10 రోజుల్లో తేల్చాలని జైలు
అధికారులకు హైకోర్టు ఆదేశం
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన జైలులో ఉన్న హీరో దర్శన్ తనకు ఇంటి భోజనం కావాలని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. 10 రోజుల్లో ఈ అర్జీపై జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి ఆస్కారం ఉందని జడ్జి పేర్కొన్నారు. పిటిషనర్‌కు పౌష్టికాహారం అవసరం ఉందని చెబుతూ ఆగస్టు 20కి వాయిదా వేశారు. స్టార్ హీరో అయిన దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు జూన్ 10 నుంచి హత్య కేసులో జైలు పాలయ్యారు. అప్పటి నుంచి జైలు తిండితో ఇబ్బంది పడుతున్నారు.
చిక్కుల్లో సిద్ధారూఢ
పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కు టీవీతో పాటు వీఐపీ సౌకర్యాలు కల్పించారని చెప్పిన మాజీ ఖైదీ సిద్ధారూఢపై చర్యలు తీసుకోనున్నారు. తాను జైలులో దర్శన్‌కు యోగ నేర్పించానని, ఆయనకు సకల సౌకర్యాలు అందుతున్నాయని ఇటీవల సిద్ధారూఢ మీడియా ముందు చెప్పారు. సత్ప్రవర్తన కింద విడుదలైన సిద్ధారూఢ ఇలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.
జైలు తిండి బాగుంటుంది: చేతన్
తనకు జైలులో వడ్డించే భోజనం నచ్చిందని, అయితే అదే భోజనం నటుడు దర్శన్‌కు ఎందు నచ్చలేదో అర్థం కావడం తేదని నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అన్నారు. ఒక ఇంటర్వూలో మాట్లాడిన చేతన్ తాను జైలులో ఉండగా తన కుటుంబ సభ్యులను ఎవరినీ చూడడానికి అనుమతించలేదన్నారు. తనను జైలులో ఆరుమంది ఉన్న సెల్‌లో ఉంచారని, రెండవసారి జైలుకు వెళ్లినప్పుడు నలభైమంది ఉన్న బ్యారెక్‌లో ఉంచారన్నారు. అందరిలాగే తానూ జైల్లో పని చేశానన్నారు. జైలులో పెట్టే భోజనం బాగా ఉండేదన్నారు. మరి దర్శన్‌కు ఎందుకు నచ్చడం లేదో, పదే పదే ఇంటి భోజనం కావాలని ఎందుకు కోరుతున్నాడో తెలియడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment