వైష్ణో దేవి భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.
ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్‌కు ఇతర రైళ్ల టిక్కెట్ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్‌లో రూ. 1610 టిక్కెట్‌తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్‌లో వెళితే ఒక్కో ప్రయాణికునికి రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment