అంతర్జాతీయ బర్గర్ డే అనేది ప్రపంచ ఆహార సెలవుదినం. దీనిని ప్రతి సంవత్సరం మే 28న జరుపుకుంటారు. ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో వివిధ రకాల బర్గర్‌లను ఆస్వాదిస్తూ జరుపుకుంటారు. నిజానికి బర్గర్‌లనేది అధిక క్యాలరీతో కూడిని భారీ భోజనంతో సమానం. దీనిలో అధిక సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్‌లు వంటి ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుంది. అందువల్ల అధిక బరువుకి దారితీసి హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే దీన్ని సరైన విధంగా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చట. అదెలాగో సవివరంగా తెలుసకుందామా..! అలాగే దీన్ని ఇష్టంగా లాగించే ప్రముఖ సెలబ్రిటీలు ఎవరో కూడా తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన పోషక పదార్థాలతో ఇంట్లో తయారు చేస్తే.. బర్గర్లు నుంచి కూడా ఆశ్చర్యకరమైన రీతిలో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చట. అవి సూక్ష్మ పోషకాల నుంచి స్థూల పోషకాల వరకు అన్ని ప్రధాన ఆహార సమూహాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది భారీ భోజనం కాబట్టి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉండే అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది. ప్రోటీన్‌లకు మంచి మూలం. చికెన్, చేపలు వంటి పోషకాలతో కూడిన ఆహారం.
ఆరోగ్య ప్రయోజనాలు..
కొలస్ట్రాల్ తక్కవగా ఉండే బర్గర్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎర్రమాంసంతో చేసిన బర్గర్‌లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఐరన్‌తో పోలిస్తే ఇందులో లభించే ఐరన్ సలభంగా శోషించబడుతుంది. వందగ్రాముల బర్గర్‌లో 3 మిల్లిగ్రాముల ఐరన్ ఉంటుంది.
అలాగే ఇందులో ఎర్రరక్తకణాలకు అవసరమయ్యే బీ12 కూడా ఉంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జింక్‌కి అద్భతమైన మూలం. ఇందులో ఉపయోగించే ఎర్రమాంసం అద్భుతమైన జింక్ మూలం. అలాగే ఇందులో బీ కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
ఇది మానసిక స్థితిని మెరగుపరుస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇతర ఆహార పదార్థాలు మాదిరిగానే ట్రాన్స్‌ఫ్యాట్స్, సోడియం, కెమికల్ ప్రిజర్వేటివ్‌లతో సంబంధం ఉన్న కొన్ని బర్గర్‌లను మితంగానే తీసుకోండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరిగా దీన్ని చూస్తే మనసాగాక ఏదో ఒక విధంగా ఇష్టంగా తినే కొందరు ప్రమఖులు ఎవరో చూద్దాం.
అనన్య పాండే..
వర్కౌట్‌లు చేసేందుకు ఇష్టపడుతుంది. ఎక్కువగా యోగాసనాలు కూడా వేస్తుంటుంది. అయితే బర్గర్ బే జ్యూసి అంటే మహా ఇష్టం. తినాలనుకుంటే ఆదివారాలు ఏదో రకంగా ఓ పట్టు పట్టేస్తుంది.
అబ్దురోజిక్
సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 16 సీజన్‌లో పాల్గొన్న తజికిస్తానీ గాయకుడు అబ్దు రోజిక్ కూడా బర్గర్‌లంటే మహా ఇష్టం. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మొదటగా ఇష్టం లాగించేది బర్గర్‌నే అట. ఆయనకు ఓ రెస్టారెంట్ కూడా ఉంది.
వరుణ్ ధావన్:
ఫిట్‌నెస్ ఔత్సాహికుడు కూడా ఈ బర్గర్ తనకు బలహీనతగా పేర్కొన్నాడు. తన డైట్‌లో ఒక్కోసారి చీట్ చేసి మరీ ఈ బర్గర్‌ను ఇష్టంగా లాగిస్తానని చెబుతున్నాడు.
ఆలియా..
ఎంత ఫిటనెస్‌గా ఉండేలా స్ట్రిట్ డైట్ ఫాలో అయినా ఆనంద క్షణాల్లో మాత్రం బర్గర్‌ని ఆస్వాదించకుండా ఉండనని అంటోంది బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియ భట్. అంతేగాదు 2022లో రిలీజ్ అయ్యిన గంగూబాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినప్పుడు వెజ్ బర్గర్‌ని ఆస్వాదిస్తూ సక్సెస్‌ని ఎంజాయ్ చేసింది.
ప్రియాంక చోప్రా జోనాస్
ఫిట్‌గా ఉండే ప్రియాంక చోప్రా సైతం క్రిస్పీ ఫ్రైస్‌తో కూడిన పెద్ద బర్గర్ తినకండా ఉండలేనంటోంది. ఆమె 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నప్పుడు బర్గర్‌ని తింటూ ఆనందంగా ఆ క్షణాన్ని సెలబ్రెట్ చేసుకుంది.
(చదవండి: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటున్నారా..?)
Comments
Please login to add a commentAdd a comment