ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నిమిషాల్లో వేడి వేడి ఫుడ్‌ను మన కాళ్ల దగ్గరకు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ మూడ్ లోనో, ఓపికలేనపుడో, వర్షం వచ్చినపుడో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దాదాపుఅందరికీ అలవాటే. అందరిలాగా తానూ చేస్తే కిక్ ఏముంది అనుకున్నారో ఏమోగానీ, ఒక జంట తమ ఎంగేజ్‌మెంట్ సెర్మనీకి వచ్చిన అతిథులకు ఏకంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై మీమ్స్ ఫన్సీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఒక జంట వారి నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ క్యాటరింగ్‌కు బదులుగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకు హాజరైన వ్యక్తి ఈ విషయాన్ని గమనిం చాడు. డెలివరీ బాయ్. ఫంక్షన్‌లో ఉన్న ఒక టేబుల్‌పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్‌ల వరుసలను పేర్చుతున్న చిత్రాన్ని షేర్ చేసారు. ఇది వైరల్‌గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.
ఈ కుర్రాళ్ల కంటే ఉపయోగించినట్టుగా, క్రేజీ డీల్‌ను ఇంకెవరూ ఇలా వాడలేదు.. పెళ్లి భోజనాలు కూడా మా దగ్గరే ఆర్డర్ చేసుకోండి’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. భోజనాలు వాళ్లింట్లో, చదివింపులు(జీపే) మాకు అంటూ ఒకరు, వాళ్ల యూపీఐ క్యూఆర్ పెడతారు అని ఒక కోడ్‌ని ఉంచుతారు. మరో యూజర్, వాళ్ల నిశ్చితార్థం, వాళ్ల పైసలు, వాళ్ల ఇష్టం..ఇక్కడ సమస్య కనిపించడం లేదు’’ అంటూ మరొకరు పన్నీగా కమెంట్ చేశారు.
no one has used our Crazy Deals better than these guys 😭😭 shaadi ka khana bhi humse mangwa lena 🥰 https://t.co/XIo2z2TnYX
— Swiggy Food (@Swiggy) August 4, 2024
Comments
Please login to add a commentAdd a comment