మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ పాస్‌పోర్ట్స్‌ లిస్ట్‌ : టాప్‌లో సింగపూర్‌, మరి ఇండియా? | Henley Passport Index Worlds Most Powerful Passports 2024 List check where is Indian Passport | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ పాస్‌పోర్ట్స్‌ లిస్ట్‌ : టాప్‌లో సింగపూర్‌, మరి ఇండియా?

Published Wed, Jul 24 2024 11:36 AM | Last Updated on Wed, Jul 24 2024 12:21 PM

Henley Passport Index Worlds Most Powerful Passports 2024 List  check where is Indian Passport

ప్రపంచంలోనే  శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ కలిగిన దేశాల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌’  విడుదల చేసింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ర్యాంకింగ్  డేటా  ఆధారంగా  దీన్ని  రూపొందించింది.  ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్‌   మూడు స్థానాలు పైకి ఎగబాకింది .ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో  ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు  ప్రయాణించవచ్చు. గతంలోఈ అనుమతి  59 దేశాలకు ఉండేది. 

సింగపూర్‌ టాప్‌ 
సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా  నిలిచింది. ఈ జాబితా ప్రకారం 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తోంది. జపాన్‌, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ , స్పెయిన్ రెండో స్థానంలో  ఉన్నాయి. పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు 192 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత, ర్యాంకింగ్‌లో మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా ,స్వీడన్‌లు 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి.

హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌  ప్రకారం న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్ , స్విట్జర్లాండ్‌లతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా  పోర్చుగల్ 5వ స్థానాన్ని పంచుకోగా,  అమెరికా 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సెనెగెల్‌, తజకిస్థాన్‌ దేశాలు 82వ స్థానంలోఉన్నాయి.  పాకిస్థాన్‌ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.  ఇక ఈ జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చు.  

2024  అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల టాప్‌ -10 జాబితా
సింగపూర్ (195 గమ్యస్థానాలు)
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192)
ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191)
బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ (190)
ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189)
గ్రీస్, పోలాండ్ (188)
కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187)
అమెరికా (186)
ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185)
ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement