Ministry of Home Affairs
-
తిరుమలలో వరుస ఘటనలు: కేంద్ర హోంశాఖ సీరియస్
తిరుపతి: తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs) సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈనెల 8 వ తేదీన తిరుమలలో జరిగిన తొక్కిసలాట, 13వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలపై ఇప్పటికే కేంద్రం నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అదనపు కార్శిదర్శి సంజీవ్ కుమార్ తిరుమలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధానంగా తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై సోమవారం సమీక్షనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ భేటీ కానున్నారు. వరుసగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై టీటీడీ అధికారుల నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది. తిరుమలలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పర్యటనపై ఆసక్తి నెలకొంది.పాలకుల వైఫల్యం.. భక్తులకు శాపంఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ(TTD) పాలకుల మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం -
ఎస్ఎమ్ఎస్ స్కామర్లపై డాట్ కొరడా.. బ్లాక్‌లిస్ట్‌లో 8 సంస్థలు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT), కేంద్ర హోమ్ శాఖ సహకారంతో సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మోసపూరిత కమ్యూనికేషన్లను పంపినందుకు ఎనిమిది ఎస్ఎమ్ఎస్ హెడర్లను బ్లాక్‌లిస్ట్ చేసినట్లు తెలిపింది.గత మూడు నెలల్లో ఈ ఎనిమిది హెడర్ల నుంచి 10,000 కంటే ఎక్కువ మోసపూరిత సందేశాలు వెళ్లాయి. అదే సమయంలో ఈ సందేశాలను పంపించడానికి ఉపయోగించిన 73 ఎస్ఎంఎస్ హెడ్డర్స్, 1522 కంటెంట్ టెంప్లేట్లను డాట్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. కాబట్టి ఈ హెడ్డర్స్ ఇకపై ఎలాంటి మెసేజ్‌లను పంపించలేవు.మోసపూర్తి ఎస్ఎమ్ఎస్ల నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర హోమ్ శాఖ 'సంచార్ సాతీ' కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైనా మోసపూరిత సందేశాలను అందుకున్నప్పుడు.. లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు వారు సంచార సాథీ పోర్టల్‌లోని చక్షు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా స్పామ్ మీద కంప్లైంట్ చేయడానికి 1909కి కాల్ చేయవచ్చు.. లేదా DND (డు నాట్ డిస్ట్రబ్) అనే సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. -
గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల లఖ్బీర్ ఖలిస్తానీ గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’ (బీకేఐ)కి చెందిన గ్యాంగ్‌స్టర్. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు. అదే విధంగా 2022 డిసెంబరులో తరన్ తరణ్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. అతను అనేక ఇతర తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. లఖ్బీర్ స్వస్థలం పంజాబ్ కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడ్డాడు. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో అతని హస్తం ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో లఖ్బీర్ సన్నిహితులతో సంబంధం ఉన్న 48 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), పంజాబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల అనంతరం కొంత మందిని అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 21న ఒక వ్యాపారిపై ఇద్దరు దుండగులు దాడి చేయడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. తాను లాండ హరికే అని చెప్పుకుంటూ ఓవ్యక్తి తనకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి పోలీసులకు చెప్పడంతో వారు దాడులు చేపట్టారు చదవండి: డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్ -
విపత్తులు ఎదుర్కొనే యంత్రాంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థాగత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర విపత్తుల నిర్వహణ బలగాల (ఎస్డీఆర్ఎఫ్) ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటుచేసే ఈ ప్రధాన కేంద్రంలోనే శిక్షణా కేంద్రాన్ని కూడా నెలకొల్పనుంది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 50 ఎకరాల్లో ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రం, శిక్షణ కేంద్రం నిర్మాణానికి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (రివైజ్డ్ డీపీఆర్)ను ఖరారు చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రూ.99.73 కోట్లతో ప్రధాన కేంద్రం దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన సముద్రతీరం (దాదాపు 972 కి.మీ) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. దీంతో ఏటా తుపాన్లు, వరదల ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోంది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను యుద్ధప్రాతిపదికన ఆదుకునేందుకు.. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండే వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం)లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రాలను కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎంకు 10 ఎకరాలు, ఎస్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎస్డీఆర్ఎఫ్కు కేటాయించిన 50 ఎకరాల్లో ప్రధాన కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్ ప్రణాళికకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రధాన కేంద్రంలో 154 మంది.. ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 154 మంది అధికారులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వీరిలో పర్యవేక్షణ స్థాయి ఉన్నతాధికారులు నలుగురు ఉంటారు. అలాగే, రెండు రెస్క్యూ టీమ్‌లలో అత్యవసర సేవలు అందించే అధికారులు, సిబ్బంది 94 మంది ఉండనున్నారు. అదేవిధంగా క్వార్టర్ మాస్టర్ గ్రూప్ సభ్యులు 15 మంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది 8 మంది, రవాణా విభాగం అధికారులు, సిబ్బంది 15 మంది, ప్రధాన కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు ఇద్దరు, ఫార్మసిస్టులు నలుగురు, మినిస్టీరియల్ సిబ్బంది 12 మంది ఉంటారు. ఆధునిక మౌలిక వసతులతో.. తుపాన్లు, వరదలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు సమర్థంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆధునిక మౌలిక వసతులను ఎస్డీఆర్ఎఫ్కు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.65 కోట్లతో ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 309 అధునాతన పరికరాలను రూ.21.74 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. అలాగే, రూ.39 కోట్ల వ్యయంతో వాహనాలను కూడా కొంటారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.77 లక్షలతో కంప్యూటర్లు, జీపీఎస్ ట్రాకర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారాన్ని అనుసంధానించేందుకు అధునాతన సాంకేతిక, సమాచార పరికరాలను రూ.1.50 కోట్లతో కొంటారు. అదేవిధంగా శిక్షణ కేంద్రంలో 10 రకాల శిక్షణ అందించేందుకు రూ.2 కోట్లతో పరికరాలను కొనుగోలు చేస్తారు. -
మణిపూర్ హింసాకాండపై విచారణకు కమిటీ ఏర్పాటు
ఇంఫాల్: ఇటీవల జరిగిన మణిపూర్ అల్లర్లపై విచారణకు గౌహతి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది కేంద్ర హోంశాఖ. కమిటీలో ఎవరెవరున్నారంటే... మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇటీవల ఇక్కడ పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మాట ప్రకారం కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వం వహిస్తారు. ఈ త్రిసభ్య కమిటీలో మిగిలిన ఇద్దరిలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ కాగా మరొకరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్. కమీషన్ల విచారణ చట్టం 1952(60 ఆఫ్ 1952) లోని సెక్షన్-3 ప్రకారం ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, విచారణను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆరు నెలల లోపే నివేదిక సమర్పించాలని కోరింది కేంద్ర హోంశాఖ. హైవే మీద అడ్డంకులను తొలగించండి... ఇదిలా ఉండగా నిత్యావసర వస్తువులను చేరవేసేందుకు వీలుగా ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై ఉంచిన అడ్డంకులను తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇది కూడా చదవండి: ఒడిశా పోలీస్ సీరియస్ వార్నింగ్.. -
వెంటాడు... వేటాడు...
పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ (సీపీఆర్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది. ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది. విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్ ఇచ్చామనీ, కానీ సీపీఆర్ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సీపీఆర్ కార్యాలయం, అలాగే ఆక్స్‌ఫామ్ ఇండియా, పలు డిజిటల్ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండే షన్’ (ఐపీఎస్ఎంఎఫ్)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది. ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్‌కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం. ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది. నిజానికి, సీపీఆర్ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు. ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్‌కు నిధులు వచ్చాయి. మరి, ఉన్నట్టుండి సీపీఆర్ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్ వికాస్ సంస్థ’ (జస్వాస్) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్ నిధులిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్‌దేవ్‌లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్‌తో జస్వాస్ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్ లైసెన్స్ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది. గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది. ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది. ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్సీఆర్ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే! -
భారతీయుల అమెరికా వీసా ప్రక్రియలో పురోగతి
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న భారతీయుల ఇబ్బందుల్ని తొలగించేందుకు అధ్యక్ష అడ్వైజరీ కమిషన్ చేసిన సిఫార్సులను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆచరణలో పెడుతోంది. భారతీయుల వీసా దరఖాస్తులను విదేశాల్లోనూ త్వరగా తేల్చేలా అదనంగా దౌత్య కార్యాలయాలు, కౌంటర్లు తెరుస్తున్నారు. కోవిడ్ అనంతరం ప్రయాణ ఆంక్షలు తొలగించాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడటం తెల్సిందే. అమెరికాలో అభ్యసించనున్న విద్యార్థులు, పర్యటించే సందర్శకులు చాలాకాలంపాటు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా వ్యాఖ్యానించారు. భారతీయ వీసా దరఖాస్తుదారులకు ప్రపంచంలో ఏ దేశంలో కుదిరితే ఆ దేశం నుంచే అక్కడి అమెరికా ఎంబసీ సిబ్బంది వర్చవల్‌గా ఇంటర్వ్యూలు చేసి వీసా జారీ/నిరాకరణ ప్రక్రియను పూర్తిచేయడంలో సాయపడతారు. విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో ఎక్కువ వీసా అపాయ్మెంట్ కౌంటర్లను తెరుస్తారు. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటారు. ఎంబసీల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. 400 రోజులకుపైబడిన వెయిటింగ్ సమయాన్ని 2–4 వారాలకు కుదించడమే వీరి లక్ష్యం. -
యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న యువతిని కారులో ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర హోంశాఖ. మొత్తం 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో పాటు 10 మంది పోలీసులపై వేటు వేసింది. జనవరి 1న ఈ ఘటన జరిగిన రూట్లో డ్యూటీ చేసిన అధికారులపై ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. వీరంతా ఆ రోజు మూడు పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్లు, రెండు పికెట్లలో విధులు నిర్వహించారు. ఢిల్లీ కంఝవాలాలో జనవరి 1న స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టారు కొందరు యువకులు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపారు. అంజలి చక్రాల మధ్య ఇరుక్కున్నా పట్టించుకోకుండా 12 కిలోమీటర్లు కారును అలాగే రోడ్డుపై తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి మృతిచెందింది. తెల్లవారుజామున నడిరోడ్డుపై నగ్నంగా ఆమె మృతదేహం లభ్యమవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే అంజలిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన రోజు విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆరోజు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను హోంశాఖ సస్పెండ్ చేసింది. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ.. -
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి విదేశీ నిధుల లైసెన్స్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి ఉన్న విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్‌ని కేంద్రం రద్దు చేసింది. ఇది గాంధీ కుటుంబాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థ. ఐతే ఈ సంస్థ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూలై 2020లో ఎంహెచ్ఏ దీనిపై ఒక కమిటి నియమించి, వారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేగాదు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్జీఈఎఫ్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని కూడా తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఫౌండేషన్‌కి చైర్ పర్సన్ కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ సభ్యులు రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ట్రస్ట్ సభ్యులు. ఈ ఫౌండేషన్‌ని 1991లో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫౌండేషన్ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు మద్దతుతో సహా అనేక క్లిష్టమైన సమస్యలపై పనిచేసింది. పైగా విద్యా రంగానికి సంబంధించి పలు సేవలు అందించింది. (చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..) -
బిల్కిస్ బానో కేసు: రిలీజ్‌కు కేంద్రం కూడా పర్మిషన్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల ముందస్తు విడుదలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదకొండు మంది ఖైదీల త్వరగతిన విడుదలను సీబీఐ, ప్రత్యేక న్యాయాస్థానాలు వ్యతిరేకించినా.. కేంద్రం కేవలం రెండే వారాల్లో విడుదలకు అనుమతి ఇచ్చిందని వెల్లడైంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం సోమవారం.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. పద్నాలుగేళ్లు జైల్లో గడిపిన బిల్కి బానోస్ నిందితులను సత్ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశామని, ఇందుకు కేంద్రం సైతం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు నివేదించింది. రెమిషన్ కింద 11 మంది దోషులను విడుదల చేసేందుకు ఈ జూన్ 28వ తేదీన.. గుజరాత్ ప్రభుత్వం కేంద్ర అనుమతి కోసం ప్రయత్నించింది. అయితే జులై 11వ తేదీన కేంద్ర హోం వ్యవహారాల శాఖ దానికి అప్రూవల్ ఇచ్చినట్లు పత్రాల్లో స్పష్టంగా ఉంది. సీపీఎం పొలిబ్యూరో సభ్యులు సుభాషిని అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మెహువా మోయిత్రాలే కాకుండా మరొకరు కూడా బిల్కిస్ బానో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 435 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా గుజరాత్ ప్రభుత్వం మాత్రమే దోషులను విడుదల చేయడంపై పిటిషనర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం, గుజరాత్ ప్రభుత్వాన్ని దోషుల రెమిషన్(విడుదలకు సంబంధించిన) ఆదేశాలతో సహా బిల్కిస్ బానో కేసుకు సంబంధించి మొత్తం రికార్డు ప్రొసీడింగ్స్ సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. ముంబైలోని సీబీఐ స్పెషల్ బ్రాంచ్ ఎస్పీతో పాటు గ్రేటర్ బాంబే సిటీ సివిల్ సెషన్స్ కోర్టు సీబీఐ ప్రత్యేక సివిల్ న్యాయమూర్తి సైతం ఖైదీల విడుదలను వ్యతిరేకించినట్లు అఫిడవిట్లో పేర్కొంది గుజరాత్ ప్రభుత్వం. దోషుల క్షమాభిక్షకు సంబంధించిన నిర్ణయం గురించి తనను స్పందించలేదని బిల్కిస్ బానో చెప్తున్నారు. ఒక దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం తరపున సూచించిన అడ్వైజరీ కమిటీ పది మంది సభ్యుల్లో.. సగం మంది బీజేపీతో సంబంధం ఉన్నారనే విషయం వెలుగు చూసింది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదీ చదవండి: ముందు షారూక్‌ను తీసేయండి: బీజేపీ -
రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటనపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయన ప్రకటనను తోసిపుచ్చింది. రోహింగ్యాలకు అటువంటి హామీలేమీ లేవని తేల్చి చెప్పింది. రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని తెలిపింది. న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను అందించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. అక్రమ విదేశీ శరణార్థులైన వారికి ఎలాంటి సౌకర్యాలు ప్రకటించలేదని స్పష్టం చేసింది. India has always welcomed those who have sought refuge in the country. In a landmark decision all #Rohingya #Refugees will be shifted to EWS flats in Bakkarwala area of Delhi. They will be provided basic amenities, UNHCR IDs & round-the-clock @DelhiPolice protection. @PMOIndia pic.twitter.com/E5ShkHOxqE — Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022 కాగా, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులకు పక్కా ఇళ్లు, భద్రత కల్పిస్తామని గృహ, పట్టణ వ్యవహరాలశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. వారిని ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలాలోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) అర్ట్‌మెంట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రకటనపై స్పందించిన కేంద్రం, అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిపింది. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు With respect to news reports in certain sections of media regarding Rohingya illegal foreigners, it is clarified that Ministry of Home Affairs (MHA) has not given any directions to provide EWS flats to Rohingya illegal migrants at Bakkarwala in New Delhi. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022 ‘రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే విదేశాంగ శాఖ ద్వారా సంబంధిత దేశంతో వారి బహిష్కరణ విషయాన్ని చర్చిస్తున్నందున.. రోహింగ్యాలు ప్రస్తుతం ఉన్న మదన్‌పూర్ ఖాదర్, కాళింది కుంజ్ ప్రదేశాల్లో కొనసాగేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. చట్టప్రకారం రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్లో( నిర్బంధ కేంద్రం) ఉంచుతాం. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం శరణార్థులు ఉన్న ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు.. వెంటనే ఆ పనిచేయాలని ఆదేశించాం.’ అని హోం మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. Rohingya Illegal Foreigners Press release-https://t.co/eDjb9JK1u1 pic.twitter.com/uKduPd1hRR — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 17, 2022 -
'ఏ ల్యాండ్‌మైన్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ హోం మంత్రి సుచరిత 'సాక్షి టీవీ'తో మాట్లాడారు. 'గతంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైంది. వారి సంఖ్యాబలం 50కి పడిపోయింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మనబడి నాడు-నేడు పథకం ద్వారా మౌళిక సదుపాయాలు పెంచాం. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు సహాయం చేస్తున్నాం. మహిళలకు సాధికారత కోసం రూ. 75 వేలు సహాయం చేస్తున్నాం. ఈ పథకాలన్నీ ఆర్థికంగా స్థిరపడేందుకు తోడ్పడుతున్నాయి. పేదరిక నిర్మూలనకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. అటవీ ప్రాంతాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌కి తరలించాలని కోరాం. మారుమూల ప్రాంతాలలో మూడు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీస్ ఉండాలని కోరా. 4జీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరా. ఈ కార్యకలాపాల వల్ల నక్సల్స్ ప్రాబల్యం తగ్గుతుంది. గతంలో ఎప్పుడు ఏ ల్యాండ్ మెయిన్ పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఏజెన్సీలో పర్యటించాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏజెన్సీలో రాజకీయ నేతలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఈ సమస్య పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. చదవండి: (సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్: 539 కొత్త 104 వాహనాలు) మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచాలని కోరాము. రోడ్లు వేసేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించి అనుమతివ్వాలని కోరా. అటవీ ప్రాంతాలలో టెలికాం, మౌళిక వసతులు సౌకర్యాలు పెంచాలని కోరాం. విభజన చట్టం మేరకు సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. బాక్సైట్ తవ్వకాలను ఆపేసిన నేపథ్యంలో, అవసరమైన ఖనిజాలను ఒరిస్సా నుంచి ఇవ్వాలి' అని కోరినట్లు మంత్రి సుచరిత తెలిపారు. -
‘269 రోజులైంది.. నా భార్యను చూడనివ్వరా?’
తన భార్యను నుంచి తనను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత దేశంలోకి తనను అడుగుపెట్టనివ్వడం లేదని పాపులర్ యూట్యూబర్ కర్ల్ రాక్ ఆరోపిస్తున్నాడు. కనీసం తనకు వివరణ కూడా ఇవ్వట్లేదంటూ ఇండియన్ గవర్నమెంట్ పై ఆరోపణలు గుప్పిస్తూ తాజాగా యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే కార్ల్ రాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన కారణం ఇంతకాలం వెల్లడించకుండా వస్తున్న కేంద్ర హోం శాఖ.. తాజాగా దానిపై వివరణ ఇచ్చుకుంది. న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్‌కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్రైస్.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతనికి భారీగా మద్ధతు లభిస్తోంది. ‘కర్ల్ రాక్’ పేరుతో యూట్యూబర్‌గా పాపులర్ అయిన కార్ల్.. ట్రావెల్ సేఫ్టీ, వివిధ ప్రాంతాల్లో కల్చర్, వేరేదేశాల్లో ఫారినర్లకు ఎదురయ్యే మోసాల మీద వీడియోలు తీస్తుంటాడు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 1.8 మిలియన్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 2019లో భారత్‌కు చెందిన మనీషా మాలిక్‌కు పెండ్లి చేసుకున్నాడు. అయితే కిందటి ఏడాది అక్టోబర్ నుంచి అతన్ని భారత్‌లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఈ విషయంపై భారత్‌ను నిలదీయడంతో పాటు న్యూజిలాండ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నాడు. కనీసం స్పందించరా? 2020 అక్టోబర్‌లో దుబాయ్, పాకిస్థాన్‌లో అతను పర్యటించాడు. ఆ టైంలో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అతను బయలుదేరగానే.. అతన్ని భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో తనపేరు చేర్చిందన్నది అతని వాదన. ‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. భారత ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్ పంపినా బదులు లేదు. నా భార్య, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బదులు ఇవ్వడం లేద’ని వీడియోలో వాపోయాడు అతను. అంతేకాదు ట్విటర్లో న్యూజిలాండ్ పీఎం జెస్సిండాను సైతం ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం కర్ల్కు సపోర్ట్‌గా సైన్ పిటిషన్ కూడా నడుస్తోంది. ఈ కోణాలు కూడా! అయితే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందువల్లే అతనికి ఇలా జరుగుతోందని కొందరు మద్ధతుదారులు అంటున్నాడు. అంతేకాదు గతంలో అతను పాక్‌లో కొన్ని నెలలు గడిపాడు కూడా. అటుపై పాక్ అక్రమిత కశ్మీర్‌తో పాటు సైనిక శిబిరాలను సైతం సందర్శించాడు. ఈ నేపథ్యంలోనే అనుమానాల నడుమ భారత ప్రభుత్వం అతన్ని అడ్డుకుంటోందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఐఎస్ఐ తనను గమనిస్తోందని అప్పట్లో అతను తీసిన వీడియోను సైతం పోస్ట్ చేస్తున్నారు. #Exclusive | ‘India is a secular country and it shouldn’t have any laws which talk about religion’, says Karl Rock on anti-CAA protests. Watch TIMES NOW’s Mohit Sharma speaking exclusively with YouTuber (@YouTube) @iamkarlrock. pic.twitter.com/RVtx6YWwI6 — TIMES NOW (@TimesNow) December 19, 2019 ఆరోపణలపై స్పందించిన కేంద్రం అయితే కర్ల్ రాక్ విషయంలో వినిపిస్తున్న వాదనలను, ఆరోపణలను కేంద్రం ఖండించింది. వీసా నిబంధనల, షరతులు ఉల్లంఘించిన నేరానికే అతన్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టూరిస్ట్ వీసా మీద వచ్చిన అతను.. వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా కండిషన్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, వచ్చే ఏడాది వరకు అతన్ని దేశంలోకి అనుమతించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. కాగా, కరోనా టైంలో ఢిల్లీ ప్లాస్మా బ్యాంకులో రెండుసార్లు రక్తదానం చేసి సీఎం కేజ్రీవాల్ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు కర్ల్ రాక్. -
ముకుల్ రాయ్‌కు జెడ్ కేటగిరి భద్రత తొలగింపు
కోల్‌కతా: టీఎంసీ నాయకుడు ముకుల్ రాయ్‌కు కేటాయించిన జెడ్ కేటగిరీ భద్రతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉపసంహరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్ భద్రత విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ ఉదయం నుంచి విధులకు హాజరు కాలేదు. నాలుగు రోజుల క్రితం ముకుల్ రాయ్ తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. టీఎంసీలో చేరిన ఒక రోజు తర్వాత ముకుల్ రాయ్ ఈ అభ్యర్థన చేశారు. Security of TMC leader Mukul Roy has been withdrawn by Ministry of Home Affairs (MHA), order has been issued: Govt Sources (File photo) pic.twitter.com/RcLInrbaLl — ANI (@ANI) June 17, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 ముందు, రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలువురు బీజేపీ నాయకుల భద్రతను పెంచింది. మార్చి 2021 లో, బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ముకుల్ రాయ్ భద్రతను 'వై-ప్లస్' నుంచి 'జెడ్ కేటగిరీ'కి పెంచింది. ఈ క్రమంలో ఆయన తిరిగి టీఎంసీకి చేరడంతో, ముకుల్ రాయ్ తన జెడ్ సెక్యూరిటీ కేటగిరీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. చదవండి: సొంత గూటికి ముకుల్ రాయ్ -
రేపు అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్ వంటి ఢిల్లీ సరిహద్దుల్లో ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను రేపు రాత్రి 11 గంటల వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017లోని రూల్ 2లోని సబ్ రూల్ 1 కింద ప్రజా భద్రతను కాపాడటం, ప్రజా అత్యవసర పరిస్థితి దృష్ట్యా టెలికాం సేవలను తాత్కాలికంగా సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(చదవండి: అమెరికాపై కేసు వేసిన షియోమీ) కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది. ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసు అధికారులు ఢిల్లీ సరిహద్దులో ఖాజీపూర్ సమీపంలో ముళ్ల తీగలతో కంచె వేశారు. ఖాజీపూర్ నిరసన స్థలంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. -
ముగ్గురు ఐపీఎస్‌లపై కేంద్రం బదిలీ వేటు
