అల్లాదుర్గం రూరల్/కల్హేర్/వర్గల్/కొండపాక/దౌల్తాబాద్/సిద్దిపేట జోన్/మిరుదొడ్డి/నంగునూరు/జగదేవ్‌పూర్/మనూర్/జోగిపేట: వడదెబ్బకు జనం రాలిపోతున్నారు. ముఖ్యంగా రైతులు, కూలీలు ఎండలో పనిచేస్తూ అస్వస్థతకు గురవుతున్నారు. చికిత్స పొందుతూ ప్రా ణాలు నిలువడం లేదు. శనివారం జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాస్త ఎండ తగ్గినట్టు అన్పించినా వడగాలుల కారణంగా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో అస్వస్థతకు గురవుతున్నారు. శనివా రం ఒక్క రోజే జిల్లాలో 15 మంది మృత్యువాత పడ్డారు. సిద్దిపేట, దుబ్బాక, నంగునూరు, జగదేవ్‌పూర్ మండలాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.
వడదెబ్బ కారణంగా మరణించిన వారి వివరాలు ఇలా...
అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన మంగలి మాణిక్యం(60), కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన రాములు(65), వర్గల్ మండలం వేలూరులో ఉప్పరి రాములు(65), కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో కూరెళ్ల నరేందర్‌రెడ్డి, దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌లో రాపోల్ బూదయ్య(60) మరణించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన స్వర్ణకారుడు అనంతోజ్ రాజుకుమార్ (38), సిద్దిపేట మండలం తడ్కపల్లికి చెందిన పార్నంది సిద్దేశ్వర శర్మ (70), దుబ్బాక మండలం ధర్మాజీపేటలో తలారి నర్సయ్య (70), ఇదే మండలం ఎనగుర్తికి చెందిన బోరెడ్డి చంద్రవ్వ (65), నంగునూరుకు చెందిన చిప్ప వైకుంఠం (68), అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి కిష్టయ్యగౌడ్ (65) మృత్యువాత పడ్డారు. జగదేవ్‌పూర్ మండలం అలీరాజ్‌పేట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు సత్తయ్యగౌడ్(50), దౌలాపూర్ గ్రామానికి చెందిన ముక్కరి బాలయ్య (35), మనూర్‌కు చెందిన కె.నాగమ్మ(48), అందోల్ మండలం నేరడిగుంటకు చెందిన గొల్లపండరి(40) వడదె బ్బ బారిన పడి ప్రాణాలు వదిలారు.
అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రాహుల్ బొజ్జ
సంగారెడ్డి మున్సిపాలిటీ: పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జ సూచించారు. తప్పని సరిగా తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలు వేసుకోవాలన్నారు. గొడుగులతోపాటు తలపై టోపీ, రుమా లు వాడాలన్నారు. మంచినీరు ఎక్కువగా తాగాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు సాధ్యమైనంత ఆరుబయట శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదన్నారు. వడదెబ్బకు గురైన వారి శరీర ఉష్టోగ్రత 101 డిగ్రీ సెల్సియస్ లోపు ఉండేలా తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, ఆలస్యం చేయకుండా ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని తెలిపారు. పీహెచ్‌సీల్లో తగినన్ని ఓఆర్‌ఎస్, ఐవీ ద్రవాలు, గ్లూకోజ్, పొటాషియం క్లోైరె డ్, డెర్మా అలర్టిక్ క్రీములు, పౌడర్ అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
వడదెబ్బకు 15 మంది మృతి
Published Sun, May 31 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement