
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న జాబితాలో భారతదేశానికి 84 స్థానం దక్కినట్లు హెన్లీ అండ్ పార్టనర్స్ ప్రకటించిన రిపోర్టులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా భారత్ 58 స్కోరును సాధించింది. దీంతో భారతీయులు వీసా, పాస్‌పోర్ట్‌లు లేకుండానే 58 దేశాలు వెళ్లడానికి అనుమతి ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. కాగా తజికిస్తాన్, మౌరిటానియాలతో కలిసి భారత్ స్థానాన్ని పంచుకొంది. ఇక అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న టాప్ 10 దేశాలలో జపాన్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాత వరుసగా సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ ఈ జాబితాలో సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచాయి. ఇక ఆప్ఘనిస్తాన్ అత్యంత చెత్త పాస్‌పోర్ట్ కలిగి ఉన్న దేశంగా ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. కాగా గతేడాదితో పోలిస్తే భారతదేశం రెండు స్థానాలను కోల్పోయి 58 వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment