ఢిల్లీ : కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త. ఢిల్లీ నుంచి కాట్రా వరకు ప్రయాణించే రెండవ వందే-భారత్ రైలును ప్రారంభించనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఇది ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత్ మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు అనుకూలంగా ఉండే ఢిల్లీ-కాట్రా వందే భారత్ రైలును నవరాత్రి రోజుల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ తన ట్విటర్ ద్వారా తెలియజేశారు.
मुझे यह सूचित करते हुए अत्यंत खुशी हो रही है कि, आधुनिकतम और मेक इन इंडिया के तहत बनी दूसरी वंदे भारत एक्सप्रेस का नई दिल्ली से माँ वैष्णो देवी के पावन स्थल कटरा तक ट्रायल रन पूरा हो चुका है और माता के भक्तों के लिए यह ट्रेन नवरात्रो में शुरू कर दी जाएगी।
— Piyush Goyal (@PiyushGoyal) September 18, 2019
जय माता दी 🚩 pic.twitter.com/U3RcCxOYUi
భారత రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ట్రయల్ రన్ కింద ఢిల్లీ-కాట్రా వందే-భారత్ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతంగా పూర్తి అయిందనీ, ఇది వైష్ణో దేవి యాత్రికులకు శుభవార్త అని పేర్కొన్నారు. ఈ రైలు ఢిల్లీ జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు.. కాట్రాకు 8 గంటల్లో చేరుకోనుందన్నమాట.
అలాగే రద్దీగా ఉండే పలు రైల్వే మార్గాలను సరళీకృతం చేయడానికి ప్రయత్రిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ- హౌరా రైళ్లు 2021 నాటికి సిద్ధమవుతాయన్నారు. ఇక నూతనంగా ప్రారంభించబోతున్న 40 వందే-భారత్ రైళ్ల గురించి మాట్లాడుతూ..వీటి టెండర్ విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పూర్తి పారదర్శకతతో కొత్త టెండరింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు పూర్తి భారతీయ సాంకేతికతతో తయారు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ-కాట్రా రైలు ఢిల్లీ జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment