ప్రపంచంలో జర్మనీ పాస్‌పోర్టు శక్తిమంతం
దుబాయ్: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా, భారత్ 78వ ర్యాంకు సాధించింది. జర్మనీకి వీసాఫ్రీ స్కోర్ 157 ఉండగా, ఆసియాలో సింగపూర్ 156 స్కోరుతో దక్షిణ కొరియాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌కు వీసాఫ్రీ స్కోర్ 46గా ఉంది. చైనా, పాకిస్తాన్‌లు వరుసగా 58, 94 ర్యాంకుల్లో ఉన్నాయి.
ఏదైనా ఒక దేశ పాస్‌పోర్టుతో వీలైనన్ని ఎక్కువ దేశాల్లో వీసా అవసరం లేకుండా గానీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆధారంగా ప్రవేశం పొందడాన్ని, ఇతర వివరాలను బట్టి వీసాఫ్రీ స్కోర్‌ను లెక్కగడతారు. దీన్నిబట్టి పాస్‌పోర్టు ర్యాంకులను కేటాయిస్తారు. ఆర్టాన్ కేపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ అత్యంత తక్కువ స్కోరు (23)తో ఉంది.