
నటి వింధ్యకు అస్వస్థత
తమిళ సినిమా : దక్షిణాది చిత్రాల సినీ నటి వింధ్య అస్వస్థతకు గురై బుధవా రం చైన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యా రు. సంగమం చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన నటి వింధ్య ఆ తరువాత తంబీ విట్టు కల్యాణం, చార్లిచాప్లిన్, కన్నమ్మ తదితర చిత్రాల్లో నాయికగా నటించారు. తెలుగులో అభిషేకం చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. 2011 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కొద్ది రోజుల క్రితం వారణాసి వెళ్లారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకోగానే అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో స్థానిక కేకే నగర్ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ఆస్పత్రి చికిత్స తీసుకుంటున్నారు.