Kasturba Gandhi College
-
సికింద్రాబాద్ కస్తూర్బాలో గ్యాస్ లీక్.. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్ కావడంతో కలకలం రేగింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రేపటి దాకా అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. చదవండి: వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు -
ఈసారి కొత్తగా మరో 84 కేజీబీవీలు
- బాలుర కోసం 29 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు - కేంద్ర పథకాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నివాస వసతితో కూడిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) 391 ఉండగా, వచ్చే జూన్ నుంచి మరో 84 కేజీబీవీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏ బీ) వీటికి ఓకే చెప్పింది. వాటిని వచ్చే జూన్ నుంచే ప్రారంభించాలని మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ సహకార పథకాలపై జరిగిన సమీక్షలో నిర్ణయించారు. వీటితోపాటు బాలుర కోసం కూడా మరో 29 కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటిలో 6, 7, 8 తరగతుల్లో బోధన ప్రారంభిస్తారు. ఒక్కో పాఠశా లలో ఇందుకుగాను 600 మందికి పైగా బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులను వెంటవెంటనే రాబట్టుకునే ప్రయత్నాలు చేయాలని, వాటిని సకాలంలో ఖర్చు చేసి వి నియోగ పత్రాలు సమర్పిం చాలని కడియం శ్రీహరి సూచించారు. ప్రస్తుతం ఉన్న కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫర్నిచర్, బెడ్ మెటీరియల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రొడక్టు కిట్లను విద్యార్థులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన 84 మండలాల్లో కేజీబీవీల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని, బాలుర కోసం కూడా 29 జిల్లా కేంద్రాల్లో బాలుర స్కూళ్లను ప్రారంభిం చాలన్నారు. వీటి ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని కోరామని, వారు సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ –2 కింద కొనసాగుతున్న పనులను ఈ ఏడాది జూన్ నెలాఖరు లోగా, ఆర్‌ఎంఎస్‌ఏ–3 కింద కొనసాగుతున్న పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. మరో 6 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ ఈసారి దాదాపు 6 వేల విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరును అమలు చేస్తామని కడియం చెప్పారు. స్కూళ్లలో టాయిలెట్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. టాయిలెట్ల నిర్వహణకు ఒక వర్కర్‌ను పెట్టుకునేందుకు ప్రత్యేకంగా రూ. 20 వేలు ఇస్తున్నామని, వంద నుంచి 300 లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఇద్దరిని నియమిం చేందుకు, నిర్వహణకు రూ. 50 వేలను ఇస్తామన్నారు. 500 కంటే ఎక్కువ మంది ఉ చోట ముగ్గురు వర్కర్లను పెట్టుకోవాలని, వాటికి రూ. 75 వేలు ఇస్తామని, పాఠశాలలు ప్రారంభయ్యే నాటికే తొలి ఇన్స్టాల్మెంట్ ఇస్తామన్నారు. కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్పీల వేతనాలు పెంపు యోచన ఉందనీ అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత
నర్మేట కస్తూర్బాగాంధి విద్యాలయంలో గురువారం మరో ముగ్గురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నంగునూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి సదానందం పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులకు మందులు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సందర్భంగా పాఠశాల ఎస్ఓ హమీదా, వైద్య సిబ్బంది విద్యార్థుల గదుల్లో నిల్వ ఉంచిన తినుబండారాలను గుర్తించి వాటిని తొలగించారు. అనంతరం డాక్టర్ సదానందం మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లో నుంచి తెచ్చుకున్న అప్పడాలు తినడం వల్ల కడుపు నొప్పి, వీరేచనాలు అయ్యాయన్నారు. విద్యార్థులు కోలుకుంటున్నందున ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
ఆత్మహత్యే శరణ్యం
♦ ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇద్దరు కుక్ల మనస్థాపం ♦ కస్తూర్బా గాంధీ విద్యాలయం మేడపై నుంచి దూకేందుకు యత్నం అడ్డుకున్న తోటి సిబ్బంద నిరుపేద కుటుంబాలు.. ఆ చిరుద్యోగమే వారికి జీవనాధారం.. మీపై ఫిర్యాదులు వచ్చాయంటూ అధికారులు ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కనీసం దర్యాప్తు కూడా లేకుండా తమను రోడ్డున పడేయడం ఏమిటని మనస్తాపం చెందిన ఇద్దరు మహిళా కుక్‌లు ఆత్యహత్యకు యత్నించారు. తోటి సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. రోలుగుంట : అధికారులపై ఆరోపణలు వస్తే దర్యాప్తుల పేరుతో కాలయాపన చేసే ఉన్నతాధికారులు చిరుద్యోగులపై మాత్రం తమ ప్రతాపం చూపుతున్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పనిచేస్తున్న కురచ శాంతమ్మ, మడ్డు అమ్మాజీ అనే వంట పనివారిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నుంచి శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రత్యేక అధికారి వై.త్రివేణి కుక్‌లకు చెప్పి తక్షణం విద్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు మహిళా కుక్‌లు విద్యాలయం మేడపైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. తోటి సిబ్బంది పరుగున వె ళ్లి వారి ప్రయత్నాన్ని అడుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రోలుగుంట ఎస్ఐ జి.గోవిందరావు విద్యాలయానికి వచ్చి ఎస్వో త్రివేణి, కుక్‌లతో చర్చించారు. కుక్‌లపై తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని, ఆ మేరకు వారిద్దరినీ తొలగిస్తూ తమకు ఉత్తర్వుల అందాయని, వారిని కొనసాగించడం సాధ్యం కాదని ఎస్వో స్పష్టంచేశారు. బాధిత వంట పనివారు మాట్లాడుతూ తాము ఏ తప్పూ చేయలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తాము కూడా తెలియజేశామన్నారు. జిల్లా కలెక్టర్ యువరాజుకు కుడా తాము వినతులు పంపుకున్నామని చెప్పారు. దీనిపై పాఠశాల కమిటీ, అధికారులు విచారణ చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా, ఎలాంటి విచారణ లేకుండానే తమను తొలగించడం అన్యాయమని వాపోయారు. తాము ఇక్కడ నుంచి వెళ్లబోమని అక్కడే ఎండలో ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండలోనే ఉండి నిరసన తెలిపారు. దీంతో శాంతమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మహిళా హోమ్‌గార్డు ఆమె ముఖంపై నీళ్లుచల్లి సపర్యలు చేశారు. తరువాతఎస్ఐ కుక్‌లకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. కొత్తగా వచ్చాను.. విషయం తెలియదు తన ముందు పనిచేసిన స్పెషలాఫీసర్ జానకి హయాంలో కుక్‌లపై ఫిర్యాదు చేశారు. తాను కొత్తగా రావడం వలన వారి సమస్య తనకు తెలియదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే కుక్‌లను తొలగించాం. -త్రివేణి, స్పెషలాఫీసర్, కస్తూర్బా గాంధీ విద్యాలయం, రోలుగుంట రాజకీయం చేశారు నేను తొమ్మిది సంవత్సరాలుగా ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా విధులు నిర్వహిస్తున్నాను. నేను, తోటి కుక్ అమ్మాజి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్లినపుడు సరుకులు పట్టుకొని పోయినట్లు ఒక పత్రికలో (సాక్షి కాదు) తప్పుడు వార్త వచ్చింది. స్థానికులు కొందరు మార్గంలో అడ్డగించి మా నుంచి సరుకులు పట్టుకున్నట్టు మూడు నెలల క్రితం కొందరు వార్త రాయించారు. రాజకీయం చేసి ఇపుడు తొలగించారు. మేము ఏ తప్పూచేయలేదు. - కురచ శాంతమ్మ, బాధితురాలు ఫిర్యాదులో వాస్తవం లేదు నాపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల్లో వాస్తవం లేదు. స్థానికుల రాజకీయానికి బలయ్యాను. వాస్తవాలపై ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలి. పాడి గేదెను అమ్మూకొని ఈ ఉద్యోగానికి పెట్టుబడి పెట్టి రెండేళ్ల కిందట చేరాను. స్కూల్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఫిర్యాదుదారులతో బహిరంగ విచారణ జరిపించండి. తప్పుచేసినట్లు తేలితే అప్పుడు చర్యతీసుకోండి. -మడ్డు అమ్మాజీ, బాధిత కుక్ -
గ్యాస్ లేదని పస్తులు పెట్టారు
అల్లాదుర్గం రూరల్ : కట్టెలు లేక, గ్యాస్ అయిపోవడంతో మూడు గంటల వరకు భోజనం లేకపోవడంతో విద్యార్థుల కడుపులు కాలి కన్నీరు పెట్టిన ఘటన మండల కేద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక విలేకరులతో తమ గోడును వెల్లబోసుకున్నారు. 15 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని సరిగా భోజనం చేయడం లేదన్నారు. రోజూ నీళ్ల చారు చేస్తున్నారని, తాగునీరు కూడా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు (సోమవారం) హాస్టల్లో గ్యాస్ అయిపోయిందని, ఇదే సమయంలో కట్టెలు కూడా లేకపోవడంతో ఉదయం టిఫెన్ కూడా లేదన్నారు. కనీసం మధ్యాహ్నం ఒంటి గంటకైనా అన్నం పెడతారనుకుంటే మూడు గంటలకు పెట్టారని తెలిపారు. దీంతో చాలా మంది విద్యార్థినులు ఆకలికి తట్టుకోలేక ఏడ్చార న్నారు. గతంలో ఒక సారి గ్యాస్ అయిపోవడంతో వంట మనిషి మా వద్ద డ బ్బులు వసూలు చేసింది. ఇంత వరకు తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం ఎంపీపీ ఇందిర, టీఆర్ఎస్ నాయకులు సుభాష్రావ్, బసవరాజ్, ప్రేమ్ కుమార్, కిషోర్, వెంకట్‌రెడ్డిలు కస్తూర్బా విద్యాలయానికి చేరుకుని బిస్కెట్ అందజేశారు. ఈ విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే బాబూమోహన్‌కు ఫోన్లో తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్వీఎం సీఎంఓ వెంకటేశం, డిప్యూటీ తహశీల్దార్ తులసీరాంలు అల్లాదుర్గం కేజీవీబీలో విచారణ జరిపారు. ఇదిలా ఉండగా విద్యాలయ ప్రిన్సిపాల్ జ్యోతి మెటర్నటీ లీవ్‌లో ఉండగా ఇన్చార్జ్గా ప్రతిభ బాధ్యలు చేపట్టారు. అయితే ఆమె తనకు మెయిటెనెన్స్ బాధ్యతలు అప్పగించలేదని తెలిపారు. దీంతో తానేమీ చేయలేకపోయానని చెప్పారు. -
శ్రీలతకు రెండు స్వర్ణాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా యువతరంగం డిగ్రీ కాలేజి క్రీడోత్సవాల్లో మహిళల అథ్లెటిక్స్ మీట్లో కస్తూర్బా గాంధీ కాలేజికి చెందిన అథ్లెట్ పి.శ్రీలత సత్తా చాటింది. ఆమె 100 మీ., 200 మీ. రేసుల్లో స్వర్ణ పతకాలు సాధించింది. జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. అథ్లెటిక్స్ మహిళల విభాగం: ఫైనల్స్ ఫలితాలు: 100 మీటర్లు: 1.పి. శ్రీలత( కస్తూర్బా గాంధీ కాలేజి), 2. ఝాన్సీ(సెయింట్ ఫాన్సిస్ కాలేజి), 3.కె.మహేశ్వరీ (ఐపీజీడీసీ). 200మీటర్లు: 1.పి.శ్రీలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.టి.మీనా (జీడీసీ), 3. జి.వరలక్ష్మీ (కస్తూర్బా గాంధీ కాలేజి). 400 మీటర్లు: 1.హేమలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. బి.రాణి (జీడీసీ), 3. మరియా ఝాన్సీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి). 800 మీటర్లు: 1.అమృత కుమారి(సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి), 2.కె.మహేశ్వరీ (ఐపీజీడీసీ), 3.టి.జ్యోతి (జీడీసీ). లాంగ్‌జంప్: 1.కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.మరియా ఝాన్సీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి), 3.సి.అమృత కుమారి (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి). షాట్‌ఫుట్: 1.కాజల్ సింగ్రోహ (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.ఆర్.కోమల్ (కస్తూర్బా గాంధీ కాలేజి), 3.ఎం.గాయత్రి (జీడీసీ). సిటీ కాలేజికి టైటిల్ పురుషుల వాలీబాల్ టీమ్ టైటిల్‌ను ప్రభుత్వ సిటీ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు శుక్రవారం సిటీ కాలేజి జట్టు 25-20, 25-12 స్కోరుతో వివేకవర్ధిని(వీవీ) డిగ్రీ కాలేజి జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్స్‌లో సిటీ కాలేజి జట్టు 25-12, 25-21తో ఎస్పీ కాలేజిపై.. వీవీ కాలేజి 25-15, 25-10తో ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజిపై గెలిచాయి. -
‘కస్తూర్బా’లో కలుషిత ఆహారం
కల్వకుర్తి, న్యూస్‌లైన్: కల్వకుర్తిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులకు కలుషిత ఆహారమే పరమాన్నమైంది. కడుపు మాడ్చుకోలేక.. ఆకలిబాధను ఎవరికీ చెప్పుకోలేక కుళ్లిన భోజనం తిని బుధవారం 18 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం.. వసతిగృహ పర్యవేక్షకుల కక్కుర్తి వెరసి విద్యార్థినులకు ప్రాణసంకటంగా మారింది. వివరాల్లోకెళ్తే..స్థాని క కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నా రు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి హాస్టల్లో అన్నం, పప్పు, చెట్నీ వడ్డించారు. భో జనాలు ముగించుకుని నిద్రకుపూనుకున్న విద్యార్థినులు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకరి తరువాత మరొకరు.. ఇలా 18 వాం తులు, విరేచనాలు చేసుకున్నారు. రాత్రి అందుబాటులో ఎవరూ లేకపోవడంతో త మ బాధను ఎవరికీ చెప్పుకోలేపోయారు. రాత్రంతా అలాగే గడిపిన విద్యార్థినులు ఉ దయం హాస్టల్‌కు వార్డెన్ రాగానే విషయం చెప్పగా..హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కవిత, రోజా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఇలా జరి గిందని తెలిపారు. అస్వస్థతకు గురైన వి ద్యార్థులకు డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుం డా సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్ చె ప్పారు. జరిగిన ఘటనపై వార్డెన్ శ్రీలతను వివరణ కోరగా..విద్యార్థినులకు బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొచ్చారు. సందర్శించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆస్పత్రి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటన లు తలెత్తకుండా చూడాలని వార్డెన్ శ్రీలత ను ఆదేశించారు.