Income
-
నిజంగానే వ్యవసాయ ఆదాయం ఉందా? లేక...
మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం మీద ఆదాయం చేతికొస్తే, ఎటువంటి పన్ను భారం లేదు. ఈ వెసులుబాటు 1961 నుంచి అమల్లో ఉంది. చట్టంలో నిర్వచించిన ప్రకారం వ్యవసాయ భూమి ఉంటే, అటువంటి భూమి మీద ఆదాయం/రాబడికి ఆదాయపు పన్ను లేదు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఎటువంటి ఏ ఇతర ఆదాయం లేకపోతే, వచ్చిన ఆదాయం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా మినహాయింపులోనే ఉంటుంది. ఎటువంటి పన్నుకి గురి కాదు. భూమి, ఆదాయం ఈ రెండూ, తూ.చా. తప్పకుండా ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన ప్రకారం ఉండాలి. ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మినహాయింపు ఇస్తారు.కొంత మందికి అటు వ్యవసాయ ఆదాయం, ఇటు వ్యవసాయేతర ఆదాయం రెండూ ఉండొచ్చు. వారు రిటర్న్ వేసేటప్పుడు రెండు ఆదాయాలను జోడించి వేయాలి. దానికి అనుగుణంగా ఆ ఆదాయాలపై పన్ను లెక్కించి, అందులో మినహాయింపులు ఇవ్వడమనేది .. ఇదంతా ఒక రూలు. దాని ప్రకారం లెక్క చెప్తే పన్నుభారం పూర్తిగా సమసిపోదు కానీ ఎక్కువ శాతం రిలీఫ్ దొరుకుతుంది. పై రెండు కారణాల వల్ల, రెండు ఉపశమనాల వల్ల ట్యాక్స్ ఎగవేసే వారు.. ఎప్పుడూ ఎలా ఎగవేయాలనే ఆలోచిస్తుంటారు. ట్యాక్స్ ప్లానింగ్‌లో ప్రతి ఒక్కరికి అనువుగా దొరికేది వ్యసాయ ఆదాయం. అక్రమంగా ఎంతో ఆర్జించి, దాని మీద ట్యాక్స్ కట్టకుండా బైటపడే మార్గంలో అందరూ ఎంచుకునే ఆయుధం ‘వ్యవసాయ ఆదాయం’. దీన్ని ఎలా చూపిస్తారంటే..👉 తమ పేరు మీదున్న పోరంబోకు జాగా, 👉 ఎందుకు పనికిరాని జాగా. 👉 వ్యవసాయ భూమి కాని జాగా 👉 సాగుబడి చేయని జాగా 👉 తమ పేరు మీద లేకపోయినా చూపెట్టడం 👉 కౌలుకి తీసుకోకపోయినా దొంగ కౌలు చూపడం 👉 కుటుంబంలో తాత, ముత్తాతల పొలాలను తమ పేరు మీద చూపెట్టుకోవడం 👉 బహుమతులు, ఇనాముల ద్వారా వచ్చిన జాగా 👉 దురాక్రమణ చేసి స్వాధీనపర్చుకోవడం మరికొందరు నేల మీదే లేని జాగాని చూపెడతారు. ఇలా చేసి ఈ జాగా.. చక్కని మాగణి అని.. బంగారం పండుతుందని బొంకుతారు. కొంత మంది సంవత్సరానికి రూ. 50,00,000 ఆదాయం వస్తుందంటే ఇంకొందరు ఎకరానికి రూ. 5,00,000 రాబడి వస్తుందని చెప్పారు. ఈ మేరకు లేని ఆదాయాన్ని చూపించి, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోకి పాకింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కొనసాగింది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల మీద లెక్కలేనంత ఆదాయం చూపించారు. అధికారులు, మామూలుగానే, వారి ఆఫీసు రూమ్‌లో అసెస్మెంట్ చేస్తేనే అసెస్సీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అధికారులు అడిగే ప్రశ్నలకు, ఆరా తీసే తీరుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది, ఈసారి అధికారులు శాటిలైట్ చిత్రాల ద్వారా వారు చెప్పిన జాగాలకు వెళ్లారు. అబద్ధపు సర్వే నంబర్లు, లేని జాగాలు, బీడు భూములు, అడవులు, చౌడు భూములు, దొంగ పంటలు, దొంగ కౌళ్లు, లేని మనుషులు, దొంగ అగ్రిమెంట్లు.. ఇలా ఎన్నో కనిపించాయి. ఇక ఊరుకుంటారా.. వ్యసాయ ఆదాయాన్ని మామూలు ఆదాయంగా భావించి, అన్ని లెక్కలూ వేశారు. ఇరుగు–పొరుగువారు ఎన్నో పనికిమాలిన సలహాలు ఇస్తారు. వినకండి. ఫాలో అవ్వకండి. ఒకవేళ ఫాలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగవేతకు ఒక మార్గమే ఉంది. కానీ ఇప్పుడు ఎగవేతలను ఏరివేసి, సరిచేసి, పన్నులు వసూలు చేసే మార్గాలు వందలాది ఉన్నాయి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. ఇక అది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్‌లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్‌లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది. -
విదేశీ ఆస్తులు, ఆదాయం చూపించలేదా..
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 నవంబర్ 17 నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ‘మీలో ఎవరైనా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని డిక్లేర్ చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి‘ అనేది దీని సారాంశం. సాధారణంగా ఐటీఆర్‌లు దాఖలు చేసినప్పుడు, ప్రతి అస్సెస్సీ ముఖ్యంగా రెసిడెంట్ స్టేటస్ గల వారు తమ ఆదాయాన్ని .. అంటే మనదేశంలో వచ్చిన ఆదాయంతో పాటు విదేశాల్లో వచ్చినదాన్ని కూడా చూపించాలి.నాన్ రెసిడెంట్లు కేవలం మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని చూపిస్తే చాలు. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలు డిక్లేర్ చేయక్కర్లేదు. పన్ను భారమనేది అస్సెస్సీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్న వ్యవధి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే రెసిడెంట్ అవుతారు. లేకపోతే నాన్ రెసిడెంట్లవుతారు. ఈ వ్యవధిని లెక్కించడానికి పాస్‌పోర్ట్‌లోని పద్దులు, ఎంట్రీలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాటి ప్రకారం రోజులను లెక్కిస్తారు.సాధారణంగా మనందరం రెసిడెంట్లు అవుతాం. పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటం వల్ల వారు నాన్ రెసిడెంట్లు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టేటస్‌ను తప్పుగా పేర్కొనకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు, అవగాహన కల్పించేందుకు, విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తప్పులుంటే/తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. మీ రిటర్నును రివైజ్ చేసుకోండి .. అని చెప్పారు. దీనిపై మెసేజీలు పంపారు. ఇవి రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు.వెంటనే తమ స్టేటస్‌ని, ఆదాయాన్ని, ఆస్తుల వివరాలను చెక్ చేసుకున్నారు. 30,161 మంది అస్సెస్సీలు తమ తప్పులను సరి చేసుకున్నారు. వారి వారి ఆస్తులను (విదేశాల్లోనివి) డిక్లేర్ చేశారు. వీరిలో 24,678 మంది రివ్యూ చేసుకున్నారు. 5,483 మంది తమ రిటర్నులను రివైజ్ చేసుకున్నారు. దీనితో రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు అదనంగా ఉన్నట్లు బైటపడింది. వాటి ద్వారా అదనంగా రూ. 1,089 కోట్ల ఆదాయం బైటికొచ్చింది.అంతే కాకుండా 6,734 మంది వారి స్టేటస్‌ను రెసిడెంటు నుంచి నాన్ రెసిడెంటుగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవగాహన, పారదర్శకత పెరుగుతోంది. నిబంధనలను పాటించడం (కాంప్లయెన్స్) పెరిగింది. కీలక వివరాలు తెలిశాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి.కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (సీఆర్ఎస్) ద్వారా విదేశాల్లోని పన్ను అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి సమగ్రమైన సమాచారం వస్తోంది. అంతే కాకుండా విదేశీ ఖాతాల నుంచి సమాచారం వస్తోంది. పలు చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించారు. కరపత్రాలు, బ్రోచర్లు పంచారు. సోషల్ మీడియా వాడుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు స్నేహపూర్వకంగా జరుగుతోంది. ఇలాగే కొనసాగాలంటే, ‘వాళ్లు మన గురించి తెలుసుకుంటున్నారన్న విషయాన్ని‘ మనం అర్థం చేసుకుని మసలుకోవాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
మహాకుంభ్‌తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు కోట్లాది మంది జనం తరలివచ్చారు. ఫలితంగా యూపీ సర్కారుకు లెక్కలేనంత ఆదాయం సమకూరింది. కుంభమేళాకు వచ్చేందుకు జనం ప్రధానంగా రైళ్లను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది.నెలన్నర పాటు జరిగిన మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్(Prayagraj) లోని ఎనిమిది రైల్వే స్టేషన్ల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లిన రైళ్ల ద్వారా రైల్వేశాఖకు టిక్కెట్ల విక్రయాల రూపంలో దాదాపు రూ.200 కోట్లు సమకూరాయి. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌కు చెందిన డీఆర్ఎం హిమాన్షు బదోనీ, సీనియర్ డీసీఎం హిమాన్షు శుక్లా తెలిపిన వివరాల ప్రకారం మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని నాలుగు రైల్వే స్టేషన్లలో రూ.159.20 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్లోని మూడు రైల్వే స్టేషన్ల నుండి రూ.21.79 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈశాన్య రైల్వేలోని వారణాసి డివిజన్లోని రెండు రైల్వే స్టేషన్ల నుండి రూ.6 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించడం ద్వారా రైల్వేలు అధిక ఆదాయాన్ని ఆర్జించాయి. 2019 కుంభమేళాలో రైల్వేశాఖ 86 కోట్ల రూపాయల విలువైన టిక్కెట్లను విక్రయించింది.మహాకుంభమేళాకు ఊహించనంత సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, అయితే రైల్వేశాఖ(Railways) గత మూడేళ్లుగా ముందస్తు చర్యలు చేపట్టిన కారణంగా ఎక్కడా ఎటువంటి సమస్య రాలేదని డిఆర్ఎం హిమాన్షు బదోనీ తెలిపారు. ఇదిలావుండగా రైల్వేశాఖ 2031లో జరగబోయే కుంభమేళా కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మూడు రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్‌లను కలుపుతూ రైళ్లను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి -
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రతినెలా రూ.22 వేల కోట్ల ఆదాయం అవసరమని, అంత ఉంటేనే సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా నడపగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వేతనాలు, అప్పులకే రూ.13 వేల కోట్లు పోతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి క్యాన్సర్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏం చేయాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్ కాలేజీ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు బుధవారం రవీంద్రభారతి వేదికగా ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రొటేషన్ మాత్రమే చేస్తోంది.. ‘ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తోంది. రూ.6,500 కోట్లు అప్పులు తిరిగి చెల్లించేందుకు కడుతున్నాం. మిగిలిన రూ.5 వేల కోట్ల నుంచి రూ.5.5 వేల కోట్లల్లోనే 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు చెల్లించాలి. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా ఈ నిధులే వాడుకోవాలి. ఈ ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెలలో ఒక్కో పథకానికి చెల్లింపు పెండింగ్‌లో పెడుతున్నాం. మా ప్రభుత్వం రొటేషన్ చేసే పని మాత్రమే చేస్తోంది. గత సీఎం క్యాన్సర్ ఇచ్చిపోయాడు గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి క్యాన్సర్ ఇచ్చి పోయాడు. దీన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుంటే పది నెలలకే దిగిపొమ్మంటున్నారు. తల తాకట్టు పెట్టి ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజు వేతనాలు ఇస్తున్నాం. ఉద్యోగులు విపక్షాల మాటలకు ప్రభావితం కావొద్దు. స్టేచర్ ఉందనుకునే నాయకులు స్ట్రెచ్చర్ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి మార్చురీకి కూడా నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లను. నా కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. పనిచేసి జీవిస్తా..’అని సీఎం అన్నారు. అధ్యాపకులు భవిష్యత్తుకు బాటలు వేయాలి ‘ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిలో భావోద్వేగం కన్పిస్తోంది. పరీక్షలు రాసి 12 ఏళ్ళు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేమి కాలయాపనకు కారణం. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపా. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా లేదు. గత పాలకుల ఉద్యోగాలు తీసి వేయడం వల్లే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ భవిష్యత్‌కు అధ్యాపకులు బాటలు వేయాలి. అంకిత భావంతో పనిచేయాలి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభు త్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిజానికి ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైన టీచర్లు ఉన్నారు. అయినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? సర్కారీ స్కూళ్ళల్లో పోటీ తత్వం పెరగాలి. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఇంజనీరింగ్‌లో నాణ్యత ఉండటం లేదు..‘రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఇందులో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్సు కోసం ఆరాటపడుతున్నా, వారికి బేసిక్స్ కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో వెనుకబాటును అధిగమించడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం..’అని సీఎం వివరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్లు నమోదవుతున్నాయన్నారు. ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్‌ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. -
మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్‌లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు. అంచనాలను మించి..విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు. భారీగా ఆర్థిక కార్యకలాపాలుఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది. 150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధిమహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్‌రాజ్‌కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్‌లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్ -
ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య
అయోధ్య: యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినది మొదలు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగింది. అప్పటి నుంచి నేటివరకూ 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు.అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకల విషయానికొస్తే స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో కానుకలు అందుతున్నాయి. గడచిన ఏడాదిలో ఆలయానికి కానుకలు, విరాళాల రూపంలో మొత్తం రూ. 700 కోట్లు అందింది. మహాకుంభ్ ప్రారంభమయ్యాక రూ. 15 కోట్ల ఆదాయం సమకూరింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది. ఒక నివేదికను అనుసరించి చూస్తే షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుండగా, వైష్ణోదేవికి ప్రతీయేటా రూ. 400 కోట్ల వరకూ ఆదాయం అందుతోంది.ఇది కూడా చదవండి: బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి.. -
MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్‌వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?మన చాయ్‌వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్) View this post on Instagram A post shared by Shubham Prajapat (@madcap_alive)స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్‌వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే. -
ఆదాయార్జనకు కొత్త ఆలోచనలు చేయండి
సాక్షి, అమరావతి: ఖజానాకు రాబడులు పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఆదాయార్జన కోసం కొత్త ఆలోచనలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయట పడేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వనరులు, ఆదాయ వృద్ధిపై మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో రొటీన్‌గా పనిచేస్తే ఫలితాలు రావని.. వినూత్న ఆలోచనలతో పనిచేయాలన్నారు. వాణిజ్య పన్నుల ఎగవేతలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయొద్దన్నారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, 16వ ఆరి్థక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించానని, అధికారులు కూడా దీనిని అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎంకు వివరణ ఇస్తూ.. 2023–24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం రూ.41,420 కోట్లు రాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.41,382 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ విభాగంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని తెలిపారు. నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఆదాయం పెరుగుతుందని వివరించారు.మైనింగ్ శాఖలో ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదన్నారు. కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యలతో మైనింగ్ ఆదాయాన్ని పెంచాలని సీఎం అన్నారు. సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఉగాది నుంచి పీ–4 విధానంపేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ–4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ తీసుకురావాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రణాళిక శాఖపై సమీక్ష సందర్భంగా పీ–4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారని.. వారిని స్వయంగా ఆహ్వానించి ఉగాది రోజున పీ–4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామన్నారు. -
టీడీఎస్‌లో మార్పులు.. అద్దె ఆదాయంపై భారీ ఊరట
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో టీడీఎస్‌కి కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు."ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.టీడీఎస్‌లో ప్రధాన మార్పులు ఇవే..సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంపుఅద్దె ఆదాయంపై టీడీపీ పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుపాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది. విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్!
సాక్షి, హైదరాబాద్: సొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దూసుకుపోతోందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25 వెల్లడించింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో వసూలవుతున్న పన్నుల్లో సగం కంటే ఎక్కువ మొత్తం సొంత పన్నుల( Own Tax Revenue) ద్వారానే వస్తోందని.. అందులో అత్యధికంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడి 88శాతంగా ఉందని తెలిపింది. కర్ణాటక, హరియాణా రాష్ట్రాలు 86 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.శుక్రవారం ప్రారంభమైన లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా అంశాల్లో ముందంజలో ఉందని వెల్లడైంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ హబ్‌గా మారిందని.. కర్ణాటక, మహారాష్ట్రలతో పోటీగా ఇక్కడ రియల్ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందుతోందని ఈ సర్వే తెలిపింది.రాష్ట్రంలో 100శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోందని, 86 శాతం సాగుయోగ్యమైన భూములకు నీటి సౌకర్యం ఉందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక సర్వే (2024–25)లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విశేషాలివీ.. ⇒ ఎగుమతుల పెంపు కోణంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ–కామర్స్ మార్కెట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ–కామర్స్ వ్యా ప్తికి ఇతోధికంగా దోహదపడనుంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లో అమ్మకపు సంస్థల ప్రాతినిధ్యాన్ని పెంచేదిగా ఉంది. ⇒ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు దేశంలోని 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17శాతం) మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 2024 నవంబర్ 26 నాటికి ఈ పథకం కింద మరో 12.06 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతోంది. ప్రస్తుతం దేశంలోని 79.1 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు చేరుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం గ్రామీణ కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఒకటి. ⇒ ఇస్రో చేపట్టిన అనేక భౌగోళిక వేదికల ద్వారా గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, న్యాయ, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా రంగాల్లో సామర్థ్యం పెరగడంతోపాటు ఆయా రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తోన్న పురోగతిని తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో భువన్ వేదిక ద్వారా వెబ్‌జీఐఎస్ పోర్టల్‌తో ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా నిర్వహణ సాధ్యమవుతోంది. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తి అత్యధికంగా జరుగుతోంది మన దేశంలోనే. మన దేశంలోని రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే 87 శాతం సిమెంట్ పరిశ్రమలున్నాయి. ⇒ రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో సేవల రంగం గణనీయ పాత్ర పోషిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని సేవల రంగం వాటా దేశంలోని అన్ని రాష్ట్రాల వాటాలో 25 శాతాన్ని మించుతోంది. తెలంగాణలో స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతంగా నమోదైంది. దేశంలో ఈ రంగంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. ⇒ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవల రంగాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై నగరాల్లో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. ఆయా నగరాల్లో ఐటీ, ఫిన్‌టెక్ సేవల విస్తృతి కారణంగా ఆఫీసు, నివాస స్థలాల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ⇒ కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు సర్విసుల రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. పారిశ్రామిక అభివృద్ధిలో ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కేంద్రంగా ముందుకెళుతుండటమే ఇందుకు కారణం. ⇒ సామూహిక అభ్యాస కార్యక్రమాల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ మోడల్ విద్య కొనసాగుతోంది. తద్వారా తక్కు వ సంఖ్యలో ఉండే సమూహాలు అభ్యసనం, బో ధన తదితర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి.కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ సర్విసుల విస్తృతి గణనీయంగా ఉంది. వాణిజ్య సేవల రంగమైన ఐటీ రంగమే తెలంగాణ తలసరి ఆదాయ వాటాలోనూ సింహభాగం నమోదు చేస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ హబ్‌గా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఇందుకు దీర్ఘకాలికంగా దోహదపడనుంది. దేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ రాష్ట్రంగా తెలంగాణ రూపొందింది.2016–21 మధ్య దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం బాగా పెరిగింది. పంజాబ్ (98శాతం), హరియాణా (94), తెలంగాణ (86), ఉత్తరప్రదేశ్ (84శాతం)లలో సాగుయోగ్యమైన భూములకు ఎక్కువగా నీటి సౌకర్యం అందుతోంది. -
ఆదాయం ఏం మారలేదబ్బా..!
సాక్షి, అమరావతి: దేశంలో గత ఏడాది 41.5 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయంలో ఎటువంటి మార్పులేదు. 36.0 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది. 22.6 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల సెంటిమెంట్స్ సర్వేలో ఈ విషయాలు గుర్తించినట్లు నాబార్డు వెల్లడించింది.వివిధ రాష్ట్రాల్లో గ్రామాల్లోని కుటుంబాల ఆదాయం, వినియోగం, ఆర్థిక పొదుపు, రుణాలు, మూలధన పెట్టుబడులకు సంబంధించి సర్వే చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అంచనా వేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగ డిమాండ్ ఉత్సాహంగా ఉందని సర్వే తెలిపింది. పొదుపు చేయడంలో గ్రామీణ కుటుంబాల్లో ఎటువంటి మార్పులేదని, మూలధన పెట్టుబడి పెట్టిన కుటుంబాల శాతం పెరిగిందని సర్వేలో తేలింది. -
ఇన్‌కం.. లేదు నమ్మకం!
దేశంలో 24 శాతం మంది మాత్రమే 2025లో తమ కుటుంబ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అదే విధంగా 48 శాతం మంది తమ సంపాదన ఈ ఏడాది 25 శాతం వరకూ లేదా అంతకన్నా ఎక్కువ తగ్గొచ్చని ఆందోళన చెందుతున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు తేలింది. ఈ సర్వేలో 16,111 మంది పాల్గొన్నారు. సేవింగ్స్ గురించి ప్రశ్నించగా.. 27 శాతం మంది మాత్రమే ఈ ఏడాది తమ సేవింగ్స్ పెరుగుతాయని చెబితే.. 45 శాతం మంది 25 శాతం మేర తగ్గుతాయని చెప్పారు. ‘దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొనిఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఆయా వర్గాల వారికి ఉపశమనం కలిగించేలా తగు చర్యలు తీసుకోవాలి’ అని లోకల్ సర్కిల్స్ నివేదిక పేర్కొంది. ప్రజల ఆదాయంలో వృద్ధి లేకపోవడం.. అలాగే ధరల పెరుగుదల వల్ల 2024లో నిత్యావసరాలుకాని వస్తువుల కొనుగోలు తగ్గిందని.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లలో తాము ఆశించినంత వృద్ధి కనపడలేదని రిటైలర్లు పేర్కొన్నట్లు తెలిపింది. ఈ ఏడాది కూడా ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు నమ్ముతున్నట్లు తన నివేదికలో తెలిపింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మనవడి భవిష్యత్తుకు ఉత్తమ ఫండ్స్
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారీ నాకు కేటాయించే యూనిట్ల విలువ కొంత తక్కువగా ఉంటుంది. కాకపోతే నా పెట్టుబడులు, నాకు కేటాయించే యూనిట్ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగానే ఉంటోంది. ఎందుకు ఇలా? - నంబూద్రి ప్రసాద్మీరు గుర్తించిన ఈ స్వల్ప వ్యత్యాసం అన్నది మీ ప్రతి పెట్టుబడికి సంబంధించి మినహాయించే స్టాంప్ డ్యూటీ. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకు దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెట్టుబడి విలువపై 0.005 శాతాన్ని స్టాంప్ డ్యూటీ చార్జీ కింద వసూలు చేస్తారు.ప్రతి పెట్టుబడి మొత్తంలో ఈ మేరకు మినహాయించగా, మిగిలిన మొత్తానికి యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు సిప్ రూపంలో రూ.5,000 ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 0.005 శాతం అంటే రూ.0.25 అవుతుంది. అప్పుడు రూ.4,999.75 మొత్తం పెట్టుబడి కిందకు వెళుతుంది. సిప్‌లు, ఏక మొత్తంలో పెట్టుబడులు, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు అన్నింటికీ వర్తిస్తుంది.ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ఉపసంహరణకు స్టాంప్ డ్యూటీ వర్తించదు. చట్టపరమైన ఈ చార్జీల గురించి పెద్దగా ఆలోచించకుండా, పెట్టుబడుల ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. నా మూడేళ్ల మనవడి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలించే ఫండ్స్ ఏవి? వాటి విషయంలో ఎలా వ్యవహరించాలి? - రవిగుప్తాపిల్లల ఉన్నత విద్య కోసం ఈక్విటీ, అగ్రెస్సివ్ ఈక్విటీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల సౌకర్యంగా లేకపోతే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఒకటి లేదా రెండు మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. 15 ఏళ్ల కాలంలో మార్కెట్లు ఎన్నో ఎత్తు పల్లాలు చూసినప్పటికీ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో (వైవిధ్యమైన పెట్టుబడులతో కూడిన) మెరుగైన రాబడులు ఇస్తుంది. కాకపోతే పెట్టుబడులు అలాగే కొనసాగించి, మధ్య మధ్యలో వచ్చే మార్కెట్ పతనాలను పట్టించుకోకుండా ఉంటే చాలు.మార్కెట్ ఊగిసలాటల్లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మనవడు, మనవరాలి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు రెండు రకాల విధానాలను అనుసరించొచ్చు. చిన్నారి పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవాలి. ఈ ఖాతాలోకి నగదు బదిలీ చేయాలి. తర్వాత ఎంపిక చేసిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?మనవడి పేరు మీదే ఖాతా ఉంటుంది కనుక 18 ఏళ్లు నిండిన తర్వాత సంబంధిత ఖాతా యాజమాన్య హక్కులు చిన్నారికి బదిలీ చేయవచ్చు. లేదంటే మీ మనవడికి బదులు మీ పేరు మీదే పెట్టుబడులు పెట్టుకోవడం మరొక ఆప్షన్. మనవడికి 18 ఏళ్లు నిండగానే, ఆ పెట్టుబడులను ఉపహరించుకుని ఆ మొత్తాన్ని మనవడికి గిఫ్ట్ కింద బదిలీ చేయవచ్చు. అప్పటి వరకు ఆ పెట్టుబడులకు నామినీగా మనవడి (మైనర్)ని ప్రతిపాదించొచ్చు. -
యూట్యూబ్ కోసం రూ.8 లక్షల ఖర్చు.. ఎంత వచ్చిందంటే?
టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తూ.. యూట్యూబ్ మీద పడుతున్నారు. నేడు చాలామందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొందరు లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తుంటే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నళిని ఉనగర్'. ఇంతకీ ఈమె ఎవరు? యూట్యూబ్ కోసం ఎంత వెచ్చించింది? ఎందుకు ఫెయిల్ అయిందనే.. వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నళిని ఉనగర్.. 'నలినీస్ కిచెన్ రెసిపీ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు నడిపింది. అయితే ఈమెకు యూట్యూబ్ ద్వారా ఏ మాత్రం ఆదాయం రాలేదు. కానీ నళిని.. స్టూడియో, కిచెన్ సెటప్ చేసుకోవడానికి, ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.మూడేళ్ల పాటు సుమారు 250 వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. దీంతో విసుగెత్తి.. యూట్యూబ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా కిచెన్ వస్తువులను, స్టూడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. నేను నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పింది.I failed in my YouTube career, so I’m selling all my kitchen accessories and studio equipment. If anyone is interested in buying, please let me know. 😭 pic.twitter.com/3ew6opJjpL— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024మూడు సంవత్సరాల్లో 250 వీడియోలు చేసాను, 2450 సబ్‌స్కైబర్లు మాత్రమే వచ్చారు. ఎంత కష్టపడినా.. యూట్యూబ్ కొన్ని రకాల కంటెంట్లకు మాత్రమే ఫేవర్ చేస్తుందని నళిని ఆరోపించింది. నేను మూడేళ్ళలో సంపాదించిన మొత్తం 'సున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ ఛానల్ ప్రారంభించాడని డబ్బు, సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను.. అని ఒక ట్వీట్లో వెల్లడించింది. కానీ నాకు యూట్యూబ్ ఎలాంటి ప్రతిఫలాన్ని అందించలేదని వాపోయింది.I’m honestly angry with YouTube. I spent my money, time, and even risked my career to build my channel, but in return, YouTube gave me nothing. It feels like the platform favors certain channels and specific types of videos, leaving others with no recognition despite the hard…— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024యూట్యూబర్స్ ఎదుర్కోవాల్సిన సవాళ్లుయూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట నిజమే. కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అందరూ డబ్బు సంపాదిస్తారు అని అనుకోవడం మూర్కత్వమే. ఎందుకంటే యూట్యూబ్‌లో అందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. డబ్బు రావడం అనేది సబ్‌స్కైబర్లు, వాచ్ అవర్స్, వ్యూవ్స్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి యూట్యూబర్స్ వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగి.. ఓపిగ్గా నిలబడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. -
BCCI: బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం
ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.ప్రధాన ఆదాయ వనరులివేకాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.ఐసీసీ నుంచి సింహభాగంజూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులునిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
జీవో 59తో రూ.6 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో 59ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. ఈ జీవో కింద వచ్చిన 50వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఆదాయ వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి దీనిపై నివేదిక కూడా సమర్పించింది. ఈ జీవో అమలును నిలిపివేయడానికి ముందువరకు రూ.534 కోట్ల ఆదాయం వచ్చిoదని.. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా మరో రూ.500 కోట్లు వస్తాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని వివరించినట్టు సమాచారం. ఏడాది నుంచి ఎదురుచూపులే.. జీవో 59 కింద భూముల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఏడాది నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నా... ఎలాంటి పలుకుబడి లేని సాధారణ ప్రజలు మాత్రం వీటి పరిష్కారం ఇంకెప్పుడు అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో కింద పరిశీలన పూర్తయి డిమాండ్ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్ డీడ్లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ సర్కారు నిర్ణయం పట్ల ఆశతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే క్రమంలో అర్హులైన వారికి భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రక్రియ కొనసాగుతుండగానే.. జీవో 59 కింద ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 2022, 2023 సంవత్సరాల్లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 31 వేలు, మిగతా అన్ని జిల్లాల్లో 26 వేల వరకు.. మొత్తంగా 57 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం 32,788 దరఖాస్తులను ఆమోదించి సదరు లబ్దిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 10వేల మందికిపైగా ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు) కూడా పొందారు. డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు కట్టినా.. కన్వేయన్స్ డీడ్లు జారీకానివారు మరో 3 వేల మందికి పైగా ఉన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కారు ఏర్పాటవగా.. అదే నెల 11వ తేదీ నుంచి ఈ జీవోకు సంబంధించిన పోర్టల్‌ను నిలిపివేశారు. ఆ జీవో కింద అప్పటికే చేసిన క్రమబద్దీకరణలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని విలువైన భూములను బీఆర్ఎస్ నేతలు క్రమబద్ధీకరించుకున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే అలాంటివన్నీ ముందే జరిగిపోయాయని... సాధారణ ప్రజల దరఖాస్తులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని దరఖాస్తు దారులు పేర్కొంటున్నారు. హక్కులు కల్పించని కారణంగా ఈ భూములు ఇటు తమవి కాకుండా, అటు ప్రభుత్వానివి కాకుండా మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు. అసలు జీవో 59 ఏంటి?తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 డిసెంబర్ 30న తొలిసారి జీవో 59 విడుదల చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2022, 2023 సంవత్సరాల్లో ఆ జీవోలో స్వల్ప మా ర్పులు చేస్తూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.చివరిగా 2023లో విడుదల చేసిన జీవో ప్రకారం... క్రమబద్దీకరణ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్ విలువలో 25 శాతం... 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్దీకరణ సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది. తొలుత 2014 జూన్ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్దీకరిస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్దీకరిస్తామని సర్కారు పేర్కొంది. -
వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..
పూర్వం వయస్సు మీద పడుతున్నా పెళ్లికాకపోతే ‘ఏమి ఇంకా పెళ్లి చేయలేదా’.. అనేవారు. పెళ్లయ్యాక ‘ఏమి ఇంకా పిల్లలు కాలేదా’ అని దెప్పిపొడిచేవారు. కానీ నేటి యువజంటల్లో కొందరు మాకు పిల్లలే వద్దని తెగేసి చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటాం.. గానీ ఇప్పుడే పిల్లలను కనేది లేదని అంటున్నారు. ‘చదువు, ఉద్యోగం పేరుతో ఇన్నాళ్లు కష్టపడుతూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తాం. మాకు కావాలనుకున్నప్పుడు మాత్రమే పిల్లలను కంటాం’అని భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు మాత్రమే ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరానికి కూడా పాకుతోంది. పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే కట్నకానుకలు మాట్లాడుకోవడం ఒకప్పుటి మాట. ఇప్పుడు కొన్ని షరతులు.. అంటూ కొత్త కొత్త అంశాలు పెద్దల ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా అమ్మాయి తరఫు వాళ్లు తగ్గేదేల్యా.. అంటున్నారు. నిన్నటి వరకు ‘ఇంట్లో అత్తామామలు, ఆడబిడ్డలు ఉండకూడదని.. ఇంటికి మాటిమాటికి చుట్టపు చూపుతో బంధువులు రాకూడదని... మా పిల్ల వారికి చాకిరి చేయలేద’ని తెగేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు కొందరు ‘అమ్మాయిని ఇస్తాము గానీ మా పిల్ల ఇంకా ఇప్పుడే చిన్నది...ఇప్పుడిప్పుడే పిల్లలను కనాలని ఇష్టం తనకు లేదని, ఈ అంగీకారానికి అబ్బాయి ఒప్పుకుంటేనే పెళ్లి అని చెబుతున్నారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ/బీటెక్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూ ఎలాంటి ఎంజాయ్ చేయలేదని, ఇప్పుడు పెళ్లి, ఆ తర్వాత పిల్లలు అంటే.. సరదాలు, సంతోషాలు ఇంకెప్పుడు అంటూ చెబుతున్నారు. ఈ అంగీకారమేదో బాగుందని ఒప్పుకుంటున్న మగరాయుళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఇద్దరి అంగీకారంతో వివాహాలు హాయిగా జరిగిపోతున్నాయి. కానీ ఏ ఒక్కరూ పైకి ఈ విషయం బయటకు మాత్రం చెప్పడం లేదు. వివాహమయ్యాక వీకెండ్లో ఇద్దరూ హాయిగా విహారయాత్రల పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చినచోటకు వెళ్లడం, నచ్చినది తినడం, నచ్చిన ప్రదేశాలు చూడటం, ఇష్టమొచ్చిన హోటళ్లలో బస చేయడం వంటి సరదాలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతిని ఆంగ్లంలో ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ (డింక్)గా పిలుస్తారు. ఈ లైఫ్స్టైల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదించాలి...కానీ పిల్లలు మాత్రం వద్దు. ఆ ఇద్దరు సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తారు. వారి జీవితానికి వారే రాజు...వారే రాణి అన్నమాట. ఈ డింక్ లైఫ్ స్టైల్ 1980 దశకంలో జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ప్రారంభమైందని చెబుతారు. గత దశాబ్ద కాలంగా మన దేశంలోని మెట్రో సిటిలైన న్యూఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కత లాంటి నగరాల్లో ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లిన మన ప్రాంత యువతీయువకులు డింక్ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ కారణంగా ఈ సంస్కృతి ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పొచ్చు. డింక్ లైఫ్‌స్టైల్ గురించి సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం జరుగుతున్న తీరుతో కొందరు ఔత్సాహిక యువతీయువకులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరినా వారికి ఇష్టం లేకపోయినా, కంపెనీకి వారి పని నచ్చకపోయినా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు ఒకే కంపెనీలో రెండు, మూడేళ్లు మించి పనిచేయడం లేదు. వారు మారడమో, కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించడమో చేయడం వల్ల వారు కంపెనీలు మారుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. కొంత కాలం వేచి చూసి ఉద్యోగం వల్ల కావాల్సినంత కూడబెట్టుకున్నామని భరోసా కలిగాక పిల్లలు, వారి పెంపకం గురించి ఆలోచించే వారు ఎక్కువయ్యారు. పిల్లలను పెంచడమూ భారంగా...! కొందరు యువతీయువకులు పిల్లలను పెంచడాన్ని కూడా భారంగా భావిస్తున్నారు. మెట్రో సిటీల్లో వారిద్దరే ఉంటుండటంతో ఒకవేళ పిల్లలు కన్నా వారిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పిల్లలను కనేందుకు, వారిని పెంచేందుకు తరచూ సెలవులు పెట్టాల్సి రావడం, ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి ఉండటం నేటి కొందరు యువతీయువకులకు ఇష్టం ఉండటం లేదు. పిల్లలు పెద్దగైతే మెట్రో సిటీల్లో వారి చదువులు, వారిని పెంచేందుకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారు. కొంత కాలం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి సంపాదించి, కూడబెట్టి, ఎంజాయ్ చేసిన తర్వాత మాత్రమే పిల్లలను కనాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ మేరకు కొందరు తల్లిదండ్రులకు కూడా తెలియకుండా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని పిల్లలను ఇప్పుడే వద్దనుకుంటున్నారు.నచ్చిన జీవితాన్ని ఆనందించేందుకే...!ఒకప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు కేవలం ఉన్నత వర్గాల పిల్లలు మాత్రమే చదివేవారు. కానీ దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే వారికి తగినట్లే మెట్రో సిటీల్లో ఉద్యోగం చేసేవారో, లేక ఉన్నత చదువులు చదివిన వారో ఎంచుకుంటున్నారు. ఇద్దరూ అక్కడే కలిసి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చదవాలంటే ఆషామాషీ కాదు. పాఠశాల, ఇంటర్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా, విలాసాల జోలికి వెళ్లకుండా చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఈ క్రమంలో ఉద్యోగం వచ్చేంత వరకు వారి జీవితంలో ఎంజాయ్ అనే పదం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంసంపాదించాక కూడా ఎంజాయ్ లేకపోతే ఎలాగంటూ పిల్లల కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ‘డింక్’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు చైనా వంటి దేశాల్లో యువత కంటే వృద్ధులే అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడ అభివృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది. ఈ కారణంగా ఒకప్పుడు పిల్లలే వద్దని చెప్పిన ఆ దేశం ఇప్పుడు ఎంత మంది పిల్లలనైనా కనండని చెబుతోంది. ఎందుకంటే పిల్లలు కనకపోతే ఆ దేశాభివృద్ధి ఆగిపోతుంది. ఏ దేశానికైనా యువతీయువకులే ఆయువుపట్టు. అభివృద్ధికి వారే మూలాధారాలు. యువత ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో డింక్ అనే లైఫ్‌స్టైల్ పేరుతో యువతీయువకులు పిల్లలు వద్దంటేæ ఈ దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. జననాల రేటు తగ్గిపోయి కొంతకాలానికి ఈ దేశంలో వృద్ధు్దల సంఖ్య ఎక్కువై పనిచేసే యువత సంఖ్య తక్కువ అవుతుంది. అప్పుడు మళ్లీ పేద దేశంగా మన దేశం మారిపోతుంది. సంతానోత్పత్తి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ మనజాలదు. ఇంట్లో, కుటుంబంలో పిల్లలు ఉండటాన్ని తల్లిదండ్రులకే కాదు అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. మార్కెట్లో ఒడిదుడుకులే కారణం సమాజంలో డింక్ లాంటి సంస్కృతులు రావడానికి మార్కెట్లోని ఒడిదుడుకులే కారణం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటు కంపెనీలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేవు.ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే మెట్రోసిటీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ పిల్లలు, వారి బాధ్యతలు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతామనే భయంతో నేటి యువత ఉన్నారు. ఈ క్రమంలో వారిలో డింక్ లాంటి ఆలోచనలు రావడంలో తప్పేమీలేదు. – జీఆర్ శర్మ, ఎన్హెచ్ఎం ఉద్యోగి, కర్నూలువ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటున్నారు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లలు ఇప్పుడే వద్దనే జంటలు ఇటీవల ఎక్కువయ్యారు. దీనికి ఆర్థిక ప్రాధాన్యత కూడా ఒక కారణం. ఆర్థికంగా స్థిరపడటం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం ప్రధాన అంశాలు. ఇది ఒక కొత్త జీవనశైలి. దీనికి సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో పిల్లలను పెద్దలే ఎక్కువగా చూసుకునేవారు. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలను కంటే వారి ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు30 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే ఆరోగ్య సమస్యలు సాధారణంగా 25 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ప్రసవం అయితే వారికి జని్మంచే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 30 నుంచి 35 ఏళ్ల మధ్య గర్భం దాల్చితే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నెలలు నిండకుండా బిడ్డ జని్మంచడం, బీపీ, థైరాయిడ్, షుగర్ వంటివి రావడం జరుగుతాయి. వివాహమైన వెంటనే పిల్లలను కనకూడదన్న ఆలోచన మంచిదే గానీ మరీ ఆలస్యమైతేనే ఇబ్బంది. కొంత మంది ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఎగ్ ఫ్రీజింగ్, సెమన్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల వారు అనుకున్న వయస్సులో పిల్లలను కనేందుకు వీలు చేసుకుంటున్నారు. – డాక్టర్ పి.శిరీషారెడ్డి, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు (చదవండి: -
నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉంటే నిరుపేదలు
నిరు పేదలు, మధ్య తరగతి ప్రజలు అంటే ఎవరు? నెలవారీ ఆదాయం ఎంతుంటే మధ్య తరగతి? మధ్య తరగతిలో ఎన్ని వర్గాలు? నిరు పేదల ఆదాయమెంత? వీటిపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచి్చంది. ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలను అధ్యయనం చేసే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)తో కలిసి ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాల స్థిరమైన ఆర్థిక వృద్దిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు ఓఈసీడీ 37 దేశాలతో కలిసి పనిచేస్తోంది.ప్రపంచ బ్యాంకు, ఓఈసీడీ కలిసి ప్రజల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశాయి. మారుతున్న సామాజిక, ఆరి్థక స్థితిగతులను అనుసరించి జరిపిన ఈ అధ్యయనం నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే మెరుగుపడుతున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పెరిగినట్టు ప్రకటించింది. ఈ అధ్యయనంలో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజల ఆరి్థక స్థితిగతులపై లోతైన పరిశీలన జరిపింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు వర్గాలుగా విభజించింది. ఇక నుంచి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష లోపు ఆదాయం ఆర్జించే వారిని మధ్య తరగతిగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రూ.లక్ష కు పైబడి ఆదాయం ఆర్జించే వారిని ఎగువ మధ్యతరగతి వర్గీయులుగా పరిగణించాలని పేర్కొంది. రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఆర్జించే వారిని దిగువ మధ్య తరగతిగా గుర్తించాలని ప్రకటించింది. ఇక రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న వారిని నిరుపేద వర్గానికి చెందిన వారిగా పరిగణించాలని పేర్కొంది. గతంలోకంటే మెరుగైన ఆర్థి క పరిస్థితిగతంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఉన్న వారిని మధ్య తరగతిగా, రూ.40 వేల నుంచి రూ.60 వేల లోపు ఉన్న వారిని ఎగువ మధ్యతరగతిగా, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న వారిని దిగువ మధ్యతరగతిగా పరిగణించేవారు. రూ.10 వేలకు తక్కువగా ఆర్జించే వారిని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలుగా గుర్తించే వారు. ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనం ప్రకారం అల్పాదాయ, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే కొంత మెరుగు పడినట్టు తేలింది. జాతీయ తలసరి ఆదాయాన్ని బట్టి అంచనా.. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 75 శాతం నుంచి 200 శాతం ఆదాయం ఆర్జిస్తున్న వారిని మధ్య తరగతి ప్రజలుగా, 200 శాతం కంటే ఎక్కువ ఆర్జించే వారిని ఉన్నత వర్గాలుగా, 75% కంటే తక్కువ ఆదాయం ఆర్జించే వారిని అల్పాదాయ వర్గాలుగా ప్రపంచ బ్యాంకు విభజించింది. 75 శాతం నుంచి 50 శాతం ఆదాయం పొందే వారిని నిరుపేదలే అయినప్పటికీ, తక్కువ ఆదాయం (నాన్–పూర్ లోయర్ ఇన్కమ్) ఆర్జించే వర్గాలుగా పేర్కొంది. 50 శాతంకంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా అభివర్ణించాలని పేర్కొంది. అదే విధంగా స్థూల జాతీయ ఆదాయం సగటున రూ.97,192 (1145 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను తక్కువ ఆదాయ దేశాలుగా, రూ.3,82,917 (1146–4515 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను దిగువ మధ్య ఆదాయ దేశాలుగా, రూ.11,87,764 (4516–14వేల డాలర్లు) ఆర్జించే దేశాలను ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా అభివరి్ణంచింది. భారత దేశం దిగువ మధ్య ఆదాయ ఆర్జన కలిగిన దేశాల జాబితాలో ఉంది. -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్‌లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్‌ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్‌తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
ఆదాయాన్ని నిర్ధారించేవి.. ఈ మూడే..
మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని నిర్ధారించేవి ముఖ్యంగా మూడు అంశాలు. అవేంటంటే.. 1. రెసిడెన్షియల్ స్టేటస్ 2. ఆదాయం వచ్చే సమయం 3. ఆదాయానికి మూలం (సోర్స్) ఇక వివరాల్లోకి వెళ్దాం.1. రెసిడెన్షియల్ స్టేటస్ .. ఆదాయపు పన్ను చట్టంలో పన్ను భారాన్ని నిర్ధారించేది మీ రెసిడెన్షియల్ స్టేటస్ .. అంటే మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నారనే విషయం. పౌరసత్వానికి, పన్ను భారానికి ఎటువంటి సంబంధం లేదు. పౌరుడైనా, పౌరుడు కాకపోయినా ఆ వ్యక్తి స్టేటస్ .. అంటే ఇండియాలో ఎన్ని రోజులున్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.ఆదాయానికి మూలం కింద .. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం మీద ఆదాయం .. మొదలైనవి ఉంటాయి. ఈ స్టేటస్ ప్రతి సంవత్సరం మారొచ్చు. మారకపోవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఈ షరతుని లేదా పరిస్థితిని లేదా కొలబద్దని కొలవాలి. లెక్కించాలి. వ్యక్తి విషయానికొస్తే.. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుంటే, అటువంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. సాధారణంగా మనందరం రెసిడెంట్లమే.మరో ప్రాతిపదిక ఏమిటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో 365 రోజులు లేదా పైగా ఉంటూ, ఆ ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇలాంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. ఈ లెక్కింపులకు మీ పాస్‌పోర్ట్‌లలో ఎంట్రీలు ముఖ్యం. రెసిడెంటుకు, నాన్–రెసిడెంటుకు ఎన్నో విషయాల్లో భేదాలు ఉన్నాయి. మిగతా వారి విషయంలో ఇండియాలో ఉంటూ ‘‘నిర్వహణ, నియంత్రణ’’ చేసే వ్యవధి మీద స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.2. ఆదాయం ఏర్పడే సమయం సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మీ చేతికి వచ్చినది, మీరు పుచ్చుకున్నది, మీ ఖాతాలో జమ అయినదాన్ని మీ ఆదాయం అంటారు. దీన్నే రావడం ... అంటే ARISE అంటారు. కానీ చట్టంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం ‘ACCRUE’ మరో అర్థాన్ని సూచిస్తుంది. ‘‘ఆదాయాన్ని’’ నిర్వచించే విధానం చూస్తే, వాడే భాష చూస్తే, ఆదాయ పరిధిని ‘‘వామన అవతారం’’లో ‘‘మూడు అడుగుల’’ను స్ఫురింపచేస్తుంది. ఎన్నో వివరణలు, తీర్పులు, పరిధులు ఉంటాయి. ‘‘ఇందుగలడందు కలడు’’ అనే నరసింహావతారం గుర్తుకు రాక తప్పదు.స్థూలంగా చెప్పడం అంటే మేము ‘సాహసం’ చేయడమే! పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, చేతికొచ్చింది .. చేతికి రావాల్సినది, హక్కు ఏర్పడి రానిది, హక్కు ఉండి అందనిది, ఆదాయంలా భావించేది, భావించతగ్గది, భావించినది, ఆదాయం కాకపోయినా తీసుకోక తప్పనిది (Deemed), కొన్ని సందర్భాల్లో మీకు కలిపేది (Included) అని చెప్పొచ్చు.3. ముచ్చటగా మూడోది..మూలం. అంటే Source. చట్టప్రకారం మనకు ఏర్పడే ఆదాయాల్ని ఐదు రకాలుగా, 5 శీర్షికల కింద వర్గీకరించారు. a) జీతాలు, వేతనాలు b) ఇంటి మీద ఆదాయం c) వ్యాపారం/వృత్తి మీద లాభనష్టాలు d) క్యాపిటల్ గెయిన్స్ e) పై నాలుగింటిలోకి విభజించలేక మిగిలినవి .. ఏ మూలమైనా, ఏ మూల నుంచి వచ్చినా ఈ శీర్షిక కింద పరిగణనలోకి తీసుకుంటారు. అవశేష ఆదాయం అని అనొచ్చు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ ప్లానింగ్‌కి శ్రీకారం చుడదాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
జైలర్ కన్నా ఖైదీల ఆదాయమే ఎక్కువ!
బ్రిటన్ జైళ్లలో అధికారుల కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారు. రక్షణ కల్పించే అధికారులు, సెకండరీ టీచర్లు, బయో కెమిస్టులు, సైకోథెరపిస్టులు తదితరుల కంటే కూడా వారి ఆదాయం చాలా ఎక్కువట! అక్కడి కొన్ని బహిరంగ జైళ్లలో ఖైదీలను బయటికి వెళ్లి పని చేయడానికి కూడా అనుమతిస్తారు. అలా పనికి వెళ్లిన ఓ ఖైదీ గతేడాది ఏకంగా 46 వేల డాలర్ల (రూ.39 లక్షల) వార్షిక ఆదాయం ఆర్జించి రికార్డు సృష్టించాడు. మరో 9 మంది ఖైదీలు కూడా ఏటా 28,694 డాలర్ల (రూ.24 లక్షల) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖైదీలకు పునరావాసంతో పాటు విడదలయ్యాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కలి్పంచడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడి జైళ్లలో ఖైదీలు పలు ఉద్యోగాలు చేస్తారు. లారీ డ్రైవర్లుగా చేసేవారి సంపాదన ఎక్కువ. కొందరు శిక్షాకాలం ముగియకముందే తాత్కాలిక లైసెన్సు సంపాదించేస్తారు. ఈ ఖైదీల్లో పలువురు ఆదాయపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. కొందరు సేవా కార్యక్రమాలకు విరాళాలూ ఇస్తారు! బ్రిటన్‌లో జైలు గార్డుల సగటు వేతనం 35,000 డాలర్లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సవాళ్లలోనూ పీఎస్‌బీల బలమైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) బలమైన పనితీరు చూపించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీఎస్‌బీల నికర లాభం 26 శాతం పెరగ్గా, వ్యాపారం 11 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్, కెనరా బ్యాంక్ సహా మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల గణాంకాలు ఇందులో ఉన్నాయి. ‘‘క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు రుణాలు 12.9 శాతం వృద్ధితో రూ.102.29 లక్షల కోట్లు, డిపాజిట్లు 9.5 శాతం వృద్ధితో రూ.133.75 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలంలో నిర్వహణ లాభం 14.4 శాతం పెరిగి రూ.1,50,023 కోట్లుగా, నికర లాభం 25.6 శాతం పెరిగి రూ.85,520 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 3.12 శాతం (1.08 శాతం తక్కువ), నికర ఎన్పీఏలు 0.63 శాతానికి (0.34 శాతం తగ్గుదల) తగ్గాయి’’అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితమిస్తున్న చర్యలు.. ‘‘బ్యాంకింగ్‌లో చేపట్టిన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ చాలా వరకు సవాళ్లను పరిష్కరించాయి. రుణాల విషయంలో మెరుగైన క్రమశిక్షణ అవసరమైన వ్యవస్థలు, విధానాలు ఏర్పడ్డాయి. నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) గుర్తింపు, వాటికి పరిష్కారం, రుణాల మంజూరీలో బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, టెక్నాలజీ అమలు తదితర చర్యలు ఫలించాయి. స్థిరమైన ఆర్థిక శ్రేయస్సుకు, బ్యాంకింగ్ రంగం పటిష్టానికి దోహపడ్డాయి.ఇదే పీఎస్‌బీల పనితీరులో ప్రతిఫలించింది’’ అని ఆర్థిక శాఖ వివరించింది. ఏఐ/క్లౌడ్/బ్లాక్‌చైన్ తదితర టెక్నాలజీల విషయంలో పీఎస్‌బీలు గణనీయమైన పురోగతి చూపించడంతోపాటు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుచుకున్నట్టు వివరించింది. సైబర్ సెక్యూరిటీ రిస్‌్కలను తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు/నియంత్రణలను అమల్లో పెట్టిన ట్టు తెలిపింది. అత్యుత్తమ కస్టమర్ అనుభూతికై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. -
రూ. 23 కోట్ల దున్న.. నెలకు రూ. 5 లక్షల ఆదాయం
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్‌ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
ఏమాత్రం సంపాదించారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పడింది. వారుంటున్న ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకూ అన్ని వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపింది. ఎస్‌హెచ్‌జీలోని సభ్యుల రుణాలు, మొత్తం గ్రూపు ఎంతమేర రుణం తీసుకుంది? నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే వివరాలతో పాటు ఆయా సంఘాల్లో ఉంటున్న సభ్యుల కుటుంబాల్లోని ఇతరుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.ఈ మేరకు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలతో పాటు పట్టణాల్లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలను సేకరించి మెప్మా, డీఆర్డీఏ పీడీల సంతకాలతో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కేవలం గ్రూపులకు సంబంధించిన సమాచారం, ఆయా గ్రూపుల్లో ఉన్న మహిళల సమాచారం మాత్రమే కాకుండా మొత్తం వారి కుటుంబ ఆదాయ వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో ప్రభుత్వం మంజూరుచేసే సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లు నుంచి సెల్లు వరకూ..రాష్ట్రవ్యాప్తంగా 11.46 లక్షల పొదుపు సంఘాలున్నాయి. ఇందులో కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ అన్ని గ్రూపులకు సంబంధించిన సమాచారంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. వారుంటున్న ఇంటి నుంచి.. వాడే సెల్‌ఫోన్ వరకూ అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉంటున్న ఇల్లు సొంతానిదా? అద్దెకు ఉంటున్నారా? ఇల్లు ఏ రకానికి చెందినది.. అంటే, గుడిసె, పెంకుటిల్లు, భవంతి, అపార్టుమెంట్ అనే వివరాలను సేకరిస్తోంది. ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్రా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా? అని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.అలాగే, వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధిపొందారా? ఎంత మొత్తం పొందారు? ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? కారు ఉందా? తదతర వివరాలను కూడా నింపాలని పేర్కొంది. ఇక సభ్యురాలి మొబైల్ నెంబరుతో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు? డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఎస్‌హెచ్‌జీ ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే.. తద్వారా వచ్చే ఆదాయం ఎంత? జీఎస్టీ నెంబరు వివరాలను కూడా సేకరిస్తున్నారు.సంక్షేమ పథకాల కోతకేనా!?కేవలం ఎస్‌హెచ్‌జీలో ఉంటున్న మహిళల ఆదాయ వివరాలతో ఆగకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే, పొదుపు మహిళలు స్వయం ఉపాధి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటు కుటుంబంలోని సభ్యుల ఆదాయాన్ని కూడా తెలుసుకోనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల కోసం సేకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సేకరిస్తున్న వివరాలన్నీ ప్రభుత్వానికి చేరితే ఇస్తున్న కొద్దిపాటి సంక్షేమానికి కూడా కోతలు పెడతారనే భయాందోళనలను ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక.. ఇంట్లో వాడుతున్న గ్యాస్ నెంబరును కూడా ఆర్పీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుండటంతో వారు కలవరపడుతున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని జిల్లాల మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో వారు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. -
రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!
‘నేను రోజుకు నాలుగు గంటలే పనిచేస్తాను’ అని ఎవరైనా అంటే....‘అయితే ఏంటటా’ అనుకుంటాం. నేను రోజుకు నాలుగు గంటలే పనిచేసినా నెలకు పదిహేను లక్షలు సంపాదిస్తాను’ అని అంటే మాత్రం ‘అయ్ బాబోయ్’ అని బోలెడు ఆశ్చర్య΄ోవడమే కాదు ‘అలా ఎలా?’ అని అడుగుతాం.అమీ లాండినో (న్యూయార్క్)ను ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు. డిజిటల్ ఫీల్డ్‌లో’ అంటూ చాలా సంవత్సరాల క్రితం కాలేజీకి గుడ్‌బై చెప్పిన అమీ లాండినో మన కరెన్సీలో నెలకు పదిహేను లక్షలకు పైగా సంపాదిస్తుంది. ‘సోషల్ మీడియా’ను లాభదాయకమైన వ్యాపారక్షేత్రంగా మలుచుకోవడంలో విజయం సాధించింది. మొదట్లో వీడియోలను యూట్యూబ్‌లో షేర్ చేసేది. ఇలా చేస్తున్న క్రమంలోనే తనలోని స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేది.వ్యాపారులు తమకు కావలసిన వీడియోలను సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో నేర్పే ఆన్లైన్ కోర్సును ప్రారంభించడం అమీ లాండినోకు టర్నింగ్ పాయింట్. లాండినో యూట్యూబ్ చానల్ ‘అమీ టీవి’లో తన గోల్–సెట్టింగ్ ప్రాసెస్‌తో సహా వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి. అమీ లాండినో ‘స్టార్ యూట్యూబర్’ మాత్రమే కాదు ఎన్నో పుస్తకాలు కూడా రాసింది. (సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ) -
USA: అమెరికాలో భారతీయులే రిచ్
అమెరికాలో కుటుంబ సగటు ఆదాయం అధికంగా ఉన్నది భారతీయులకే. ఎంత ఎక్కువంటే అమెరికన్ల ఆదాయం కంటే అది రెట్టింపు. మనవాళ్లు సంపన్నులే కాదు, మనవాళ్ల నెలవారీ ఆదాయాలు కూడా అమెరికన్లకంటే ఎక్కువ ఉండటం విశేషం. 2019 నుంచి 2023 మధ్య సగటు భారతీయ కుటుంబ ఆదాయం 24 శాతం పెరిగితే, అమెరికన్ల ఆదాయం 18 శాతమే పెరిగింది. -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
దొండతో దండిగా ఆదాయం!
ప్రణాళికాబద్ధంగా కష్టపడితే వ్యవసాయం సహా ఏ రంగంలోనైనా రాణించొచ్చు అంటున్నారు ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన యంజి బీఈడి కళాశాల కరస్పాండెంట్ గఫార్ అలిఖాన్ బీఈడీ కళాశాల పనులపై ఇతర ప్రాంతాలు వెళ్లి వచ్చే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్న పొలాలు కంటపడ్డాయి. ఆ పంటలను చూసిన తర్వాత వ్యవసాయంపై మక్కువ కలిగింది. అక్కడి రైతులతో మాట్లాడి వ్యవసాయం లాభదాయకంగా ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. కందులాపురం వద్ద తనకున్న 2.2 ఎకరాల భూమిలో రెండేళ్ళ క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో 12 రకాల అంతర పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు గఫార్.బత్తాయి తోట కాపునకు వచ్చే సరికి నాలుగేళ్ళ కాలం పడుతుంది. ఈలోగా అంతర పంటలు వేసుకొని సాగు లాభదాయకమని ప్రధాన అంతర పంటగా టొమాటోను ఫెన్సింగ్ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. బత్తాయి తోట చుట్టూ సుమారు 20 సెంట్లలో పందిళ్లు వేసి దొండ మొక్కలు నాటారు. 4 నెలలకే పంట చేతికి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ దొండ రూ. 50 వరకు పలుకుతున్నది. ఇప్పటికే రూ. లక్షన్నరకు పైగా లాభం వచ్చిందని గఫార్ వివరించారు. దొండ పందిళ్ల కింద క్యాబేజీ, బీట్రూట్ సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌కు సైతం సొరకాయ చెట్లను పాకించారు. సొర తీగలు కాయలనివ్వటంతో పాటు చీడపీడలను అడ్డుకునే జీవకంచెగా ఉపయోగ పడుతున్నాయన్నారు. కొత్తిమీర, కాకర, మెంతి, కాకర, మిరప, మునగ, కాళీఫ్లవర్, బీర ఇంకా తదితర అంతర పంటలు సాగు చేస్తున్నారు. రెండు ఎకరాల్లో 15 ట్రాక్టర్ల మాగిన పశువుల ఎరువుతో పాటు వర్మీ కం΄ోస్టు, జీవామృతం, వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, జీవన ఎరువులను వినియోగిస్తున్నారు. బత్తాయిలో సాగు చేసే అంతర పంటలకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. పందిళ్లు వేసి విత్తనాలు నాటితే చాలు దిగుబడినిస్తాయి. దొండలో వచ్చిన ఆదాయం బత్తాయితో పాటు ఇతర అన్ని పంటల పెట్టుబడికి సరి΄ోతుందని గఫార్ స్వీయానుభవంగా చెబుతున్నారు. బీర, సొరకాయ, క్యాబేజీ, ఇతర కూరగాయల సాగు కూడా మంచి లాభదాయకమేనన్నారు. తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలతో మేలు: రెండెకరాల లేత బత్తాయి తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నాను. భూమిని ఖాళీగా వదలకుండా అంతర పంటలు వేశాం. తోటల్లో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని నా అనుభవంలో తెలుసుకున్నాను. అంతర పంటలకు పెట్టుబడి తక్కువే. శ్రమ అధికంగా ఉంటుంది. అందుకని రైతులు తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలు వేసుకోవటం లాభదాయకం. – గఫార్ అలీఖాన్, కంభం – ఖాదర్ బాష, సాక్షి, కంభం -
74 శాతం తగ్గిన ఆదాయ అసమానతలు
న్యూఢిల్లీ: పదేళ్ల వ్యవధిలో దేశీయంగా ఆదాయ అసమానత గణనీయంగా దిగి వచ్చింది. రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి సంబంధించి 2013–14, 2022–23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అసమానతలు ఏకంగా 74.2 శాతం మేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోని ఎకనమిక్ డిపార్ట్మెంట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014–2024 అసెస్మెంట్ ఇయర్స్ గణాంకాలను అధ్యయనం చేసిన మీదట ఎస్బీఐ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆదాయాన్ని మెరుగుపర్చుకుంటూ పై స్థాయికి చేరుకుంటున్న అల్పాదాయ వర్గాల వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.5 లక్షల వరకు ఆదాయాలున్న వారిలో 31.8 శాతంగా ఉన్న అసమానత 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గింది. రూ. 5.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాల సంపాదన గత దశాబ్దకాలంలో (కోవిడ్ ప్రభావిత 2020 అసెస్మెంట్ ఇయర్ తప్ప) ప్రతి సంవత్సరం సానుకూల రేటుతో వృద్ధి చెందింది. -
రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ ఆర్జన శాఖలకు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై భారం పడకుండానే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించి ఆదాయ ఆర్జన శాఖలు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి మించి అదనంగా 15 శాతం 25 శాతం వరకు పెంచాలని ఆయా శాఖల అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రాన్ని నిధులు అడగలేమని, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల ద్వారానే అమలు చేయాల్సి ఉందని ఆయన చేశారు. ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, మైనింగ్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం మేరకు సీఎం సమీక్షలో ఆదాయ ఆర్జన శాఖలకు ఆర్థిక శాఖ భారీ ఆదాయ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపు ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.8000 కోట్ల ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను భూముల విలువను పెంచాల్సిందిగా సూచించింది. దీని ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఆదాయం పెంచాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ చార్జీల పెంపుపైన కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీ ఎగవేతలను నిరోధించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాల్సిందిగా సూచించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ప్రస్తుతం రూ.4,500 కోట్లు ఆదాయం వస్తోందని, దీన్ని రూ.8000 కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థికశాఖ నిర్దేశించింది. నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ఆదాయం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాల్సిందిగా సూచించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే హామీలు అమలు చేయగలమని, ఈ నేపథ్యంలో ఆదాయ ఆర్జన శాఖలు అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. నినాదంతో ముందుకు సాగాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం పరిశ్రమలశాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌తో కలిపి ఐదు అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం ద్వారా ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని మెరుగుపరచాలని సూచించారు. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి వంతున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) విభాగంలో చిన్న ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వారిని ట్రేడింగ్‌కు దూరంగా ఉంచేందుకు సెబీ రంగంలోకి దిగింది. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో జీరో బ్రోకరేజీ సంస్థలకు బాగానే సెగ తగలనుంది. సెబీ చర్యలు అమల్లోకి వస్తే.. డెరివేటివ్స్ వాల్యూమ్స్ పడిపోయి బ్రోకరేజీ కంపెనీల ఆదాయాలకు గండి పడుతుంది. దీంతో జీరో బ్రోకరేజీ ప్లాన్లకు ఇక ‘ఎక్స్పైరీ’ తప్పదంటున్నాయి మార్కెట్ వర్గాలు!డెరివేటివ్ ట్రేడింగ్ విషయంలో సెబీ తీసుకున్న చర్యలతో జీరో బ్రోకరేజీ సంస్థల జోరుకు అడ్డకట్ట పడనుంది. ఎఫ్ అండ్ ఓ విభాగం నుంచి లభించే ఆదాయానికి చిల్లు పడుతుందన్న అంచనాలతో ఏంజెల్ వన్ ‘జీరో బ్రోకరేజీ’కి చెల్లు చెబుతున్నట్లు ప్రకటించింది. క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో మూడో అతపెద్ద బ్రోకరేజీ సంస్థగా ఇది నిలుస్తుండం విశేషం. నవంబర్ 1 నుంచి క్యాష్ మార్కెట్ లావాదేవీలు (షేర్ల కొనుగోలు, అమ్మకం)పై రూ.20 ఫ్లాట్ ఫీజు లేదా టర్నోవర్‌పై 0.1% (ఏది తక్కువైతే అది) ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా ఈ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేవు. కాగా, రాబోయే రోజుల్లో ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘పరిస్థితుల మార్పుతో అతి తక్కువ ఫీజులతో బ్రోకింగ్ పరిశ్రమ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు ఫీజులు పెంచక తప్పదు. ఎందుకంటే అవి ఎఫ్అండ్ఓ వాల్యూమ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెబీ నిర్ణయంతో ఆదాయాలకు కోత పడుతుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ ధీరజ్ రెల్లి పేర్కొన్నారు.కొన్నేళ్లుగా హవా... గతంలో ఓ వెలుగు వెలిగిన బ్యాంకింగ్ ‘బ్రోకరేజ్’లకు (ఐసీఐసీ డైరెక్ట్, యాక్సిస్ డైరెక్ట్ వంటివి) జీరోధా, గ్రో వంటి కొత్త తరం బ్రోకరేజీ సంస్థలు భారీగానే గండి కొట్టాయి. ముఖ్యంగా క్యాష్ లావాదేవీలపై జీరో బ్రోకరేజీ, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌కు అతి తక్కువ చార్జీలు, మార్జిన్లపై లీవరేజీ వంటి ప్రయోజనాలతో బ్యాంకుల వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. మరోపక్క, రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువత సరైన అవగాహన లేకుండా, అత్యాశతో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌లో కుదేలయ్యే పరిస్థితికి దారితీస్తోంది. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయకుండా సెబీ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 2022–24 మధ్య వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయారని.. రూ.1.8 లక్షల కోట్లు ఆవిరైందని సెబీ అధ్యయనం తేల్చింది. దీంతో ఇంకాస్త కఠిన నిబంధనలు తెచి్చంది. రూ. 2,000 కోట్ల చిల్లు... మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐలు–ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు) మెంబర్లకు (బ్రోకర్లు) విధించే ఛార్జీ లతో సమానంగానే కస్టమర్లకు (ఇన్వెస్టర్లు, ట్రేడర్లు) కూడా చార్జీలు ఉండాలని సెబీ ఈ ఏడాది జూలైలో ఆదేశించింది. ప్రస్తుతం అధిక వాల్యూమ్ ఉంటే ఎంఐఐలు బ్రోకర్లకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాయి. ట్రేడర్లకు మాత్రం ఫ్లాట్ రేట్ అమలు చేస్తుండటంతో ఆమేరకు బ్రోకింగ్ కంపెనీలకు లాభం చేకూరుతోంది. అయితే, సెబీ ఏకరీతి చార్జీల నిబంధనల వల్ల బ్రోకరేజీ సంస్థల ఆదాయాల్లో రూ. 2,000 కోట్లకు పైగా చిల్లు పడుతుందని అంచనా. ముఖ్యంగా డిస్కౌంట్ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు జీరో బ్రోకరేజీ మోడల్స్‌కు తెరపడవచ్చనేది పరిశ్రమ విశ్లేషకుల మాట! ‘ఆదాయంలో 15–20 శాతం కోత ప్రభావంతో చాలా వరకు బ్రోకరేజీలు ఈక్విటీ డెలివరీపై ఫీజు విధించవచ్చు. మధ్య, చిన్న స్థాయి బ్రోకింగ్ కంపెనీలకు ఈ సెగ బాగా తగులుతుంది’ అని ఫైయర్స్ బ్రోకరేజ్ కో–¸ఫౌండర్, సీఈఓ తేజస్ ఖోడే అభిప్రాయపడ్డారు. కాగా, బ్రోకింగ్ దిగ్గజం జీరోధా మాత్రం ప్రస్తుతానికి తాము షేర్ల డెలివరీపై ఎలాంటి ఫీజూ విధించబోమని స్పష్టం చేసింది. ‘మా ఆదాయంలో అత్యధిక భాగం ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారానే వస్తోంది. ఈ విభాగంలో కఠిన నిబంధనల వల్ల ఆదాయంలో 30–50 శాతం తగ్గుదలకు ఆస్కారం ఉంది’ అని జీరోధా ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ పేర్కొనడం విశేషం! సెబీ కీలక మార్పులు... ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కాంట్రాక్ట్ కనీస విలువను రూ.15 లక్షలకు (గరిష్టంగా రూ.20 లక్షలు) పెంపు. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్టుల సంఖ్య కుదింపు, ఇంట్రాడే పొజిషన్ లిమిట్లను తప్పనిసరిగా పర్యవేక్షించడంబ్రోకరేజీలు ఆప్షన్ ప్రీమియంను బయ్యర్ల నుంచి ముందుగానే పూర్తిగా వసూలు చేయడం. డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మార్జిన్ల పెంపు, క్యాలెండర్ స్ప్రెడ్ ప్రయోజనాల తొలగింపు. ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు. ఈ నిబంధనలు నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు దశల వారీగా అమల్లోకి రానున్నాయి.సెబీ కఠిన నిబంధనల కారణంగా మొత్తం ఎఫ్అండ్ఓ ట్రేడ్స్‌లో 60% మేర ప్రభావం ఉండొచ్చు. మా ప్లాట్ఫామ్లో డెరివేటివ్ ఆర్డర్లు 30% తగ్గుతాయని భావిస్తున్నాం. – నితిన్ కామత్, జీరోధా ఫౌండర్, సీఈఓ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
త్వరలోనే రెట్టింపు ఆదాయం
సమీప భవిష్యత్తులో దేశ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగబోతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తెలిపారు. ప్రజల తలసరి ఆదాయం కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన ‘కౌటిల్య ఆర్థిక సదస్సు’ మూడో ఎడిషన్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘సమీప భవిష్యత్తులో సామాన్య మానవుల జీవన ప్రమాణాలు భారీగా పెరగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘గిని ఇండెక్స్’(ఆర్థిక సమానత్వాన్ని కొలిచే సూచిక. ఇది 0-1 మధ్య ఉంటుంది. 0-పూర్తి ఆర్థిక సమానత్వం, 1-అధికంగా ఉన్న ఆర్థిక అసమానత్వం) 0.283 నుంచి 0.266కు క్షీణించింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 0.363 నుంచి 0.314కి చేరింది. కొవిడ్ పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. 140 కోట్ల జనాభా తలసరి ఆదాయాన్ని కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాం. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2730 డాలర్ల (రూ.2.2 లక్షలు) తలసరి ఆదాయాన్ని చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. మరో 2,000 డాలర్లు(రూ.1.6 లక్షలు) అదనంగా సంపాదించేందుకు మాత్రం ఐదు ఏళ్లు సరిపోతుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే.. -
జీఎస్టీలో లోయెస్ట్
సాక్షి, అమరావతి: మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెబ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోంది. ప్రజా సంక్షేమం, పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో కాలం గడిపేస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. బాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా మూడో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఒకపక్క దేశంలోని ప్రధాన రాష్ట్రాల జీఎస్టీఆదాయం భారీగా పెరుగుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తగ్గిపోతోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వృద్ధి రేటులో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తిరోగమనంలో ఉంది. మిజోరం, మేఘాలయా, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలతో పోటీపడుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.3,658 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో (గత నెల) రూ.3,506 కోట్లకు పడిపోయింది. అంటే 4 శాతం తగ్గిపోయింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక 8 శాతం, కేరళ 7 శాతం, తమిళనాడు 5 శాతం వృద్ధిని సాధించాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రతి నెలా జీఎస్టీ ఆదాయం పెరుగుతున్నా మన రాష్ట్రంలో మాత్రం జూలై నెలలో ఏడు శాతం, ఆగస్టులో 5 శాతం, సెప్టెంబర్‌లో 4 శాతం మేర తగ్గిపోయింది. -
ఎన్నారైలకూ సమన్లు వస్తాయ్..
మొదలైంది.. ఎన్నారైలకు నోటీసుల పరంపర!! ఎన్నారైలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి, ఆదాయం గురించి.. ఆదాయపు స్టేటస్ గురించి.. ఆదాయపు పన్ను వారి ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచి నోటీసులు మొదలయ్యాయి. మీకూ తెలిసే ఉంటుంది. పన్ను భారం విధించడానికి ప్రమాణం.. మీ రెసిడెంట్ స్టేటస్. అంతేకాని ఎటువంటి సందర్భంలో పౌరసత్వంతో సంబంధం లేదు.ఒక వ్యక్తి భారతదేశంలో 182 రోజులు లేదా ఎక్కువ రోజులు నివాసం ఉంటే రెసిడెంట్ అవుతారు లేదా ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండి, గత నాలుగు సంవత్సరాల్లో 365 రోజులున్నా రెసిడెంట్లు అవుతారు. మిగతా వారందరూ నాన్–రెసిడెంట్లు అవుతారు. స్థూలంగా చెప్పాలంటే పన్ను విధింపు, లెక్కింపు మొదలైన విషయాల్లో రెసిడెంట్లకు, నాన్–రెసిడెంట్లకు ఎన్నో తేడాలున్నాయి. నోటీసులో ఏయే అంశాలు అడుగుతున్నారంటే..విదేశాలకు ఎప్పుడు వెళ్లారు?ఏ సంవత్సరంలో విదేశాల్లో బ్యాంకు అకౌంటు తెరిచారు? ఆ అకౌంటు వివరాలు ఆ రోజు నుంచి రెసిడెంట్ స్టేటస్ పాస్‌పోర్ట్‌లో రాక/పోకకి సంబంధించి ఎంట్రీలు బ్యాంకు అకౌంటు ఎటువంటిదైనా వివరాలు ఇవ్వాలి స్థిరాస్తి వివరాలు ఆదాయ వివరాలు పన్ను చెల్లింపు వివరాలు సంబంధిత వివరాలువిదేశీ సంస్థల ద్వారా సమాచారం తెలుసుకుని వారికి నోటీసులు.. అవసరమైతే సమన్లు ఇస్తున్నారు. నలభై సంవత్సరాల చరిత్ర అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు. ఇది అసమంజసం అని అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని కొట్టేస్తున్నారని అంటున్నారు. చట్టప్రకారం ఒకప్పుడు 16 సంవత్సరాలుగా ఉన్న కాలపరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించారు. ఆ పదిని 5 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కాలపరిమితిని అనుసరించి విదేశీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం ఎన్నారైలు కానివారి దగ్గర్నుంచి.. అంటే రెసిడెంట్లు దగ్గర్నుంచి అడుగుతారు.నాన్–రెసిడెంట్లు .. వారున్న దేశం – అంటే విదేశంలోని ఆస్తుల వివరాలు ఇవ్వనవసరం లేదు. ఎటువంటి బాధ్యత లేదు. మరయితే ఎవరిపైన ఈ అస్త్రాలు అంటే.. ‘‘రెసిడెంట్ స్టేటస్‌లో ఉంటూ నాన్–రెసిడెంట్లుగా చలామణీ అవుతున్న’’ వారి మీద. మనం వాడుక భాషలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ‘ఎన్నారై’లు అనేస్తాం. కానీ, చట్టప్రకారం స్టేటస్ లెక్కించాలి. అనుమానం వస్తే నోటీసుల ఇస్తారు. సమాచారం అడుగుతారు. ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తారు. మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. డిపార్ట్మెంట్ వారు బ్లాక్‌మనీ చట్టానికి సంబంధించిన అధికార్లకు రిఫర్ చేయొచ్చు. వారు వారి పని చేస్తారు. ఎలా బయట పడాలి? విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం/చదువు కోసం వెళ్లినవారు విధిగా అన్ని రికార్డులు నిర్వహించండి. వీలుంటే ఫ్లైట్ టికెట్లు, బోర్డింగ్ పాస్‌లు, సంబంధిత ఈమెయిల్స్, పాస్‌పోర్టులు, పాతవి, లేటెస్టువి, వీసాకు సంబంధించిన కాగితాలు, విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు, ఏ తేదీ నాడు ఎంతెంత చేశారు.. ఏమి కొన్నారు .. స్థిరాస్తులు, మొదలైనవి రెడీగా ఉంచండి. అడిగినప్పుడు సకాలంలో ఇవ్వండి. నిజాయితీగా. ఆలస్యం అవుతుందంటే ఆ విషయం చెప్పండి. గడువు తేదీ లోపల స్పందించండి.మీరు నిజంగానే నాన్–రెసిడెంట్ అయితే, మీరు భయపడక్కర్లేదు. ఎవరినీ భయపెట్టడం లేదు. ముందు నుంచి మనం చెప్పేది ఒకటే. మీరు చేసే ఏ వ్యవహారానికైనా డాక్యుమెంట్లు తప్పనిసరి!! -
తగ్గిన జీఎస్టీ ఆదాయం
‘ఎన్నికల ముందు నా అనుభవంతో సంపద సృష్టిస్తా’ అన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఒక రూపాయి ఆదాయం కూడా సృష్టించలేకపోయారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలైతే పూర్తిగా క్షీణించాయి. గత రెండు నెలలుగా నమోదవుతున్న జీఎస్టీ వసూళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూసింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే.. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2023 ఆగస్టులో రూ.3,479 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2024 ఆగస్టులో 5 శాతం తగ్గి రూ.3,298 కోట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటక 11 శాతం, ఒడిశా 11 శాతం, కేరళ 9 శాతం, తమిళనాడు 7 శాతం, తెలంగాణ రాష్ట్రాల్లో 4 శాతం చొప్పున వృద్ధి నమోదైతే.. ఒక్క ఏపీలో మాత్రమే జీఎస్టీ ఆదాయం తగ్గింది. జూలైలో కూడా ఏపీలో 7 శాతం క్షీణత నమోదైంది. – సాక్షి, అమరావతినాడు కోవిడ్ సంక్షోభంలోనూ రెండంకెల వృద్ధికోవిడ్ సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పరుగులు తీసింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే అధికంగా.. రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.28,241.33 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఐదేళ్ల కాలంలో 2023–24 నాటికి 59.35 శాతం వృద్ధితో రూ.45,002.73 కోట్లకు చేరింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సగటున జీఎస్టీ ఆదాయం ఏడాదికి 11.87 శాతం చొప్పున వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఏకంగా 15.86 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.45,002.73 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో 16 శాతం, ఏప్రిల్ 12 శాతం, మే నెలలో 15 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏపీ.. కోవిడ్ తర్వాత తొలిసారిగా బాబు పాలనలో తిరోగమనం వైపు పరుగులు తీస్తోంది. బాబు నిర్వాకంతో కొనుగోలు శక్తి తగ్గుదల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద వేధింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో.. వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచగా.. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే వాటిని దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలించేశాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఇది జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎప్పటికç³్పుడు ప్రజల జేబుల్లో నగదు నింపడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఇది కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని.. ఇది రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అంతరిక్షంలో పైపైకి...
అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయపరంపర వాణిజ్యపరంగా కాసుల వర్షం కురిపించటం కొత్తేం కాదు. అంతరిక్షంలో మనకన్నా చాలాముందే అనేక విజయాలు నమోదు చేసుకున్న దేశాలకు సైతం ఈ విషయంలో మన ఇస్రో సంస్థ దీటుగా నిలిచిన వైనం కూడా పాత కథే. మరోసారి దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష సలహా సంస్థ నోవాస్పేస్ నివేదిక ధ్రువపరిచింది. గత పదేళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ కొచ్చిన ఆదాయం 6,300 కోట్ల డాలర్లని నివేదిక తెలిపింది.అంటే మన జీడీపీ వృద్ధిలో ఇస్రో పాత్ర ఎనలేనిదన్న మాట. ఈ రంగం నానాటికీ విస్తరిస్తోంది. అవసరాలు పెరుగుతున్న కారణంగా అవకాశాలు కూడా ఊహకందని రీతిలో విస్తరిస్తున్నాయి. మన అంతరిక్ష రంగంలో ప్రత్యక్షంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 96,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా... మొత్తంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. రానున్న కాలంలో ప్రైవేటు రంగ పెట్టు బడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలను గమనిస్తే మున్ముందు ఉద్యోగావ కాశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించవచ్చు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడు లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిరుడు నిర్ణయించింది. పర్యవసానంగా 2020లో 54 స్టార్టప్లుండగా ఇప్పుడవి 200కు చేరుకున్నాయి. మన దేశం మాత్రమే కాదు... లాభదాయకమని తేలడంతో పలు దేశాలు సైతం అంతరిక్ష రంగ పెట్టుబడులపై శ్రద్ధ పెడుతున్నాయి. ఆ రంగాన్ని విస్తరించ టానికి కృషి చేస్తున్నాయి. వచ్చే పదేళ్లలో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 18 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని ఆమధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కేసింది. పెట్టుబడుల రీత్యా మన అంతరిక్ష రంగం ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. అంతిమంగా అతి పెద్ద విజయం సాధించటానికి ముందు తప్పులు దొర్లటం అతి సహజమనీ, ఏ విజయానికైనా ఇలాంటి చరిత్రే ఉంటుందనీ ప్రముఖ అణు శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఎప్పుడో చెప్పారు. మన అంతరిక్ష రంగం కూడా ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. 1975లో ఆర్యభట్ట ఉప గ్రహ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం పట్టాలెక్కడానికి పదేళ్లు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ సమస్య అయినా అత్యంత క్లిష్టమైనదని చెప్పడానికి రాకెట్ సైన్స్‌తో పోలుస్తుంటారు. ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవాలన్నా, నిర్దిష్ట కక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచాలన్నా ఎన్నో సూక్ష్మ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతికంగా రాకెట్‌లోని వ్యవస్థలూ, ఉప వ్యవస్థలూ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాలి. చిన్న లోపమైనా చోటుచేసుకోకూడదు. ఒక ఉపగ్రహాన్ని పంపటానికే ఇంత సంక్లిష్ట ప్రక్రియ అవసరం కాగా, ఒకేసారి బహుళ ఉపగ్రహాలను ప్రయోగించటం అంటే మాటలు కాదు. ఇస్రో ఇలాంటి విన్యాసాలను అవలీలగా పూర్తి చేయగలిగిందంటే దాని వెనకున్న దశాబ్దాల కృషి సామాన్యమైనది కాదు. పైగా అగ్రరాజ్యాలు ఉపగ్రహాలనుపంపటానికి వసూలు చేసే సొమ్ముతో పోలిస్తే ఇస్రో ధర ఎంతో చవక. అందువల్లే అనేక దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోను ఎన్నుకుంటున్నాయి. వేరే అంతరిక్ష ప్రయోగ సంస్థలతో పోలిస్తే ఇస్రో చేసే వ్యయం అతి తక్కువ. మన దేశం గత దశాబ్దంలో 1,300 కోట్ల డాలర్లు వ్యయం చేయగా 6,300 కోట్ల డాలర్ల ఆదాయం రావటం ఇందుకే. 2014లో ఈ ఆదాయం కేవలం 3,800 కోట్ల డాలర్లని గుర్తుపెట్టుకుంటే మనవాళ్లు సాధించిన ఘనతేమిటో అర్థమవుతుంది. అంతరిక్ష పరిజ్ఞానం మన నిత్య జీవితంతో అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. టెలికాంరంగం ప్రస్తుతం 6జీ వైపుగా అడుగులేస్తున్నదంటే అది మన ఉపగ్రహాల సమర్థత వల్లనే. రిసోర్స్ శాట్, కార్టోశాట్ వంటివి పంట భూమి స్వభావం, మట్టిలో తేమ శాతం, పంటల తీరుతెన్నులు తది తర అంశాల్లో ఎప్పటికప్పుడు రైతుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వారు తగిన ప్రణాళికలు రూపొందించుకునేందుకు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడి సాగు దిగుబడిని పెంచటానికి దోహదం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తం చేయటానికి, ఏదైనా అనుకోని దుర్ఘటన సంభవిస్తే తక్షణం సహాయ సిబ్బంది రంగంలోకి దిగటానికి ఉపగ్రహాలు సమాచారమిస్తున్నాయి. నిత్యం దేశంలో 8 లక్షలమంది మత్స్యకారులు ఈ ఉపగ్రహాలు అందించే సమాచారంతో లబ్ధి పొందుతున్నారు. పట్టణప్రాంత ప్రణాళికలకూ, మౌలిక సదుపాయాల పర్య వేక్షణకూ ఇస్రో పంపిన ఉపగ్రహాల సమాచారం ఉపయోగపడుతోంది. ఇస్రో అంతరిక్ష రంగ కార్య కలాపాలను రానున్నకాలంలో మరింత విస్తృతం చేయదల్చుకుంది. ప్రపంచ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థలో ఇస్రో వాటా ప్రస్తుతం 2 శాతం. దీన్ని 2034 నాటికి 10 శాతానికి పెంచాలన్నది ఇస్రో లక్ష్యం. అంతరిక్ష సాంకేతికతల్లో స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉపగ్రహాలకు అవసరమైన హార్డ్‌వేర్ కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తున్నది. ఆ విషయంలో సాగుతున్న పరిశోధన, అభివృద్ధి పర్యవసానంగా ఇప్పటికే ఎన్నో కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి. అయితే అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించి అందరినీ శాసించేందుకు ఇప్పటికే అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. తనకు అనుకూలంగా అంతర్జాతీయ అంతరిక్ష న్యాయనిబంధనలు రూపొందేలా పావులు కదుపుతోంది. కనుక మనం అప్రమత్తంగా ఉండటం, అందుకు తగిన వ్యూహ రచన చేయటం ముఖ్యం. ఇస్రో ఏర్పడిన ఈ అర్థ శతాబ్దపు కాలంలో ఆ సంస్థ చేసిన కృషి అసాధా రణమైనదీ, అనుపమానమైనదీ. దాన్ని మరింత విస్తృతపరుచుకుంటేనే గగనవీధుల్లో విజయపరంపర నిరంతరం సాగుతుంది. -
గడ్డి పూలతో నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న మహిళా టెక్కీ
ఏవృత్తిలో ఉన్నా మనసుకు నచ్చిన పని, హబీ, లేదా అలవాటు ఇంకోటి ఉంటుంది. ఆ అభిరుచిని ఒక్క పట్టాన వదలాలి అని అనిపించదు. కానీ ఈ విషయంలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు కేరళలోని అలప్పుకు చెందిన పార్వతీ మోహనన్. మొక్కల్ని పెంచడం, అవి పూలో పళ్లో కాస్తో మురిసిపోవడం ఆమెకు చిన్నప్పటినుంచి అలవాటు. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోని టేబుల్ రోజ్ (మాస్ రోజ్) అందమైన రంగులతో మమేకమై పోతూ చివరికి దాన్నే వ్యాపారంగా మార్చేసింది. కేరళకు చెందిన పార్వతి మోహనన్ సక్సెస్‌స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! పార్వతి మోహనన్ కాలేజీ రోజుల్లోనే పోర్టులాకా (పతుమణి) అనే పూల మొక్కలను పెంచడం అభిరుచిగా చేసుకుంది. అయితే ఈ హాబీనే తనకు ఒకరోజు ఇంత ఆదాయాన్ని తెస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. పార్వతి త్రిస్సూర్‌లో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు, 2020లో కోవిడ్ కారణంగా, స్వగ్రామానికి తిరిగి వచ్చి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేది. ఇంట్లోనే ఉంటూ పోర్టులాకా మొక్కల్ని పెంచడం మొదలు పెట్టింది. వీటి ఫోటలను ఫేస్బుక్లో పోస్ట్ చేసేది. అందరికీ ఇవి తెగ నచ్చేసేవి. మాకూ కావాలని అడిగేవారు. అలా ఆమె వ్యాపారం మొదలైంది. బ్లాగర్లు, యూట్యూబ్ ఛానెల్‌ల కవరేజీ రావడంతో మరింత పేరు వచ్చింది.ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉండగానే, అలప్పులోని చేరాల ప్రాంతానికి చెందిన పార్వతి తన ఇంటి సమీపంలోని ఒకటిన్నర ఎకరాల భూమిలో పోర్టులాకా మొక్కలను పెంచడం ప్రారంభించింది. అలా కేవలం ఐదు సంవత్సరాలలో తనహాబీని ఒక బిజినెస్ వెంచర్‌గా మార్చుకుంది.ప్రస్తుతం కక్కనాడ్‌లోని ఇన్ఫోపార్క్‌లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేస్తు, మరోవైపు తోట నుండి సంవత్సరానికి లక్షల్లో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తుంది. అంతేకాదు ప్యాకేజింగ్ , ఆర్డర్లను కొరియర్ చేయడం లాంటి పనులకోసం మరో ఇద్దరు మహిళలకు ఉపాధినిస్తోంది. భారతదేశం, థాయిలాండ్, బ్రెజిల్‌లోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 300 రకాల పోర్టులాకా మొక్కలను పెంచుతోంది. పోర్టులాకా మొక్కల కాంబో ప్యాక్ ఆర్డర్లు రోజుకు 50-100 ఆర్డర్లను పూర్తి చేసే స్థాయికి చేరుకుంది. ఆమె నెలవారీ ఆదాయం. రూ. 1 లక్షకు పైమాటే. 300 రకాల మొక్కలు ఆమె దగ్గర ఉన్నాయి.మొక్కల సంరక్షణ చూస్తున్నపుడు చాలా హాయిగా అనిపిస్తుంది.వారాంతంలో మొక్కలతోనే ఉంటారు. అది మిగిలిన వారానికి సరపడా ఉత్సాహాన్ని శక్తిని సంపాదించుకుంటారు. ‘నా మొక్కలే నాకు సర్వస్వం’ అంటారు పార్వతి. మంచి ఆదాయాన్ని సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషించేందుకు మన చుట్టూ అపారమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అంతే అంటారామె. -
భారత్ వృద్ధికి 3i స్ట్రాటజీ!.. వరల్డ్ బ్యాంక్ సూచన
భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్కమ్ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇన్ఫ్యూజన్) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్‌లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు. -
బడ్జెట్ బూస్ట్, మా ఆదాయం రూ. 2500 కోట్లకు పెరగొచ్చు- నితిన్ కామత్
2024 బడ్జెట్లో సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి) రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో ఎక్స్‌లో స్పందించారు. తాజా కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనతో తమకు రెట్టింపు లాభాలొస్తాయంటూ ట్వీట్ చేశారు.Budget summary for usSTT on options goes up from 0.062% to 0.1%. STT on futures goes up from 0.0125% to 0.02% from October 1st. We collected about Rs 1500 crores of STT last year, @zerodhaonline. If the volumes don't drop, this will increase to about Rs 2500 crores at the new…— Nithin Kamath (@Nithin0dha) July 23, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కొలువు దీరిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో స్టాక్ మార్కెట్లకు సంబంధించి అనేక మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి)ను ప్రస్తుత 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుండి ఇది అమల్లోకి రానుంది. ఈ పెంపు ద్వారా తాము రూ. 2,500 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. గత ఏడాది ఈ పన్ను ద్వారా 1500కోట్లు వసూలు అయ్యాయి. ఇపుడిక ట్రేడింగ్ వాల్యూమ్‌లు తగ్గకపోతే కొత్త ధరల ప్రకారం రూ. 2,500 కోట్ల వరకు పెరగొచ్చని లెక్కలు చెప్పారు.బడ్జెట్ 2024-మార్కెట్-ప్రతిపాదనలుస్థిరాస్తి విక్రయానికి సంబంధించిన పన్నుల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కూడా తొలగించింది. అలాగే ఆస్తి విక్రయంపై మూలధన లాభాల పన్నును ప్రస్తుత 20 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది.దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10శాతం నుంచి 12.5శాతానికి పెంచారు.స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును 15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఈ రెండూ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. -
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్‌అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్‌పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. -
గ్రేటర్ హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టత..సాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలుకీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదల..సాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజి్రస్టేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు..సాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ -
సిటీ ‘రియల్’ మార్కెట్ ఢమాల్
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.- సాక్షి,హైదరాబాద్రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టతసాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలు కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదలసాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి.హైదరాబాద్జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజిస్ట్రేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారుసాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి,గిరిధారి హోమ్స్ ఎండీ -
డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్: బెంగళూరు టెకీ జంట
పలు అవసరాలకు డబ్బులు సాయం చేయమని, ఆపదలో ఉన్నాం ఆదుకోమని అడగడం చాలా కామన్. కానీ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో చెప్పండి మహాప్రభో అని అడిగేవారిని ఎక్కడైనా చూశారా? సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! బెంగళూరు టెకీ జంట నెలకు రూ. 7 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు, ఖరీదైన కారు, సౌకర్యవంతమైన జీవితం. కానీ మిగిలిన డబ్బును పూర్తిగా ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదట. మిగులు ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నామంటూ నెటిజనులను అభ్యర్థించడం వైరల్‌గా మారింది.భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌లో ఈ దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో నెట్టింట ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 30 సంవత్సరాల వయస్సు గల భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వార్షిక బోనస్‌తో పాటు నెలవారీ సంపాదన రూ. 7 లక్షలు. ఇందులో 2 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇక నెల ఖర్చులు రూ. 1.5 లక్షలు పోను వారికి నెలకు రూ. 3లక్షలకు పైగానే మిగులుతోంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు కూడా లేరు. పైగా విలాసంగా జీవించాలనే, ఎక్కువగా ఖర్చు పెట్టాలనే కోరిక భార్యభర్తలిద్దరికీ లేదు. అందుకే మిగిలిన డబ్బును ఎలా, ఎక్కడ వినియోగించాలో అర్థం కావడంలేదు. అందుకే ఏమైనా సూచనలివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు.దీంతో యూజర్లు కొంతమంది ఫన్నీగా, మరికొంతమంది సీరియస్‌గానే తెగ సలహాలిచ్చేస్తున్నారు. పబ్లిక్/ప్రైవేట్ కాస్ (లేదా రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని, లగ్జరీ వెకేషన్‌కి వెళ్లమని కొందరు, పిల్లలకోసం ప్లాన్ చేసుకోమని ఇలా తోచినట్టు సలహాలిచ్చేశారు. దీంతోపాటు, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ''నాకు కొంత ఇవ్వండి, నాకు సరిపడా జీతం రావడం లేదు'' అని ఒకరు కమెంట్ చేశారు. మరి మీరేమంటారు.. కామెంట్ సెక్షన్లో తెలపండి. -
బంగారం బంగారమే
కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. సంప్రదాయ డెట్ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.వివిధ సాధనాలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు), డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్స్ మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్ ఈటీఎఫ్ ధర ఏరోజుకారోజు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్ఐసీ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.41 శాతంగా ఉంది. ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్పెన్స్ రేషియో కింద ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. గోల్డ్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడమే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పెన్స్ రేషియో.. తిరిగి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ఫామ్లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీల్లో రాబడి ఇండియా బులియన్‌అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్జీబీ 2016– సిరీస్1 బాండ్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. ఇతర వివరాలు ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.కేటాయింపులు ఎంత మేర? ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్ కూడా ఉండదు. బంగారం బాండ్లు భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. రిటర్నుల్లో ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్ఎస్ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. రాబడులు బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్ రాబడిని బంగారం ఇచి్చంది. ముందస్తు ఉపసంహరణ ఎలా? ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్ తన వద్దనున్న బాండ్‌ను ఆర్బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఇక ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ). కాకపోతే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్ తక్కువ కనుక మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,307 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాల దన్నుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ రూ. 1,307 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 959 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,297 కోట్ల నుంచి రూ. 7,083 కోట్లకు పెరిగింది.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 4,507 కోట్ల నుంచి రూ. 5,568 కోట్లకు, ఆదాయం రూ. 24,588 కోట్ల నుంచి రూ. 27,916 కోట్లకు పెరిగింది. 2023–24కి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 40 డివిడెండు ప్రకటించింది. అమెరికా మార్కెట్లో అమ్మకాలు పటిష్టంగా ఉండటం లాభాల వృద్ధికి తోడ్పడిందని విలేకరుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కంపెనీ ఏర్పాటై 40 ఏళ్లయిందని, రాబోయే దశాబ్ద కాలంలో నవకల్పనలు, డిజిటల్ థెరప్యూటిక్స్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా అధిక వృద్ధి సాధనకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ∗ క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 6,119 కోట్లకు చేరింది. ∗యూరప్ మార్కెట్లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 521 కోట్లుగా నమోదైంది. మరోవైపు, భారత్ మార్కెట్లో ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,126 కోట్లకు పరిమితమైంది. ∗ అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 9 % వృద్ధి చెంది రూ. 1,209 కోట్లుగా ఉంది. ∗ ఫార్మా సరీ్వసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 779 కోట్ల నుంచి రూ. 822 కోట్లకు చేరింది. ∗ మంగళవారం బీఎస్ఈలో ఈ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 6,259 వద్ద ముగిసింది. -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
అక్కచెల్లెమ్మలకు మరింత స్థిర ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా, వారు ప్రతి నెలా మరింత స్థిర ఆదాయం పొందడానికి గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలను అమలు చేసింది. వచ్చే ఐదేళ్లు కూడా ఈ పథకాలను అమలు చేస్తామని తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ ప్రకటించింది.ఈ మూడు పథకాల ద్వారానే రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అన్ని సామాజికవర్గాలకు చెందిన దాదాపు 43 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందారు. వీరిలో 18.37 లక్షల మంది ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుంటూ కొత్తగా వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటుకు ముందుకొచ్చారు.మరికొంతమంది తమకు వచ్చిన శాశ్వత జీవనోపాధులను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇప్పటికే ప్రతి నెలా రూ. 10 వేల దాకా స్థిర ఆదాయం పొందుతున్నారు. ఆయా పథకాలను మరో ఐదేళ్ల పాటు కొనసాగించడం ద్వారా ఇంకా లక్షలాది పేద కుటుంబాలు ప్రతి నెలా స్థిర ఆదాయం పొందుతాయని అధికార వర్గాలు, ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు.వైఎస్సార్ చేయూత (తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూ.1.50 లక్షల వరకు) ఈ ఐదేళ్లు 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.75 వేలు ఇచ్చింది. ఇలా ఇప్పటికే రూ.19,189 కోట్లు అందజేసింది. వచ్చే ఐదేళ్లూ ఇలా.. 45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా చేయూత కావచ్చు.. ఇలా ఉండేలా చేయూత పథకాన్ని కొనసాగిస్తారు. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పన మరో రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి చేకూరినట్టవుతుంది. ♦ అలాగే బ్యాంకులతో, ప్రఖ్యాత సంస్థలతో టై అప్ కోసం సూచనలు, సలహాలు ఇస్తూ లేదా వారి సొంత వ్యాపారం ద్వారా వారు నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. వైఎస్సార్ కాపు నేస్తం(కాపు అక్కచెల్లెమ్మలకు భరోసా.. ఇకపై రూ.1.20 లక్షల వరకు)♦ 4.63 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం అందజేసింది. ఇలా ఇప్పటికే రూ.2,030 కోట్లు ఇచ్చింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ. 60 వేలు అందజేస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.20 లక్షల లబ్ధి.♦ కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా కాపు నేస్తం కావొచ్చు.. ఇలా ఉండేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో రూ.60 వేలు అందజేస్తారు.వైఎస్సార్ ఈబీసీ నేస్తం(అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు చేదోడు.. ఇకపై రూ.1.05 లక్షల వరకు)♦ ఈ ఐదేళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,877 కోట్లు ప్రభుత్వం అందజేసింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ.60 వేలు అందిస్తుంది. మొత్తం ఏడు విడతల్లో రూ.1.05 లక్షల లబ్ధి♦రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా ఈబీసీ నేస్తం కావొచ్చు. ఇలా ఉండేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో మరో రూ. 60 వేలు అందిస్తారు.ఆర్థిక తోడ్పాటుకు అదనంగా..♦ కేవలం ఆర్థికసాయం అందజేయడానికే ప్రభుత్వం పరిమితం కాలేదు. వైఎస్సార్ చేయూత తదితర పథకాల ద్వారా అందుకున్న నగదును ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది. గత ఐదేళ్లలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలతో ముందుకొచ్చిన లబ్ధిదారులకు అదనపు తోడ్పాటును కూడా అందించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల క్రితమే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ప్రాక్టర్ – గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ♦ ప్రభుత్వం అందజేసిన లబ్ధితో కొత్తగా శాశ్వత జీవనోపాధిని పొందడానికి ముందుకొచ్చిన వారికి ఆయా వ్యాపార సంస్థల ద్వారా తగిన శిక్షణ అందజేశారు. మిగిలిన రిటైల్ వ్యాపారుల కంటే తక్కువ ధరలకే ఆయా దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. లేదంటే అక్కచెల్లెమ్మలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా ఆయా సంస్థలే కొనుగోలు చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి. ♦ శాశ్వత జీవనోపాధిని పొందే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయానికి అదనంగా ఇంకా నిధుల అవసరం పడితే.. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తక్కువ వడ్డీకే అందేలా ప్రభుత్వం సహకారం అందించింది. -
Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..
‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్‌గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్‌లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్‌లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్‌లు అమల్లో ఉన్నాయి. ఫారం 1 లేదా సహజ్ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. ఇక ఐటీఆర్ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్ లేదా అసోసియేషన్, ఎల్ఎల్పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి. చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి. వెనకటికి కుప్పుస్వామీ మేడ్ ఇట్ డిఫికల్ట్ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్ చేయండి. ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్‌లు డీలా -
‘ఆసరా’తో అగ్రపథం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పొదుపు సంఘాలు ఆదాయపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలోని సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం అత్యధికంగా ఉందని, 2019 నుంచి 2024 నాటికి వారి రోజువారీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. పొదుపు సంఘాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక సగటు ఆదాయం కలిగిన 20 జిల్లాల్లో 15 గ్రామీణ జిల్లాలే కాగా ఇందులో తొమ్మిది జిల్లాలు ఏపీలోనే ఉండటం గమనార్హం. డిజిటల్ లావాదేవీల్లోనూ ఆంధ్రప్రదేశ్ మహిళా పొదుపు సంఘాలు ముందు వరుసలో నిలిచాయి. పొదుపు సంఘాల సభ్యులు సాధికారతతో లక్షాధికారులుగా అవతరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. ఇటీవల వారి ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యుల క్రెడిట్ ఆదాయాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పొదుపు మహిళలను ప్రోత్సహిస్తూ అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలు, బ్యాంకు రుణాలతో తోడ్పాటు, మల్టీ నేషనల్ కంపెనీలతో అనుసంధానం లాంటివి సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టమవుతోంది. తద్వారా ఎన్పీఏల రేటు గణనీయంగా తగ్గిపోయి రికవరీ బాగుండటంతో పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సకాలంలో చెల్లింపులు కారణంగా వారి రుణ పరపతి సైతం పెరిగింది. గత సర్కారు హయాంలో ఏపీలో పొదుపు సంఘాల ఎన్పీఏలు ఏకంగా 18.36 శాతం ఉండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా ఆదుకుని జీవం పోయడంతో ఇప్పుడు ఎన్పీఏలు గణనీయంగా 0.17 శాతానికి తగ్గిపోయాయి. ♦ ఆంధ్రప్రదేశ్ తరువాత అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యుల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. మరో ఏడాదిలోగా హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేం‘ద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులై గేమ్ ఛేంజర్‌గా నిలుస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులుగా అవతరించడమే కాకుండా వారి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సంపదను సృష్టించి పునఃపంపిణీ చేస్తున్నారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని 72.7 శాతం మహిళా పొదుపు సంఘాల లావాదేవీలు ఇప్పుడు మెట్రో ప్రాంతాలకు, బయట జిల్లాలకు విస్తరించాయి. 20 కి.మీ. నుంచి 2,000 కి.మీ. పరిధిలో రాష్ట్రం లోపల, బయట కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా 65 శాతం మంది ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 30.5 శాతం గ్రామీణ ఏటీఎం లావాదేవీలు పట్టణాలు, మెట్రో ప్రాంతాలు, ఆయా జిల్లాల వెలుపల జరుగుతున్నాయి. ♦ పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులు వారి సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి వ్యయం చేయడం పెరిగిన వారి కొనుగోలు శక్తిని సూచిస్తోంది. ♦ విజయనగరం జిల్లాకు చెందిన పొదుపు సంఘాల సభ్యులు 68 కి.మీ. ప్రయాణించి విశాఖలో వ్యయం చేయగా శ్రీకాకుళం జిల్లా సంఘాల సభ్యులు 1,115 కి.మీ. ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో వ్యయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 1,647 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో వ్యయం చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 2,074 కి.మీ.ప్రయాణించి ఢిల్లీలో వ్యయం చేశారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వ్యాపారాల నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించి ఉంటారని పేర్కొంది. -
YouTube: మీకు మీరే బాస్
ఒక్క వీడియో వైరల్‌గా మారినా.. లక్షలాది రూపాయలు వచ్చి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. యూజర్లు నచ్చే, మెచ్చే అలాంటి వీడియోలను మరిన్ని అందిస్తూ వెళితే మంచి పేరు, గుర్తింపు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఇదంతా యూట్యూబ్ ప్రపంచం గురించే. నేడు వయసుతో సంబంధం లేకుండా యూట్యూబర్ కావాలనే అభిలాష చాలామందిలో కనిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ ద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష కూడా కనిపిస్తోంది. కానీ ఎలా..? ఎలాంటి సందేహం వచి్చనా, ఆరోగ్యం లేదా ఆహారం, విద్య, వృత్తి, వినోదం, విహారం, యోగాభ్యాసం ఇలా అన్నింటికీ చిరునామాగా యూట్యూబ్ మారిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కళ్ల ముందుంచుతుంది. వీక్షకులకు కావాల్సినంత సమాచారం, వినోదం. పంచే వారికి పండంటి ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు 2023లో వారంలో 17 గంటల చొప్పున వీడియోలను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ మంది సమాచారాన్ని వీడియోల రూపంలోనే పొందుతున్నారు. కనుక యూట్యూబ్ వినోదం లేదా సమాచార వేదికగానే మిగిలిపోవడం లేదు. ఉపాధిని వెతుక్కునే అవకాశాలకు చిరునామాగా మారిపోయింది. ప్రతి నెలా రూ.లక్షలాది రూపాయలు సంపాదించే తెలుగు యూట్యూబర్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా చేరిపోవాలంటే..? ఏమి కావాలి..? ఎలాంటి పెట్టుబడి లేకుండా యూట్యూబ్ చానల్ ఆరంభించడం చాలా మందిని ఆకర్షిస్తున్న అంశం. ఓ మంచి ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో ఎడిటింగ్ టూల్ (ఉచిత), రూ.150 పెట్టుబడితో వచ్చే మైక్ ఉంటే చాలు. ఇక్కడ ధన పరమైన పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ప్రయత్నం, కృషి, అంకిత భావం వంటి వనరులు కావాలి. వీలైనంత సమయాన్ని వెచి్చంచాలి. ‘‘నేను నా కుటుంబంతో గడిపే దానికంటే పది రెట్లు అధిక సమయాన్ని యూట్యూబ్ కోసం ఆరంభంలో వెచ్చించాల్సి వచ్చేది. వీడియో చేయాలంటే అందుకు సంబంధించిన కంటెంట్ (సమాచారం) సిద్ధం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ అనంతరం పబ్లిష్ చేయాలి. ఇందుకు ఎంతో సమయం పట్టేది. ప్రతిరోజూ ఒక వీడియో అంటే అది అసాధ్యం. దీనికంటే వారానికి రెండు, మూడు వీడియోలకు కుదించుకోవడం మంచిది. ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం నిర్ధిష్ట సమయంలో వీడియోలను అప్లోడ్ చేయడం వల్ల యూజర్లకు మరింత చేరువ కావచ్చు’’అని యూట్యూబర్ రతీష్ (‘రతీష్‌ఆర్‌మీనన్’) తెలిపారు. వ్యక్తిగతంగా ఒక నెలలో 8 వీడియోలకు మించి చేయడానికి సమయం సరిపోదన్నది అతడి అభిప్రాయం. బాగా పాపులర్ అయి, సబ్ర్‌స్కయిబర్లు మిలియన్ దాటిపోతే, అప్పుడు సహాయకులను పెట్టుకుని పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మరిన్ని వీడియోలు చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ, ఆరంభంలో పరిమాణం కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేయాలి. యూజర్లతో బలమైన బాండింగ్ అవసరం. ఆరంభం ఇలా.. ► 18 ఏళ్లు నిండి, భారత్‌లో నివసించే స్థానికులు ఎవరైనా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో నమోదుకు అర్హులే. చానల్ ప్రారంభించి వీడియోల పోస్టింగ్ అనంతరం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ► వైపీపీలో చేరాలంటే కనీస చందాదారులను సంపాదించి ఉండాలి. ‘నోటిఫై మీ వెన్ ఐ యామ్ ఎలిజబుల్’ నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకుంటే చాలు. మీ చానల్‌కు అర్హత లభించిన వెంటనే యూబ్యూబ్ నుంచి ఆహా్వనం వస్తుంది. ► ఒక్కసారి మీ చానల్ వైపీపీ కోసం ఎంపిక అయిందంటే అప్పుడు నియమ, నిబంధనలకు అంగీకరిస్తూ, మానిటైజేషన్ ఫీచర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పని చేస్తుంది..? యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయాలంటే అందుకు సంబంధించి నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి. అశ్లీల, హానికారక, తప్పుదోవ పట్టించే, అవాస్తవ, కల్పిత సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. వీడియోలు పోస్ట్ చేసే విషయంలో పరిమితి లేదు. వాటిపై ఆదాయం కోరుకునేట్టు అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవాలి. యూట్యూబ్ చానల్‌కు ఎంత మంది సబ్‌్రస్కయిబర్లు (సభ్యులు) ఉన్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఒకరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ మాడ్యూల్ ఆధారంగా ఆర్జించే మొత్తం ఆధారపడి ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు యూట్యూబ్ మద్దతు పలుకుతుంది. సృజనాత్మకత ఎలా ఉన్నా సరే దాన్ని యూజర్లకు చేరువ చేసి వారికి తగిన ప్రతిఫలం అందించడమే మా లక్ష్యం. భారత్‌లో 2008లో పార్ట్నర్ (భాగస్వామి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీడియో క్రియేటర్లు కంటెంట్ ద్వారా ఆర్జించడం మొదలైంది. క్రియేటర్ల విజయంపైనే ప్రకటనల ఆదాయం ముడిపడి ఉంటుంది’’అని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ వివరించారు. చానల్ సక్సెస్ కోసం..? ఏదైనా ఒక రంగం/విభాగం/సబ్జెక్ట్/కళలో నైపుణ్యాలు ఉంటే, దాన్ని యూజర్లకు అందించొచ్చు. మంచి సృజనాత్మకత ఉండాలి. లేదా సాధారణ విషయాలను సైతం కళాత్మకంగా పంచుకునే నైపుణ్యాలు కావాలి. విలువైన, ఉపయోగకరమైన కంటెంట్‌తో వీడియోలు పోస్ట్ చేయడమే కాదు.. వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఛానల్ నుంచి కొత్త వీడియోలు ఎప్పుడు పోస్ట్ అవుతాయనే స్పష్టత యూజర్లలో ఉండాలి. రోజుకు ఒకటా? వారానికి ఒకటా లేదా రెండా..? ఏ సమయంలో వస్తుందనే స్పష్టత ఇవ్వాలి. వీడియోలను పోస్ట్ చేసిన తర్వాత వీక్షకులతో అనుసంధానం కావాలి. వీలైతే కామెంట్లను చదివి, వారి అభిప్రాయాలు అర్థం చేసుకోవడం, వారికి నచ్చేలా కంటెంట్‌ను అందించడంపై దృష్టి పెట్టాలి. వీలు చేసు కుని సబ్్రస్కయిబర్లతో చాట్, సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల బాండింగ్, బ్రాండింగ్ పెరుగుతుంది. అనలైసిస్ టూల్ వాడు కోవాలి. ఆరంభంలో ప్రయోగాలకు వెనుకాడకూడదు. సమయం చాలడం లేదని నాణ్యతలో రాజీపడకూడదు. మరింత మంది యూజర్లను చేరుకునేందుకు, అప్పటికే పాపులర్ అయిన యూట్యూబర్ల సాయం తీసుకోవచ్చు. యూజర్లను పెంచుకునే విషయంలో యూట్యూబ్ సైతం కావాల్సినంత సహకారం, మద్దతును అందిస్తుంది. యూజర్లకు చేరువ అయితే, ఆదాయం అదే వస్తుంది. ఆదాయం ఏ రూపంలో..? యూట్యూబ్‌లో కొత్తగా చేరిన వారు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. చానల్ సభ్యులు నెలవారీగా చెల్లించే మొత్తం నుంచి కొంత యూట్యూబ్ పంచుతుంది. సూపర్ చాట్, సూపర్ స్టికర్స్ కోసం సభ్యులు చెల్లింపులు చేస్తారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మన్దీప్ సింగ్ 2021లో ‘డేటాసైన్స్డైరీస్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచాడు. కృత్రిమ మేధకు సంబంధించి కంటెంట్‌ను ఇది అందిస్తుంటుంది. చందాదారులు కేవలం 1,500 మందే ఉన్నారు. దీంతో ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా కొన్ని వేల రూపాయల చొప్పున ఆదాయం సంపాదించే వాడు. అదే ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ రతీష్ ఆర్ మీనన్ ‘రతీష్‌ఆర్‌మీనన్’ పేరుతో 2012 నుంచి చానల్ నడుపుతుండగా, ప్రస్తుతం చందాదారులు 11.2 లక్షలకు చేరుకున్నారు. మూడు మార్గాల ద్వారా అతడికి ఆదాయం వస్తోంది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంతోపాటు, స్పాన్సర్డ్ ప్రకటనలు, అఫిలియేట్ మార్కెటింగ్ కమీషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఒక్కటే నేరుగా యూట్యూబ్ నుంచి వచ్చేది. మిగిలిన రెండూ థర్డ్ పారీ్టల రూపంలో వస్తుంది. స్పాన్సర్డ్ ప్రకటనలకు సంబంధించి కంపెనీలు, బ్రాండ్లతో నేరుగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చు. ఇక అఫిలియేట్ మార్కెటింగ్ అంటే.. చానల్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం. ఉదాహరణకుఒక ఉత్పత్తికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను వీడియో డి్రస్కిప్షన్లో ఉంచడం. ఎవరైనా యూజర్ ఆ లింక్‌ను క్లిక్ చేసి, సంబంధిత ఉత్పత్తి కొనుగోలు చేస్తే, దానిపై 2–5 శాతం కమీషన్‌గా లభిస్తుంది. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లో తనకు వచ్చే ఆదాయం నుంచి 70 శాతాన్ని యూట్యూబ్ చెల్లిస్తుంది. షార్ట్‌లకు సంబంధించి వ్యూస్ ఆధారంగా (ఎంత మంది వీక్షించారు) ఆదాయంలో 45 శాతాన్ని చెల్లిస్తుంది. వీడియోల్లో ప్రదర్శించే ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో 55 శాతాన్ని చెల్లిస్తుంది. యూట్యూబ్‌కు ప్రీమియం మెంబర్షిప్ ద్వారా కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయంలోనూ కొంత వాటాను.. ఛానల్ కంటెంట్‌ను ఏ మేరకు యూజర్లు చూశారనే దాని ఆధారంగా యూట్యూబర్‌కు పంచుతుంది. రెగ్యులర్ ఆదాయానికి ప్రత్యామ్నాయమా..? తమ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్త వీక్షకులు యూట్యూబ్ వల్లే సాధ్యమైనట్టు మెజారిటీ యూట్యూబర్లు అంగీకరిస్తున్నారు. కంటెంట్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం లభించినట్టు 80 శాతం మంది చెబుతున్నారు. ఇతర వృత్తి, ఉద్యోగాన్ని విడిచి పెట్టేసి యూట్యూబ్‌ను ప్రధాన ఆదాయ మార్గంగా చేసుకుందామని అనుకుంటున్నారా..? ఆచరణలో అదంత సులభమైన పని కాదు. యూట్యూబ్ ప్రపంచంలో ప్యాసివ్ ఆదాయం కోసం (రెండో ఆదాయ మార్గం) చానళ్లను నడిపిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తమ కంటెంట్‌కు ఆదరణ వస్తూ, ఆదాయం పెరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో యూట్యూబర్‌గా మారుతున్నారు. కనుక ప్రస్తుతం చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం లేదా జాబ్ కొనసాగిస్తూనే.. తమకున్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా యూట్యూబ్ ఛానల్‌ను ఆరంభించి, ఖాళీ సమయాన్ని కంటెంట్ క్రియేషన్‌పై వెచి్చంచడం మంచి ఆలోచన అవుతుంది. యూజర్లను ఎలా ఆకర్షించాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి? తదితర విషయాలన్నీ తెలియడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. కనుక అప్పటి వరకు ఇతర ఆదాయ మార్గాలను ఎందుకు కాదనుకోవాలి. ఒకవైపు వృత్తి లేదా ఉద్యోగం చేస్తూ, మరోవైపు యూట్యూబ్ వీడియోల కోసం కావాల్సినంత సమయాన్ని వెచి్చంచడం కూడా కష్టమైన టాస్కే. అందుకే ఆరంభంలో కాస్తంత సమతుల్యం చేసుకుని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. సమయాన్ని పొదుపుగా వినియోగించుకున్న వారికే ఇది సాధ్యపడుతుంది. అసలు వీలు చేసుకోవడమే పెద్ద సమస్య అని కార్పొరేట్ ట్రైనర్ అయిన నిధి సైని పేర్కొన్నారు. ‘నిధిసైని2808’ పేరుతో ఆమె 2020లో యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. 2,690 మంది యూజర్లే ఉన్నారు. అయినా కానీ తన చానల్‌ను మానిటైజ్ (ఆదాయం పొందడం) చేసుకోలేదు. కంటెంట్‌ను అందించేందుకు తగినంత సమయాన్ని వెచి్చంచలేనన్నది ఆమె అభిప్రాయం. కనీసం 1,000 మంది సబ్ర్‌స్కయిబర్లు, 4,000 గంటల వాచ్ అవర్స్ (గడిచిన ఏడాది కాలంలో) ఉంటే ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడినట్టేనని రతీష్ అంటున్నారు. యూట్యూబ్ ప్రపంచంలో స్వల్ప మొత్తాన్ని ఆర్జించే వారే ఎక్కువ. యూట్యూబ్‌నే ప్రధాన వృత్తిగా మలుచుకుని, కావాల్సినంత ఆదాయం సంపాదించే వారు తక్కువ. యూట్యూబ్ ఛానల్ ఆరంభించి వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే ఆదాయం మొదలు కాదు. ఎంత మంది చూశారు? ఎన్ని గంటల పాటు చూశారు? తదితర పారామీటర్ల ఆధారంగా ఆదాయం మొదలు కావడానికి సమయం తీసుకోవచ్చు. రతీష్‌ఆర్‌మీనన్ 2011లో చానల్ ప్రారంభించగా, నెల రోజుల్లోనే అతడికి ఆదాయం రావడం మొదలైంది. కాకపోతే అప్పట్లో నిబంధనలు ఇప్పటి మాదిరి కఠినంగా లేవు. 2014లో తన చానల్‌ను రీబ్రాండింగ్ చేసుకోగా, ఏడాదిన్నర క్రితమే ఒక మిలియన్ సబ్స్క్రయిబర్ల మార్క్ దాటింది. టెక్ వీడియోలు అప్లోడ్ చేసే రతీష్, ట్రావెల్ వీడియోలను కూడా పోస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఒక వీడియోకి 20,000 వీక్షణలు ఉంటే, టెక్ క్రియేటర్లకు నెలవారీ 500 డాలర్ల వరకు ఆదాయం (రూ.41,000) ప్రకటనల రూపంలో వస్తుందని చెప్పారు. అదే ఎంటర్టైన్మెంట్ చానల్ అయి, ఒక మిలియన్ వ్యూస్ ఉంటే నెలవారీ ఆదాయం రూ.2–3 లక్షల మధ్య ఉంటుందట. ఏమిటి మార్గం..? చానల్‌పై ఎంత సమయం వెచి్చంచగలరనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు తెలుసుకోవాలి. మరిన్ని వీడియోలు అందించే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించొచ్చు. కానీ, దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకోవడానికి ఎంతో సహనం, సమయం కావాలి. పెట్టిన చానల్, పోస్ట్ చేసే వీడియోలు ఆదరణ సంపాదించలేకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే, అప్పుడు ప్లాన్ బీ కూడా ఉండాలి. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపివేసిన వెంటనే, ఆదాయ మార్గం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ వ్యాపారస్థులు కస్టమర్లను చేరుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లను వినియోగించుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలతో కస్టమర్లకు చేరువ అవుతున్నారు. సంగీతం, ఇతర కళల్లో పట్టున్న వారు యూట్యూబ్ చానళ్లు తెరిచి యూట్యూబ్ సాయంతో అభిమానులను పెంచుకుంటున్నారు. ఫలానా అనే కాకుండా, ప్రస్తుత మీ ఉపాధి, వృత్తి నైపుణ్యాలను విస్తరించుకునేందుకు సైతం యూట్యూబ్‌ను వేదికగా చేసుకోవచ్చు. -
ఏపీలో ఉద్యోగులు పెరిగారు.. ఆదాయం పెరిగింది! ఇవిగో లెక్కలు
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ రంగాల్లో ఉద్యోగులు పెరిగారు. వారి సంపాదన, ఆదాయం పెరిగింది. ఇవి ఎవరో చెప్పిన మాటలు కావు. ఇన్కమ్ రిటర్న్స్ ఫైలింగ్స్ ఆధారంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( SBI ) తాజా నివేదిక వెల్లడించిన గణాంకాలివి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. కొత్తగా ఏమీ రావట్లేదు.. యువత బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్నారంటూ అరకొర, అసత్య విమర్శలు చేసేవారికి ఈ గణాంకాలు చెంపపెట్టు. అసెస్మెంట్ సంవత్సరం 2020 నుంచి 2023 మధ్య కొత్తగా పన్ను దాఖలు చేసినవారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో 18 లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అసెస్మెంట్ ఇయర్స్ 2020 నుంచి 2023 మధ్య కాలంలో దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ నివేదిక ప్రకారం మూడేళ్లలో కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 18 లక్షలు ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర (13.9 లక్షలు), ఉత్తరప్రదేశ్ (12.7 లక్షలు), గుజరాత్ (8.8 లక్షలు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇతర దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సంఖ్య తమిళనాడులో 4 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, కేరళలో 3 లక్షలు ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రతికూల వృద్ధిని సాధించింది. ఈ కాలంలో 12 లక్షల మంది ఐటీఆర్ ఫైలర్లు తగ్గిపోయారు. పెరిగిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈపీఎఫ్ ఖాతాల ద్వారా తెలిసింది ఏమిటంటే.. ఏపీలో కొత్తగా 16 లక్షల మంది ఉద్యోగాల్లో చేరినట్టు రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గతేడాది డిసెంబర్ 22న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, వారి ఆదాయాలు పెరిగినట్లు చట్టబద్ధమైన కేంద్ర సంస్థల గణాంకాలు చెబుతుంటే.. కొందరు మాత్రం పనికట్టుకుని ఏపీపై విష ప్రచారం చేస్తున్నారు. ఆదాయాలు పెరిగితేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తారు. వీరిలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు ఈపీఎఫ్ ఖాతాల ఆధారంగా కేంద్ర మంత్రి సైతం వెల్లడించారు. ❑ Post the release of SBI Research report on 15 August 2023 ('Deciphering emerging Trends in ITR Filing: The Ascent of the new Middle Class in circular migration') compiled with limited data available then, Income Tax department subsequently released granular data of taxpayers’… — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) January 8, 2024 విద్యుత్తు శాఖలో ఇలా.. వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728 2019లో తొలి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 1,05,869 2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 13,136 రెండు విడతల నోటిఫికేషన్ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529 తొలి విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్మెంట్ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని గతంలో సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని గతంలో సీఎం చెప్పారు. ఇవికాక కాంట్రాక్ట్ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించామని, ఇందులో 83–84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని వివరించారు. ఆర్బీఐ నివేదికలోనూ.. చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గినట్లు ఆర్బీఐ ఇదివరకే తెలిపింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని నివేదిక వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని పేర్కొంది. -
Sitara Insta Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అందరికీ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కొందరికి మాత్రం అతడిలో అసలైన బిజినెస్‌మ్యాన్ గుర్తొస్తాడు. ఎందుకంటే మూవీ అంటే మహా అయితే సంవత్సరానికి ఒకటి చేస్తాడు. కానీ అదే టైంలో యాడ్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోలిస్తే యాడ్స్‌లో మహేశే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇతడి రూట్లోనే కూతురు సితార కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ సినిమాల్లోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మహేశ్ కూతురు సితార మాత్రం పుట్టినప్పటి నుంచే మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) గతంలో ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో కనిపించిన సితార.. 'సర్కారు వారి పాట' సినిమాలోని ఓ పాటలో డ్యాన్సులతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇన్ స్టాలో ఈమెకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలానే యూట్యూబ్ ఛానెల్లోనూ 10 వేల మంది వరకు సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తూ మంచిగా సంపాదిస్తోంది. గతేడాది ఓ జ్యూవెల్లరీ యాడ్‌లో సితార యాక్ట్ చేసినందుకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సితార సంపాదన విషయమై కొన్ని నంబర్స్ వినిపిస్తున్నాయి. నెలకు ఏకంగా రూ.30 లక్షల వరకు వెనకేసుకుంటోందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
LIC Jeevan Dhara II Policy: ఎల్ఐసీ 'జీవన్ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్ఫిట్స్!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్‌ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్ ఇన్ కమ్ పొందవచ్చు. జీవన్ ధార 2 పథకం వివరాలు ►పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. ►ఒకేసారి డిపాజిట్ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు. ►యాన్యుటైజేషన్ లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. ► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు, ► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు, ►యాన్యుటీ టాప్-అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ►ఈ ఎల్ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్ తీసుకోవచ్చు. ►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు. -
సోషల్ మీడియా క్యాష్ పార్టీ..
