అల్లాదుర్గం రూరల్ : కట్టెలు లేక, గ్యాస్ అయిపోవడంతో మూడు గంటల వరకు భోజనం లేకపోవడంతో విద్యార్థుల కడుపులు కాలి కన్నీరు పెట్టిన ఘటన మండల కేద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక విలేకరులతో తమ గోడును వెల్లబోసుకున్నారు. 15 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని సరిగా భోజనం చేయడం లేదన్నారు. రోజూ నీళ్ల చారు చేస్తున్నారని, తాగునీరు కూడా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు (సోమవారం) హాస్టల్‌లో గ్యాస్ అయిపోయిందని, ఇదే సమయంలో కట్టెలు కూడా లేకపోవడంతో ఉదయం టిఫెన్ కూడా లేదన్నారు. కనీసం మధ్యాహ్నం ఒంటి గంటకైనా అన్నం పెడతారనుకుంటే మూడు గంటలకు పెట్టారని తెలిపారు. దీంతో చాలా మంది విద్యార్థినులు ఆకలికి తట్టుకోలేక ఏడ్చార న్నారు. గతంలో ఒక సారి గ్యాస్ అయిపోవడంతో వంట మనిషి మా వద్ద డ బ్బులు వసూలు చేసింది. ఇంత వరకు తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం ఎంపీపీ ఇందిర, టీఆర్‌ఎస్ నాయకులు సుభాష్‌రావ్, బసవరాజ్, ప్రేమ్ కుమార్, కిషోర్, వెంకట్‌రెడ్డిలు కస్తూర్బా విద్యాలయానికి చేరుకుని బిస్కెట్ అందజేశారు.
ఈ విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే బాబూమోహన్‌కు ఫోన్‌లో తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్‌వీఎం సీఎంఓ వెంకటేశం, డిప్యూటీ తహశీల్దార్ తులసీరాంలు అల్లాదుర్గం కేజీవీబీలో విచారణ జరిపారు. ఇదిలా ఉండగా విద్యాలయ ప్రిన్సిపాల్ జ్యోతి మెటర్నటీ లీవ్‌లో ఉండగా ఇన్‌చార్జ్‌గా ప్రతిభ బాధ్యలు చేపట్టారు. అయితే ఆమె తనకు మెయిటెనెన్స్ బాధ్యతలు అప్పగించలేదని తెలిపారు. దీంతో తానేమీ చేయలేకపోయానని చెప్పారు.
గ్యాస్ లేదని పస్తులు పెట్టారు
Published Mon, Sep 8 2014 11:45 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
Advertisement