వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి, సాహస యాత్రలు చేయడానికి బేస్ క్యాంపు అయిన కట్రాకు ఎట్టకేలకు రైలు మార్గం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన జమ్ము కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఈ మార్గంలో తొలి రైలును ప్రారంభించారు. ఈ రైలు వల్ల వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు వెళ్లే మొత్తం మార్గంలోని 25 కిలోమీటర్ల మార్గంలో పది సొరంగాలు ఉన్నాయి. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయొచ్చని ప్రధాని మోడీ సూచించారు. ముందుగా జమ్ముకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మోడీ.. అక్కడినుంచి హెలికాప్టర్లో కట్రాకు వెళ్లారు. అక్కడే కట్రా నుంచి ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలును ఆయన ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ వెంట జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. వైష్ణోదేవి ఆలయానికి ప్రతియేటా దాదాపు 50 లక్షల మంది వెళ్తుంటారు. దాంతో ఈ మార్గంలో వెళ్లే రైలుకు మంచి డిమాండు ఉంటుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. కాశ్మీరుకు మిగిలిన భారతదేశంతో రైలు మార్గంతో అనుసంధానం చేయాలన్న ప్రాజెక్టులో ఒక భాగమే ఈ ఢిల్లీ- కట్రా రైలు. ఇక కట్రా రైల్వేస్టేషన్ మొత్తం సౌరవిద్యుత్ తోనే పనిచేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూల స్టేషన్. దేశంలోనే ఇలా పూర్తి సౌరవిద్యుత్తుతో పనిచేస్తున్న స్టేషన్ ఇదే మొదటిది.
Published Fri, Jul 4 2014 6:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
Advertisement