సాక్షి, అమరావతి: యువత బలహీనతలు సోషల్ మీడియా సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీ విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తూ యూజర్ల రక్షణ, హానికర కంటెంట్‌ను అరికట్టడంలో అవి అలక్ష్యం వహిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు తమకు వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికే పనిచేస్తున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ అధ్యయనం వెల్లడిస్తోంది. తాజా నివేదిక ప్రకారం..2022లో అమెరికాలోని 18 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ఏకంగా రూ.91,541 కోట్లను సోషల్ మీడియా సంస్థలు ఆర్జించాయి. ఇందులో 12 ఏళ్లలోపు కేటగిరీలో ఏకంగా రూ.17,476 కోట్లు ప్రకటనల రాబడి ఉండటం విశేషం. స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం 30–40% యువ యూజర్ల వీక్షణల ద్వారా సోషల్ మీడియా సంస్థలకు సమకూరుతోంది. ఈ ట్రెండ్ ఏటా పెరుగుతూనే ఉంది. ఈ లెక్కన కొత్త సంవత్సరంలో వీటి ఆదాయంలో మరింత వృద్ధి కనిపించనుంది. స్నాప్‌చాట్‌కు అధిక రాబడి: హార్వర్డ్ వర్సిటీ బృందం అమెరికాలోని ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్ వినియోగదారులపై పరిశోధన చేసింది. 12 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ప్రకటనల ద్వారా యూట్యూబ్ రూ.7,983 కోట్లు, ఇన్‌స్ట్రాగామ్ రూ.6,676 కోట్లు, ఫేస్బుక్ రూ.1,140 కోట్లను రాబట్టినట్లు నివేదిక పేర్కొంది. 13–17 ఏళ్ల లోపు యూజర్ల వినియోగంలో టిక్‌టాక్ రూ.16,644 కోట్లు, యూట్యూబ్ రూ.9,986 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. మొత్తం ప్రకటనల ఆర్జనలో స్నాప్‌చాట్ 41%, టిక్‌టాక్ 35%, యూట్యూబ్ 27%, ఇన్‌స్ట్రాగామ్ 16% వాటా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనూ గణనీయంగా వృద్ధి: భారత్‌లో సగటు వ్యక్తి సోషల్ మీడియా వినియోగం రోజుకు 192 నిమిషాలుగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా (ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్) స్థూల ప్రకటనల ఆదాయం రూ.18,308 కోట్లుగా నమోదైంది. ఇది 2022 ఆర్థిక సంవ్సతరంతో పోలిస్తే 13% వృద్ధి చెందింది. త్వరలోనే మెటా యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించే అవకాశాన్ని అన్వేషిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెడిసీర్ నివేదిక ప్రకారం దేశంలో డిజిటల్ ప్రకటనల విలువ 2020లో రూ.24,966 కోట్ల నుంచి 2030కి రూ.2.91 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయంగా ఇన్‌స్ట్రాగామ్ ప్రకటనల కోసం ప్రతి క్లిక్కి సగటున రూ.66.06 వసూలు చేస్తోంది. టెక్ కంపెనీల నుంచి ఎక్కువ పారదర్శకత ఉండాలన్నా..యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను అరికట్టాలన్నా ప్రభుత్వ జోక్యం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉంటే చిన్నా రులు, యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుని వచ్చే హాని కరమైన ప్రకటన పద్ధతులను తగ్గించవచ్చని వీరు అభిప్రా యపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా డిజిటల్, సోషల్ మీడియా నియంత్రణలపై డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తోంది. -
రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం
సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కంటే రెట్టింపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు ఇలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన దాఖలాల్లేవన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో జరిగిన ఏపీ గున్వత్ సంకల్ప (నాణ్యతకు భరోసా) వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు రైతుల సంక్షేమం కోసమే వేస్తున్నారని చెప్పారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించేందుకు ఆర్బీకే వ్యవస్థను, దీనికి అనుబంధంగా యంత్రసేవా కేంద్రాలు, గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారని వివరించారు. పాడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందించడంతోపాటు బ్యాంకింగ్ సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు, రివార్డులతో నేడు మన ఆర్బీకేలు దేశానికే కాదు.. ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలిచాయని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఉద్యానపంటల హబ్‌గా నిలిచిన ఏపీ బొప్పాయి, టమాటా, కొకో, పామాయిల్లో మొదటిస్థానంలోను, అరటి, బత్తాయి, వంగ, మిరపలో రెండోస్థానంలోను, మామిడి, ఉల్లి, జీడిమామిడిలో మూడోస్థానంలోను నిలిచిందని చెప్పారు. రొయ్యలు, చేపలు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. 14 ఎఫ్‌పీవోలకు గ్యాప్ సర్టిఫికేషన్ క్యూసీఐ సహకారంతో పైలెట్ ప్రాజెక్టు కింద గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్–23లో 33 ఎఫ్‌పీవోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, అర్హత పొందిన 14 ఎఫ్‌పీవోలకు మంత్రి కాకాణి గ్యాప్ సర్టిఫికేషన్ జారీచేశారు. క్యూసీఐ ఇండిగ్యాప్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సేవలందించేందుకు మంత్రి సమక్షంలో ఏపీ ప్రభుత్వం, క్యూసీఐ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. క్యూసీఐ చైర్పర్సన్ జాక్సా షా, సీఈవో డాక్టర్ ఎ.రాజ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవిచౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఉద్యాన, సహకార, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పనిచేయకుండానే డబ్బు కావాలా..?
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్‌స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్చేసి ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్‌చేసి స్టాక్‌లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! -
సినిమాలు తగ్గినా.. ఆదాయంలో మాత్రం తగ్గేదేలే అంటోన్న బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. ఈ ఏడాదిలో భోళాశంకర్, జైలర్ సినిమాలతో అలరించిన 33 ఏళ్ల భామ గ్లామర్‌తో ఇప్పటికీ కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు ఈమె డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా కావాల్సిందే. మొదట బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి) అయితే ఇటీవల ఆమె నటించిన చిత్రాలు ప్లాప్ అయ్యాయేమో గాని.. తమన్నా మాత్రం నటిగా ఎప్పుడు అభిమానుల్ని నిరాశ పరచలేదు. తన అందంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తమన్నా నటించిన తెలుగు చిత్రం భోళా శంకర్ నిరాశ పరిచినా.. తమిళంలో రజనీకాంత్‌తో నటించిన చిత్రం జైలర్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో నువ్వు కావాలయ్యా అనే పాట ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ చిత్రం తర్వాత తమన్నాకు కొత్తగా అవకాశాలు ఏమీ లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం తమిళంలో అరణ్మణై- 4 చిత్రంతో పాటు మలయాళం, హిందీలోనూ చిత్రాలు చేస్తోంది. ఈ మిల్కీ బ్యూటీకి అవకాశాలు తగ్గాయేమో గాని తమన్నా ఆదాయం ఆర్జించడంలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపారంగంలో దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డాన్స్ చేస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తోంది. కాగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఏ ఒక్కటి అయినా మంచి విజయం సాధిస్తే తమన్నాకు మళ్లీ అవకాశాలు రావడం ఖాయం. మరోపక్క ఈమె తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
ఐదేళ్లు ప్రీమియం.. జీవితాంతం ఆదాయం
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ఆవిష్కరింంది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీయేతర), నాన్ పార్టిసిపేటింగ్, మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. ఈ ప్లాన్‌లో నిర్ణీత కాలం తర్వాత నుం ఏటా 10 శాతం చొప్పున (సమ్ అష్యూర్డ్‌లో) వెనక్కి వస్తుంది. కనీస బీమా ర.5,00,000. గరిష్ట బీవ కవరేజీకి పరిమితి లేదు. 5–16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లింపుల కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా 65 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రెగ్యులర్ ఇన్కమ్ లేదా ఫ్లెక్సీ ఇన్కమ్లో ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ చెల్లింపుల కాలంలో మరణింనట్టయితే సమ్ అష్యూర్డ్‌కు తోడు, గ్యారంటీడ్ అడిషన్స్ కలిపి చెల్లిస్తారు. ప్రతి వెయ్యి రపాయలకు ఏటా ర.40 చొప్పున గ్యారంటీడ్ అడిషన్ లభిస్తుంది. ఇలా ప్రీమియం చెల్లింపుల కాలం వరకు ఏటా జమ అవుతుంది. ప్రీమియంను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే గ్యారంటీడ్ అడిషన్స్‌ను దాని కింద సర్దుబాటు చేస్తారు. రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్లో ప్రీమియం చెల్లింపుల కాల వ్యవధి ముగిసిన మూడేళ్లు లేదా ఆరేళ్ల తర్వాత నుం ఏటా 10% ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు 5 ఏళ్లు ఎంపిక చేసుకుంటే 8 ఏళ్లు లేదా 11వ ఏట నుంచి ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. పదేళ్ల ప్రీమియం చెల్లింపుల కాలం ఎంపిక చేసుకుంటే 13వ ఏట నుంచి ఆదాయం వస్తుంది. ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్లోనూ ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
స్థిరమైన ఆదాయం కోసం మార్గాలు - తెలుసుకోవాల్సిందే!
నేను ఒకేసారి రూ.12 లక్షలను మూడు, నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? డెట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి.. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా మంచి రాబడులు అందుకోవచ్చా? – మయూర్ సంపద సృష్టి మూడు నాలుగేళ్లలో సాధ్యపడుతుందా? ఇది ఆందోళన కలిగించే అంశం. మూడు నుంచి నాలుగేళ్లలో సంపద సృష్టి సాధ్యపడదు. ఈక్విటీలు గణనీయమైన రాబడులను అందిస్తాయి. కానీ వాటికి కూడా 10–15 ఏళ్ల కాల వ్యవధి కావాలి. అంత కాలవ్యవధి మీకు లేకపోతే అప్పుడు సంప్రదాయ ఇన్వెస్టర్‌గానే ఆలోచించాలి. మూడు నుంచి నాలుగేళ్లలోనే పెట్టుబడిపై చెప్పుకోతగ్గంత రాబడి కావాలని కోరుకునేట్టు అయితే.. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఎక్కువ మొత్తాన్ని డెట్ సాధానాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధి కోసం అంటున్నారు కనుక 12–18 నెలల కాలం పాటు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకుంటే మొత్తం పెట్టుబడుల్లో సగం కాల వ్యవధి అవుతుంది. దీనికి బదులు మూడు నుంచి నాలుగు నెలల్లోగా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ద్వారా ఈక్విటీలకు కేటాయించుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని ఉండాలి. అప్పుడే ఆ మొత్తం నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసర సమయాల్లో పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకునే విధంగా లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. సీనియర్ సిటిజన్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కు వ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకా అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలను పరిశీలించాలి. ఎస్సీఎస్ఎస్, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కొంత మొత్తాన్ని అధిక నాణ్య తతో కూడిన డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40% మేర ఉండేలా ఏడాదికోసారి అస్సెట్ (పెట్టుబడులు)రీబ్యాలన్స్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
4 నెలల్లో నాలుగో వంతు రాబడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నాలుగు నెలల్లో నాలుగో వంతు రాబడులు వచ్చాయి. ఈ ఏడాదికి మొత్తం రూ.2.58 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించగా జూలై నెల ముగిసే నాటికి రూ.67,494.73 కోట్ల మేర ఖజానాకు ఆదాయం సమకూరిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇది 26 శాతం అన్నమాట. ఇందులో పన్నుల వాటా కింద రూ.42,712.27 కోట్లు వచ్చింది. ఆ తర్వాత అప్పుల పద్దు కింద కూడా ఎక్కువ సమకూరింది. ఈ ఏడాది బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రూ.38,234 కోట్లు సేకరించాలన్నది అంచనా కాగా, అందులో దాదాపు 54 శాతం ఇప్పటికే సమకూరింది. 2023 జూలై నాటికి రూ.20,637.23 కోట్లు అప్పుల ద్వారా సేకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడించింది. మొత్తం రాబడుల్లో అప్పులే 30 శాతం ఉండడం గమనార్హం. ఇక పన్నుల ఆదాయంలో ఎక్కువగా జీఎస్టీ నుంచి రూ.15 వేల కోట్లకు పైగా వచ్చింది. మొత్తం అంచనాల్లో ఇది కూడా 30 శాతం దాటింది. ఎక్సైజ్ రాబడులు కూడా 30 శాతం దాటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నుల్లో వాటా కలిపి రూ.6,300 కోట్లకు పైగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై నాటికి రాబడులు 3 శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. -
ఆర్టీసీ బస్సులకు భారీ గి‘రాఖీ’
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాఖీ పౌర్ణమి ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. బస్సులు కిటకిటలాడగా, ఖజానా కళకళలాడింది. డీజిల్ సెస్‌ను భారీగా పెంచిన తర్వాత గతేడాది రాఖీ పండుగ రోజు రికార్డు స్థాయిలో రూ.21.66 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ రాబడి రావాలంటూ ఆర్టీసీ ఎండీ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. దీంతో ఈసారి రాఖీ పండగరోజు రూ.22.65 కోట్ల ఆదాయం సాధించి పాత రికార్డును అధిగమించింది. పండగ రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 40.922 లక్షల మంది ప్రయాణించారు. గత రాఖీ పండుగ రోజుతో పోలిస్తే లక్ష మంది ప్రయాణికులు అధికం కావటం విశేషం. ఆర్టీసీ బస్సుల్లో ఒకేరోజు ఇంత మంది ప్రయాణించటం కూడా రికార్డేనని అధికారులు పేర్కొంటున్నారు. గురువారం ఆర్టీసీ బస్సులు 36.77 లక్షల కి.మీ. తిరిగాయి. ఇది కూడా గతేడాది కంటే( 35.54 లక్షల కి.మీ.) ఎక్కువే. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 86.41 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిదిలో 104.68 శాతం నమోదైంది. నార్కట్‌పల్లి మినహా మిగతా 6 డిపోలు 100 శాతానికిపైగా సాధించాయి. ఉమ్మడి వరంగల్‌లో 97.05, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికిపైగా ఓఆర్ నమోదైంది. హుజూరాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్‌నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. కి.మీ.కు సగటున రూ.56.18 ఆదాయం రాగా, గరిష్టంగా వరంగల్–1 డిపో రూ.65.94, భూపాలపల్లి డిపో రూ.65.64 చొప్పున సాధించి రికార్డు సృష్టించాయి. సిబ్బంది సమష్టి కృషి వల్లే...: ‘‘ఇంత భారీ ఆదాయం వచ్చేందుకు సిబ్బంది సమష్టి కృషే కారణం, ప్రజలు పండుగలో నిమగ్నమై ఉంటే ఆర్టీసీ సిబ్బంది రోడ్ల మీద ఉండి అహరహం శ్రమించారు. వారందరికీ అభినందనలు’అని ఆర్టీ సీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?
గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు కీలక మార్పులకు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందరూ ఊహించినట్టుగా ఈ టేకోవర్ ఫెయిల్ కావచ్చు కానీ సాధ్యమైనంతవరకు సక్సెస్‌ను ప్రయత్నిస్తున్నామనడం చర్చకు దారి తీసింది. అలాగే ఎక్కువగా సంపాదించాలనుకునే జర్నలిస్టులకు ఎక్స్‌లో ఆఫర్ అంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఎవరైతే స్వేచ్ఛగా ఆర్టికల్స్ రాయాలనుకుంటారో ఆ జర్నలిస్టులు డైరెక్ట్ ఎక్స్‌లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది ఇప్పటికే ఇది 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ( అంతేకాదు ఆయా ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మరింత చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌లో షేర్ అయిన వార్తల ముఖ్యాంశాలను తొలగించాలని యోచిస్తున్నాడు.తద్వారా ట్వీట్ పరిణామాన్ని తగ్గించి, యూజర్ టైమ్‌లైన్‌లో మరిన్ని ట్వీట్లు సరిపోయేలా చేయడానికే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. యూజర్ స్క్రీన్‌పై ట్వీట్ ఆక్రమించే నిలువు స్థలాన్నితగ్గించడమే ఈ మార్పు వెనుకకారణమని ఫార్చ్యూన్ నివేదించింది.దీనితో పాటు క్లిక్‌బైట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మస్క్ భావిస్తున్నాడట. If you’re a journalist who wants more freedom to write and a higher income, then publish directly on this platform! — Elon Musk (@elonmusk) August 21, 2023 ఎక్స్ (ట్విటర్) టేకోవర్ విఫలం కావచ్చు: మస్క్ ముఖ్యంగా గా బిలియన్ల డాలర్ల ట్విటర్ టేకోవర్ "విఫలం కావచ్చు" అని అంగీకరించడం మరో సంచలన వార్తగా మారింది. ట్విటర్ "బ్లాక్" ఫీచర్‌ను తొలగించే నిర్ణయంపై తాజా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్ననేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత నెలలో మార్క్ జుకర్‌బర్గ్ మెటా ప్రారంభించిన టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌కు పోటీ వెబ్ వెర్షన్‌ను రూపొందించడానికి సిద్ధమైనప్పటికీ ఎక్స్ అనిశ్చిత భవిష్యత్తుపై మస్క్ ఇలా పేర్కొన్నాడు. "చాలామంది ఊహించినట్లుగా తాము విఫలం కావచ్చు, కానీ కనీసం ఒకరిగాఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తాము." అన్నాడు. అలాగే ఆదివారం నాటి పోస్ట్‌లో ."విచారకరమైన నిజం ఏమిటంటే, ప్రస్తుతం గొప్ప "సోషల్ నెట్‌వర్క్‌లు" లేవు అందుకే అలాంటి నొకదానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. The sad truth is that there are no great “social networks” right now. We may fail, as so many have predicted, but we will try our best to make there be at least one. — Elon Musk (@elonmusk) August 19, 2023 hey @elonmusk + @lindayaX … please rethink removing the block feature. as an anti-bullying activist (and target of harassment) i can assure you it’s a critical tool to keep people safe online. - that woman — Monica Lewinsky (she/her) (@MonicaLewinsky) August 19, 2023 కాగా ఇప్పటికే బ్లూటిక్ పేరుతో యూజర్లనుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. అలాగే ఇటివలి కాలంలో పరిచయం చేసిన యాడ్ రెవెన్యూ షేర్ ఫీచర్ కింద వెరిఫైడ్ యూజర్లు మానిటైజేషన్ రూల్స్ ప్రకారం డబ్బు సంపాదించుకునే అవకాశం అందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో స్వేచ్ఛగా రాయాలనుకునే జర్నలిస్టులకు డబ్బులు ఆర్జించే అవకాశాన్ని కల్పించడం విశేషం.అయితే దీనిపై పబ్లిషర్స్నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పాతికేళ్ల లోపే రూ.50 లక్షలకు భారతీయుల సగటు ఆదాయం
భారతదేశంలో మధ్య ఆదాయ వర్గం ఎదుగుదలపై 77వ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా విభాగం ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఎంతో ఆశావహంగా ఉంది. ఆర్థిక సంవత్సరాలు 2011, 2022 మధ్య పదేళ్ల కాలంలో దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్స్ ఆధారంగా దేశంలోని మధ్య తరగతి ఆదాయాలు పెరిగిన తీరును ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది. ఈ నివేదికలోని గణాంకాల ప్రకారం ఆర్థిక సంవత్సరాలు 2013, 2022 మధ్య కాలంలో మధ్య తరగతి భారతీయుల సగటు ఆదాయం మూడు రెట్లు పెరిగింది. అంటే వారి ఆదాయం ఈ 11 సంవత్సరాల్లో రూ.4.4 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెరిగింది. 21వ శతాబ్దం మొదటి దశాబ్దం తర్వాత భారతీయుల ఆదాయం పెరగడం గణనీయ పరిణామం. గడచిన పది సంవత్సరాల్లో దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నత ఆదాయ వర్గం స్థాయికి ఎలా ఎదిగినదీ ‘కొత్త మధ్య తరగతి ఎదుగుదల’ అనే శీర్షికతో వచ్చిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వివరించారు. అలాగే ఇదే కాలంలో అసలు ప్రభుత్వానికి పన్నే చెల్లించాల్సిన అవసరం లేని విధంగా దాఖలు చేసే ఆదాయపన్ను రిటర్న్స్ సంఖ్య ఎలా పూర్తిగా మాయమైనదీ ఈ నివేదికలో పొందుపరిచారు. పట్టుదలతో లక్ష్య సాధనే భారతీయుల ప్రత్యేకత! 2047 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు ఇండియా పూర్తిగా అభివృద్ధిచెందిన దేశంగా అవతరిస్తుందన్న ఆకాంక్షను ప్రధానమంత్రి తన ఆగస్ట్ 15 ప్రసంగంలో ఢిల్లీ ఎర్రకోటపై వ్యక్తంచేశారు. మరో 24 ఏళ్లలో ‘వికసిత్ భారత్’ను చూస్తామన్న ప్రధాని కోర్కె 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులందరి మనసుల్లో ఉందంటే అతిశయోక్తి లేదు. ఆర్థిక సంవత్సరం 2047 నాటికి ఇండియాలో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య 85.3 శాతం పెరిగి 48 కోట్ల 20 లక్షలకు చేరుకుంటుందని కూడా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ లెక్కన భారత్ ఒక మోస్తరు సంపన్నదేశంగా అవతరిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2023లో రూ 2 లక్షలు ఉందని భావిస్తున్న భారత ప్రజల తలసరి ఆదాయం 2047 నాటికి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని అంచనా. అలాగే, మధ్య తరగతి భారతీయుల ప్రస్తుత సగటు ఆదాయం రూ.2 లక్షలు 24 ఏళ్ల తర్వాత 49.7 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ పరిశోధనా బృందం అంచనా వేసింది. ఈ సంఖ్యా వివరాలు లేదా అంచనాలన్నీ భారీగా, అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి. పెరుగుతున్న భారత జనసంఖ్య, ముఖ్యంగా పనిచేసే వయసులో ఉండే యువత జనాభా ఎక్కువ ఉన్న కారణంగా పై అంచనాలను నిజం చేయడం అసలు కష్టమే కాదు. మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఎదగాలనే ఆకాంక్ష, సంపన్న దేశాల సరసన నిలబడాలనే బలమైన కోర్కె ఫలితంగా దేశాభివృద్ధితోపాటు జనం ఆదాయాలు పై స్థాయిలో పెరగడం కష్టమేమీ కాదు. 1947లోనే స్వాతంత్య్రం సంపాదించిన మన సోదర దేశం పాకిస్తాన్ తో పాటు, ఇతర దక్షిణాసియా, ఆసియా దేశాల పరిస్థితులతో పోల్చితే భారతదేశంలో అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. దేశంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సుస్థిరత, చట్ట ప్రకారం సాగే పరిపాలన వంటి అంశాలు వచ్చే పాతికేళ్లలో ఇండియాను సంపన్న దేశాల జాబితాలో చేర్చుతాయనడంలో సందేహం లేదు. అనేక ఆటుపోట్లు, అననుకూల సంకేతాలు, పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమకాలీన ప్రపంచంలో భారతదేశం ఏకైక ఆశాజనక ప్రాంతమని అంతర్జాతీయ నిపుణులు, ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. నిజానికి దేశవ్యాప్తంగా పెరిగిన ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2015–2020 మధ్య 3.81 కోట్లుండగా... 2020–23 మధ్య మాత్రం 1 కోటి మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, తక్కువ ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయాల కేటగిరీల్లోకి వెళుతున్నారని... ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లిస్తుండటంతో ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతోందని సంస్థ తెలియజేసింది. ఫలితంగా 2023లో ఐటీ రిటర్నుల దాఖల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆదాయం.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక మేరకు... 2014లో దేశంలో మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం రూ.4.4 లక్షలు. 2023 నాటికి అది రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గడిచిన పదేళ్లలో రూ.5 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.10 లక్షల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించే వారు ఏకంగా 8.1 శాతం పెరిగారు. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. ఇక రూ.20 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి చేరింది 1.5 శాతం. రూ.50 లక్షల కేటగిరీ నుంచి రూ.1 కోటి కేటగిరీకి 0.2 శాతం మంది, రూ.1 కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుదల ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. దేశ జనాభా 2023లో 140 కోట్లుండగా 2047 నాటికి ఇది 161 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 53 కోట్లు. 2047 నాటికి 72.5 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే.. మొత్తం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక వెల్లడించింది. 2023లో ఐటీ పరిధిలోకి 31.3 కోట్ల మంది ఉద్యోగులు రాగా 2047 నాటికి 56.5 కోట్లకు ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లలో ఉద్యోగుల వాటా ప్రస్తుతం 59.1 శాతం ఉండగా 2047 నాటికి ఇది 78 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. -
ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా?
ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? – కృతిక మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్‌డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్‌డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం) ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్పెన్స్ రేషియో భారం ఇన్వెస్టర్పైనే పడుతుంది. ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్‌వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లను నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎస్‌డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు!
న్యూఢిల్లీ: ప్రకటనల ఆదాయంలో వాటాల కింద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విటర్) నుంచి వ్యక్తులకు వచ్చే ఆదాయం కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్ క్రియేషన్‌ను సర్వీసు కింద పరిగణిస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ట్యాక్స్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో అద్దె ఆదాయం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీసులు వంటి వివిధ సర్వీసుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ. 20 లక్షలు దాటిన పక్షంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎక్స్ ఇటీవల ప్రకటనలపై తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కి కూడా అందించడం ప్రారంభించింది. ఇందుకోసం సదరు సబ్‌స్క్రయిబర్స్ పోస్టులకు గత మూడు నెలల్లో 1.5 కోట్ల ఇంప్రెషన్లు, కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. ఎక్స్ నుంచి తమకు ఆదాయం వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈమధ్య పోస్ట్ చేశారు. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్‌లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్‌ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క
గత ఏడాది అంటే 2022 నాటికి దక్షిణాఫ్రికా జనాభా పెరిగింది. మొత్తం జనాభా 60.6 మిలియన్లకు చేరింది. వీరిలో ఎక్కువ మంది (సుమారు 49.1 మిలియన్లు) నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారు. భారతీయ లేదా ఆసియా నేపథ్యం కలిగిన వ్యక్తులు అతి చిన్న జనాభా సముదాయంగా ఏర్పడ్డారు. వీరి జనాభా సుమారు 1.56 మిలియన్లుగా ఉంది. దక్షిణాఫ్రికా సరిహద్దు ప్రాంతాలలో దాదాపు 59.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఆరు దేశాలలో ఒకటిగా నిలిచింది. అతిపెద్ద జనావాస ప్రావిన్సుల విషయానికొస్తే గౌటెంగ్ ( రాజధాని నగరం జోహన్నెస్‌బర్గ్), క్వాజులు-నాటల్ (రాజధాని నగరం పీటర్‌మారిట్జ్‌బర్గ్) ఉన్నాయి. ఇక్కడి జనాభా వరుసగా దాదాపు 15.9 మిలియన్లు, 11.7 మిలియన్లుగా ఉంది. కేప్ టౌన్, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ అతిపెద్ద కమ్యూనిటీలను కలిగిన నగరాలుగా నిలిచాయి. గృహాల సంఖ్యలో పెరుగుదల 2001- 2022 మధ్య కాలంలో దేశంలో మొత్తం గృహాల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ కాలంలో దక్షిణాఫ్రికా దాదాపు 60 శాతం గృహాల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో (30.7 శాతం) కంటే పట్టణ ప్రాంతాలలో (38.2 శాతం) ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 20.5 శాతంగా ఉన్నాయి. 2021లో కుటుంబాల సంఖ్య దాదాపు 17.9 మిలియన్లకు చేరుకుంది. దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలలో అత్యధికులు అధికారిక గృహాలలో నివసిస్తున్నారు. 2018 నాటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాష ఇసిజులు(isiZulu). తరువాతి స్థానంలో ఇసిక్సోసా (isiXhosa), అనంతరం ఇంగ్లీషు వస్తాయి. అత్యధిక ఆదాయ అసమాన దేశం ఆఫ్రికన్ దేశాలు ఆదాయ పంపిణీకి సంబంధించి గణనీయమైన అసమానతలను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఆదాయ అసమానత ఇండెక్స్‌లో 63 శాతంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ సూచికలో మెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత అసమానత నెలకొంది. దేశంలో నెలవారీ జాతీయ ఆహార దారిద్య్ర రేఖ 663 దక్షిణాఫ్రికా రాండ్లు కావడం గమనార్హం. 2019లో దక్షిణాఫ్రికాలోని అత్యధిక కుటుంబాలు జీతాలు లేదా గ్రాంట్లను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి. దాదాపు 10.7 మిలియన్ల ప్రజలు వేతనాల ద్వారానే ఆదాయాన్ని పొందుతున్నారు. 7.9 మిలియన్ల కుటుంబాలు ప్రభుత్వం చెల్లించే సామాజిక గ్రాంట్లను అందుకుంటున్నాయి. 2022లో ఆఫ్రికన్ ఖండంలో సగటు ఆయుర్దాయం మహిళలకు 64 సంవత్సరాలు. పురుషులకు 61 సంవత్సరాలు. దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే అధికం. 2021 నాటికి, దక్షిణాఫ్రికాలో సంతానోత్పత్తి రేటు 2.37. ఇది 2019 నుండి తగ్గుతోంది. శిశు మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణకు సూచిక. దేశంలో మరణాలకు ప్రధాన కారణం క్షయవ్యాధి, తరువాత మధుమేహంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (కాంపెన్సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరినట్లు అధికారులు వెల్లడించారు. జూన్ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే.. తగ్గిన మద్యం అమ్మకాలు. ► 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు. ►2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు. ►2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా..ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పెరిగిన రిజస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. రీసర్వే పూర్తిచేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం అయ్యాయని, దాదాపు 5వేల రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–19లో ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని తెలిపారు. కార్యకలాపాలను నిర్వహించిన 2724 మైనింగ్ లీజుల్లో 1555 చోట్ల తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ ఏపీఎండీసీ ఆర్థిక పనితీరు మెరుగుపడిందన్న అధికారులు. 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం పెరగిందన్నారు అధికారులు. 2023–24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేశారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి ఏపీఎండీసీ భారీగా ఆదాయం తెచ్చుకుంటోందని, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. గణనీయంగా ఆదాయల పెంపు: సీఎం జగన్ గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని అన్నారు సీఎ జగన్. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో ఆదాయాలపరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతోపాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని తెలిపారు. రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని, అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు. కలెక్టర్లతో భాగస్వామ్యం కావాలి: సీఎం జగన్ వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని సీఎం జగన్ సూచించారు. ఇవి కొనుగోలు దారులకు ఎంకరేజ్ చేసేలా ఉండాలని తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలని, ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ఆర్ధికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో నిరంతరం మాట్లాడాలన్నారు. దీనివల్ల ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం అవుతాయని, ఎక్కడా లీకేజీలు లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని సీఎ జగన్ తెలిపారు. ఇదీ చదవండి: విద్యుత్ పొదుపునకు కేరాఫ్ జగనన్న ఇళ్లు -
రిస్క్ ఎక్కువే.. మంచి రాబడులు మాత్రం పక్కా..
దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తూ, ఓపిక పట్టే ఇన్వెస్టర్లకు స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గణనీయమైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకాలు గడిచిన పదేళ్ల కాలంలో ఏటా 21 శాతం కాంపౌండ్ వార్షిక రాబడిని అందించాయి. మిడ్‌క్యాప్ (19 శాతం), లార్జ్ క్యాప్ (14 శాతం) పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించాయి. అయితే స్మాల్‌క్యాప్ పథకాలు అందరికీ అనుకూలం అని చెప్పలేం. కేవలం అధిక రిస్క్ తీసుకునే వారు, కనీసం పదేళ్ల పాటు అయినా తమ పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఉన్న వారే వీటిని పరిశీలించొచ్చు. ఈ విభాగంలో గొప్ప రాబడుల చరిత్ర ఉన్న కొద్ది పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి కావడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలను కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. తద్వారా ఫండ్‌లో అంతర్లీనంగా రిస్క్ తగ్గించే వ్యూహం ఉంది. ముఖ్యంగా టాప్ 250కి పైన ఉన్న (స్మాల్‌క్యాప్) వాటిల్లోంచి భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాలానుగుణంగా ఒక్కో సైకిల్లో ఒక్కో రంగానికి చెందిన కంపెనీలు బుల్ ర్యాలీ చేస్తుంటాయి. అలాంటి అవకాశాలను కూడా ఈ పథకం ముందే గుర్తించి అధిక కేటాయింపులు చేస్తుంటుంది. ఈ పథకానికి 2017 నుంచి సమీర్ రాచ్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. తేజాస్ షేత్ అనే మరొక ఫండ్ మేనేజర్ కూడా ఈ బాధ్యతలను పంచుకుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు స్థూల ఆర్థికపరమైన మార్పులకు సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకని స్వల్పకాలంలో వీటిల్లో ఎక్కువ అస్థిరతలు కనిపిస్తాయి. కానీ ఓ కంపెనీని వృద్ధి దశ ఆరంభంలోనే గుర్తించి పెట్టుబడులు పెట్టి, వాటిని కొన్నేళ్లపాటు నిలకడగా కొనసాగించడం ద్వారా మెరుగైన రాబడికి వీలుంటుందని చెప్పడానికి ఈ పథకం పనితీరు నిదర్శనం. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.31,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం 2010 సెప్టెంబర్ 16న మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 20 శాతానికి పైనే ఇన్వెస్టర్లకు రాబడులను అందిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 37 శాతం ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. మూడేళ్ల కాలంలోనూ వార్షిక రాబడి 46 శాతంగా ఉంది. ఐదేళ్లలో 21.72 శాతం, ఏడేళ్లలోనూ ఇంతే మేర, పదేళ్ల కాలంలో ఏటా 28.21 శాతం చొప్పున రాబడి అందించింది. అంటే ఏ కాలంలో చూసుకున్నా వార్షిక రాబడుల రేటు 20 శాతానికి పైనే ఉండడం విస్మరించకూడని విషయం. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.80 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ విభాగంలోని కంపెనీలకు 17 శాతం మేర, మిడ్‌సైజు కంపెనీలకు 38 శాతం వరకు కేటాయింపులు చేయగా, 44.81 శాతం పెట్టుబడులను స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 179 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 17.14 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 13.44 శాతం చొప్పును కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కెమికల్ కంపెనీల్లో 8.7 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.48 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 6.44 శాతం, ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. -
నాకు ప్రతి నెలా ఇన్కమ్ కావాలి.. ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది?
నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ్ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.24.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు (అస్సెట్ రీబ్యాలన్స్) చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? – రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విష యానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. -
ఎన్పీఎస్ నుంచి నెలవారీ ఆదాయం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద క్రమం తప్పకుండా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తీసుకురానున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. దీంతో 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ ఖాతాదారులు అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి కావాల్సినంతే ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదన పురోగతి దశలో ఉంది. దాదాపు వచ్చే త్రైమాసికం చివరి నాటికి ఈ పథకంతో ముందుకు వస్తాం’’అని మహంతి చెప్పారు. ప్రస్తుతం ఎన్పీఎస్ పథకంలో 60 ఏళ్లు నిండిన వారు అప్పటి వరకు సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అంతేకానీ, నెలవారీ ఇంత చొప్పున తీసుకునే అవకాశం లేదు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ను అమల్లోకి తీసుకొస్తే అప్పుడు పింఛనుదారులు నెలవారీ లేదా మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికొకసారి.. వీటిల్లో తమకు అనువైన ఆప్షన్ ఎంపిక చేసుకుని, క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు. ఇలా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకోవడానికి పీఎఫ్ఆర్డీఏ అవకాశం కల్పించనుంది. ‘‘నా నిధిపై మంచి రాబడులు వస్తున్నప్పుడు ఆ మొత్తాన్ని ఎందుకు కొనసాగించకూడదు. ఎందుకు యాన్యుటీ తీసుకోవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి’’అని మహంతి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, యాన్యుటీని వాయిదా వేసుకోవచ్చని, దీనివల్ల తర్వాత అధిక మొత్తంలో పింఛను వస్తుందని చెప్పారు. తాము తీసుకురాబోయే మార్పుతో, చందాదారులు 40 శాతం నిధితో డిఫర్డ్ యాన్యుటీని ఎంపిక చేసుకుని, మిగిలిన 60 శాతం ఫండ్‌ను క్రమం తప్పకుండా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. -
మాల్స్ అద్దె ఆదాయంలో వృద్ధి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు అధికంగా అద్దె ఆదాయం పొందొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయం, మాల్స్‌కు విచ్చేసే కస్టమర్ల సంఖ్యలో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ మాల్స్ అద్దె ఆదాయం కరోనా ముందు నాటితో పోలిస్తే 27 శాతం పెరగడం గమనార్హం. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి కనిపిస్తోందని, ఫలితంగా నికర నిర్వహణ ఆదాయం పెరుగుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. ‘‘అద్దె ఆదాయం 2022–23లో 78 శాతం అధికంగా వచ్చింది. కరోనా ముందు నాటితో పోల్చి చూసినా 25–27 శాతం అధికంగా వచ్చింది. రిటైల్ వాణిజ్యం అధికంగా జరగడం, కస్టమర్ల రాక పెరగడం తోడ్పడింది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమారెడ్డి తెలిపారు. మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి పూర్వం ఉన్న స్థాయిలో 95 శాతానికి చేరుకుందని ఇక్రా నివేదిక తెలిపింది ట్రేడింగ్ విలువ 125–127 శాతానికి పుంజుకుంది. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని అనుపమా రెడ్డి తెలిపారు. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొనసాగుతుందని, ఫలితంగా మెరుగైన ఆదాయం ఆపరేటర్లకు వస్తుందన్నారు. అద్దెల పెంపు 3–4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్దెల పెంపు 3–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా తెలిపింది. రిటైల్ మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య అధికంగా ఉండడడంతో అధిక రేట్లపై రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4–5 శాతం అధికంగా నమోదు కావచ్చని ఇక్రా పేర్కొంది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8–10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ రంగానికి ఇక్రా స్థిరమైన అవుట్‌లుక్ ఇచ్చింది. ఆరు మెట్రోల్లో 7 మిలియన్ చదరపు అడుగులు గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా సరఫరా అయినట్టు పేర్కొంది. దీంతో మాల్స్‌లో ఖాళీల రేటు 2022–23లో 19 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాళీల రేటు 18–19 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా 9–10 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా వచ్చే మాల్స్‌లో 60 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై నుంచే ఉంటాయని వివరించింది. -
‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్!
తాజ్‌మహల్ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. ఆ అద్భుత నిర్మాణాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేవారి నుంచి ప్రభుత్వానికి ప్రతీయేటా ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విదేశీయులు ఎవరైనా భారతదేశానికి వస్తే ముందుగా వారు చూడాలనుకునేది తాజ్‌మహల్. ఇక మనదేశంలోని ప్రతీఒక్కరూ తాజ్‌మహల్ చూడాలని తప్పనిసరిగా అనుకుంటారు. తాజ్‌మహల్‌కు ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణం దాని నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజ్‌మహల్ అనునిత్యం పర్యాటకులతో కిటకిటలాడిపోతుంటుంది. మరి అటువంటప్పుడు తాజ్ మహల్ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది. అలాగే ప్రతీయేటా తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు అమ్ముడవుతాయనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందువరుసలో... దేశంలోని అత్యంత పురాతన అందమైన కట్టడాలలో తాజ్‌మహల్ ముందువరుసలో ఉంటుంది. తాజ్‌మహల్‌కు ఎంతటి ఆదరణ ఉన్నదంటే.. కరోనా కాలంలో అన్నీ స్థంభించిపోయినప్పుడు కూడా.. ఆ రెండు సంవత్సరాల్లో తాజ్‌మహల్ సందర్శించేందుకు పర్యాటకులు వచ్చారు. అటువంటి విపత్కర సమయంలోనూ తాజ్ మహల్ సందర్శన టిక్కెట్లు విక్రయమయ్యాయి. ఇది కూడా చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు సందర్శకుల సంఖ్య ఎంతంటే.. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తాజ్‌మహల్ సందర్శనకు ప్రతీయేటా సుమారు 80 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 80 వేలమంది విదేశీయులు ఉంటారు. తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి స్థానికులకు (భారత్) రూ. 50, విదేశీయులకు రూ.1100 టిక్కెట్ రూపంలో వసూలు చేస్తారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో అంటే మూడేళ్ల వ్యవధిలో రూ.152 కోట్ల ఆదాయం తాజ్‌మహల్ నుంచి ప్రభుత్వానికి సమకూరింది. ఇది చారిత్రాత్మక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40 శాతం. దేశంలోని పర్యాటకుల కారణంగా తాజ్‌మహల్‌కు టిక్కెట్ల రూపంలో ప్రతీయేటా రూ. 40 కోట్లు, విదేశీయులకు విక్రయించే టిక్కెట్ల కారణంగా రూ.110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. తరువాతి స్థానంలో ఆగ్రాకోట పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయపరంగా చూస్తే తాజ్‌మహల్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. 2021-2022లో తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్ల విక్రయాల కారణంగా సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట నుంచి కూడా అత్యధిక ఆదాయం వస్తుంటుంది. దేశంలోని మొత్తం పర్యాటక ప్రాంతాల నుంచి ప్రతీయేటా వచ్చే ఆదాయంలో.. తాజ్‌మహల్, ఆగ్రాకోటల సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం 53 శాతం మేరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా.. -
వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక..
ప్రభుత్వరంగ ఉద్యోగులను మినహాయిస్తే మిగిలిన వారికి పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి. ఉద్యోగం లేదా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడే, దాన్ని విరమించే రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. విశ్రాంత జీవనాన్ని హాయిగా గడిపేందుకు తగినంత నిధిని సమకూర్చుకోవడమే కాదు, ఆ నిధిపై రాబడికీ అనుకూలమైన వ్యూహం ఉండాలి. మనలో చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ, ఆలస్యంగా దీని అవసరం తెలిసి వస్తుంది. అప్పుడు మేల్కొన్నా, సంపాదనకు ఎక్కువ కాలం మిగిలి ఉండకపోవచ్చు. కనుక ఆరంభంలోనే దృష్టి పెట్టాల్సిన దీన్ని.. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో వాయిదా వేసుకోవద్దు. తగిన ప్రణాళికతోనే రిటైర్మెంట్ లక్ష్యాన్ని అధిగమించగలమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులూ అవసరమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి కంటే, రేపటి రోజు మరింత మొత్తం జీవనానికి ఖర్చు అవుతుంది. కనుక మన నిధి మరింత ఆదాయన్నిచ్చే విధంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మీ వద్దనున్న నిధి నుంచి ఏటా 5% చొప్పున వెనక్కి తీసుకుంటున్నారనుకోండి. వచ్చే ఏడాది కూడా అదే 5% సరిపోవచ్చు. కానీ ఐదు, పదేళ్ల తర్వాత అంతే మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే పదేళ్ల కాలంలో పెట్టుబడి దాని విలువను కోల్పోతుంది. కనుక ఇక్కడ నుంచి మరో ఐదు పదేళ్ల తర్వాత అవసరాలకు మరింత మొత్తం కావాలి. మీరు మీ ఫండ్ మొత్తాన్ని స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అది పెరిగే అవసరాలకు, కరిగిపోయే కరెన్సీ విలువకు తగినంత మద్దతుగా నిలవదు. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని అనుకుంటుంటారు. కానీ, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను భరించేంత ఆదాయానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మినహా మరో మార్గం లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ రిస్క్ తీసుకోవడం ఎందుకని కొందరు అనుకోవచ్చు. అస్థిరతలు/ఆటుపోట్లు అన్నవి రిస్క్ కాదు. ఈక్వి టీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది రిస్క్ అనుకుంటే.. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఏమ ని అనుకోవాలి. ప్రమాదకరమైన విద్యుత్‌ను వాడుకుంటూ మనం జీవించడం లేదా..? అలాగే, ఈక్విటీలను మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, నిర్ణీతకాలం లోపు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడులను వైవి ధ్యం చేసుకోవాలి. నిర్ణీత కాలానికి ఒకసారి చొప్పున రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు) చేసుకుంటూ వెళ్లాలి. ఎంత నిధి కావాలి? రిటైర్మెంట్కు కావాల్సినంత నిధి నా దగ్గర ఉందా..? ఎవరికివారు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒక్కటే నిధి ఇక్కడ పనిచేయకపోవచ్చు. మీ అవసరాలు, వ్యయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్ కోసం మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వాస్తవిక అంచనాలు వేసుకోవాలి. మీ నెలవారీ వ్యయాలు ఎంత? 12 నెలలకు ఎంత మొత్తం కావాలో లెక్కించాలి. అంత మేర ఏటా ఆదాయం తెచ్చి పెట్టేంత నిధి మీకు రిటైర్మెంట్ తర్వాత అవసరం అవుతుంది. ఇతరత్రా వేరే ఆదాయ వనరులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం సన్నద్ధం అయ్యేందుకు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం కీలకం అవుతుంది. తాము ఎంత కాలం పాటు జీవిస్తామనే విషయం ఎవరికీ తెలియదు. కనుక చిరాయువుగా జీవించేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా రాబడులకు మించి జీవించకూడదు. అందుకే ప్రణాళిక అవసరం. మీ అవసరాలకు మించి పెట్టుబడి నిధి కరిగిపోకుండా ఇది మార్గం చూపుతుంది. ప్రస్తుత విలువల ప్రకారం వార్షిక ఖర్చులకు 20 నుంచి 25 రెట్ల సరిపడా నిధిని సమకూర్చుకుంటే అది మీ అవసరాలను తీరుస్తుంది. ఇది అంత సౌకర్యవంతమైన నిధి కాకపోయినా, మీ అవసరాలను తీరుస్తుంది. మీ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని వృద్ధి చేసే ప్రణాళిక వేరు. మీ ఆదాయం, వెసులుబాటు ఆధారంగా చాలా శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవాలి. మధ్యలో అత్యవసరం ఏర్పడినా గట్టెక్కే నిధి వేరుగా ఉండాలి. అస్సెట్ అలోకేషన్ అస్సెట్ అలోకేషన్ అనేది మీ సౌకర్యం కోసం అనుసరించే విధానం. మార్కెట్లు పడిపోయినప్పుడు దీనివల్ల సౌకర్యంగా ఉండొచ్చు. స్వభావ రీత్యా ఈక్విటీల పట్ల రక్షణాత్మకంగా లేదా దూకుడుగా ఉన్నా కానీ.. ఆరంభంలో రక్షణాత్మకంగానే కేటాయింపులు చేసుకోవాలి. ఎంత ధైర్యవంతులైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం సహజం. కనుక మొదటిసారి ఇన్వెస్టర్ అయినా, రక్షణ ధోరణితో కూడిన ఇన్వెస్టర్ అయినా ఈక్విటీలకు కేటాయింపులు 25 శాతం లేదా 33 శాతంగానే ఉండాలి. దీన్ని పేపర్‌పై రాసుకోవాలి. మొదటి కొన్నేళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాలి. ఏడాదికోసారి ఈ కేటాయింపులను సమీక్షించుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీలకు 33 శాతం కేటాయింపులు చేయాలన్నది మీ ప్రణాళిక. ఏడాది కాలంలో మార్కెట్ ర్యాలీతో మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 50 శాతానికి చేరిందని అనుకుందాం. అప్పుడు 33 శాతానికి దిగొచ్చే విధంగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాలి. మిగిలిన మొత్తాన్ని డెట్‌కు మళ్లించుకోవాలి. ఇలా కొంత కాలం చేసిన తర్వాత ఈక్విటీల పట్ల అవగాహన, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా అస్సెట్ అలోకేషన్‌ను సవరించుకోవచ్చు. రిటైర్మెంట్ ఫండ్‌పై 3.5–4 శాతం రాబడి వచ్చినా సరిపోతుందని అనుకుంటే అప్పుడు మీ దగ్గర మెరుగైన ఫండ్ ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి వెసులుబాటు ఉన్న వారు రిటైర్మెంట్ ఫండ్‌ను ఈక్విటీ, డెట్‌కు సమానంగా కేటాయించుకోవచ్చు. లేదా ఈక్విటీకి 40 శాతం, డెట్‌కు 60 శాతం కేటాయించుకోవచ్చు. 5–20 శాతాన్ని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్నకు కేటాయింపులు చేసుకోవాలి. ఇక తమపై ఆధారపడిన వారు లేకపోతే.. అప్పుడు 25 లేదా 33 శాతాన్ని డెట్‌కు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ర్యీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. కార్యాచరణ ప్రణాళిక.. రిటైర్మెంట్ నాటికి రుణ భారం నుంచి పూర్తిగా బయటకు రావాలి. అన్ని పెట్టుబడులకూ ఒక్కటే బ్యాంక్ ఖాతా వినియోగించాలి. పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఏ విభాగానికి ఎంత మేర ఉండాలో నిర్ణయించుకోవాలి. ఈక్విటీలకు 50 శాతమా లేక 40 లేదా 25 శాతమా.. అలాగే డెట్‌కు ఎంతన్నది తేల్చుకోవాలి. వీటి నుంచి అవసరాలకు సరిపడా ప్రతి నెలా రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తుందేమో చూసుకోవాలి. పింఛను సదుపాయం ఉందా? ఉంటే వచ్చే మొత్తం సరిపోతుందా? అద్దె రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉందా? డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుందా? విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి రెమిటెన్స్ వస్తుందా? ఇలా అన్ని రూపాల్లోని ఆదాయ వనరులను లెక్కించుకోవాలి. అప్పుడు మీ నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తే నిశ్చింతగా ఉండొచ్చు. తరుగు ఉంటే ఆ మేరకు పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చులకు మించి ఆదాయం వస్తుంటే సంతోషంగా విశ్రాంతి జీవనాన్ని గడిపేయొచ్చు. మిగులు ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడికి సమాన స్థాయిలోనూ ఉండకూడదు. ఎందుకంటే ఏటా ద్రవ్యోల్బణ ప్రభావంతో 5–6 శాతం మేర పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. కనుక పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే తక్కువే ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ మీ పెట్టుబడిపై వచ్చే ఆదాయానికి సమాన స్థాయిలో ప్రతి నెలా ఉపసంహరించుకుంటున్నారని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు సరిపడా ఆదాయం పెంచుకునేందుకు కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్‌లో పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే ఇవి సురక్షితమైన, మెరుగైన రాబడులు కలిగిన డెట్ సాధనాలు. ఏటా ఏప్రిల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై రాబడులు ఏ మేరకు ఉన్నాయి? డెట్‌లో ఏ మేరకు రాబడి వచ్చింది? అన్ని పరిశీలించుకోవాలి. ఉదాహరణకు 2013లో రూ.50 లక్షలను ఈక్విటీ, డెట్‌లో సమానంగా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా మీ అవసరాలకు 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. అప్పుడు ఒక ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అవుతుంది. అదే 2014లో రూ.3,18,000 అవసరం అవుతుంది. ఇలా ఏటా ఉపసంహరించుకోవాల్సిన మొత్తం పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రకారం 2023లో రూ.4,32,000 అవసరం అవుతుంది. 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. కనుక ఇప్పుడు మీ వద్ద రూ.72,00,000 పెట్టుబడి ఉండాలి. అప్పుడే 6 శాతం చొప్పున రూ.4,32,000 తీసుకోగలరు. అందుకే మీ పెట్టుబడి నిధి కూడా వృద్ధి చెందాలి. -
ఆర్టీసీకి లక్కీ మండే.. ఒక్కరోజే రూ.20.36 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి సోమవారం రద్దీ బాగా కలిసొస్తోంది. గత నెల 15న సోమవారం రోజు రికార్డు స్థాయిలో రూ.20.26 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఆర్టీసీ , తాజాగా ఈ సోమవారం దాన్ని బ్రేక్ చేస్తూ రూ.20.36 కోట్లను పొందింది. గత సంక్రాంతి తర్వాతి రోజు, రాఖీ పౌర్ణమి రోజు రూ.20 కోట్లను మించి టికెట్ రూపంలో ఆదాయం పొందింది. మిగతా సందర్భాల్లో ఒకేరోజు రూ.20 కోట్లను మించి ఆదాయం రికార్డు కాలేదు. ఆ రెండు సందర్భాలు పండుగలతో ముడిపడి ఉన్నందున, ఆర్టీసీ కొంత ఆశించి లక్ష్యంగా పెట్టుకుని ఆదాయం పొందింది. ఈ సోమవారం ఎలాంటి పండుగలు లేకున్నా అంత ఆదాయం రావటం విశేషం. నిర్ధారించుకున్న లక్ష్యాన్ని మించి 116 శాతం ఆదాయం పొందటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో అది 122 శాతంగా నమోదైంది. ఆక్యుపెన్సీ రేషియో 82 శాతంగా నమోదైంది. సోమవారంరోజు 34.26 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు రికార్డు అయింది. కిలోమీటర్‌కు రూ.53.74 చొప్పున ఆదాయం (ఈపీకే) వచి్చనట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
సంస్కరణలతో ఆదాయం వృద్ధి
సాక్షి, అమరావతి: వాణిజ్యపన్నుల శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఆ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. 2022–23లో జీఎస్టీ ఆదాయం 20.13% వృద్ధితో ఏకంగా రూ.28,092.87 కోట్లు నమోదవడం విశేషం. గతంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అంటే వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎప్పుడు తనిఖీలు చేస్తారో.. ఎలాంటి జరిమానాలు విధిస్తారో.. అన్న భయం ఉండేది. కానీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు వాణిజ్యపన్నుల శాఖను పూర్తిగా స్నేహపూర్వక శాఖగా మార్చారు. గత ఏడాది కాలంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అవకతవకలకు పాల్పడకుండా పన్నులు చెల్లించే వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ.. అదే సమయంలో పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో తనిఖీల భయం లేకుండా నిజమైన వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పన్ను ఎగవేతలకు అడ్డుకట్టపడింది. గతేడాది (2022–23)లో ఈ సంస్కరణల ద్వారా అదనంగా రూ.1,745 కోట్ల ఆదాయం సమకూరినట్లు రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజాశంకర్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే సంవత్సరం 10కిపైగా కీలక సంస్కరణలతో పూర్తిస్థాయి ప్రక్షాళన చేశామన్నారు. పన్ను చెల్లించని వ్యాపారులను గుర్తించి వారితో పన్ను కట్టించడం ద్వారా రూ.263.9 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆటోమేటిక్ రిటర్న్ స్క్రూట్నీ ద్వారా రూ.132.91 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆడిటింగ్ ద్వారా రూ.38.79 కోట్లు, తనిఖీల ద్వారా రూ.64.29 కోట్లు, వ్యాట్ బకాయిలను వసూలు చేయడం ద్వారా రూ.235.13 కోట్లు వచ్చాయన్నారు. 2021–22తో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం (పరిహారం లేకుండా) 2022–23లో 20.13% వృద్ధితో రూ. 28,092.87 కోట్లుగా నమోదైందని తెలిపారు. పరిహారంతో కలిపి చూస్తే మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.33,511.33 కోట్లని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలివే.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అధికారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాహనాలను తనిఖీచేసే ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానంలో ఏ అధికారి వాహనాలను చెకింగ్ చేస్తారన్న విషయాన్ని 24 గంటలు ముందుగానే ఎస్ఎంఎస్ విధానంలో తెలియజేస్తారు. రిటర్నుల స్క్రూట్నీలో కూడా అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్క్రూట్నీ ఆటోమేటెడ్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. జీఎస్టీ పోర్టల్‌లోని డేటా, ఎనలిటికల్ నివేదికల ఆధారంగా స్క్రూట్నీ కోసం రిటర్నులను ఎంపిక చేస్తారు. అలాగే ఎనలిటిక్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలిపేలా డ్యాష్‌బోర్డు, కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్, ఈ–జర్నల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రీకృత డేటా ఎనలిటికల్ సెంటర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. తద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి నేరుగా వారివద్దే తనిఖీలు చేస్తున్నారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. -
ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2023 పోరులో ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకునే చివరి అవకాశాన్ని చేజేతులారా జార విడిచుకుంది. ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ సతీమణి, నీతా అంబానీ యాజమాన్యంలోని ఐపీఎల్ జట్టు గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయాన్ని మూట గట్టుకుని టైటిల్ పోరును నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ సీజన్ ద్వారా అంబానీ కుటుంబం ఎంత ఆర్జించింది అనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. టాప్ సక్సెస్ఫుల్ టీంగా భావించే ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీలు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేదే లేటెస్ట్ టాక్. (మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? ) ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్‌లో 100 శాతం వాటాతో నీతా, ముఖేష్ అంబానీలే ఏకైక యజమానులుగా ఉన్నారు. మిలియన్ల డాలర్లు 2008లో ఈ జట్టును కొనుగోలు చేశారు. తొలి సీజన్లో జట్టు కొనుగోలుకు రూ. 916 కోట్లు వెచ్చించారు.ఇప్పటివరకు ఐదు టైటిళ్లను సాధించి, 2023 వరకు అత్యధిక సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లను గెలుచుకుని ఆదాయం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గిందిలేదు. పెద్ద సంఖ్యలో స్పాన్సర్లను పొందిన జట్టు కూడా ఇదే. ది ట్రిబ్యూన్ ప్రకారం, ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ రూ. 10,070 కోట్లకు పైమాటే. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 200 కోట్లుపెరిగింది. ఇప్పటివరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టు. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) దీంతోపాటు టిక్కెట్ ధరలతో పాటు మీడియా స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల సంపాదన కూడా భారీగానే ఉంది. ఇది అంతా ఒక ఎత్తయితే మరో ప్రధాన ఆదాయ వనరు జియో సినిమాకు విక్రయించిన ఐపీఎల్ హక్కుల ద్వారా ఆర్జించింది మరో ఎత్తు. తొలి ఐదు వారాల్లోనే జియోసినిమా రికార్డు స్థాయిలో 1300 కోట్ల వీడియో వీక్షణలను అందుకోవడం గమనార్హం. (Shantanu Narayen:189 బిలియన్ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన) రిలయన్స్ బ్రాండ్ Viacom18, Jio సినిమా ఐపీఎల్ టెలికాస్టింగ్ హక్కులను రూ. 22,290 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు జియో సినిమా ఐపిఎల్‌ని మొదటి హోస్ట్ చేయడం ద్వారా రూ. 23,000 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేల కోట్లను కూడా ఆర్జించనుందని అంచనా. దీంతో పాటు గ్లోబల్ ఫ్రాంచైజీల ద్వారా కూడా భారీ ఆదాయాన్నే సాధిస్తోంది రిలయన్స్. ఇదీ చదవండి: చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్ ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ న్యూస్, బిజినెస్అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
R Rajeshwari: కాదేది ఉపాధికనర్హం!
గృహిణిగా ఇంటి బాధ్యతలు మహిళలకు ఎలాగూ తప్పదు. ఇక ఆదాయ మార్గం గురించి ఆలోచించడం, వాటిని అమలులో పెట్టడం అంటే తగిన వనరులే కాదు ఇంటిల్లిపాదీ అందుకు సహకరించాలి. హైదరాబాద్ బండ్లగూడ నాగోల్‌లో ఉంటున్న ఆర్.రాజేశ్వరి ని కలిసినప్పుడు ‘పదేళ్లుగా చేస్తున్న పచ్చళ్లు, పొడుల వ్యాపారం... ఆదాయంతో పాటు బిజినెస్ ఉమన్‌గానూ గుర్తింపును తెచ్చిపెట్టింది’ అని వివరించింది. ‘మన ఇళ్లల్లో అన్ని కాలాల్లోనూ ఏవో ఒక పచ్చళ్లు పెట్టడం అనేది గృహిణులకు అలవాటైన పనే. ఇంట్లో నేనూ అలాగే చేస్తుండేదాన్ని. నా చేతి పచ్చళ్లు రుచికరంగా ఉంటాయని ఇంట్లోనూ, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్లు బాగా మెచ్చుకునేవారు. అడిగి మరీ చేయించుకునేవారు. దీనికితోడు నాకు తెలిసిన వాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన పచ్చడి, పొడులు తయారు చేసిమ్మని అడిగేవారు. పదేళ్ల క్రితం... నోటి మాటతోనే ఒకరొకరుగా పచ్చళ్లు చేసిమ్మని అడిగేవారి సంఖ్య పెరగడం మొదలయ్యింది. దీనినే చిన్న వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. మా ఊరు గుంటూరుకు వెళ్లినప్పుడల్లా అక్కడ రైతుల దగ్గరకు వెళ్లి, కావల్సిన సరుకులను నేరుగా పొలాల నుంచే సేకరించేదాన్ని. ఒకటే నియమం పెట్టుకున్నాను. కేవలం వెజ్ పచ్చళ్లును మాత్రమే పెట్టాలి. అలాగే, రసాయనిక ఎరువు వాడకుండా పండించిన ఆర్గానిక్ పంటల నుంచే సేకరించాలనుకున్నాను. నేరుగా రైతులను కలిసి, వారి ద్వారా పంటలను కొనుగోలు చేయడం, వాటిని బాగుచేయించి, తీసుకురావడమూ పెరిగింది. మిర్చి, పసుపు, మసాలా దినుసులు వంటివి ఏయే ప్రాంతాల్లో ఏయే ఏవి అధికంగా పండుతాయో తెలుసుకుని, ఆ దినుసులను సేకరిస్తూ ఉంటాను. ఒక్కరిగానే... మొదట్లో ఒక్కదాన్నే పచ్చళ్లకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకునేదాన్ని. అందుకు తగిన పనుల ప్లానింగ్ కూడా చేసుకున్నాను. మెల్లగా మార్కెట్ పెరుగుతుండటంతో సాయానికి మరొకరిని నియమించుకుని, పనులు చేస్తూ వచ్చాను. కామాక్షి ఫుడ్స్ పేరుతో పదేళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని రిజస్టర్ చేయించుకొని, ఇప్పుడు నాతోపాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. మొదట్లో అంతగా తెలియకపోయినా మార్కెట్ గురించి నాకు నేనుగానే ఓ అంచనా వేసుకుంటూ షాప్స్, ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్ల ద్వారానూ పచ్చళ్లు సిద్ధం చేస్తుంటాను. టొమాటో, గోంగూర, మాగాయ, నిమ్మకాయ, చింతకాయ.. వంటి పచ్చళ్లు, పొడుల తయారీ రోజూ ఉంటుంది. రోజూ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలయ్యే నా దినచర్య తిరిగి, రాత్రి పదిగంటలకే పూర్తవుతుంది. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు ఉద్యోగి. ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. ఏడాదికి ఇరవై లక్షల ఆదాయంతో ఈ మార్గం నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా చేత్తో నలుగురికి రుచికరమైన పచ్చళ్లను అందివ్వడమే కాదు, నాతో పాటు ఇంకొందరికి ఉపాధినివ్వడం సంతోషంగా ఉంది. ఆర్డర్లను బట్టి తయారీ విధానాన్ని ఎంచుకుంటాను కాబట్టి నష్టం అనే సమస్య ఎప్పుడూ రాలేదు. చేసే పనిలో ముందుగానే అంచనా ఉంటే అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఇంటితోపాటు సమర్థవంతంగా నిర్వర్తించే సత్తా మహిళలకెలాగూ ఉంటుంది’ అని వివరిస్తుంది రాజేశ్వరి. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఆర్టీసీ.. టార్గెట్ మండే
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారాల్లో వివిధ పనులపై వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రతి సోమవారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వారా టికెట్ ఆదాయం అధికంగా వచ్చేలా చర్యలు ప్రారంభించింది. గత సోమవారం ప్రయోగాత్మకంగా చేసిన కసరత్తు సత్ఫలితం ఇవ్వడంతో ఇక నుంచి ప్రతి సోమవారం ప్రత్యేక కసరత్తు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. దీంతో ఈ సోమవారానికి సంబంధించి కూడా ఆదివారం నుంచే కసరత్తు ప్రారంభించారు. డిపోల్లోని స్పేర్ బస్సులన్నింటినీ రోడెక్కించడంతోపాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూస్తున్నారు. ఇక సర్వీసులను అటూఇటూ మార్చడం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో ఎక్కువ బస్సులు తిప్పేందుకు రూట్లను మారుస్తున్నారు. గత సోమవారం 73 డిపోల లాభార్జన గత సోమవారం అంటే.. మే 15న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ. 20 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో సమకూరింది. గత సంవత్సర కాలంలో సంక్రాంతి ముగిసిన మర్నాడు, హోలీ రోజుల్లోనే ఇలా రూ. 20 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. కానీ ఇప్పుడు ఎలాంటి పండుగలు లేకున్నా సాధారణ రోజునే అలా రూ. 20 కోట్ల ఆదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో రికార్డే. మే 15న ట్రాఫిక్ రెవెన్యూకు ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్, టోల్ సెస్‌లను కలపడం ద్వారా ఈ మొత్తం రికార్డయింది. టార్గెట్‌ను మించి 116 శాతం ఆదాయం నమోదు కావడం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో 79.33 శాతంగా నమోదైంది. అధికారులు చేసిన ప్రత్యేక కసరత్తు వల్ల సాధారణ సోమవారాల్లో వచ్చే ఆదాయం కంటే దాదాపు రూ. 3 కోట్లు అదనంగా వచ్చింది. 96 డిపోలకుగాను ఏకంగా 73 డిపోలు లాభాలను ఆర్జించాయి. -
షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షాపింగ్ మాల్ ఆపరేటర్ల ఆదాయం 7-9 శాతం అధికం కానుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. కోవిడ్ ముందస్తు కాలం 2019-20 ఆదాయంలో ఇది 125 శాతానికి సమానమని వివరించింది. రిటైల్ విక్రయాలు బలంగా ఉండడం, అద్దెలు పెరగడం ఈ వృద్ధికి కారణమని తెలిపింది. (డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు) ‘ప్రయాణ నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత సామాజికంగా సాధారణ స్థితికి రావడంతో 2022-23లో మాల్స్‌కు కస్టమర్ల రాకలో గణనీయమైన వృద్ధికి దారితీసింది. రాబడి 60 శాతం పెరిగి కోవిడ్ ముందస్తు స్థాయి ఆదాయంలో ఇది 116 శాతానికి చేరుకుంది. అధిక ఆక్యుపెన్సీ స్థాయిలు, వ్యయ నియంత్రణ చర్యలు, బలమైన బ్యాలెన్స్ షీట్ల మద్దతుతో ఘనమైన లాభదాయకత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్ ఆపరేటర్ల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 2022–23లో లీజింగ్ రేటు చదరపు అడుగుకు 12–14 శాతం దూసుకెళ్లింది’ అని వివరించింది. పుంజుకునే అవకాశం.. ఈ రంగంలో ఆరోగ్యకర పనితీరును పరిగణనలోకి తీసుకుంటే మూలధన వ్యయం మధ్యస్థ కాలానికి దగ్గరలో పుంజుకునే అవకాశం ఉంది. ఇందులో గణనీయమైన భాగం ప్రపంచ పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ ద్వారా సమకూరవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ప్రభావం, గతంలో రెపో రేటు పెంపుదలతో వెనుకబడిన ప్రభావం రిటైల్ అమ్మకాలతో సహా విచక్షణతో కూడిన వ్యయాన్ని తగ్గించగలదని క్రిసిల్ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) క్రిసిల్ రేటింగ్స్ దేశవ్యాప్తంగా 28 మాల్స్‌ను విశ్లేషించింది. ఇవి 17 నగరాల్లో 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజుకు స్థలాన్ని కలిగి ఉన్నాయి. వీటికి మొత్తం రూ.8,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. సాధారణంగా మాల్ ఆపరేటర్లు లీజు ఒప్పందాల ప్రకారం తమ ఆదాయంలో దాదాపు 85 శాతాన్ని కనీస హామీ అద్దెల నుండి సమకూర్చుకుంటారు. మిగిలినది అద్దెదారుల ఆదాయ పని తీరుతో ముడిపడి ఉంటుంది. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) -
అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభం 43శాతం పెరిగి రూ. 2,623.6 కోట్లకు చేరింది. ఆదాయం రూ.32,365 కోట్ల అంచనాతో పోలిస్తే 20శాతం పెరిగి రూ.32,048 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 38శాతం పెరిగి రూ.3,350.3 కోట్లకు చేరుకుంది. ఈమేరకు సంస్థ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు అందించింది. ఇదీ చదవండి: వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్! సెమీకండక్టర్ల కొరత ఈ త్రైమాసికం, గత సంవత్సరం పోల్చదగిన కాలం రెండింటిలోనూ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.త్రైమాసికంలో ఎగుమతులు 5.5శాతం క్షీణించి 64,000 యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ చేసిన బ్రెజ్జాగ్రాండ్ విటారా వంటి కొత్త మోడల్ లాంచ్‌లు, కార్‌మేకర్ అమ్మకాల వృద్ధిని సంవత్సరానికి 5.3శాతం నుండి 5.15 లక్షల యూనిట్లకు నమోదు చేయడంలోసహాయపడ్డాయి. అలాగే తన 40వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఉన్నప్పటికీ, కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసిందనీ కంపెనీ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ డివిడెండ్ కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.90 అత్యధిక డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2,718.7 కోట్ల రూపాయలకు తుది డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి FY23లో ఒక్కో షేరుకు 5 నామమాత్రపు విలువ కలిగిన ఈక్విటీ షేరు చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 6, 2023న షెడ్యూల్ చేసింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడిన హోల్-టైమ్ డైరెక్టర్ పదవికి షిగెటోషి టోరీ రాజీనామా చేసినట్లు కార్ల తయారీదారు ప్రకటించారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) 10 లక్షల యూనిట్ల సామర్థ్యం విస్తరణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్ల వరకు విస్తరించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇన్వెస్ట్మెంట్ కోసం అంతర్గత నిల్వలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం, మారుతీ సుజుకి సామర్థ్యం మనేసర్ , గురుగ్రామ్‌లలో దాదాపు 13 లక్షల యూనిట్లుగా ఉంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) -
ఎల్ఐసీ ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 17 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. 2021–22 సంవత్సరానికి ప్రీమియం ఆదాయం రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం వసూలు పరంగా చూస్తే జీవిత బీమా మార్కెట్లో 2023 మార్చి నాటికి 62.58 మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. లిస్టెడ్ జీవిత బీమా కంపెనీల్లో ప్రీమియం వృద్ధి పరంగా ఎల్ఐసీ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 18.83 శాతం మేర ప్రీమియం ఆదాయంలో వృద్ధిని చూపించి మొదటి స్థానంలో ఉంటే, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 16.22 శాతం పెరిగి మూడో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఆదాయం 12.55 శాతం మేర పెరిగింది. ఎల్ఐసీకి సంబంధించి ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల ప్రీమియం ఆదాయం 3.30 శాతం పెరగ్గా, ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 10 శాతం, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 21.76 శాతం, చొప్పున పెరిగాయి. -
ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన
ఫోర్బ్స్ బిలియనీర్ 2023 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. మరి అంబానీ కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయన మరెవ్వరో కాదు అంబానీకి దగ్గరి బంధువు , ముంబై ఇండియన్స్ బాస్ నిఖిల్ మెస్వానీ. ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న క్రమంలో నిఖిల్ సంపాదన, ఇతర విశేషాలపై ఆసక్తి నెలకొంది. ముఖేష్ అంబానీకి చెందిన ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ జట్టు బాస్‌గా నిఖిల్ మెస్వానీ జట్టు రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం మాత్రమే కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను విజయవంతమైన వెంచర్‌గా మార్చడంలో కూడా ఆయనది కీలక పాత్ర. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న నిఖిల్ మెస్వానీ 1986లో కంపెనీలో చేరారు. జూలై 1988లో నిఖిల్ మెస్వానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నిఖిల్‌తోపాటు అతని ఇతర కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుగుదలలో కీలక భూమిక పోషిస్తుండటం విశేషం. ఫోర్బ్స్ ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ సంపాదన రూ. 24 కోట్లు. ఇది ముఖేష్ అంబానీ సంపాదించిన దానికంటే ఎక్కువ. అంబానీ 10 సంవత్సరాలకు పైగా తన వేతానాన్ని రూ.15 కోట్లకు కుదించుకుంటున్న సంగతి తెలిసిందే. (వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!) నిఖిల్ మెస్వానీ ఎవరు? నిఖిల్ మెస్వానీ ముంబై విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఇండియాకు తిరిగి వచ్చి రిలయన్స్‌లో చేరారు. రిలయన్స్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా 1997 - 2005 మధ్య భారీ రిఫైనరీ వ్యాపార బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన జామ్‌నగర్ రిఫైనరీతో సహా కంపెనీ అనేక ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన ఘనత మెస్వానీ సొంతం. టెలికాం, రిటైల్ రంగాల్లోకి కంపెనీ ప్రవేశంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) నిఖిల్ సోదరుడు హితల్ మెస్వానీ కూడా మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కాగా నిఖిల్ మేస్వానీ తండ్రి, రసిక్లాల్ మేస్వానీ, ధీరూభాయ్ అంబానీకి బంధువు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం. నిఖిల్ మెస్వానీ దాతృత్వం దాతృత్వ కార్యక్రమాలలో కూడా నిఖిల్ పాల్గొంటారు. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధితో సహా వివిధ సామాజిక కారణాలను ఫౌండేషన్ చూసుకుంటుంది. ముంబై ఇండియన్స్ Vs x గుజరాత్ టైటన్స్ ఈ రోజు ( ఏప్రిల్ 25, మంగళవారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో IPL 2023లో మ్యాచ్ నం. 35లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. Power, finesse, switchin’ it up when needed - Nehal can do it all. 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/s2Bl4BqWrb — Mumbai Indians (@mipaltan) April 25, 2023 -
సొంత ఆదాయాల పెంపుపై పంచాయతీలు దృష్టి పెట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఉపయోగించుకుంటూనే సొంత ఆదాయాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి సూచించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 27 పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులను కమిషనర్ సన్మానించి అవార్డులను అందజేశారు. పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాల కల్పన, హెల్దీ పంచాయతీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియెంట్ పంచాయతీ, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ, సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైనవారు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్లు సుధాకర్‌రావు, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంద్రబాబూ సిగ్గు.. సిగ్గు ) -
అదరగొట్టిన రిలయన్స్ జియో
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టింది. నికర లాభంతో 13 శాతం జంప్‌చేయగా, ఆదాయం 11.9 శాతం ఎగిసింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 23,394 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 20,901 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగిందని రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చినప్పటికీ, ఐదు త్రైమాసికాల్లో లాభం, రాబడి వృద్ధి మందగించడం గమనార్హం. దీనికి ఇటీవలి కాలంలో జియో టారిఫ్ పెంపు లేకపోవడం, అధిక ఖర్చులు కారణంగా మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్) గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,173 కోట్లతో పోలిస్తే నికర లాభం సంవత్సరానికి 13 శాతం (YoY) పెరిగి రూ. 4,716 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, డిసెంబర్ త్రైమాసికంలో రూ.4,638 కోట్ల లాభంతో పోలిస్తే లాభం 1.7 శాతం పెరిగింది. అలాగే ఈ త్రైమాసికంలో రూ.23,394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1.7 శాతం పుంజుకుంది. ఈ త్రైమాసికంలో ఎబిటా రూ. 12,210 కోట్లుగాను, ఎబిటా మార్జిన్ 52.19 శాతంగా ఉంది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) -
దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. రూ.18,973 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఇటు సరుకు రవాణా రైళ్లు, అటు ప్రయాణికుల రైళ్ల ద్వారా కలిపి మొత్తం రూ.18,973 కోట్ల రాబడి సాధించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.15,708 కోట్ల ఆదాయమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. 2021–22లో 14,266.04 కోట్లు మాత్రమే సాధించింది. ఈసారి పాత రికార్డులను బద్దలు కొడుతూ ఏకంగా రూ.19 వేల కోట్లకు చేరువ కావటం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్లకు గాను దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఉత్తర రైల్వే, తర్వాత వరసగా మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వేలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సరుకు రవాణాతో రూ.13,051.10 కోట్లు, ప్రయాణికుల రైళ్ల ద్వారా రూ.5,140.70 కోట్లు ఆర్జించిందని తెలిపారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 25.56 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారని, అంతకుముందు సంవత్సరంలో ఆ సంఖ్య కేవలం 12.70 కోట్లేనని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి సిద్దిపేటకు రైలు మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో సిద్దిపేట వరకు పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే ఆగస్టు నాటికి రైలును సిద్దిపేట వరకు నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్టు జీఎం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులు రైలు పట్టాలు దాటేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్లను వినియోగించుకోవాలని, నేరుగా పట్టాలు దాటొద్దని కోరారు. 139 హెల్ప్‌లైన్ నంబరును వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో అదనపు జీఎం ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు! -
గ్రీన్ లైఫ్: అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి... ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం అర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – ఖలీద్ మునావర్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ పనితీరు చూపించడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు కొన్ని ప్రతికూల సమయాలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకం పనితీరు గురించి మీరు ఆలోచన చేయవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్ లెటర్లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను కొనసాగించొచ్చు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఐదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టుబడులు పెట్టే కాలంలో అస్సెట్ అలోకేషన్‌ను ఎలా నిర్వహించాలి? -వినయ్ శేఖర్ చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అస్సెట్ అలోకేషన్ ఎంతో కీలకమైనది. మీ పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించడం, అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాల ఆధారంగా కేటాయింపులు చేసుకోవడమే అస్సెట్ అలోకేషన్. ఈక్విటీలు ఇతర సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మంచి రాబడులను ఇవ్వగలవు. మీ పెట్టుబడుల కాల వ్యవధి ముగింపునకు వస్తున్నప్పుడు, పెట్టుబడులతో అవసరం ఏర్పడడానికి కొంత ముందు నుంచే క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను డెట్‌లోకి మళ్లించు కోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలు మూడేళ్ల లోపు ఉంటే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. మూడేళ్లకు మించి ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మూడు నుంచి ఐదేళ్ల కోసం అయితే 25-30 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఐదు, ఏడేళ్ల కోసం అయితే ఈక్విటీ కేటాయింపులు 50 శాతం వరకు, లేదా మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఏడేళ్లకు మించిన లక్ష్యాల కోసం ఈక్విటీలకు 70-80 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ముఖ్యమైనది. దీనివల్ల అస్థిరతలను అధిగమించొచ్చు. -ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
మంగళగిరిలో ‘ఐపీజీ’ బాధితులు 700 మందికిపైనే!
మంగళగిరి: సైబర్ మోసగాళ్ల ఐపీజీ రెంట్ యాప్ ఉచ్చులో మంగళగిరికి చెందిన 700 మందికిపైగా చిక్కి విలవిల్లాడుతున్నారు. పెట్టుబడికి వారం రోజుల్లో రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపడంతో వీరు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. వీరు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు రెండురోజుల కిందట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు తిరిగి ఇచ్చిన యాప్ నిర్వాహకులు తరువాత క్రమంగా చెల్లింపులు నిలిపేశారు. నిదానంగా ముఖం చాటేసిన నిర్వాహకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా యాప్‌లోను సమాధానం చెప్పకపోవడం, ఐపీజీ రెంట్ కామ్ యాప్‌ను సైతం మూసేయడంతో పెట్టుబడిదారులు మోసపోయామని గ్రహించారు. తొలుత కిషోర్‌కు అతడి స్నేహతుడు ఐపీజీ యాప్ లింక్ పంపారు. తన స్నేహితులు చాలామంది ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టారని, మంచి ఆదాయం వస్తుందని అతడు చెప్పడంతో కిషోర్ ఆ యాప్‌లో నమోదు చేసుకున్నారు. మొదట రూ.800 పెట్టుబడి పెట్టగా వారానికి రూ.1,600 ఆదాయం వచ్చింది. రెండుమూడుసార్లు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడంతో కిషోర్ తన స్నేహితులకు యాప్ లింక్ పంపి రెట్టింపు ఆదాయం గురించి చెప్పారు. కిషోర్ స్నేహితులు, బంధువులతోపాటు చైన్‌లింక్‌గా మారి ఒక్క మంగళగిరిలోనే 700 మందికిపైగా ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. రూ.800, రూ.1,200 నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు.. ఇలా శక్తిమేర పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలాఖరు కావడంతో యాప్ ఆఫర్ ప్రకటించిందని చెప్పి రూ.30 వేలు పెట్టుబడి పెట్టినవారికి అదనంగా ఆదాయంతోపాటు వారం రోజులకు వడ్డీ రూ.27 వేలు కలిపి రూ.80 వేలు వస్తాయని ఆశచూపారు. దీంతో పలువురు ఎక్కువ సొమ్ము యాప్‌లో పెట్టుబడి పెట్టారు. బాధితుల్లో అత్యధికంగా మహిళలున్నారు. వారం రోజుల తర్వాత మోసగాళ్లు యాప్‌ను మూసేయడంతో కిషోర్ ఆన్లైన్లో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులతో కలిసి ఈ నెల 7వ తేదీన పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తమకు ఫిర్యాదు చేసినట్లు పట్టణ సీఐ బి.అంకమ్మరావు చెప్పారు. సైబర్ క్రైమ్ కావడంతో దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్‌కు అప్పగించామని తెలిపారు. -
IPL: క్యాష్ రిచ్ లీగ్.. చీర్‌లీడర్స్ ఆదాయమెంతో తెలుసా? ఒక్కో మ్యాచ్‌కు..
క్యాష్ రిచ్ లీగ్.. ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. వేలం సందర్భంగా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న ప్రతిభావంతులు మొదలు.. స్టార్ ప్లేయర్లపై వేలంలో కనక వర్షం కురవడం షరా మామూలే! ఇక పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాగ్జిమమ్ సిక్స్‌లు.. అద్భుత రీతిలో వికెట్లు పడ్డప్పుడు.. ఊహించని క్యాచ్‌లు అందుకున్నపుడు.. ఇలా ప్రతీ కీలక మూమెంట్లో ఆయా జట్లను ఉత్సాహపరుస్తూ చీర్‌లీడర్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు! తమదైన శైలిలో హుషారైన స్టెప్పులతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకూ కనువిందు చేస్తూ ఉంటారు చీర్‌లీడర్స్. మరి ఒక్కో మ్యాచ్‌కు వారు అందుకునే మొత్తం, చీర్‌లీడర్స్‌కు అధిక మొత్తం చెల్లిస్తున్న ఫ్రాంఛైజీ ఏదో తదితర వివరాలు పరిశీలిద్దాం. ఒక్కో మ్యాచ్‌కు కనీసం ఎంతంటే డీఎన్ఏ రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు సగటున 12,000 రూపాయల నుంచి 17 వేల వరకు ఫ్రాంఛైజీలు చెల్లిస్తాయట. ఇక క్రిక్ఫాక్ట్స్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ చీర్‌లీడర్స్‌కు అత్యధిక మొత్తం చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా ఒక్కో మ్యాచ్‌కు రూ. 24 వేలు పారితోషకంగా కేకేఆర్ అందిస్తోందట. అత్యధికంగా చెల్లించే ఫ్రాంఛైజీ ఏదంటే ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్‌లీడర్స్‌కు మ్యాచ్‌కు 12 వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. కాగా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌కు పనిచేస్తున్న చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు 20 వేల రూపాయల చొప్పున ముట్టజెప్తున్నారట. అదే విధంగా రాయల చాలెంజర్స్ బెంగళూరు సైతం ముంబై మాదిరే 20 వేలు చెల్లిస్తోందట. ఇలా చీర్‌లీడర్స్ ఒక్కో మ్యాచ్‌కు ఈ మేరకు నగదు అందుకోవడమే కాకుండా.. విలాసవంతమైన హోటళ్లలో బస, రుచికరమైన భోజనంతో ఇతర సదుపాయాలు కూడా పొందుతున్నారు. అంత తేలికేం కాదు ఏంటీ.. ఇదంతా వింటుంటే చీర్‌లీడర్స్ పనే బాగున్నట్లుంది అనుకుంటున్నారా? నిజానికి చీర్‌లీడర్‌గా ఎంపిక కావడం అంత తేలికేం కాదు. స్వతహాగా మంచి డాన్సర్లు అయిన వాళ్లు, మోడలింగ్ రంగంలో ఉన్నవాళ్లను.. అనేక ఇంటర్వ్యూల అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు సెలక్ట్ చేస్తాయి. అంతేకాదు వేలాది ప్రేక్షకుల నడుమ రాత్రిపగలు మ్యాచ్‌లనే తేడా లేకుండా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది మరి! ప్రస్తుతం చీర్లీడర్స్గా ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో రెండేసి విజయాలతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు
న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. -
ప్రీమియం హోటళ్లకు డిమాండ్
ముంబై: ప్రీమియం హోటళ్లకు డిమాండ్ సానుకూలంగా ఉన్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 80 శాతం పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15–20 శాతం మేర ఆదాయం పెరగొచ్చని అంచనా వేసింది. విహార, కార్పొరేట్, సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ ప్రయాణాలతో హోటళ్ల బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, ప్రమీఇయం హోటళ్లకు దశాబ్దంలోనే గరిష్ట అక్యుపెన్సీకి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అధిక డిమాండ్, రూమ్ రేట్లు పెరగడం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇవన్నీ కలసి, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధిని నడిపిస్తాయని తెలిపింది. సగటు రూమ్ ధరలు కరోనా ముందు నాటి స్థాయికి చేరాయని, ఆపరేటింగ్ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, రూమ్‌ల వారీ ఉద్యోగుల రేషియో తగ్గ డం ఇందుకు మద్దతుగా నిలుస్తోందని వివరించింది. రూమ్ ధరల పెరుగుదల ‘‘ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏపీఆర్) 2021–22లో 13 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19–21 శాతం మేర పెరిగి దశాబ్ద గరిష్ట స్థాయి అయిన రూ.7,500– 10,000కు చేరాయి. అక్యుపెన్సీ (రూముల భర్తీ) 2021–22లో 50 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద గరిష్టమైన 67–72 శాతానికి ఎగిసింది’’అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పుషన్ శర్మ తెలిపారు. అయితే, ప్రీమియం హోటళ్లకు డిమాండ్ పెరిగినప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ నివేదిక పేర్కొంది. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 54 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించడం గమనార్హం. కరోనా ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 70 శాతమే. బడ్జెట్ హోటళ్లు.. బడ్జెట్ హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏఆర్ఆర్) కరోనా ముందున్న నాటి కంటే 20 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. ప్రీమియం హోటళ్ల వ్యాప్తంగా వృద్ధి రేటు ఒకే మాదిరిగా లేదని, విహార పర్యటనలకు సంబంధించి అక్యుపెన్సీ 70–75 శాతంగా ఉందని, అలా కాకుండా వ్యాపార పర్యటనల అక్యుపెన్సీ 65–70గా ఉన్నట్టు తెలిపింది. 2020–22 మధ్య హోటళ్లలో రూమ్ వారీ ఉద్యోగుల రేషియో 20–30 శాతానికి తగ్గినట్టు, డిమాండ్ పెరిగినప్పటికీ వ్యయాల సర్దుబాటును హోటళ్లు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. -
టీఎస్ఆర్టీసీ చాలెంజ్.. టార్గెట్ 100 డేస్.. రూ.200 కోట్లే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలను పెద్ద ఆదాయంగా మలుచుకొనేందుకు టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయత్నం ప్రారంభిస్తోంది. వంద రోజులపాటు ఆర్టీసీలో స్పేర్ బస్సులు సహా మొత్తం బస్సులను రోడ్డెక్కించడంతోపాటు ప్రత్యేక మార్పుచేర్పులు, కొత్త ప్రయత్నాలతో భారీ ఆదాయాన్ని పొందాలని నిర్ణయించింది. దీనికి ‘టార్గెట్ 100 డేస్’గా పేరు పెట్టింది. ఈ నెల 23 నుంచి జూన్ 30 వరకు దీన్ని కొనసాగించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఈ వంద రోజుల్లో సిబ్బంది అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టరాదన్నారు. వీక్లీ ఆఫ్‌లలో సిబ్బంది ‘పరిరక్షణ బృందాలు’గా ఏర్పడి రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులెక్కేలా చూడాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ కనీసం 70 వేల కి.మీ. మేర బస్సులన్నీ కలిపి అదనంగా తిరగాలని లక్ష్యం నిర్దేశించారు. వంద రోజుల్లో కనీసం రూ. 200 కోట్ల మేర అదనపు ఆదాయం పొందాలని ఆర్టీసీ భావిస్తోంది. గతేడాది వేసనిలో ప్రయోగాత్మకంగా వంద రోజుల చాలెంజ్‌ను అమలు చేయగా అప్పట్లో రూ. 178 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. అలాగే గతేడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో మరో కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సైతం భారీ ఆదాయం లభించింది. దీంతో ఇప్పుడు మరింత ఆదాయం కోసం ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇవీ లక్ష్యాలు ► ప్రతి ట్రిప్పులో కనీసం నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు అదనంగా బస్సులు ఎక్కేలా డ్రైవర్, కండక్టర్లు చొరవ చూపాలి. ►రద్దీ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద అవసరమైతే రెండు నిమిషాలపాటు అదనంగా బస్సులను ఆపాలి. ►ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద ఆర్టీసీ ‘పరిరక్షణ బృందాలు’ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న ప్రయాణికులను బస్సుల వైపు మళ్లేలా చూడాలి. ►వేసవిలో బస్సు ట్రిప్పులు మధ్యాహ్నం వేళ తగ్గించి ఉదయం, రాత్రిళ్లలో పెంచాలి. ►ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అవసరమైతే రాత్రి వేళ బస్సులు తిప్పే మూడో షిఫ్టును కూడా అమలు చేయాలి. ►అదనపు సమయంలో పనిచేసిన సిబ్బందికి కి.మీ.కు రూ.2 చొప్పున అదనంగా చెల్లించాలి. అద్దె బస్సులను కూడా అదనపు ట్రిప్పులకు వినియోగించాలి. ►రాత్రివేళ మెయింటెనెన్స్ చేసే బస్సులకు పగటి వేళనే ఆ ప్రక్రియ పూర్తి చేసి రాత్రి వేళ ట్రిప్పులకు వినియోగించాలి. ►పరీక్షలు పూర్తయ్యాక గ్రామాలకు తిప్పే సరీ్వసుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉండే సరీ్వసులను గుర్తించి వాటిని రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలకు మళ్లించాలి. ►డిమాండ్ ఎక్కువగా ఉండే రోజుల్లో టార్గెట్‌ను మించి బస్సులు ఎక్కువ కి.మీ. తిరగాలి. ఒకటి రెండు పాయింట్లలో గ్రౌండ్ బుకింగ్ కోసం కండక్టర్లను పెట్టి, బస్సులను కండక్టర్ సరీ్వస్ లేనివిగా ఎక్కువ తిప్పాలి. ►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే వారిపై చర్యలు తీసుకొనేందుకు రవాణా, పోలీసు శాఖలతో కలిసి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలి. -
నాయీ బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ గూడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశ ఖండనశాలల్లో తలనీలాల కార్యక్రమం కనీసం వంద రోజులు కొనసాగే ఆలయాలలో ఇది వర్తిస్తుందని దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించే టిక్కెట్ ధరను రూ.40కి పెంచి ఆ మొత్తాన్ని సంబంధిత నాయీ బ్రాహ్మణులకే అందజేస్తారు. రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాల ద్వారా లభించే ఆదాయం రూ.20 వేల కంటే ఎక్కువగా ఉంటే అది కూడా మొత్తం సంబంధిత నాయీ బ్రాహ్మణులకే చెల్లిస్తారు. ఒకవేళ తగినంత డిమాండ్ లేక టికెట్ల అమ్మకం ద్వారా రూ. 20 వేల కంటే తక్కువ ఆదాయం లభిస్తే తలనీలాలు విక్రయాల ద్వారా సమకూరే మొత్తం నుంచి ఆమేరకు చెల్లించాలని నిర్ణయించారు. టికెట్టు ధర రూ.40కి పెంచడం ద్వారా కేశఖండన శాలలు వంద రోజుల లోపు పనిచేసే ఆలయాలలో సైతం నాయీ బ్రాహ్మణులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. నాడు చంద్రబాబు చిందులు.. టీడీపీ అధికారంలో ఉండగా తమకు కనీస ఆదాయం వర్తింపజేయాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా జీవో విడుదలైంది. సముచిత స్థానం.. నాయీ బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే అరుదైన గౌరవాన్ని కల్పించిందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డులో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చదవండి: స్పీచ్ అదిరింది.. వాస్తవాలు కళ్లకు కట్టారు.. టీడీపీ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న తమకు సీఎం జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నేతలు గుంటుపల్లి రామదాసు, ఇతర నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు. -
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎన్ని వేల కోట్లో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన ఏడాదిలో..అంటే ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,707 కోట్లు. కానీ ఈ ఏడాది జనవరి వరకు..ఏకంగా రూ.12,000 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో రోజురోజుకూ విస్తృతమవుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాల నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. కరోనా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత బాగా ఊపందుకున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్ విలువలు, పెంచిన స్టాంప్ డ్యూటీ కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానా కళకళలాడుతోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 19.88 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి 31 నాటికి 16.03 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.11,928 కోట్ల ఆదా యం సమకూరినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,600 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య, ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది (2014–15)లో 8.26 లక్షల లావాదేవీలు జరిగి కేవలం రూ.2,707 కోట్ల ఆదాయం మాత్రమే ఖజానాకు రావడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టూనే.. భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు చాలావరకు హైదరాబాద్ చుట్టూనే జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మెజార్టీ లావాదేవీలు జరుగుతుండగా, హనుమకొండ, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేటల్లో కూడా భారీగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో 10 నెలల్లో 50 వేల వరకు లావాదేవీలు జరగ్గా, మిగిలిన జిల్లాల్లో 30 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయేతర భూముల విలువలను బట్టి ఆదాయం సమకూరుతోంది. ఇక రాష్ట్రంలో అతి తక్కువ రిజి్రస్టేషన్లు ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వరంగల్, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో నెలకు సగటున వెయ్యి లోపు లావాదేవీలే జరుగుతుండడం గమనార్హం . ధరణి పోర్టల్‌కు 10.23 కోట్ల హిట్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 2020 నవంబర్ 2 నుంచి అమల్లోకి వచి్చన ధరణి పోర్టల్‌కు ఇప్పటివరకు 10.23 కోట్ల హిట్లు వచి్చనట్టు (వీక్షించినట్లు) ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 29.67 కోట్ల భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ.4,741.65 కోట్ల ఆదాయం సమకూరిందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించింది. -
తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు. కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత -
మధ్యతరగతి మందహాసం!
సాక్షి, అమరావతి: దేశంలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందిన వారే! వారి సంపాదన, ఖర్చులు, పొదుపు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. మన మార్కెట్లు ప్రధానంగా ఆధారపడేది ఈ వర్గంపైనే. రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వీరంతా ప్రస్తుతం 31 శాతం ఉన్నారు. 2004–05లో దేశ జనాభాలో వీరు 14 శాతం మాత్రమే ఉండగా 2021–22 నాటికి రెట్టింపు దాటింది. 2030 నాటికి మిడిల్ క్లాస్ జనాభా 46 శాతానికి, 2047 నాటికి 63 శాతానికి పెరుగుతుందని అంచనా. పీఆర్‌ఐసీఈ (పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకానమీ) సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 63 నగరాల్లో 10 లక్షల జనాభాను ప్రశ్నించి ఐసీఈ 360 సర్వే నిర్వహించారు. నాలుగు విభాగాలుగా.. రూ.30 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను రిచ్ కేటగిరీగా పరిగణించారు. రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిని మధ్యతరగతి కేటగిరీగా, రూ.1.25 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని దిగువ తరగతిగా లెక్కించారు. రూ.1.25 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని అల్పాదాయ వర్గాలుగా విభజించారు. ఆయా వర్గాల ఇళ్లలో సౌకర్యాలు, కొనుగోలు శక్తిని బట్టి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఆదాయం, ఖర్చు, పొదుపులో అగ్రభాగం.. ఆదాయార్జన, డబ్బు ఖర్చు చేయడం నుంచి పొదుపు చేయడం వరకు ఆర్థిక వ్యవస్థ చోదకాంశాల్లో మధ్యతరగతి ప్రజలే కీలకపాత్ర పోషిస్తున్నారు. 31% జనాభా ఉన్న మిడిల్ క్లాస్ ప్రజల ద్వారానే దేశంలోని మొత్తం ఆదాయంలో 50% వస్తోంది. 52% ఉన్న దిగువ తరగతి ప్రజలు 25% ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 4% ఉన్న ధనికులు 23% ఆదాయాన్ని అర్జిస్తున్నారు. 15% ఉన్న అల్పాదాయ వర్గాల ఆర్జన కేవలం 2%. మిడిల్ క్లాస్ ప్రజలు 48% మొత్తాన్ని ఖర్చు చేస్తుండగా దిగువ తరగతి ప్రజలు 32%, ధనికులు 17, పేదలు 3% ఖర్చు చేస్తున్నారు. పొదుపులోనూ మిడిల్‌కా>్లస్‌దే అగ్రభాగం. 52 శాతాన్ని ఈ వర్గం ప్రజలే పొదుపు చేస్తున్నారు. 29 శాతాన్ని ధనికులు, 18 శాతాన్ని దిగువ తరగతి, ఒక శాతాన్ని పేదలు పొదుపు చేస్తున్నారు. మిడిల్ క్లాస్‌లో 97 శాతం మంది సీలింగ్ ఫ్యాన్ వినియోగిస్తుండగా 79% మంది ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు. 93% మంది కలర్ టీవీని, 71% రిఫ్రిజిరేటర్, 30% కారును కొనుగోలు చేస్తున్నారు రూ.1.25 – రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతి 10 మందిలో ఐదుగురు తప్పనిసరిగా బైక్ వినియోగిస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్న ప్రతి పది కుటుంబాల్లో మూడు కుటుంబాలు కారు వాడుతున్నాయి. రూ.30 లక్షల ఆదాయం దాటిన ధనిక కుటుంబాలు తప్పనిసరిగా ఒక కారును కొనుగోలు చేస్తున్నాయి. కోటీశ్వరుల కుటుంబాల్లో సగటున మూడు చొప్పున కార్లు ఉంటున్నాయి. సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. వార్షిక ఆదాయం రూ.2 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను ఈ కేటగిరీలో చేర్చారు. 1994–95లో ఈ కుటుంబాల సంఖ్య 98 వేలు కాగా 2020–21 నాటికి 18 లక్షలకు పెరిగింది. సూపర్ రిచ్ కుటుంబాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 6.4 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ 1.81 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో గుజరాత్ (1.41 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలు), నాలుగో స్థానంలో తమిళనాడు (1.37 లక్షలు), ఐదో స్థానంలో పంజాబ్ (1.01 లక్షలు) ఉన్నాయి. దేశంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే నగరాల్లో సూరత్, నాగపూర్ ముందున్నాయి. అక్కడి ధనిక వర్గాలు 1994–95 నుంచి 2020–21 మధ్య బాగా వృద్ధి చెందాయి. -
Karnataka: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్‌గా మేనిఫెస్టో!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై వరాలజల్లు కురిపించింది. ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో పెడతానంటూ పలు హామీలు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఒక కార్యక్రమంలో తాము గనుక అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2000 ఇస్తామని ప్రకటించారు. గృహలక్ష్మీ యోజన కింద ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపకరించే బేసిక్ ఆదాయం కింద ఏడాదికి రూ. 24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ని అందిస్తామని హామి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేగాదు ఈ గృహలక్ష్మీ యోజన అనేది కాంగ్రెస్ పార్టీ అధికమైన ఎల్పీజీ గ్యాస్ ధరల తోపాటు తమ రోజు వారీ ఖర్చుల నిమిత్తం మహిళలకు ఉపకరించేలా చేసిన ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతి మహిళ సాధికారిత తోపాటు తన కాళ్లపై తాను నిలబడి తన పిల్లలను చూసుకునే సామర్థ్యాంతో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. అందుకనే ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని పార్టీ తెలిపింది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తామని చెప్పింది. ఈ మేరకు ప్రియాంక గాంధీ " నేను నాయకురాలిని(నా నాయకి) " అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ... కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందంటూ విమర్శించారు. పైగా మంత్రులు ఉద్యోగాల్లో సుమారు 40% కమిషన్ తీసుకుంటున్నారని అన్నారు. అంతేగాదు కర్ణాటకలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అలాగే పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ స్కామ్ గురించి మాట్లాడుతూ..కర్ణాటకలో లంచాలు ఇవ్వకుండా ఏది జరగదన్నారు. పోలీసుల పోస్టులనే అమ్ముకునే సిగ్గుమాలిన మోసాలు జరుగుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. అయినా మీరు అధికారుల నుంచి ఆశించేది ఇదేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ముందుగా పిల్లలను, బాలికలను ఉద్యోగాలు వచ్చేలా చదివించండి అని చెప్పారు. అలాగే బెంగుళూరులో జరగాల్సిన సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులు గురించి ఆలోచించండి అని ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 9 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్!) -
టీసీఎస్ ఆదాయం అదుర్స్..కానీ ఉద్యోగుల్లో..!
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాల లాభాల్లో అంచనాలను మిస్ చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు శాతం వృద్ధితో రూ.10,846 కోట్లకు పరిమితమైంది. లాభాలుపెరిగినప్పటికీ రూ.11,200 కోట్ల మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆదాయం విషయంలో మాత్రం దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. జనవరి 9న క్యూ3ఎఫ్వై23 ఫలితాలను ప్రకటించిన కంపెనీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నా, లాంగ్‌టర్మ్ గ్రోత్ ఔట్‌లుక్‌లో ధృడమైన వృద్ధి సాధిస్తామని ప్రకటించింది. అలాగే స్పెషల్ డివిడెండ్ రూ.67తోపాటు, 8 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ సీఎండీ రాజేశ్ గోపినాథన్ ప్రకటించారు. 10 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి మరోవైపు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన సంస్థ హెడ్‌కౌంట్ భారీగా క్షీణించింది. 2,197 మంది ఉద్యోగులను తగ్గించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ 28,238 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ప్రస్తుతం తమ ఉద్యోగుల సంఖ్య 6,16,171 నుంచి 613,974 మందికి తగ్గిందని పేర్కొంది. 10 త్రైమాసికాల్లో ఈ స్థాయిల్లో తగ్గడం ఇదే తొలిసారి. ఐటీ పరిశ్రమలో ఆందోళన కలిగించే ఎలివేటెడ్ అట్రిషన్ స్వల్పంగా క్షీణించింది. అట్రిషన్ 21.3 శాతంగా ఉంది, వార్షిక ప్రాతిపదికన గత ఏడాది 21.5 శాతం నుండి స్వల్పంగా క్షీణించింది. రానున్న త్రైమాసికాల్లో ఇది మరింత తగ్గుతుందని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే డిమాండ్ క్షీణించినట్టు కాదనీ, భారీ డిమాండ్‌తో ప్రస్తుతం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నారు. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్క్ష్యంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఫ్రెష్ టాలెంట్, నైపుణ్య శిక్షణమీద ఎక్కువ దృష్టి పెట్టామని లక్కాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
దేశంలో తెలంగాణ రైతుల స్థానం.. అప్పుల్లో 5.. ఆదాయంలో 25
సాక్షి, హైదరాబాద్: మన రైతన్నలు ఆదాయంలో బాగా వెనుకంజలో ఉన్నారు. అప్పుల భారం కూడా భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నెలకు సగటున రూ.10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నాడు. అంటే రోజుకు రూ.340 మాత్రమే. అదే సమయంలో ఒక్కో రైతుకు సగటున రూ.74,121 అప్పు ఉంది. ఇక రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో, ఆదాయంలో 25వ స్థానంలో ఉండటం గమనార్హం. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు దేశంలోని వ్యవసాయ కుటుంబాలు, రైతుల అప్పు, ఆదాయంపై సర్వే జరిగింది. సర్వే వివరాలు ఇటీవల పార్లమెంటులో చర్చకు రాగా.. అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. రైతు కోసం ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా రైతు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగుపడటం లేదు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రూ.313 మాత్రమే కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. తెలంగాణ రైతుల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. రైతు కుటుంబసభ్యుల సగటు ఆదాయం నెలకు రూ.9,403గా ఉంది. ఏడాదికి రూ.1,12,836. అంటే రోజుకు రూ.313 మాత్రమేనన్న మాట. ఇది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సగటు జీతం కంటే దాదాపు సగం తక్కువ. ఇక ఆదాయంలో తెలంగాణ రైతు దేశంలో 25వ స్థానంలో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మేఘాలయ రైతు సగటున నెలకు రూ. 29,348 ఆదాయం పొందుతున్నాడు. పంజాబ్ రైతు రూ. 26,701, హరియాణ రైతు రూ.22,841, అరుణాచల్‌ప్రదేశ్ రైతు రూ. 19,225 పొందుతున్నాడని కేంద్రం తెలిపింది. రైతన్న ధనికుడు కాదని తేలిపోయింది ధనిక రాష్ట్రమని చెబుతున్న తెలంగాణలో రైతన్న ధనికుడు కాదని స్పష్టమైపోయింది. రూ.2.75 లక్షల తలసరి ఆదాయం ఉందని చెబుతున్నా, అది రైతుకు లేదని తేలిపోయింది. దిగుబడి పెరిగింది.. పంటలు బాగా పండిస్తున్నామని చెబుతున్నా, రైతుకు మార్కెట్లో అన్యాయం జరుగుతోంది. రైతుబంధు కౌలు రైతులకు అందడం లేదు. రుణమాఫీ కొందరికే చేశారు. దీంతో అప్పులు పెరిగాయి. రైతులు ఆ రుణం నుంచి బయటపడటం లేదు. కౌలు రైతులకు రైతుబంధు, రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంది. కౌలు రైతులు ఈ రాష్ట్రపు వారు కాదా? వారి బాగోగులు ప్రభుత్వానికి పట్టవా? – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు -
యూట్యూబ్‌తో రూ. 10 వేల కోట్లు.. 7.5 లక్షల పైగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ వ్యవస్థ 2021లో భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 10,000 కోట్ల పైగా తోడ్పాటు అందించింది. అలాగే, 7.5 లక్షల పైచిలుకు ఫుల్‌టైమ్ కొలువులకు సమానమైన ఉద్యోగాలను కల్పించింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రూపొందించిన యూట్యూబ్ ప్రభావ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 4,500 పైగా ఛానల్స్‌కు 10 లక్షలకు మించి సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. వార్షికంగా రూ. 1 లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ఛానల్స్ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2021లో 60 శాతం పైగా పెరిగింది. యూట్యూబ్ ప్రభావంపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన సర్వేలో 4,021 యూట్యూబ్ యూజర్లు, 5,633 మంది క్రియేటర్లు, 523 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. నివేదిక ప్రకారం ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇద్దరు యూజర్లలో ఒకరు తమ కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాలను దక్కించుకోవాలనుకునే యూజర్లలో 45 శాతం మంది, వాటికి అవసరమైన నైపుణ్యాలను సాధించుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ‘యూట్యూబ్‌ను సాంప్రదాయ విద్యాభ్యాసానికి అదనంగా ఒక ప్రయోజనకరమైన సాధనంగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పరిగణించే ధోరణి పెరుగుతోంది. యూట్యూబ్‌తో పిల్లలు సరదాగా నేర్చుకుంటున్నారని దాన్ని ఉపయోగించే పేరెంట్స్‌లో 83 శాతం మంది తెలిపారు. విద్యార్థులు నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని యూట్యూబ్‌ను ఉపయోగించే 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు‘ అని నివేదిక వివరించింది. మహిళల ఆసక్తి: పర్సనల్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం మొదలుకుని స్ఫూర్తినిచ్చే సలహాలు పొందేందుకు, తమ హాబీలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు, కెరియర్.. వ్యాపారాలను నిర్మించుకోవడం వరకు ఇలా తమ జీవితానికి తోడ్పడే ఎన్నో అంశాలు నేర్చుకునేందుకు మహిళలు యూట్యూబ్‌ని ఎంచుకుంటున్నారు. జీవితకాల అభ్యాసానికి యూట్యూబ్ ఎంతో ఉపయోగకరమైన ప్లాట్‌ఫాం అని 77 శాతం మంది మహిళలు తెలిపారు. ప్రతి రోజూ ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని 56 శాతం మంది, తమ ఆకాంక్షలు .. ఐడియాలను పంచుకోవడంలో సహాయపడుతోందని 90 శాతం మంది మహిళా క్రియేటర్లు వివరించారు. చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ! -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ వస్తుందా!
బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్‌కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది ►క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం ►నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం ►తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం ►క్రెడిట్ కార్డ్ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 750లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. -
టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్
ముంబై: డేటా వినియోగం, 4జీ కనెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది. వీటి దన్నుతో క్యూ3లో టెల్కోల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 3-4 శాతం వృద్ధి నమోదు చేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒరిస్సా, హర్యానాలో ఆవిష్కరించిన రేట్ల పెంపును భారతి ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లలోనూ అమలు చేసి, పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పడితే నాలుగో త్రైమాసికంలో సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయం 5 శాతం పైగా వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) దిగువ స్థాయిలో రేట్ల పెంపును ఎయిర్టెల్ రెండు సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేసిన పక్షంలో టెలికం రంగం ఆదాయ వృద్ధిపై పెద్దగా అర్థవంతమైన ప్రభావమేమీ ఉండకపోవచ్చని బీఎన్పీ పారిబా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ, దాన్ని ఇతర సర్కిళ్లకూ విస్తరిస్తే, పోటీ కంపెనీలు కూడా అనుసరిస్తే మాత్రం 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయాలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనూ త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్) టెలికం పరిశ్రమ ఆదాయాలు 3-4 శాతం స్థాయిలో వృద్ధి చెందాయి. నవంబర్ ఆఖర్లో అమలు చేసిన రేట్ల పెంపు ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ సానుకూలంగా కొనసాగింది. ఇక రెండో త్రైమాసికంలో కస్టమర్లు పెద్ద డేటా ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ అవుతుండటం ఆదాయాల వృద్ధికి కలిసి వచ్చింది. జియో, వొడా ఐడియా కీలకం.. పరిశ్రమలో పరిస్థితులను అంచనా వేసుకునేందుకు ఎయిర్టెల్ ఈ నెల తొలినాళ్లలో ఒరిస్సా, హర్యానాలో కనీస టారిఫ్‌ను ఏకంగా 57 శాతం పెంచి రూ. 155కి చేసిన సంగతి తెలిసిందే. పోటీ కంపెనీల ప్రతిస్పందనను కూడా చూసిన తర్వాత ఈ పెంపును కొనసాగించడం లేదా పూర్వ స్థాయికి తగ్గించడం గురించి తగు నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎయిర్టెల్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ మిగతా కంపెనీలు కూడా అదే బాట పడితే మాత్రం టారిఫ్‌ల పెంపును ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఎయిర్టెల్ చర్యలకు ప్రతిస్పందనగా జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) ఎంత మేర టారిఫ్‌లు పెంచుతాయనే దానిపై జనవరి–మార్చి త్రైమాసికంలో టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి ఆధారపడి ఉంటుందని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్ తన బేస్ ప్యాక్ టారిఫ్‌ల పెంపును ఎంత వేగంగా మిగతా సర్కిళ్లకు విస్తరిస్తుంది .. జియో, వీఐ తమ కనీస రీచార్జ్ ప్లాన్లను రూ. 99 నుండి రూ. 125 స్థాయికి పెంచుతాయా లేదా ఎయిర్‌టెల్‌కు సమానంగా నేరుగా రూ. 155కి పెంచేస్తాయా అనే అంశాలతో ఆదాయాలు ప్రభావితం కాగలవని వారు పేర్కొన్నారు. విక్రేతల మార్కెట్.. విశ్లేషకుల అంచనాలు ఒకవేళ పోటీ కంపెనీలు కూడా ఎయిర్‌టెల్‌ను అనుసరించిన పక్షంలో టెలికం పరిశ్రమ.. విక్రేతల మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సందర్భంలో రేట్లను వినియోగదారుల డిమాండ్ కాకుండా విక్రేతలే నిర్దేశించే అవకాశం ఉంటుంది. టెలికం రంగంలో ఇలాంటి పరిస్థితి కనిపించి దాదాపు దశాబ్ద కాలం పైగా గడిచిపోయింది. రేట్లను నిర్దేశించే శక్తి కంపెనీల దగ్గర ఉన్నప్పుడు ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు ఎంచుకునేందుకు ప్రత్యా మ్నాయ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు, టారిఫ్‌ల పెంపునకు ఇక్కడితో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో మరో విడత పెంపు అవసరం ఉంటుందని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. రేట్లను పెంచుతున్నా త్రైమాసికాల వారీగా టెల్కోల యూజర్ల స్థాయి దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుండటంతో.. టారిఫ్‌లను మరింతగా పెంచేందుకు టెలికం సంస్థలకు అవసరమైన ధీమా లభించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
సిరులు కురిపిస్తున్న శ్రీవారి హుండీ.. వరుసగా తొమ్మిదో నెల రూ.100 కోట్లు..
సాక్షి, తిరుమల: శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఈ ఏడాది వరుసగా తొమ్మిదో నెల హుండీ ఆదాయం రూ.100 కోట్లను దాటింది. ఈ వార్షిక సంవత్సరం (టీటీడీలో మార్చి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు)లో హుండీ ద్వారా రూ. 1,000 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. అయితే, మార్చి నుంచి నవంబరు వరకు 9 నెలలు నెలకు రూ. 100 కోట్లు దాటి హుండీ ఆదాయం వచ్చింది. గత 8 నెలల్లోనే రూ.1,164 కోట్లను దాటేసింది. నవంబరు నెలలో రూ.127.30 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారికి రూ.1,600 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుందని టీటీడీ భావిస్తోంది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఇలా హుండీ ద్వారా శ్రీవారికి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇప్పటికే టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.15,938 కోట్లు దాటగా, బంగారం నిల్వ 10,258 కేజీలు దాటింది. 1950వ సంవత్సరం వరకు శ్రీవారికి నిత్యం లభించే హుండీ ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండగా, 1958లో మొదటిసారి లక్ష రూపాయలు దాటింది. 1990కి నిత్యం కోటి రూపాయలు పైగా హుండీ ఆదాయం లభించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏటేటా పెరుగుతోంది. 2010 అక్టోబర్ 23న రూ.3.6 కోట్లు, 2011 నవంబర్ 1న రూ.3.8 కోట్లు, 2012 జనవరి 1న రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చింది. 2012 ఏప్రిల్ ఒకటో తేదీన అత్యధికంగా రూ.5.73 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జూలై 4వ తేదీకి రూ.6 కోట్లు దాటేసింది. 2015–16 సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.1,000 కోట్లు దాటగా, 2019 – 20లో రికార్డు స్థాయిలో రూ.1,313 కోట్లు రావడం విశేషం. కోవిడ్ కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2020 –21లో రూ.731 కోట్లు, 2021–22లో రూ.933 కోట్లు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది. వరుసగా 9వ నెల కూడా స్వామికి లభించిన హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. కోవిడ్ కారణంగా రెండేళ్లు శ్రీవారి దర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆదాయం పెరుగుతున్నట్లు టీటీడీ చెబుతోంది. చదవండి: (రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి) -
పాడి రైతుల ఆదాయం పెంపుపై దృష్టి సారించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వ్యవసాయానికి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న పాడి రంగాన్ని కచ్చితమైన ఆదాయ వనరుగా మలచుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర అధికారులతో కలసి మంత్రి తలసాని గురువారం పాడిరంగం అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు, చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. తలసాని మాట్లాడుతూ...పాడి పశువుల కొనుగోలు, పశువుల కొట్టాల నిర్మాణం, బీమా వంటి వాటి కోసం రుణ మార్గాలను కూడా అన్వేషించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పాల ఉత్పత్తి దారుల సహకార సంఘా లు, బ్యాంకులు, పాల ఉత్పత్తి దారుల మధ్య ఒప్పందం కు దుర్చుకునేలా మార్గం సుగమం చేయాలని సూచించారు. -
అప్డేటెడ్ ఐటీఆర్‌ల రూపంలో రూ.400 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల సవరణకు అనుమతించడం వల్ల.. కొత్తగా 5 లక్షల సవరించిన (అప్డేటెడ్) రిటర్నులు దాఖలు కావడంతోపాటు, రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం కేంద్రానికి వచ్చింది. ఫైనాన్స్ యాక్ట్, 2022లో సవరించిన రిటర్నుల క్లాజును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఒకసారి రిటర్నులు సమర్పించిన అసెస్మెంట్ ఏడాది నుంచి, రెండేళ్లలోపు సవరణలు దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఐటీఆర్–యు పత్రం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చింది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైనా ఆదాయం వెల్లడించకపోయి ఉంటే, ఈ నూతన ఫామ్ రూపంలో సవరణలు దాఖలు చేసుకునే అవకాశం లభించింది. దీంతో 5 లక్షల మంది ఐటీఆర్–యు దాఖలు చేసి రూ.400 కోట్ల పన్ను చెల్లించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిబంధనల అమలు సులభతరం అయిందని, కార్పొరేట్లు సైతం సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ‘‘ఒక కంపెనీ సవరించిన రిటర్నులు సమర్పించి రూ.కోటి పన్ను చెల్లించింది. స్వచ్ఛందంగా నిబం«దనలను అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. ప్రజలు పన్ను చెల్లించి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు’’అని ఆ అధికారి వాస్తవ పరిస్థితి వివరించారు. సవరణ రిటర్నుల్లో, గతంలో పేర్కొనని ఆదాయ వివరాలు వెల్లడిస్తున్నట్టు అయితే అందుకు కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
యాదాద్రీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం.. ఆదాయం రెండింతలు!
యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి ఈ కార్తీక మాసం కలిసొచ్చింది. గతేడాది కార్తీక మాసంతో పోల్చుకుంటే ఈసారి అన్ని విభాగాల ద్వారా ఆదాయం డబుల్ అయింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు 50వేల కంటే ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నిత్యా ఆదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. ఇక సత్యనారాయణస్వామి వ్రతాలు సైతం ఈసారి అధికంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ గీతారెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆదాయం రెండింతలు.. గతేడాది కార్తీక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా, ఈసారి రూ.14,66,38,097 ఆదాయం వచ్చింది. యాదాద్రి ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైన తర్వాత క్షేత్రానికి భక్తులు రాక అధికంగా పెరిగింది. స్వయంభూ దర్శనం పునఃప్రారంభం అయిన తరువాత మొదటిసారి వచ్చిన కార్తీక మాసం కావడంతో స్వామివారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వ్రతాలతో రూ.1.71కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధికంగా సత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఈ కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది బాలాలయం ఉన్న సమయంలో 19,176 వ్రతాలు మాత్రమే జరిపించారు. రికార్డు స్థాయిలో నిత్యాదాయం.. కార్తీకమాసం చివరి రెండు ఆదివారాలు 50వేలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 13న ఆదివారం రోజున స్వామి వారికి రూ.1,09,82,446 నిత్య ఆదాయం రాగా, 20న ఆదివారం రోజున రూ.1,16,13,977 నిత్య ఆదాయం వచ్చింది. కార్తీక మాసం చివరి ఆదివారం వచ్చిన ఆదాయమే ఆలయ చరిత్రలో అధికమని అధికారులు వెల్లడించారు. (క్లిక్ చేయండి: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు) -
అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం!
జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. అవేమిటంటే.. ఇలా ఎన్నెన్నో .. యజమాని తన ప్రేమను కాసుల్లో కురిపిస్తే.. ప్రతి కాసు మీద పన్నుకట్టాల్సిందే. ఇంత వరకు బాగానే ఉంది. మీరు ప్రస్తుతం ఇలాగే పన్ను కడుతున్నారు. ఏ సమస్యా లేదు. కానీ ఈ కింది వారిని ఒకసారి గమనించండి. లెక్కలమాస్టారికి లెక్క లేదు .. నగరంలో నంబర్ వన్ లెక్కల మాస్టారు నగధరరావుగారు. ఉదయం 4 గంటల నుండి ట్యూషన్లు, కాలేజీ టైమింగ్స్ తర్వాత నిశిరాత్రి దాకా కొనసాగుతుంటాయి. కానీ ట్యూషన్ ఫీజుల మీద పన్ను కట్టలేదు. అంతే కాకుండా పేపర్ సెట్టింగ్, వేల్యుయేషన్, ఇన్విజిలేషన్ మీద వచ్చేదీ ఎక్కడా అగుపడదు. డ్రిల్లు మాస్టారు యోగేశ్వర్రావుగారు కూడా అదే బాపతు. ఆయన యోగాలో ఎక్స్పర్టు. నగధరరావు గారిలా కాకపోయినా మూడుబ్యాచ్లు .. అరవై మంది పిల్లలు. ఇలా చిట్టీలు నడిపే చిదంబరం, బుక్స్ అమ్మే బుచ్చిరాజు, ఆవకాయలు .. పచ్చళ్లు పెట్టే అనంతయ్య, జ్యోతిష్యం చెప్పే జోస్యుల, సంగీతం చెప్పే సంగీత రావు, బ్యూటీపార్లరు బుచ్చమ్మ, హోమియో డాక్టర్ హనుమాన్లు, జంతికలు .. వడియాలు అమ్మే జనార్దన రావు, జీడిపప్పు .. కిస్మిస్ అమ్మే జీవనాధం, బట్టలు అమ్మే భుజంగం .. మొదలైనవారంతా మనకు కనిపిస్తూనే ఉంటారు. వీరి మీద మనకేం అసూయ లేదు .. ఏడుపూ ఉండదు. కానీ చట్టాన్ని పక్కన పెట్టి వీరు రాజ్యం ఏలుతున్నారు. ‘‘మేం కష్టపడి సంపాదిస్తున్నాం. తప్పేంటి?’’, ‘‘రెక్కాడితే గానీ డొక్కాడదు’’, ‘‘కష్టేఫలి’’, ‘‘చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడు’’ అంటూ వాదనకు దిగొద్దు. డిపార్ట్మెంట్ వారి దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కృత్రిమ మేథస్సు ద్వారా ఎంతో సేకరించారు. అసలే ‘‘డిజిటలైజేషన్ డేస్’’ .. తగిన జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి సైడు ఆదాయాలన్నింటిపైనా పన్ను చెల్లించండి. -
ఫిఫా ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం
ఇప్పుడంటే క్రికెట్లో ఐపీఎల్‌కు కాసుల వర్షం కురుస్తోంది కానీ ఫుట్‌బాల్‌లో అలా కాదు. కొన్ని దశాబ్దల కిందటి నుంచే ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వరల్డ్‌కప్ ఆదాయం తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ ఎడిషన్స్ అన్నింటిని కలిపినా కూడా ఫిఫా వరల్డ్‌కప్‌లో వచ్చే ఆదాయంలో సగం కూడా ఉండదు. అంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ మరొక రోజులో ఖతార్ వేదికగా మొదలుకానుంది. మరి ఫిఫాకు వస్తున్న ఆదాయం ఎంత.. ఈ స్థాయిలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకుందాం. 2018లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌కు రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ఆ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలవగా.. క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆ వరల్డ్‌కప్‌లో ఫిఫాకు వచ్చిన ఆదాయం 460 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో సుమారుగా రూ.37,500 కోట్లు. ఇప్పుడు ఖతార్ వరల్డ్‌కప్‌లోనూ మొత్తంగా 44 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తోంది. అందులో విజేతకే 4.4 కోట్ల డాలర్లు దక్కుతుంది. మన కరెన్సీలో సుమారు రూ.358 కోట్లు. ఇక నాలుగేళ్లకోసారి ఫిఫా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా 2015-18 కాలానికిగాను ఫిఫా మొత్తంగా 640 కోట్ల డాలర్లు (సుమారు రూ.52 వేల కోట్లు) సంపాదించింది. ఫుట్‌బాల్ వ్యవహారాలు చూసుకునే సంస్థ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (FIFA).. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ సహా, నిర్వాహక దేశం ఆర్గనైజింగ్ కమిటీకి, రవాణాకు, టీమ్స్, సపోర్ట్ స్టాఫ్ వసతి ఏర్పాట్లకు, ఆతిథ్య దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ఇలా ఎంతో ఖర్చు చేస్తుంది. ఈ విశ్వంలో ఎక్కువమంది చూసే ఆటగా పేరున్న ఫుట్‌బాల్‌లో ఫిఫా సంపాదన కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఫిఫా ఆదాయం ఇలా ఫిఫా సంపాదనలో చాలా వరకూ టీవీ హక్కుల అమ్మకం ద్వారానే వస్తుంది. వరల్డ్‌కప్, ఇతర ఇంటర్నేషనల్ టోర్నీల టీవీ హక్కులను ఫిఫా భారీ మొత్తానికి అమ్ముతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు 640 కోట్ల ఆదాయంలో 460 కోట్లు కేవలం టీవీ హక్కుల ద్వారానే రావడం విశేషం. ఇక మార్కెటింగ్ హక్కుల ద్వారా కూడా ఫిఫా పెద్ద మొత్తమే అందుకుంటుంది. వరల్డ్కప్లాంటి మెగా ఈవెంట్లలో బడా కంపెనీలు తమ అడ్వర్టైజ్మెంట్ల కోసం భారీ మొత్తాలు ఫిఫాకు చెల్లిస్తాయి. 2015-18 నాలుగేళ్ల సైకిల్లో ఫిఫాకు ఇలా మార్కెటింగ్ హక్కుల అమ్మకం ద్వారా ఏకంగా 166 కోట్ల డాలర్ల (సుమారు రూ.13500 కోట్లు) ఆదాయం వచ్చింది.ఇక టికెట్ల అమ్మకాలు, ఆతిథ్యం ద్వారా కూడా ఫిఫాకు కొంత ఆదాయం సమకూరుతుంది. అయితే టీవీ, మార్కెటింగ్ హక్కులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2015-18 సైకిల్లో వీటి ద్వారా ఫిఫాకు 7.12 కోట్ల డాలర్లు (సుమారు రూ.580 కోట్లు) సమకూరింది. ఫిఫా తన పేరును వాడుకోవడానికి కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తుంది. వీడియో గేమ్స్ చేసే ఈఏ 20 ఏళ్లకుగాను ఫిఫా పేరు వాడుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఏడాదికి 15 కోట్ల డాలర్లు ఫిఫాకు చెల్లిస్తుంది. గతేడాది లైసెన్సింగ్, మర్చండైజ్, రీటెయిల్, గేమింగ్ ద్వారా ఫిఫాకు 18 కోట్ల డాలర్లు వచ్చాయి. చదవండి: ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్‌కు అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ? -
గృహోపకరణాల పరిశ్రమ@ రూ.1.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (ఏసీఈ) పరిశ్రమ వచ్చే మూడేళ్లలో రెట్టింపై రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ మండలి సీఈఏఎంఏ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ మార్కెట్ పరిమాణం రూ.75 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఏసీఈ మార్కెట్లలో ఒకటని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు భారత్ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా మారుతున్నట్టు చెప్పారు. 2021 మొత్తం మీద ఏసీఈ పరిశ్రమలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 198 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2022 జూన్ నాటికే రెట్టింపు స్థాయిలో 481 మిలియన్ డాలర్లు (రూ.3,888 కోట్లు) వచ్చినట్టు బ్రగంజా తెలిపారు. సీఈఏఎంఏ వార్షిక సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం పాల్గొన్నారు. తయారీ కేంద్రాల ఏర్పాటు.. ఇప్పుడు కొన్ని అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎం) భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు బ్రగంజ చెప్పారు. ప్రభుత్వం ఏసీలకు సంబంధించి ప్రకటించిన పీఎల్ఐ పథకం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న, పెద్ద గృహోపకరణాలకు సంబంధించి ఇదే మాదిరి పీఎల్ఐ పథకాలను ప్రకటించినట్టయితే దేశీయంగా తయారీ మరింత ఊపందుకుంటుందని, మరింత మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఎరిక్ బ్రగంజ అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర ఉత్పత్తుల విభాగాలకు సంబంధించి పీఎల్ఐ పథకం ప్రకటించాలని కోరుతున్నాం. ఇలా చేయడం వల్ల దేశంలో విడిభాగాల తయారీ వసతులు ఏర్పడతాయి. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఆత్మనిర్భర భారత్ పిలుపునకు ఇది మద్దతుగా నిలుస్తుంది’’అని బ్రగంజ వివరించారు. వృద్ధికి భారీ అవకాశాలు ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏసీఈ పరిశ్రమలోని కొన్ని విభాగాలకు సంబంధించి భారత్‌లో విస్తరణ ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నట్టు బ్రగంజ చెప్పారు. కనుక వృద్ధికి భారీ అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘‘కరోనా వల్ల గత రెండు సంవత్సరాల్లో పరిశ్రమ వృద్ధిని చూడలేదు. ఇప్పుడు తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది వేసవిలో కంప్రెషర్ ఆధారిత కూలింగ్ ఉత్పత్తులు అధికంగా అమ్ముడయ్యాయి. పరిశ్రమ ఎంతో ఆశాభావంతో ఉంది. నూతన టెక్నాలజీని అందుపుచ్చుకుని, భారత్‌లో తయారీ కింద స్థానికంగా తయారు చేసేందుకు సుముఖంగా ఉంది. కొన్ని స్టార్టప్‌లు సైతం పరిశ్రమకు విలువను తెచ్చిపెడుతున్నాయి’’అని బ్రగంజ వివరించారు. పరిశ్రమలో మధ్యస్థ, ఖరీదైన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. జీఎస్టీ విధానం కింద పన్నుల పరంగా పరిశ్రమకు ప్రోత్సాహం అవసరమన్నారు. టీవీలకు సంబంధించి స్క్రీన్ సైజుతో సంబంధం లేకుండా ఏకీకృత పన్ను రేటు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించారు. ప్రస్తుతం 32 అంగుళాల టీవలపై 18 శాతం జీఎస్టీ ఉంటే, అంతకుపైన సైజుతో ఉన్న వాటిపై 28 శాతం జీఎస్టీ అమలవుతున్నట్టు చెప్పారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలను 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు తీసుకురావాలని కోరారు. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
ఆదాయంలో ఎంఎస్ఎంఈలో జోరు
ముంబై: కరోనా మహమ్మారి ముందుస్థాయికి సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు(ఎంఎస్ఎంఈలు) నెమ్మదిగా చేరుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో దాదాపు అన్ని సంస్థలూ 2020 స్థాయి ఆదాయాన్ని సాధించగలవని అంచనా వేసింది. అయితే అప్పటి మార్జిన్లను సగానికిపైగా కంపెనీలు అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది. విలువరీత్యా 43 శాతం సంస్థలు కరోనా ముందు ఏడాది స్థాయిలో లాభదాయకతను సాధించలేకపోవచ్చని తెలియజేసింది. పెరిగిన కొన్ని కమోడిటీ ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయలేకపోవడం, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వివరించింది. ఎంఎస్ఎంఈ రంగంలోని 69 రంగాలు, 67 క్లస్టర్లు ఆధారంగా క్రిసిల్ నివేదికను రూపొందించింది. ఉమ్మడిగా వీటి ఆదాయం రూ. 56 లక్షల కోట్లుకాగా.. జీడీపీలో 20–25 శాతం వాటాకు సమానమని క్రిసిల్ తెలియజేసింది. నివేదిక ప్రకారం.. బౌన్స్‌బ్యాక్ ఆదాయాన్ని పరిగణిస్తే ఈ ఏడాది మొత్త ఎంఎస్ఎంఈ రంగం కరోనా ముందుస్థాయితో పోలిస్తే 1.27 రెట్లు వృద్ధిని సాధించే అవకాశముంది. అయితే విలువరీత్యా 43 శాతం కంపెనీలు 2020 స్థాయి నిర్వహణ మార్జిన్లు అందుకోలేకపోవచ్చు. వీటిలో 30 శాతం కెమికల్స్, పాలు, డెయిరీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలుకాగా.. చమురు, పాల ధరలు ప్రభావం చూపనున్నాయి. మిగిలిన 13 శాతంలో ఫార్మా(బల్క్ డ్రగ్స్), జెమ్స్ అండ్ జ్యువెలరీ నుంచి నమోదుకానున్నాయి. రూపాయి పతనం మార్జిన్లను దెబ్బతీయనుంది. మహమ్మారికి ముందు డాలరుతో మారకంలో రూపాయి విలువ 70.9కాగా.. 2022 అక్టోబర్‌లో 82.3కు జారింది. ఇక ముడిచమురు ధరలు సైతం 2020లో బ్యారల్‌కు సగటున 61 డాలర్లుకాగా.. ఏప్రిల్– అక్టోబర్ మధ్య 104 డాలర్లకు చేరింది. చమురు, చమురు డెరివేటివ్స్‌ను కెమికల్స్, డైలు, పిగ్మెంట్స్, రోడ్ల నిర్మాణం తదితర రంగాలలో వినియోగించే సంగతి తెలిసిందే. దీంతో కెమికల్స్, రోడ్ల నిర్మాణం రంగంలో 2.5–3 శాతం మార్జిన్లు నీరసించే వీలుంది. పాలు, డెయిరీ తదితరాలలో ఈ ప్రభావం 0.5–1 శాతానికి పరి మితం కావచ్చు. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!
గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?‘ ఈ మధ్య డిపార్ట్మెంట్ వారు సేకరించిన సమాచారం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు ‘నో‘ అని సమాధానం వచ్చింది. వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది తమకు అదనంగా వచ్చే ఆదాయాన్ని తమ తమ రిటర్నులలో ‘డిక్లేర్‘ చేయడం లేదని తెలిసింది. తేలింది. అలాంటి వారెవరో తెలుసుకోవాలనుందా? ఇంటి మీద అద్దె ఎంతెంతయ్యా? ‘నేను ఎప్పుడూ అద్దెను బ్యాంకులో డిపాజిట్ చేయను. నాకు అక్షరాలా నగదు చేతిలో పడాల్సిందే. రశీదు ఇవ్వను. ఎప్పుడూ వ్యాపారస్తులు .. అటువంటి వారికే ఇస్తాను. ఉద్యోగస్తులకు ఇవ్వను‘ అని సగర్వంగా చెప్తాడు మూడు అంతస్తులున్న ముత్యాల రావు. ‘ఇల్లు, ఫ్లాట్లు నా పేరు మీదే ఉన్నాయి. కాని అద్దె ప్రతి నెలా మా ఆవిడ బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. పాన్ నంబరు మా ఆవిడదే. రశీదు ఇస్తాను. కానీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు దాటదు‘ అని తానెంతో తెలివిగా ప్లానింగ్ చేసుకుంటున్నానని సంబరపడతాడు నాలుగు ఫ్లాట్లున్న నాగభూషణ రావు గారు. ‘మనం ఎప్పుడూ 50:50నే. సగం బ్యాంకులో జమ.. మిగతా సగం నగదు. నగదు ఇస్తే కానీ రశీదు ఇవ్వను. ఇంటికి రిపేర్లు, పన్నులు, సున్నాలు అన్నింటికీ మనమే చెల్లించాలి కదా. అదెలా రాబట్టాలి?‘ ఇలా ఎదురు ప్రశ్న వేసి బేతాళుడి ప్రశ్నలాగా ఫీల్ అవుతాడు పిచ్చేశ్వర్రావు గారు. ‘వాళ్లిచ్చే 30% రిపేరుకు ఏం సరిపోతుంది. కరోనా తర్వాత రూ. 3 లక్షలు ఖర్చు పెట్టా. అందుకని సగం అద్దె చూపిస్తా‘ .. ఇదీ చాణక్య రావుగారి స్టేట్మెంటు. పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరు పేరాశ రావుగారిది కూడా ఇదే వరస! ఆయన సరసనే చేరారు ఎందరో ఓనర్లు. ‘ఐకమత్యమే మహాబలం‘ అని జ్ఞాపకం చేసుకుంటూ. ‘మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విల్లా వాడిదే. అక్కడ పన్ను ఎక్కువ. అందుకని రెంటు నా అకౌంటులో వేసుకుంటాను. వాడికి పాన్ లేదు. నేను ఇది ఆదాయంగా చూపించను‘ మితిమీరిన తెలివితేటలున్న మృత్యుంజయ రావు మనసులోని మాట ఇది. ‘నాకు రెండు అగ్రిమెంట్లు. ఒకటి అద్దెది .. సగం. మిగతా సగానికి ఫర్నిచర్, ఏసీ, వాషింగ్ మెషిన్, మంచాల నిమిత్తం అద్దె. ఈ అద్దె చూపించను‘ మందహాసంతో మధుసూదన రావుగారి ముక్తాయింపు. ఇలా అద్దె కింద వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ఉండటానికి ఎన్నో అడ్డదార్లు .. ఎగవేతకు ఆలోచనలు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.. చట్టం ఒప్పుకోదు. పన్ను కట్టడానికి పంగనామాలు .. చట్టానికి తూట్లు .. ఎగవేతకు అగచాట్లు.. దొరికిన తర్వాత తప్పని పాట్లు. ఇకనైనా కట్టిపెట్టాలి ఈ ముచ్చట్లు. నగదు అయినా, బ్యాంకు ద్వారా అయినా మీరు ఓనర్ అయితే మీకు చేతికొచ్చే అద్దె ఏమాత్రం తగ్గించకుండా చూపించండి. ఫ్లాట్ల విషయంలో నెలసరిగా మెయింటెనెన్సును అద్దెకు కలపకుండా, డైరెక్టుగా వెల్ఫేర్ అసోసియేషన్‌కి ఇప్పించండి. కొంత ఉపశమనం ఉంటుంది. -
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ నష్టాలు, రూ.7800 కోట్లకు పైమాటే!
సాక్షి,ముంబై: ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ ఈ క్వార్టర్లో భారీగా నష్టపోయింది. అయితే ఈ పండుగ సీజన్లో భారతదేశంలో మొత్తం విక్రయాలలో అగ్రగామిగా ఉన్న కారణంగా ఆదాయం బాగా పుంజుకుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. క్యూ2లో ఫ్లిప్‌కార్ట్ నికర ఆదాయం దాదాపు 20 శాతం పెరిగింది. ఆదాయం పుంజుకుని రూ. 61,836 కోట్లుగా ఉంది. (ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?) ఫ్లిప్‌కార్ట్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాని బిజినెస్-టు-బిజినెస్ యూనిట్ ఫ్లిప్‌కార్ట్ ఇండియా, బిజినెస్-టు-కన్స్యూమర్ ఇ-కామర్స్ యూనిట్ మొత్తం నష్టాలు రూ.7,800 కోట్లకు చేరాయి. ఇందులో మింత్రా, ఇన్‌స్టాకార్ట్ మొదలైన ఫిప్కార్ట్ గ్రూప్ సంస్థల ఫలితాలు కూడా ఉన్నాయి. కాగా రెండు సంస్థల ఉమ్మడి నష్టం గత ఏడాది(2020-21) రూ. 5,352 కోట్లుగా ఉంది. 2020-21లో ఫ్లిప్‌కార్ట్ ఆదాయం రూ. రూ. 51,465 కోట్లు. ఫ్లిప్‌కార్ట్ ఇండియా రూ. 43,349 కోట్లు, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ సహకారంతో రూ. 8,116 కోట్లుగా ఉంది. సెప్టెంబరు చివరి వారంలో జరిగిన ఫస్ట్ వీక్ పండుగ సీజన్ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్ 62 శాతం లేదా 24,800 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. మొత్తం అమ్మకాల విలువ రూ. 40,000 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే? -
అదిరిపోయే ఐడియాలు..ప్రతి నెలా ఆదాయం కావాలా?
ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. స్థిరమైన ఆదాయం ఉండాలి కానీ, ఇక్కడ రిస్క్ దాదాపు ఉండకూడదనుకునే వారి ముందున్న ఏకైక మార్గం డెట్ సాధనాలే. ఉద్యోగ విరమణ చేసిన వారికి.. అప్పటి వరకు నెల నెలా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. పింఛను ఏర్పాటు ఉన్న వారికి, ఆ తర్వాత కూడా ఎంతో కొంత మొత్తం ప్రతి నెలా చేతికి అందుతుంటుంది. కానీ, ఆ విధమైన ఏర్పాటు లేని వారు ఇతర ప్రత్యామ్నాయాలను చూడాల్సిందే. క్రమం తప్పకుండా ఆదాయం కోసం అందుబాటులో ఉన్న సాధనాల గురించి తెలిపే కథనం ఇది... ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్‌లు ప్రతి నెలా వడ్డీని చెల్లించే ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం ఆఫర్ చేస్తాయి. వడ్డీ ఆదాయం సేవింగ్స్ అకౌంట్లోనే జమ అవుతుంది. కనుక కావాల్సినప్పుడు ఆ మొత్తాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. త్రైమాసికం వారీగా, ఏడాదికోసారి వడ్డీని చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యాంక్‌ల్లో నెలసరి ఆదాయం (మంత్లీ ఇన్కమ్) చెల్లించే డిపాజిట్లపై వడ్డీ రేటు 10 ఏళ్ల కాల వ్యవధికి గరిష్టంగా 6.5 శాతం వరకు ఉంది. బ్యాంక్‌ల మధ్య ఈ రేటు వేర్వేరుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు నిండిన) బ్యాంకులు అర శాతం అధికంగా ఆఫర్ చేస్తున్నాయి. అనుకూలం/ప్రతికూలం బ్యాంక్‌ల్లో డిపాజిట్లు ఎంతో సౌకర్యం. బ్యాంకు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు లేదంటే ప్రముఖ ప్రైవేటు బ్యాంకులను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. మరీ చిన్న బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకుల్లో కొంత అదనపు రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ, ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒక డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాంకు సంక్షోభంలో పడితే ఈ మొత్తం రావడానికి సమయం పట్టొచ్చు. అందుకని ముందే పటిష్ట బ్యాంకులను ఎంపిక చేసుకుంటే సరి. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వృద్ధులు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల ఆదాయంపై పన్ను లేదు. ఇంతకుమించిన ఆదాయం వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్ అమలు చేస్తుంటాయి. కనుక ఆదాయపన్ను వర్తించని వారు ఫామ్ 15జీ/హెచ్ సమర్పిస్తే సరిపోతుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ ఇది ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే, ప్రతి నెల వడ్డీ ఆదాయాన్ని పోస్టల్ సేవింగ్ అకౌంట్లో జమ చేయడం జరుగుతంది. దీనిపై 6.6 శాతం రేటు ప్రస్తుతం అమల్లో ఉంది. ఒక్కరు అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. జాయింట్‌గా అయితే ఈ పరిమితి రూ.9 లక్షలుగా ఉంది. అనుకూలం/ప్రతికూలం బ్యాంకులతో పోలిస్తే కాస్తంత వడ్డీ రేటు ఇందులో ఎక్కువ. పైగా ఇందులో పెట్టుబడులకు భారత ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. కాకపోతే, బ్యాంకు డిపాజిట్ల మాదిరి సౌకర్యం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో ఉండదు. పోస్టాఫీసుకు వెళ్లే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉపసంహరణకు కూడా వెళ్లాలి. వృద్ధులు, చిరునామా మారే వారికి ఇది అసౌకర్యం. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయంలో చూపించి చెల్లించాలి. ఐదేళ్లలోపు క్లోజ్ చేస్తే పెనాల్టీ పడుతుంది. బ్యాంకుల్లో ఎలాంటి పెనాల్టీలు ఉండవు. కంపెనీల ఎన్సీడీలు కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి కంపెనీల ఎన్సీడీలను షేర్ల మాదిరే కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. వడ్డీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటిల్లో వడ్డీ రేటు 6–11 శాతం మధ్య ఉంటుంది. ఎన్సీడీల కాల వ్యవధి 3–8 ఏళ్ల మధ్య ఉంటుంది. ఏఏఏ రేటెడ్ కలిగిన ఎన్‌సీడీల్లో పెట్టుబడులు పెట్టడం వరకే పరిమితం కావాలి. అనుకూలం/ప్రతికూలం బ్యాంకుల కంటే వడ్డీ రేటు ఎక్కువ. కానీ, ఎటువంటి హామీ ఉండదు. డీమ్యాట్ ఖాతా ఉంటే సులభంగా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే టీడీఎస్ పడదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ఎన్సీడీల కొనుగోలు, విక్రయాల పరంగా లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ డెట్ లేదా ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుని, ప్రతి నెలా నిర్ణీత మొత్తం లభించేలా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై రాబడి బ్యాంకు డిపాజిట్ల స్థాయిలోనే 5–6 శాతం (వార్షిక) మధ్య ఉంటుందని అనుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, పథకం పనితీరు ఆధారంగా స్వల్ప మార్పులు ఉండొచ్చు. కావాల్సిన ఆదాయం ప్రతి నెలా వచ్చేలా ఇన్వెస్టర్లు తమ స్వేచ్ఛకొద్దీ ఎస్‌డబ్ల్యూపీని నిర్ణయించుకోవచ్చు. రాబడి మేరకు తీసుకుంటే ఫర్వాలేదు. అది చాలదనుకుంటే పెట్టుబడి నుంచి కూడా కొంత మొత్తం తీసుకున్నట్టు అవుతుంది. అనుకూలం/ప్రతికూలం ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పన్ను పరంగా ఇది మెరుగైన సాధనం. అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి అనుకూలం. పెట్టుబడి, ఉపసంహరణ అంతా సులభంగా ఉంటుంది. ఆన్లైన్లోనే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ అన్నవి డెట్, ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ కొన్ని సందర్భాల్లో తప్పించి దాదాపుగా ఉండదు. యాన్యుటీ ప్లాన్లు బీమా కంపెనీలు యాన్యూటీ ప్లాన్లను ఆఫర్ చేస్తుంటాయి. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే నిర్ణీత రేటుపై ప్రతి నెలా ఇవి చెల్లింపులు చేస్తాయి. 60 ఏళ్లు దాటిన వారికి అయితే పెట్టుబడి పెట్టిన మరుసటి నెల నుంచి చెల్లింపులు చేసే ఇమీడియట్ యాన్యూటీ ప్లాన్లు, ఇంకా రిటైర్మెంట్కు సమయం ఉన్నవారి కోసం డిఫర్డ్ యాన్యూటీ ప్లాన్లు ఉన్నాయి. పెన్షన్ కోరుకునే వారు ఇమీడియట్ యాన్యూటీలను ఎంపిక చేసుకోవాలి. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వారు సైతం 60 ఏళ్లు వచ్చిన తర్వాత సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతమే వెనక్కి తీసుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యూటీ ప్లాన్‌ను తీసుకోవడం తప్పనిసరి. ఎల్ఐసీలో జీవన్ అక్షయ్ పెన్షన్ ప్లాన్, జీవన్ శాంతి యూన్యూటీ ప్లాన్లే. వీటిల్లో రాబడి 4–7 శాతం మధ్య ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం యాన్యూటీ ప్లాన్ల కొనుగోలు సులభం. బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా ఆదాయం జమ అవుతుంది. ఇందులో ఆదాయానికి, పెట్టుబడికి పూర్తి గ్యారంటీ ఉంటుంది. యాన్యూటీ ప్లాన్ ఒక్కసారి కొనుగోలు చేశామంటే జీవితాంతం కొనసాగించాల్సిందే. బ్యాంకు ఎఫ్‌డీల కంటే రాబడి తక్కువ. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇదేమంత ఆకర్షణీయమైన సాధనం కాదు. రియల్ ఎస్టేట్ అద్దెలు అద్దెలు కూడా క్రమం తప్పకుండా ఆదాయ మార్గమే. నివాసం అయితే రాబడి 1–4 శాతం మధ్యే ఉంటుంది. వాణిజ్య ప్రాపర్టీ అయితే రాబడి 5–12 శాతం మధ్య ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం ఏటేటా ఎంతో కొంత చొప్పున అద్దె ఆదాయం పెరుగుతుంది. కనుక ద్రవ్యోల్బణం నుంచి రక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కేవలం ఆదాయం కోణంలోనే ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టలేము. ఎందుకంటే కావాల్సినప్పుడు వేగంగా అమ్ముకునే వెసులుబాటు అంతగా ఉండదు. ప్రాపర్టీ కొనుగోలుకు అధిక పెట్టుబడి అవసరం అవుతుంది. పన్ను ఆదా బాండ్లు.. అధిక ఆదాయపన్ను పరిధిలోని వారికి ఇవి మరింత అనుకూలం. పన్ను లేని ఆదాయాన్ని అందుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత కాలవ్యవధికి ముందు బాండ్లలోని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే కనుక, అప్పుటి వరకు పొందిన లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. గతంలో ఏటా ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసేది. గత కొన్నేళ్లుగా వీటి జారీ లేదు. సెకండరీ మార్కెట్ నుంచి (డీమ్యాట్ ఖాతా ఉన్నవారు) కొనుగోలు చేసుకోవచ్చు. రాబడి 6–6.50 శాతం శ్రేణిలో వస్తుంది. అనుకూలం/ప్రతికూలం వడ్డీ ఆదాయంపై పన్ను లేకపోవడం సానుకూలం. బ్యాంకు ఎఫ్డీలకు తగ్గకుండా ఆదాయం ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో వస్తుంది. అదే బ్యాంకు ఎఫ్‌డీల ఆదాయం అయితే పన్ను పరిధిలోకి వస్తుంది. దీర్ఘకాలం పాటు ఇందులో పెట్టుబడులు కొనసాగించాల్సి రావడం అందరికీ అనుకూలం కాకపోవచ్చు. ముందే తీసుకుంటే వడ్డీ ఆదాయంపై పన్ను పడుతుంది. ఈ బాండ్లలో ఎక్కువ వాటికి వార్షికంగా చెల్లింపులు చేసే ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది ప్రతికూలం. సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొంత రిస్క్ తీసుకునే వారికి రిస్క్ తీసుకునే వారు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో వీటిల్లో రాబడులు వార్షికంగా 12 శాతం వరకు ఉన్నాయి. దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న పథకాల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వీటిల్లో ఏకమొత్తంలో కాకుండా.. ఆరు నుంచి 12 నెలసరి వాయిదాల్లో తమవద్దనున్న కార్పస్‌ను ఇన్వెస్ట్ చేసుకుని, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. అనుకూలం/ప్రతికూలం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ 25% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఈ మేరకు అధిక రాబడికి అవకాశం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు సమయాల్లో పెట్టుబడిని కాపాడుకునేందుకు ఉపసంహరణను కొంత వరకు తగ్గించుకోవాల్సి రావచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎంతో పాపులర్ పథకం. 60 ఏళ్లు నిండిన వారు ఇందులో డిపాజిట్ చేసుకోగలరు. 55 ఏళ్లు నిండి, పదవీ విరమణ తీసుకున్న వారు కూడా అర్హులే. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇది బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ. ఈ రేటు ప్రకారం ప్రతి మూడు నెలలకు (ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిలో) వడ్డీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వృద్ధులకు క్రమం తప్పకుండా ఆదాయన్ని ఇచ్చే సంప్రదాయ సాధనాల్లో ఇది మెరుగైనది. అనుకూలం/ప్రతికూలం ఇందులో పెట్టుబడికి ఎటువంటి రిస్క్ లేదు. భారత ప్రభుత్వం హామీనిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడిని సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కోరొచ్చు. భార్యా, భర్త వేర్వేరు ఖాతాలను తెరవొచ్చు. పోస్టాఫీసులే కాకుండా బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడమే సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవడం సులభం. ఇందులో ఆదాయంపై టీడీఎస్ అమలవుతుంది. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఫామ్ 15జీ/హెచ్ ఇస్తే టీడీఎస్ మినహాయించరు. ప్రధానమంత్రి వయవందన యోజన 2017 మే నుంచి అందుబాటులోకి వచ్చిన పథకం ఇది. ఎల్ఐసీ దీన్ని నిర్వహిస్తోంది. ఒకే విడత ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు ఆదాయం అందుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో నెలవారీ చెల్లింపు ఆప్షన్‌పై 7.40 శాతం వార్షిక రేటు చెల్లిస్తున్నారు. 2023 మార్చి 31 వరకు ఇన్వెస్ట్ చేస్తే, పదేళ్ల పాటు ఇదే రేటు అమల్లో ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం బ్యాంకు సాధనాలతో పోలిస్తే ఇందులో అధిక రేటు అమల్లో ఉంది. పదేళ్ల కాలానికి ఒక్కటే రేటు ఉండడం వల్ల ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. బీమా కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లతో పోల్చినా ఇందులోనే రాబడి ఎక్కువ. యాన్యుటీ ప్లాన్లతో పోలిస్తే నూరు శాతం ఇదే మెరుగైనది. ప్రభుత్వం తరఫున ఎల్ఐసీ దీన్ని నిర్వహిస్తోంది కనుక ఇందులో పెట్టుబడికి రిస్క్ ఉండదు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం చెల్లించే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే దీన్ని స్వాధీనం చేసి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో పెట్టుబడి విలువపై 75 శాతానికి సమానంగా రుణాన్ని ఎప్పుడైనా పొందొచ్చు. దీంతో అత్యవసరాల్లో సాయపడుతుంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై ప్రతి నెలా రూ.9,250 పెన్షన్ వస్తుంది. కంపెనీల డిపాజిట్లు బజాజ్ ఫైనాన్స్ తదితర ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థలు, కంపెనీలు సైతం ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తుంటాయి. వీటిల్లో అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. 6–9 శాతం మధ్య వీటిల్లో వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు సహజంగా అర శాతం అధిక రేటు లభిస్తుంది. ఈ డిపాజిట్ల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. కొన్ని ఎన్బీఎఫ్సీలు 10 ఏళ్ల డిపాజిట్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అనుకూలం/ప్రతికూలం సాధారణంగా బ్యాంకులతో పోలిస్తే అదనపు రేటును ఇవి ఆఫర్ చేస్తుంటాయి. ఇవి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే 9 శాతానికి పైనే చెల్లించాల్సి వస్తుంది. అందుకుని ప్రజలకు సైతం మెరుగైన రేటును ఆఫర్ చేస్తాయి. వీటిల్లో డిపాజిట్ పూర్తిగా రిస్క్‌తో కూడినదే. ఎందుకంటే పెట్టుబడికి, వడ్డీకి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఇందులో వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 మించితే 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. పన్ను పరిధిలో లేని వారు ఫామ్ 15జీ/హెచ్ సమర్పించి టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. కాల వ్యవధిలోపు తీసుకుంటే పెనాల్టీ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు పెనాల్టీ నిబంధన చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రివర్స్ మార్ట్గేజ్ ఇంటిని తనఖా పెట్టి పొందే రుణం ఇది. ఈ మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. ప్రతి నెలా నిర్ణీత మొత్తం మీకు లభించేలా బ్యాంకుతో ఒప్పందం చేసుకోవచ్చు. ఇది ఈఎంఐకి రివర్స్ మాదిరి పనిచేస్తుంది. బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. కోరుకున్నప్పుడు తీసుకున్న మొత్తం, దానిపై వడ్డీ చెల్లించి మార్ట్‌గేజ్‌ను ఉపసంహరించుకోవచ్చు. లేదంటే తమ తదనంతరం వారసులకు దీన్ని బదిలీ చేయవచ్చు. అనుకూలం/ప్రతికూలం రూ.50 లక్షల నుంచి కోటి వరకు పొందడానికి ఉంటుంది. ఎక్కువ బ్యాంక్‌లు 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్‌గేజ్‌ను అందిస్తున్నాయి. 60 ఏళ్లు నిండిన వారికే ఈ సదుపాయం. మార్ట్గేజ్ కింద ఇంటిని బ్యాంకుకు తనఖా పెట్టి రుణం పొందుతున్నా కానీ, అదే ఇంట్లో నివసించొచ్చు. తమ తదనంతరం వారసులు ఈ మొత్తాన్ని చెల్లించి బ్యాంకుల నుంచి ఇల్లు తమ పేరిట స్వాధీనం చేసుకోవచ్చు. వద్దనుకుంటే బ్యాంకు సదరు తనఖాలో ఇంటిని విక్రయించి, అప్పటి వరకు చెల్లించిన మొత్తం, దానిపై వడ్డీని మిహాయించుకుంటుంది. ఇది పోను మిగులు ఏమైనా ఉంటే వారసులకు ఇస్తుంది. రుణంపై జీవించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే బ్యాంకు నుంచి అప్పటి వరకు పొందిన మొత్తంపై వడ్డీ కూడా చెల్లించుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంటుంది. రిటైలర్ల కంటే ఎక్కువగా ఇనిస్టిట్యూషన్స్ ఈ సాధనంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ బాండ్ల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది. వడ్డీని ప్రతి ఆరు నెలలకు చెల్లిస్తారు. రాబడి 5–7 శాతం మధ్య ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం పెట్టుబడికి, రాబడికి ఏ మాత్రం రిస్క్ ఉండదు. ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ ప్రారంభించి ఆన్లైన్లోనే కొనుగోలు చేసుకోవచ్చు. టీడీఎస్ అమలు కాదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. -
ఫలితాల్లో మారుతి అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం
సాక్షి,ముంబై: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 4 రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 475.30 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎగిసింది. (షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!) గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ.19,297.80 కోట్లనుంచి రూ.28,543.50 కోట్లకు వార్షిక ప్రాతిపదికన 47.91 శాతం వృద్ధి చెందాయి. ఆపరేటింగ్ ఎబిట్ గత ఏడాది త్రైమాసికంలో రూ.98.80 కోట్ల నుంచి 20.71 రెట్లు పెరిగి రూ.2,046.30 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో ఎబిట్ మార్జిన్ 670 బేసిస్ పాయింట్లు పెరిగి 0.5 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు, అనుకూలమైన విదేశీ మారకపు వైవిధ్యం తమకు లాభించిందని పేర్కొంది. అయితే ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా ఈ త్రైమాసికంలో దాదాపు 35,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికం ముగిసే సమయానికి 4.12 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 1.3 లక్షల వాహనాల ప్రీ-బుకింగ్‌లు ఇటీవల లాంచ్ చేసిన మోడళ్లకు సంబంధించినవేనని మారుతి వెల్లడించింది. ఈ ఫలితాల జోష్‌తో మారుతి సుజుకి షేరు ఆరుశాతం ఎగిసి 9,548 వద్ద ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. -
అదరగొట్టిన సెంచురీ టెక్స్టైల్స్, ఆదాయం జంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 70 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 44 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,034 కోట్ల నుంచి రూ. 1,242 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 972 కోట్ల నుంచి పెరిగి రూ. 1,125 కోట్లను తాకాయి. కంపెనీ టెక్స్టైల్స్, పల్ప్, పేపర్, రియల్టీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో సెంచురీ టెక్స్టైల్స్ షేరు గురువారం నాటి 8 శాతం లాభంతో పోలిస్తే 2 శాతం నష్టంతో 861 వద్ద ట్రేడ్ అవుతోంది. -
మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్!
యూట్యూబ్.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మారుస్తోంది ఈ వీడియో ప్లాట్‌ఫాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసందే. కొందరు దీని ఎంటర్టైన్మెంట్ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్‌ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ అందరూ షాక్ అయ్యేలా ఏడాదికి రూ.312 కోట్లు సంపాదిస్తూన్నాడు. దీంతోపాటు మరికొన్ని సంచలన విషయాలను అతను బయటపెట్టాడు. ఇదంతా మోసం చేసి సంపాదించాను! వివరాల్లోకి వెళితే.. మార్క్ ఫిష్‌బాచ్ అనే ఒక యూట్యూబర్ ఒక సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా 38 మిలియన్ డాలర్లు (రూ. 312 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వ్యక్తి మార్క్ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘యూట్యూబ్ ద్వారా నాకు ఇంత డబ్బు వస్తోందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అయితే ఒక్కోసారి ఈ దారిలో సంపాదించడం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఈ స్థాయిలో సక్సెస్, సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందని’ తెలిపాడు. భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలని, వారి స్నేహితులు, బంధువుల జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవలే యూట్యూబర్ MrBeast, (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్), అతని యూట్యూబ్ ఛానెల్ కోసం $1 బిలియన్ల డీల్‌ను ఆఫర్ చేసిన సంగతి తెలసిందే. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! -
Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు. 26 నుంచి కార్తిక మాసోత్సవాలు ఈ నెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి భవానీ మండల దీక్షలు నవంబర్ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ) -
AP: ఆర్టీసీకి జై కొట్టిన ప్రయాణికులు.. రెగ్యులర్ చార్జీలతోనే రెట్టింపు ఆదాయం
సాక్షి, అమరావతి: దసరా సీజన్లో కూడా రెగ్యులర్ చార్జీలే అమలు చేసిన ఆర్టీసీకి ప్రయాణికులు జై కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4,500 సర్వీసుల్లో ఏకంగా 1.84 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. 80 శాతం ఆక్యుపెన్సీ రేటుతో రూ.4.42 కోట్ల ఆదాయం సమకూర్చారు. కొత్త రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే... దశాబ్దకాలంగా ఆర్టీసీ దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. రెగ్యులర్ టికెట్ల కంటే 50శాతం పెంచడం పరిపాటిగా మారింది. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది దోహద పడుతుందని భావించేవారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల జీతాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో సర్వీసులే తక్కువుగా నడిపారు. తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 25 నుంచి దసరా వరకు 2,206 ప్రత్యేక సర్వీసులు నడిపింది. రెగ్యులర్ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే ప్రాధాన్యమిచ్చారు. గతేడాది 150 శాతం చార్జీలు వసూలు చేసినా సరే రూ.2.10కోట్ల రాబడే వచ్చింది. ఆర్టీసీపై ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ దసరా సీజన్ ప్రతీకగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో 10వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. -
Dussehra 2022: కాసులు కురిపించిన దసరా
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా సంస్థలకు దసరా పండగ కాసులు కురిపించింది. రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దసరా సందర్భంగా నగరం నుంచి సుమారు 30 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా. వీరిలో 25 శాతం మంది సొంత వాహనాల్లో వెళ్లగా.. మిగతా 75 శాతం ఆర్టీసీ బస్సులు, రైళ్లలో బయలుదేరారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా వెళ్లారు. ప్రయాణికుల రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే సుమారు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో సాధారణ బోగీల సంఖ్యను పెంచింది. మరికొన్ని రైళ్లకు స్లీపర్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4600 అదనపు బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు సాధారణ చార్జీలపైనే అదనపు బస్సులను నడపడంతో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఆర్టీసీకి ఆదరణ.. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఎక్కువ శాతం నగరవాసులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులే అందుబాటులో ఉండడంతో ఆర్టీసీ సైతం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతేడాది దసరాకు రూ.10 కోట్లు సమకూరగా.. ఈసారి సుమారు రూ.15 కోట్లకుపైగా లభించినట్లు ఓ అధికారి తెలిపారు. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు నడిచే 3500 బస్సులతో పాటు రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. నగరవాసులు పూర్తిస్థాయిలో బస్సులను వినియోగించుకుంటే ఆర్టీసీకి మరింత ఆదాయం లభించేదని, ఎక్కువ శాతం సొంత వాహనాలు, టాటాఏస్‌లు, అద్దె కార్లకు ప్రాధాన్యమిచ్చారని అధికారులు భావిస్తున్నారు. బైక్‌లపై కూడా పెద్ద ఎత్తున వెళ్లినట్లు సమచారం. పండగ చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు.. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. పండగ రద్దీని సొమ్ము చేసుకున్నారు. టూరిస్టు బస్సులుగా నమోదైనవి కూడా స్టేజీ క్యారేజీలుగా రాకపోకలు సాగించాయి. మినీ బస్సులు, ట్రావెల్స్ కార్లు సైతం రెండు రాష్ట్రాల మధ్య పరుగులు తీశాయి. దక్షిణమధ్య రైల్వేకు.. దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.45 కోట్ల వరకు లభించినట్లు అంచనా. దసరా సందర్భంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అన్ని రూట్లలోను ప్రయాణికుల రద్దీ పెరిగింది. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్‌లిస్టు 250 దాటిపోయింది. దీంతో రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వల్ల కొంత మేరకు ఊరట లభించింది. కోవిడ్‌కు ముందు.. అంటే రెండేళ్ల క్రితం నాటి ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చాలా తక్కువే లభించినట్లు అధికారులు చెప్పారు. -
మూడేళ్ళలో లక్ష రూపాయలకు 20 లక్షలు
-
ఆదాయపు పన్ను లెక్కించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..
ఆదాయపు పన్ను భారం లెక్కించేటప్పుడు సొంత ఖర్చులు/ఇంటి ఖర్చులను మినహాయించుకోవచ్చా? ఈ ప్రశ్నకు నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాలన్నీ కలిపిన మొత్తం ఆదాయంపై పన్ను భారం ఉంటుంది. ఆదాయాలన్నింటినీ ఐదు శీర్షికల కింద వర్గీకరించారు. జీతాలు, ఇంటి మీద అద్దె, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు. ఈ అయిదింటిని లెక్కించే విధానంలో ఏయే శీర్షిక కింద ఏయే మినహాయింపులు ఇవ్వాలో నిర్దేశించారు. జీతంలో నుంచి స్టాండర్డ్ డిడక్షన్, వృత్తి పన్ను మినహాయిస్తారు. ఇంటి అద్దెలో నుంచి 30 శాతం మొత్తం రిపేరు కింద తగ్గిస్తారు. వ్యాపారం/వృత్తిగత ఆదాయంలో నుంచి సంబంధిత ఖర్చులను మాత్రమే తగ్గిస్తారు. అందుకే ఈ మినహాయింపుల విషయంలో పూర్తిగా తెలుసుకోకపోతే పన్నుదారులకు పర్సులో నగదుపై ప్రభావం పడుతుంది. అలాగే మూలధన లాభాలు లెక్కించేటప్పుడు ఆస్తి కొన్న విలువ, బదిలీ కోసం అయిన ఖర్చు, ఇతర ఆదాయాలు లెక్కించేటప్పుడు సంబంధిత ఖర్చులే మినహాయిస్తారు. సంబంధించిన ఖర్చులుంటే నిర్వహణ నిమిత్తం ఖర్చు పెట్టాలి. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సంబంధం ఉండాలి. సమంజసంగా ఉండాలి. సరైనవి ఉండాలి. రుజువులు ఉండాలి. పైన చెప్పిన వివరణ ప్రకారం ఏ శీర్షిక కిందనైనా స్వంత ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, ఇంటి ఖర్చులకు మినహాయింపు లేదు. వ్యాపారం/వృత్తి నిర్వహణలో చాలామంది అన్ని ఖర్చులు కలిపేస్తుంటారు. కరెంటు చార్జీలు, పెట్రోల్, టెలిఫోన్, సెల్‌ఫోన్, పనివాళ్ల మీద ఖర్చు, విరాళాలు, దేవుడికి పూజలు, దేవుడికి కానుకలు, మొక్కుబడులు, తిరుపతి యాత్ర .. తీర్థయాత్రలు .. విహారయాత్రలు.. పార్టీలు, విలాసాలు, క్లబ్బు ఖర్చులు, ఇంటి పేపరు ఖర్చు, షాపుల నుండి .. దుకాణాల నుండి ఇంటికి పంపే వస్తువులు .. సొంత వాడకాలు.. ఇలా ఎన్నో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి ఖర్చులన్నీ స్వంత ఖర్చులుగా, వ్యక్తిగత ఖర్చులుగా పరిగణిస్తారు. అవి వ్యాపార సంబంధమైనవి కావు.. వ్యాపారానికి ఎటువంటి అవసరం లేదు. అందువల్ల ఇటువంటి ఖర్చులన్నీ మినహాయించరు. మనం వీటిని వ్యాపార ఖర్చులుగా చూపించడం సమంజసమూ కాదు. ఇంటి విషయంలో రిపేరు విషయంలో మీరు ఖర్చు పెట్టకపోయినా, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా కేవలం 30 శాతం మాత్రమే మినహాయిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు స్టాండర్డ్ డిడక్షన్ విషయం. ఇది ఆఫీసుకు వెళ్లి రావడం నిమిత్తం ఇచ్చిన మినహాయింపు. మీ ఆఫీసు ఇంటి పక్కనే ఉన్నా, అడవిలో ఉన్నా, అల వైకుంఠపురంలో ఉన్నా .. రవాణా నిమిత్తం నడక అయినా, సైకిల్ అయినా .. కారు వాడినా .. అలవెన్సు మారదు. తగ్గదు. అలాగే సంబంధిత ఖర్చులు, సమంజసంగా ఉండాలి. సరిగ్గా ఉండాలి. లెక్కలుండాలి. రుజువులు ఉండాలి. లాభం తగ్గించడానికి స్వంత ఖర్చులు / ఇంటి ఖర్చులను వ్యాపార ఖర్చులుగా చూపించకండి. సంబంధిత ఖర్చులనే చూపండి. ఒక్కొక్కపుడు కొన్ని ఖర్చుల ప్రయోజనం వ్యాపారానికెంత.. సొంతానికి ఎంత అని చెప్పలేకపోవచ్చు. కేటాయించలేకపోవచ్చు. అధికారులకు వారి సంతృప్తి మేరకు వివరణ ఇవ్వగలిగితేనే వ్యాపార ఖర్చులుగా చూపించండి. లేదా మొత్తం సొంతంగానే భావించండి. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి అప్డేట్!
సాక్షి, ముంబై: యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి వార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది. ఇది చదవండి: Tata Nexon:సేల్స్‌లో అదరహ! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది టిక్‌టాక్ (మన దేశంలో బ్యాన్) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్డేట్ను తీసు కొచ్చింది. షార్ట్-ఫారమ్వీడియోపై డబ్బు సంపాదించడానికి క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. మారుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్‌లో (సృష్టికర్తలకు) భారీ మద్దతునిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ రారాజు. తన యూజర్లకు ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్ ప్రకటనల ద్వారా 14.2 బిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. -
బైజూస్ ఆదాయం హైజంప్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం థింక్ అండ్ లెర్న్ స్థూల ఆదాయం మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో నాలుగు రెట్లు దూసుకెళ్లింది. బైజూస్ బ్రాండుతో విద్యా సంబంధ సేవలందించే కంపెనీ రూ. 10,000 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. 202021లో నష్టాలు రూ. 4,588 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ కాలంలో రూ. 2,428 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. కొద్ది నెలల ఆలస్యం తదుపరి కంపెనీ ఆడిటెడ్ ఫలితాలను విడుదల చేసింది. భారీ నష్టాలకు ప్రధానంగా వైట్‌హ్యాట్ జూనియర్ విభాగం ఆదాయం, నష్టాలను వాయిదా వేయడం, ఆదాయ మదింపులో చేపట్టిన మార్పులు కారణమైనట్లు బైజూస్ పేర్కొంది. 2019–20లో దాదాపు రూ. 232 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. 2020లో సాధించిన రూ. 2,511 కోట్లతో పోలిస్తే ఆదాయం సైతం 1 శాతం తగ్గినట్లు తెలియజేసింది. ఆదాయ నమోదును వాయిదా వేసినప్పటికీ వ్యయాల నమోదును కొనసాగించడంతో నష్టాలు భారీగా పెరిగినట్లు బైజూస్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ వివరించారు. అంతేకాకుండా వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నష్టాలు నమోదు చేస్తున్న వైట్‌హ్యాట్ జేఆర్ తదితర సంస్థల కొనుగోళ్లు కూడా ఇందుకు కారణమైనట్లు తెలియ జేశారు. అయితే గతేడాది లాభం లేదా నష్టం వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం! తొలి 4 నెలల్లో జూమ్ 2022 ఏప్రిల్-జులైలో సాధించిన రూ. 4,530 కోట్ల ఆదాయం 2021లో నమోదైన మొత్తం ఆదాయం కంటే అధికమని రవీంద్రన్ వెల్లడించారు. కీలక బిజినెస్ 150 శాతం పురోగమించినట్లు తెలియ జేశారు. ఆకాష్, గ్రేట్ లెర్నింగ్ సంస్థల కొనుగోళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు తదుపరి బిజినెస్‌లో రెట్టింపు వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. వైట్‌హ్యాట్ జేఆర్ మాత్రం అంతంత మాత్ర పనితీరును చూపుతున్నట్లు ప్రస్తావించారు. 50 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరణకు కంపెనీ నిర్వహిస్తున్న చర్చలు పురోగతిలో ఉన్నట్లు తెలియజేశారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం అబుధాబి సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి 40–50 కోట్ల డాలర్లు, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి 25–35 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులను సమకూర్చుకునే వీలుంది. నిధులను 23 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఇతర కంపెనీల కొనుగోళ్ల అంశాన్ని పక్కనపెట్టినట్లు రవీంద్రన్ తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే బిలియన్ డాలర్లకు దేశీ సంస్థ ఆకాష్‌ను సొంతం చేసుకోగా.. సింగపూర్ సంస్థ గ్రేట్ లెర్నింగ్‌ను 60 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ బాటలో యూఎస్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్‌ను 50 కోట్ల డాలర్లకు, కోడింగ్ సైట్ టింకర్‌ను 20 కోట్ల డాలర్లకు చేజిక్కించుకుంది. ఆస్ట్రియా గణిత శాస్త్ర సంస్థ జియోజెబ్‌డ్రాను 10 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో ప్రస్తుత ఉపాధ్యాయుల సంఖ్య 20,000కాగా వచ్చే ఏడాదిలో మరో 10,000 మందిని జత చేసుకునే ప్రణాళికల్లో బైజూస్ ఉంది. కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య ప్రస్తుతం 50,000కు చేరింది. -
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ అంటే ఏంటి?
నా సోదరుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పు డు మా వదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? – వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినికి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు. ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – కృతిక పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమై ప్రణాళిక కలిగి ఉండడం కూడా ముఖ్యమే. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అన్నది పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. ఇది రిటైర్మెంట్ తీసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి కోరుకున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి జమ అవుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. కానీ, ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం వార్షికంగా పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి సాయపడుతుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు పెట్టుబడి నిలిచి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా తీసుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే మూడేళ్లకు మించిన లాభంపై 20 శాతం చెల్లించాలి. మూడేళ్లలోపు లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. ధీరేంద్ర కుమార్,సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు
దేశంలో పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన పోషకాహారం లభించక కోట్లమంది రక్త హీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక వైపున కొద్ది మంది సర్వభోగాలూ అనుభవిస్తు న్నారు. దేశంలో ఈ దారుణ పరిస్థితులకు కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా సంపద కొందరి దగ్గరే పోగుపడటం ప్రారంభమైంది. భారతదేశంలో ఆదాయం, సంపద పరంగా తీవ్ర అసమానతలు ఉన్నాయని ప్యారిస్ లోని అధ్యయన సంస్థ (వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) 2022 నివేదిక వెల్లడించింది. 2021లో భారత సమాజంలోని 10శాతం అగ్రశ్రేణి సంపన్న వర్గం జాతీయ ఆదాయంలో 57 శాతం కలిగి ఉంది. అందులోని ఒక శాతం అగ్ర ధనిక వర్గం 22 శాతం వాటాను సొంతం చేసుకుంది. 50 శాతం ప్రజల వాటా 13 శాతం మాత్రమే. 1980 నుంచి భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక వెల్లడించింది. ఇండియాలో ప్రైవేట్ వ్యక్తుల సంపద 1980లో 290 శాతం ఉంటే 2020 నాటికి 560 శాతానికి పెరిగింది. మరొక వైపున ప్రపంచంలో అత్యంత పేదరికం ఉన్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు 68.9 కోట్లు ఉండగా... అందులో భారతదేశం వాటా 20.17 శాతంగా ఉంది. ఆర్థిక అసమానతల ఫలితంగా పేదలు పస్తులతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక, ఆహార భద్రత– 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది భారత ప్రజలు పస్తులతో పడుకుంటున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ) మేరకు 119 దేశాల్లో భారత్ 103వ స్థానంలో ఉంది. ఆహార భద్రత సూచీ ప్రకారం 113 దేశాల్లో భారత్ 76వ స్థానంలో ఉంది. ఈ విషయంలో శ్రీలంక, ఘనా, బొలీవియా కన్నా వెనకబడి ఉంది. పోషకాహారం లోపం వలన 17.3 శాతం చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశంలో మరింత ఎక్కువ మందిలో రక్త హీనత ఏర్పడింది. చిన్నపిల్లల్లో, గర్భిణుల్లో అధికంగా రక్త హీనత ఉంది. ‘జాతీయ ఆహార భద్రత చట్టం’ అమలులోకి వచ్చి 54 ఏళ్లయినా ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015–18లో దేశవ్యాప్తంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్ అభియాన్ సంస్థ 2015 చేసిన సర్వే వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్ ఖండ్ ప్రాంతం లోని 13 జిల్లాల్లోని 38 శాతం గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణిం చారు. మోదీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావనీ, అనారోగ్య కారణాలతో చనిపోయారనీ చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంది. పేదరికానికి, అనారోగ్య సమస్యలకు, ఆకలి చావులకు దుర్భరమైన ఆర్థిక పరిస్థితులే కారణం. ప్రభుత్వ పథకాలు వలన పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని ప్రస్తుత పరిస్థితులే నిరూపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలున్నాయి. గ్రామీణ పేదలకు సేద్యపు భూమి పంపిణీ చేసి, హక్కు కల్పించాలి. పట్టణ పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. వారికి వాటిల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఇందు కోసం గ్రామీణ, పట్టణ పేదలు సమష్టిగా ఉద్యమించాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - బొల్లిముంత సాంబశివరావు రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
జాతీయ ఆదాయంలో 20%.. వేతనాల్లో 40%
ముంబై: భారత్ మొత్తం జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) వాటా 20 శాతం అయితే, మొత్తం వేతనాల్లో వాటా 40 శాతంగా ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రైవేటు రంగం విషయంలో ఈ రేట్లు ‘దాదాపు సమతౌల్యంగా’ వరుసగా 36.3 శాతం, 35.2 శాతాలుగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)కు సంబంధించి 2020–21కి ముందు గడచిన పదేళ్ల కాలంలో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన ఈ విశ్లేషణ చేసినట్లు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలకు సంబంధించి ప్రభుత్వం పాత్రను తగ్గించాలని ఒత్తిడి చేస్తూ, ప్రభుత్వ రంగంలోని సమర్థత లోపాన్ని తరచుగా ఎత్తి చూపే విమర్శకులకు తాజా నివేదిక మద్దతునిస్తోంది. నివేదిక ప్రకారం, 2011–2021 మధ్య వేతనాల సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 10.4 శాతంగా ఉంటే, మూలధనంపై రాబడి 8.8 శాతం వృద్ధిని (సీఏజీఆర్) నమోదుచేసుకుంది. -
కాళేశ్వరంతో ఎంత ఆదాయం వచ్చింది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆదాయం వస్తుందా? ఇప్పటి వరకు వచ్చిందెంత?.. అని ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాయి. ఈ వివరాలి వ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరా యి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.65,454 కోట్ల ప్రత్యక్ష ఆదాయం రానుందని బ్యాంకులకు సమర్పించిన టెక్నో–ఎకనామిక్ వయబిలిటీలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నీటి తీరు వా పన్నులు, పరిశ్రమలకు ముడి నీటి సరఫ రా, జంట నగరాలు, గ్రామాలకు తాగునీరు సరఫరాకు వసూలు చేయనున్న చార్జీలు, తదితర మార్గాల్లో ఈ మేరకు ఆదాయం రానుందని ప్రభుత్వం తెలిపింది. దీని ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణానికి రుణాలిచ్చాయి. బ్యాంకులు, రుణసంస్థలతో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభు త్వం రుణాలను తిరిగి చెల్లించాలి. గత మా ర్చి 31 నాటికి కాళేశ్వరం పూర్తై వాణిజ్యపర కార్యకలాపాలను ప్రారంభించిందని కాళేశ్వ రం ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ (కేఐపీసీఎల్).. బ్యాంకుల కన్సార్టియంకు నివేదించింది. ఇప్పటి వరకు ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి ప్రాజెక్టు కోసం తీసుకున్న రు ణాలకు వడ్డీలు చెల్లిస్తోంది. కాళేశ్వరం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని ప్రక టించిన నేపథ్యంలో గత జూన్ నుంచి అసలు రుణాల వాయిదాలతో పాటు వడ్డీ చెల్లింపు ను ప్రాజెక్టు ద్వారా వస్తున్న ఆదాయంతో కట్టాలి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందో సమాచారమివ్వాలని బ్యాంకులు తాజాగా కేఐపీసీఎల్‌ను కోరాయి. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్ తాజాగా రాష్ట్ర ప్ర భుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాలను పొందుపరిచారు. ఈ క్రమంలో వివిధ రూపా ల్లో వస్తున్న ఆదాయాన్ని కాళేశ్వరం కార్పొరేషన్‌కు సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయాలని ఆయన ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే.. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.86,064 కోట్ల రుణాలను వివి ధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకుంది. మొత్తం రూ.97,445 కోట్ల రుణాలు రావాల్సి ఉండగా, మిగిలిన రుణాలు కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో నిలిచిపోయాయి. జంట నగరాల్లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని సరఫరా చేస్తుండటంతో జలమండలికి వచ్చే ఆదాయం పడిపోయింది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు సరఫరా చేసే నీళ్లకు సైతం నీటి కుళాయి చార్జీలు వసూలు చేయట్లేదు. రాష్ట్రంలో నీటి తీరువా పన్నుల వసూళ్లను ఎప్పుడో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. నీటి తీరు వా పన్నులు, కుళాయి చార్జీలను రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీల రూపంలో కాళేశ్వరం కార్పొరే షన్ ఖాతాలోకి జమ చేయక తప్పని పరిస్థితి.. దీనికి బ్యాంకులు, రుణ సంస్థలు అంగీకరిస్తాయా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
Kareena Kapoor Says Indian Railways Income Increased By Geet Role: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. ఆమెను అభిమానులంతా ముద్దుగా బెబో అని కూడా పిలుచుకుంటారు. కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్, తషాన్, భజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్, హీరోయిన్ వంటి చిత్రాలతో అలరించింది. సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల అమీర్ ఖాన్‌కు జోడీగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ శర్మ లాయర్లుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'కేస్‌తో బన్ తా హై'. ఈ షోలో పాల్గొన్న జబ్ వి మెట్ సినిమాలోని గీత్ అనే పాత్ర వల్లే రైల్వేస్‌కు ఆదాయం పెరిగిందని తెలిపింది. ''నేను చేసిన గీత్ పాత్ర వల్లే ప్యాంట్స్ అమ్మకాలు, భారతీయ రైల్వేలకు ఆదాయం పెరిగింది'' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ జోడిగా కలిసి నటించిన చిత్రం జబ్ వి మెట్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీత్‌గా కరీనా కపూర్ అలరించింది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్లో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీకి గి‘రాఖీ’.. భారీగా ఆదాయం.. ఏకంగా..!
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రోజువారీ టికెట్ ఆదాయం రూ.20 కోట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ అనుకున్నది సాధించింది. ఆగస్టు చాలెంజ్ పేరుతో తనకు తాను సవాలు విసురుకుని దాన్ని అధిగమించి చూపింది. రాఖీ పౌర్ణమి రోజు టికెట్ రూపంలో ఏకంగా రూ.20.10 కోట్ల ఆదాయాన్ని పొంది ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఉమ్మడి ఆర్టీసీలో ఓరోజు టికెట్ ఆదాయం రూ.21 కోట్ల రికార్డు కాగా, ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ టీఎస్ఆర్టీసీ ఒక్కటే దానికి అతి చేరువగా వచ్చి సత్తా చాటింది. ఇదే రోజు అటు ఏపీఎస్ఆర్టీసీ రూ.19.79 కోట్ల ఆదాయాన్ని పొందింది. విస్తృత పరిధి ఉన్న ఏపీఎస్ఆర్టీసీ కంటే ఎక్కువ ఆదాయాన్ని పొంది టీఎస్ఆర్టీసీ కొత్త మైలురాయిని దాటింది. ఈ నెల 12న 38,76,824 మంది ప్రయాణికులను బస్సులు గమ్యస్థానాలకు చేర్చాయి. ఏకంగా 35.54 లక్షల కి.మీ. మేర బస్సులు తిరిగాయి. ఎన్నడూలేనట్టు కి.మీ.కి రూ.56.56 చొప్పున ఆదాయాన్ని సంస్థ నమోదు చేసుకుంది. వెరసి 86.84 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.8.79 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.5.84 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో రూ.5.47 కోట్ల ఆదాయం సమ ూరింది. రాఖీ పౌర్ణమితో పాటు వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బస్సులు కిటకిటలాడాయి. ముందుగానే ఈ రద్దీని ఊహించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉద్యోగులకు ఆగస్టు ఛాలెంజ్ పేరుతో లక్ష్యాన్ని నిర్ధారించారు. -
పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..
సాక్షి ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.380 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం 89 శాతం పెరిగి రూ.1,680 కోట్లుగా నమోదైంది. గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ రెట్టింపై రూ.3లక్షలకు చేరింది. నెలవారీ లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49 శాతం పెరిగి 7.48 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. (ఇది చదవండి: ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్) పోస్ట్‌పెయిడ్ లోన్లు సంవత్సరానికి 486 శాతం పెరిగగా, పంపిణీ చేసిన రుణాల విలువ ఏడాది క్రితం రూ.447 కోట్లతో పోలిస్తే 656 శాతం పెరిగి రూ.3,383 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల వ్యాపారం బాగా పెరిగిందని Paytm తెలిపింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం రూ.5,554 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ పంపిణీ చేసిన రుణాలు రూ.632 కోట్లతో పోలిస్తే రుణ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. వార్షికంగా చూస్తే రుణాల పంపిణీ రూ.24,000 కోట్లుగా ఉంటుందని పేటీఎం పేర్కొంది. చదవండి: కోవిడ్‌సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త
న్యూఢిల్లీ: డిజిటల్ రేడియో టెక్నాలజీ వినియోగంతో రేడియో విభాగం ఆదాయం అయిదేళ్లలో రెండింతలై రూ.12,300 కోట్లకు చేరుకుంటుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ), ఈవై నివేదిక వెల్లడించింది. ‘డిజిటల్ రేడియోతో ప్రసార కంపెనీలు, శ్రోతలు, ప్రకటనకర్తలు, నియంత్రణ సంస్థలకు ప్రయోజనం. అధిక ధరలతో స్లాట్స్ విక్రయించేలా ప్రకటనలు పెరుగుతాయి. డిజిటల్ రేడియో వ్యవస్థ శ్రోతల డేటాను పారదర్శకంగా అందిస్తుంది. ఎంతమంది వింటున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రసారకులు నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. చానెళ్లూ పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఫ్రీక్వెన్సీలో నాలుగింతలు ఎక్కువగా చానెళ్లను ఆఫర్ చేయవచ్చు. నాణ్యత అధికం అవుతుంది. శ్రోతలకు మెరుగైన అనుభూతి కలుగుతుంది. అదనపు స్పెక్ట్రమ్ అవసరం లేకుండానే చానెళ్ల సంఖ్య ప్రస్తుతమున్న 300 నుంచి 1,100 దాటుతుంది. కొన్నేళ్లుగా ఆదాయాల ఆర్జనకు ఎఫ్ఎం రేడియో కష్టాలను ఎదురీదుతోంది’ అని నివేదిక వివరించింది. -
Horsley Hills: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో వేసవి విడిది కేంద్రంగా, ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌పై కోవిడ్ ప్రభావం ఆర్థికంగా దెబ్బతీసింది. సందర్శకులు కరువై ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కోవిడ్ అనంతర పరిస్థితులతో పర్యాటకం గాడిలో పడటంతో సందర్శకుల రాకతో పాటు, వారిని ఆకట్టుకునే చర్యలు సఫలమై ఆదాయం పెరుగుతోంది. 2000 ఏడాదిలో కొండపై టూరిజం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయంతో మొదలై ప్రస్తుతం రూ.4 కోట్లను దాటింది. అత్యధికంగా వేసవి, సెలవురోజుల్లో పర్యాటకులు ఇక్కడికి వస్తారు. బెంగళూరు, చెన్నై, చిత్తూరు, తిరుపతి, పుట్టపర్తి, అనంతపురం జిల్లాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు బృందాలుగా ఇక్కడికి వచ్చి విడిది చేస్తారు. ప్రయివేటు కంపెనీలు తమ సిబ్బందిని విహారయాత్రగా పంపుతుంటారు. ఈ కంపెనీలను ముందుగా టూరిజం అధికారులు సంప్రదించడం ద్వారా హార్సిలీహిల్స్‌కు పంపేలా కృషి చేస్తుంటారు. ఒక్కో కంపెనీ నుంచి కనీసం లక్షకుపైబడిన ఆదాయం సమకూరుతుంది. దీనిపైనే స్థానిక టూరిజం అధికారులు దృష్టిపెట్టి ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటాయి. దీనివల్ల ఒకసారి వచ్చివెళ్లిన సందర్శకులు మళ్లీ వస్తుంటారు. గత ఏడాది కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఆదాయం మొదలైంది. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ 12 నెలల కాలంలో రూ.4,02,53,364 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజం అభివృద్ధి విషయంలో చర్యలు మొదలయ్యాయి. కొండను ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దడమే కాకుండా స్టార్ హోటల్ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు టూరిజం ఎండీ కన్నబాబు ఇటీవల హార్సిలీహిల్స్‌పై పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల పర్యాటకశాఖ ఉన్నతాధికారులు కొండకు వచ్చి చేపట్టాల్సిన అభివృద్ధిపై పరిశీలించి వెళ్లారు. దీనిపై ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది. అభివృద్ధికి నిధులు హార్సిలీహిల్స్ యూనిట్ ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గదుల ఆధునీక రణ, ఇతర పనులకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు, చెన్నై పర్యాటకులను ఆకర్షిస్తున్న హార్సిలీహిల్స్‌పై స్టార్‌హోటల్ స్థాయి వసతులు కల్పించేందుకు పర్యాటకశాఖ దృష్టికి తీసుకెళ్లాం. – మిట్టపల్లె భాస్కర్‌రెడ్డి, ఏపీటీడీసీ డైరెక్టర్ పరిశీలన పూర్తి హార్సిలీహిల్స్‌పై టూరిజం కార్యకలాపాల విస్తరణ, ఆధునీకరణ పనులపై ఉన్నతస్థాయి అధికార బృందం పరిశీలనలు పూర్తి చేసింది. భవిష్యత్తులో హార్సిలీహిల్స్ ఆదాయం భారీగా పెంచుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. –నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, టూరిజం మేనేజర్, హార్సిలీహిల్స్ -
తగ్గేదెలే! ఆపిల్ ఇండియా దూకుడు
న్యూయార్క్: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియా ఆదాయం దాదాపు రెండింత లైంది. జూన్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 83 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతఏడాదితో పోలిస్తే 2శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్ల ఆదాయ సాధించినట్లు ఆపిల్ తెలిపింది. జూన్ 25తో ముగిసిన 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను ఆపిల్ గురువారం వెల్లడించింది. తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని సాధించామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. సరఫరా పరిమితులు, బలమైన విదేశీ మారకపు సవాళ్లు, రష్యా ప్రభావం ఉన్నప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు. అలాగే అమెరికా, యూరప్, మిగిలిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జూన్ త్రైమాసికంలో రికార్డు నెలకొల్పామన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాంలో రెండంకెల వృద్ధిని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో జూన్ త్రైమాసిక ఆదాయ రికార్డు సృష్టించామని తెలిపారు. ఈ క్రమంలో ఇండియాలో దాదాపు రెట్టింపు ఆదాయాన్ని సాధించామని కుక్ వెల్లడించారు. జూన్ త్రైమాసికంలో కంపెనీ సేవల ఆదాయం 19.6 బిలియన్ల డాలర్ల రికార్డు ఆదాయం నమోదు చేశామని యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లూకా మిస్త్రి తెలిపారు. మైక్రో ఎకానమీ కష్టాలు, రష్యాలో తమ వ్యాపారం లాంటి ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ 12 శాతం ఎగిసినట్టు వెల్లడించారు. -
రైతుల ఆదాయం పెరుగుతోంది
హిమ్మత్‌నగర్: రైతుల ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వివిధ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్లు మాత్రమే కాగా, ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు. మొట్టమొదటి సారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ రూ.1లక్ష కోట్ల మార్కు దాటిందన్నారు. ఈ పరిశ్రమల్లో కోటిన్నర మందికి ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు. సబర్కాంత జిల్లా హిమ్మత్‌నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుందని ఆయన చెప్పారు. -
జాతీయ ఆదాయంలో.. ‘వ్యవసాయం’ వాటా తగ్గుతోంది
సాక్షి, అమరావతి: జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గిపోతోందని, అదే సమయంలో దేశంలో సాగుచేసే వారి సంఖ్య పెరుగుతోందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే, ఇతర దేశాలతో పోలిస్తే వ్యవసాయ కూలీల సంఖ్య దేశంలో ఆశించిన స్థాయిలో తగ్గలేదని, రైతుల ఆదాయం కూడా పెరగడంలేదని ఆ నివేదిక పేర్కొంది. 21వ శతాబ్దంలో.. వ్యవసాయ రంగంలో సవాళ్లు–అనుసరించాల్సిన విధానాలపై నాబార్డు అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. నివేదిక ముఖ్యాంశాలు ఇవీ.. ► జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 1991లో 27.3 శాతం ఉండగా 2019 నాటికి 16.7 శాతానికి తగ్గిపోయింది. ► అయితే, ఇతర దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఉద్యోగుల సంఖ్య బాగా క్షీణించినప్పటికీ దేశంలో మాత్రం ఆ తగ్గుదల చాలా తక్కువగా ఉంది. ► 1993–94 ఆర్థిక సంవత్సరంలో సాగుచేసే వారి సంఖ్య దేశంలో 138 మిలియన్లుండగా 2019–20 నాటికి 166 మిలియన్లకు పెరిగింది. పురుషులతో పాటు మహిళా సాగుదారుల సంఖ్య కూడా పెరిగింది. ► సాగు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో రైతుల ఆదాయం పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. రైతుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిసారించాలి. వేగవంతమైన రేటుతో రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయోత్పత్తిలో మార్పు అవసరం. ► ఉత్పాదకత పెరుగుదల, సగటు వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరల కల్పించడం, విస్తరణ వంటి బహుముఖ వ్యూహం ద్వారా మార్కెటింగ్ అనుబంధ కార్యకలాపాలను చేపట్టాలి. ► అలాగే.. రైతులను వ్యవసాయేతర వృత్తుల వైపు మార్చడంపైన దృష్టిసారించాలి. ► ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం దేశంలో ఇంకా చాలామంది కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అయితే, ఇతర దేశాల్లో ఈ రంగంపై ఆధారపడిన కూలీల సంఖ్య బాగా తగ్గింది. ► వ్యవసాయం నుంచి శ్రామిక శక్తిని పారిశ్రామిక రంగం వైపు మళ్లించడంలో ఆ రంగం వైఫల్యాలే కారణం. అందుకే దేశంలో అత్యధిక సంఖ్యలో కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం నుండి తయారీ, సేవల వరకు అవకాశాలను కల్పించేందుకు అన్వేషించాలి. ► వ్యవసాయం, వ్యవసాయేతర ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడంపై ఆలోచన చేయాలి. సవాళ్లపై దృష్టిపెట్టాలి ఇక 21వ శతాబ్దంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారించడంతో పాటు అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని నాబార్డు నివేదిక సూచించింది. అలాగే, కొన్ని దశల్లో వ్యవసాయంలో అధిక వృద్ధిరేటు.. దేశంలో ఆహార పదార్థాల వాస్తవ ధరలను తగ్గించలేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడానికి నైపుణ్యం అవసరమని.. ఇందులో భాగంగా, గ్రీన్హౌస్ సాగు, పాలీ హౌసెస్, టిష్యూ కల్చర్ విధానాలు అనుసరించడం ద్వారా సగటు వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచుతుందని నివేదిక తెలిపింది. ప్రజల ప్రాధాన్యతలను, రైతుల ఆదాయాన్ని పెంచే జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పద్ధతులను అనుసరించాలని వివరించింది. -
సూర్యలంక బీచ్‌లో వీకెండ్ జోష్.. రాబడి కుష్
హోరుగాలికి లయబద్ధంగా కేరింతలు కొడుతున్నట్టు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. అలలతోపాటే ఎగిరెగిరి పడుతూ ఆనందగానం చేస్తున్నట్టు కిలకిలారావాలు చేసే వలస పక్షుల విన్యాసాలు.. ప్రకృతి సరికొత్త ‘అల’ంకారమేదో అద్దినట్టు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మిలమిలా మెరుస్తూ కనువిందు చేసే సాగర జలాలు.. స్వచ్ఛమైన గాలి వీచే సుందర అటవీప్రాంతం.. ఇవన్నీ సూర్యలంక సొంతం. అందుకే ఈ తీరాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారాంతాల్లో అధికసంఖ్యలో పోటెత్తుతున్నారు. సాక్షి, బాపట్ల: వీకెండ్ వస్తే చాలు.. సూర్యలంక తీరం కోలాహలంగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయం పెరుగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల నష్టపోయిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. సూర్యలంక ప్రత్యేకతలివే.. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఈ తీరంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ రెండుకిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉంటాయి. ఇవి పర్యాటకులకు స్వచ్ఛమైన గాలులతో స్వాగతం పలుకుతాయి. ఈ తీరంలో అడపాదడపా డాల్ఫిన్లు విన్యాసాలు చేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. రవాణా మార్గం.. అనుకూలం బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే సూర్యలంక ఉంటుంది. రవాణా మార్గం అనువుగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచీ యువత వారాంతంలో సూర్యలంకకు తరలివస్తారు. ఇక్కడ పర్యాటకులకు సకల వసతులూ అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు సమీపంలో ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం, పొన్నూరులోని ఏకశిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ. కలెక్టర్ చొరవతో.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే విజయకృష్ణన్ సూర్యలంక తీరంపై దృష్టిపెట్టారు. ఈ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్‌జిందాల్ సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం సేవించి హల్చల్ చేసే మందుబాబులకు రూ.పదివేలు జరిమానా విధించాలని ఆదేశించారు. పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సూర్యలంక తీరంలో పర్యాటకాభివృద్ధికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాల భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు కేటాయించిన భూముల్లోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ చైర్మన్ ఆరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు. పెరిగిన ఆదాయం తీరంలో పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతోంది. గతంలో నెలకు సగటున రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం రూ.40 లక్షలకు చేరుకుందని పేర్కొంటున్నారు. ఏడాదికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు వివరిస్తున్నారు. 32 రూమ్‌లతో సూర్యలంక తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
ఏయే ఆదాయానికి ట్యాక్స్ మినహాయింపులిస్తారో..ఇవ్వరో మీకు తెలుసా!
గత వారం ‘ఇతర ఆదాయాలు’ శీర్షిక కింద వచ్చే వివిధ అంశాలను తెలుసుకున్నాం. ఈవారం ఏయే ఆదాయానికి మినహాయింపులిస్తారో..వేటి విషయంలో మినహాయింపులివ్వరో తెలుసుకుందాం. ♦డివిడెండు, వడ్డీని ఆదాయంగా లెక్కించినప్పుడు బ్యాంకరుకు ఇచ్చిన కమీషన్, పారితోషికం, ఇతర ఖర్చులు, వీటిని వసూలు చేయటానికి పెట్టిన ఖర్చులకు మినహాయింపులు ఇస్తారు. షరా మామూలుగానే ఖర్చు సమంజసంగా ఉండాలి. కాగితాలు, రుజువులు ఉండాలి. ♦ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్‌ల మీద వచ్చే అద్దె/ఆదాయం విషయంలో.. చెల్లించిన అద్దెపరమైన పన్నులు, రిపేర్లు, ఇన్సూరెన్స్, తరుగుదల మొదలైనవి తగ్గిస్తారు. ♦ చాలా మంది ఇంటద్దెని రెండు భాగాలుగా చేసి కొంత ఇంటి మీద అద్దె .. కొంత ఫర్నిచర్ మీద అద్దె అని ప్లానింగ్ చేస్తారు. ఇంటద్దె మీద ఏ కాగితాలు, వివరణ, సంజాయిషీ లేకుండా 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అద్దెలో అంత వెసులుబాటు ఉండదు. ♦ ఇతర ఆదాయం కింద పరిగణించేటప్పుడు దానిలో మినహాయింపులు రూ. 15,000 లేదా 1/3వ భాగం .. ఈ రెండింటిలో ఏది తక్కువయితే అదే ఇస్తారు. ♦ఏ ఆదాయం ఉన్నా/వచ్చినా సంబంధిత ఖర్చుని మినహాయిస్తారు. వివరణ, రుజువులు కావాలి. ♦ గుర్రాలను పోషిస్తూ, పోటీలు నిర్వహించే వారికి సంబంధిత ఖర్చులు మినహాయింపు ఇస్తారు. ♦నష్టపరిహారం విషయంలో ఖర్చులుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ♦అలాగే కొన్ని ఆదాయాల లెక్కింపులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. వ్యక్తిగత ఖర్చులు ♦క్యాపిటల్ ఖర్చులు .. ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, మొదలైనవి. ♦ఆస్తి పన్ను (మున్సిపల్ పన్ను కాదు) ♦విదేశంలోని ఖర్చులు ♦విదేశాల్లో ఉన్నవారికి ఇచ్చిన జీతాలు ♦లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, రేసులు, గేమ్స్, బెట్టింగ్, జూదం మొదలైన వాటి మీద వచ్చే లాభాలను/పారితోషికం/ఆదాయం మొదలైన వాటిని ‘ఇతర ఆదాయం’ కింద వర్గీకరించి, ఆదాయంగా భావిస్తారు. అంతే కాకుండా ఎటువంటి ఖర్చులను మినహాయింపుగా ఇవ్వరు. ♦చివరగా దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏమిటంటే ఆదాయం విషయంలో సంబంధిత ఖర్చులు సమంజసంగా ఉన్నంత వరకు, వివరణ/రుజువులు/కాగితాలతో సమర్ధించుకోవాలి. పన్ను తగ్గించుకునే ప్రయత్నంలో తొందరపడొద్దు. -
పెరగనున్న మాల్స్ ఆదాయం..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాదితో పోలిస్తే 2022–23లో మాల్స్ అద్దె ఆదాయం 30 శాతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ప్రధానంగా డిమాండ్ పెరగడం, కోవిడ్–19 వ్యాక్సిన్లు అత్యధికులకు ఇవ్వడం, మల్టీఫ్లెక్స్‌లు పునఃప్రారంభం ఇందుకు కారణం. 2021 ఆగస్ట్ నుంచి రిటైల్ మాల్స్ కార్యకలాపాల రికవరీ ప్రారంభమైంది. ఒమిక్రాన్ కారణంగా క్లుప్త విరామం మినహా 2021–22 అర్ధ భాగం మెరుగ్గా కొనసాగింది. మూడవ త్రైమాసికంలో రిటైల్ వ్యాపారం విలువ పరంగా కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో ఈ వ్యాపార విలువను మించిపోయింది. 2022–23 మూడవ త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయిలో వినియోగదార్ల రాక ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్స్‌కు 2019–20 స్థాయి కంటే 4–6 శాతం అధిక అద్దె ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ మరింత మెరుగు అవుతుంది’ అని ఇక్రా వివరించింది.