
అయోధ్య: యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినది మొదలు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.
ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగింది. అప్పటి నుంచి నేటివరకూ 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు.
అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకల విషయానికొస్తే స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో కానుకలు అందుతున్నాయి. గడచిన ఏడాదిలో ఆలయానికి కానుకలు, విరాళాల రూపంలో మొత్తం రూ. 700 కోట్లు అందింది. మహాకుంభ్ ప్రారంభమయ్యాక రూ. 15 కోట్ల ఆదాయం సమకూరింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది. ఒక నివేదికను అనుసరించి చూస్తే షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుండగా, వైష్ణోదేవికి ప్రతీయేటా రూ. 400 కోట్ల వరకూ ఆదాయం అందుతోంది.
ఇది కూడా చదవండి: బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి..
Comments
Please login to add a commentAdd a comment