ప్రణబ్ సతీమణికి అస్వస్థత | President Pranab Mukherjee's Wife Admitted to Hospital: Sources | Sakshi
Sakshi News home page

ప్రణబ్ సతీమణికి అస్వస్థత

Published Sat, Aug 8 2015 1:18 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

ప్రణబ్ సతీమణికి అస్వస్థత - Sakshi

ప్రణబ్ సతీమణికి అస్వస్థత

భువనేశ్వర్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆమెను శుక్రవారం ఢిల్లీలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలిసి ప్రణబ్ హుటాహుటిన ఒడిశా పర్యటనను రద్దుచేసుకుని శుక్రవారం రాత్రి ఢిల్లీ బయల్దేరారు. కొంతకాలంగా శుభ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ప్రణబ్ ఒడిశాలోని పూరీలో జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement