చైనా, పాక్ కంటే మనమే బెటర్!
చైనా, పాక్ కంటే మనమే బెటర్!
Published Wed, Jan 18 2017 10:47 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు జర్మనీ దేశానికి ఉందట. ఒక పాస్‌పోర్టు మాత్రమే ఉండి, ముందుగా వీసా తీసుకోకుండా (వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ ఎరైవల్‌తో) ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా వివిధ దేశాల పాస్‌పోర్టులకు స్కోర్లు, ర్యాంకులను ఆర్టన్ కేపిటల్ సంస్థ ప్రకటించింది. అందులో జర్మనీ 157 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని సింగపూర్ 156 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న దక్షిణ కొరియాను వెనక్కి నెట్టింది. ఇక మన దేశానికి ఈ విషయంలో స్కోరు 46 మాత్రమే వచ్చి 78వ స్థానంలో నిలిచింది. కానీ చైనా, పాకిస్థాన్ దేశాల కంటే మాత్రం మనం చాలా ముందున్నాం. అవి ఇంకా వెనకబడ్డాయి.
మొత్తం ఎన్ని దేశాల పాస్‌పోర్టులను పరిశీలించారన్న విషయాన్ని ప్రస్తావించలేదు గానీ, అఫ్ఘానిస్థాన్ మాత్రం కేవలం 23 స్కోరుతో జాబితాలో అట్టడుగున నిలిచింది. వివిధ దేశాలు తమ దేశానికి ఫలానా దేశం నుంచి వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని కల్పిస్తాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం పలు దేశాలకు ఈ సదుపాయాన్ని కల్పించగా, ప్రతిగా మరిన్ని దేశాలు మనవాళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం ఇచ్చాయి. దీని వల్ల ప్రయాణానికి ముందే వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడకు వెళ్లిన తర్వాత విమానాశ్రయాల్లో ఉండే ప్రత్యేక కౌంటర్లలో విజిటర్స్ వీసా తీసుకోవచ్చన్న మాట.
Advertisement
Advertisement