Vande Bharat Express Fare: No Lower Fares Of Vande Bharat Express To Telugu States - Sakshi
Sakshi News home page

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!

Published Thu, Jul 6 2023 3:46 PM | Last Updated on Thu, Jul 6 2023 6:32 PM

No lower fares of Vande Bharat Express To Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వందేభారత్‌ రైళ్ల సక్సెస్‌ మాటేమోగానీ.. అధిక టికెట్‌ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్‌ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్‌ రైళ్లనే ప్రమోట్‌ చేసేందుకే భారతీయ రైల్వేస్‌ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్‌ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్‌ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. 

అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్‌ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్‌ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్‌లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్‌-భోపాల్‌ వందే భారత్‌ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు.  జూన్‌ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్‌-ఇండోర్‌ రూట్‌లో 21 శాతం  ఆక్యుపెన్సీతో నడిచింది.  అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్‌లో టికెట్‌ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్‌.  

ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు.

ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్‌లలోనూ టికెట్‌ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు.

ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement