vaishno devi
-
వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు. -
వైష్ణోదేవి దర్శనానికి వందేభారత్... ఖర్చెంత?
వైష్ణో దేవి భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్‌కు ఇతర రైళ్ల టిక్కెట్ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్లో రూ. 1610 టిక్కెట్‌తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్‌లో వెళితే ఒక్కో ప్రయాణికునికి రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్, ఆఫ్లైన్లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. -
వైష్ణోదేవికి కట్టుదిట్టమైన భద్రత
జమ్మూ డివిజన్లో ఇటీవల నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణో దేవిని సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఉగ్రదాడులను ఖండిస్తూ భక్తులు వైష్ణోదేవి యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు తరలివస్తున్నారు.మరోవైపు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు కాట్రాలో చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైష్ణో దేవి దర్శనం కోసం కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుని వైష్ణో దేవి ఆలయం దిశగా ముందుకు కదిలారు.ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తాజాగా వైష్ణో దేవి ఆలయ భద్రతకు సంబంధించి పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ పోలీసు, భద్రతా బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం మాతా వైష్ణో దేవి భవన్ ప్రాంగణంలో అదనపు సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల సిబ్బందిని మోహరించారు. ప్రసుతం వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తులలో కమాండోలు పహారా కాస్తున్నారు. గురువారం 38 వేల మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకున్నారు. -
వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. -
వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
దేశంలోని చాలామంది తీర్థయాత్రలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. తమకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాలకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వస్తున్న భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను కొద్దిసేపు నిలిపివేసింది. కొద్దిసేపటి తరువాత భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనాలకు అనుమతినిచ్చింది. మాతా వైష్ణో దేవి ఆలయం జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! #WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj — ANI (@ANI) January 1, 2024 -
వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి
నూతన సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి క్షేత్రంతో సహా హిమాచల్‌లోని పలు శక్తిపీఠాలను నందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. వైష్ణోదేవి ఆలయానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్‌లోని అన్ని శక్తిపీఠాలను పూలతో అందంగా అలంకరించారు. జ్వాలాజీ, బజరేశ్వరి, చాముండ, నయన దేవి, చింతపూర్ణి క్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నయన దేవి క్షేత్రంలో నూతన సంవత్సర మేళా ప్రారంభమైంది. ఆలయ తలుపులు 22 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. కాంగ్రాలోని చాముండ దేవాలయం తలుపులు తెల్లవారుజామున 4:00 గంటలకే తెరిచారు. హిమాచల్‌లోని పలు హోటళ్లు ఇప్పటికే భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో మనాలికి 60 నుంచి 70 వేల మంది పర్యాటకులు తరలివచ్చారు. డిసెంబర్ 31 (ఈరోజు) సాయంత్రం నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా. మరోవైపు సిమ్లా ఇప్పటికే టూరిస్టులతో నిండిపోయింది. రోహ్తంగ్ పరిధిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలో ఆకాశం మేఘావృతమైంది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పట్నిటాప్, నత్తతోప్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ తదితర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హిమాచల్ సిద్ధమైంది. కసౌలి, చైల్, డల్హౌలీలు పర్యాటకులతో నిండిపోయాయి. ఖజ్జియార్లోని హోటళ్లలో 85 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. శనివారం సాయంత్రం నాటికే వందలాది మంది పర్యాటకులు డల్హౌసీ, ఖజ్జియార్‌కు చేరుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు హిమాచల్ చేరుకున్నారు. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, మనాలి మాల్ రోడ్లలో నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లను 24 గంటలూ తెరిచే ఉంచనున్నారు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇది కూడా చదవండి: అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
జమ్మూకశ్మీర్: కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందిన ఘటన జమ్మూలోని కాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం మాతా వైష్ణోదేశి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులతో పాటు వారిని తీసుకెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. వీరంతా పాత మార్గం గుండా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కత్రా జిల్లా పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన మరో 10 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.