
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్ కావడంతో కలకలం రేగింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు.
వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రేపటి దాకా అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు.
చదవండి: వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు
Comments
Please login to add a commentAdd a comment