నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్‌ రియాక్షన్‌ | BITS Pilani Dropout youtuber earns rs 35 Lakh Last Month Ashneer Grover shocking Reaction | Sakshi
Sakshi News home page

నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్‌ రియాక్షన్‌

Published Thu, Jul 18 2024 4:34 PM | Last Updated on Thu, Jul 18 2024 4:34 PM

BITS Pilani Dropout youtuber earns rs 35 Lakh Last Month Ashneer Grover shocking Reaction


బిట్స్‌ పిలానీ డ్రాప్‌అవుట్‌  సంపాదన చూసి  దిగ్గజాలకు సైతం  విస్మయం!

గత నెలలో నా సంపాదన  రూ. 35 లక్షలు : యూట్యూబర్‌ ఇషాన్ శర్మ

బిట్స్‌ పిలానీ డ్రాప్‌అవుట్‌, 20యేళ్ల యూట్యూబర్‌ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్‌ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్‌ ఎలా స్టార్ట్‌ చేయాలి ‘లీక్డ్‌’ పేరుతో నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో ఇషాన్‌ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు.  దీనికి సంబంధించిన చిన్న  క్లిప్‌ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.

విషయం ఏమిటంటే  2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి  అనే అంశంపై భారత్‌పే  ఫౌండర్‌ అష్నీర్ గ్రోవర్‌, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్‌ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్‌1 పోడ్‌కాస్ట్‌లో భాగంగా  ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్‌ గ్రోవర్‌ వంతైంది.  ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్‌శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్‌)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.

 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు,  ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్‌ మనీ అంటాడేంటి భయ్యా అని  మరొక నెటిజన్‌  వ్యాఖ్యానించాడు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement