powerful Passport
-
మోస్ట్ పవర్ ఫుల్ పాస్పోర్ట్స్ లిస్ట్ : టాప్‌లో సింగపూర్, మరి ఇండియా?
ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ విడుదల చేసింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) ర్యాంకింగ్ డేటా ఆధారంగా దీన్ని రూపొందించింది. ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలు పైకి ఎగబాకింది .ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణించవచ్చు. గతంలోఈ అనుమతి 59 దేశాలకు ఉండేది. సింగపూర్ టాప్ సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ జాబితా ప్రకారం 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తోంది. జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ , స్పెయిన్ రెండో స్థానంలో ఉన్నాయి. పాస్‌పోర్ట్ హోల్డర్లకు 192 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత, ర్యాంకింగ్‌లో మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా ,స్వీడన్లు 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్ , స్విట్జర్లాండ్లతో పాటు యునైటెడ్ కింగ్డమ్ నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పోర్చుగల్ 5వ స్థానాన్ని పంచుకోగా, అమెరికా 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సెనెగెల్, తజకిస్థాన్ దేశాలు 82వ స్థానంలోఉన్నాయి. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చు. 2024 అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల టాప్ -10 జాబితాసింగపూర్ (195 గమ్యస్థానాలు)ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192)ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191)బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190)ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189)గ్రీస్, పోలాండ్ (188)కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187)అమెరికా (186)ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185)ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184) -
ఫ్రాన్స్ పాస్‌పోర్టు చాలా పవర్ఫుల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంక్స్–2024’ ఈ మేరకు పేర్కొంది. ఇందులో భారత పాస్‌పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానం పడిపోయింది. గతేడాది ఇండియా పాస్పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది! అత్యంత శక్తివంతమైన ఫ్రాన్స్ పాస్‌పోర్టు కలిగి ఉంటే 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. పాకిస్తాన్ పాస్‌పోర్టు ఈసారి కూడా 106వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పాస్‌పోర్టు ర్యాంకు 101 నుంచి 102కు పడిపోయింది. చిన్నదేశమైన మాల్దీవుల పాస్‌పోర్టు ర్యాంకు 58. ఈ పాస్‌పోర్టు ఉంటే 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తుంటారు. ఇందుకోసం గత 19 ఏళ్ల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 199 పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తారు. వీసా లేకున్నా తమ దేశంలో పర్యటించే అవకాశం కలి్పస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో సగటున 58 దేశాల్లో వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది. -
ప్రపంచంలో నెం.1 పాస్‌పోర్ట్ ఏదో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మరోసారి జపాన్ పాస్‌పోర్టు ఎంపికయింది. ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’లో ఇలా జపాన్ పాస్‌పోర్ట్ ఎంపికవడం ఇది వరుసగా మూడోసారి. ఇందుకు కారణం ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ప్రపంచంలో 191 దేశాలు తిరిగి రావచ్చు. ఆ తర్వాత సింగపూర్ పాస్‌పోర్ట్ రెండో స్థానంలో, ఆ తర్వాత దక్షిణ కొరియా, జర్మనీ దేశాల పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఎంపికయ్యాయి. సింగపూర్ పాస్‌పోర్టు ద్వారా ప్రపంచంలో వీసా లేకుండా 190 దేశాలు, దక్షిణ కొరియా, జర్మనీ పాస్‌పోర్టుల ద్వారా 189 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలు స్థానాలు క్రమంగా ఇండెక్స్‌లో పడిపోతూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతోపాటు బెల్జియం, గ్రీస్, నార్వే దేశాల పాస్‌పోర్టులు ఎనిమిదవ స్థానంలో ఎంపికయ్యాయి. ఈ ఐదు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 184 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలు 2015లో మొదటి స్థానంలో ఉండగా, గతేడాది ఆరవ స్థానంలోకి పడిపోయాయి. వీసా అవసరం లేకుండా 188 దేశాలను తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫిన్లాండ్, ఇటలీ దేశాల పాస్‌పోర్ట్‌లు నాలుగో స్థానంలో, 187 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న డెన్మార్క్, లగ్జెమ్‌బర్గ్, స్పెయిన్ ఐదో స్థానంలో, 186 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫ్రాన్స్, స్వీడన్ ఆరవ స్థానంలో, ఆస్ట్రియా, ఐర్లాండ్, నెదర్లాండ్, పోర్చుగల్, స్విడ్జర్లాండ్ పాస్‌పోర్టులు ఏడో స్థానంలో ఎంపికయ్యాయి. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్ తొమ్మిదవ స్థానంలో, హంగరి, లిథ్వానియా, స్లొవాకియా పాస్‌పోర్ట్‌లు పదవ స్థానంలో ఎంపికయ్యాయి. వీసా అవసరం లేకుండా 58 దేశాలు మాత్రమే తిరిగొచ్చే అవకాశం ఉన్న భారత పాస్‌పోర్ట్ 84వ స్థానంలో ఎంపికయింది. ఇది 2019లో 86వ స్థానంలో ఎంపికకాగా ఈ ఏడాది రెండు స్థానాలు మెరుగుపడింది. -
పాస్‌పోర్ట్ జాబితాలో దేశానికి 84వ స్థానం
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న జాబితాలో భారతదేశానికి 84 స్థానం దక్కినట్లు హెన్లీ అండ్ పార్టనర్స్ ప్రకటించిన రిపోర్టులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా భారత్ 58 స్కోరును సాధించింది. దీంతో భారతీయులు వీసా, పాస్‌పోర్ట్‌లు లేకుండానే 58 దేశాలు వెళ్లడానికి అనుమతి ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. కాగా తజికిస్తాన్, మౌరిటానియాలతో కలిసి భారత్ స్థానాన్ని పంచుకొంది. ఇక అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న టాప్ 10 దేశాలలో జపాన్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాత వరుసగా సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఈ జాబితాలో సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచాయి. ఇక ఆప్ఘనిస్తాన్ అత్యంత చెత్త పాస్‌పోర్ట్ కలిగి ఉన్న దేశంగా ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. కాగా గతేడాదితో పోలిస్తే భారతదేశం రెండు స్థానాలను కోల్పోయి 58 వ స్థానంలో నిలిచింది. -
జపాన్ పాస్‌పోర్ట్.. మోస్ట్ పవర్ఫుల్
పాస్‌పోర్ట్‌కు పవర్ ఏంటి అనుకుంటున్నారా? పాస్‌పోర్ట్‌లకు కూడా పవర్ ఉంటుంది. అంటే.. పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా అవసరం లేని ప్రయాణాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో ఆ దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. ఆ ప్రాతిపదికన ప్రస్తుతం జపాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. జపాన్ దేశస్తులు వీసా అవసరం లేకుండా వెళ్లే 190వ దేశంగా మయన్మార్‌కు ఇటీవలే గుర్తింపు లభించింది. అంటే, జపాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 190 దేశాలకు వీసా లేకుండా కానీ, ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలోనే వీసా పొందే అవకాశంతో కానీ ప్రయాణం చేయొచ్చు. ఈ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ దేశాల జాబితాలో రెండో స్థానంలో 189 దేశాలతో సింగపూర్, మూడో స్థానంలో 188 దేశాలతో ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికాలు నిలిచాయి. మన భారత్ స్థానం ఏంటని ఆలోచిస్తున్నారా? మన పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా కానీ, వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా కానీ 59 దేశాలకు వెళ్లొచ్చు. అంటే పవర్ఫుల్ పాస్ పోర్ట్ ఉన్న దేశాల జాబితాలో మన స్థానం 76. ఈ మధ్యే 78 నుంచి 76వ స్థానానికి ఎదిగాం. అగ్రదేశాలైన అమెరికా లేదా బ్రిటన్ల పాస్‌పోర్ట్‌తో 186 దేశాలను వీసా లేకుండా చుట్టేయొచ్చు. ప్రస్తుతం ఈ దేశాల స్థానం ఐదు కాగా, 2015లో ఈ రెండే అగ్రస్థానంలో ఉన్నాయట. విశేషమేంటంటే.. ఈ రేసులో ముందంజలో ఉంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం 2006లో ఉన్న 62వ స్థానం నుంచి వేగంగా ముందంజ వేసి ఇప్పుడు 21వ స్థానానికి చేరింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ ర్యాంకింగ్‌లు రూపొందించింది. లాభాలేంటి? సాధారణంగా వీసా లేనిదే విదేశీ పర్యటనలు సాధ్యం కాదు. దాని కోసం డబ్బు కట్టి దరఖాస్తు చేసుకుని అవసరమైతే ఇంటర్వ్యూ, ఆపై ప్రాసెసింగ్ పూర్తయితే వీసా వస్తుంది. అలాంటి వీసా అవసరమే లేకుండా పాస్‌పోర్ట్‌తోనే విదేశీ పర్యటనలకు వెళ్లడం ఈజీ కదా. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో వీసా ఫ్రీ పర్యటనకు అవకాశం లభిస్తుంది. -
ఇండియా పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ ఇదే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల్లో భారతదేశం 76వ స్థానంలో నిలిచింది. హెన్లే అండ్ పార్ట్నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2018 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పాస్‌పోర్టు మాత్రమే ఉండి, ముందుగా వీసా తీసుకోకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరనే అంశం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ దేశ పాస్‌పోర్ట్‌తో 189 దేశాలకు ముందుగా వీసా లేకుండా వెళ్లోచ్చు. సింగపూర్, జర్మనీ సంయుక్తంగా రెండవ స్థానంలో( 188 దేశాలకు వెళ్లోచ్చు) నిలిచాయి. డెన్మార్గ్, ఫిన్లాండ్, ప్రాన్స్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అధ్యయన సమాచారం ఆధారంగా 199 దేశాల పాస్‌పోర్టులు పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయించారు. -
చైనా, పాక్ కంటే మనమే బెటర్!
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు జర్మనీ దేశానికి ఉందట. ఒక పాస్‌పోర్టు మాత్రమే ఉండి, ముందుగా వీసా తీసుకోకుండా (వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ ఎరైవల్‌తో) ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా వివిధ దేశాల పాస్‌పోర్టులకు స్కోర్లు, ర్యాంకులను ఆర్టన్ కేపిటల్ సంస్థ ప్రకటించింది. అందులో జర్మనీ 157 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని సింగపూర్ 156 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న దక్షిణ కొరియాను వెనక్కి నెట్టింది. ఇక మన దేశానికి ఈ విషయంలో స్కోరు 46 మాత్రమే వచ్చి 78వ స్థానంలో నిలిచింది. కానీ చైనా, పాకిస్థాన్ దేశాల కంటే మాత్రం మనం చాలా ముందున్నాం. అవి ఇంకా వెనకబడ్డాయి. మొత్తం ఎన్ని దేశాల పాస్‌పోర్టులను పరిశీలించారన్న విషయాన్ని ప్రస్తావించలేదు గానీ, అఫ్ఘానిస్థాన్ మాత్రం కేవలం 23 స్కోరుతో జాబితాలో అట్టడుగున నిలిచింది. వివిధ దేశాలు తమ దేశానికి ఫలానా దేశం నుంచి వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని కల్పిస్తాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం పలు దేశాలకు ఈ సదుపాయాన్ని కల్పించగా, ప్రతిగా మరిన్ని దేశాలు మనవాళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం ఇచ్చాయి. దీని వల్ల ప్రయాణానికి ముందే వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడకు వెళ్లిన తర్వాత విమానాశ్రయాల్లో ఉండే ప్రత్యేక కౌంటర్లలో విజిటర్స్ వీసా తీసుకోవచ్చన్న మాట. -
ప్రపంచంలో జర్మనీ పాస్‌పోర్టు శక్తిమంతం
దుబాయ్: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా, భారత్ 78వ ర్యాంకు సాధించింది. జర్మనీకి వీసాఫ్రీ స్కోర్ 157 ఉండగా, ఆసియాలో సింగపూర్ 156 స్కోరుతో దక్షిణ కొరియాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌కు వీసాఫ్రీ స్కోర్ 46గా ఉంది. చైనా, పాకిస్తాన్‌లు వరుసగా 58, 94 ర్యాంకుల్లో ఉన్నాయి. ఏదైనా ఒక దేశ పాస్పోర్టుతో వీలైనన్ని ఎక్కువ దేశాల్లో వీసా అవసరం లేకుండా గానీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆధారంగా ప్రవేశం పొందడాన్ని, ఇతర వివరాలను బట్టి వీసాఫ్రీ స్కోర్‌ను లెక్కగడతారు. దీన్నిబట్టి పాస్‌పోర్టు ర్యాంకులను కేటాయిస్తారు. ఆర్టాన్ కేపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ అత్యంత తక్కువ స్కోరు (23)తో ఉంది.