katra
-
జమ్మూకశ్మీర్ యువతలో సాధికారత మొదలైంది... శ్రీనగర్, కాత్రాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కశ్మీర్లో యువ వికాసం
శ్రీనగర్/కాత్రా: జమ్మూకశ్మీర్ యువత ఇక నిస్సహాయులు కాదని, వారితో సాధికారత మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంపై యువతలో విశ్వాసం పెరిగిందని, ఓటుతో మార్పు వస్తుందని వారంతా నమ్ముతున్నారని తెలిపారు. గురువారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో, రియాసీ జిల్లా కాత్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని పునరుద్ఘాటించారు. తమ పరిపాలనలో ఇక్కడి యువతరం ప్రగతి పథంలో ముందడుగు వేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.జమ్మూకశ్మీర్ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అవన్నీ నెరవేరుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలపై మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మూడు కుటుంబ పార్టీలు సొంత లాభం కోసం ప్రజాస్వామ్యాన్ని, కాశ్మీరియత్‌ను అణచివేశాయని మండిపడ్డారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించకుండా దగా చేశా యని ఆరోపించారు. ఓటు వేసినా, వేయకున్నా ఆ మూ డు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తాయన్న ఆలోచన యువతలో ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రజాస్వామ్య పండుగ ‘‘జమ్మూకశ్మీర్‌లో గత ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో సాయంత్రం 6 గంటలకే ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి వచ్చేది. ఇంటింటి ప్రచారం అసాధ్యమే. ఇప్పుడు అర్ధరాత్రి దాకా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేవు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఓటు ప్రజాస్వామిక హక్కు, ఆ హక్కుతో చుట్టూ ఉన్న సమాజంలో కోరుకున్న మార్పును సాధించుకోవచ్చన్న భరోసా యువతలో ఏర్పడింది. సాధికారత దిశగా ఇదొక గొప్ప ముందడుగు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం.కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ. 18 వేల చొప్పున ఇస్తాం. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతాం. జమ్మూకశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందాన్నలదే మా ఆశయం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జమ్మూకశ్మీర్ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. నూతన జమ్మూకశ్మీర్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లే ఎన్నికలివి. అందుకే తెలివిగా ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు చరమగీతం పాడుతాం. ఇప్పుడు మన నినాదం అబ్కీ బార్.. బీజేపీ సర్కార్’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
వైష్ణోదేవికి కట్టుదిట్టమైన భద్రత
జమ్మూ డివిజన్లో ఇటీవల నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణో దేవిని సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఉగ్రదాడులను ఖండిస్తూ భక్తులు వైష్ణోదేవి యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు తరలివస్తున్నారు.మరోవైపు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు కాట్రాలో చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైష్ణో దేవి దర్శనం కోసం కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుని వైష్ణో దేవి ఆలయం దిశగా ముందుకు కదిలారు.ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తాజాగా వైష్ణో దేవి ఆలయ భద్రతకు సంబంధించి పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ పోలీసు, భద్రతా బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం మాతా వైష్ణో దేవి భవన్ ప్రాంగణంలో అదనపు సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల సిబ్బందిని మోహరించారు. ప్రసుతం వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తులలో కమాండోలు పహారా కాస్తున్నారు. గురువారం 38 వేల మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకున్నారు. -
జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీనగర్: జమ్ములో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని, వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన మరో డజను మందికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే.. బస్సు అమృత్సర్ నుంచి కాత్రాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. #WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries. Visuals from the spot. pic.twitter.com/iSse58ovos — ANI (@ANI) May 30, 2023 CRPF, Police and other teams are also here. Ambulances were called & the injured were immediately rushed to hospital. Bodies have also been taken to the hospital. A crane is being brought here to see if someone is trapped under the bus. A rescue operation is underway. We are… pic.twitter.com/0H5FiJ2eQe — ANI (@ANI) May 30, 2023 ఇదీ చదవండి: కరెంట్ పోల్ నిలబెడుతుండగా.. షాక్ తగిలి ఎనిమిది మంది..! -
కశ్మీర్లో ఉగ్రదాడులు
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరో ట్రక్ డ్రైవర్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఉదంపూర్ జిల్లాలోని కట్రాకు చెందిన నారాయణ్ దత్‌ను సోమవారం సాయంత్రం తుపాకీతో కాల్చి చంపారు. కాల్పుల శబ్దం వినగానే దగ్గర్లోనే ఉన్న సీనియర్ పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు ట్రక్ డ్రైవర్లను కాపాడారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం నలుగురు ట్రక్ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపడం గమనార్హం. మరణించిన వారంతా కశ్మీరీయేతర ప్రాంతాలకు చెందినవారే. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి.. కశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. నగరంలోని ఓ బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న జనాలే లక్ష్యంగా గ్రెనేడ్ విసిరారు. ఈ పేలుడులో 20 మంది ప్రజలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన చుట్టుపక్కల్లో ప్రాంతాల్లో సోదాలు మొదలుపెట్టారు. -
భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ...
ఢిల్లీ : కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త. ఢిల్లీ నుంచి కాట్రా వరకు ప్రయాణించే రెండవ వందే-భారత్ రైలును ప్రారంభించనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఇది ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత్ మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు అనుకూలంగా ఉండే ఢిల్లీ-కాట్రా వందే భారత్ రైలును నవరాత్రి రోజుల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. मुझे यह सूचित करते हुए अत्यंत खुशी हो रही है कि, आधुनिकतम और मेक इन इंडिया के तहत बनी दूसरी वंदे भारत एक्सप्रेस का नई दिल्ली से माँ वैष्णो देवी के पावन स्थल कटरा तक ट्रायल रन पूरा हो चुका है और माता के भक्तों के लिए यह ट्रेन नवरात्रो में शुरू कर दी जाएगी। जय माता दी 🚩 pic.twitter.com/U3RcCxOYUi — Piyush Goyal (@PiyushGoyal) September 18, 2019 భారత రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ట్రయల్ రన్ కింద ఢిల్లీ-కాట్రా వందే-భారత్ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతంగా పూర్తి అయిందనీ, ఇది వైష్ణో దేవి యాత్రికులకు శుభవార్త అని పేర్కొన్నారు. ఈ రైలు ఢిల్లీ జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు.. కాట్రాకు 8 గంటల్లో చేరుకోనుందన్నమాట. అలాగే రద్దీగా ఉండే పలు రైల్వే మార్గాలను సరళీకృతం చేయడానికి ప్రయత్రిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ- హౌరా రైళ్లు 2021 నాటికి సిద్ధమవుతాయన్నారు. ఇక నూతనంగా ప్రారంభించబోతున్న 40 వందే-భారత్ రైళ్ల గురించి మాట్లాడుతూ..వీటి టెండర్ విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పూర్తి పారదర్శకతతో కొత్త టెండరింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు పూర్తి భారతీయ సాంకేతికతతో తయారు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ-కాట్రా రైలు ఢిల్లీ జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. -
ఆ హెలికాప్టర్‌ను కూల్చింది ఓ పక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కాట్రా ప్రాంతంలో సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ఓ పక్షి కారణమని తెలుస్తోంది. హెలికాప్టర్‌కు ఓ పక్షి తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనా స్థలంలో పక్షి మృతదేహం లభించిందని, ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మలా సింగ్ తెలిపారు. సింగిల్ ఇంజన్‌తో కూడిన ఈ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక్కసారిగా పక్షి తగలడంతో అది అదుపు తప్పి కూలిపోయిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా, ఏడుగురు మరణించారు. వారిలో ముగ్గురు ఢిల్లీకి చెందినవారు కాగా, ఇద్దరు జమ్మూకు చెందినవారని అధికారులు గుర్తించారు. ఈ విమానం హిమాలయన్ హెలీ సర్వీస్‌కు చెందినది. దైవదర్శనానికి వైష్ణోదేవి బయల్దేరిన తమ కుటుంబసభ్యులు మరణించడంపై వారి బంధువులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. -
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!!
-
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!!
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి, సాహస యాత్రలు చేయడానికి బేస్ క్యాంపు అయిన కట్రాకు ఎట్టకేలకు రైలు మార్గం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన జమ్ము కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఈ మార్గంలో తొలి రైలును ప్రారంభించారు. ఈ రైలు వల్ల వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు వెళ్లే మొత్తం మార్గంలోని 25 కిలోమీటర్ల మార్గంలో పది సొరంగాలు ఉన్నాయి. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేయొచ్చని ప్రధాని మోడీ సూచించారు. ముందుగా జమ్ముకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మోడీ.. అక్కడినుంచి హెలికాప్టర్లో కట్రాకు వెళ్లారు. అక్కడే కట్రా నుంచి ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలును ఆయన ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ వెంట జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. వైష్ణోదేవి ఆలయానికి ప్రతియేటా దాదాపు 50 లక్షల మంది వెళ్తుంటారు. దాంతో ఈ మార్గంలో వెళ్లే రైలుకు మంచి డిమాండు ఉంటుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. కాశ్మీరుకు మిగిలిన భారతదేశంతో రైలు మార్గంతో అనుసంధానం చేయాలన్న ప్రాజెక్టులో ఒక భాగమే ఈ ఢిల్లీ- కట్రా రైలు. ఇక కట్రా రైల్వేస్టేషన్ మొత్తం సౌరవిద్యుత్ తోనే పనిచేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూల స్టేషన్. దేశంలోనే ఇలా పూర్తి సౌరవిద్యుత్తుతో పనిచేస్తున్న స్టేషన్ ఇదే మొదటిది. -
వైష్ణోదేవి గుడిలో 43 కిలోల నకిలీ బంగారం
దేవుడంటే భయం, భక్తి రెండూ ఉంటాయి. వాటివల్లే కాస్త జాగ్రత్తగా ఉంటారని అనుకుంటాం. కానీ, జమ్ము కాశ్మీర్‌లోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలలో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి.. అంతా నకిలీదేనట!! ఈ విషయం సమాచార హక్కు చట్టం దరఖాస్తులో వెల్లడైంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 193.5 కిలోల బంగారం, 81,635 కిలోల వెండిని కట్రా పట్టణంలోని వైష్ణోదేవి ఆలయంలో సమర్పించారు. ఇందులో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి నకిలీవిగా తేలాయని ఆలయ పాలకమండలి సీఈవో ఎంకే భండారీ వెల్లడించారు. సాధారణంగా అయితే తాము ఇలా వచ్చిన బంగారం, వెండి మొత్తాన్ని ప్రభుత్వానికి పంపి, వాటిని కరిగించి బంగారు, వెండి నాణేలుగా మార్చి భక్తులకు ఇస్తామని ఆయన తెలిపారు. అయితే, భక్తులు కావాలని ఇలా నకిలీ బంగారం వేసి ఉండకపోవచ్చని, వారు కొనేటప్పుడు నాణ్యత పరీక్షలు చేయించుకోకపోవడమే ఇందుకు కారణం అయి ఉండొచ్చని భండారీ చెప్పారు. వైష్ణోదేవి ఆలయానికి గత సంవత్సరం కోటి మందికి పైగా భక్తులు వచ్చారు.