Parappana Agrahana Central Jail
-
దర్శన్‌కు ఇంటి భోజనం ఇస్తారా.. లేదా?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన జైలులో ఉన్న హీరో దర్శన్ తనకు ఇంటి భోజనం కావాలని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. 10 రోజుల్లో ఈ అర్జీపై జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి ఆస్కారం ఉందని జడ్జి పేర్కొన్నారు. పిటిషనర్‌కు పౌష్టికాహారం అవసరం ఉందని చెబుతూ ఆగస్టు 20కి వాయిదా వేశారు. స్టార్ హీరో అయిన దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు జూన్ 10 నుంచి హత్య కేసులో జైలు పాలయ్యారు. అప్పటి నుంచి జైలు తిండితో ఇబ్బంది పడుతున్నారు.చిక్కుల్లో సిద్ధారూఢపరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కు టీవీతో పాటు వీఐపీ సౌకర్యాలు కల్పించారని చెప్పిన మాజీ ఖైదీ సిద్ధారూఢపై చర్యలు తీసుకోనున్నారు. తాను జైలులో దర్శన్‌కు యోగ నేర్పించానని, ఆయనకు సకల సౌకర్యాలు అందుతున్నాయని ఇటీవల సిద్ధారూఢ మీడియా ముందు చెప్పారు. సత్ప్రవర్తన కింద విడుదలైన సిద్ధారూఢ ఇలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.జైలు తిండి బాగుంటుంది: చేతన్తనకు జైలులో వడ్డించే భోజనం నచ్చిందని, అయితే అదే భోజనం నటుడు దర్శన్‌కు ఎందు నచ్చలేదో అర్థం కావడం తేదని నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అన్నారు. ఒక ఇంటర్వూలో మాట్లాడిన చేతన్ తాను జైలులో ఉండగా తన కుటుంబ సభ్యులను ఎవరినీ చూడడానికి అనుమతించలేదన్నారు. తనను జైలులో ఆరుమంది ఉన్న సెల్లో ఉంచారని, రెండవసారి జైలుకు వెళ్లినప్పుడు నలభైమంది ఉన్న బ్యారెక్‌లో ఉంచారన్నారు. అందరిలాగే తానూ జైల్లో పని చేశానన్నారు. జైలులో పెట్టే భోజనం బాగా ఉండేదన్నారు. మరి దర్శన్‌కు ఎందుకు నచ్చడం లేదో, పదే పదే ఇంటి భోజనం కావాలని ఎందుకు కోరుతున్నాడో తెలియడం లేదన్నారు. -
దర్శన్ గురించి సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన డాక్టర్
కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 4 వరకు పరప్పన అగ్రహారం జైలులో ఆయన ఉండనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ A2 అని పోలీసులు నిర్ధారించారు. ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 అని తెలిపారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దర్శన్ మానసిక పరిస్థితి గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి.దర్శన్ ఆరోగ్యంపై అనుమానాలుదర్శన్కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్ గొడవపడిన ఘటనలు, షూటింగ్లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూస్తే మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని చెప్పారు. చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్డమ్ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు. బెయిల్ కోసం డ్రామా..?దర్శన్ 13 ఏళ్ల కిందట భార్యపై దాడి కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు. మరోవైపు బెయిల్ కోసమే దర్శన్ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మానసిక పరిస్థితి బాగులేదనే అధికారికంగా ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే తప్పకుండా దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెయిల్ కోసమే ఇలా కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు
సాక్షి, చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ అండ్ బృందం ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్టు సమాచారం. కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా కలవరంతో దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖైదీలను బెయిల్, పెరోల్ మీద బయటకు పంపించిన విషయం తెలిసిందే. ఆ దిశగా బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌కు పెరోల్ అ వకాశం లభించినా, ఉపయోగించుకోలేదు. బయట కన్నా, జైల్లోనే ఉండడం మంచిదని వారు భావించారేమో. (కరోనా ; యమలోకం హౌస్‌ఫుల్!) పెరోల్ ప్రయత్నాలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు చేపట్టినా, వారు తిరస్కరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని సమాచారం. చిన్నమ్మ శశికళ, ఇలవరసి, సుధాకరన్ జైలులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాస్క్‌లు ధరించడమే కాదు, భౌతిక దూరాన్ని పాటి స్తూ జైలులో కాలం నెట్టుకొస్తున్నారు. భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. అలాగే, చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. ఒకరు పెరోల్ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తు తం శశికళ, ఇలవరసి మాత్రమే ఉన్నట్టు భోగట్టా.(తమిళనాడును కబళిస్తున్న కరోనా) -
నేను ఎలాంటి తప్పు చేయలేదు: డీఐజీ రూప
బెంగళూరు : తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను టార్గెట్ చేయడం సరికాదని జైళ్ల డీఐజీ రూప మౌద్గిల్ అన్నారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నివేదికలో తాను చెప్పిన అన్ని విషయాలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని డీఐజీ రూప స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ అందరికీ వర్తించాలని, తన ఒక్కదానికే కాదని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని రూప వ్యాఖ్యానించారు. ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసిన సిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. అయితే డీఐజీ రూప సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పలుమార్లు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం తగదని అన్నారు. ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా దావణగెరె స్వస్థలమైన జైళ్ల డీఐజీ రూప ప్రతిభావనిగా పేరు తెచ్చుకున్నారు. పనిచేసిన ప్రతిచోటా ఆమె సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 2000లో సివిల్స్‌లో 43వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ బ్యాచ్‌లో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను 2016 జనవరి 26న రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. ఓ కేసులో కోర్టు తీర్పు ప్రకారం అప్పటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతీని ఎస్పీ హోదాలో అరెస్టు చేశారు. ఆమె బెంగళూరు డీసీపీగా ఉండగా వీవీఐపీల భద్రతా సిబ్బందిని తొలగించి లా అండ్ ఆర్డర్ విభాగానికి మార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. డీసీపీ (సిటీ ఆర్మ్డ్ రిజర్వ్) గా విధులు నిర్వర్తించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా యెడ్యూరప్ప ఓ ఊరేగింపులో ఎక్కువ వాహనాలను వినియోగించడాన్ని గుర్తించిన రూప వెంటనే వాటిని తొలగించి వార్తల్లోకెక్కారు. -
శశికళ తరలింపునకు రంగం సిద్ధం!
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళను అక్కడ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం అవుతోంది. జైళ్లశాఖ అధికారులు ఆమెను మరో జైలుకు మార్చే యోచనలో ఉన్నారు. కాగా శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు డీఐజీ రూప గురువారమిక్కడ మాట్లాడుతూ.. తన నివేదికలో చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనన్నారు. నివేదికలో పొందుపరిచిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని డీఐజీ రూప పేర్కొన్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలను జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ కొట్టిపారేశారు. శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు.