హైదరాబాద్: విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాస్‌లు వినేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఓయూలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం యూనివర్సిటీకి ఓయూలో, బాచుపల్లిలో హాస్టల్స్ ఉన్నాయని, వీటిలో భోజన వసతి కూడా ఉండేదని వీసీ తెలిపారు. అయితే ఇకపై ఈ హాస్టళ్లలో ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే భోజనాన్ని అందిస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనాన్ని ఇకపై నాంపల్లిలోని యూనివర్సిటీ సెంటర్‌లో మాత్రమే అందించనున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థులంతా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment