
న్యూఢిల్లీ:వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వేశాఖ తాజాగా మరో సదుపాయం కల్పించింది. టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకోని వారికి కూడా ప్రయాణం సమయంలో అప్పటికప్పుడు ఆహారం అందించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించనుంది.
టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకున్న వారికే ప్రస్తుతం ఆ సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ప్రయాణంలో భోజన వసతి కల్పించడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఐఆర్‌సీటీసీ మార్పులు చేసింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది.