సాక్షి, న్యూఢిల్లీ : చైనా కేంద్రంగా కరోనా వైరస్ పలు ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో భారత ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే ట్రావెలర్స్‌కు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇమిగ్రేషన్ బ్యూరో, హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించాయి. మరోవైపు చైనాలో 44 తాజా మరణాలతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2,788కి చేరింది. చైనా వ్యాప్తంగా గురువారం 433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 78,824కు పెరిగింది. ఈ డెడ్లీ వైరస్ బయటపడిన హుబేయ్ ప్రావిన్స్‌లోనే నూతన కేసులు, మృతుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment