Meal
-
భోజనం చేస్తుండగా సడెన్‌గా కోతి ఎంట్రీ..ఐతే ఆ తర్వాత..!
ఒక్కోసారి జంతువులు మనతో ప్రవర్తించే తీరు భయబ్రాంతులకు, ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఆ క్షణంలో చాలామంది భయంతో హడావిడి చేస్తే..కొందరు మాత్రం చాలా కూల్‌గా వ్యవహరిస్తారు. నిజానికి ఆ జంతువుల సడెన్ ఎంట్రీ కంటే.. వాటితో కొందరు వ్యక్తులు వ్యవహరించే తీరు అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పైగా ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయానికి గురవ్వుతాం కూడా. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటు చేసుకుంది. మనం ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తుండగా సడెన్‌గా ఓ కోతి నేరుగా మనవద్దకు వస్తే ఏం చేస్తాం చెప్పండి. భయంతో వణికిపోతాం. దాన్ని పొమ్మనే ప్రయత్నమే లేక మనమే పక్కకు తప్పుకునే యత్నమో చేస్తాం కదా..!. కానీ ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు తాను భోజనం చేస్తుండగా వచ్చిన కోతిని చూసి భయపడ లేదు కదా..!. దాన్ని చూసి ఛీత్కరించనూ లేదు. ఆ కోతి తన పళ్లెంలోనే తింటున్న ఏం అనలేదు. పైగా దాన్ని తినమని ప్రోత్సహిస్తూ.. ఆయన కూల్‌గా భోజనం చేశారూ. అంతేగాదు అక్కడ వడ్డించేవాళ్లు ఆ కోతికి అంతరాయం కలగకుండా చూడటమే కాకుండా..బెదురు లేకుండా తినేలా ఆ కోతికి పెద్దాయన భరోసా ఇవ్వడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు కూడా ఒకింత ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పెద్దాయన చేసిన పనికి మెచ్చుకోవడమే గాక హనుమాన్ జీ మీతో విందుని పంచుకోవాలనుకున్నారు కాబోలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by shalu Sharma (@shalu_weightlifter) (చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?) -
దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రంలో ఓ దళిత కుటుంబాన్ని సందర్శించారు. కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంట్లో వారితో కలిసి వంట చేయడమే కాకుండా భోజనం కూడా చేశారు.వారి ఇంట్లో భోజనం చేయాల్సిందిగా.. రాహుల్ గాంధీని ఆ జంట ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ సోమవారం వారి వద్దకు వెళ్లారు. వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు.दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024 కాగా షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ఎక్స్‌లో షేర్ చేశారు.‘ఈనాటికీ దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షాహూ పటోలే జీ చెప్పినట్లు, దళితులు ఏమి తింటారో ఎవరికీ తెలియదు. వాళ్లు ఏం తింటారు, ఎలా వండుతారు, దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో అజయ్ తుకారాం సనదే, అంజనా తుకారాం సనదేతో మధ్యాహ్నం గడిపాను.తను నన్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన ఇంటికి చాలా గౌరవంగా ఆహ్వానించాడు. వంటగదిలో అతనికి సహాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర, వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశాం. దళితలుకు రాజ్యాంగ అనేక హక్కులను కల్పించింది. అయితే ప్రతి భారతీయుడు సోదర భావాన్ని కలిగి ఉన్నప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
AP Floods: పట్టెడన్నం కోసం పరితపిస్తూ..
పటమట/చిట్టినగర్ (విజయవాడ): బుడమేరు వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్న జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు ఆహారం అందక అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారంతా తిండి, తాగునీరు, పాల కోసం అర్రులు చాస్తున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనం ఏది వచ్చిన ఆహారం పొట్లాలు ఇచ్చేందుకు వచ్చాయని భావించి వాటివెంట పరుగులు పెడుతున్నారు. జక్కంపూడి కాలనీలో సోమవారం ఉదయానికి కాలనీలో వరద నీరు అడుగు మేర తగ్గింది. బాధితులు తమ ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటూ భోజనం కోసం ఆతృతగా ఎదురు చూశారు.ఉదయం ఆల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందకపోవడంతో కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీలోకి ట్రాక్టర్, కారు వచ్చినా అందులో తమ కోసం భోజనం తీసుకొచ్చారేమోనని భావిస్తూ ఆతృతతో ఆ వాహనాలను చుట్టుముడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు పట్టుకుని పిల్లలతో కలిసి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి తాగేందుకు ఉపయోగించవద్దని ముందుగానే కార్పొరేషన్ అధికారులు మైక్‌లో ప్రచారం చేయడంతో వాటర్ బాటిళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు సైతం తమ సేవలను నిలిపివేశాయి.జక్కంపూడి కాలనీలో కారు వెంట పరుగులు పెడుతున్న వరద బాధితులు ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు కాలనీ వాసులకు భోజనం అందించేందుకు రాగా మహిళలు, యువకులు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలను చుట్టుముట్టి కదలనివ్వడం లేదు. సోమవారం కాలనీ మెయిన్ రోడ్డులో నివాసం ఉండే వారికే ఆహారం అందింది. శివారు ప్రాంతాలతో పాటు బుడమేరు కాలువకు అవతలి వైపున ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందలేదు. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు కాలనీలో నివాసం ఉండే కుటుంబాలకు ఆహారం అందించాలని అక్కడి వారంతా వేడుకుంటున్నారు.ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితిఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కూలి పనులు, ఆటోలు నడుపుకుంటేనే కానీ పొట్టగడవని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తామంతా యాచకుల మాదిరిగా తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఈ ప్రాంత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ కాలనీలో పేద, మధ్య తరగతికి చెందిన 600 కుటుంబాల్లో కనీసం రెండు వేల మంది నివాసం ఉంటున్నారు. వరద కారణంగా ఉండే వంట సామాగ్రితో, వస్త్రాలు, జీవనో«పాధి కల్పంచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. మహిళల స్వయం ఉపాధి ఆసరాగా నిలిచే కుట్టు మెషిన్లు, టిఫిన్ బండ్లతోపాటు ఇళ్లల్లోని గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ పొయ్యిలు మరమ్మతులకు గురయ్యాయి. ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా దాతలిచ్చే ఆహార పొట్లాలపైనే ఆధారపడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాయని భావించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం సరఫరాను చాలా వరకు తగ్గించేశాయి. దీంతో ఆహారం, పాలు, తాగునీరు దొరక్క ఇక్కడి పేదలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు ఈ రెండు కాలనీల్లోని కుటుంబాలకు ప్రభుత్వమే ఆహారం అందించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.అన్నీ కోల్పోయాం ఇదేం వరదో. కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కాలనీలోని ప్రతి ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి. ఆహారం దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. పేదలు పూర్తిగా తేరుకునే వరకు ప్రభుత్వమే ఆహారం, పాలు, నీళ్లు అందించాలి. ఇంటిసామగ్రి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. – వసంత, ఆంధ్రప్రభ కాలనీ జగనన్న ఇళ్లపట్టా కూడా కొట్టుకుపోయింది మాది చిన్న కుటుంబం. గృహోపకరణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఆధార్, రేషన్, పాన్ కార్డులు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, పుస్తకాలతోపాటు జగనన్న ఇచ్చిన ఇంటిపట్టా కూడా కొట్టుకుపోయింది. మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవాలన్నా కార్డులు అడుగుతున్నారు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయిన వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. – వెంకటదుర్గా సూర్యకుమారి, ఆంధ్రప్రభ కాలనీ అర్థగంటలో అంతా నాశనమయ్యింది. అర్థగంటలో మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఊహించలేనంత ముప్పు మా ఇంటిలోకి వచ్చింది. మా కష్టం అంతా బుడమేరులో కొట్టుకుపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే రక్షించాలి. – లక్ష్మీ సరోజ, ఆంధ్రప్రభ కాలనీ -
దర్శన్‌కు ఇంటి భోజనం ఇస్తారా.. లేదా?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన జైలులో ఉన్న హీరో దర్శన్ తనకు ఇంటి భోజనం కావాలని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. 10 రోజుల్లో ఈ అర్జీపై జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి ఆస్కారం ఉందని జడ్జి పేర్కొన్నారు. పిటిషనర్‌కు పౌష్టికాహారం అవసరం ఉందని చెబుతూ ఆగస్టు 20కి వాయిదా వేశారు. స్టార్ హీరో అయిన దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు జూన్ 10 నుంచి హత్య కేసులో జైలు పాలయ్యారు. అప్పటి నుంచి జైలు తిండితో ఇబ్బంది పడుతున్నారు.చిక్కుల్లో సిద్ధారూఢపరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కు టీవీతో పాటు వీఐపీ సౌకర్యాలు కల్పించారని చెప్పిన మాజీ ఖైదీ సిద్ధారూఢపై చర్యలు తీసుకోనున్నారు. తాను జైలులో దర్శన్‌కు యోగ నేర్పించానని, ఆయనకు సకల సౌకర్యాలు అందుతున్నాయని ఇటీవల సిద్ధారూఢ మీడియా ముందు చెప్పారు. సత్ప్రవర్తన కింద విడుదలైన సిద్ధారూఢ ఇలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.జైలు తిండి బాగుంటుంది: చేతన్తనకు జైలులో వడ్డించే భోజనం నచ్చిందని, అయితే అదే భోజనం నటుడు దర్శన్‌కు ఎందు నచ్చలేదో అర్థం కావడం తేదని నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అన్నారు. ఒక ఇంటర్వూలో మాట్లాడిన చేతన్ తాను జైలులో ఉండగా తన కుటుంబ సభ్యులను ఎవరినీ చూడడానికి అనుమతించలేదన్నారు. తనను జైలులో ఆరుమంది ఉన్న సెల్లో ఉంచారని, రెండవసారి జైలుకు వెళ్లినప్పుడు నలభైమంది ఉన్న బ్యారెక్‌లో ఉంచారన్నారు. అందరిలాగే తానూ జైల్లో పని చేశానన్నారు. జైలులో పెట్టే భోజనం బాగా ఉండేదన్నారు. మరి దర్శన్‌కు ఎందుకు నచ్చడం లేదో, పదే పదే ఇంటి భోజనం కావాలని ఎందుకు కోరుతున్నాడో తెలియడం లేదన్నారు. -
మిల్లెట్ మీల్‌తో ఆరోగ్యం..
ఒకప్పుడు గ్రామీణ ప్రాంత్రాలకే పరిమితమైన చిరుధాన్యాల వంటలు నేడు పట్టణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వాటికి బాగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు సంప్రదాయ వంటలైన అన్నం, రొట్టెలకే పరిమితమైన చిరుధాన్యాల (మిల్లెట్స్)తో ఇప్పుడు వివిధ రకాల తినుబండారాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక చిరుతిండ్లను తీసుకుంటుంటాం. ప్రస్తుతం నగరవాసులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వాసులు వాటి స్థానంలో ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో పాటు నగరవాసుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు ఉత్పత్తిదారులు.. రెడీ–టు ఈట్, రెడీ–టు కుక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నారు.. ఈ చిరుధాన్యాల కథేంటి? వాటితో ఎలాంటి ఆహారాన్ని తయారు చేస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం.. రోనా పుణ్యమా అని నేడు చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ పాకగా, చిరుధాన్యాల పంటలు, వంటకాలకు డిమాండ్ పెరిగింది. ప్రతిదీ కాలుష్యానికి గురవ్వడం, కల్తీ అవ్వడంతో ఆరోగ్యకరమైన ఆహారానికే మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఆరోగ్యకరమైన ఆహారం ప్రస్తుత పరిస్థితుల్లో మిల్లెట్లు, చిరుధాన్యాలతోనే సాధ్యమని భావించి ఆ తరహా వంటకాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.ఐకరాజ్యసమితి గుర్తింపు... మిల్లెట్స్‌కి ఉన్న ప్రాధాన్యతను భారతదేశం ఐక్యరాజ్యసమితి ముందు పెట్టగా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ డేగా ప్రకటించింది. భారత్‌ను మిల్లెట్స్ దేశంగా 74 దేశాలు గుర్తించాయి. దీనికి ముందే భారత్ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించింది. అంతకుమునుపు 2018లో జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు దీనిపై అవగాహన కలి్పంచడం ప్రారంభించింది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో 2023ను అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరగా 74 దేశాలు గుర్తించాయి. దీంతో ప్రపంచ దేశాల్లో కూడా మిల్లెట్స్‌కు డిమాండ్ పెరిగింది.పాత పంటలు.. కొత్త వంటలుమిల్లెట్స్ పాత తరం పంటలైనా వాటితో కొత్త రకం వంటలు చేసి.. న్యూట్రిషనల్ వ్యాల్యూస్‌తో ఈ తినుబండారాలు రూపొందిస్తున్నారు. మిల్లెట్స్‌ను ద్వితీయ పద్ధతల్లో ప్రాసెసింగ్ చేసి ఈ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు రెడీ–టు– ఈట్, రెడీ–టు–కుక్ అనే పద్ధతుల్లో కొత్త వంటకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్నారు. 400 అంకుర సంస్థలు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మిల్లెట్స్‌తో వివిధ రకాల తినే వస్తువులను తయారు చేయడానికి 400 రకాల కంపెనీలు పనిచేస్తున్నాయి. చిరుధాన్యాల విలు వలతో కూడిన పలు ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.ఏవి చిరుధాన్యాలు... జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, హరికలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు మొదలైన వాటిని భారత దేశంలోనే సంప్రదాయ పంటలుగా పండిస్తుంటారు. గతంలో వీటినే ఎక్కువగా ఆహారంగా వాడేవారు.. అయితే నూతన వంగడాలు అందబాటులోకి రావడంతో వాటిపై దృష్టి మరల్చారు. అవగాహన పెరగడంతో ప్రస్తుతం సంప్రదాయ పంటలవైపే చూపు మరల్చి నూతన పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు రాబడుతున్నారు రైతులు. తీనికితోడు ఈ పంటలకు డిమాండ్ పెరగడంతో అదే పద్ధతులను అవలంభిస్తున్నారు. మార్కెట్లో మిల్లెట్స్ ఉత్పత్తులు.. రాగి నుండి మాల్ట్, చిరుధాన్యాల నుంచి పఫ్స్, స్నాక్స్, జొన్న ఇడ్లీమిక్స్, ఉప్మా, దోస, పొంగల్, లడ్డూ మిక్స్, జొన్న ముయోస్లీ, పాస్తా, కుకీలు, బ్రెడ్, బన్, కేక్, పిజ్జా, ఐస్‌క్రీం, జొన్న పేలాలతో పాటు, జొన్న పంటలో అనేక రకాల వంటకాలను తయారు చేస్తున్నారు.జొన్న ముడి పదార్థాలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని వయస్సుల వారికీ అనుకూలమైన ఆహారం. జొన్నలో మెగ్నీషియం, ఐరన్, జింక్, పీచుతో కూడిన ప్రొటీన్ అధికంగా ఉంటుంది. జొన్న రోల్స్, జొన్న బూందీ లడ్డు, సమోస, వడ, అరిసెలు, షర్బత్ కూడ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 12,600 టన్నుల చిరుధాన్యాల పదార్థాలు ప్రతి రోజు ప్రజలు తింటున్నారు.చిరు«ధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఐసీఎఆర్, భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ లాంటివి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. ముందు ముందు చిరుధాన్యాలు, మిటెల్స్కు మంచి ఆదరణ ఉంటుంది. అనేక రకాల స్నాక్స్ తయారు చేసి రెడీగా ఉంచుతున్నాం. అప్పటికప్పుడు తినడానికి, వండుకోవడానికీ అనుకూలంగా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాం.. – డాక్టర్ బి.దయాకర్ రావు, సీఈఓ న్యూట్రీహబ్, ఐఏఎంఆర్ రాజేంద్రనగర్ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం.. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దీనికితోడు నూతన పద్ధతుల్లో వీటిని పండించడానికి ప్రభుత్వం పోత్సాహం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అంకుర సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా చిరుధాన్యాలతో న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో, రైతులు పండించిన పంటలకు మార్కెట్లో డిమాండ్ కలి్పస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో చిరుధాన్యాల ఉత్పత్తులు తయారువుతున్నాయి. -
వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తుండగా దంపతులక వందే భారత్ రైలులో అందించిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన బందువుల తరుపున విదిత్ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్ వందేభారత్ రైలులో భోపాల్ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని పోస్టు పెట్టారు.అంతేకాకుండా ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు ట్వీట్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.అయితే ఈ ఘటనపై ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.Today on 18-06-24 my Uncle and Aunt were travelling from Bhopal to Agra in Vande Bharat.They got "COCKROACH" in their food from @IRCTCofficial. Please take strict action against the vendor and make sure this would not happen again @RailMinIndia @ AshwiniVaishnaw @RailwaySe pic.twitter.com/Gicaw99I17— Vidit Varshney (@ViditVarshney1) June 18, 2024 కాగా వందేభారత్ రైళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. గత మార్చిలో సిలిగురి నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ప్రసూన్ దేవ్.. తన ఆహారంలో పురుగును గుర్తించాడు. -
అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!
అంతర్జాతీయ బర్గర్ డే అనేది ప్రపంచ ఆహార సెలవుదినం. దీనిని ప్రతి సంవత్సరం మే 28న జరుపుకుంటారు. ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో వివిధ రకాల బర్గర్లను ఆస్వాదిస్తూ జరుపుకుంటారు. నిజానికి బర్గర్లనేది అధిక క్యాలరీతో కూడిని భారీ భోజనంతో సమానం. దీనిలో అధిక సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్లు వంటి ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుంది. అందువల్ల అధిక బరువుకి దారితీసి హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే దీన్ని సరైన విధంగా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చట. అదెలాగో సవివరంగా తెలుసకుందామా..! అలాగే దీన్ని ఇష్టంగా లాగించే ప్రముఖ సెలబ్రిటీలు ఎవరో కూడా తెలుసుకుందాం.ఆరోగ్యకరమైన పోషక పదార్థాలతో ఇంట్లో తయారు చేస్తే.. బర్గర్లు నుంచి కూడా ఆశ్చర్యకరమైన రీతిలో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చట. అవి సూక్ష్మ పోషకాల నుంచి స్థూల పోషకాల వరకు అన్ని ప్రధాన ఆహార సమూహాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది భారీ భోజనం కాబట్టి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉండే అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది. ప్రోటీన్లకు మంచి మూలం. చికెన్, చేపలు వంటి పోషకాలతో కూడిన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలు..కొలస్ట్రాల్ తక్కవగా ఉండే బర్గర్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎర్రమాంసంతో చేసిన బర్గర్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఐరన్‌తో పోలిస్తే ఇందులో లభించే ఐరన్ సలభంగా శోషించబడుతుంది. వందగ్రాముల బర్గర్లో 3 మిల్లిగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే ఇందులో ఎర్రరక్తకణాలకు అవసరమయ్యే బీ12 కూడా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జింక్‌కి అద్భతమైన మూలం. ఇందులో ఉపయోగించే ఎర్రమాంసం అద్భుతమైన జింక్ మూలం. అలాగే ఇందులో బీ కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరగుపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇతర ఆహార పదార్థాలు మాదిరిగానే ట్రాన్స్‌ఫ్యాట్స్, సోడియం, కెమికల్ ప్రిజర్వేటివ్‌లతో సంబంధం ఉన్న కొన్ని బర్గర్లను మితంగానే తీసుకోండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరిగా దీన్ని చూస్తే మనసాగాక ఏదో ఒక విధంగా ఇష్టంగా తినే కొందరు ప్రమఖులు ఎవరో చూద్దాం. అనన్య పాండే..వర్కౌట్లు చేసేందుకు ఇష్టపడుతుంది. ఎక్కువగా యోగాసనాలు కూడా వేస్తుంటుంది. అయితే బర్గర్ బే జ్యూసి అంటే మహా ఇష్టం. తినాలనుకుంటే ఆదివారాలు ఏదో రకంగా ఓ పట్టు పట్టేస్తుంది. అబ్దురోజిక్సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 16 సీజన్లో పాల్గొన్న తజికిస్తానీ గాయకుడు అబ్దు రోజిక్ కూడా బర్గర్లంటే మహా ఇష్టం. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మొదటగా ఇష్టం లాగించేది బర్గర్‌నే అట. ఆయనకు ఓ రెస్టారెంట్ కూడా ఉంది. వరుణ్ ధావన్: ఫిట్నెస్ ఔత్సాహికుడు కూడా ఈ బర్గర్ తనకు బలహీనతగా పేర్కొన్నాడు. తన డైట్లో ఒక్కోసారి చీట్ చేసి మరీ ఈ బర్గర్‌ను ఇష్టంగా లాగిస్తానని చెబుతున్నాడు. ఆలియా..ఎంత ఫిటనెస్గా ఉండేలా స్ట్రిట్ డైట్ ఫాలో అయినా ఆనంద క్షణాల్లో మాత్రం బర్గర్‌ని ఆస్వాదించకుండా ఉండనని అంటోంది బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియ భట్. అంతేగాదు 2022లో రిలీజ్ అయ్యిన గంగూబాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినప్పుడు వెజ్ బర్గర్‌ని ఆస్వాదిస్తూ సక్సెస్‌ని ఎంజాయ్ చేసింది. ప్రియాంక చోప్రా జోనాస్ఫిట్గా ఉండే ప్రియాంక చోప్రా సైతం క్రిస్పీ ఫ్రైస్‌తో కూడిన పెద్ద బర్గర్ తినకండా ఉండలేనంటోంది. ఆమె 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నప్పుడు బర్గర్‌ని తింటూ ఆనందంగా ఆ క్షణాన్ని సెలబ్రెట్ చేసుకుంది.(చదవండి: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటున్నారా..?) -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్‌లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్‌లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా?
చాలామంది ఆహారం తిన్న వెంటనే తేలిగ్గా తీసుకుని చేసే పనులే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం. భోజనం తిన్న వెంటనే చల్లటి పదార్థాలు గానీ లేదా పండ్లు తీసుకుంటుంటాం. అలాగే బాగా స్పైసీ ఫుడ్ తినేసి హెర్బల్ టీలు వంటివి తాగేస్తుంటారు కొందరూ. నిజానికి ఇలాంటి అలవాట్లు చాలా ప్రమాదం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు. మన జీర్ణ వ్యవస్థ పాడవడ్డానికి ఆ అలవాట్లే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పండ్లు తింటే.. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతారంటే భోజనం కాగానే పండ్లు తినడం వల్ల అందులోని ఎంజైమ్‌లు విచ్ఛిన్నమై ఆహారంతో కలిసిపోయి పొట్టలో సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి నీరు.. ప్రస్తుతం చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే రిఫ్రిజిరేటర్లో.. కొందరైతే మరీ డీప్ ఫ్రీజర్‌లో ఉంచిన చల్లని నీరు తాగుతున్నారు. ఇలా చల్లటి తాగడం వల్ల కడుపులో ఉత్పత్తి అయ్యే డైజెస్టివ్ ఎంజైమ్‌లు పొట్టను చల్లగా చేసి, జీర్ణక్రియ వ్యవస్థను స్తంభింపజేస్తాయి. అంతేకాదు, శరీరం ఆహారంలోని పోషకాలను గ్రహించడం మానుకుంటుంది. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్పైపీ ఫుడ్ తీసుకున్న తర్వాత టీ తీసుకుంటే.. వేడి ఆహారాలు తీసుకున్న తర్వాత హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పొట్టలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే బాగా వేడిగా ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు తాగడం మానుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
అన్నం పెడ్తలేరు.. ఆరోగ్యం పట్టించుకోరు
ఆసిఫాబాద్‌రూరల్: ‘మెనూ ప్రకారం భోజనం పెడ్తలేరు.. అన్నంలో పురుగులు వచ్చినా పట్టించుకుంటలేరు.. నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు’ అంటూ గిరిజన విద్యార్థినులు కన్నీమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల బాలికలు సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. సుమారు ఆరు గంటలపాటు వివిధ చోట్ల నిరసన తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 600 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పట్టించుకోకుండా వేధిస్తున్నా రని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం పాఠశాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ఎండలోనే బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో భోజనం సక్రమంగా పెట్టడం లేదని, నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. డార్మెంటరీలు శుభ్రంగా లేవని, రెండు రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఇష్టారీతిన తమను తిడుతూ భయపెడుతుందని వి లపించారు. ఈ విషయం ఆర్సీవో దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న తమ బా ధను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రి న్సిపాల్‌ను తొలగించే వరకూ గురుకులానికి వెళ్లమ ని భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఓ విద్యార్థిని తండ్రి అరటి పండ్లు, వాటర్ప్యాకెట్లు తీసుకొచ్చి వారి ఆక లి తీర్చడం గమనార్హం. పోలీసులు, పాఠశాల టీచ ర్లు ఎంత బతిబాలినా విద్యార్థినులు మొండికేయడం.. ఎండలో విద్యార్థినుల అవస్థలు గమనించిన టీచర్లు సైతం కన్నీరుపెట్టుకున్నారు. టీచర్లను చూసి విద్యార్థినులూ కన్నీటిపర్యంతమయ్యారు. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థినులు వెనక్కి తగ్గకుండా ఆమెకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివిధ విద్యా సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అయితే విద్యార్థినులను సముదాయించి తీసుకురావాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కొంత మంది అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులతో మాట్లాడి గురుకులానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా విద్యార్థినులు ‘భోజనం చేయమని.. ప్రిన్సిపా ల్ తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటాం’ అని గేటు ఎదుట బైఠాయించారు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోపలికి పంపించారు. కొద్దిసేపు చెట్ల కింద కూర్చున్న విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పాఠశాలలోకి వెళ్లారు. విద్యార్థినుల ఆరోపణలపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్షి్మని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తలేరు.. ప్రిన్సిపాల్‌కు చెప్పినా సమస్యలను పట్టించుకోవడం లేదు. జ్వరం వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదు. ప్రస్తుతం ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. – స్వాతి, ఇంటర్ అన్నంలో పురుగులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. ప్రిన్సిపాల్‌కు చెప్పినా అదే తినాలి అని చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – ఆర్తి, తొమ్మిదో తరగతి వేరే కళాశాలలో చేర్పిస్తా మా పాప నిఖిత గిరిజన గురుకులంలో ఇంటర్ చదువుతోంది. కళాశాలలో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నానని ఏడుస్తోంది. టీసీ తీసుకుని వెళ్లి వేరే కళాశాలలో చేర్పిస్తా. – రమేశ్, విద్యార్థిని తండ్రి -
లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని..
కాసేపు లాఠీని పక్కనపెట్టి గరిటను పట్టుకుందాం అనుకుని కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ వారు ఈ వానల్లో వేడివేడిగా వంట చేశారు. వీడియో కూడా తీశారు. వాళ్లు లొట్టలేసుకు తింటుంటే నెటిజన్లు‘ఈ మాత్రం కళాపోషణ’ ఉండాలి అని మెచ్చుకున్నారు. కాని పోలీసు బాసులు మాత్రం వేరొకటి తలచారు. ఏమా వంట? ఏమా వైరల్? ఆ పోలీసులు ఇంట్లో వంట చేసుకుని ఉంటే బాగుండు. కాని వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందో ఏమో, కొంచెం బోర్ను బ్రేక్ చేద్దాం అనుకున్నారో ఏమో ఏకంగా స్టేషన్లోనే వంట చేశారు. ఆ చేయడం వీడియోలో షూట్ చేసి ఇన్‌స్టాలో పెట్టారు. చూసిన జనం ఈ మాత్రం సర్దా ఉండాల్లే అని ముచ్చట పడితే పోలీసు బాసులు మాత్రం కయ్యిమన్నారు. అసలేం జరిగిందంటే కేరళలోని ఇలవుంతిట్ట అనే స్టేషన్లో పోలీసులు వంట చేసుకు తిన్నారు. చికెన్‌ని తేవడం, ముక్కలు కొట్టించడం, కూర చేయడం, మటన్ కూర, దాంతో పాటు చిలగడదుంపల సంగటి కెమెరా ముందు అద్భుతంగా వండారు. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చి స్టేషన్ ఎస్.ఐతో పాటు అందరూ ఆరగించారు. దానికి మంచి పాట జత చేశారు. వీడియో సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది... జనం రకరకాల సరదా కామెంట్లు చేశారు. ‘అప్పుడప్పుడు తినండోయ్... ఎప్పుడూ డ్యూటీయేనా’ అన్నారు. కాని ఈ వీడియో పోలీస్ బాస్‌ల కంట పడింది. ఆ ఏరియా ఐ.జి ‘ఈ విధంగా డ్యూటీలో వండుకు తినడం ఏ విధంగా విధులకు భంగకరం కాదో’ వివరణ ఇమ్మని ఆదేశించాడు. మరి ఐ.జి గారికి ఎక్సప్లనేషనే పంపుతారో ఇంకో కూర వండి కూల్ చేస్తారో తెలియదు. (చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!) -
యాప్.. ఏజ్ గ్యాప్!
సాక్షి, హైదరాబాద్: కొందరికి బిర్యానీ ఇష్టం.. ఇంకొందరికి వంకాయ అంటే మధురం.. మరికొందరికి పప్పన్నమే అమృతం.. ఇలా ఇష్టాలు మరెన్నో.. అదీ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల వారీగా భిన్నంగా ఉంటుంది. అందుకే ‘లోకో భిన్న రుచి’అన్న సామెత పుట్టింది. మరి ఒక్క భోజనం విషయంలోనేనా.. అన్ని వ్యవహారాలకూ ఈ నానుడి వర్తిస్తుంది. ఇది తేల్చేందుకే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, యాప్‌ల వినియోగంపై వివిధ అధ్యయనాలు జరిగాయి. అన్ని అధ్యయనాలూ కొంచెం అటూఇటూగా ఒకే తరహా ఫలితాలను ఇవ్వడం గమనార్హం. అన్నీ కూడా లోకా ‘మొబైల్ యాప్స్’భిన్న రుచీ అన్నట్టుగా నివేదికలు ఇచ్చేశాయి మరి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మందికిపైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. దీనికి తగ్గట్టుగానే మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్) భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫోన్లు, యాప్‌ల వినియోగం బాగా ఎక్కువైంది. ఆఫీసులో, ఇంట్లో, వీధిలో, బెడ్‌పై ఉన్నా, భోజనం చేస్తున్నా, వాహనాల్లో ఉన్నా ఫోన్లను ఉపయోగించడం పెరిగిపోయింది. అయితే ఇందులో ఫోన్ మాట్లాడటానికి వినియోగించే సమయం తక్కువేనని.. 88శాతం సమయాన్ని యాప్స్‌లోనే గడుపుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక తరచూ ఫోన్ చెక్ చేసుకోవడం కూడా బాగా పెరిగిపోయినట్టు తేలింది. ఉదాహరణకు అమెరికన్లు సగటున రోజూ 262 సార్లు అంటే ప్రతి ఐదున్నర నిమిషాలకోసారి తమ ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నట్టు వెల్లడైంది. వివిధ అధ్యయనాలు, పరిశీలనల్లో తేలినది ఇదీ.. ►24 ఏళ్లలోపు యువతరంలో 21శాతం రోజుకు యాభైకంటే ఎక్కువసార్లు ఒక యాప్‌ను ఓపెన్ చేస్తున్నారు. ►49 శాతం వినియోగదారులు రోజుకు 11 సార్లు యాప్‌లను తెరుస్తున్నారు. ►సగటు స్మార్ట్ఫోన్యూజర్ రోజుకు 10 యాప్‌లను.. నెలకు 30 యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ►యాపిల్ యాప్ స్టోర్‌లో 1.96 మిలియన్ల యాప్‌లు, గూగుల్ ప్లేస్టోర్‌లో 2.87 మిలియన్ల యాప్‌లు ఉన్నాయి. ►గతేడాది మొత్తంగా 219 బిలియన్ల యాప్‌లను స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ►ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం యాప్ డౌన్లోడ్లు ఉచితంగానే జరుగుతున్నాయి. ►సగటున ఒక్కో వ్యక్తి తమ ఫోన్లో 80 దాకా యాప్‌లను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. వీటిలో 62 శాతం యాప్‌లను నెలలో ఒకసారి కూడా ఉపయోగించడం లేదు ►2023లో మొబైల్ యాప్స్ ద్వారా 935 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్లకు భిన్నంగా మనదేశంలో వయసు వారీగా యాప్‌ల వినియోగంలో ప్రాధాన్యతలు వేరుగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా 18– 24 ఏళ్ల మధ్యవారు తమ మొబైల్స్‌లో గడిపే సమయం, వినియోగించే యాప్‌లకు.. 25ఏళ్లు, ఆపైనవారి అభిరుచులు, ప్రాధాన్యతలకు భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ►24 ఏళ్లలోపు యువతరం ఇన్‌స్టా, ట్రూకాలర్, ఫ్లిప్‌కార్ట్, ఎంఎక్స్ ప్లేయర్, టెలిగ్రామ్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. ►25 ఏళ్లు, ఆపై వయసు వారు వాట్సాప్, ఫేస్బుక్, ఫోన్‌పే, అమెజాన్, ఫేస్బుక్ మెసెంజర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ►మహిళలు ఉపయోగించే టాప్–5 యాప్‌లలో వాట్సాప్, స్నాప్‌చాట్, మీషో, షేర్‌చాట్, మోజో ఉన్నాయి. ►పురుషులు ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రూకాలర్, ఫోన్‌పే, అమెజాన్లను వినియోగిస్తున్నారు. -
కేజీబీవీలో నాసిరకం ఆహారం
నేరడిగొండ: నాసిరకం భోజనం కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో 248 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం టిఫిన్ (చపాతి, పెసరపప్పు) చేసిన 11మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో మిగతా విద్యార్థులు కేజీబీవీ భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. ఇటీవల భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సెలవుదినం కావడంలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూడా సిబ్బందిని నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ జయశ్రీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సెక్టోరల్ అధికారి ఉదయశ్రీకి పలువురు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయగా, సోమవారం వచ్చి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపాల్‌ను ఈ విషయమై సంప్రదించగా.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. కాగా, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విద్యార్థినుల నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. -
అమ్మ చేతి ఆఖరి వంట.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్
అమ్మ ప్రేమకు కొలమానం ఉంటుందా?.. అంతులేని మమకారాన్ని ప్రదర్శించిన ఓ అమ్మ వీడియో కోట్ల మందితో కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే ఆమె ఆఖరి గడియలు ఉంది కాబట్టి. అయినా ఆ ఇబ్బందికర క్షణాల్లోనూ ఆమె కొడుకు కోసమే ఆలోచించింది. ప్రేమగా అతనికి వండిపెట్టింది. చైనాలో ఓ వీడియో.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటిదాకా కోట్ల మంది ఆ వీడియోను తిలకించడంతో రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ వారం మోస్ట్ సెర్చ్డ్ న్యూస్‌గా అక్కడి నిలిచింది ఆ వీడియో. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ.. ఆఖరి క్షణాల్లో తన కొడుకు కోసం ప్రేమగా వండిపెడితే.. వ్లోగర్ అయిన ఆ కుర్రాడు కన్నీళ్లతో తీసిన వీడియో అది. దలైయాన్కు చెందిన ఓ 20 ఏళ్ల టీనేజర్.. డెంగ్ అనే మారుపేరుతో గత వారం చైనా షార్ట్‌వీడియో యాప్ డౌయిన్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. చైనా జానపద సంగీతం ఫేర్వెల్ సంగీతాన్ని ఆ వీడియోకు జత చేశాడు. ‘‘అమ్మా.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఇకపై ఏదీ నన్ను ఓడించదు’’ కన్నీళ్లతో ఆమెకు నివాళి ఇస్తూ క్యాప్షన్ ఉంచాడు. ‘‘మా అమ్మకి మనోధైర్యం ఎక్కువ. స్వతంత్రంగా బతకాలనుకునే మనిషి. ఈ ఫిబ్రవరిలో ఆమె(49) క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఇంట్లోవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఆ విషయం తెలిస్తే మేం ఏమైపోతామో అని ఆమె భయం. ఆమెకి ఉన్న జబ్బు మాకు తెలిసేసరికి.. పరిస్థితి చేజారిపోయింది. అయినా అమ్మను బతికించుకునేందుకు ప్రయత్నించాం. మూడో సెషన్ కీమోథెరపీ పూర్తైన కొన్నాళ్లకు.. ఆమె ఒకరోజు హఠాత్తుగా ‘ఏం తినాలని ఉంది’ అని నన్ను అడిగింది. మార్కెట్‌కు తాను కూడా వచ్చింది. కావాల్సిన సరుకులన్నీ ఆమె ఎంచుకుంది. స్వయంగా వంట గదిలో దగ్గరుండి వండింది. మా అమ్మను అలా చూసేసరికి నా కన్నీళ్లు ఆగలేదు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతూనే ఆమె వంట చేసింది. కనీసం నన్ను దగ్గరికి కూడా రావొద్దని వారించింది. దగ్గరుండి ఆమె వడ్డించింది. ఆమె వండిన వంట.. ఎప్పటిలాగే రుచికరంగా ఉంది. దురదృష్టవశాత్తూ అదే మా అమ్మ చేతి ఆఖరి వంట అయ్యింది. ఆ మరుసటిరోజే ఆమె నిద్రలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను, చివరి క్షణాలను ఇక నేను జీవితాంతం మోయక తప్పదు అంటూ భావోద్వేగంగా ఆ వీడియోను ఉంచాడు. కేవలం ఆ షార్ట్ వీడియో డౌయిన్‌లో రెండు లక్షల దాకా లైకులు తెచ్చుకుంది. చావు.. ఎల్లప్పుడూ బతికి ఉండే ప్రేమకు ముగింపు కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. తన అమ్మ చనిపోయిన తర్వాత ఆమె వండిన వంటకాలు ఫ్రిజ్‌లో ఉండిపోయాయని, వాటిని చాలాకాలం ఆమెను తల్చుకుంటూ తిన్నానని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఏ లోకంలో ఉన్నా ఆ అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుందని ఓ మహిళ కామెంట్ చేసింది. -
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
మంచి భోజనం
మాధవ్ శింగరాజు ధర్మ ఒకప్పుడు బాగా బతికినవాడు. అంటే, ఇప్పుడతడు బతికి ఉన్నాడని, బతికుండి కూడా బాగా బతకడం లేదని కాదు. అతడు చనిపోయి చాలాకాలమే అయింది. ఎందుకో మళ్లీ అతడు భూమి మీదకు వచ్చాడు! ఆకాశంలోంచి భూమి మీదకు కాదు. భూగర్భంలోంచి భూమి మీదకు. బాగా ఆకలవుతోంది ధర్మకి. మంచి భోజనం దొరికితే బాగుండనుకున్నాడు. నిజంగా ఇప్పుడతనికి మంచి భోజనం కావాలి. బాగా బతికినవాడు మరి. ∙∙ మంచి భోజనం కోసం హైదరాబాద్‌లో రోడ్లు, బోర్డ్‌లు చూసుకుంటూ నడుస్తున్నాడు ధర్మ. ఓ చోట ‘మంచి భోజనం’ అనే బోర్డు కనిపించింది! బోర్డుకూడా వెరైటీగా ఉంది. బోర్డు బోర్డులా లేదు. అరటి ఆకులా ఉంది. ‘మంచి భోజనం’ అనే అక్షరాల కింద.. ‘తెలుగు భోజనం. భక్తితో వడ్డించబడును’ అని రాసి ఉంది. ఒక్క క్షణం ఆగాడు ధర్మ. భక్తితో వడ్డించడం అంటే నైవేద్యం పెట్టడం. ఎవరికి నైవేద్యం పెడతారు? దేవుడికి. మరి తనను లోపలికి రానిస్తారా? ఆలోచిస్తున్నాడు ధర్మ. ఆలోచిస్తూనే ఆ రెస్టారెంట్ మెట్లు ఎక్కాడు. లోపల పెద్ద హాలు! నిండా జనం. అంతా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఆఫీసర్లు. ఎగ్జిక్యూటివ్‌లు. అందరి చేతుల్లో టోకెన్లు ఉన్నాయి. ఆ పైఫ్లోర్‌లో డైనింగ్ హాల్. పైన రెండు కుర్చీలు ఖాళీ అయ్యాయని చెప్పగానే కింది నుంచి ఇద్దరు వెళుతున్నారు. మూడు అయ్యాయంటే ముగ్గురు. టేబుల్ టేబులే ఖాళీ అయిందని కబురొస్తే నలుగురు వెళుతున్నారు. టోకెన్ తీసుకున్నవాళ్లలో కూడా మళ్లీ అందరికీ కుర్చీల్లేవు. కొందరు నిలుచునే ఉన్నారు. నిలుచున్నందుకు వాళ్లేమీ నిట్టూర్చడం లేదు. ఫోన్లు చూసుకుంటున్నారు. ‘‘ఒక భోజనం’’ అన్నాడు ధర్మ.. పర్సు తీసి. కౌంటర్లో ఉన్నతను ధర్మ వైపు చూడనైనా చూడకుండా ‘‘ఫుల్లా.. ప్లేటా?’’ అన్నాడు. ధర్మ కాస్త నొచ్చుకున్నాడు. పోన్లే.. వీళ్లేమీ బోర్డు మీద రాయలేదు కదా.. ‘భక్తితో వడ్డించడమే కాదు.. భక్తితో టోకెన్ కూడా ఇవ్వబడును’ అని.. అనుకున్నాడు. మంచి భోజనం చేయాలని అతడికి ఎంతగానో ఉంది. ‘‘ఫుల్లే ఇవ్వండి’’ అన్నాడు. ‘డబ్బులు ఇవ్వండి’ అన్నట్లు చెయ్యి చాచాడు కౌంటర్లోని మనిషి. ‘‘ఎంత?’’ అని అడిగాడు ధర్మ. ‘‘రెండు వేలు’’ చెప్పాడు ఆ మనిషి. ధర్మ ఆశ్చర్యపోయాడు. ఒక్కక్షణం ఆలోచించి, ‘‘ప్లేట్ మీల్స్ అయితే ఎంత?’’ అని అyì గాడు. ‘‘ఒక వెయ్యీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది..’’ చెప్పాడతను. ‘‘అయితే ఫుల్లే ఇవ్వండి’’ అన్నాడు ధర్మ. విసుక్కుంటూ.. ఫుల్ టోకెన్ ఇచ్చి, రెండు వేల నోటు తీసుకున్నాడు అతను. పాపం అతడి తప్పేం లేదు. భోజనం చేశాక చెయ్యి కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గర పెద్ద క్యూ ఉన్నట్లు.. టోకెన్ తీసుకోడానికి ఆ అర నిముషంలోనే ధర్మ వెనుక పెద్ద క్యూ తయారైంది! టోకెన్ దొరికిన కొంతసేపటికి పైన భోజనం హాల్లో సీటు కూడా దొరికింది ధర్మకు. అప్పుడే కడిగిన స్టీల్ ప్లేట్‌ను విదుల్చుకుంటూ తీసుకొచ్చి ఆప్యాయంగా ధర్మ ముందు పెట్టాడు వెయిటర్. ప్లేట్ చూసి నిరాశ పడ్డాడు ధర్మ. బయట రెస్టారెంట్ బోర్డు అరిటాకులా ఉంది కాబట్టి, రెస్టారెంట్ లోపల కూడా అరిటాకులోనే భోజనం వడ్డిస్తారనుకున్నాడు. ధర్మ ముందు ఖాళీ ప్లేట్ పెట్టి వెళ్లిన కుర్రాడు మళ్లీ రాలేదు. వేరెవరో వచ్చి, ఒక స్టీల్ జగ్గు, రెండు ఖాళీ గ్లాసులు పెట్టి వెళ్లారు. వాటిల్లో ఒకటి తనకు కావచ్చనుకున్నాడు ధర్మ. గ్లాసులో నీళ్లు వాళ్లొచ్చి పోస్తారా, తను పోసుకోవాలా అని ఆలోచించలేదు అతను. పోసుకున్నాడు. ఆకలి దహించుకుపోతోంది. ఈలోపు ఎవరో వచ్చి చిన్న స్వీటు ముక్క ఏదో ప్లేటులో పెట్టి వెళ్లిపోయారు. ఇంకొకరొచ్చి అప్పడం వేసి వెళ్లారు. ఇంకొకరు అరటి పండు పెట్టి వెళ్లారు. మొదట ప్లేటు పెట్టిన కుర్రాడే మళ్లీ వచ్చి రెండో రకం స్వీటు పెట్టి వెళ్లాడు. మరొకరు వచ్చి, రెండు పూరీలు వేసి వెళ్లారు. ఏవేవో వస్తున్నాయి. అన్నం మాత్రం రావడం లేదు. అడిగితే ఆప్యాయతను మిస్ అవుతానని ధర్మ మౌనంగా ఉన్నాడు. టేబుల్ మీద నాలుగు అరల కూరల గిన్నెల్లో ఒక కూర, ఒక వేపుడు, సాంబారు, రసం ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న చిన్న గిన్నెల అరల్లో ఏవో పొడులు, పచ్చళ్లు ఉన్నాయి. ప్లేటులో అన్నం లేకుండా.. ప్లేటు చుట్టూ అవన్నీ ఉన్నాయి.‘‘బాబూ.. రైస్’’ అన్నాడు ధర్మ. ఆప్యాయంగా వడ్డించడం అనే డ్యూటీలో పడిపోయి తనను మర్చిపోయాడేమోనని. నిజమే. మర్చిపోయాడు. ‘‘అరె.. ఇక్కడింకా రైస్ పడలేదా?’’ అని పెద్దగా అరిచి, ఎవరికో పురమాయించాడు. ‘పడలేదా?’ అనే మాట ధర్మకు మింగుడు పడలేదు. ఒక ముద్ద తినడానికి ఇంత అస్థిమితం ఏమిటి అనుకున్నాడు. అన్నం వచ్చింది. డిష్ పట్టుకొచ్చిన మనిషి డిష్లోంచి గరిటెతో కొద్దిగా అన్నాన్ని ప్లేట్లోకి జార్చి వెళ్లిపోయాడు. ఫుల్ మీల్స్ కాబట్టి అలాగే కొద్దికొద్దిగా పెడుతూ ఉంటారు. ప్లేట్ మీల్స్‌లో ఒకేసారి కొద్దిగా పెట్టి ఇక ఊరుకుంటారు. అన్నం కలుపుకోబోయాడు ధర్మ. వేడిగా లేదు! పిలిచి అడిగాడు. ‘‘వేడిగానే తెచ్చాను కదా’’ అన్నాడు డిష్ మనిషి. కోపాన్ని ఆపుకున్నాడు ధర్మ. ‘‘వేడిగా ఉండడం వేరు. వెచ్చగా ఉండడం వేరు. వేడిగా ఉంటే అన్నం పొగలు కక్కుతుంది..’’ పెద్దగా అరిచాడు. చుట్టూ భోజనం చేస్తున్నవాళ్లంతా ‘ఏంటీ న్యూసెన్స్?!’ అన్నట్లు ధర్మవైపు చూశారు. ధర్మ కూడా వాళ్లవైపు చూశాడు. తను తింటున్నప్పుడు కూడా మధ్యమధ్యలో ఆ తినేవాళ్లను చూస్తున్నాడు ధర్మ. వెయిటర్లు భక్తితో పెడుతున్నారో లేదో కానీ, వాళ్లు మాత్రం భక్తితో తింటున్నారు! ఫోన్లు చూసుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ ఎందులో ఏం కలుపుకుంటున్నారో తెలియకుండా తింటున్నారు. ఎవరూ ప్రశ్నించడం లేదు. అన్నం వేడిగా లేదేంటి అని అడగడం లేదు. పప్పులో ఉప్పెక్కువైంది ఏంటీ అని అడగడం లేదు. పెరుగు నీళ్లలా ఉందేంటీ అని అడగడం లేదు. పెట్టింది తింటున్నారంతే. ఒకళ్లెవరో అంటున్నారు.. ఇంత మంచి రెస్టారెంట్‌ను తనెప్పుడూ చూడలేదని! డైనింగ్ టేబుల్స్ బాగున్నాయట. ఫ్లోర్ మీద టైల్స్ బాగున్నాయట. వాల్స్ మీద పెయింటింగ్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయట. కిటికీలోంచి చూస్తే పక్క బిల్డింగ్ మీద రూఫ్‌టాప్‌పై మొక్కలు బాగున్నాయట!భోజనాన్ని తినలేక మధ్యలోనే వదిలేసి.. వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు శుభ్రంగా కడుక్కుని కౌంటర్లో ఉన్న మనిషి దగ్గరికి వెళ్లాడు ధర్మ.‘ఏంటి?’ అన్నట్లు చూశాడు ఆ మనిషి. ‘‘భోజనం బాగుంది’’ అన్నాడు ధర్మ. ‘అందులో వింతేం ఉంది’ అన్నట్లు భుజాలు ఎగరేశాడు అతడు.‘‘మంచి క్వాలిటీ మీల్స్‌ని తక్కువ ధరకు అందిస్తున్నారు. ఎవరు మీ ప్రొప్రయిటర్?’’ అడిగాడు ధర్మ. ‘‘థ్యాంక్యూ. ప్రొప్రయిటర్ని నేనే’’ చెప్పాడు అతను. కత్తి తీసి సర్రున అతడి గొంతు కోశాడు ధర్మ. ‘‘తప్పు నీది కాదు. నువ్వెలా పెట్టినా తింటున్నవాళ్లది. మరోసారి వాళ్లను తప్పు చెయ్యనివ్వను’’ అనేసి మెట్లు దిగి వెళ్లిపోయాడు.∙∙ ధర్మ బాగా బతికినవాడు. బాగా బతకడం అంటే అతడి దృష్టిలో.. ఇంత విస్తరాకులో వేడి వేడి అన్నం, ఘాటుగా పచ్చిమిరపకాయ పచ్చడి కలుపుకుని కమ్మగా తినడం! స్వీట్లు, సలాడ్లు.. వంద రకాల కూరలులేకుండా కడుపుకు అవసరమైనంత వరకే తినడం. ఆకలిగా ఉంది ధర్మకు. ఒక్క పూట ఎవరైనా తనకు మంచి భోజనం పెడితే తను వీలునామా రాయకుండా వదిలిపోయిన యావదాస్తినీ ఇచ్చేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. -
మూడేళ్ల తర్వాత అన్నం ముద్ద
వేములవాడ: వేములవాడ రాజన్ననే నమ్ముకుని మూడేళ్లపాటు అన్నం ముట్టకుండా దీక్ష చేపట్టిన డాక్టర్ (డెంటల్) అనుమోలు అర్పిత శుక్రవారం దీక్షను విరమించారు. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరులో ప్రాక్టీస్ చేస్తున్న అర్పిత.. వేములవాడ రాజన్నకు అన్నపూజ నిర్వహించిన అనంతరమే దీక్ష విరమిస్తానని మూడేళ్ల క్రితం మొక్కుకున్నట్లు చెప్పారు. శుక్రవారం సోదరి అపర్ణ, స్నేహితురాలు మంజులతో కలసి వేములవాడకు వచ్చారు. స్వామివారికి అన్నపూజ నిర్వహించిన తర్వాత భోజనం చేశారు. తన కుటుంబం బాగుకోసం రాజన్నకు మొక్కుకుని దీక్ష చేపట్టినట్లు చెప్పారు. మూడేళ్లపాటు పండ్లు, ఇతర పదార్థాలు స్వీకరించినట్లు తెలిపారు. తిరువూరులోనే పిల్లల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న తన భర్త నాగభూషణం, ఇద్దరు కుమారులు అఖిల్రాజు, ఆకాశ్ సైతం తన దీక్షకు మద్దతు ప్రకటించారని ఆమె సంతోషంగా చెబుతున్నారు. -
రాజన్న క్యాంటీన్ ప్రారంభం
- నాలుగు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం - ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పేద ప్రజలకు కడుపునిండా రుచికరమైన భోజనం పెట్టాలనే సంకల్పంతో మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆదివారం ‘రాజన్న’ మొబైల్ క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేవలం నాలుగు రూపాయలకే పేదలకు భోజనాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. 2004లో మే 14వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాజన్న క్యాంటీన్ పేరుతో భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 365 రోజులూ ప్రతి పేదవాడికీ శ్రేష్టమైన భోజనం అందేలా తన సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం కనుక క్యాంటీన్లు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో మసీదు సెంటర్ వద్ద ప్రతి పేదవాడికీ ఒక్క రూపాయికే నాలుగు ఇడ్లీలు ఇచ్చే పథకం ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంటీన్లు పరిశీలించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కమిటీలను పంపించారని, ఇప్పటికి మూడేళ్లు గడిచినా పథకం రూపు దాల్చలేదన్నారు. -
రాజన్న క్యాంటీన్లో రూ.4కే భోజనం
- నేడు మంగళగిరిలో ప్రారంభం - పేదల కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్లో ఆదివారం నుంచి నాలుగు రూపాయలకే భోజనాన్ని అందించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. రాజన్న క్యాంటీన్ పేరుతో కేవలం నాలుగు రూపాయలకే అన్నం, కూర, పెరుగు, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మిగిలిన మూడు రోజులు అరటి పండ్లు, వడియాలు, తాగునీటి ప్యాకెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజైన మే 14వ తేదీన రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గౌతమ బుద్ధారోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే ఆర్కే ఈ క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని వివరించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లో అందజేస్తున్న భోజనాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. నెలలో తొలి పదిరోజులు అంబేడ్కర్ విగ్రహం సెంటర్, మలి పది రోజులు పట్టణంలోని మిద్దె సెంటర్, మిగిలిన పది రోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో భోజనం అందజేయనున్నట్లు వివరించారు. -
అన్నం అడిగితే కర్రలతో బాదారు
గుంటూరు జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీలో ఘటన 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు మేడికొండూరు(గుంటూరు): భోజనం పెట్టలేదని అడిగినందుకు కర్రలతో విచక్షణా రహితంగా విద్యార్థులను బాదారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లోని ఓ జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పేరేచర్ల జంక్షన్‌లోని శ్రీలక్ష్మీ నరసింహా కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ వసతితో ఇక్కడ బోధన చేస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం చేసేందుకు విద్యార్థులు వచ్చారు. వారికి తెచ్చిన భోజనం సరిపోకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావును విద్యార్థులు భోజనం పెట్టించమని అడిగారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాల యాజమాన్యానికి తెలియపరచగా కళాశాల కరస్పాండెంట్ బి.లక్ష్మణరావు, కొంతమంది లెక్చరర్లు అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి కార్లలో పేరేచర్లకు వచ్చి విద్యార్థులపై కర్రలతో దాడి చేశారు. సుమారు 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇతర విద్యార్థులు పరిస్థితిని స్థానికులకు చెప్పారు. వారు మేడికొండూరు పోలీసులకు తెలియజేశారు.ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సత్తెనపల్లి – గుంటూరు ప్రధాన రహదారిపై నిరసనగా బైఠాయించారు. ఘటనా స్థలానికివ వచ్చిన గుంటూరు సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు పరిస్థితిని చక్కదిద్దారు. విద్యార్థులను కొట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
గోరుముద్ద అందేనా?
నిధులు కేటాయించని సర్కారు సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు అర్థాకలితో విద్యార్థులు ఆరోగ్యంపై ప్రభావం రెంజల్ : 2016–17 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట అదనంగా ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. విద్యార్థుల ఉత్తమ గ్రేడ్ల సాధనే ప్రామాణికంగా పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు వారి బాగోగులు పట్టించుకొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ పాత్ర బాగానే ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేక తరగతుల కోసం వేకువ జామునే ఇంటి నుంచి బయల్దెరే పిల్లల ఆకలిని తీర్చుకునేందుకు మధ్యలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. సాయంత్రం బడి వదిలాక అర్దాకలితో ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. హైస్కూళ్లకు చట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నాకనే ముద్ద నోట్లో వేసుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పస్తులుంటున్న విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించక పోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అందని ఉదయం, సాయంత్రం స్నాక్స్.. జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందడం లేదు. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే వీక్లీ టెస్టులు, స్పెషల్ టెస్టులు పూర్తవగా ప్రస్తుతం ఈ నెల 15వ తేదీ వరకు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ నుంచి మార్చి 6 వరకు ఫ్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయినప్పటికీ విద్యార్థుల నోట్లోకి గోరుముద్ద అందడం లేదు. పదో తరగతి పరీక్షలు మార్చి నెల 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 504 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 24 వేల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదిలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ గత డిసెంబరు నుంచి ప్రత్యేక కార్యాచరణను రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురుకావద్దని ప్రముఖ వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. మూడుపూటలా తప్పని సరిగా మితంగా భోజనం చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే మనసును ప్రశాంతంగా నిమగ్నం చేసి చదువుకునే వీలుంటుందని అంటున్నారు. అర్దాకలితో చదివితే నిరుపయోగమని సూచిస్తున్నారు. చదివింది ఒంటబట్టేందుకు సమయం వృథా అవుతుందంటున్నారు. సమయానికి తినకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రణాళిక ప్రకారం భోజనం, నిద్ర విద్యార్థులకు తప్పనిసరని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం విద్యార్థులు లేచింది మొదలు రాత్రి వరకు పాఠశాలలకు అతుక్కుపోతున్నారు. వారి ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గోరుముద్దకు దాతలు ముందుకు రావాలి.. గోరుముద్దకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గోరుముద్ద పేరిట గతేడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దాతలతో అల్పాహారం అందించేందుకు అధికారులు ప్రయత్నించి సఫలమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులను అందించకున్నా అధికారులు ప్రత్యేక చోరవ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్‌ను వివరణ కోరగా.. గోరుముద్ద అందించేందుకు జిల్లాలోని హైస్కూల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పలు పాఠశాలల్లో దాతల సహకారంతో అల్పాహారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి గోరుముద్దకు నిధులు రాకున్నా ఇంకా సమయం ఉన్నందును త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆకలితో అలమటిస్తున్నాం.. నా పేరు వంశి. నేను కూనేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. మా తరగతిలో 45 మంది విద్యార్థులు ఉంటారు. మా సొంత గ్రామం కల్యాపూర్. కూనేపల్లికి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాతోపాటు మా ఊరు నుంచి పదో తరగతి విద్యార్థులు 15 మంది వస్తారు. ప్రత్యేక తరగతుల కోసం ఉదయం ఏడు గంటలకు మా ఊరు నుంచి బస్సులో వస్తాము. కొందరం భోజనం చేసి వస్తారు, కొందరు చేయక వస్తారు. మధ్యాహ్నం మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తాము. ప్రత్యేక తరగతులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. పగలంతా ఆకలితో పాఠాలు వింటు న్నాము. ఉదయం, సాయంత్రం స్నాక్స్ పెడితే బాగుంటుంది. -
నిద్రలేమితో బాధపడుతుంటే...
హెల్త్‌టిప్స్ ఒక గ్లాసు వేడిపాలలో ఒక టీ స్పూన్ తేనె కలిపి రాత్రి పడుకోవడానికి అరగంట ముందుగా తాగితే బాగా నిద్రపడుతుంది. పాలతో అరిపాదాలకు మసాజ్ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకుని తలకు పట్టించి, పది నిమిషాల సేపు మర్దన చేసి తలస్నానం చేస్తుంటే నిద్రలేమి సమస్య బాధించదు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది. {పతిరోజూ రాత్రి అర కప్పు సొరకాయ రసంలో, అంతే మోతాదులో నువ్వులనూనె కలిపి తలకు మర్దన చేయాలి. అలాగే సొరపాదు ఆకులను ఉడకబెట్టి ఆహారంతోపాటు తీసుకుంటే కూడా మంచి ఫలితాన్నిస్తుంది కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. 350 ఎం.ఎల్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు లేదా సోంపు పొడి వేసి మరిగించాలి. పాత్రకు మూత పెట్టి సన్న మంట మీద పదిహేను నిమిషాల సేపు ఉడికించి, వడపోసి, వేడిగా కాని గోరువెచ్చగా కాని తాగాలి. రుచికోసం తగినంత తేనె, పాలను కూడ కలుపుకోవచ్చు. ఈ టీని రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు తాగవచ్చు. -
స్నానం.. దానం.. దీపం.. ఉపవాసం...
నెలంతా.. పండగే తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. ఆధ్యాత్మిక ఆరోగ్యవాసం: పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసి - శిఖరం లేక గోపుర ద్వారం వద్ద నేతితో గానీ, మంచి నూనెతోగానీ - ఇప్ప - నారింజ నూనెతో గానీ దీపారాధన చేయాలి. శివారాధన ముఖ్యమైనది. ఈ మాసంలో పగటి పూట వేడి - రాత్రి చల్లదనం ఉంటాయి. వాత-పైత్య-శ్లేష్మాలు వస్తాయి. అందువలన ఒక్క పొద్దు భోజనం శ్రేష్ఠం. వీటిని చాదస్తంగా భావించక ఆరోగ్యపరంగా ఆలోచించాలి. దీర్ఘవ్యాధుల నివారణలో ఉపవాసం తిరుగులేని మందు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికరంగా ఆలోచనలో, ఆవేశాలపరంగా సమతౌల్యం సాధించడానికి ఉపవాస నిర్ణయం ఎంతో గొప్పది. ఉపవాసంలో స్వల్పంగా ఆహారం-నీరు-తీసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. దైవం పట్ల స్థిరచిత్తం ఏర్పడుతుంది. ‘ఉప’ అంటే దగ్గరలో, వాసం అంటే ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, సాత్త్వికాహారం, మితాహారం-దైవార్పితం చేసి తీసుకోవాలి. న్యాయార్జితాహారం పొందాలని శాస్త్రం. వృద్ధులకు, రోగులకు మినహాయింపు: వృద్ధులు - మానసిక - మెదడు వ్యాధిగ్రస్థులు - గర్భిణులు- క్షయరోగులు - మధుమేహగ్రస్థులు - క్రీడాకారులు ఉపవాసం చేయరాదు. శాస్త్రప్రకారం వారికి మినహాయింపు ఉంది. శరదృతువు ఇది. బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే మంచిది. ప్రవాహస్నానం పవిత్రం. దైవధ్యానం జపం - గ్రంథపఠనం - పురాణాలు చదవడం - వినడం చేయాలి. వృక్షారాధనం విశేషం: అశ్వత్థం విష్ణురూపం - వటవృక్షం రుద్రరూపం. పలాశ వృక్షం బ్రహ్మరూపం. అశ్వత్థ వృక్షాన్ని (రావి చెట్టును) ఆశ్రయించి ఉండమని విష్ణువు లక్ష్మీదేవిని ఆదేశించాడు. రావి చెట్టు శీతల గుణం కలిగి ఉంటుంది. పైత్య దోషాన్ని నివారిస్తుంది. స్త్రీలు ఈ మాసంలో తులసిని పూజించి దీపాలు వెలిగించాలి. తులసిమూలంలో సర్వతీర్థాలు - మధ్యకాండంలో దేవతలు - చివుళ్ళలో సర్వవేదాలూ ఉన్నాయని శాస్త్రవచనం. విష్ణు పత్ని తులసి మాత పూజ పాపాలను హరించి, ధర్మార్థ, కామమోక్షాలు కలిగిస్తుంది. దీపారాధనం.. మోక్షకరం: ఈ మాసం అంతా శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించాలి. దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదలాలి. శివ కేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ॥ దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞానవ్యాప్తికి - వితరణకు సంకేతం. వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి, దీపం వెలిగించడం వల్ల అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రం అవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం దీపదానంలోని విశిష్టత. ప్రమిదలో వత్తులు వేసి - నువ్వుల నూనె వేసి తాళ్ల సాయంతో దీపాలు వెలిగించమే ఆకాశదీపం. విశిష్టమైన వనభోజనాలు: కార్తీకమాసంలో వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. వన భోజనాలు శాస్త్రీయమైనవి. ఉసిరిచెట్టు నీడన, పనస ఆకులో భోజనం చేయాలి. ఉసిరిని ఔషధీ భాషలో ‘ధాత్రి’ అంటారు. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రక దేహి మహాప్రాజ్ఞే యవోదేహి బలం చ మే ॥ ఉసిరి చెట్టు క్రింద చిత్రాన్నాలు చేసుకొని హరికి నివేదించి, పండిత భోజనం చేయించాలి. బంధువులతో కలిసి భుజించడం వల్ల మహాఫలం లభిస్తుంది. దేవతలు-ఋషులు-సర్వతీర్థాలు అచటనే ఉంటాయని, ఈ మాసంలోనే హరి జాగరణ చేయాలని శాస్త్రం. ఈ కార్తిక మాసంలో శివ - విష్ణ్వాలయదర్శనాలు చేయాలి. అవిలేని చోట ఇతర దేవాలయాల్లో రావి చెట్టు మొదట - తులసి వనంలో విష్ణుచరితలు పాడాలి. దేవపూజ ప్రశస్తం. దీప దానం చేయాలి. తులసి మంజరులచే హరిహరులను అర్చిస్తే ముక్తి లభిస్తుంది. తులసిచే అలంకృతమైన గృహానికి యమకింకరులు కూడా రాలేరనీ తులసీ మాహాత్మ్యం తెలుపుతుంది. ఈ మాసంలో మంత్ర దీక్ష జన్మరాహిత్యం కలిగిస్తుంది. ఈ నెలలో విష్ణువు దామోదర నామంతో పూజింపబడతాడు గాన సంకల్పంలో ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం’ అని చెబుతారు. అన్ని దానాలు ఒక వైపు, దీపదానం ఒక వైపు అని శాస్త్రం. ‘ఏకతస్సర్వదాని - దీపదానం తథైకతః’ అని శాస్త్రవచనం. ఉసిరికాయపై వత్తిని పెట్టి వెలిగించడం విష్ణువుకు ప్రీతికరం. వేకువనే విష్ణు-శివ-గంగ-సూర్యదేవతల ఉపాసన చేయాలి. శివాయ విష్ణురూపాయ - శివరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే - వాసిష్ఠాయ నమోన్నమః ॥ క్షీరాబ్ధికన్నియకు...శ్రీ మహావిష్ణువుకు... ఈ మాసంలోనే క్షీరాబ్ధి ద్వాదశి. అదే కార్తిక శుద్ధ ద్వాదశి. ఆ రోజు క్షీరసాగరశయనుడైన విష్ణువు లక్ష్మీయుతుడై తులసి వనానికి వస్తాడని చెబుతాడు. బృందావనంలో సంచరించే విష్ణువు భోగభోగ్యాలనందిస్తాడు. ఈ మాసంలో శివార్చన - అభిషేకం - ఉపవాసం - సాయంపూజ అన్నాదుల నివేదన నక్షత్ర దర్శనం ఎంతో పుణ్యప్రదం. భగినీ హస్తభోజనం... ఈ నెలలోనే యమ విదియ. ఆ రోజున సోదరి చేతివంట తినడమే భగినీ హస్తభోజనం. గోష్టాష్టమి రోజున గోవులను పూజించి ప్రదక్షిణం చేయాలి. శివదీక్షలు - విష్ణు ఆరాధనలకు కార్తిక మాసం పుణ్యఫల మాసంగా చరిత్రలో ప్రసిద్ధమైన కలిజనులకు భక్తినీ ముక్తినీ ప్రాప్తింపజేస్తుంది. కార్తిక పురాణం పఠనం చేయాలి. - పి.వి.బి. సీతారామమూర్తి -
నీటి మంటలు పుట్టించే స్వాముల గురించి...
నీటి మంటలు చేతనబడి స్వాముల్లో నీతిమంతుల గురించి అరుదుగా వింటాం. మరి... నీటి మంటలు పుట్టించే స్వాముల గురించి... దాదాపుగా అసాధ్యమే! ఈ నీటిమంటలు... నీటిమీద రాతలేనా కష్టాలను మాయచేసే ట్రిక్కులా! లేక... జేబులు కొట్టే మేజిక్కులా? ‘‘రా శంకరన్నా... ఎన్నాళ్లైంది చూసి! పిల్లలు, వదిన బావున్నారా?, మంచినీళ్లివ్వనా’’ కుశల ప్రశ్నలతో పలకరించింది హైమవతి. ‘‘అంతా బావున్నాం హైమవతీ, రిటైరయ్యాను. పిల్లల పెళ్లిళ్లయ్యాయి కదా! నేను, మీ వదిన శేషజీవితం సొంతూర్లోనే గడుపుదామనుకుంటున్నాం’’ అన్నాడు శంకరయ్య తాను వచ్చిన పని వివరిస్తూ. ‘‘అంతకంటే సంతోషం ఏముంటుంది! అలాగే రండి! ఇల్లు ఉండనే ఉందాయె’’ శంకరయ్య నిర్ణయాన్ని స్వాగతించింది హైమవతి. ‘‘ఆ ఇంటిని నివాసయోగ్యంగా మార్చుకుందామని వచ్చానమ్మా’’ మనసులో మాట బయటపెట్టాడాయన. ‘‘దానిదేముంది? ఓ గంట విశ్రాంతి తీసుకోండి. వంట చేస్తాను’’ అంటూ వంట పనిలో పడిందామె. గదిలో ఉన్న పాతకాలం నాటి వస్తువులను, కొత్తగా చేరిన వస్తువులను పరికించి చూడసాగాడు శంకరయ్య. ప్రాచీన భాండాగారంలో ఆధునికతను అమర్చినట్లు ఉందా ఇల్లు. శంకరయ్య చూపు గోడకు వేళ్లాడుతున్న క్యాలెండర్ మీద పడింది. ఎరువుల డీలర్ కంపెనీ పేరు, దుకాణం అడ్రస్సుతో ప్రచురించిన క్యాలెండర్ అది. బ్రహ్మయ్య ఎరువుల దుకాణం... అంటే వీడు తన క్లాస్మేట్ బ్రహ్మం గాడేనా?’’... ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. క్యాలెండర్లో ఉన్న స్వామీజీ ముఖం కూడా తెలిసినట్లే ఉంది. భోజనం చేస్తూ హైమవతిని క్యాలెండర్లో ఉన్న స్వామీజీ గురించి అడిగాడు. గత కొద్ది నెలలుగా తాను వింటున్న సంగతులను చెప్పసాగిందామె. ‘‘ఆయన ముఖంలో ఏదో దివ్యమైన కాంతి ఉంది వదినా’’ అబ్బురంగా చెబుతోంది కామాక్షి. ‘‘ఎప్పుడు అన్నం తింటాడో తెలియదు. ఎప్పుడో ఓసారి కళ్లు తెరిచి చెలమలో నీరు తాగి మళ్లీ చెట్టు కిందకు వస్తాట్ట.’’ ‘‘నువ్వెళ్లినప్పుడు కళ్లు తెరిచాడా. నీకేం చెప్పాడు’’ మధ్యలో అడ్డు తగులుతూ అడిగింది హైమవతి. ‘‘ఆయన వచ్చిన వాళ్లను చూడను కూడా చూడడొ దినా! అయినా సరే... ఆయన కళ్లు విప్పే క్షణాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. రెండు గంటల సేపు కూర్చున్నా. అయినా కళ్లు తెరవలే. నేనెళ్లక ఒక్క ఘడియ ముందే కళ్లు తెరిచాట్ట’’ అన్నది నిరుత్సాహంగా. సాధువు కళ్లు తెరిచాక ఎదురుగా ఉన్నవాళ్లలో చాలా మందిని పేర్లతో సంభోదించేవారు. తమ పేరు సాధువుకెలా తెలిసిందనే ఆశ్చర్యంతోపాటు మహిమ అంటే అదే మరి అనే సమాధానం కూడా వాళ్లకు వాళ్లే చెప్పుకునేవారు. సాధువుకు తమ కష్టాలను చెప్పుకునేవారు. వాళ్ల కష్టాలను సాధువు నీటిలో మండించేవాడు. సాధువు రెండు నెలల్లోనే స్వామీజీ అయ్యాడు. కొందరు భక్తులు శిష్యులుగా మారారు. స్వామీజీని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటున్నారు. వారి బస కూడా స్వామీజీతోపాటు కుటీరంలోనే. భక్తులు పెరిగారు. కానుకలు పెరిగాయి. శిష్యుల జీవనశైలి మారింది. జీవనస్థాయి పెరిగింది. శిష్యగణం ప్రచారమూ జోరందుకుంది. వైద్యం, జ్యోతిషం, వాస్తు, కుటుంబ కలహాలు... సమస్య ఏదైనా సరే దోష పరిహారం చెబుతారు, మన చేతనే పూజ చేయిస్తారు. ఆయన నీటిని తిప్పి పోస్తే మంటలు మండుతాయి. ఆ మంటల్లో కష్టాలు కాలిపోతాయి... ఇదీ సారాంశం. శంకరయ్య అంతా విన్న తర్వాత హైమవతిని మరికొన్ని ప్రశ్నలడిగాడు. ఓ వారం తర్వాత... ‘‘మన ఊళ్లోకి కొత్త సన్యాసి వచ్చాడు’’... వార్త ఊరంతా గుప్పుమంది. ఒక సన్యాసి శిష్యులతో పాటు పాదయాత్ర చేసుకుంటూ మన ఊరికి వచ్చాడు. ఆయన శిష్యులు ఇంటింటికీ వెళ్లి... ‘మీ బోరులో నుంచి ఒక గ్లాసెడు నీటిని తెచ్చి పోయండి. మంటలు మండిస్తాం’ అని ప్రచారం చేయసాగారు. నీటిలో నుంచి మంటలు పుట్టించే స్వామి వచ్చారంటూ ప్రచారం రెండు మూడు రోజుల్లోనే పాకిపోయింది. పాత స్వామీజీ శిష్యులు వచ్చి కొత్త స్వామిని కలిశారు. తమ ఆశ్రమానికి వచ్చి విశ్రమించవలసిందిగా ఆహ్వానించారు. కొత్త స్వామి చిరునవ్వుతో వారి ఆహ్వానానికి సుముఖత వ్యక్తం చేశారు. రెండు రోజులు గడిచాయి. ‘‘ఇద్దరు స్వామీజీలు కలిసి ఊరికి సందేశాన్నిస్తారు. మంచి విషయాలు చెప్తారు. అందరూ సమావేశానికి రావలసింది’’ అని డప్పు వేయించారు. జనం సమావేశమయ్యారు. ‘‘నీటిలో మంట ఎలా వస్తుంది’’ అని చిన్నగా మొదలైన డిబేట్ అరగంటలో తారస్థాయికి చేరింది. ‘‘స్వామీజీ మహిమ వల్లనే’’ అనే స్వామీజీ శిష్యుల వాదన బలహీనపడుతోంది. క్రమంగా వారిలో ఆవేశం పెరుగుతోంది. సన్యాసి శిష్యులు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుగుతున్నారు. జనానికి మాత్రం ఇందులో ఏదో మోసం దాగి ఉందని తెలుస్తోంది. అదేంటో తెలిశాకే కదిలేది అన్నట్లు స్థిరంగా ఉన్నారు. సన్యాసి శిష్యులు వెళ్లి స్వామీజీ కుటీర పరిసరాల్లోని ఇసుకలో అక్కడక్కడా దాచిన కార్బైడ్ రాళ్లను బయటకు తీశారు. ఓ రాయి మీద నీటిని పోశారు. రాయి నుంచి అసిటలిన్ గ్యాస్ విడుదలైంది. ముందు పొగ రాజుకుని క్షణాల్లో మండిపోయింది. ఊరి జనం చేత అన్ని రాళ్ల మీదా నీటిని పోయించారు. అన్నీ మండాయి. ‘‘ఎంత మోసం’’.. నోళ్లు నొక్కుకున్నారు మహిళలు. మగవాళ్లలోనూ గుసగుసలు మొదలయ్యాయి. ఇంతలో ఆ సన్యాసి గడ్డం తీసేశాడు. ఆ సన్యాసి శంకరయ్య. ‘‘ఇదంతా ఎందుకు చేశానంటే...’’ అని మొదలుపెట్టి స్వామీజీ ఆడుతున్న నాటకంతోపాటు, స్వామీజీ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో కూడా చెప్పాడు. అలాగ వెళ్లినవాడు... ఇలాగ వచ్చాడు! ఇది పొడరాళ్లపల్లి గ్రామంలో అక్కమ్మ కొండ, గుండుదోనలో పదిహేనేళ్ల కిందట జరిగింది. అంతకు పదేళ్ల ముందు గ్రామంలో చంద్రం అనే ఓ మాయగాడు ఉండేవాడు. తనకు పై స్థాయిలో చాలామంది తెలుసని, హైదరాబాద్‌లో నాయకులు, అధికారులు పలుకుబడి ఉందని చెప్పుకునేవాడు. పదవ తరగతి పరీక్షలో మంచి మార్కులు వేయిస్తానని డబ్బు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరి కనిపించలేదు. దశాబ్దం దాటాక సాధువు రూపంలో ఊరికొచ్చాడు. క్యాలెండర్లో ఉన్న చంద్రాన్ని శంకరయ్య గుర్తు పట్టాడు. శంకరయ్య సైన్స్ప్రచార వేదికలో సభ్యుడు. మూఢనమ్మకాల గురించి చైతన్యం తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంటాడు. అలాంటి శంకరయ్య కళ్లలో పడడంతో చీటింగ్ చంద్రం బండారం బయటపడింది. - ఎస్. శంకర శివరావు, జనవిజ్ఞాన వేదిక జాతీయ మేజిక్ కమిటీ సభ్యులు - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అన్నం పెట్టండి మహాప్రభో
* మెస్ చార్జీలు చెల్లించినా భోజనం పెట్టలేదని నిరసన * వీఎస్‌యూ పరిపాలన భవనం, కళాశాల వద్ద ధర్నా * సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విద్యార్థులు నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీ రోజుకో వివాదానికి కేంద్ర బిందువవుతోంది. వర్సిటీ అధికారులు అనుసరిస్తున్న తీరుతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా మెస్‌చార్జీలు చెల్లించినా భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా హాస్టల్లోనే నిరసన తెలుపుతూ వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వీఎస్‌యూ పరిపాలన భవనం వద్ద బైఠాయించారు. కార్యాలయంలోకి అధికారులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో వర్సిటీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన విరమించకుంటే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించారు. ఈ క్రమంలో విద్యార్థులు సీఐ అబ్దుల్ కరీం కాళ్లు పట్టుకుని అధికారులతో మాట్లాడి తమకు భోజనం పెట్టించాలని వేడుకున్నారు. మరోవైపు వర్సిటీ క ళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ అందె ప్రసాద్ విద్యార్థుల వద్దకు వచ్చి చిందులు తొక్కారు. నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని వీసీతో చర్చించి బుధవారం నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇంకోవైపు వీఆర్ హైస్కూలు ప్రాంగణంలోని వర్సిటీ కళాశాల వద్ద విద్యార్థినులు బైఠాయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన వసతిగృహం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిరసన తెలిపారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ కొనసాగుతున్న డీకేడబ్ల్యూ కళాశాల వసతిగృహంలో వసతులు అధ్వానంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ తరగతులు బహిష్కరించారు. ఇంతలో ఇన్చార్జి ప్రిన్సిపల్ వచ్చి టీసీలు ఇచ్చి పంపేస్తామని బెదిరించడంతో విద్యార్థినులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇంత జరిగినా వీసీ, రిజిస్ట్రార్లు పరిపాలనా భవనం వద్దకు రాకపోవడంతో దాతలు ఏర్పాటు చేసిన భోజనంతో విద్యార్థులు ఆకలి తీర్చుకున్నారు. సమస్య ఇదీ విక్రమ సింహపురి యూనివర్సీటీ పీజీ కళాశాలకు సంబంధించిన వసతి గృహాన్ని కొత్తూరులో నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా క్రమం తప్పకుండా మెస్ చార్జీలు చెల్లిస్తున్నారు. అయితే పాత విద్యార్థులు బకాయి ఉన్నారనే నెపంతో ఆరు నెలలుగా మెస్నూ మూసేశారు. తాము మెస్ చార్జీలు చెల్లించినందున తమ వరకైనా భోజనం పెట్టాలని విద్యార్థులు కోరినా వర్సిటీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఈ విద్యార్థులు అప్పటి నుంచి భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థినులు కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరు డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.2 వేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లించారు. అయితే ప్రస్తుతం నూతన హాస్టల్ లోకి మార్చితే మరోమారు కాషన్ డిపాజిట్ చెల్లించమంటుండటంతో విద్యార్థినులు మండిపడుతున్నారు.