వందే భార‌త్ రైలు ఆహారంలో బొద్దింక.. | Cockroach Found In Meals Served In Vande Bharat Train, Pic Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Cockroach In Vande Bharat Meal: వందే భార‌త్ రైలు ఆహారంలో బొద్దింక.. .. షాకైన జంట

Published Thu, Jun 20 2024 5:18 PM | Last Updated on Thu, Jun 20 2024 6:04 PM

Cockroach Found in Vande Bharat Meal

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్‌ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.

తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తుండగా  దంప‌తుల‌క వందే భారత్ రైలులో అందించిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక  దర్శనమిచ్చింది. దీంతో ఈ విషయాన్ని త‌న బందువుల త‌రుపున విదిత్‌ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్‌ లో పోస్టు చేశారు. ‘ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్‌ వందేభారత్‌ రైలులో భోపాల్‌ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని పోస్టు పెట్టారు.

అంతేకాకుండా ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు ట్వీట్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

అయితే ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.

 కాగా వందేభారత్ రైళ్ల‌లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదేం తొలిసారి కాదు. గ‌త మార్చిలో సిలిగురి నుంచి కోల్‌క‌తా వెళ్తున్న రైలులో ప్ర‌యాణిస్తున్న ప్ర‌సూన్ దేవ్‌.. త‌న ఆహారంలో పురుగును గుర్తించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement