జమ్మూ డివిజన్‌లో ఇటీవల నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణో దేవిని సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఉగ్రదాడులను ఖండిస్తూ భక్తులు వైష్ణోదేవి యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు తరలివస్తున్నారు.
మరోవైపు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు కాట్రాలో చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైష్ణో దేవి దర్శనం కోసం కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుని వైష్ణో దేవి ఆలయం దిశగా ముందుకు కదిలారు.
ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తాజాగా వైష్ణో దేవి ఆలయ భద్రతకు సంబంధించి పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ పోలీసు, భద్రతా బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం మాతా వైష్ణో దేవి భవన్ ప్రాంగణంలో అదనపు సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల సిబ్బందిని మోహరించారు. ప్రసుతం వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తులలో కమాండోలు పహారా కాస్తున్నారు. గురువారం 38 వేల మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment