కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టమోటాలు, బంగాళదుంప ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 అదే నెలలో భోజనం ఖర్చులు 6 శాతం పెరిగి రూ.31.6కు చేరినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంతకుముందు నవంబర్‌లో మాత్రం ఇది రూ.32.7గా ఉందని తెలిపింది.
ధరల పెరుగుదలకు కొన్ని కారణాలను నివేదిక విశ్లేషించింది.
వెజిటేరియన్ థాలీ: వెజిటేరియన్ థాలీ(Veg Thali) తయారీకి అయ్యే సగటు ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.31.6కు చేరింది.
నాన్ వెజిటేరియన్ థాలీ: నాన్‌వెజ్ థాలీ(Non Veg) ధర ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.63.3కు చేరింది.
టమోటా ధరలు: డిసెంబర్‌లో కిలో టమోటా(Tamato) ధర 24 శాతం పెరిగి రూ.47కు చేరింది.
బంగాళాదుంప ధరలు: కిలో బంగాళాదుంప ధర 50 శాతం పెరిగి రూ.36గా ఉంది.
వంట నూనెలు: దిగుమతి సుంకం పెంపు కారణంగా వెజిటబుల్ ఆయిల్ ఖర్చులు 16% పెరగడం కూడా ఆహార ధరలు పెరిగేందుకు దోహదం చేసింది.
చికెన్ ధరలు: బ్రాయిలర్ (చికెన్) ధర గతంలో కంటే 20% పెరిగింది. ఇది మొత్తం భోజన ఖర్చును గణనీయంగా ప్రభావితం చేసింది.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!
2024 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో టమోటా ధరలు 12% తగ్గాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వీటి సరఫరా పెరిగినందునే, శాకాహార థాలీ ధర 3% తగ్గింది. ఉల్లి ధరలు నెలవారీగా 12%, బంగాళాదుంపల ధరలు 2% తగ్గాయి. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు కొంత తగ్గడం, టమోటాల సరఫరా పెరగడం ప్రస్తుతం కొంత ధరలు నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది జనవరి నెల నివేదికలో ప్రతిబింబిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment