vaishno devi shrine
-
కొత్త సంవత్సరం వేళ విషాదం.. ప్రధాని మోదీ సంతాపం
జమ్మూకశ్మీర్: నూతన ఏడాదివేళ జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, కొత్త సంవత్సరం కావడంతో భక్తులు ఆలయంలో పూజలకు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోదీ సంతాపం వైష్ణోదేవి ఆలయ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిహారం ప్రకటించిన లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూకశ్మీర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. -
వైష్ణోమాత ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, కటారా : జమ్మూకశ్మీర్‌లోని సుప్రసిద్ధ వైష్ణోమాత ఆలయానికి దుర్గా నవరాత్రుల సందర్భంగా భక్తులు పోటెత్తారు. నవరాత్రులు మొదలైన మూడురోజుల్లోనే అమ్మావారిని లక్షకు పైగా భక్తులు దర్శించారని అధికారులు వెల్లడించారు. రాజధాని జమ్మూకు 42 కిలోమీటర్ల దూరంలో.. కటారా బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉన్న ఆలయానికి.. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవరాత్రుల్లో మొదటి రోజు గురువారం నాడు 40 వేలమంది, రెండోరోజు శుక్రవారం 27 వేల 500 మంది, మూడోరోజు శనివారం 40 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు రిజిస్ట్రేషన్ ఇన్చార్జి అధికారి మహేశ్ సింగ్ చెప్పారు. శుక్రవారం నాడు.. దక్షిణ జమ్మూలో టెర్రరిస్టులు బాంబులు పేల్చడంతో.. భక్తుల సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు. నవరాత్రులు.. అందులోనూ భక్తులు అమ్మావారిని దర్శించుకునేందుకు విపరీతంగా వస్తుండడంతో.. టెర్రిరిస్ట్ దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయానికి, భక్తులకు భారీ రక్షణ ఏర్పాట్లు చేశామని జమ్మూ కశ్మీర్ మంత్రి అజయ్ నందా ప్రకటించారు. -
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!!
-
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!!
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి, సాహస యాత్రలు చేయడానికి బేస్ క్యాంపు అయిన కట్రాకు ఎట్టకేలకు రైలు మార్గం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన జమ్ము కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఈ మార్గంలో తొలి రైలును ప్రారంభించారు. ఈ రైలు వల్ల వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు వెళ్లే మొత్తం మార్గంలోని 25 కిలోమీటర్ల మార్గంలో పది సొరంగాలు ఉన్నాయి. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేయొచ్చని ప్రధాని మోడీ సూచించారు. ముందుగా జమ్ముకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మోడీ.. అక్కడినుంచి హెలికాప్టర్లో కట్రాకు వెళ్లారు. అక్కడే కట్రా నుంచి ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలును ఆయన ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ వెంట జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. వైష్ణోదేవి ఆలయానికి ప్రతియేటా దాదాపు 50 లక్షల మంది వెళ్తుంటారు. దాంతో ఈ మార్గంలో వెళ్లే రైలుకు మంచి డిమాండు ఉంటుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. కాశ్మీరుకు మిగిలిన భారతదేశంతో రైలు మార్గంతో అనుసంధానం చేయాలన్న ప్రాజెక్టులో ఒక భాగమే ఈ ఢిల్లీ- కట్రా రైలు. ఇక కట్రా రైల్వేస్టేషన్ మొత్తం సౌరవిద్యుత్ తోనే పనిచేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూల స్టేషన్. దేశంలోనే ఇలా పూర్తి సౌరవిద్యుత్తుతో పనిచేస్తున్న స్టేషన్ ఇదే మొదటిది.