వందే భారత్‌లో పాడైపోయిన భోజనం? | IRCTC Reacts On Vande Bharat Smelling Food | Sakshi
Sakshi News home page

వందే భారత్‌లో పాడైపోయిన భోజనం?.. వీడియో వైరల్‌

Published Thu, Jan 11 2024 9:33 PM | Last Updated on Thu, Jan 11 2024 9:33 PM

IRCTC Reacts On Vande Bharat Smelling Food - Sakshi

దేశంలోనే సెమీహైస్పీడ్‌ రైళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి వందే భారత్‌ రైళ్లు. సాధారణ రైళ్ల కంటే టికెట్‌ ధర ఎక్కువైనప్పటికీ.. త్వరగా గమ్యస్థానం చేర్చడం, ఇతర సదుపాయాల విషయంలో వందేభారత్‌ రైళ్లకు మంచి స్పందనే వస్తోంది. అయితే.. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది.  

తాజాగా ఎక్స్‌లో వందేభారత్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. పాడైపోయిన భోజనం ఇచ్చారంటూ ఆ కస్టమర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన డబ్బులు తనకు రిటర్న్‌ చేయాలంటూ.. ఆ ఘటనంతా వీడియో రూపంలో బయటకు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. 

ఫిర్యాదు అందిందని.. ఘటనపై దర్యాప్తు చేపడతామని రైల్వేస్‌సేవ తెలియజేసింది. ఫిర్యాదు వివరాల కోసం తమను సంపద్రించాలంటూ సదరు ఎక్స్‌ యూజర్‌కు సూచించింది. ఇక.. ఐఆర్‌సీటీసీ సైతం సదరు వీడియోపై స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే.. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సర్వీస్‌ ప్రొవైడర్‌ పెనాల్టీ విధించడంతో పాటు  చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement