meals
-
వందేభారత్ రైళ్లలో భోజనం.. రైల్వే కీలక ప్రకటన
న్యూఢిల్లీ:వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వేశాఖ తాజాగా మరో సదుపాయం కల్పించింది. టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకోని వారికి కూడా ప్రయాణం సమయంలో అప్పటికప్పుడు ఆహారం అందించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించనుంది.టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకున్న వారికే ప్రస్తుతం ఆ సేవలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. ప్రయాణంలో భోజన వసతి కల్పించడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఐఆర్సీటీసీ మార్పులు చేసింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఇంటి భోజనం మరింత భారం!
కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టమోటాలు, బంగాళదుంప ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 అదే నెలలో భోజనం ఖర్చులు 6 శాతం పెరిగి రూ.31.6కు చేరినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంతకుముందు నవంబర్‌లో మాత్రం ఇది రూ.32.7గా ఉందని తెలిపింది.ధరల పెరుగుదలకు కొన్ని కారణాలను నివేదిక విశ్లేషించింది.వెజిటేరియన్ థాలీ: వెజిటేరియన్ థాలీ(Veg Thali) తయారీకి అయ్యే సగటు ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.31.6కు చేరింది.నాన్ వెజిటేరియన్ థాలీ: నాన్‌వెజ్ థాలీ(Non Veg) ధర ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.63.3కు చేరింది.టమోటా ధరలు: డిసెంబర్లో కిలో టమోటా(Tamato) ధర 24 శాతం పెరిగి రూ.47కు చేరింది.బంగాళాదుంప ధరలు: కిలో బంగాళాదుంప ధర 50 శాతం పెరిగి రూ.36గా ఉంది.వంట నూనెలు: దిగుమతి సుంకం పెంపు కారణంగా వెజిటబుల్ ఆయిల్ ఖర్చులు 16% పెరగడం కూడా ఆహార ధరలు పెరిగేందుకు దోహదం చేసింది.చికెన్ ధరలు: బ్రాయిలర్ (చికెన్) ధర గతంలో కంటే 20% పెరిగింది. ఇది మొత్తం భోజన ఖర్చును గణనీయంగా ప్రభావితం చేసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!2024 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో టమోటా ధరలు 12% తగ్గాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వీటి సరఫరా పెరిగినందునే, శాకాహార థాలీ ధర 3% తగ్గింది. ఉల్లి ధరలు నెలవారీగా 12%, బంగాళాదుంపల ధరలు 2% తగ్గాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు కొంత తగ్గడం, టమోటాల సరఫరా పెరగడం ప్రస్తుతం కొంత ధరలు నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది జనవరి నెల నివేదికలో ప్రతిబింబిస్తుంది. -
ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?)అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు. Vivaaha bojanambu..idhi prabhasa premayam Leykunda jarigindhi. evaru cheppaddhu. Chepthe ee Tanu petey food tho ee babu bali… Adhee baahubali level.. pandikoku laaga thini ambothlaaga Padukuntunanu. pic.twitter.com/64TPjI46L1— Jaggu Bhai (@IamJagguBhai) December 9, 2024 -
సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు
నీళ్ల పప్పు.. ఉడికీ ఉడకని అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో రోజూ ఇదే మెనూ. ఈ భోజనాన్ని తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. చలి వణికిస్తోంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేక విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు దోమల మోత.. మరో వైపు బయటి నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో రాత్రిళ్లు పడుకోలేకపోతున్నారు. ‘ఇదేంటయ్యా..’ అని పిల్లల తల్లిదండ్రులు వార్డెన్లను ప్రశ్నిస్తే.. ‘మేమేం చేయాలి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. ఎన్ని రోజులని మేం అప్పులు చేసి తెచ్చిపెట్టాలి? ఇప్పటికే చాలా వరకు అప్పులు చేశాం.. ఆ అప్పు తీరిస్తేనే కొత్తగా సరుకులు ఇస్తామని కిరాణా కొట్ల వాళ్లు చెబుతున్నారు. పై ఆఫీసర్లకు రోజూపరిస్థితి చెబుతూనే ఉన్నాం. వారు అంతా విని ఫోన్ పెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టినా.. కనీసం మెస్ చార్జీలన్నా సమయానికి ఇవ్వాలి కదా..’ అంటూ వాపోతున్నారు. వార్డెన్లే ఇలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు బిక్కమోహం వేసుకుని చూడాల్సిన దుస్థితి. సరిగ్గా ఐదు నెలలకు ముందు వరకు వారంలో రోజుకొక మెనూతో చక్కటి భోజనం తిన్న విద్యార్థులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత పరిస్థితిపై వాపోతున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : మానవత్వం లేని కూటమి సర్కారు తీరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు చలి వణికిస్తుండగా, మరోవైపు పిల్లలకు సరైన భోజనం కరువైంది. చాలా చోట్ల మరుగుదొడ్లు, మంచి నీటి సమస్యతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వారికి క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులతోపాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు విడుదల చేయడం లేదు. ఈ దిశగా కూటమి పార్టీల నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదు నెలలైనా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో 3,836 హాస్టళ్లు, గురుకులాల్లో చదివే 6,34,491 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర పేద వర్గాల విద్యార్థులతోపాటు వాటిలో పని చేస్తున్న 36,537 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఏటా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటింజెంట్ బిల్లులు కూడా విడుదల చేయలేదు. ఈ నిధులను స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క హాస్టల్, గురుకులానికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కంటింజెంట్ అవసరాలు ఉంటాయి.అంతటా అవే సమస్యలే..» ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలా చోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. మంచి నీరు సరిగా ఉండదు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూలన పడింది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 88 మంది విద్యార్థినిలు నేల మీదే పడుకుంటున్నారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహంలో మే నుంచి కాస్మటిక్స్ ఛార్జీలు ఇవ్వ లేదు. ఏ ఒక్క హాస్టల్లోనూ సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. » గుంటూరు నగరంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మార్చి నుంచి సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రాలేదు. దీంతో వార్డెన్ న్లు అప్పు తీసుకువచ్చి విద్యార్థినులకు ఆహారం పెట్టాల్సిన పరిస్థితి. జూన్ నెలలో ఇవ్వాల్సిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్లు ఇంత వరకు ఇవ్వలేదు. » ఒంగోలు జిల్లాలోని చాలా వరకు హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారంలో 6 సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజుతో సరిపెడుతున్నారు. ప్రతి రోజూ పాలు అందించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కనిగిరి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో 45 మందికి గాను ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు. పామూరు పట్టంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 30 మందికి గాను ఒక్క విద్యార్థి మాత్రమే కనిపించాడు. గిద్దలూరు బేస్తవారిపేటలోని బీసీ హాస్టల్లో వాచ్మెన్, అటెండర్లే వంట చేస్తున్నారు.» ఏలూరు జిల్లాలోని హాస్టళ్లలో చలికి తట్టుకోలేక చాలా మంది పిల్లలు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 400 మంది విద్యార్థులకు ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని హాస్టళ్లలో పారిశుద్ధ్యం బాగోలేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. » కాకినాడ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అధ్వాన పారిశుద్ధ్యం వల్ల పందులు, దోమలతో సావాసం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. సామర్లకోట బీసీ బాలికల వసతి గృహం చుట్టూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పిఠాపురం బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో భద్రత కరువైంది. చివరకు బాలికలు దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట విద్యుత్ పోయిందంటే హాస్టల్లో అంధకారమే. » విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధిలోనున్న బీసీ సంక్షేమ వసతి గృహంలో కోండ్రు సాంబశివరావు అనే విద్యార్థి ఇటీవల మృత్యువాతపడ్డాడు. కారణమేమిటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఘటనతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తిరిగి హాస్టల్లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు నాలుగు నెలల్లో 8 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు.» విశాఖపట్నం జిల్లాలో కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాలికల హాస్టళ్లన్నింటిలో సీసీ కెమెరాల్లేవు. విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, జంబుకానాలు ఇవ్వలేదు. అల్లూరి జిల్లాలోనూ అదే పరిస్థితి. » బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో కనీస వసతులు కరువయ్యాయి. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది.» మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన కర్నూలు జిల్లా లద్దగిరిలో బాత్రూమ్లు లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. కోసిగిలో పందుల బెడద తీవ్రంగా ఉంది. నంద్యాలలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లో నీటి సౌకర్యం లేదు. విద్యార్థులు బహిర్భూమికి ముళ్ల పొదలు, రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలకు ప్రహరీ లేదు. ఈ హాస్టళ్లు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున అడవి జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుమార్లు వసతి గృహాలకు సమీపంలో చిరుతలు సంచరించాయి. ప్యాపిలి ఎస్సీ వసతి గృహంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాణ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంచి నీటి సమస్య ఉంది. » చిత్తూరులో ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. వాచ్మెన్ బంధువులతో అనధికారికంగా వంటలు వండిస్తున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో వార్డెన్లు చేతి నుంచి ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. చౌడేపల్లిలో మరుగుదొడ్లు సహా వసతి గృహాన్ని బాలురే శుభ్రం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగు దొడ్లకు నీటి సౌకర్యం లేదు. నిధుల లేమితో తిరుపతిలోని హాస్టళ్లలో ఐదు నెలలుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కడుపునిండా భోజనం కరువు..ప్రభుత్వం మూడు నెలలుగా డైట్ చార్జీలు ఇవ్వక పోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు ఎలా భోజనం పెట్టాలో తెలియక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. సరుకులను అప్పుపై తెచ్చి వంట చేయించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పెద్ద మొత్తంలో సరుకులను అప్పుగా ఇవ్వడానికి దుకాణదారులు ముందుకు రావడం లేదని గ్రామీణ ప్రాంత హాస్టల్, గురుకులాల వార్డెన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు అందించే ఆహారంలో పూర్తిగా నాణ్యత కరువైంది. నీళ్ల చారు, నాసిరకం అన్నంతో కడుపు నింపుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమస్యలు.. ఆపై ఆకలి కేకలతో హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు భద్రత కరువైంది. ఎవరు పడితే వారు హాస్టల్ ప్రాంగణంలో వచ్చి పోతుంటారు. ఎవరు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇటీవల హైకోర్టు ప్రాథమికంగా పలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు.హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా..» హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. » హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. » హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.» మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. » భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. » సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ళీ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. » హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి » హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. » తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. » హాస్టళ్లలో సమ వయస్కులతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే గుర్తించి సరిచేయాలి. » హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీనిమహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. -
ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు
ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించుకున్న ఉద్యోగులకు మెటా సంస్థ షాకిచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను జాజ్ నుంచి తొలగించింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి..కంపెనీ యాజమాన్యం తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించిందో తెలుసుకుందాం.మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజ కంపెనీ మెటా తన ఉద్యోగులకు నిత్యం ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. అందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లు ఇస్తోంది. అయితే వీటిని కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. దాంతో లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఏకంగా జాజ్ నుంచి తొలగించింది. అయితే వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను ఉపయోగించారు. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్ఆఫ్ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!మెటా తన ఉద్యోగులకు ‘గ్రూబ్హబ్’, ‘ఉబర్ఈట్స్’ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. అందులో భాగంగా తమకు ఉచితంగా వోచర్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఒక ఉద్యోగికి టిఫిన్ కోసం 20 డాలర్లు(రూ.1,681), మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100), రాత్రి భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100) విలువ చేసే వోచర్లు ఇస్తోంది. అయితే కొంతమంది ఉద్యోగులు నాన్-ఫుడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి, కార్యాలయానికి రాని సమయంలో భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. -
ప్లేట్ మీల్స్ ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..!
బరువు తగ్గడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. వ్యాయమాలు, డైట్లని ఒకటి కాదు. ఎక్కడ ఏ తేడా కొడుతోందో గానీ బరవు తగ్గక భారంగా నిట్టూర్చుతాం. అయితే ఇలాంటి విషయంలో పోషకాహర నిపుణులు సహాయం తప్పనిసరి. అందుకోసం ఎలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలో సోషల్ మీడియాలో ఓ ప్రముఖ పోషకాహర నిపుణురాలు దీప్సిఖా జైన్ వివరించారు. మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో అన్ని పోషకాలు ఉండేలా బ్యాలెన్సింగ్‌గా తీసుకుంటే చాలని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ బ్యాలెన్సింగ్ ప్లేట్ మీల్స్ టెక్నిక్..!.మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటాం. ఐతే ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు దీప్సిఖా జైన్. ముఖ్యంగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గిస్తే ఎక్కువ సానూకూల మార్పులు చూడగలమని అన్నారు. అందుకోసం ప్లేట్ భోజనంలో కొద్ది మార్పులు చేయమని సూచిస్తున్నారు. ఇంట్లో వండిన రోటీలు, అన్నం అయితే అతిగా తినేస్తాం. అలాగే బరువు కూడా పెరిగిపోతారు. కాబట్టి సమతుల్యంగా ప్లేట్ మీల్స్ ఉండేలా చూడాలి. అంటే.. స్థూల, సూక్ష్మ పోషకాలను చేర్చడం తోపాటు మనసు పెట్టి తినడం వంటివి కూడా చేయాలని చెప్పారు. బరువు తగ్గేందుకు మన భోజనం ప్లేట్లో నాలుగు రకాలుగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.మొదటిది సలాడ్‌తో ప్రారంభించాలి, పచ్చికూరగాయలతో చేసిన ఓ కప్పు సలాడ్‌తో ప్రారంభించాలి. ఇది మంచి బ్లడుషగర్కి దోహదపడుతుంది. రెండోది ప్రోటీన్‌తో భర్తీ చేయాలి అంటే పప్పు, పనీర్ సబ్దీ లేదా నచ్చనీ ప్రోటీన్ మూలం తప్పనిసరిమూడోది ప్రోబయోటిక్స్ లేదా ప్రీబయోటిక్స్ మూలంతో నింపాలి. అంటే రైతా లేదా పెరుగుతో తీసుకోవచ్చు. ఇది జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నాలుగు కార్బోహైడ్రేట్ల కోసం చివరగా మల్టీగ్రెయిన్ రోటీని ఎంచుకోవాలి. ఇలా తీసుకుంటే కార్బోహైడ్రేట్లపై నియంత్రణ ఉంటుంది.ఈ నాలుగింటిని తప్పనిసరిగా ప్లేటు భోజనంలో ఉండేలా చూసుకుంటే అన్ని రకాల పోషకాలు విటమిన్లు శరీరానిక అందడమే కాకుండా బుద్దిపూర్వకంగా తింటారు. పైగా అధికా కేలరీలను తీసుకోకుండా నియంత్రించగలుగుతాం. ఇది ఒక రకరంగా ఆరోగ్యకరమైన రీతీలో భోజనం తీసుకునేందుకు సహాయపడుతుంది కూడా అని చెబతున్నారు పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్. View this post on Instagram A post shared by Deepsikha Jain (@fries.to.fit) (చదవండి: ఆ తల్లి గొప్ప యోధురాలు': 55 ఏళ్ల వయసులో..!) -
అభిమానులకు భోజనం వడ్డించిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ డైరెక్షన్లో ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు.భోజనం వడ్డించిన హీరో..బాక్సాఫీస్ వద్ద తంగలాన్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు. స్టార్ హీరో అయి ఉండి సింపుల్‌గా కనిపించారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Thangalaan success meetA @chiyaan treat 🥳 pic.twitter.com/nFoFtL7FAA— Kalaiarasan 𝕏 (@ikalaiarasan) August 27, 2024 -
భో'జనం' @ ఆన్లైన్
దేశంలో ఆహార సేవల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇంటికంటే హోటళ్లు, రెస్టారెంట్లలో తినే వారి సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదవుతోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు వచ్చాక వినియోగదారులు తమకు నచి్చన ఆహారాన్ని ఒక్క క్లిక్‌లో ఆర్డర్ చేసి హాయిగా లాగించేస్తున్నారు. మార్కెట్లో విస్తరిస్తున్న వినియోగదారులు, కొత్తరకాల తినుబండారాల సంఖ్య పెరగడంతో ఈ తరహా వృద్ధి నమోదవుతోందని ఆహార సరఫరాల సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. –సాక్షి, అమరావతిరూ.9 లక్షల కోట్లకు వృద్ధి ఆదాయంలో పెరుగుదల, డిజిటలైజేషన్, మెరుగైన కస్టమర్ సేవలు, కొత్త ధోరణిలో ఆహారపు అలవాట్లు మార్కెట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం రూ.5.50 లక్షల కోట్లుగా ఉన్న ఆహార మార్కెట్ విలువ 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల గరిష్ట వృద్ధిని నమోదు చేస్తుందని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 32–34 కోట్ల వినియోగదారుల నుంచి 43–45 కోట్లకు వృద్ధి చెందనున్నారు. ఫాస్ట్‌ఫుడ్ చైన్ల పెరుగుదల, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ప్రవేశంతో దేశంలో ఆహార సేవల మార్కెట్లో గత దశాబ్దంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తద్వారా ప్రజలు బయటి నుంచి ఆహార పదార్థాలను ఇంటికే రప్పించుకుని తినే ఫ్రీక్వెన్సీ మరింత పెరగనుంది. వాస్తవానికి దేశంలోని మొత్తం ఆహార సేవల వినియోగంలో దాదాపు 70 శాతం టాప్ 50 నగరాల్లోనే ఉంది. ఈ క్రమంలోనే క్లౌడ్ కిచెన్‌తో కూడిన క్విక్ సరీ్వస్ రెస్టారెంట్లు 40 శాతం వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా. నెలకు ఏడెనిమిదిసార్లు బయట భోజనమే వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఆదాయం పెరుగుదల బయట ఆహారాన్ని తీసుకునే విధానంలో స్పష్టమైన మార్పులు తీసుకొస్తుందని ఓ ప్రముఖ సంస్థ తాజా నివేదిక తేల్చింది. అంటే భారతీయ వినియోగదారులు నెలకు 5 సార్లు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ డెలివరీల్లో ప్రత్యేక భోజనం చేస్తుంటే ఇది 7–8 రెట్లు పెరుగుతుందని స్పష్టం చేస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు, ఫైన్‌డైన్ రెస్టారెంట్ల చెయిన్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపింది. ప్రతి వినియోగదారుడు సగటున ఆరు కంటే ఎక్కువ సార్లు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు చేస్తే.. ఇందులో ఏడాదిలో మూడు కంటే ఎక్కువ విభిన్న రకాల వంటకాలను ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ భారతీయ వినియోగదారులు ప్రతిసారీ వైవిధ్యమైన ఆహారాన్ని కోరుకుంటున్నట్టు నివేదికలో తేలింది. ముంబైలో మొదటి రెండు వంటకాలు దాల్ కిచిడీ, మార్గెరిటా పిజ్జా, ఢిల్లీలో మెక్ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్‌పఫ్ ఉన్నాయి. బెంగళూరులో మసాలా దోశ, చికెన్ బిర్యానీ ఎక్కువగా ఆర్డర్ చేయగా.. కోల్‌కతాలో చికెన్, మటన్ బిర్యానీలను ఎక్కువగా ఇష్టపడినట్టు ఆ నివేదిక తెలిపింది. ఆయా నగరాల్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న ఆహార పదార్థాలు నగరం ఆహార పదార్థాలు ముంబై దాల్ కిచిడీ, మార్గెరిటా పిజ్జా ఢిల్లీ మెక్ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్‌పఫ్ బెంగళూరు మసాలా దోశ, చికెన్ బిర్యానీ కోల్‌కతా చికెన్, మటన్ బిర్యానీ -
బురదలోనే విద్యార్థులకు భోజనాలు
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితే మళ్లీ దాపురించింది. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు.. ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విశాఖపట్నంలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. పాఠశాల విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి మధ్యాహ్న భోజనాలు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను కన్పించింది. రోజూ నిర్దిష్ట మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించింది. అయితే కూటమి ప్రభుత్వం వ చ్చిన కొద్ది రోజులకే విద్యార్థులకు మళ్లీ ఆరుబయట ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చేసింది. కప్పరాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తరగతి గదుల్లో భోజనాలు చేయడానికి సిబ్బంది అంగీకరించలేదు. ఒకవైపు వర్షం పడి బురదమయంగా మారిన పాఠశాల ఆవరణలో ఆరుబయటే విద్యార్థులను కూర్చోబెట్టేశారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే మధ్యాహ్న భోజనాలు వడ్డించారు. విద్యార్థులు బతిమాలినా.. బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు బతిమలాడినప్పటికీ అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు ఆరు బయట బురదలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వచ్చింది. దీనిపై కొంత మంది స్థానికులు పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లలు గదులను పాడు చేసేస్తారని, అందుకే లోపల తినొద్దని చెప్పామని సిబ్బంది చెప్పడం గమనార్హం. బురదలో విద్యార్థులకు భోజనాలు పెట్టడాన్ని స్థానికులు తమ ఫోన్లతో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటి, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నిట్టూరుస్తున్నారు. -
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్ బ్లేడ్ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్ వస్తువు వచ్చినట్లు తెలిసింది. మా క్యాటరింగ్ భాగస్వామి సదుపాయాలు, పరిసరాలను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామని హామీ ఇస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం..న్యూదిల్లీ నుంచి నెవార్క్ వెళ్లేందుకు ఎయిర్ఇండియాలో ప్రయాణించాలని నిర్ణయించుకుని బిజినెస్క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానం టేకాఫ్ అయిన దాదాపు 30 నిమిషాల తర్వాత పడుకోవాలనుకున్నాడు. దాంతో సీటును ఫ్లాట్‌బెడ్(పడుకునేందుకు వీలుగా)మోడ్‌కు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తీవ్ర నిరాశకుగురైనట్లు ప్రయాణికుడు చెప్పాడు. దాంతోపాటు అదే విమానంలో సరిగా ఉడకని ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నాడు. -
భార్య భోజనం వడ్డించలేదని.. తల నరికి, చర్మం ఒలిచి..!
తుంకూర్: భోజనం వడ్డించ లేదని భార్యతో తగవుపెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలి చేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా కునిగల్ తాలుకాలోని హళియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. శివరామ, పుష్పలత(35)లకు పదేళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. శివరామ కోత మిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు. ఇద్దరిమధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తలనరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు పక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూర్ ఎస్పీ అశోక్ వెంకట్ గురువారం తెలిపారు. -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
అంతరిక్ష పర్యాటకం! అక్కడే విందు విలాసం..!
అంతరిక్ష పర్యాటకం ఇటీవలి కాలంలోనే మొదలైన ధోరణి. సంపన్న పర్యాటకులను భూమికి సుదూరంగా వ్యోమసీమలో విహారయాత్రలకు తీసుకుపోయేందుకు పలు అంతరిక్ష పర్యాటక సంస్థలు పోటాపోటీగా విలాసాలను కల్పిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన అంతరిక్ష పర్యాటక సంస్థ ‘జెఫాల్టో’ అంతరిక్ష పర్యాటకుల కోసం వ్యోమసీమలో విందువిలాసాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘జెఫాల్టో’ సంస్థ తన పర్యాటకులను బెలూన్ ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకుపోనుంది. ఇది భూమికి 25 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించనుంది. అంతరిక్షంలోకి చేరుకోగానే, బెలూన్‌లోనే పర్యాటకులకు విందు ఏర్పాటు చేయనుంది. పర్యాటకులు అంతరిక్షం నుంచి భూమిని తిలకిస్తూ విందు ఆరగించవచ్చు. తొలుత ఈ యాత్రను 2025లో ప్రారంభించాలని తలపెట్టినా, పర్యాటకుల నుంచి స్పందన బాగుండటంతో 2024 చివర్లోనే ఈ యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ‘జెఫాల్టో’ తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు యాత్రికులను అంతరిక్షానికి తీసుకుపోవడానికి బుకింగ్‌లు ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష విహారయాత్రలు చేపట్టిన సంస్థలేవీ తమ యాత్రికులకు అంతరిక్షంలో విందువిలాసాలను కల్పించలేదు. ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న తొలి సంస్థగా ‘జెఫాల్టో’ రికార్డులకెక్కనుంది. ఈ యాత్రకు వెళ్లడానికి టికెట్టు ధర 1.20 లక్షల యూరోలు (రూ.1.07 కోట్లు) మాత్రమే! (చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !) -
ఇజ్రాయెల్ - హమాస్ ఉద్రిక్తతలు.. బాయ్‌కాట్ ‘మెక్‌డొనాల్డ్స్’
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఉద్రిక్తతలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ దిగ్గజం మెక్‌డొనాల్డ్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. ఇటీవల,హమాస్ ఉగ్రవాదుల ఏరేవేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతికార దాడులకు తెగబడుతోంది. అయితే, వారి పోరాటానికి మెక్‌డొనాల్డ్స్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో మెక్‌డొనాల్డ్ తీరును విమర్శిస్తూ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సైనికులు ఉచిత ఆహారం ఇన్ స్టాగ్రామ్ వేదికగా మెక్ డొనాల్డ్ ఇజ్రాయెల్ సైన్యానికి మద్దతు పలికింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(Israel Defence Forces)లో భాగమైన హాస్పిటల్స్, సైన్యానికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే 4,000 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. యుద్ధం చేస్తున్న సైనికులు కాకుండా డిఫెన్స్‌లో పనిచేస్తున్న సోల్జర్స్ కోసం ప్రత్యేకంగా 5 రెస్టారెంట్లను ప్రారంభించినట్లు తెలిపింది. బాయ్‌కాట్‌కు పిలుపు దీంతో హమాస్ మద్దతు దారులు మెక్‌డొనాల్డ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలునిచ్చారు. ‘ఐడీఎఫ్కి మెక్‌డొనాల్డ్ ఉచిత భోజనాన్ని అందిస్తోంది. మనం మన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. నమ్మకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అనే నినాదంతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీలను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు. మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైన్యానికి ఉచితంగా భోజనం ఇస్తుంటే గాజాలో ప్రభావితమైన వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా హమాస్ మద్దతుదారులందరూ మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మద్దతు దారులు మాత్రం మెక్‌డొనాల్డ్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రకటనపై నిరసనలు ఇదిలా ఉండగా అక్టోబర్ 13న ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహార ప్రకటనపై లెబనాన్ దేశంలో నిరసనలు చెలరేగాయి. లెబనాన్ ఆధారిత 961 నివేదిక ప్రకారం, స్పిన్నీస్, సిడాన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌పై పాలస్తీనియన్ గ్రూపులు దాడి చేశాయి. దీనిపై మెక్‌డొనాల్డ్స్ లెబనాన్ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. ఇతర దేశాలు, భూభాగాల్లోని ఇతర ఫ్రాంఛైజీల్లోని మెక్‌డోనాల్డ్స్ నిర్ణయాలపై మెక్ డొనాల్డ్స్ లెబనాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. ఒమన్ మెక్‌డొనాల్డ్స్ గాజాకు తమ మద్దతును తెలిపింది. గాజాలోని ప్రజల సహాయ చర్యల కోసం కంపెనీ 100,000 డాలర్లు విరాళంగా అందించింది. మెక్‌డొనాల్డ్స్ ఒమన్ (అల్ దౌద్ రెస్టారెంట్స్ ఎల్ఎల్సీ) గాజాలోని సోదరులు, సోదరీమణులకు అండగా నిలుస్తాం. విలువలు, మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని నోట్లో వెల్లడించింది. -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
జనరల్ బోగీల వద్దే భోజనం ప్లేట్ మీల్స్ రూ.50
సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్సీటీసీ ఎకానమీ మీల్‌గా పేర్కొంది. కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది. దశలవారీగా విస్తరణ దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. ప్లేట్ ఇడ్లీ రూ.1,200 గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్ బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్‌కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్‌నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు. బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్‌కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్. -
ఆ శుభదినాన తల్లితో కలిసి.. ఐశ్వర్యరాయ్ ఫోటో వైరల్.. గంటల వ్యవధిలోనే
అందమంటే ఏంటీ? అని హఠాత్తుగా పది మందిని అడిగితే.. కనీసం ఐదుగురు ఐశ్వర్య రాయ్ పేరు చెబుతారట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఓ విషయం ఇది. నిజమే.. భువి నుంచి దిగి వచ్చినట్టుండే ఐశ్వర్య రాయ్ అత్యంత ప్రసిద్ధ మోడల్స్ లో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్.. అటుపై బాలీవుడ్, హాలీవుడ్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు. ఇదీ ఐశ్వర్య కెరియర్. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటో ఇది. 21 years ago aishwarya rai gave one of her best performances ever. pic.twitter.com/HLDx9KKzyV — ً (@SheethalS5) July 13, 2023 ఈ ఫొటోను చూస్తూ ‘ఇది అంతర్జాల విందు’ అన్నారు ఒక యూజర్. 21 సంవత్సరాల వయసులో ‘మిస్ వరల్డ్’ అందాల కిరీటాన్ని గెలుచుకుంది ఐశ్వర్యరాయ్. ఆ శుభదినాన తల్లితో కలిసి ఫ్లోర్ మ్యాట్‌పై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. how can someone who has seen this, not be an aishwarya rai stan ?#aishwaryarai • #devdas pic.twitter.com/MmvHSIzGZT — 𝒂𝒚𝒖𝒔𝒉𝒊. (@_ayushi_saran) July 13, 2023 భారతీయతకు, భారతీయ భోజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఫొటో ఇది. పాపులర్ పేజ్ ‘హిస్టారిక్ విడ్స్’లో షేర్ చేసిన ఈ ఫొటో గంటల వ్యవధిలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘సో...ప్యూర్ అండ్ జెన్యూన్’‘మన విలువలు, సంప్రదాయాలు భూమాతను, భోజన సంప్రదాయాలను గౌరవిస్తాయి’... ఇలా నెటిజనులు రకరకాలుగా స్పందించారు. Gorgeous Aishwarya Rai in Her Early Age. pic.twitter.com/qTUK8Jr58R — 🫶𝙌𝙃𝘿❤️🔥 (@QHDposts) July 10, 2023 ఐశ్వర్యారాయ్ నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2007లో అభిషేక్ బచ్చన్ ను వివాహామాడి అమితాబ్ ఇంట కోడలిగా అడుగుపెట్టారు. 21 Years of Aishwarya Rai as Iconic Paro. ❤#AishwaryaRaiBachchan #21YearsOfDevdas https://t.co/CvKCHCMztn pic.twitter.com/2pwbHEIGVM — Name! why? (@Whatever820082) July 12, 2023 -
అభివృద్ధీ... నీ పయనం ఎటు?
ఏడు సంవత్సరాల క్రితం 87 ఏళ్ల వయసులో మరణించిన భవిష్యత్తు వాది ఆల్విన్ టాఫ్లర్ ‘ఫ్యూచర్ షాక్’ అనే పుస్తకాన్ని 1970లో రాశాడు. వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చుతుందని అందులో ఊహించారు. ఆ ఊహ నిజమే నని నా అనుభవాలే చెబుతున్నాయి. 75 ఏళ్ల వయసులో, ముందూ వెనుకా ఐదు తరాల వాళ్లను చూసిన మాలాంటి వారికి అభివృద్ధి పేరుతో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న కొన్ని మార్పులు గమనిస్తుంటే ఆశ్చర్యం సంగతి అటుంచి, ఏంచేయాలో పాలుపోని పరిస్థితి కలుగుతున్నది. అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఏ పట్టణంలో, ఏ హోటల్లో పోయినా కడుపునిండా తినే తెలుగువారి భోజనం దొరకదు. అన్నం, కూర, పప్పు, నెయ్యి, సాంబారు, రసం, గోధుమ పిండి రొట్టె, పూరీ లాంటి పదార్థాలతో భోజనం పెట్టే హోటళ్లు మచ్చుకైనా కానరావు. పేరుకు అన్నీ ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు. బిరియానీ, పలావ్, జింజర్ రైస్, పన్నీర్, మైదా పిండో మరేదో దానితో చేసిన బటర్ నాన్, నాన్, రోటీ, కుల్చా లాంటివి తినాల్సిందే. లేదా పస్తు ఉండాల్సిందే. ‘పేదరాసి పెద్దమ్మ’ సంస్కృతి రోజుల రుచికరమైన భోజనం, సత్రాల భోజనం, తరువాత కాలంనాటి ఉడిపి హోటళ్ళ భోజనాలు ఏమయ్యాయి? డాక్టర్ దగ్గరికి పోతే పాతరోజుల్లాగా ఒంటి మీద చేయి వేసి, స్టెతస్కోప్ పెట్టి పరీక్ష చేసి, చూడడం గత చరిత్ర అయిపోయింది. గుడికి పోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టనివ్వరు. తీర్థం ఒకచోట, ప్రసాదం ఇంకొక చోట ఇస్తారు. వివిధ రకాల సేవల పేరు మీద ఛార్జీలు ఉంటాయి. మొదట్లో పెద్ద గుళ్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా పాకింది. అన్నింటికీ అనవసరమైన పరిమితులు. ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకులు ఒకప్పుడు హాయిగా దగ్గరలోని కొట్టుకుపోయి, స్వచ్ఛమైన, కల్తీలేని వాటిని, కొట్టువాడి ముందర పరీక్ష చేసి చూసుకుని, తూకం వేయించుకుని కొనుక్కునే వాళ్లం. ఇప్పుడు సంస్కృతి మారింది. పెద్దపెద్ద సూపర్ బజార్లలోకి పోయి, మనమే మనకు కావాల్సిన సామాన్లు వెతికి పట్టుకుని, ఒక బండిలో వేసుకుని తెచ్చుకోవాలి. అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి. ఇన్ని గ్రాములు, ఇన్ని కేజీలు అని ఉంటుంది వాటిమీద. నిజంగా అంత తూకం ఉంటాయా లేదా అనేది సందేహమే! పైగా ఒక ఎక్స్పైరీ డేట్ వేస్తారు. అందులో ఎంత కల్తీనో తెలుసుకునే మానిటరింగ్ మెకానిజం లేదనాలి. సరుకు తెచ్చుకున్న తరువాత ప్యాకెట్లు విప్పిచూస్తే కొన్నిట్లో పురుగులు ఉంటాయి. ఇదేంది అని అడిగితే పాకింగ్ చేసింది మేం కాదుకదా! అని జవాబు. ఇక మెడికల్ షాప్‌కు పోతే మనకు కావాల్సింది ఒక ఐదారు టాబ్లెట్స్ అయినా... షాపువాడు మొత్తం స్ట్రిప్ కొనమంటాడు. ఏ వస్తువు కొన్నా (ఫర్నిచర్ దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ పనిముట్ల వరకు) వాటికి రిపేర్ వస్తే, కొన్న చోట కాకుండా వేరే వర్క్ షాప్‌కు వెళ్లాలి. వాళ్లకు ఫోన్ చెయ్యాలంటే, టోల్ ఫ్రీ అనే నెంబర్‌కు చేయాలి. అది ఏ దేశంలో ఉంటుందో తెలియదు. వాళ్లు ‘ఒకటి నొక్కు, రెండు నొక్కు...’అంటూ డిస్కనెక్ట్ చేస్తారు. అసలు చిన్న చిన్న దుకాణాల సంస్కృతి పూర్తిగా పోవడం చాలా దురదృష్టకరం. చిన్నతనంలో తెల్ల కాగితాలు, పెన్సిల్, సిరా బుడ్డి, పిప్పరమింట్లు, చాక్లెట్లు, నువ్వుల జీడీలు, బిస్కట్లు లాంటివి కొనుక్కోవడానికి అక్కడక్కడ చాలా చిన్నచిన్న దుకాణాలు ఉండేవి. ఇప్పుడు చిన్న గుండు సూది కొనాలన్నా పెద్ద షాపునకు పోవాల్సిందే! అధిక ధరలు చెల్లించాల్సిందే. ఇంటి ముందుకు, తాజా కూరగాయలు తెచ్చి అమ్మే రోజులు పోయి కూరగాయల మార్కెట్లు వెలిశాయి. వాటిమీద బతికేవారు ఉపాధి కోల్పోయారు. ఫ్యామిలీ డాక్టర్ సంస్కృతీ పోయింది, పరాయి ఊరుకు వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో ఉండే అలవాటు పోయింది. చక్కటి, చిక్కటి స్వచ్ఛమైన పాలను ఇంటి ముందర కొనుక్కునే ఆచారం పోయింది. ఇంటి వెనుక పెరుగు చిలికిన చల్ల కడుపు నిండా తాగే రోజులు పూర్తిగా పోయాయి. వేరు శనగపప్పుతో ఎవరికివారు శనగ నూనె చేయించుకుని ఏడాది పొడుగూతా వాడే అలవాటు పోయింది. నడక ప్రయాణం కనుమరుగైంది. కడుపు నిండా భోజనం తినే సంస్కృతి స్థానంలో పిజ్జా, బర్గర్స్ వచ్చాయి. స్వచ్చమైన వెన్న, నెయ్యి లభ్యమయ్యే ప్రదేశాలు మచ్చుకైనా లేవు. జొన్న చేలలో ఉప్పు, కారం కలుపుకున్న దోసకాయలు తినే రోజులు ఇకరావేమో! చేలల్లో పెసరకాయలు వలుచుకు తినే అదృష్టం ఇక లేనట్టేనేమో. అన్నీ ఫాస్ట్ ఫుడ్సే. పెరుగు, నెయ్యి, పాలు, తేనె, కూరలు, నూనె, ఒకటేమిటి... అన్నీ ప్యాక్ చేసిన (కల్తీ) ఆహారాలే! చివరకు సీజనల్ పండ్లు కూడా కలుషితమైనవే! కాలుతీసి కాలు బయట పెట్టకుండా, కనీస వ్యాయామం లేకుండా, ఒంటికి చెమట పట్టకుండా, నిరంతరం ఏసీ గదుల్లో ఉంటూ అన్నీ ఇంటి ముంగిటే పొందడం! బాత్రూమ్ కూడా బెడ్రూమ్కు అను బంధమే! ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో కోల్పోతున్నాం. ఇంకా ఎన్ని కోల్పోవాలో? ఇదంతా చూస్తూ, అను భవిస్తూ ‘అభివృద్ధీ నీ పయనం ఎటువైపు?’ అని నిట్టూర్చడం కన్న చేయగలిగిందేముంది? వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
టీ, టిఫిన్, భోజనానికి 2 రూపాయలా?
ఓ కేఫ్‌లో ఇరానీ చాయ్ తాగాలంటే ఎంతలేదన్నా రూ. 10 నుంచి రూ. 20 మధ్య ఖర్చు పెట్టాల్సిందే. అలాగే ఒక ఉస్మానియా బిస్కెట్ తినాలంటే కనీసం రూ. 5 చెల్లించాల్సిందే. అలాంటిది పోలీసుల అదుపులో ఉండే నిందితులకు రూ. 2కే ఉదయం టీ, అల్పాహారంతోపాటు రెండు పూటలా భోజనం అందించాలట! ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అధికారికంగా అదుపులో ఉన్న నిందితుల రోజు ఖర్చుల కింద ప్రభుత్వం పోలీసులకు అంతే ఇస్తోంది మరి!! సాక్షి, హైదరాబాద్: వివిధ నేరాలకు సంబంధించి అనుమానితులు, నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనివార్యం. అదే సమయంలో వారి యోగక్షేమాల్ని చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబీకులకు కూడా తెలియదు కాబట్టి వారికి ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ పోలీసులే సమకూర్చాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తిండి ఖర్చు దగ్గరే తేడా కొడుతోంది. ఎందుకంటే.. ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒక్కో నిందితుడి ఆహార ఖర్చు కింద అక్షరాలా రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. నిజాం కాలంలో ఇది ఒక రూపాయిగా ఉండగా కొన్ని దశాబ్దాల క్రితం ఉదారతతో రెట్టింపు చేస్తూ రూ. 2కు పెంచారు. ఆ తరువాత ఈ విషయాన్ని అంతా మరచిపోవడంతో ఇప్పటికీ అదే అమలవుతోంది. దీంతో పోలీసులు ఎవరూ ఈ సొమ్ము తీసుకోవట్లేదు. దానికీ ఓ ఆసక్తికర కారణం ఉందని అధికారులు చెబుతున్నారు. అసలుకు మించి బిల్లులకు ఖర్చు... వాస్తవ ఖర్చుల మాట ఎలా ఉన్నా ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 అయినా తీసుకుందామనుకున్నా దానికి దాదాపు రూ. 10కిపైగా ఖర్చు చేయాల్సి వస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ, రికవరీల కోసం కనిష్టంగా వారం నుంచి 10 రోజులపాటు కస్టడీలో ఉంచుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది అనివార్యంగా మారిపోయింది. చట్ట ప్రకారం ఎవరిని అదుపులోకి తీసుకున్నా కచ్చితంగా 24 గంటల్లో అరెస్టు చూపడమో లేదా విడిచి పెట్టడమో చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి రోజుకు రూ. 2 కంటే ఎక్కువ బిల్లు పెట్టుకొనే అవకాశం ఉండదు. అంతకంటే ఎక్కువ బిల్లు పెట్టుకోవాలంటే చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయి. ఈ లెక్కన నెలలో అదుపులోకి తీసుకున్న ఒక ఐదుగురు నిందితులకు సంబంధించిన రోజువారీ ఆహార ఖర్చు బిల్లు గరిష్టంగా రూ. 10 వరకే పెట్టాల్సి ఉంది. పైగా దీనికోసం ఓ దరఖాస్తును టైప్ చేసి ఆ మొత్తానికి సరిపడా బిల్లు పెట్టి సంబంధిత ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకెళ్లి మంజూరు చేయించుకొని రావాలి. ఇందుకు సొంత ద్విచక్ర వాహనంలో వెళ్లి రావాల్సి ఉంది. వాటన్నింటికీ కనీసం రూ. 70 ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసు విభాగంలో ఎవరూ ఈ బిల్లుల్ని తయారు చేయడం, ఉన్నతాధికారులకు పంపడం చేయట్లేదు. వీలైతే ఈ ఖర్చుల్ని పోలీసులు భరించడమో లేదా సదరు వ్యక్తి జేబులో ఉన్న వాటితో సరిపెట్టడమో చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో నేరుగా ఆ వ్యక్తి ఇంటి నుంచే భోజనం తెప్పించి పెడుతున్నారు. అయితే అనుమానితుడు అనారోగ్యంతో ఉంటే ఈ ఖర్చులకు తోడు వైద్యం, మందుల భారమూ పోలీసులకు అంటుకుంటోంది. నిందితుల కంటే ఖైదీలకే బెటర్... నిందితుడిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాక పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంటే అప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నన్ని రోజులకు బిల్లు పెట్టుకొనే అవకాశం ఉంది. కానీ ఈ మొత్తం కూడా గరిష్టంగా రూ. 28 దాటేందుకు వీల్లేదు. పైగా ఆ సొమ్ము కోసం కూడా పోలీసులు దాదాపు రూ. 70 ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఏళ్లుగా ఈ మొత్తాన్ని పెంచకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర జైళ్లలోని ఖైదీలకు ఇచ్చే రేషన్ ఆధారంగా సరాసరి లెక్క కడితే ప్రస్తుతం రోజుకు ఒక్కొక్కరికీ రూ. 16పైనే కేటాయిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. కనీసం వారికి ఖర్చు చేసేంత మొత్తం అయినా అదుపులోకి తీసుకొనే నిందితుడు/అనుమానితుడి ఖర్చులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. అవసరాలు ఒకటే అయినప్పుడు ఠాణాలకు ఓ కేటాయింపు, జైళ్లకు మరో కేటాయింపు ఉండటం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) కోరుతున్నారు. -
ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి.. ఫొటో వైరల్..
తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ విమానంలో ప్రయణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా అని సర్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు. You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed. This kind of negligence is unacceptable. #airIndia pic.twitter.com/L3lGxgrVbz — Sarvapriya Sangwan (@DrSarvapriya) January 8, 2023 ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా జేఆర్డీ సంస్థ.. అంతర్జాతీయ గౌరవం పొందింది. ఇప్పుడు మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? నిర్వహణ లోపమా? అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ఆ రాయి ఉన్న ఆహారం తని మీ పన్ను విరిగిపోయి ఉంటుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మహిళ ట్వీట్‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణమే క్యాటరింగ్ టీం దృష్టికి దీన్ని తీసుకెళ్తామంది. తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు అభినందించింది. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
వింత ఘటన.. ఆధార్ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్
అమ్రోహా(యూపీ): అక్కాచెల్లెళ్ల వివాహాలను ఒకే రోజు జరిపించింది ఓ కుటుంబం. దాంతో బంధు మిత్రులు, తెల్సినవారు తండోపతండాలుగా హాజరయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో కుటుంబం విఫలమైంది. పైగా పిలవని వాళ్లు కూడా భారీగా వచ్చారేమోనని అనుమానం. దాంతో, ఆధార్ కార్డును చూపిస్తేనే భోజనం ప్లేటు ఇస్తామని ప్రకటించారు. దీంతో అతిథులు హుతాశులయ్యారు. ఆధార్ కార్డులున్న వారు వాటిని చూపించి భోజనాలు కానిచ్చేశారు. మిగతావాళ్లు ఇదేం అవమానమంటూ వెళ్లిపోయారు. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్‌లో జరిగిన ఈ వింత ఘటన తాలూకు వీడియోలు వైరల్‌గా మారాయి. In a seemingly bizarre incident, guests at a #wedding in Uttar Pradesh's #Amroha district were asked to show their #Aadhaar cards before they were allowed to pick up dinner plates.The incident took place in Hasanpur where two sisters were getting married at the same venue. pic.twitter.com/9IfenucXUH— IANS (@ians_india) September 25, 2022 -
టాయిలెట్లో భోజనాలు
సహరన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లో వినడానికే రోత పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులకు ఇంకెక్కడా చోటు లేనట్టు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు! సహరన్‌పూర్‌లోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ స్టేడియంలో సెపె్టంబర్ 16 నుంచి 18 దాకా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్ల నుంచి 300 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారికి టాయిలెట్లో భోజనాలు వడ్డించడం తీవ్ర దుమారం రేపింది. అన్నం, కూరలతో పాటు పూరీలను టాయిలెట్లోనే నేలపై పేపర్లు పరిచి ఉంచారు. గత్యంతరం లేక బాలికలు అక్కడే వడ్డించుకొని తింటున్న వీడియో వైరల్‌గా మారింది. దాంతో యూపీ ప్రభుత్వం తీరును నెటిజన్లు అసహ్యించుకున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సహరన్పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసింది. భోజనాలు తయారు చేసిన కేటరర్‌ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ‘‘వీడియోలో కనిపిస్తున్న ఆహారం సెపె్టంబర్ 15న వండినది. పాడైపోయిన ఆహారం కావడంతో భారీ వర్షాల వల్ల స్టేడియంలో ఎక్కడా చోటు లేక ఛేంజింగ్ రూమ్‌లో ఉంచాం. అంతే తప్ప బాలికలకు పెట్టడానికి కాదు’’ అంటూ సక్సేనా సమరి్థంచుకున్నారు. భోజనాలపై కోచ్‌లు, క్రీడాకారిణులు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. 300 మందికి భోజనాన్ని ఇద్దరే చేశారని, అన్నం కూడా ఉడకలేదని సమాచారముందని కలెక్టర్ చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మండిపడ్డారు. క్రీడాకారిణుల్ని ఈ స్థాయిలో అగౌరవపరచడం జాతికే అవమానమంటూ ట్వీట్ చేశారు. ఇంత దారుణంగా చూస్తారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా దీనిపై మండిపడింది. -
బండరాయిపై భోజనం
-
నాసిరకం భోజనంతో విద్యార్థులకు అస్వస్థత
సిద్దిపేట అర్బన్: నాసిరకం భోజనం తిని 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా ఉడకని ఆహారం తిన్న విద్యార్థినులు రెండు, మూడు రోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్లో ని ఓ గదిలో ఉంచి పుల్లూరు పీహెచ్సీ వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. పునరావృతం కావొద్దు: కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని సామాజి క మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వారిని అడగ్గా ప్రస్తుతం బాగా నే ఉందని విద్యార్థినులు సమాధానం చెప్పారు. పిల్లలు బాగా నే ఉంటే బయట ప్రచారం మరోలా జరుగుతోందని ఇలా ఎందుకు అని ప్రిన్సిపాల్ లలితను ప్రశ్నించగా హెడ్ కుక్ రాకపోవడంతో మరో వ్యక్తి వంట చేయగా నాణ్యత లోపించి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాధానం ఇచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యం కుదుటపడే వరకు మెడికల్ సిబ్బంది అక్కడే ఉండి వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. -
అన్నపూర్ణ.. అక్షయ పాత్ర
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటోంది. దేశంలోనే విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా సైతం లభిస్తోంది. రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతున్న యువతకు ప్రభుత్వ పరంగా అన్నపూర్ణ భోజన పథంకం అక్షయ పాత్రగా మారింది. కేవలం రూ.5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనం లభిస్తోంది. జీహెచ్ఎంసీ చొరవతో 2014లో అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీని అమలు కోసం నిరంతరం పర్యవేక్షణ సాగిస్తోంది. ఎనిమిదేళ్లుగా.. ఎనిమిదేళ్లుగా అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చయ్యాయి. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. లాక్డౌన్ సమయంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్– మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించారు. రాత్రి పూట సైతం 259 రెగ్యులర్– మొబైల్ కేంద్రాలు పనిచేశాయి. పేదల సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ సదుపాయం కూడా కల్పించారు. మొదటి విడతగా 32 ఏరియాల్లో సిట్టింగ్ అన్నపూర్ణ కాంటీన్లను ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నారు. -
నాణ్యత లేని భోజనం.. ‘ఎగ్’నామం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అరకొరగా, నాణ్యతలేని ఆహారం అందుతోంది. గర్భిణులు, బాలింతలతోపాటు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న పేదలు, ప్రమాదాల బారిన పడిన సామాన్యులకు ప్రభుత్వాస్పత్రులే దిక్కు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థికస్తోమత లేకపోవడంతో ఎక్కువ మంది ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. పేదరోగుల ఆహారం కోసం ప్రభుత్వమే ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందజేస్తోంది. ఈ మేరకు ధరలు నిర్ణయించి, నిబంధనలు విధించి.. ఈ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కానీ కాంట్రాక్టర్ల కక్కుర్తి, పర్యవేక్షించాల్సిన ఆయా ఆస్పత్రుల ఉన్న తాధికారుల నిర్లక్ష్యంతో చాలా ఆస్పత్రుల్లో రోగులు అర్ధాకలితో అలమటిస్తున్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. జిల్లాల వారీగా పరిస్థితి ఇలా.. ♦ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత లేని భోజనం సరఫరా చేస్తు న్నారు. ఆసిఫాబాద్‌లో కొన్నిసార్లు భోజనమే పెట్టడం లేదు. నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో అన్నం, చారుతోనే సరిపుచ్చుతున్నారు. కూరగాయలు వండ డం లేదు. కోడి గుడ్లు ఇవ్వడం లేదు. ♦సిద్దిపేట జనరల్ ఆస్పత్రిలో రోగులకు రోజూ అల్పాహారం, భోజనం అందిస్తు న్నారు. అలాగే ఈనెల 4వ తేదీ వరకు గుడ్డు ఇచ్చారు. కానీ దాదాపు 20 రోజు లుగా గుడ్డు ఇవ్వడం లేదు. అరటిపండు కూడా అందడం లేదు. ♦నిజామాబాద్ ఆస్పత్రిలో రోజూ 340 నుంచి 400 మందిరోగులకు ఆహారం అందిస్తున్నారు. మెనూ ప్రకారం కాకుం డా ఉదయం ఎక్కువగా ఇడ్లీ మాత్రమే ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో నీళ్లచారు మాత్రమే ఉంటోందని రోగులు ఆరోపిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ గుడ్డు ఇస్తున్నారు. కానీ చిన్నగా ఉంటోంది. అరటిపండు రోజూ ఇవ్వాల్సి ఉన్నా.. కొందరికి మాత్రమే ఇస్తున్నారు. నీళ్ల చారు, మరీ పలుచగా మజ్జిగ ఇస్తున్నారని, కూరలు కూడా నీళ్లు నీళ్లుగా ఉంటున్నాయని చెబుతున్నారు. ♦మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో 600 మంది రోగులకు, 50 మంది వైద్యులకు ఏజెన్సీ ఆహారం సరఫరా చేస్తోంది. నీళ్ల చారు, ఉడకని అన్నం పెడుతుండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రోగులకు ఏమివ్వాలి.. ♦ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సాధారణరోగులకు ఉదయం 4 బ్రెడ్డు ముక్కలు, 200 మిల్లీలీటర్ల పాలు.. మధ్యాహ్నం అన్నం, కూర, గుడ్డు, సాం బారు.. రాత్రి అన్నం, కూర, మజ్జిగ అంద జేయాలి. ఇందుకు ఒక్కొక్కరికి రూ.40 చొప్పున ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. ♦పౌష్టికాహారలోపంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారికి ఉదయం 4 బ్రెడ్ ముక్కలు, 200 ఎంఎల్ పాలు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, 2 కూరలు, గుడ్డు, అరటి పండు చొప్పున అందిం చాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం ఏజెన్సీకి రూ.56 చెల్లిస్తోంది. ♦బాలింతలకు బలవర్ధక ఆహా రం కోసం ఉదయం అల్పా హా రం కింద ఇడ్లీ లేదా ఉప్మా, 200 ఎంఎల్ పాలు, 4 బ్రెడ్డు ముక్కలు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, 2 కూరలు, గుడ్డు, అరటి పండు అందజేయాలి. ఇందుకోసం ఏజెన్సీకి రూ.వంద చొప్పున చెల్లిస్తోంది. ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి.. ♦పలు ఆస్పత్రుల్లో వైద్యులకు ప్రత్యేకంగా నాణ్యమైన ఆహారం అందజేస్తుండగా.. రోగులకు మాత్రం నాసిరకమైన భోజనం పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ♦ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీల నిర్వాహకులు రోజువారీగా మెనూ ప్రదర్శించాల్సి ఉంది. ఆ మెనూ ప్రకారమే ఆహారం ఇవ్వాలి. కానీ ఇది చాలాచోట్ల అమలుకు నోచుకోవడం లేదు. ♦చాలావరకు ఆస్పత్రుల్లో రెండు, మూడు బ్రెడ్డు ముక్కలు, తాగేందుకు వీలు లేనివిధంగా ఉన్న పాలు, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో ఇస్తున్నారు. మధ్యాహ్నం కూర, సాంబారులో ఏదో ఒకటే ఇస్తుండగా, అరటిపండు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా చాలావరకు పాడైనవే ఉంటున్నాయి. కొన్ని చోట్ల గుడ్డు ఇవ్వడం లేదు. అన్నంతో పాటు కూరలు సరిగా ఉండడం లేదు. నీళ్ల సాంబారుతో సరిపుచ్చుతున్నారు. ఈ ఫొటోలో భోజనం చేస్తున్న ఈయన పేరు మోరే లక్ష్మణ్. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్‌కు చెందిన ఈయనకు నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఇతనికి ఒక పూటే, అదికూడా నాసిరకమైన భోజనం అందుతోంది. దీంతో ఇంటి నుంచి తెప్పించుకుని తింటున్నాడు. రెండు రోజులుగా ఇక్కడ భోజనమే ఇవ్వలేదని మరికొందరు రోగులు చెప్పారు. గుడ్డు, పాలు, బ్రెడ్ కూడా రోజూ ఇవ్వడం లేదని లక్ష్మణ్ తెలిపాడు. ఉడకని అన్నం పెడుతున్నారు.. మా బాబుకు రక్తం తక్కువగా ఉందని 9 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నాం. ఆహారం అయితే రెండు పూటలు ఇస్తున్నారు. కాకపోతే కూరలు నీళ్ల మాదిరి ఉంటున్నాయి. అన్నం కూడా సరిగ్గా ఉడకడం లేదు. – అనిత, పొల్కంపల్లి, భూత్పూర్, మహబూబ్‌నగర్ ఒక్కరోజే అరటి పండు ఐదు రోజుల కిందట కూతురి కాన్పు కోసం వచ్చాం. ఐదు రోజుల్లో ఒక్కరోజు మాత్రమే అరటి పండు ఇచ్చారు. గుడ్డు, భోజనం పెడుతున్నప్పటికీ అంత మంచిగా ఉండడం లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తినిపిస్తున్నాం. –పగిడిమర్రి లక్ష్మమ్మ, నల్లగొండ అమల్లోకి రాని పెరిగిన రేట్లు ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణ బాధ్యతలను టెండర్ పద్ధతిన ఏజెన్సీలకు అప్పచెబుతున్నారు. నిర్ణయించిన రేటు ప్రకారం ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. అయితే ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ధరలను రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 21న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. -
భజనలు చేస్తూ మోదీ.. లంగర్లో వడ్డిస్తూ రాహుల్
వారణాసి/ఢిల్లీ: పంజాబ్ ఎన్నికల సందడి అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ వారణాసిలో కనిపించింది. కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరూ గురు రవిదాస్ సంస్మరణలో మునిగితేలారు. 15వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడు గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజకీయ నాయకులు, భక్తులతో వారణాసి కిటకిటలాడిపోయింది. రవిదాస్ అనుచరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీల వారు పోటీలు పడి మరీ ప్రార్థనలు చేశారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రవిదాస్ ఆలయాన్ని సందర్శించి మహిళా భక్తులతో కలిసి కూర్చొని భజనలు చేశారు. రవిదాస్ జన్మస్థలమైన వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఒక ఎంపీగా తనకా అవకాశం దక్కడం అదృష్టమని మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసిలోని రవిదాస్ ఆలయంలో లంగర్ (సమూహ భోజనాలు)లో భక్తులకు భోజనాలు వడ్డించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెల్లవారుజామున 4 గంటలకే రవిదాస్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కూడా ప్రార్థనలు చేశారు. రవిదాస్‌కి ఎందుకింత ప్రాధాన్యం ► గురు రవిదాస్ వారణాసిలోని గోవర్ధన్‌పూర్ గ్రామంలో చర్మకారుల కుటుంబంలో జన్మించారు. రవిదాసియా అనే ప్రత్యేక మతాన్ని వ్యాప్తి చేశారు. పంజాబ్‌లో ప్రముఖ డేరా సచ్చఖానంద్ బల్లాన్ రవిదాసియా మతాన్నే ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేరాకు 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ► చిన్నప్పట్నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ వివక్షను ప్రశ్నిస్తూ కవిత్వం రాశారు. ఆయన రాసిన కవిత్వానికి, రవిదాసులో సాహితీవేత్తకి కులాలకతీతంగా అభిమానులున్నారు. ► సిక్కు రాడికల్ సంస్థకు చెందిన కొందరు నాయకులు 2009లో వియన్నాలో గురు రవిదాస్ డేరాలపై జరిపిన దాడిలో ఒక నాయకుడు మరణించాడు. దీంతో సిక్కు మతంతో తమకు సంబంధం లేదని ఆ డేరా ప్రకటించింది. గురు గ్రంథ సాహిబ్ స్థానంలో రవిదాస్ రచించిన 200 కీర్తనలతో కూడిన అమృత్వాణిని తీసుకువచ్చారు. అదే తమకు మత గ్రంథమని ప్రకటించుకున్నారు. ► పంజాబ్ జనాభాలో 32 శాతం దళితులున్నారు. వారిలో ఎక్కువ మంది రవిదాస్ అనుచరులు కావడంతో రాజకీయ పార్టీల తలరాతలు మార్చే ఓటు బ్యాంకుగా మారారు. ► ఈ సారి పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14నే జరపాలని తొలుత ఎన్నికల సంఘం నిర్ణయించినప్పటికీ రవిదాస్ జయంతి కోసం ఎన్నికల్ని కూడా 20 తేదీకి వాయిదా వేసింది. ► పంజాబ్‌లో దళితుల ఓట్లను ఆకర్షించడానికి గతంలో బీఎస్పీ ప్రయత్నించి కొంత సఫలమైంది. అయితే ఆ పార్టీకి రామ్‌దాసియా సిక్కుల మద్దతు మాత్రమే లభించింది. ఈసారి వీరి ఓట్ల కోసం ప్రతీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వారణాసిలోని రవిదాస్ ఆలయంలో వడ్డిస్తున్న రాహుల్ -
20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర తక్కువే! ఎక్కడో తెలుసా?
కూసుమంచి (ఖమ్మం జిల్లా): భోజనం చేసేందుకు ఏదైనా హోటల్‌కు వెళ్తే ఓ నాలుగు కూరలు, ఒక చట్నీ, సాంబారు, పెరుగుతో సరిపెడతారు. దీంతో కడుపు నిండినట్టు అనిపించనప్పటికీ సర్దుకుపోతాం. ఒకవేళ ఎక్కువగా తీనాలంటే మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టలేని వారు అసంతృప్తితోనే బయటకు వస్తుంటారు. కానీ కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో మాత్రం 20కి పైగా రకాల కూరలను వడ్డిస్తూ భోజన ప్రియులను సంతృప్తి పరుస్తున్నారు. సామాన్యులు వెచ్చించగల బడ్జెట్లోనే పసందైన భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి హోటళ్లు ఎక్కడా లేవంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. (చదవండి: భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం, క్రిమినల్ చర్యలకు ఈవో ఆదేశం) నాగన్నతో మొదలు.. కూసుమంచిలోని నాగన్న (రామకృష్ణ ) హోటల్లో గత కొన్నేళ్లుగా వివిధ కూరలతో భోజనాలు వడ్డిస్తున్నారు. దీంతో ఈ హోటల్ ప్రత్యేకతను సంతరించుకుంది. కూసుమంచిలో ఖమ్మం– సూర్యాపేట రాష్ట్రీయ రహదారి పక్కన ఉండటంతో ఇక్కడ 24 కూరల భోజనం గురించి తెలుసుకుని అనేక మంది ప్రయాణికులు ఆగి మరీ భోజనాలు చేస్తుంటారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ హోటల్లో భోజనం చేసి అభినందించారు. ఈ హోటల్ యజమాని బెల్లంకొండ నాగన్న గత 20 ఏళ్లకు పైగా సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు. శివ హోటల్‌కు క్రేజ్.. కూసుమంచిలోని సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన శివ హోటల్ సైతం నాగన్న హోటల్ మాదిరిగా 24 కూరలను అందిస్తూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ హోటల్లో కూరలతో పాటు చికెన్ కర్రీని అదనంగా వడ్డించడం ప్రత్యేకత. కాలానుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలను యజమాని శివ సొంతంగా కొన్నింటిని పండిస్తూ, మరికొన్ని కొనుగోలు చేస్తూ 20 కూరలకు తగ్గకుండా భోజనాలు అందిస్తున్నారు. వెజిటేరియన్ కాకుండా నాన్‌వెజ్‌లో భాగంగా బిర్యానీ, చికెన్, చేప కూరలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. అనతికాలంలోనే ఈ హోటల్ కూడా ఆదరణ పొందింది. మండల ప్రజలతో పాటు ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేకంగా కూసుమంచికి వచ్చి భోజనాలు చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..) వడ్డించే కూరలు... కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో వివిధ రకాల కూరలు వడ్డిస్తున్నారు. వాటిలో పప్పు, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు కాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, బంగాళదుంప, చామగడ్డ, క్యారట్, కాకరకాయ, టమాట, బీర, సొరకాయ, బెండకాయ, పాలకూర, బచ్చలికూర, చుక్క కూర, గోంగూర, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడితో పాటు సాంబారు, పెరుగు వడ్డిస్తారు. కాగా కూరలు సీజన్‌ను బట్టి కొంచెం మారుతుంటాయి. అయినప్పటికీ 20 కూరలకు తగ్గకుండా వడ్డిస్తుండటం ప్రత్యేకత. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా భోజనం రూ.100 మాత్రమే తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడా చూడలేదు.. మాది వరంగల్ జిల్లా కేసముద్రం. మేం కూసుమంచికి పనిమీద వచ్చాం. ఇక్కడ 20 కూరల భోజన హోటల్ బోర్డు చూసి వచ్చి తిన్నాం. ఇన్ని కూరలు వడ్డించే హోటల్ ఎక్కడా చూడలేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కూరలు కూడా చాలా బాగున్నాయి. – లక్ష్మి, కేసముద్రం, వరంగల్ జిల్లా తృప్తి మిగులుతుంది.. మా హోటల్లో రోజూ 20కి తగ్గకుండా కూరలు తయారు చేస్తాం. కస్టమర్ల తృప్తి మేరకు భోజనాలు వడ్డిస్తున్నాం. భోజన ప్రియుల అభిరుచి మేరకు నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. మంచి భోజనం అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. – భూక్యా శివ, శివ హోటల్ యజమాని -
‘అవ్వ’ హోటల్.. రూ. 25కే మీల్స్.. ఎక్కడో తెలుసా?
‘అవ్వ కావాలా.. బువ్వ కావాలా ఏదో ఒకటి ఎంచుకోమనే పదాన్ని సర్వసాధారణంగా క్లిష్ట సమస్యలొచ్చినప్పుడు వాడుతుంటాం.. కాకపోతే కర్నూలు నగర పాతబస్తీలో మాత్రం అవ్వే స్వయంగా బువ్వ వడ్డిస్తుంది. తన హోటల్లో సన్న బియ్యంతో చేసిన అన్నం, పప్పు, సాంబారు, కర్రి, పచ్చడి, మజ్జిగ మధ్యాహ్న భోజనంగా అందిస్తోంది. బయటి హోటళ్లలో మీల్స్ రూ. 60 నుంచి రూ. 90లకు విక్రయిస్తున్న ఈ కాలంలో అవ్వ వద్ద రూ.25ల ధరకే లభిస్తుండటం విశేషం. ఆశ్చర్యం వేస్తోంది కదూ! ఇది వాస్తవం. కడుపు మాడ్చుకునే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈమె ఇలాంటి పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇప్పటినుంచి కాదు.. ఓ పదహైదేళ్ల నుంచి! అలాగని ఆమె గొప్ప ధనవంతురాలేమీ కాదు.. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఓ సామాన్యురాలే. ఆకలిబాధేమిటో ఆకలిగొన్నవారికే తెలుస్తుందనే అనుభవాన్ని ఆమె స్వయంగా చవిచూసింది. భర్త మరణంతో తెలిసొచ్చిన ఆకలిబాధ.. ఈ అవ్వ పేరు కురువ లక్ష్మీదేవి. ఈమె భర్త కె.తిప్పన్న. సేంద్రీయ ఎరువుల వ్యాపారం చేసేవాడు. పశువుల పేడను ఆర్డరిచ్చిన రైతుల చేన్లకు లారీలో తరలించేవాడు. వీరిరువురికి యాభైఐదు ఏళ్ల క్రితం వివాహం అయింది. ఓ ఐదేళ్లకు కుమారుడు (కె.మద్దయ్య) పుట్టాడు. పెళ్లి చేసుకున్న పదేళ్లూ ఆ దంపతులు సుఖంగానే ఉన్నారు. అప్పటివరకు ఆకలి బాధేంటో అవ్వకు తెలీదు. విధి వక్రించడంతో ఆమెకు భర్త వియోగం కలిగింది. అప్పటినుంచి ఆ కుటుంబానికి అధోగతి పట్టింది. అప్పట్లో బుధవారపేట బ్రిడ్జీ స్థానంలో హంద్రీ నదిలో గచ్చు (ఇసుక, సున్నం, నీరు కలిపిన మిశ్రమం) గానుగలు ఉండేవి. ఇంటిగోడల నిర్మాణానికి, ప్లాస్టిరింగ్కు గచ్చునే వాడేవారు. అవ్వ మారెమ్మ గానుగలో పని కుదుర్చుకుంది. రాత్రింబవళ్లు కష్టపడినా కూలీడబ్బులు వారానికి రూ.50 మాత్రమే లభించేది. పెద్దపడఖానాలోని తన ఇరుకింటిలోనే జీవనం గడిపేది. వర్షానికి కారుతున్నా మరమ్మతులకు డబ్బులుండేవి కావు. కనీసం టీ తాగడానికి పది పైసలు ఉండేవి కావు. ఇంతటి ఆర్థిక కష్టాన్ని సైతం ఆమె ఎదురీదుతూ కుమారుడిని ఏడో తరగతి దాకా చదివించుకుంది. కొన్నాళ్లకు గానుగలకు డిమాండ్ పడిపోయింది. ఈమె ఉపాధి కోల్పోయింది. బొంగుల బజార్‌లోని జైనమందిరంలో నెలకు రూ. 900ల చొప్పున పని కుదుర్చుకుంది. అక్కడ పదహైదేళ్లు పనిచేస్తే జైనమత పెద్దలు జీతాన్ని రూ. 1500లకు పెంచారు.1994లో కుమారుడికి నగరానికే చెందిన సుభద్రతో పెళ్లి చేసింది. హమాలీల ఆకలిబాధలు కలచివేశాయి.. అవ్వ మండీబజార్‌లో రూ.600తో ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుంది. కుమారుని సాయంతో మొదట ఉగ్గాని, బజ్జి వంటి టిఫిన్ పదార్థాలను విక్రయిస్తుండేది. మండీబజార్‌కు దూర ప్రాంతాల నుంచి సరుకుల లారీలు వస్తుంటాయి. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన హమాలీలు లారీల్లోంచి సరుకుల బస్తాలు దింపుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోంచేయడానికి ఇళ్ల వద్ద నుంచి చద్దిమూట తెచ్చుకునే వారు. తెల్లవారు జామునే వారు తెచ్చుకున్న అన్నం పాచిపోయేది. పప్పు వాసనకొట్టేది. చేతిలో డబ్బులేక వారు బజ్జీ తిని కాలం వెళ్లబోసుకునే వారు. మధ్యాహ్నం పూట వారి ఆకలి నకనకలను అవ్వ అతి సమీపం నుంచి చూసింది. ఏదోరీతిలో వారికి సాయం చేయాలనే సంకల్పానికి వచ్చింది. తను బజ్జీలమ్మే గదిలోనే సన్నబియ్యంతో అన్నం తయారు చేసి రూ. 10కే విక్రయించింది. ధర చౌకగా ఉండటం వల్ల హమాలీలు రాసాగారు. అన్నంతో పాటు పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగలను వడ్డించింది. నష్టం కలిగించిన వరద.. 2009లో నగరానికి వరదలు వచ్చాయి. వరద ప్రభావంతో నిల్వ ఉంచుకున్న కొన్ని బియ్యం బస్తాలు, బ్యాళ్లు వంటివి పాడైపోయాయి. పుంజుకోవడానికి సమయం పట్టింది. అయినా అవ్వ అధైర్య పడలేదు. అన్నం వడ్డింపునకు అంతరాయం కలిగించలేదు. భోజన ధరను రూ. 15కు పెంచారు. స్థలం చాలడం లేదని 2014లో ఎదురుగా ఉండే షాపులోకి షిఫ్ట్ అయ్యారు. కొడుకు, కోడలు అవ్వకు తోడుగా నిలిచారు.హమాలీలతో పాటు షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పనిమీద నగరానికి వచ్చిన బాటసారులు, నిరుపేదలు అందరు రాసాగారు. ఆమె అన్నానికి క్రమేపీ గిరాకీ పెరిగింది. భోజన సరఫరా వేళలను పెంచుతూ ఈ ప్రక్రియను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. బియ్యం ధర కేజీ రూ. 50 ఉండే ప్రస్తుత రోజుల్లోనూ అవ్వ రూ.25కే భోజనం వడ్డిస్తుండటం గమనార్హం. రైతుబజార్ రైతులకూ ఉపయోగకరమే.. నగరంలోని సీక్యాంప్ రైతుబజార్‌కు కూరగాయలు తెచ్చే గ్రామీణ రైతులు తెల్లవారు జామునే సరుకులతో బయలుదేరి వస్తారు. వారు చద్దిమూట తెచ్చుకున్నా పాచిపోతుంటుంది. ఇక్కడ అవ్వ హోటల్ ఉందనే విషయం తెలుసుకుని వారూ ఉపయోగించుకుంటున్నారు. పేద సాదలే కాకుండా ఒకసారి రుచి చూసిన వారు మళ్లీమళ్లీ వస్తున్నారు. సేవతో సంతృప్తి: కురువ లక్ష్మీదేవి (అవ్వ) కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట నిజం. మేం కుటుంబ సభ్యులంతా కలిసి అన్నం పెట్టే మహాయజ్ఙాన్ని నడిపిస్తున్నాం. మేమే స్వయంగా నిర్వహించుకుంటాం కాబట్టి మాకు పనివాళ్ల అవసరం ఉండదు. వేతనాల చెల్లింపుల ఖర్చు అసలే ఉండదు. బియ్యం లూజుగా కొంటే ధర ఎక్కువ. మేం ఒకేసారి ఐదారు బస్తాలు కొనేస్తాం. చౌకధరకు లభిస్తాయి. బ్యాళ్లు, నూనె వంటి ఇతర వస్తువులను కూడా టోకులో కొంటున్నాం. లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో (అంటే తక్కువ లాభంతో) పనిచేస్తున్నాం. పేదలకు సైతం కడుపు నింపుకునే అవకాశం కల్పించినందుకు నాకు, మా కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తోంది. ఇటీవలే కంటి ఆపరేషన్ చేసుకున్నా ఇంట్లో ఉండలేకపోయా. నా పేరుతోనే హోటల్ నడుస్తుంది – కాబట్టి పనిలోకి వెంటనే వచ్చేశా. పడిదెంపాడు నుంచి వచ్చా: నాగరాజు, రైతు నేను పండించిన కూరగాయలను పడిదెంపాడు నుంచి తెచ్చా. నేను, నా భార్య ఉదయం నుంచి సాయంత్రం దాకా సీక్యాంప్ రైతుబజార్లో కూరగాయలు విక్రయించుకుని ఊరికి వెళుతుంటాం. మేం తెచ్చే కూరగాయలపై వచ్చే లాభం అంతంత మాత్రమే. హోటల్ భోజనం తినేంత స్థోమత ఉండదు. రోజూ మధ్యాహ్నం అవ్వ హోటల్‌కు వచ్చి తింటా. నా భార్యకు పార్సిల్ తీసుకెళతా. గోకులపాడు నుంచి వచ్చా: మద్దిలేటి, హమాలీ ఇక్కడ మండీబజార్‌లో హమాలీ పని చేయడానికి నేను ఎ.గోకులపాడు గ్రామం నుంచి వచ్చా. హమాలీ కార్మికుల ఒప్పందం ప్రకారం మాకు 24 గంటల షిఫ్ట్ ఉంటుంది. ఇరవైనాలుగు గంటల కాల వ్యవధిలో మూడుసార్లు తినాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజనం మాత్రం అవ్వ వద్ద తిని. మిగతా వేళల్లో టిఫిన్లతో గడుపుతుంటా. గొందిపర్ల నుంచి వచ్చా: రాజు, హమాలీ నేను హమాలీ పనిచేస్తుంటా. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే లారీల లోడ్ దింపడం, ఎక్కించడం నా పని. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి వస్తా. భోజనం తెచ్చుకుంటే చెడిపోద్ది. అవ్వ హోటల్ నాకు వరం. రూ.25 ఇచ్చి కడుపునిండా భోజనం చేస్తాను. ఇలాంటి హోటల్ లేకపోయింటే మా లాంటి పేదలు ఎనభై రూపాయలు చెల్లించుకోలేక పస్తులుండాల్సి వచ్చేది. -
విషాదం: పెళ్లి విందులో భోజనం తిని..
సాక్షి, శివమొగ్గ: పెళ్ళి విందులో భోజనం ఆరగించి పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ప్రాణాలు కోల్పోయారు. మృతుడు శివమొగ్గ తాలూకాలోని ఆరికెరె గ్రామా పంచాయతీకి చెందిన పిడిఓ దినేష్‌సింగ్ (42). ఈ నెల 17న అరదోట్లు గ్రామంలో ఒక పెళ్లిలో ఆయన భోజనం తిన్నారు. వెంటనే వాంతులు, విరేచనాలతో పాటు చలి జ్వరం వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విందులో ఆహారం తిన్న అనేకమందికి కూడ వాంతులు, విరేచనాలు అయ్యాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం) చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
విమానాల్లో మీల్స్‌కు అనుమతి
న్యూఢిల్లీ:విమానయాన సంస్థలు అన్ని దేశీ విమానాల్లో ప్రయాణికులకు మీల్స్ సర్వీసు అందించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. అలాగే, చదువుకునేందుకు మ్యాగజైన్లు మొదలైనవి కూడా అందించవచ్చని తెలిపింది. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో రెండు గంటల కన్నా తక్కువ ప్రయాణ సమయం ఉండే ఫ్లయిట్స్‌లో ప్రయాణికులకు భోజనాలు అందించడంపై ఏప్రిల్ 15 నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు
సాక్షి, తిరుమల: సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు. తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందువలనే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సాంప్రదాయ బద్ధంగా గోవు నుండి పాలు,నెయ్యి, వెన్నను సేకరించి స్వామి వారికి అందింస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వ దర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్
సాక్షి బళ్లారి (కర్ణాటక): రూపాయికే రెండు రొట్టెలు, దాల్, లేదా చిత్రాన్నం వివిధ రకాల ఫ్రైడ్ రైస్‌లతో కూడిన భోజనాన్ని అందించేందుకు జైన్ యువక మండలి ముందుకు వచ్చింది. తక్కువ ధరకే భోజనాన్ని శుక్రవారం నుంచి పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరంలోని జైన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జైన్ యువక మండలి పదాధికారులు భరత్‌జైన్, తదితరులు మాట్లాడుతూ ఓపీడీ ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, ప్రైవేట్, ప్రభుత్వ బస్టాండ్ల వద్దకు ఈ మొబైల్ వాహనం చేరుకొని పేదలకు రూ.1కే భోజనం అందిస్తుందని తెలిపారు. చదవండి: విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్ -
కరోనా రాకముందు 5 రూ... ఇప్పుడు ఫ్రీ!
-
ఆ సమయాలలో గ్రీన్‌టీ చాలా డేంజర్..
న్యూఢిల్లీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలిసిందే. కాగా వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్ ముప్పులను నివారించవచ్చని ఎన్నో అధ్యయాలు స్పష్టం చేశాయి. కాగా గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. కానీ గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకోవాలో కూడా చాలా ముఖ్యమని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సమయాలలో గ్రీన్ టీని తీసుకోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రి పడుకునే ముందు: మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా, అయితే గ్రీన్‌టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీని సేవిస్తే నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. గ్రీన్ టీలోకెఫిన్ ఉండడం వల్ల నిద్ర ప్రేరిపిత మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది. ఉదయాన్నె గ్రీన్ టీ విషయంలో జాగ్రత్త: ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీని సేవించడం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫినాల్స్ గ్యాస్ట్రిక్ యాసిడ్లను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఉదయాన టిఫిన్ చేశాక గ్రీన్‌టీని సేవించడం ఆరోగ్యకరం. గ్రీన్‌టీతో మందులు వేసుకుంటే అంతే.. ఏదయినా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కొందరు ఓ కప్పు గ్రీన్‌టీతో మందులు వేసుకుంటారు. కానీ అలా మందులు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం, మందులలో ఉండే కెమికల్స్ గ్రీన్ టీతో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు తలెత్తె అవకాశముంది. భోజన సమయంలో జాగ్రత్త: సాధారణంగా గ్రీన్ టీ సేవిస్తే జీర్ణకక్రియ సమస్యలకు ఎంతో ఉపయోగం. కానీ మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు -
వేశ్యావాటికలో అన్నం ముద్ద ..
ప్రభుత్వానికి తక్కువ పట్టే వాళ్లూ అసలు పట్టని వాళ్లూ ఉంటారు. అసలు పట్టని వాళ్లలో సెక్స్వర్కర్స్ ఉంటారు. దేశంలో అధికారికంగా 7 లక్షల మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. మెట్రో నగరాలలో రెడ్‌లైట్ ఏరియాలున్నాయి. ఈ లాక్డౌన్లో వీరికి అన్నం ఎవరు పెడుతున్నారు? రుచిరా గుప్తా ఒక జవాబు. సెక్స్ వర్కర్స్ కోసం ఈమె మొదలుపెట్టిన ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపు వీరి వాకిట కంచంలా మారింది. రుచిరా గుప్తా ఒక సీనియర్ జర్నలిస్ట్. ‘టెలిగ్రాఫ్’ (కోల్కటా)కు పని చేసేది. కాని వార్తలు రాయడం కంటే క్షేత్రంలో ఉండి పని చేయడమే ముఖ్యం అని భావించింది. తన వృత్తిలో భాగంగా ఆమె ముంబై, ఢిల్లీ, కోల్కటా వంటి మహా నగరాల్లో రెడ్‌లైట్ ఏరియాల్లో ఉన్న వేశ్యలను గమనించాక ఇంత వేదనాపూరిత జీవితాలలో ఉన్న స్త్రీల గురించి పని చేయకపోతే ఎలా అనుకుంది. ఉద్యోగం మానేసింది. ‘ఐక్యరాజ్యసమితి’లో చేరి నేపాల్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి అవసరమైన చట్టాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించింది. ఇండియా తిరిగి వచ్చి 2002లో ‘అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్’ సంస్థను స్థాపించి సెక్స్వర్కర్స్ కోసం పని చేయడం మొదలుపెట్టింది. భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఆమె తీసిన డాక్యుమెంటరీ ‘సెల్లింగ్ ఇన్నోసెంట్స్’ విశేషమైన గుర్తింపును పొందింది. ఆమె అనుభవాలను హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల అవగాహన కోసం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ పాఠాలుగా పెట్టాయి. రుచిరా చేస్తున్న కృషికి గాను ‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్’ వంటి సర్వోన్నత పురస్కారాలు దక్కాయి. ఆమె ఎడిట్ చేసిన ‘రివర్ ఆఫ్ ఫ్లెష్’ అనే సెక్స్‌వర్కర్ల కథల సంకలనం తప్పక పరిశీలించదగ్గది. ఒక్క ఫోన్ కాల్ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించాక రుచిరా గుప్తాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాలోని ఒక పన్నెండేళ్ల అమ్మాయి. ‘అమ్మా... ఏదైనా చేయి. ఆకలితో అలమటిస్తున్నాం’ అని ఆ పాప ఏడ్చింది. ఆ పాపను రుచిరా గుప్తా సంస్థ ఢిల్లీలోని ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. లాక్డౌన్ కారణాన స్కూల్ మూసేయడంతో తిరిగి వేశ్యావాటిక చేరింది. ఆ పాప ఫోన్ ద్వారా వేశ్యావాటికలోకి ఆకలి కేకలు రుచిరాకు అర్థమయ్యాయి. కరోనా వ్యాప్తి భయంతో రెడ్‌లైట్ ఏరియాలు మూతబడ్డాయి. విటుల రాక బొత్తిగా లేదు. వీరికి మరో ఉపాధి కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అందుకని రుచిరా రంగంలోకి దిగింది. ఆ క్షణంలోనే ఐదు వందల ఆహార పొట్లాలు పురమాయించి ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చేర్చింది. ఆ వార్త దావానలంలా దేశంలోని అన్ని రెడ్‌లైట్ ఏరియాలకు చేరాయి. అన్నింటి నుంచి రుచిరాకు ఫోన్లే ఫోన్లు. ‘అందరికీ అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం సాయం చేస్తోంది కాని అది సరిగ్గా అందడం లేదు’ అని అంది రుచిలా. వేశ్యలకు ఆహారం కోసం ఆమె ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వేశ్యావాటికల్లో రోజుకు పదిలక్షల ఆహారపొట్లాలు అందించడం లక్ష్యం. స్పందించిన గుండెలు రుచిరా గుప్తా పిలుపుకు అందరూ స్పందించారు. ఆమెకు సాయం చేసే చేతులు ముందుకు వచ్చాయి. బాస్మతి బియ్యం అమ్మకందారైన ‘ఇండియా గేట్’ సంస్థ ఒక లారీ బియ్యం పంపింది. మరెవరో డబ్బులు ఇచ్చారు. ఇంకొకరు సెక్స్ వర్కర్లకు అవసరమైన 50 వేల శానిటరీ ప్యాడ్స్‌ను పంపారు. ‘క్రమంగా మేము అన్నం పంచే బదులు డ్రై రేషన్ పంచడానికి షిఫ్ట్ అయ్యాం. ప్రతి సెక్స్ వర్కర్ కుటుంబానికి ముఖ్యమైన ఆహార వస్తువులు ఉన్న బ్యాగ్‌ను అందజేస్తున్నాం’ అంది రుచిరా. దీనమైన బతుకులు ‘లాక్డౌన్ తర్వాత దేశంలోని సెక్స్ వర్కర్లు ఎలా ఉన్నారో ఎవరికీ పట్టడం లేదు. వారు తమ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువునూ అమ్మి నాలుగు మెతుకులు తింటున్నారు. వారి ఇరుకు చిన్న గదుల్లో దాదాపు 10 మంది నివసిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా వ్యాప్తి సులభం. వీరి పిల్లల గురించి పట్టించుకునేవారే లేరు. తల్లులు కనుక ఈ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటే వీరు అనాథలు అవుతారు. కరోనా వల్ల దేశంలో మరో సంవత్సరం వరకూ పరిస్థితులు చక్కబడేలా లేవు. అంతవరకూ ఎలా సాయం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మా వాలెంటీర్లు యాభై కుటుంబాలకు రేషన్ తీసుకెళితే 200 మంది లైన్లలో నిలబడుతున్నారు. అయినప్పటికీ మేం చేయవలసిందంతా చేస్తున్నాం’ అంటుంది రుచిరా. ఆమె సంస్థ తాలూకు వెబ్సైట్ ‘అప్నే ఆప్ ఉమన్ వరల్డ్‌వైడ్’ (https://apneaap.org/) ని సంప్రదించి విరాళాలు ఇవ్వొచ్చు. మీరూ ఒక దీనురాలి ఆకలి తీర్చినవారవుతారు. – సాక్షి ఫ్యామిలీ -
వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు
-
వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు
కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతోపాటు పిండి వంటలతో అల్లుడికి మొహం మొత్తేలా చేస్తారు కొందరు అత్తా మామలు. ఈ క్రమంలోనే భోజనంలోకి పలు రకాల కూరలు, రకారకాల స్వీట్స్, పిండివంటలతో అరిటాకు వేసి మరీ వడ్డించేస్తారు. ఈ పద్దతి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అల్లుడు ఎప్పుడొచ్చినా వారికి ఇలా స్వాగతం పలుకుతారు అత్తింటివారు. ఆంధ్రాకు చెందిన ఓ అత్తగారు కూడా ఇటీవల పెళ్లైన తన కూతురు, ఆమె భర్త(అల్లుడు) కోసం తమ పద్దతిలో మర్యాద చేయాలనుకున్నారు. ఇంటికి వస్తున్న అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలు వండి 5 కోర్స్ మీల్స్ అరిటాకును సిద్దం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: అడవి గుండా 30 ఏళ్లుగా 15 మైళ్లు నడుస్తూ..) ఈ వీడియోను అనంత్ రూపనగుడి అనే ట్విటర్ యూజర్ గురువారం షేర్ చేశాడు. అందులో ప్రతి వంటకాన్ని చూపిస్తూ వివరించిన ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి నోట్లో నీళ్లూరాల్సిందే. ఈ 67 రకాల వంటకాల్లో చాట్స్, ఎన్నో రకాల భిన్నమైన స్వీట్స్, వెల్కం డ్రింక్, మెయిన్ కోర్స్, స్నాక్స్‌తో పాటు డిసెర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోకు ఇప్పటి వరకు 68 వేలకు పైగా వ్యూస్ రాగా, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘వెంటనే ఈ మీల్స్‌ను నాకు కూడా పంపించండి, ఒకవేళ అలా చేయకపోతే తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. -
అభాగ్యుల పాలిట అన్నదాత తులసీరామ్
పశ్చిమగోదావరి ,భీమవరం: కన్నబిడ్డలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులువి. అటువంటిది క్రమం తప్పకుండా ఏ ఆదరవు లేని వృద్ధులకు ప్రతి రోజు భోజనం పంపిస్తున్నారు. అదీ వృద్ధులున్నచోటకే క్యారేజీలు పంపించడం విశేషం. ఇలా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన మళ్ల తులసీరామ్(రాంబాబు). రైస్‌మిల్లర్‌గా, రొయ్యల రైతుగా తాను సంపాదించేదానిలో కొంతమొత్తాన్ని వృద్ధుల సేవకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు యండగండి గ్రామంలో వృద్ధులకు భోజనం పెడుతున్న వైనాన్ని తెలుసుకుని తాను స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాంబాబు చెప్పారు. వీరవాసరం గ్రామంలోని తులసీ కన్వెన్షన్ హాలులో భోజనం తయారు చేయించి ప్రతి రోజూ పంజావేమవరం, వీరవాసరం గ్రామంలోని వృద్ధులకు పంపిస్తున్నారు. బుధ, ఆదివారాల్లో గుడ్డు, చేప, చికెన్ వంటి మాంసాహారం కూడా పెడుతుండటం విశేషం. అంతేకాదు ఒక్కోసారి రాంబాబు స్వయంగా ఆహారం వండుతారు. 2019 నవంబర్‌లో కేవలం 30 క్యారేజీలతో ప్రారంభమైన భోజనం పంపిణీ ప్రస్తుతం 180కి చేరుకుంది. జీవితకాలం కొనసాగించాలన్నదేలక్ష్యం కుటుంబసభ్యుల సహకారంతో వృద్ధులకు, అనాథలకు ప్రతి రోజూ ఉచితంగా భోజనం పంపిస్తున్నాను. అనేకమంది దాతలు సహకరిస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. అయితే కిరణా, కూరగాయల వ్యాపారులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నందుకు సంతోషం. నా సంపాదనతోనే జీవితకాలం ఈ పథకాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాను. –మళ్ల తులసీరామ్(రాంబాబు),అన్నదాత, పంజా వేమవరం తృప్తిగా భోజనం చేస్తున్నాను వృద్ధాప్యంలో వంట చేసుకోలేని దుస్థితిలో ఉన్న నాకు ప్రతి రోజు క్యారేజీ రావడంతో తృష్తిగా భోజనం చేయగలుగుతున్నాను. వంటలు కూడా రుచికరంగా ఉండటంతో ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు. –వంకాయల మహాలక్ష్మి, వేమవరం రాంబాబు ఆశయం గొప్పది చిన్న వయస్సులోనే వృద్ధులకు భోజనం పంపించాలనే రాంబాబు ఆశయం పదిమందికి ఆదర్శం. రోజూ క్రమం తప్పకుండా వేడి వేడి పదార్థాలతో ఉదయం 10.30 గంటలకే భోజనం క్యారేజీ మా ఇంటి ముందు సిద్ధంగా ఉంటుంది. –పంజా రాఘవమ్మ -
లతిత అమ్మగారి భోజనం.. భళా
జూబ్లీహిల్స్: ఆహ్లాదకరమైన వాతావరణంతో రుచిరకరమైన భోజనాన్ని అందుబాటులో ఉంచిన ‘లలిత అమ్మ గారి భోజనం’ రెస్టారెంట్ నిర్వాహకులు అభినందనీయులని... నాణ్యత, శుభ్రతతో రుచికరమైన వంటకాలను అందించి భోజనప్రియుల ఆదరణ పొందాలని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్‌నం.12 లో లలిత అమ్మ గారి భోజనం పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సందీప్‌రాజ్, ప్రణయ్ మాట్లాడుతూ... 90 శాతం మంది మహిళా సిబ్బందితో ఈ హోటల్ నిర్వహిస్తున్నామన్నారు. రుచికరమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలు ఉన్నాయన్నారు. రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నహోంమంత్రి మహమూద్ అలీ -
ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు
న్యూఢిల్లీ: శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణీకులకు అందించే టీ, టిఫిన్, భోజనం ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మూడు రైళ్లలో మీల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి టికెట్ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. పెరిగిన కేటరింగ్ చార్జీలు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మూడు రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి. సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.70 నుంచి రూ.105కి. లంచ్, డిన్నర్ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి. -
భోజన కార్మికులకు తీపి కబురు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి వంట కార్మికులు పనిచేస్తున్నారు. గత ఐదేళ్లుగా వారికి సకాలంలో జీతాలు అందలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు మంజూరు చేయAకుండా టీడీపీ ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేసింది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సమయంలో చాలామంది మధ్యాహ్న భోజన కార్మికులు ఆయన్ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల ముందే ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే వారి గౌరవ వేతనం రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై మధ్యాహ్న భోజన కార్మికులు, యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో విద్యాశాఖ పరిధిలో 4,894 పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆ పాఠశాలల్లో 8,540 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 3,750 ప్రాథమిక పాఠశాలల్లో 1,32,222 మంది, 445 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 34,714 మంది, 699 హైస్కూళ్లల్లో 1,75,769 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పేదవిద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆ పథక నిర్వహణ కోసం ఆయా గ్రామాల్లో ఉండే పొదుపు సంఘాలకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్యను బట్టి వంట నిర్వాహకుల కార్మికులకు గౌరవవేతనాలిచ్చే వారు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటివరకు వంట కార్మికులకు జీతాలు పెంచలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వంట కార్మికులు, మధ్యాహ్నభోజన కార్మికుల సంఘాల నాయకులు జీతాలు పెంచాలని ఎన్నోసార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఒకానొక సందర్భంలో వారిపై గత పాలకులు లాఠీచార్జీలు సైతం చేసి తీవ్రంగా గాయపడేలా చేశారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వంట కార్మికులకు రూ.3వేలు గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో పుస్తెలు తాకట్టు పెట్టి.. ఐదేళ్ల కాలంలో మధ్యాహ్నభోజన కార్మికులు తమ పుస్తెలను తాకట్టు పెట్టి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి సమస్యలను పట్టించుకోలేదు. పుస్తెలు తాకట్టు పెట్టి ఆ పథకాన్ని కొనసాగించిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మికులకు అలాంటి పరిస్థితి రానీవ్వకుండా జూన్ నుంచి రూ.1000 నుంచి గౌరవవేతనాన్ని రూ.3వేలు ఇవ్వనున్నారు. సర్కారు బడులు సరికొత్త హంగులతో ప్రతి ప్రభుత్వ పాఠశాల సరికొత్త హంగులతో కనబడాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి సమీక్షలో చెప్పడంతో విద్యాశాఖాధికారులు పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. గత పాలనలో మౌలిక వసతులు శూన్యం గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చూపింది. అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి మరుగుదొడ్లు లేకపోవడం, డెస్కులు, విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్ టీచర్ల కొరత, తాగునీటి సౌకర్యం, అదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, మైదానాలు, క్రీడా వస్తువులు లేని పరిస్థితి. ప్రస్తుతం వాటిన్నింటిని ఏర్పాటు చేయడానికి జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు కసరత్తు చేపట్టారు. -
రెండు రోజుల తర్వాత భోంచేసిన లాలూ
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి లోనై.. భోజనం కూడా మానేశారు. రెండు రోజుల పాటు లాలూ ఆహారం తీసుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. ఇది ఇలానే కొనసాగితే.. ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం చేయాల్పిందిగా లాలూను కోరారు. చివరకు రెండు రోజుల తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం లాలూ భోజనం చేశారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘లాలూకు బీపీ, షూగర్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. అలాంటిది రోజుల తరబడి భోజనం చేయడం మానేస్తే.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. దాంతో ఆయనను కన్వీన్స్ చేసి భోం చేయాల్సిందిగా ఒప్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంద’ని తెలిపారు. పశుగ్రాస కుంభకోణం కేసులో భాగంగా లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమిగా ఏర్పడి.. ఎన్డీఏను ఎదుర్కొని ఘోర పరాజయాన్ని చవి చూశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 39 చోట్ల విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. -
ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఆర్జేడీ దక్కించుకోకపోవడంతో ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్ధాపానికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఆహారం తీసుకోవడం లేదని రాంచీలోని రిమ్స్‌లో లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన దినచర్య గాడితప్పిందని వారు తెలిపారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచిలాలూ ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని ఆయనను పర్యవేక్షించే వైద్యుడు ఉమేష్ ప్రసాద్ చెప్పారు. మందులు, ఇన్సులిన్ ఇచ్చేందుకు సహకరిస్తూ ఆయనను ఆహారం సవ్యంగా తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు.బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడి కూటమిగా ఎన్డీయేను ఎదుర్కోగా కాంగ్రెస్‌కు కేవలం ఒక స్ధానం దక్కగా, ఆర్జేడీ ఒక్క స్ధానంలోనూ గెలుపొందలేదు. రాష్ట్రంలోని 40 స్ధానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్ధానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చని లాలూకు ఆర్జేడీ నేతలు సర్ధిచెబుతున్నా ఆర్జేడీ చీఫ్ మాత్రం ఫలితాల షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
పెళ్లి భోజనాల వద్ద బిర్యానీ కోసం కొట్లాట
పశ్చిమగోదావరి, పెరవలి: శుభమా అని పెళ్ళి చేసుకుంటే భోజనాల దగ్గర జరిగిన చిన్న గొడవతో ఇరువర్గాలు కొట్టుకోవటంతో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకు పాతూరుకు చెందిన వధువు తరుఫు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చారు. పెళ్ళి తంతు ముగిసిన తరువాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో వరుడి తరుఫున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. -
శ్రీకాళహస్తిలో ఒక్క రూపాయికే భోజనం పథకం
-
పైలట్లకు ఎయిర్ ఇండియా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియా పైలట్లకు షాక్ ఇచ్చింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ నిర్ధేశించిన ఆహార పదార్ధాలనే ఆర్డర్ చేయాలని, స్పెషల్ మీల్స్‌ను ఆర్డర్ చేయడం కుదరదని పైలట్లకు స్పష్టం చేసింది. సంస్థ నిర్దేశించిన మీల్స్ షెడ్యూల్‌కు భిన్నంగా విమాన సిబ్బంది స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని..ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని పైలట్లకు పంపిన ఈమెయిల్ సందేశంలో ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ అమితాబ్ సింగ్ పేర్కొన్నారు. ఆరోగ్య కారణాలతో వైద్యుడి సిఫార్సుతో మాత్రమే సిబ్బంది స్పెషల్ మీల్స్‌ను ఆర్డర్ చేయవచ్చని వివరణ ఇచ్చారు. కాగా, పైలట్లు తమ కోసం బర్గర్లు, సూప్‌ల వంటి స్పెషల్ మీల్స్‌ను ఆర్డర్ చేసు్తన్నట్టు వెల్ల్లడైందని, ఇది సంస్థ ఆహార వ్యయాల్లో పెరుగుదలతో పాటు ఆహార నిర్వహణ వ్యవస్థను డిస్టబ్ చేస్తోందని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. -
వికటించిన పెళ్లి భోజనం
భైంసా (నిర్మల్): భైంసాలో సోమవారం రాత్రి పెళ్లి భోజనం వికటించి 500 మం దికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన వివాహ వేడుకకు హాజరయ్యారు. భోజనాలు చేసిన గంటలోపే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో భైంసాలోని ఏరియా ఆసుపత్రికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అర్ధరాత్రి 12.30 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 500కుపైగా పెళ్లికి హాజరైన వారు ఆసుపత్రి పడకల్లో కనిపించారు. ఆసుపత్రి ఆవరణ, అత్యవసర విభాగం, పురుషుల వార్డు, స్త్రీల వార్డు ఇలా ఎటుచూసినా అస్వస్థతకు లోనైన వారే కనిపించారు. ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు పిల్లలను ఉంచి వైద్య చికిత్స అందించారు. ఒక్కో కుటుంబంలో నలుగురు, ఐదుగురు అస్వస్థతకు లోనయ్యారు. భైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెల్లవారే వరకు వైద్య సేవలు అందించారు. ఉదయం వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివాహ భోజనంలోని పాయసంతోనే అస్వస్థతకు లోనైనట్లు పలువురు ఆరోపించారు. -
చివరి పాలు
అబూహురైరా (రజి) దైవప్రవక్త (సల్లం) సేవలో, జ్ఞానార్జనలో పూర్తిగా లీనమైపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. ఒక రోజయితే ఆయన తీవ్రమైన ఆకలితో విలవిల్లాడి పోయారు. దాంతో ఆయన.. దారిలో ఒకచోట నిల్చొని ఎవరైనా వచ్చి తనను ఇంటికి తీసికెళ్లి భోజనం పెట్టిస్తారేమోనని ఎదురు చూడసాగారు. కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) అటుగా వచ్చారు. దైవప్రవక్త (సల్లం) ఎంతో వాత్సల్యంతో ఆయన వైపు చూస్తూ ‘‘అబూహురైరా! పద నావెంట’’ అన్నారు. అబూహురైరా (రజి) వెంటనే ఆయన వెంట నడిచారు. దైవప్రవక్త ఆయన్ని తన ఇంటికి తీసికెళ్లారు. అక్కడ ఒక గిన్నెలో పాలు ఉండటం చూసి అబూహురైరా (రజి)తో ‘‘అబూహురైరా! మస్జిద్కు వెళ్లి సప్ఫా వారందరినీ పిలుచుకొనిరా’’ అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) వాళ్లందరినీ పిలిపించడం అబూహురైరా (రజి)కు నచ్చలేదు. ఓ గిన్నెడు పాలు అంతమందికి ఎలా సరిపోతాయి? అనుకున్నారు ఆయన. ‘‘ఏమైనా దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ కదా!’’ అని భావిస్తూ వెళ్లి వారందరినీ పిలుచుకు వచ్చారాయన. దైవప్రవక్త (స) అందరూ వచ్చి కూర్చున్న తరువాత ‘‘అబూహురైరా! ఈ పాలగిన్నె తీసుకొని వీరందరికీ పాలు తాగించు’’ అని అన్నారు. అబూహురైరా (రజి) పాలగిన్నె తీసుకొని ఒకరి తర్వాత ఒకరు చొప్పున అందరికీ పాలు తాగించారు. అయినా గిన్నెలో పాలు ఏమాత్రం తగ్గలేదు. తరువాత ఆయన పాలగిన్నెను దైవప్రవక్త (సల్లం) ముందు పెట్టారు. ‘‘సరే, ఇప్పుడు నువ్వు తాగు ఈ పాలను’’ అన్నారు దైవప్రవక్త (సల్లం). ఆకలితో నకనకలాడుతున్న అబూహురైరా (రజి) వెంటనే పాలగిన్నె తీసుకొని గటగటా పాలుతాగి దాన్ని కింద పెట్టేశారు. దైవప్రవక్త (సల్లం) ఇంకా తాగమన్నారు. అబూహురైరా (రజి) మరొకసారి గిన్నె పైకెత్తి పాలుతాగారు. దైవప్రవక్త (సల్లం) ఇంకా తాగు, ఇంకా తాగు అన్నారు. అబూహురైరా (రజి) ఆవిధంగా కడుపునిండా తాగి ‘‘ఇప్పుడిక నా కడుపులో ఏమాత్రం అవకాశం లేదు’’ అని అన్నారు. గిన్నెలో పాలు ఇంకా మిగిలివున్నాయి. అందరికంటే చివర్లో దైవప్రవక్త (సల్లం) ఆ పాలను తాగారు. – ముహమ్మద్ ముజాహిద్ -
సమోసా, టీ, దిల్పసంద్..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తోంది. పదోతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో అభ్యాసనకు ఎక్కువ సమయం కేటాయించేలా సంక్షేమ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ అదనంగా స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాన్ని ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నారు. విద్యార్థులకు రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలకు ఇస్తుండటంతో 9 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తారు. టెన్త్ విద్యార్థులకు అదనం.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం అదనంగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మరోసారి ఇవ్వనున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే టెన్త్ విద్యార్థులకు సమోసా, దిల్పసంద్, టీ, పండ్లు తదితరాలు రోజుకో రకం చొప్పున ఇవ్వనుంది. ఇలా పరీక్షలు ముగిసే వరకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బడ్జెట్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ. 15 చొప్పున వంద రోజుల పాటు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 715 సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో పదో తరగతి చదువుతున్న వారు 22 వేలకుపైగా ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండ్రోజుల నుంచి కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. విద్యార్థులు కూడా ఉత్సాహంతో స్టడీ అవర్స్‌లో కొనసాగుతున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. త్వరలో ఎస్టీ, బీసీ హాస్టళ్లలోనూ.. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రత్యేక మెనూను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలో కూడా అమలు చేసేందుకు ఆయా శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. అత్యుత్తమ ఫలితాల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
‘అన్న’న్నా..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రూపాయికే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదల కడుపు నింపిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.. అన్నార్తుల ఆకలిని పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. నాణ్యత లోపం, నానాటికీ పడిపోతున్న పరిమాణం, రుచి లేమి తదితర లోపాలు కనిపిస్తుండడంతో అన్న క్యాంటీన్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా క్యాంటీన్లలో తొలి రోజుల్లో ఉన్న నాణ్యత ఇప్పుడు ఉండటం లేదు. రుచికరమైన భోజనం పెట్టడం లేదు. పెట్టాల్సిన అన్నంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. దీంతో భోజనం కోసం వచ్చిన వారందరూ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజుల్లో సన్నబియ్యం.. ఇప్పుడు కోటా బియ్యం ‘‘అన్న క్యాంటీన్లు ఆరంభించిన తొలి రోజుల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టేవారు. సాంబారు, కూర కూడా రుచిగా ఉండేవి. కానీ కొన్ని రోజులుగా పరిస్థితి మారింది. సన్నబియ్యం పెట్టడం లేదు. కోటా బియ్యం మాత్రమే వండి వార్చి పెడుతున్నారు. ఇక, సాంబారు నీళ్లను తలపిస్తోంది. కూర ఏమాత్రం రుచిగా ఉండటం లేదు’’ అని అన్న క్యాంటీన్లకు నిత్యం వస్తున్నవారు విమర్శిస్తున్నారు. గతంలో మెనూ చార్ట్ ఉండేదని, ఇప్పుడా చార్ట్ కూడా తీసేశారని అంటున్నారు. ఎందుకు తీసేశారని సిబ్బందిని అడిగితే పైవాళ్లు తీసేయమన్నారంటున్నారని చెబుతున్నారు. లోపమెక్కడో! గతంలో 6 బౌల్స్ అన్నం, రెండు బౌల్స్ సాంబారు, ఒక బౌల్ పూర్తిగా కూర ఇచ్చేవారు. క్యాంటీన్లలో తింటున్నవారి సంఖ్య పెరగడంతో అన్నాన్ని ఆరు నుంచి తొమ్మిది బౌల్స్‌కు పెంచారు. సాంబారు యథాతథంగానే రెండు బౌల్స్ ఇస్తున్నారు. కూర సగానికి పైబడి ఉన్న రెండు బౌల్స్‌తో అందిస్తున్నారు. ఇప్పుడిదే సమస్యగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. గతంలో పెద్ద బౌల్స్‌లో వచ్చేవని, ఇప్పుడా బౌల్స్ సైజు కూడా తగ్గిపోయిందని, భోజనం రుచి కూడా తగ్గిపోయిందని సాక్షాత్తూ సిబ్బందే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భోజనం సరఫరా చేస్తున్న ‘అక్షయపాత్ర’ సంస్థ నుంచే ఆవిధంగా వస్తోందని సిబ్బంది అంటున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ప్రచారం కోసం అన్న క్యాంటీన్లను భారీగా ఏర్పాటు చేసినా ఆ తర్వాత ప్రభుత్వం వీటి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు సన్నబియ్యం పెడితే ఇప్పుడా బియ్యం నాసిరకంగా ఉండడానికి ప్రభుత్వమే కారణమని పలువురు చెబుతున్నారు. సాధారణంగా భోజనం పెట్టేటప్పుడు ముందుగా సంబంధిత పర్యవేక్షకులు రుచి చూసి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడా పరిస్థితి కనిపించడం లేదు. తమకొచ్చిన భోజనం రుచికరమైనదా, కాదా అనేది చూడకుండా ప్రజలకు నేరుగా పెట్టేస్తున్నారు. అది నాణ్యతగా లేకపోవడంతో తింటున్న వారందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఒక్కో క్యాంటీన్లో ఎనిమిది మంది చొప్పున పని చేస్తున్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. జీతాల్లేని వారు ఏ మేరకు బాధ్యతగా పని చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం చేసినా సిబ్బందిని ప్రశ్నించే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు. మొదట్లో బావుండేది అన్న క్యాంటీన్ పెట్టిన మొదట్లో భోజనం బావుండేది. అన్నం నిర్దేశిత పరిమాణంలో పెట్టేవారు. ఆకలి కూడా తీరేది. భోజనం రుచికరంగా ఉండటంతో తింటే సంతృప్తిగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో వచ్చి భోజనం చేస్తున్నాం. లోపాలను అధికారులు చక్కదిద్దాలి– విజయ్, విద్యార్థి అన్నం బాగోలేదు గతంలో సన్నబియ్యం పెట్టేవారు. ఇప్పుడు స్టోర్ బియ్యం పెడుతున్నట్టుగా ఉంది. ఏమాత్రం బాగోవడం లేదు. సాంబారు, కూర కనీసంగా కూడా రుచిగా ఉండడం లేదు. పెట్టిన అన్నంలో కూడా 70 నుంచి 90 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. ఆకలి తీరడం లేదు. క్యాంటీన్లో కనీసం మెనూ చార్ట్ కూడా ఉంచడం లేదు. అంతా ప్రచారార్భాటంగానే ఉంది.– అల్లు సతీష్ రుచిగా లేదు అన్నమే కాదు.. సాంబారు, కూర కూడా రుచిగా ఉండడం లేదు. వారేది పెడితే అది తింటున్నాం. లోపాలపై అడిగితే పట్టించుకోవడం లేదు. సాంబారైతే నీళ్ల మాదిరిగానే ఉంటోంది. మొదట్లో అన్నం బాగుండేది. ఇప్పుడది కూడా బాగుండటం లేదు.– వీరబాబు, కాకినాడ నా దృష్టికి రాలేదు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాను. భోజనం రుచికరంగానే ఉంటోంది. పరిమాణం తక్కువ పెడుతున్నట్టు నా దృష్టికి రాలేదు. అయినప్పటికీ ‘అక్షయపాత్ర’ దృష్టికి తీసుకెళ్తున్నా. లోపాల్లేకుండా చూసుకుంటాను. – ఉమామహేశ్వరి, నోడల్ ఆఫీసర్ -
దేవునికి ఇష్టమైన కార్యం
ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. చాలా ధనం ఉండటం వల్ల వేరే ఆలోచన లేక తింటూ, తాగుతూ సుఖాన్ని అనుభవిస్తుండేవాడు. ఆ ధనవంతుడి ఇంటి బయటనే లాజరు అనే ఒక బీదవాడు ఆకలికి అలమటిస్తూ ధనవంతుడు ఏమన్నా ఇస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడు భోజనం చేశాక తన పెదవులను రొట్టె ముక్కలతో తుడిచి వాటిని బయట పడవేస్తే ఆ రొట్టె ముక్కలతో కడుపు నింపుకునేవాడు లాజరు. కొంత కాలానికి ధనవంతుడు చనిపోయాడు. శరీరం ఇక్కడే ఉంది, ధనవంతుడు కదా! అంతిమ సంస్కారాలు బాగానే జరిగాయి. జనం కూడా బాగానే వచ్చారు. కానీ అతడు మాత్రం నరకంలో కళ్లు తెరిచాడు. అతని ధనం అతనికి సంతోషాన్ని ఇచ్చే స్థలాన్ని మాత్రం ఇవ్వలేదు. ఆ తరువాత బీదవాడైన లాజరు కూడా మరణించాడు. అతడు సంతోష కరమయిన స్థలంలో కళ్లు తెరిచాడు. ధనవంతుడు ధనవంతుడు కావడం వలన వేదనకరమయిన స్థలంలోనికి, లాజరు బీదవాడు కావడం వలన సంతోషకరమయిన స్థలం లోనికి వెళ్లలేదు. ప్రాణంతో ఉన్నప్పుడు తాము బతికిన దానిని బట్టి ఆ స్థలాలలోకి వెళ్లారని అర్ధమవుతుంది. తనకు ఆస్తి, ధనం ఉన్నప్పుడు ధనవంతుడు తన పక్కనే ఉన్న లాజరును పట్టించుకోలేదు. తన వరకు తాను తిని, తాగి సంతోషపడ్డాడు. దేవుడు ఒకరిని ధనవంతుడిగా లేదా బీదవాడిగా పుట్టించాడంటే ఎక్కడ పుట్టామో అక్కడ మనం మన భక్తిని కాపాడుకోవాలని! పక్కన ఒకరు ఆకలితో అలమటిస్తుంటే మనం అతడిని పట్టించుకోకుండా బతుకుతుంటే మనలను దేవుడు మెచ్చుకుంటాడా? బీదవాడు ధనవంతుడిని నిందించకుండా తన స్థితిని నిందించుకోకుండా తానున్న స్థితిలోనే భక్తిని కాపాడుకోవాలని లాజరు ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. వేదన కరమయిన స్థలంలో ఉన్న ధనవంతుడు తన దాహాన్ని తీర్చమని.. లాజరుని పంపమని.. అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము ‘‘నా కుమారుడా భూమి మీద నీవు నీకిష్టమయినట్టు బ్రతికావు’’ అని అంటున్నాడు అంటే భూమి మీద మన బతుకుని బట్టి మనకు స్థలం నిర్ణయించబడుతుందని అర్థమవుతుంది కదా. అందుకే. మన తోటి సహోదరునికి సాయం చేయాలి, సహోదరుడిని ప్రేమించాలి. అదే దేవుడికి ఇష్టమయిన కార్యం. -
నిత్య జీవితంలో భక్తిసాధన
‘తిరువళ్లువార్’ మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని అల్లుకొచ్చేవాడు. వారంలో ఒకరోజును పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నెనిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటినిగాని, సూదినిగాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకికి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి ‘నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’ అనడిగింది భర్తను. సరేనన్నాడు తిరువళ్లువార్. ‘‘మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరెప్పుడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది’’ అని అడిగింది. తిరువళ్లువార్ చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కిందపడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం. నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు’’అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో చేస్తే ఇంతకంటే భక్తి సాధన వేరొకటి లేదు. – డి.వి.ఆర్. -
సోలాంగ్
నైట్ డ్యూటీలో ఉన్నాడు సోలాంగ్. రాత్రి పదకొండు అవుతుండగా తన ఫ్లోర్‌లోంచి పైఫ్లోర్లోని ఆఫీస్ డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. దేనికైనా అందరూ ఒకేసారి వెళ్లిరావాలనే ‘హాఫేనవర్ బ్రేక్’లు ఉండే ఆఫీస్ కాదది. ‘ఎప్పుడెలా చస్తారో మీ ఇష్టం. ఇన్ టైమ్‌లో వర్క్ ఫినిష్ అయితే చాలు..’ అన్నట్లుంటాయి అక్కడి రూల్స్ అన్నీ.నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు రోజూ అదే టైమ్‌కి భోజనానికి లేస్తాడు సోలాంగ్. అప్పటికైనా ఆకలి కొరికేస్తోందని అతడు లేవడు. ఇంటి నుంచి ఏవో రెండు గిన్నెలు తెచ్చుకుంటాడు. అవి ఖాళీ చేయడం కోసం లేస్తాడు. ఆ గిన్నెలు కూడా అతడు పెట్టించుకుని తెచ్చుకున్నవి కావు. భార్య పెట్టిస్తే తెచ్చుకున్నవి. ఆ గిన్నెల్లో ఏం పెట్టావని అతడెప్పుడూ ఆఫీస్‌కు బయల్దేరే ముందు గానీ, ఆఫీస్‌కి వచ్చాక గానీ భార్యను అడగలేదు. కొత్తల్లో ఒకసారి అతడు అడక్కుండానే భార్యే చెప్పింది.. పై గిన్నెలో మీకిష్టమైన బంగాళదుంప వేపుడు, చల్ల మిరపకాయలు ఉన్నాయని. ఆమె అలా చెప్పినప్పుడు.. అతడన్నమాట.. ‘ఏదైతేనేం.. నోట్లోనే ఉండిపోయేదా! కడుపులోకి వెళ్లేదే కదా’ అని! ఆ లాజిక్ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు నుంచీ గిన్నెల్లో ఏం పెట్టిందీ చెప్పడం మానేసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఏదో ఒకటి తినడం తప్ప, ఏదైనా ఒకటి తినాలని తన భర్తకు ప్రత్యేకంగా ఏమీ ఉండదని. అలాగని అతడికి ఇష్టమైనవి చేసి గిన్నెల్లో సర్దడం మానలేదు ఆమె. తనకు ఇష్టమైనవి ఇష్టంగా తింటున్నానన్న స్పృహైతే లేకుండా అతడు తినేసేవాడే కానీ, ఆమె మాత్రం పూర్తి స్పృహతో అతడు ఏవైతే ఇష్టంగా తింటాడో అవి మాత్రమే చేసి గిన్నెల్లో పెట్టేది. క్యారియర్ తెరిచాడు సోలాంగ్. పెద్ద కంపెనీకి తగినంత పెద్ద డైనింగ్ హాల్ అది. ఓ యాభై వరకు టేబుల్స్ ఉంటాయి. సోలాంగ్ వెళ్లేటప్పటికి అవన్నీ ఖాళీగా ఉన్నాయి. సోలాంగ్ ఆ టైమ్‌కే డైనింగ్ హాల్‌కి రావడానికి అదొక కారణం. ఎవరూ ఉండరు. తనొక్కడే ఉంటాడు. ఒక్కడే కూర్చొని తింటూ ఆలోచనల్లో పడిపోవడం అతడి అలవాటు. ఆలోచనల మధ్య తింటుంటాడు తప్ప, తింటూ మధ్య మధ్య ఆలోచించడు. ఇంట్లో కూడా అంతే. ఎదురుగా భార్య కూర్చొని ఉన్నా.. తన ఆలోచనల్ని తను తింటుంటాడు. ఆమెతో మాట్లాడడు. కొంచెం పెట్టమనీ, ఇంక చాలనీ అనడు. భర్త ఏం తిన్నాక ఏం తింటాడో, ఏది ఎంత తింటాడో పెళ్లయిన ఆ మూడేళ్లలోనూ పెద్ద పీహెచ్‌డీనే చేసింది ఆమె. డైనింగ్ హాల్లో ఒక్కడే తింటున్నాడు సోలాంగ్. అతడు తింటుంటే.. ఎప్పటిలాగే అతడిని ఆలోచనలు కొరుక్కుతింటున్నాయి. సోలాంగ్ ఎప్పుడూ ముగ్గురి గురించి ఆలోచిస్తుంటాడు. దేవుడు.. దెయ్యం.. మనిషి!ఈ ముగ్గురి మధ్య ఉండే సంబంధమే అతడి నిరంతర ఆలోచన. సోలాంగ్ తింటూ ఉంటే.. (ఆలోచిస్తూ ఉంటే).. డైనింగ్ హాల్లోకి ఎప్పుడొచ్చాడో గానీ ఓ వ్యక్తి నేరుగా సోలాంగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ‘‘నేనూ మీతో కలిసి కూర్చోవచ్చా?’’ అన్నాడు తన క్యారియర్‌ను బయటికి తీస్తూ. సోలాంగ్ అతడివైపు మౌనంగా చూశాడు. ‘‘ఒక్కణ్ణే తినడం నాకు అలవాటు లేదు’’ అన్నాడు ఆ వచ్చిన అతను. ‘‘కానీ నాది ఐపోవచ్చింది. మధ్యలోనే లేచి వెళ్తాను’’ అన్నాడు సోలాంగ్. ఎలాగైనా అతడిని అక్కడ కూర్చోనివ్వకపోవడం సోలాంగ్ ఉద్దేశం. అతడు నవ్వాడు. ‘‘రెండు క్షణాల్లో తినేస్తాను. బహుశా మీకంటే ముందే తినేస్తానేమో కూడా’’ అన్నాడు. అతడి డబ్బాలవైపు చూశాడు సోలాంగ్. అవి రెండు క్షణాల్లో అయిపోయేలా లేవు.. అతడు దెయ్యమో, దేవుడో అయితే తప్ప! అదే మాట అన్నాడు కూడా.ఆ మాటకు పెద్దగా నవ్వాడు అతను. ‘‘రండి. కూర్చోండి’’ అన్నాడు సోలాంగ్. అతడి జీవితంలో ఒక వ్యక్తిని అలా తన టేబుల్ మీదకు ఇన్వైట్ చెయ్యడం అదే మొదటిసారి.‘‘మిమ్మల్ని ఆఫీస్‌లో చాలాసార్లు చూశాను. ఎప్పుడూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తుంటారు కదా’’ అన్నాడు అతను. సోలాంగ్ నవ్వాడు. ఆ ‘సుదీర్ఘత’నే ఇంగ్లిష్‌లోకి అనువదించి అతడికి ఆఫీస్‌లో అంతా సోలాంగ్ అనే పేరు పెట్టారని కూడా ఆ వచ్చినతనికి తెలుసు. అయితే ఆ మాట పైకి అనలేదు. ‘‘నా పేరు విశిష్ట’’ అన్నాడు.. తన గిన్నెలు ఓపెన్ చేస్తూ. ‘అవునా’ అన్నట్లు చూశాడు సోలాంగ్. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్లిద్దరి టాపిక్.. దెయ్యాల మీదకు, దేవుడి మీదకు మళ్లింది! ‘‘నాకు ఈ దెయ్యాల మీద, దేవుళ్ల మీద, మనుషుల మీద నమ్మకం లేదు’’ అన్నాడు విశిష్ట. పెద్దగా నవ్వాడు సోలాంగ్. ‘‘కనీసం మీ మీదైనా మీకు నమ్మకం ఉండాలి కదా’’ అన్నాడు. ‘‘మీరన్నది నాకు అర్థమయింది. మీ ఎదురుగా ఉన్న నేను.. దెయ్యమో, దేవుడో, మనిషో కాకుండా ఇంకొకరు అవడానికి అవకాశమే లేనప్పుడు.. ఈ ముగ్గురిలో నేను ఎవరో.. ఆ ఎవరినోనైనా నేనునమ్మకపోవడం ఎలా సాధ్యమౌతుందనే కదా మీరు అనడం’’ అన్నాడు విశిష్ట. ‘అంతే కదా’ అన్నట్లు చూశాడు సోలాంగ్.‘‘కానీ సుధీర్.. ‘నాకు నమ్మకం లేదు’ అని నేను అన్నది ఆ ముగ్గురి ఉనికి గురించి కాదు. ఆ ముగ్గురినీ నేను విశ్వసించను అని’’ అన్నాడు విశిష్ట. అదిరిపడ్డాడు సోలాంగ్. అయితే ఆ అదురుపాటును దాచుకుంటూ.. ‘‘నా పేరు మీకెలా తెలుసు?’’ అన్నాడు. ‘‘మీ పేరు అదే అయినప్పుడు.. ఆ పేరేగా నాకు తెలుస్తుంది’’ అన్నాడు విశిష్ట. సోలాంగ్కి చాలా సంతోషం వేసింది. విశిష్ట తనకు ఆప్తుడిలా అనిపించాడు. తనని అతడు తనలాగే గుర్తించాడు. తన ‘సుదీర్ఘత’కు ఎలాంటి గుర్తింపునూ ఇవ్వకుండా. ఇద్దరి భోజనాలు పూర్తయ్యాయి. టాపిక్ మాత్రం పూర్తి కాలేదు. అది పూర్తయ్యేలా లేదనిపించి.. ‘‘ఇక నేను వెళ్తాను’’ అని పైకి లేచాడు విశిష్ట. సోలాంగ్ లేవలేదు.విశిష్ట లేచి, ఆ డైనింగ్ హాల్లోనే ఓ మూల.. మలుపులో ఉన్న సింక్ దగ్గరికి వెళ్లి గిన్నెల్ని కడుక్కుని, వాటిని మళ్లీ టేబుల్ దగ్గరకు తెచ్చి, టేబుల్ మీద ఉన్న లంచ్ బ్యాగ్‌లో సర్దుకుని కింది ఫ్లోర్‌లోకి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి ‘బై’అన్నట్లు సోలాంగ్ వైపు చెయ్యి ఊపాడు. సోలాంగ్ కూడా చెయ్యి ఊపాడు. సోలాంగ్కి, తిన్న తర్వాత గిన్నెలు కడిగే అలవాటు లేదు. వాటిని అలాగే లంచ్ బ్యాగ్‌లో పెట్టేస్తాడు. చేతులు కడుక్కోవడం తప్పదు కాబట్టి.. వాటిని మాత్రం కడుక్కుంటాడు. విశిష్ట వెళ్లిపోయాక కూడా, కొద్దిసేపు అలాగే కూర్చొని.. చేతులు ఎండిపోతున్నట్లుంటే అప్పుడు లేచి, సింక్ వైపు నడిచాడు సోలాంగ్. సింక్‌లో నీళ్ల చప్పుడు అవుతోంది! ట్యాప్‌ను సరిగా కట్టేయకుండా వెళ్లాడేమో విశిష్ట.. అనుకున్నాడు.మరో నాలుగడుగులు వేసి, మలుపు తిరిగి, సింక్ ఉన్న రూమ్‌లోకి వెళ్లాడు.నిజమే. లోపల ట్యాప్‌లోంచి నీళ్లు పడుతున్నాయి. అయితే అవి విశిష్ట తిప్పేసి వెళ్లడం వల్ల పడుతున్న నీళ్లు కాదు. ట్యాప్ తిప్పి విశిష్ట చేతులు కడుక్కుంటున్నప్పుడు పడుతున్న నీళ్లు!గుండె చిక్కబట్టుకుని ఒక్కసారిగా అక్కణ్ణుంచి డైనింగ్ హాల్ బయటికి పరుగులు తీశాడు సోలాంగ్. ఆ తర్వాతెప్పుడూ అతడు ఆఫీస్ డైనింగ్ హాల్లో ఒక్కడే కూర్చొని తినలేదు. - మాధవ్ శింగరాజు -
పాములతో సావాసం..బల్లులతో భోజనం!
పాములు, కొండచిలువలు, బల్లులు, తేళ్లు.. వీటిని చూడగానే ఏమనిపిస్తుంది.. ఫస్ట్ భయం వేస్తుంది. కొందరికైతే వాటిని పుస్తకాల్లో బొమ్మలు చూడాలన్నా భయం, అసహ్యం అనిపిస్తుంది. మరి వాటితో కలసి భోజనం చేయాలంటే.. యాక్.. వామ్మో వాటిని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది భోజనం ఏంటి.. అసలు అన్నం తినకుండానైనా ఉంటాం కానీ.. అలాంటి తిక్క పనులు చేయమంటారా..? మీలాంటి వారి కోసం కాకుండా అవంటే ఇష్టం.. ప్రేమ ఉండే వారికోసం కంబోడియాలో ఓ రెస్టారెంట్ ఉంది. భోజనం చేయాలంటే అక్కడ ఉన్న కొండచిలువలు, పాములు, తేళ్లు వంటి సరీసృపాలతో కలసి కూర్చునే ధైర్యం కూడా కావాలి. ఎంచక్కా కొండచిలువను మెడలో వేసుకుని, టేబుల్‌పై పెట్టుకుని మన ఆర్డర్ ఆరగించొచ్చు. ప్రాణహాని ఉంటుందన్న భయం లేకుండా హోటల్ యజమానులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ రెస్టారెంట్ లోపల గాజు అద్దాల డబ్బాల్లో వీటిని పెట్టారు. అవంటే భయం ఉన్నవారు దూరం నుంచే వాటిని చూసుకుంటూ తినేయొచ్చు. మరీ ఇలాంటి రెస్టారెంట్లు అవసరమా అని ప్రశ్నిస్తే.. ఈ ప్రాణులను జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... అవి కూడా మంచివే.. ఊరికే ఎవరికీ హాని తలపెట్టవని చెప్పేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశామని అంటున్నారు హోటల్ యజమానులు. -
అయ్యా.. మీరే గొప్ప!
అనగనగా ఓ జ్ఞాని. ఆయన రోజూ ఎవరికో ఒకరికి అన్నం పెట్టి గానీ తాను భుజించడు. దానిని ఓ నియమంగా చేసుకుని చాలా కాలంగా కొనసాగిస్తూ వచ్చాడు. ఓరోజు ఒక్క అతిథీ రాలేదు. వీధి అరుగుమీద కూర్చుని చాలాసేపు నిరీక్షించాడు. దేవుడా, ఈరోజు ఎవరూ రాలేదు. ఏం చేయను.. ఒక్కడినే భుజించి నియమం తప్పాలా.. లేక ఉపవాసం ఉండనా.. అనుకుంటాడు.అయినా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అన్నం పెట్టి ఆ తర్వాత తాను తినాలనుకున్నాడు. అందుకని వీధిలోకి వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఇంతలో ఎదురుగా ఓ వ్యక్తి రావడం చూశాడు. జ్ఞానిలో పట్టరాని ఆనందం కలిగింది. అమ్మయ్య ఎవరో ఒకరు కనిపించారు చాల్లే అనుకున్నాడు మనసులో. అతనిని తన ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు. అతను వచ్చాడు. అయితే ఆ వ్యక్తి పక్కా నాస్తికుడు. ఆ విషయం జ్ఞానికి తెలీదు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. జ్ఞాని అతనికి వడ్డిస్తూ దేవుడి గురించి స్మరించాడు. ఆ తర్వాత అతనిని దేవుడిని స్తుతించమన్నాడు. అయితే అతను తనకిలాంటి మూర్ఖత్వం పట్ల నమ్మకం లేదన్నాడు. ‘‘ఏంటీ అన్నం తినడానికి ముందు దేవుడిని స్తుతించడం మూర్ఖత్వమా’’ అడిగాడు జ్ఞాని.‘‘అసలు దైవారాధనే మూర్ఖత్వం’’ అన్నాడు నాస్తికుడు.ఇలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. పైగా అతనన్నాడు...‘‘అన్నం పెడుతున్నది మీరు. కావాలంటే మీ గురించి ప్రార్థించమంటే ఎంతయినా ప్రార్థిస్తాను. అంతే తప్ప కనిపించని దేవుడి గురించి ప్రార్థించడం వొట్టి మూర్ఖత్వం‘‘ అని గట్టిగా చెప్పాడు. దాంతో వారి మధ్య వాదనలు మరింత పెరిగాయి.‘‘నాస్తికుడికి నేను అన్నం పెట్టను, పో‘‘ అన్నాడు జ్ఞాని.అప్పుడు అతను ‘‘నేనా వచ్చాను. మీరు రమ్మంటే వచ్చాను... మీరేదో అన్నం పెడుతున్నారు కదాని నా అభిప్రాయాన్ని మార్చుకోలేను’’ అని వెళ్ళిపోయాడు.అనంతరం జ్ఞాని నీరసించి పడుకుండిపోయాడు.అప్పుడు ఆయనకు కలలో కృష్ణుడు కనిపించాడు.‘‘నాయనా, అతనికి నా మీద నమ్మకం లేకపోవచ్చు. అది అతని ఇష్టం. అయినా నేను అతనిని ఏమీ అనలేదు. కానీ నువ్వు నీ అంతట నీవే అతనిని భోజనానికి రమ్మనమని చెప్పి ఇలా గొడవ పెట్టి పంపడం ఏమన్నా బాగుందా? నిన్ను నమ్మి అతనిని నీ దగ్గరకు పంపాను భోజనానికి. కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వతనిని పంపించేయడంతో నేనిప్పుడు అతనికి మరొక చోట అన్నం లభించే ఏర్పాటు చేయాలి.. ఏం చేయనూ.. చేస్తాను’’ అన్నాడు. ఈ కలతో జ్ఞాని నిద్ర లేచి వీధిలోకి పరుగులు తీశాడు. అతను ఓ చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు. అతనిని భోజనానికి రమ్మనమని చెప్పాడు.అయితే అతను ‘‘నేను భగవంతుడిని వ్యతిరేకించే వాడిని. మీరు నన్ను పొమ్మనడం న్యాయమే. అందులో మీ తప్పేమీ లేదు. ఇప్పుడు మళ్లీ మీరొచ్చి నన్ను రమ్మంటున్నారేంటీ.. ఇంతలో ఏమైంది‘‘ అని అడిగాడు ఆ నాస్తికుడు.జ్ఞాని ఏం చెప్తాడు.. తనకు కలలో వచ్చిన కృష్ణుడి గురించి చెప్పాలా... చెప్తే అతను వింటాడా.. మళ్లీ గొడవకు దిగడూ.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్న ఆ జ్ఞాని.. తన జ్ఞానం, చదువుసంధ్యలు అన్నీనూమూట కట్టి పక్కన పెట్టి అతనితో ఇలా అన్నాడు –‘‘అయ్యా, మేము ఆస్తికులం. దేవుడు ఉన్నాడు అనడానికి మాకు ప్రత్యేకించి ధైర్యం అక్కర్లేదు. కానీ దేవుడు లేడని చెప్పడానికే అసాధారణమైన ధైర్యం ఉండాలి. మనసు గట్టి చేసుకోవాలి. అంతేకాదు, వైరాగ్యమూ ఉండాలి. ఆ విధంగా చూస్తే మీరే నాకంటే దృఢమైనవారు. నా కంటే ఉన్నతులు. మీకు అన్నం పెట్టడం నాకు గొప్పే’’ అన్నాడు జ్ఞాని. దాంతో అతను సరేనని జ్ఞాని వెంట అతనింటికి వెళ్లి భోజనం చేశాడు. అక్కడే విశ్రాంతి కూడా తీసుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
రూ.10 కే గ్రీవెన్స్ మీల్స్
సీతంపేట : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ చొరవతో ప్రతి సోమవారం గిరిజన దర్బార్‌కు వచ్చే గిరిజనులకు రూ.10కే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. సుదూర ప్రాంతాలు, కొండలపై నుంచి గ్రీవెన్స్‌కు రానున్న గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీనిలో భాగంగా ఐటీడీఏ పీఓ శివశంకర్ గ్రీవెన్స్ మీల్స్ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం భోజనం ఖరీదు రూ.30 కాగా, ఇందులో ఐటీడీఏ రూ.20 భరిస్తుందని తెలిపారు. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఐటీడీఏ పరిధిలో 20 మండలాల నుంచి వచ్చే అర్జీదారులు లబ్ధిపొందేందుకు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రారంభం రోజున సుమారు 300ల మందికి భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ఎల్.ఆనందరావు, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, ఈఈ అశోక్, డీఈ సింహాచలం, ఐడబ్ల్యూఎంపీ ఏపీడీ డోల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భోజనం కోసం ‘తమ్ముళ్ల’ బాహాబాహీ
కర్నూలు, ఆలూరు: మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నాయకుల మధ్య బాహాబాహీకి వేదికైంది. తమలో విభేదాలు లేవని చెబుతూ సమావేశం ప్రశాంతంగా ముగిసిందని ఊపిరి పీల్చుకున్న కొద్ది సేపటికే భోజనం చేసే విషయంలో పరస్పరం తోసుకుని గొడవకు దిగారు. ఆలూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ జయరాములు జెడ్పీటీసీ సభ్యుడు రాంభీం నాయుడు అన్నీ మండలాల కన్వీనర్లు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం భోజనం చేసే క్రమంలో ‘అప్పుడే ఆకలైందా..’ అంటూ పరస్పరం గొడవ పడ్డా రు. వాసవీ కల్యాణ మండపంలోనే పిడిగుద్దులు గుద్దుకున్నారు. తిండి కోసం గుద్దులాడుకోవద్దం టూ సీనియర్ నాయకులు సర్ధిచెప్పినా వినలేదు. వీరభద్ర గౌడ్ ముఖ్య అనుచరుడు నారాయణ, చింతకుంట సింగిల్ విండో అధ్యక్షుడు జయానంద రెడ్డి తనయుడు రఘు ప్రసాద్‌రెడ్డి మధ్య ఈ గొడవ జరిగింది. చివరకు ఎవరికి వారు తాము కావాలో వాళ్లు కావాలో తేల్చుకో అంటూ గౌడ్ వద్ద పంచాయితీ పెట్టారు. కార్యాలయంలో మాట్లాడుకుందామంటూ గౌడ్ వారికి సర్ధిచెప్పారు. -
ప్లేటు..సీటు!
సాక్షి, సిటీబ్యూరో : ప్రతినిత్యం దాదాపు 35 వేల మంది క్షుద్బాధ తీరుస్తున్న రూ.5 భోజన(అన్నపూర్ణ) కేంద్రాలకు అదనపు హంగులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం ఏకరూప నమూనాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లోకి వచ్చేవారు పైకప్పు కూడా లేకుండానే నిల్చుని భోజనం చేయాల్సిన పరిస్థితి. ఈ కేంద్రాలకు వచ్చేవారి గౌరవానికి భంగం కలగకుండా.. తగిన సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దాలని భావించిన మేయర్ బొంతు రామ్మోహన్ ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రస్తుతంఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు ఒక్కో దానికి రూ.3.6 లక్షలు ఖర్చు కాగా, అదనపుసదుపాయాలకు దాదాపు రూ.3 లక్షలు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతమున్న 150 అన్నపూర్ణ కేంద్రాల్లో తగిన స్థల సదుపాయం ఉన్న కేంద్రాల్లో కొత్త సదుపాయాలు అందుబాటులోకి తేనున్నారు. దాదాపు వంద చ.మీ.ల స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వర్షానికి తడవకుండా ఉండేందుకు పైన కప్పులాంటి ఏర్పాటుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫ్‌సర్వీస్ విధానంలో ఉన్న సందర్శిని టిఫిన్ కేంద్రాల తరహాలో స్టాండ్‌తో కూడిన స్టీల్ రౌండ్ టేబుళ్లు, మరికొందరు కూర్చునేందుకు కుర్చీ, బల్లలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. మొత్తం ఎన్ని కేంద్రాల్లో ఈ ఏర్పాట్లకు అవకాశముందో పరిశీలించి, తగిన ప్రతిపాదనలు రూపొందించి త్వరలోనే ఈ సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ ఏర్పాట్లతో ఏకకాలంలో దాదాపు ఇరవైమందికి ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. గడచిన నాలుగేళ్లుగా ఎంతో ఆదరణ పొందిన ఈ పథకం రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందింది. హైదరాబాద్ స్ఫూర్తితో కొన్ని నగరాల్లో వివిధ పేర్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇతర నగరాలకు ఆదర్శప్రాయంగా మారిన దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సదుపాయాలపై దృష్టి సారించారు. కోటిమందికి పైగా.. నగరంలో నాలుగేళ్లక్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు కోటిమందికి పైగా ఆకలిబాధను తీర్చింది. 2014 మార్చి 2వ తేదీన నాంపల్లి సరాయి వద్ద లాంఛనంగా ప్రారంభమైన ఇది తొలుత ఎనిమిది కేంద్రాలతో ప్రారంభమై దశలవారీగా 150 కేంద్రాలకు చేరింది. హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఈ భోజన పథకంలో భాగంగా నాణ్యత, వేడితో కూడిన భోజనాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందిస్తున్నారు. ఈ పథకంలో అందిస్తున్న భోజనానికి రూ.24.25 ఖర్చవుతుండగా, రూ.5లను మాత్రమే లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నారు. మిగతా రూ.19.25 లను జీహెచ్ఎంసీ సబ్సిడీగా అందజేస్తోంది. రుచి, శుచి, నాణ్యతలో లోపాల్లేకపోవడంతో ప్రజలెందరో ఈ భోజనం కోసం క్యూలో నిల్చుంటున్నారు. ముఖ్యంగా ఆటో కార్మి కులు, వివిధ పనులు చేసే దినవారీ కూలీలు, ఆయా అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు, ఆస్పత్రుల్లోని వారికి సహాయకులుగా వచ్చేవారు, పోటీ పరీక్షల కోసం నగరానికి శిక్షణకు వచ్చిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. నగరంలో సాధారణ హోటల్లో భోజనానికి దాదాపు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోండగా, రూ.5లకే అందుతున్న ఈ భోజనానికి విశేషంగా స్పందన లభిస్తోంది. ఇదీ మెనూ.. 400 గ్రాముల రైస్, 100 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, సాంబార్, స్పూన్‌పచ్చడి. ఎందరికో ప్రయోజనం.. సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలతో పాటు భారీ సంఖ్యలో కోచింగ్ కేంద్రాలున్న అమీర్‌పేట లాంటి ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్లను నిరుద్యోగ యువతీ యువకులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. వీరితో పాటు వివిధ హాస్టళ్లలో ఉంటున్న నిరుద్యోగులకు సైతం ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -
హాజరైతేనే భోజనం
హైదరాబాద్: విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాస్‌లు వినేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఓయూలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం యూనివర్సిటీకి ఓయూలో, బాచుపల్లిలో హాస్టల్స్ ఉన్నాయని, వీటిలో భోజన వసతి కూడా ఉండేదని వీసీ తెలిపారు. అయితే ఇకపై ఈ హాస్టళ్లలో ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే భోజనాన్ని అందిస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనాన్ని ఇకపై నాంపల్లిలోని యూనివర్సిటీ సెంటర్లో మాత్రమే అందించనున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థులంతా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. -
విద్యార్థుల ఆకలి కేకలు
నెల్లూరు రూరల్: విద్యార్థులకు భోజనం పెట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆ వార్డెన్ మాకొద్దు అంటూ బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులు రోడ్డెక్కారు. కొత్తూరు రామకోటయ్య నగర్‌లోని బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులకు బుధవారం ఉదయం టిఫిన్ పెట్టలేదు. వార్డెన్ వంట మనిషిని వెనక్కు పంపడంతో అల్పాహారం అందలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక కొండాయపాళెం గేటు సెంటర్లోని జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయం ఎదట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఈ వార్డన్ మా కొద్దు, వార్డెన్ వెంకట్రావుపై చర్యలు తీసుకో వాలని, పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా మె నూ మార్చాలని, సక్రమంగా భోజనం పెట్టాలని, హాస్టల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీబీసీడబ్లూఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.రాజేశ్వరి విద్యార్థులతో చర్చిం చారు. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారించి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిందని, పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా సవరించిన మెనూ ప్రకారం భోజనం పెట్టమంటే వార్డెన్ విద్యార్థులపై దాడికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం రాత్రి మెనూ ప్రకారం బుధవారం ఉదయం టిఫిన్ రెడీ చేయాలని మెస్ కమిటీ సభ్యులు కోరడంతో నానా దుష్పలాడారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం టిఫిన్ తయారు చేయకుండా వంట మనిషిని వెనక్కు పంపించారన్నారు. కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గాలాజు శివాచారి, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గంపాటి పద్మజ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. విద్యార్థుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని అధికారులకు విన్నవించారు. -
హిందూ మీల్స్‌పై వెనక్కి తగ్గిన ఎమిరేట్స్
న్యూఢిల్లీ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమవడంతో, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది. ఫుడ్ ఆప్షన్స్ నుంచి హిందూ మీల్స్‌ను వెనక్కి తీసుకోవాలని, భారతీయుల మతసంబంధమైన విశ్వాసాలకు అనుగుణంగా శాంకాహారం, మాంసాహారం ఆఫర్ చేయనున్నట్టు ఎమిరేట్స్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని, హిందూ మీల్ ఆప్షన్‌ను కొనసాగించనున్నామని ఎమిరేట్స్ ధృవీకరించింది. దీంతో తమ హిందూ కస్టమర్లను తేలికగా గుర్తించవచ్చని, వారి అభ్యర్థనమేరకు దీన్ని కొనసాగిస్తున్నామని ఎమిరేట్స్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన వెలువరించింది. ఎమిరేట్స్ ఎన్నో రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని, వారిలో తమ హిందూ కస్టమర్లు కూడా ఉంటారని తెలిపింది. ప్రయాణికులకు తాము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. తాము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటామని, ఇది తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని ఎమిరేట్స్ తెలిపింది. పెద్ద పెద్ద విమానయాన సంస్థలన్నీ మతపరమైన అంశాలను, ఆహార నియమాలు, వైద్య అంశాలను పరిగణలోకి తీసుకుని మీల్ ఆప్షన్లను అందిస్తూ ఉంటాయి. ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మెనూలలో ‘రిలీజియస్’ పేరు మీద స్పెషల్ మీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో హిందూ నాన్-వెజిటేరియన్ మీల్, ముస్లి, మస్సెలెం మీల్, కోషర్ మీల్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెజిటేరియన్ మీల్ కోసం కూడా పలు ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇండియన్ వెజ్, జైన్ మీల్, ఓరియెంటల్, వెగాన్ వంటి మీల్స్‌ను ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు అందిస్తూ ఉంటాయి. -
ఇక విమానాల్లో హిందూ భోజనం కట్
దుబాయ్ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించింది. బుధవారం విమానయాన సంస్థ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రయాణికులకు మేము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తాం. మేము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటాం. ఇది మా సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దానిలో భాగంగానే ఆన్ బోర్డ్ ప్రొడక్ట్స్, సేవల విషయంలో ప్రయాణికులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఎమిరేట్స్ మెనూలోంచి హిందూ మీల్స్‌ను తొలగించాం’ అని ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. అంతేకాక ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని తెలిపారు. ఇక మీదట హిందూ ప్రయాణికులు, శాఖాహార ప్రయాణికులు శాఖాహార జైన్ ఆహారం, భారతీయ శాఖాహార భోజనం, కోశర్ భోజనం, నాన్ బీఫ్ నాన్ వెజిటేరియన్ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. -
నిరుపేదలకు సద్దిమూట
తాండూరు : మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన తాండూరు, వికారాబాద్‌లో నిరుపేదలు, అభాగ్యులకు కేవలం రూ.5కే భోజనం అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. సింగిల్ చాయి ఖరీదు రూ.7 నుంచి రూ.10 ఉన్న ఈ సమయంలో పేదవాళ్ల ఆకలిబాధ తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎంత చిన్న హోటల్లో భోజనం చేయాలన్నా రూ.50 నుంచి రూ.70 వరకు ఖర్చు చేయాల్సిన తరుణంలో రూ.5కే భోజనం అందించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో రూ.5కే నాణ్యమైన భోజనం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో ఈ సేవలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ జిల్లా కావడంతో దీనికి పేదల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఫుల్ భోజనమే... మున్సిపల్ శాఖ ద్వారా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న రూ.5 భోజనంలో అన్నం, కూరగాయలతో చేసిన కర్రీ, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్ అందిస్తారు. ప్రస్తుతం హోటల్, మెస్‌లలో ప్లేట్ భోజనం రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. మున్సిపల్ శాఖ ద్వారా అందించనున్న భోజనంతో వందలాది మంది కార్మికులు, రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల కడుపు నిండనుంది. ‘సంపూర్ణ’ భోజనం.. రూ.15 తాండూరు పట్టణంలో సంపూర్ణ సంస్థ ఆధ్వర్యం లో 6 నెలలుగా రూ.15లకే భోజనం అందిస్తున్నారు. సంపూర్ణ సంస్థ తాండూరు పట్టణంలోని బస్టేషన్ ప్రాంగణంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఇందిరాచౌక్‌ల వద్ద ఏర్పాటు చేసిన భోజన కేంద్రాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీ రోజు 500 మందికి పైగా తాండూరు నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సంపూర్ణ సంస్థ అందిస్తున్న భోజనం కన్నా 100 శాతం నాణ్యతతో మున్సిపల్ శాఖ రూ.5కే భోజనం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా పథకం అమలుతో మున్సిపాలిటీలకు అదనపు భారం తప్పదని అధికారులు చెబుతున్నారు. కౌన్సిల్ సభ్యులతో సమావేశం మున్సిపల్ శాఖ ద్వారా ప్రారంభించాలనుకుంటు న్న రూ.5 భోజనంపై.. త్వరలోనే మున్సిపల్ కౌ న్సిల్ సభ్యులతో సమావే శం నిర్వహిస్తాం. భోజనం నిర్వహణపై ఉన్న తాధికారుల నుంచి ఇంకా విధి విధానాలు అందలేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకం కావడంతో త్వరలోనే రూ.5 భోజనం అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నాం. – భోగీశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, తాండూరు -
10రూపాయలకే రెండు పూటలా భోజనం..
సాక్షి, హైదరాబాద్ : జబ్బు చేసి ఆస్పత్రి పాలైన వారి పరిస్థితి ఒకలా ఉంటే... వారిని పరామర్శించడానికి వచ్చే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారి పరిస్థితి ఇంకా దారుణం. ఒక్కరోజులో చూసి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందే. పట్నంలో పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లు ఉంటాయి. అలాంటి వారి పట్ల ఆత్మీయ బంధువవుతుంది ‘సేవా భారతి ట్రస్ట్’. రోగులకు, వారితో పాటు వచ్చే బంధువులకు కూడా రెండు పూటలా కడుపు నిండా భోజనం పెట్టడమే కాక ఉండటానికి వసతి కల్పిస్తుంది ఈ ట్రస్ట్. ఇదంతా కూడా కేవలం ‘పది రూపాయలకే’. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దూర ప్రాంతం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అలానే వారితో పాటు వచ్చే కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టి ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ప్రారంభమైంది. ఈ విషయం గురించి ‘సేవా భారతి ట్రస్ట్’ సెక్రటరీ నర్సింహమూర్తి ‘మొదట మేము కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించే వాళ్లం. కానీ 2013లో గాంధీ ఆస్పత్రి సుపరిండెంట్ ‘రోగుల కోసం వచ్చే వారి కోసం వసతి కల్పించమ’ని కోరాడు. దాంతో మేము ఈ వసతి గృహాన్ని నిర్మించాము. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మేము ఈ భవనాన్ని నిర్మించాం. దీన్ని నిర్మించిన కొత్తలో రోజుకు కేవలం పది మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు ఇక్కడ దాదాపు రెండు వందల మంది వరకూ బస చేస్తున్నారు. వారానికి దాదాపు 7 వేల మందికి బస కల్పిస్తున్నామని’ చెప్పారు. -
కూరలో ఎలుక.. సోషల్ మీడియాలో వైరల్
హన్మకొండ అర్బన్: ‘కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి..’ అని ఆకలి ఎక్కువైతే చెప్పేందుకు వాడే జాతీయం. కానీ వరంగల్ నగరంలోని ఓ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు దంపతులు ఏమరుపాటుగా ఉంటే కడుపులోకి నిజంగానే ఎలుక పోయే పరిస్థితి ఏర్పడింది. వారు భోజనం చేస్తుండగా వంకాయ కూరలో కలిసిపోయిన చనిపోయిన కలేబరాన్ని గుర్తించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి పక్కనగల అక్షయ టిఫిన్ సెంటర్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఆందోళనకు గురైన అతడు హోటల్ నిర్వాహకులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మొత్తం వ్యవహారాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో విషయం వైరల్ అయింది. అనారోగ్యంతో వచ్చి.. వరంగల్‌కు చెందిన రమేష్ తన భార్య చంద్రకళ నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో రోహిణి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన అతడు ఆకలిగా ఉండటంతో తాను భోజనం చేసి భార్యకు పార్సిల్ తీసుకెళ్దామని పక్కనే ఉన్న అక్షయ టిఫిన్స్‌కు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేసి తింటుండగా వంకాయ కూరలో ఎలుక కనిపించింది. అనుమానంతో బయటకు తీసి చూడగా కూరలో బాగా ఉడికినట్లు సగం తోలు ఊడిన ఎలుక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన రమేష్ మిగతా వారిని కూడా తినవద్దని సూచించాడు. విషయం నిర్వాహకులకు తెలిపాడు. అయితే బాధితుడి ఆందోళనపై నిర్వాహకుల నుంచి చాలా సేపటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పాడు. బాధితుడి ఆందోళనతో హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. విషయం తెలుసుకుని హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లేక ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ఈ విషయమై హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలుగడ్డలు, ఇతర కూరగాయల బస్తాలు, సామగ్రి కిచెన్‌లో ఉన్నందున పొరపాటు జరిగి ఉండొచ్చన్నారు. హోటల్ సీజ్, రూ.10 వేల జరిమానా ట్రేడ్ లైసెన్స్ రద్దు.. ల్యాబ్‌కు నమూనాలు : గ్రేటర్ ఎంహెచ్ఓ రాజారెడ్డి వరంగల్ అర్బన్: అక్షయ టిఫిన్ సెంటర్లో వంకాయ కర్రీలో మృతిచెందిన ఎలుక వెలుగు చూడటంతో గ్రేటర్ ఎంహెచ్ఓ రాజారెడ్డి, సిబ్బంది తనీఖీలు నిర్వహించారు. టిఫీన్ సెంటర్‌కు రూ.10 వేల జరిమానా విధించి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, ఆహార నమూనాలను సేకరించి సిబ్బంది ద్వారా ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ రాజారెడ్డి సంఘటన వివరాలను వెల్లడించారు. వంట గది అధ్వాన్నంగా ఉన్నందున సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. -
రూ. ఐదుకే భోజనం అభినందనీయం
మెదక్‌జోన్: రూ. 5కే అన్నం పెట్టడం అభినందనీయమని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ధర్మాకారి రామచందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మకారి(కటికె) శ్రీనివాస్ తన తండ్రి జ్ఞాపకార్థం ఏరియా ఆస్పత్రిలో రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 5 కే బోజనం పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి రోజు భోజన వసతి కల్పించేందుకుముందుకు వచ్చిన శ్రీనివాస్ ఆదర్శవంతుడన్నాడు. ఎంతో మంది నిరుపేదలు ప్రతి రోజు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారని, వారికి ఈ వసతి కల్పించడం వల్ల నిరుపేదల ఆకలి తీరుతుందన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో భోజన వసతి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్రావు ఏరియా ఆసుపత్రి సూపరెంటెండెంట్ చంద్రశేఖర్, వైద్యులు నవీన్, శివదయాల్, బొజ్జ పవన్ తదితరులు ఉన్నారు. -
స్టేషన్‌కో టేస్ట్
ఆగండి ఆస్వాదించండి జీవితం ఎప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది. మామూలుగానైతే రుచికరమైన భోజనం దొరికినప్పుడు. అదే భోజనం లేదా ఇంకేదైనా టేస్టీ ఫుడ్‌ను ప్రయాణం చేస్తూ మధ్య మధ్య రైల్వేస్టేషన్లలో దిగి తింటే? జీవితంలోని సంతృప్తికి ఆహ్లాదం కూడా తోడవుతుంది. సాధారణంగా ప్రదేశాలు చూడ్డానికి ప్రయాణాలు చేస్తాం. వీలైతే ఒకసారి మీరెప్పుడైనా కేవలం ఫుడ్‌ని తినడానికే జర్నీ చెయ్యండి. ఎక్కడికి అంటారా? ఇదిగో మెనూ. ఏ రైల్వే స్టేషన్లో ఏ ఫుడ్ ఐటమ్ అదిరిపోతుందో లిస్ట్ ఇస్తున్నాం. టిక్ పెట్టడం, టికెట్ బుక్ చేసుకోవడం మీ వంతు. కర్జాత్, మహారాష్ట్ర వడాపావ్, బటాటా వడ. ఆ ఘుమఘుమలు ఎంత నోరూరిస్తాయో చెప్పలేం. నసీరాబాద్, రాజస్తాన్ కచోరా. జెయింట్ కచోరా తీస్కోండి. క్రంచీగా, డెలీషియస్‌గా లాగించేయండి. సురేంద్రనగర్, గుజరాత్ కామెల్ మిల్క్ టీ. ఒంటె పాల తేనీరు! లైఫ్‌లో ఒక్క సిప్ అయినా వెయ్యాల్సిందే. మద్దూర్, కర్ణాటక మద్దూర్ వడ. చూడ్డానికి కుకీస్‌లా ఉంటాయి ఈ వడలు. ఒకటి తిని చూడండి. ఇంకోటి తినకుండా ఆగగలరేమో.. అదీ చూడండి. కాలికట్, కేరళ కోళికోడ్ హల్వా. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, లోకల్ సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ హల్వా మీకు ఈ భూమ్మీద ఇక్కడ కాక మరెక్కడా దొరకదు. హౌరా, పశ్చిమ బెంగాల్ చికెన్ కట్లెట్. చిన్నవిగా ఉంటాయి. కరకరలాడతాయి. ఎంపిక చేసిన లేత చికెన్‌తో చేస్తారు కాబట్టి పీచు మిఠాయిల్లా నోట్లో కరిగిపోతాయి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ దాల్ వడ. లోపల, బయట కూడా మృదువుగా ఉంటుంది. చట్నీ ఇస్తారు. ఉల్లిపాయ ముక్కలు వేస్తారు. కొరుక్కోడానికి ఒక మిరపకాయను కూడా పెడతారు. తింటే స్వర్గలోకాల వీక్షణే. తండ్లా, యు.పి. ఆలూ టిక్కీ. వేడి వేడిగా, క్రిస్పీగా ఉంటాయి. అయితే ట్రైన్ ఇక్కడ ఎంతోసేపు ఆగదు. ఆలోపే కుమ్మేయాలి మరి. జలంధర్, పంజాబ్ చోళే భతూరే. ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఈ స్టేషన్లో దిగి, ఈ ఐటమ్‌ను తినకపోతే.. మీరిక ప్రపంచమంతా తిరిగినా వృథానే. ప్రయాణం వృథా అని కాదు. లైఫ్ వృథా అని. రత్లామ్, ఎం.పి. పోహ. ఉల్లిపాయలు తరిగి, ఫ్రెష్‌గా సర్వ్ చేస్తారు. చవక, ఆరోగ్యం కూడా. బ్రేక్‌ఫాస్ట్‌కి సూట్ అవుతుంది. -
కంటికి రెప్పలా కిడాంబి
శ్రీరంగని తీర్థం తీసుకోకుండా రామానుజునికి రోజు గడవదు. అదే కుట్రదారులకు అవకాశం ఇచ్చింది. ఓ రోజు రామానుజులు తీర్థం తీసుకోవడానికి రావడానికి ముందు పెరుమాళ్ల తీర్థపాత్రలో విషం కలిపారు. రోజూ తీర్థమిచ్చే అర్చకుడే ఆ రోజు కూడా ఇస్తున్నాడు. కాని ఏనాడు లేని విధంగా ఉద్ధరిణితో తీర్థం ఇస్తున్న చేతులు తీవ్రంగా వణకడాన్ని రామానుజులు గమనించారు. ‘‘ఏమి స్వామీ మీ చేయెందుకు వణుకుతున్నది’’ అని అడిగారు రామానుజులు. అర్చకుడు ఏమీ చెప్పలేకపోతున్నారు. స్వామి తీర్థంలోనూ విషం కలిపి ఉంటారని ఊహించి నవ్వుకున్నారు. అప్పడికే ఆయన ఈ హత్యా ప్రయత్నాలతో విసిగిపోయారు.శ్రీవారి పాదాలు తాకి పునీతమైన ఈ తీర్థం ఏ విషాన్నయినా కరిగిస్తుందని అనుకుంటూ ‘‘తీర్థం ఇవ్వండి. అందులో ఏమున్నాసరే’’ అన్నారు. ఆ అర్చకుడు తీర్థం ఇచ్చారు, వీరు స్వీకరించారు. దాని గురించి ఇక ఆలోచించకుండా దైనందిన కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. యతిరాజును విషం ఏమీ చేయలేకపోయింది. ప్రపీత విష తీర్థాంబః ప్రకటీకృతవైభవః అనే నామం రామానుజుని వేయినామాల్లో ఒకటైంది. ఈ విషప్రయోగాలతో రామానుజులు కలత చెంది, భోజనం మాని ఉపవసించడం ఆరంభించారు. చికాకుతో శ్రీరంగానికి దూరంగా తిరువెళ్లరైకి వెళ్లి కొన్నాళ్లున్నారు. ఈ సంఘటనలు తెలిసి ఆందోళన చెందిన గోష్టీపూర్ణుల వారు తిరుగోష్టియూరు నుంచి హుటాహుటిన శ్రీరంగానికి వచ్చారు. ఆచార్యుల వారు వస్తున్నట్టు తెలిసి రామానుజులు ఎదురేగారు. కావేరీ నదీ సమీపాన ఇద్దరూ ఎదురు పడినారు. స్వామి కనిపించగానే రామానుజులు సాష్టాంగ దండ ప్రణామం చేసినారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఆచ్ఛాదన లేని ఛాతీతో కాలిపోతున్న ఇసుక మీద పడిపోయారాయన. ఎవరైనా సరే, ఆ విధంగా సాష్టాంగ పడితే వెంటనే లేపడమో, లేవమని చెప్పడమో పెద్దలు చేయవలసింది. కాని గోష్ఠీపూర్ణులవారు అట్లాగే చూస్తున్నారు. కిమ్మనరు. లెమ్మనరు. లెమ్మనేదాకా రామానుజులు లేవరు. ఆచార్యుని ప్రియశిష్యుడైన కిడాంబి ఆచ్చాన్ ఈ హింస తట్టుకోలేక పోయారు. గోష్టీపూర్ణుల మీద కోపం వచ్చింది. కాని ఏమీ అనలేరు. ఆయన్నేమైనా అంటే తమ గురువు రామానుజులు ఆగ్రహిస్తారు. తానే ఏదయినా చేయాలనుకున్నాడు. గోష్ఠీపూర్ణుల దగ్గరగా వచ్చి సూటిగా కళ్లలోకి కోపంగా చూసారు. అయినా మౌనంగానే ఉన్నారు. తానే ఆ ఇసుకమీద పడిపోయి రామానుజుల కిందకు దూరి తన వీపు మీద గురువుగారిని పడుకోబెట్టుకున్నారు. గోష్ఠీపూర్ణులు అప్పుడు ‘‘లే నాయనా’’ అని ఇద్దరినీ లేవదీసారు. రామానుజులను ఆలింగనం చేసుకున్నారు. ‘‘స్వామీ ఇదేమిటి. రామానుజాచార్యులవారు ఏమి తప్పు చేసారని కాలే కావేరీ ఇసుకతిన్నల మీద కాలిపొమ్మని శిక్షించారు. ఆయన కుసుమకోమల శరీరం చూడండి ఎలా కందిపోయిందో. ఆ వేడి ఎవరైనా తట్టుకోగలరా, మరీ ఇంత కాఠిన్యమా?’’ అని ఆవేదన కలిసిన ఆవేశంతో ఆక్రోశించారు కిడాంబి. రామానుజుని పట్ల కిడాంబికి ఉన్న అపారమైన అనురాగానికి, ఆయన్ను రక్షించుకోవాలన్న తీవ్ర తపనకు, అందుకోసం ఏం చేయడానికైనా ముందుకు వచ్చే ఆయన సంసిద్ధతను చూసి గోష్టీపూర్ణులకు ఆనందం కలిగింది. ఓహో రామానుజుడికి ఇంత ప్రియశిష్యుడొకడున్నాడన్నమాట. ‘‘నాయనా కిడాంబి ఆచ్చాన్.. ఇక నీదే రామానుజుని బాధ్యతంతా. నీ వంటి త్యాగశీలి అయిన శిష్యుడి కోసమే వెదుకుతున్నాను. ఈ పరీక్ష రామానుజునికి కాదు. ఆయన్ను కంటికి రెప్పవలె కాపాడుకునే శిష్యుడిని కనిపెట్టడం కోసం, గురువు కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే నీవంటి ఆప్తుడిని కనుగొనడం కోసం. నువ్వు దొరికావు. నీవుండగా ఇక రామానుజుని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం రామానుజుని రక్షించుకోవాలి. ఎందుకంటే ఆయనే మన వైష్ణవ మతానికి రక్షకుడు, మోక్షమార్గ నిర్దేశకుడు. పాప పంకిలమైన కలికాలంలో దైవం వైపు మనుషుల్ని మళ్లించగల ఆచార్యుడు. నీవే స్వయంగా వస్తువులు కూర్చుకుని, తళిహ చేసి పెరుమాళ్లకు ఆరగింపు చేసి, ఆ భగవత్ప్రస్రాదాన్ని రామానుజునికి వడ్డించాలి. నిరంతరం ఆయనకు కాపాయంగా ఉండాలి. నీవే కాపాడుకోవాలి’’ అని గోష్ఠీ పూర్ణుల వారు కిడాంబిని ఆశీర్వదించారు. ‘‘నీవు గాక ఇంకెవరూ రామానుజునికి వండకూడదు. ఆహారం ఇవ్వకూడదు సుమా..’’ అని మరోసారి హెచ్చరించారు గోష్టీ పూర్ణులవారు. ఆ విధంగా కిడాంబి తన ఆచార్య నిష్టను చాటుకున్నారు.కిడాంబి గొప్ప విద్వాంసుడు. సంస్కృత భాషలో ఆయన పేరు ప్రణతార్తిహరాచార్యులు. ప్రణతి చేసిన వారి ఆర్తిని హరించేవారని అర్థం. ఆ తరువాత తళిహత్నం, పెరుమాళ్ల ప్రసాదం, రామానుజుని పాకశాల కైంకర్యం కిడాంబిదే. రామానుజులు మధూకరవృత్తి (యాచన) వదిలేసి కిడాంబి తళిహత్నం (వంట) మీదనే ఆధారపడేవారు. అందుకే రామానుజుని సహస్రనామావళిలో ‘‘ప్రణతార్తిహరాచార్య దత్తభిక్షైక భోజన’’ అనే మరో నామం చేరింది. కిడాంబితో సహా రామానుజుని ఆంతరంగికులు జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తున్నారు. రామానుజులకు ఇచ్చే ప్రతి పదార్థాన్ని, ద్రవాన్ని, ఫలాన్ని పరీక్షిస్తున్నారు. ఆయనకు సమీపంలో మెలిగే ప్రతివారి కదలికను పరిశీలిస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న శిష్యగణం స్వామిని కంటికి రెప్పలా కాచుకునే రక్షగణం వలె తయారైంది. యజ్ఞమూర్తితో వాదంయజ్ఞమూర్తి ఒక మహాపండితుడు. అద్వైత వేదాంతంలో దిట్ట. తర్కశాస్త్రప్రవీణుడు. ఆయన శాస్త్ర చర్చలో ఓడించని పండితుడు లేడు. ప్రతిచోటా విజయపత్రాన్ని సాధించేవాడు. ఇక తనను జయించే వాడే లేడని ఆయనకు అహంకారం పెరిగింది. విస్తరిస్తున్న కీర్తితోపాటు నాకు సాటి నేనే అనే నమ్మకం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఆయన ఏకదండ సన్యాసి. యజ్ఞమూర్తి దృష్టిలో ఓడించవలసిన వారు ఇంక ఒక్కరు మిగిలారు. శ్రీరంగంలో త్రిదండి యతీశ్వరుడై జగద్గురువై ఆచార్యోత్తముడిగా భాసిస్తున్న రామానుజుడిని వాదంలో జయిస్తే ఇక తిరుగే లేదని అనుకుని శ్రీరంగానికి వచ్చారు. వేదాంత చర్చలో పోటీ పడడాన్ని శాస్త్రార్థం అంటారు. పెద్దమూటనిండా పుస్తకాలు తెచ్చుకుని వచ్చి రామానుజులతో ‘‘మీతో శాస్త్రార్థానికి వచ్చాను. నేను ఓడితే మీ మతం స్వీకరిస్తాను. మరి మీరు ఓడితే ఏం చేస్తారు’’ అని అడిగాడు. ‘‘గ్రంథసన్యాసం చేసి మౌనం వహిస్తాను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేసాడు రామానుజుడు. అంతా ఆశ్చర్యపోయారు. ఇదేం ప్రతిజ్ఞ. రామానుజులవారు గ్రంథ సన్యాసం చేస్తే ఇక ఈ శాస్త్రమంతా ఏమైపోవాలి. ఈ మతం ఏమైపోవాలి అని ఆందోళన చెందారు. మాయావాదంలో ఆరితేరిన యజ్ఞమూర్తి గర్వంగా వాదంలోకి దిగారు. 17 రోజుల పాటు వాదం సాగుతూనే ఉంది. రామానుజాచార్యులతో ఇన్ని రోజుల పాటు వాదించిన వారు మరొకరు లేరు. 17వ రోజున యజ్ఞమూర్తి వాదన పై చేయిలో ఉన్నట్టు కనిపించింది. సాయంత్రం తన పెరుమాళ్లు వరదరాజస్వామితో ‘‘ఆళ్వార్లనుంచి ఆళవందార్ దాకా ఇన్నాళ్లూ పెద్దలంతా తపోబలంతో నిర్మించుకున్న ఈ శ్రీ వైష్ణవాన్ని, నీ నామ రూప గుణ విభవ విభూతులనే నిత్య సత్యప్రకాశాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వదులుకునే పరిస్థితి నాకు రాకుండా రక్షించుకోవలసిన బాధ్యత మీకూ ఉంది స్వామీ’’ అని సంభాషించారు. రాత్రి స్వప్నంలో వరదుడు కనిపించి ‘‘యామున మునీంద్రుని మనసెరిగిన శిష్యుడివైన నీకు, యామునుడి సిద్ధిత్రయాది గ్రంథాల్లో ఉన్న విజ్ఞానాన్ని వంట పట్టించుకున్న నీవు, చింతించే అవసరం ఉందా? ఏమో నీకు అత్యంత ప్రతిభావంతుడైన మరొక శిష్యుడు లభిస్తాడేమో’’ అన్నారు. దిగ్గున నిద్రలేచారు రామానుజులు. నూనె దీపం వెలుగులో సిద్ధిత్రయగ్రంథాలు తెరిచారు. కొన్ని పత్రాలు తిరగేసినారు. మరునాటి శాస్త్రార్థానికి సర్వం సన్నద్ధమైంది. ఆలోచనలు వెలిగాయి. లోలోన నవ్వుకుంటూ రామానుజులు నిద్రలోకి జారుకున్నారు. పద్దెనిమిదోరోజు... వివేకానంద ముఖారవిందుడైన రామానుజుని చూడగానే యజ్ఞమూర్తి మాయ మాయమైపోయింది. అనుమాన బీజం నాటుకుంది. అవిశ్వాసమై పెరిగింది. రామానుజుని మోములో ఏమిటీ కాంతి? అని ఆశ్చర్యపోయారు. చూపు మరలడం లేదు. ఆరోజు రామానుజుడు వాదం ఆరంభించిన కొద్దిసేపటికే ముగిసిపోయింది. పరమాత్మ స్వరూపాన్ని సైద్ధాంతికంగా నిరూపించిన తరువాత యజ్ఞమూర్తి పరాజయాన్ని అంగీకరించక తప్పలేదు. త్రిదండి సన్యాసం స్వీకరించారు. రామానుజునికి మరో పండిత శిష్యుడు లభించాడు. ఆయనకు అరుళాలప్పెరుమాళ్ ఎంబెరుమానార్ అనే నామాన్ని ప్రసాదించారు. విశిష్ఠాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడిగా తీర్చిదిద్దారు. పేద శిష్యుడి పెద్ద గుణం, ధనిక శిష్యుని పేదరికం ఓసారి రామానుజులు అష్టసహస్ర గ్రామానికి వస్తున్నారు. ఆ గ్రామంలో రామానుజునికి ఇద్దరు శిష్యులున్నారు. ఒకరు యజ్ఞేశుడు (యజ్ఞమూర్తి కాదు) మరొకరు వరదాచార్యుడు. యజ్ఞేశుడికి చాలా ధనం ఉంది. వరదుడు పేదవాడు. తాను వస్తున్నట్టు ఇద్దరికీ సమాచారం వెళ్లింది. రామానుజులు తన భవనానికి వస్తే స్వాగత సన్నాహాలు చేయడానికి సిద్ధం అన్నాడు యజ్ఞేశుడు. ఆ విషయం తెలియగానే రామానుజుడు శిష్యులతో ‘‘వరదుడి కుటీరానికి పదండి’’ అన్నారు. వరదుడు అప్పుడే భిక్షాటనకు వెళ్లాడు. ఇంట్లో వరదుడి భార్య ఉంది.రామానుజులవారు వస్తున్నారని ఆమె ఎంతగానో సంతోషించింది. కాని ఆమె బయటకు వచ్చి ఆచార్యునికి స్వాగతం చెప్పే స్థితిలో లేదు. తనకు ఒకే చీర ఉంది. ఆ చీరను అప్పుడే ఉతుక్కుంటున్నది. భర్త వచ్చేలోగా అది ఆరితే కట్టుకోవాలి. ఇప్పుడెట్లా. ఇంతలో గురువుగారు వచ్చిన సందడైంది. మూసి ఉన్న తలుపులకు ఆవల ఉన్నారు ఆచార్యులు. లోపల ఉన్న తను ఏ విధంగా స్వాగతం చెప్పాలో తెలియక ఆహ్వాన సూచనగా చప్పట్లు కొట్టింది. పరిస్థితిని రామానుజులు గమనించారు. తన శిరస్సుకు తలపాగా వలె కట్టుకున్న కాషాయ వస్త్రాన్ని తీసి కిటికీలోంచి లోనికి విసిరారు. దాన్నే చీరగా చుట్టుకుని ఆమె బయటకు వచ్చి నమస్కరించింది. కాళ్లు కడుక్కునేందుకు నీళ్లిచ్చి లోపల కూచునేందుకు ఆసనంగా ఒక చాపను పరిచింది. పూర్వజన్మపుణ్యాన గురువుగారు మా కుటీరాన్ని పావనం చేశారు. ఇంతకన్న ఆనందం ఏముంటుంది... కాని ఏం చేయడం? ధాన్యం కూడా లేదే, వారికి, శిష్యగణానికి సాపాటు ఏర్పాటు ఏ విధంగా చేయడం? ఇదివరకెవరో వైష్ణవ తదీయారాధన (భోజనం) కోసం దొంగతనాలైనా చేసేవారట. నేనేం చేసేది? ఈ వైష్ణవ స్వాములకు నేనెలా సాపాటు పెట్టేది. అని తపించసాగింది. ఆ ఊళ్లో ఉన్న వైశ్యవర్తకుడి దగ్గరకు సరుకులకోసం పోయినప్పుడల్లా వంకర చూపులు చూసేవాడు. అవసరం ఉన్నా సరే అక్కడికి వెళ్లాలంటే ఆ చూపులకు భయపడేది. ఓ నిర్ణయానికి వచ్చి, ‘‘ఆచార్యా ఇప్పుడే వస్తాను. వెచ్చాలు తేవడానికి వెళ్తున్నాను. మీ అనుగ్రహంతో సరుకులు దొరుకుతాయనే అనుకుంటున్నాను’’ అని వెళ్లింది. ఆమె రాక చూసి వర్తకుడి మనసు కామంతో నిండిపోయింది. ‘‘మా ఆచార్యులవారు శిష్యులతో సహా వచ్చారు. వారికి సాపాటు పెట్టాలి. దయచేసి సరుకులు ఇవ్వండి మీ రుణం ఉంచుకోను. మీరు చెప్పినట్టు వింటాను’’. శెట్టిగారికి అర్థమైపోయింది. చాలా సంతోషంగా కావలసిన దానికన్న ఎక్కువ సరుకులే ఇచ్చారు. ఆచార్యుల సేవకు సరుకు దొరికిందన్న ఆనందంతో గుడిసెకు వెళ్లిందామె. ‘‘అమ్మా నీ చేతి వంట తినే భాగ్యం మాకుంది. స్నానానికి వెళ్లి వస్తాం తల్లీ’’ అని రామానుజులు శిష్యులతో సహా వాగు వైపు వెళ్లారు. స్నానం, సంధ్య, అనుష్టానం తిరువారాధనలు ముగించుకుని సాపాటుకు కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి వరదుడు వచ్చి ఆచార్యులను చూసి సాష్టాంగదండాలు సమర్పించి, భార్య అన్ని ఏర్పాట్లు చేయగలిగినందుకు వేయిదేవుళ్లకు దండాలు పెట్టుకున్నాడు. ‘‘నన్ను ధన్యుyì ని చేసావు, జ్ఞానమార్గాన్ని ఉపదేశించిన ఆచార్యుడే భగవంతుడు. వారి బృందానికి తదీయారాధన చేసే భాగ్యం కల్పించిన దేవతవు నీవు. ఏ విధంగానైనా గురువుకు ఆతిథ్యమివ్వగలిగే శిష్యుడే నిజమైన శిష్యుడు’’ అంటూ పరి పరి విధాలా భార్యను మెచ్చుకున్నాడు. ఇంతలో రామానుజుల వారు వరదుడి ఇంటికి వచ్చారని తెలిసి ఉళ్లో వాళ్లు చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ రామానుజులు అందరికీ తీర్థం ఉంచి ఆశీర్వదించారు. శెట్టి కూడా వచ్చారు. రామానుజుని దివ్యస్వరూపం చూసిన తరువాత వారి తీర్థం తీసుకుని ఆశీస్సులు పొందిన తరువాత, ఈ మహానుభావుడు స్వయంగా వరదుడి ఇంటికి వచ్చారంటే, సంపన్నుడైన యజ్ఞేశుడిని తిరస్కరించారంటే వరద దంపతులు ఎంత గొప్పవారో అర్థమైంది. రామానుజుల సమక్షంలో వరదుడి భార్య పాదాలపై పడి తన పాపపు చూపులకు పరితపించాడు. క్షమించమని వేడుకున్నాడు. తన ద్రవ్యం సద్వినియోగమైందని సంతోషించాడు. రామానుజుడి రాకతో తన సమస్య ఆ విధంగా పరిష్కారమైనందుకు వరదుడి భార్య ఆనందించింది. యజ్ఞేశుడికి గర్వభంగం అయిందని ఊళ్లో వాళ్లంతా అనుకున్నారు. ఆ విషయం యజ్ఞేశుడికి కూడా తెలిసింది. తన ఇంటికి రాకుండా రామానుజుడు తన యాత్ర కొనసాగించారని తెలిసి తన అహంకారానికి సిగ్గుపడ్డాడు. -
అనాథ పిల్లలపై అమానుషం
హన్మకొండ చౌరస్తా: అమ్మా, నాన్న పిలుపునకు దూరమై.. నా అనేవారు లేని పిల్లల సంరక్షణ చూడాల్సినవారే అమానుషంగా ప్రవర్తించారు. సరైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించినందుకు హింసించారు. అంతటితో అహం చల్లారక గుండు గీయించారు. అమానుషమైన ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ పట్టణ వీధి బాలల వసతి గృహంలో సుమారు వంద మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. పిల్లలందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారం రోజులుగా వార్డెన్ అర్చన వ్యక్తిగత సెలవులో ఉండగా, వసతి గృహాన్ని ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్లే నిర్వహిస్తున్నారు. అయితే నీళ్ల చారు, సరిగా ఉడకని అన్నాన్ని వడ్డించడంపై రెండు రోజుల క్రితం కల్యాణ్, దిలీప్, అక్షయ్‌వర్మ అనే విద్యార్థులు ట్యూటర్, వాచ్మన్లను నిలదీశారు. దీంతో ‘మమ్మల్నే అడుగుతార్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ ముగ్గురు విద్యార్థులను చితకబాదారు. అయినప్పటికీ శాంతించని వాచ్‌మన్, ట్యూటర్లు ఆ ముగ్గురికి గుండు చేయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఏబీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్బీ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాలు బుధవారం సాయంత్రం వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ ట్యూటర్, వాచ్మన్లను విధుల నుంచి తొలగించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన ఉధృతం కాకుండా బందోబస్తు చేపట్టారు. ఆ ఇద్దరిని తొలగించాం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్‌ను తొలగిస్తూ ఉదయమే తీర్మానం చేశాం. వారిద్దరిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదనడం సరైంది కాదు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. – కేడల పద్మ, నిర్వాహకురాలు,పట్టణ వీధి బాలల వసతి గృహం, లష్కర్‌బజార్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో గల మహాత్మజ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం తనిఖీ చేశారు. హాస్టల్‌ను ఎçప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఆవరణలో రకరకాల మొక్కలను నాటాలని సూచించారు. పిల్లలను ప్రణాళిక ప్రకారం చదివించాలని, వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం గురుకుల పాఠశాలకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ పోతగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు లింగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
కడుపు నిండిన వారికి కాదు... డొక్కలు ఎండిన వారికి...
ప్రత్యుపకారం చేసే స్తోమత లేని నిరుపేదలకు, దీనులకు, అభాగ్యులకు చేసే సాయమే భక్తులకు అత్యంత ఫలదాయకమని శాస్త్రాలు బోధించాయి. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం. ఉన్నవారికే విందు భోజనాలు పెట్టడమూ అంతే. నీళ్లు చెట్టుకు, చేనుకు పోయాలి లేదా గొంతెండి పోతున్న వారి దప్పిక తీర్చాలి. అదే దేవుడు మెచ్చే మంచి పని. లేనివారికి పచ్చడన్నం పెట్టినా పరమాన్నంతో సమానంగా భావిస్తాడు. ఇందుకో చిన్న ఉదాహరణ చూద్దాం... ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులను ఆహ్వానించాడు. అయితే వాళ్లంతా కూడబలుక్కొని ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. అందుకతను నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన సేవకులను పురమాయించాడు. వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. అయినా ఇంకా స్థలముంటే, భిక్షగాళ్లను, కూలీలను పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల కడుపులూ నిండాయి. ధనికుని హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది. -
అన్ని గురుకులాల్లో ఒకే మెనూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే రకమైన భోజనం (మెనూ), మౌలిక వసతులు (అమెనిటీస్) కల్పించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే నిధుల కోసం వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో రకరకాల పద్ధతులుండటం వల్ల పిల్లల్లో బేధభావాలేర్పడే అవకాశం ఉందని.. అందరికీ సమానావకాశాలు, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు మంచి మెనూ అందిస్తున్నారని, వస తులూ బాగున్నాయని.. ఇలాంటి మెనూ, వసతులు అన్ని సొసైటీల్లోని విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వసతుల కల్పన మన బాధ్యత మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులున్నాయని.. కేజీబీవీలలో వచ్చే ఏడాది నుంచి అకడమిక్ బ్లాకులు నిర్మిం చాలని యోచిస్తున్నట్లు కడియం తెలిపారు. రెండేళ్లలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో బయోమెట్రిక్ మెషీన్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, డ్యుయల్ డెస్క్‌లు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్లు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, ఫర్నిచర్ ఇచ్చామన్నారు. చలికాలంలో వేడి నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అందించడం కనీస బాధ్యతని చెప్పారు. ఆన్‌కాల్‌లో డాక్టర్లు: ప్రవీణ్ కుమార్ విద్యార్థుల హజరు నమోదులో అవకతవకల్లేకుండా ఆన్లైన్లో హాజరు నమోదు చేస్తున్నామని, తర్వాత మార్చడానికి వీల్లేకుండా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉత్తమ విధా నం అవలంభిస్తున్నామని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ చెప్పారు. కమాండ్ కంట్రోల్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేశామని, ప్రతి విద్యార్థికి ఎలక్ట్రా నిక్ హెల్త్ కార్డులు జారీ చేశామని, కమాండ్ సెంటర్లో ఆన్‌కాల్‌లో డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామ న్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. -
తిన్నవెంటనే ఏం చేయకూడదంటే...
సాక్షి,న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ధృడంగా, వ్యాధులకు దూరంగా ఉంటామనుకుంటే పొరపాటే. ఆహారం తీసుకునే ముందు, తిన్న తర్వాత మనం చేసే పనులూ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తిన్న వెంటనే మనం చేసే కొన్ని పనులు మనకు తెలియకుండానే అనారోగ్యాలకు దారితీస్తాయి.ముఖ్యంగా తిన్న వెంటనే ఆహార పదార్ధాలు జీర్ణం అవుతాయనే అపోహతో వెంటనే నడవడం వంటివి చేస్తారు. అయితే తిన్న తరువాత 30 నిమిషాల వరకూ వాకింగ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి చేటుచేస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే జఠరరసాలు ప్రతికూల దిశలో వెళ్లి మొత్త జీర్ణ ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక పొగతాగడం ఆరోగ్యానికి హానికరమైతే..తిన్న వెంటనే స్మోక్ చేయడం మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయడం మానుకోవాల్సిన అలవాటని సూచిస్తున్నారు. ఆహార పదార్ధాలు జీర్ణం కావడానికి తగిన శక్తి అవసరమని, తిన్న వెంటనే స్నానానికి ఉపక్రమించడం సరైంది కాదని చెబుతున్నారు. ఆహారం తీసుకున్న అరగంట తర్వాతే టీ, కాఫీలు తీసుకోవాలి.తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంత అవసరమో, తిన్న వెంటనే వీటిని తీసుకోవడం అంతే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆహారంతో పాటు పండ్లు తీసుకుంటే అవి ఆహారపదార్ధాలతో కలిసిపోవడంతో సకాలంలో జీర్ణవ్యవస్థలోకి వెళ్లలేవని చెబుతున్నారు. -
భోజనం ఒంటరిగా వద్దు
వేళకు భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. నలుగురితో కలసి కబుర్లు చెప్పుకుంటూ తింటే తృప్తిగా ఉంటుంది. ఒంటరిగా తింటే అది షడ్రసోపేతమైన భోజనమే అయినా తిన్న తృప్తి ఉండదు. చాలామందికి ఈ విషయం అనుభవపూర్వకంగా తెలిసే ఉంటుంది. అయితే, ఒంటరిగా భోజనం చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషులకు ఒంటరి భోజనం మరింత అనర్థదాయకమని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా భోంచేసే పురుషులకు తినే పదార్థాల మీద ఆసక్తి గాని, తిండి మీద నియంత్రణ గాని ఉండకుండాపోతుందని, దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే వారి జీవక్రియల్లో ప్రతికూల మార్పులు తలెత్తి స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడతారని సియోల్‌లోని డాంగ్‌జుక్ యూనివర్సిటీ పరిధిలోని ఇల్సాన్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా భోజనం చేసే 7,745 మంది వయోజనులపై జరిపిన దీర్ఘకాలిక అధ్యయనం తర్వాత వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా భోంచేసే పురుషుల్లో 64 శాతం మంది జీవక్రియల లోపాలకు గురవుతున్నారని, మహిళల్లో వారి సంఖ్య 29 శాతం మాత్రమేనని ఈ పరిశోధనలో తేలింది. -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గందరగోళం
♦ భోజనం సరిగాలేదని విద్యార్థుల ఆందోళన ♦ కుంటుపడుతున్న చదువులు.. ♦ అధ్యాపకుల ధర్నాకు వైఎస్ఆర్సీపీ నాయకుల మద్దతు ♦ సమస్యను జగన్ దృష్టికి తీసుకెళతాం.. వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఉన్న మెస్‌లలో నాణ్యమైన భోజనం అందించడంలేదంటూ శుక్రవారం 6 వేల మంది విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.తరగతులను బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. మరోవైపు అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు నాగరాజు మృతిపై అధ్యాపకులు నిరవధికంగా ఆందోళన కొనసాగింది.దీంతో చదువులు కుంటుపడుతున్నాయి. భోజనం సరిగా లేదు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో భోజనం సరిగా లేదని విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న మెస్‌లకు ఎదురుగా రోడ్డుపై బైటాయించారు. అక్కడ మెస్ నిర్వాహకులు తమకు నాణ్యమైన భోజనం అందించడంలేదు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కేఎంకె, ఫైన్, శక్తి సంస్థలు విద్యార్థులకు మెస్‌ల ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందులో 6 ఏళ్ల విద్యార్థులు దాదాపు 6 వేలమంది భోజనం చేస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి భోజనం వడ్డిస్తున్నారన్న విద్యార్థులనుండి ఆరోపణలు వచ్చాయి. నాగరాజుపై కొనసాగిస్తున్న అధ్యాపకుల ఆందోళన : ట్రిపుల్ ఐటీలో మెకానికల్ విభాగంలో తాత్కాలిక అధ్యాపకునిగా పనిచేస్తున్న నాగరాజు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు మంగళవారం నుంచి ఆందోళన చేపట్టారు.శుక్రవారం నాగరాజు చిత్రపటానికి పూలమాలవేసి రోడ్డుపై బైఠాయించారు. ట్రిపుల్ ఐటీల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళతాం.. : ట్రిపుల్ ఐటీలో ఉన్న అన్ని సమస్యలను ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి అధ్యాపకులకు తెలియజేశారు. నాగరాజు మృతిపై విచారణ జరిపించాలని ఆందోళన చేస్తున్న అధ్యాపకులకు వారు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎ స్ అవినాష్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులతో డైరెక్టర్ భగవన్నారాయణ, ఏఓ అమరేంద్రకుమార్ చర్చలు జరిపారు. ఇక్కడ ఉన్న మెస్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించా రు. ఈ నెల 23వ తేదీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామనిడైరెక్టర్ విద్యార్థులకు తెలిపారు. వీసీ రాకతో ఆందోళన విరమించేనా.. ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య రామచంద్రరాజు శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి రానున్నారు. ఆయన రాకతో అధ్యాపకులు చేపడుతున్న ఆందోళన విరమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాగరాజు మృతిపై కలెక్టర్‌తో కమిటీ వేసి విచారణ జరిపించాలని అధ్యాపకుడు నాగరాజు భార్య పావనికి అర్హతను బట్టి ఉద్యోగం, రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో తోటి అధ్యాపకులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
నాణ్యమైన భోజనమే ఇస్తున్నారా?
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు ప్రయాణ సమయంలో, స్టేషన్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు అందజేస్తున్నారా? లేదా? వివరణ ఇవ్వాలని రైల్వే శాఖను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వ వాదనలను తెలియజేయాలని కోరింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరి శంకర్ల హైకోర్టు ధర్మాసనం రైల్వే శాఖ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)కి నోటీసులు జారీ చేసింది. రైళ్లలో, స్టేషన్లలో నాణ్యతలేని భోజనం, గుర్తింపులేని బ్రాండ్ల నీళ్ల బాటిళ్లను అందజేస్తున్నట్లు కాగ్ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వివరించింది. దీని ఆధారంగా నరేంద్ర ఖన్నా ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. -
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు
భోజనం విషయంలో వివాదం - విద్యార్థులపై రౌడీలను ఉసిగొల్పిన వార్డెన్ - సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన - రాత్రి 10 గంటల వరకు ఉద్రిక్తత కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): భోజనం విషయంలో తలెత్తిన వివాదం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని విద్యార్థులను వార్డెన్ కిరాయి రౌడీలతో చితకబాదించాడు. బాధిత విద్యార్థులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రజా సంఘాలతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలివీ.. స్థానిక డాక్టర్స్ కాలనీ శివారులోని బీసీ కాలేజీ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం భోజనంలో కొడిగుడ్డు వడ్డించే విషయంలో ఇంటర్మీడియట్ విద్యార్థి రమేష్, డిగ్రీ విద్యార్థి గోపాల్ తదితరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కితే తన నిర్లక్ష్యం ఎక్కడ బయట పడుతుందోనని వార్డెన్ శ్రీనివాసరావు కిరాయి రౌడీలతో తమను చితకబాదించినట్లు విద్యార్థులు నాగరాజుగౌడ్, గోపాల్, నరేష్‌బాబు, జయచంద్ర, నాగార్జున తదితరులు వాపోయారు. వార్డెన్ తన సమీప బంధువైన విద్యార్థిని మెస్ ఇన్చార్జిగా నియమించి అక్రమాలకు పాల్పడుతున్నాడని.. ఇదేమని నిలదీయడంతోనే ఇలా చేశారన్నారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్‌కు తెలిపేందుకు బాధిత విద్యార్థులతో పాటు వసతి గృహ విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. కిరాయిరౌడీలను ఉసిగొల్పి హాస్టళ్లలో గ్యాంగ్‌వార్‌లకు ఊతమిస్తున్న వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ సంఘం నాయకులు లక్ష్మినరసింహ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు వార్డెన్‌కు, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్డెన్‌కు బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఘటనతో రాత్రి 10గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో సీఐ మధుసూదన్, బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు కలెక్టరేట్ వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
టోకెన్లు ఇచ్చి భోజనం లేదన్నారు
* మార్కెట్ యార్డులో మూణ్నాళ్ల ముచ్చటైన ఉచిత భోజన పథకం * రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన కొరిటెపాడు (గుంటూరు): మార్కెట్ యార్డులో రైతులకు ఉచిత భోజన పథకం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, మార్కెటింగ్ అధికారులు ఈనెల 20వ తేదీన అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించారు. అయితే అన్నదాతలకు టోకెన్లు ఇచ్చి, భోజనం పెట్టకపోవడంతో మంగళవారం యార్డులో గందరగోళం నెలకొంది. టోకెన్లు తీసుకొన్న రైతులు భోజనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి మిర్చి రైతులు భారీ స్థాయిలో గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం మిర్చి బస్తాలను తీసుకు వచ్చారు. అమానత్ పట్టీల ఆధారంగా యార్డు సిబ్బంది వారందరికీ ఉచిత భోజనం టోకెన్లు పంపిణీ చేశారు. మిర్చి బస్తాలను విక్రయించి భోజన హాలు దగ్గరకు వెళ్ళే సరికి భోజనం అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహించి యార్డు బయటకు వచ్చి నరసరావుపేట రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో, ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పలువురు మిర్చి రైతులు మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి క్యూలో నిలబడితే భోజనం అయిపోయిందని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, పాలకవర్గం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. భోజనం పెట్టకపోగా రైతుల పట్ల యార్డు సిబ్బంది హేళనగా మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, కార్యదర్శి ఎం.దివాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇక మీదట యార్డులో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని, రైతులందరికీ భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో మధ్యాహ్న పథక కార్మికులు డిమాండ్ కాకినాడ సిటీ : మధ్యాహ్న భోజనపథకానికి కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని పథకం కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వారు బుధవారం ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పథక కార్మికులు సుమారు రెండుగంటలపాటు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ నుంచి డీఈవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. వర్కర్లు, హెల్పర్లకు కనీసవేతనం రూ.5వేలు ఇవ్వాలని, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వంట చేసే కార్మికులకు బిల్లులు సకాలంలో అందక సరుకుల కోసం అప్పు తెచ్చి వండేపరిస్థితి ఉందన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు సత్తిరాజు, కార్మికులు పాల్గొన్నారు.