న్యూఢిలీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఇరు పక్షాల మధ్య మరింత అగ్గి రాజేసింది. తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఏకపక్షంగా సమన్లు జారీ చేసింది. ఐపీఎస్ అధికారులైన భోలనాథ్ పాండే (డైమండ్ హార్బర్ ఎస్పీ), ప్రవీణ్ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్), రాజీవ్ మిశ్రా (ఏడీజీ, సౌత్ బెంగాల్) నడ్డా బెంగాల్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు వారిని కేంద్రానికి డిప్యుటేషన్ రావాల్సిందిగా హోంశాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా పోలీసు అధికారుల్ని కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌కి రమ్మంటే ముందస్తుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా ఈ సమన్లు జారీ చేసింది. శాంతి భద్రతలు రాష్ట్ర అంశం: మమతా సర్కార్ ఎదురు దాడి నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించడానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంపై మమతా సర్కార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేంద్రం అందులో తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి లేఖ రాశారు. నిబంధనలేమంటున్నాయి? కేంద్ర డిప్యుటేషన్‌కు రమ్మని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఐపీఎస్ అధికారులు తప్పక పాటించాలని, వేరే ఆప్షన్ ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి ఉత్తర్వులు పొందిన ఐపీఎస్ ఆఫీసర్లను సదరు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రిలీవ్ చేయాల్సిఉంటుంది. ఐపీఎస్ రూల్స్– 1954 ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు వస్తే, రాష్ట్రాలు కేంద్ర ఆదేశాన్ని అనుసరించక తప్పదు. సమాధానం ఇవ్వకపోతే: మరోవైపు పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 267 ఫిర్యాదుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తప్పు పట్టింది. మరో 15 రోజుల్లో మమతా సర్కార్ ఏమీ మాట్లాడకపోతే ఆ ఫిర్యాదుల్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖ శర్మ హెచ్చరించారు. -
నడ్డాపై దాడి.. ఐపీఎస్ అధికారులకు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోం శాఖ ఏకపక్ష సమన్లను జారీ చేసింది. జేపీ నడ్డా పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు భోలానాథ్ పాండే, ప్రవీణ త్రిపాఠీ, రాజీవ్ మిశ్రాలు తమ విధులను నిర్వర్తించటంతో అలసత్వం వహించారని హోంశాఖ పేర్కొంది. అంతకు క్రితం పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీలకు కేంద్ర హోం శాఖ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 14వ తేదీన రాష్ట్రంలోని శాంతి,భద్రతలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేంద్ర హోం శాఖ సమన్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నోటీసులపై స్పందించరాదన్న నిర్ణయానికి వచ్చింది. ( కేంద్రంతో మమత ఢీ ) కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్లో పట్టు పెంచుకోవడం కోసం నడ్డా రాష్ట్రానికి వెళ్లారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి గత గురువారం ఉదయం డైమండ్ హార్బర్‌కి వెళుతుండగా మార్గం మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. -
మమత సర్కార్‌పై గవర్నర్ ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు
-
నడ్డాపై దాడి: బెంగాల్ డీజీపీ, సీఎస్‌లకు సమన్లు
కోల్‌కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్లో బీజేపీ, టీఎంసీ నాయకుల మధ్య మాటల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. వడ్డితో సహా చెల్లిస్తామని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ హెచ్చరించారు. ‘మేం మారుస్తాం.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం. వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ దిలీప్ ఘోష్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. డైమండ్ హర్బర్‌లో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌ని అడ్డుకోవడమే కాక రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన అనంతరం బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్ డీజీపీకి సమన్లు ఇక నడ్డా కాన్వాయ్‌పై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బెంగాల్ సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా గవర్నర్‌ని కోరిన సంగతి తెలిసిందే. బీజేపీ రియాక్షన్.. నడ్డాపై దాడిని బెంగాల్ బీజేపీ నాయకులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఈ క్రమంలో సయంతన్ బసు ‘మీరు ఒక్కరిని చంపితే.. మేం నలుగురిని చంపుతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి అనంతరం ఢిల్లీలోని అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీన్ని ఉద్దేశిస్తూ.. బసు ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు ముందు చాలా ఉంటాయి’ అంటూ హెచ్చరించారు. -
లాక్డౌన్? కేంద్రం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని, జనాలను నియంత్రించాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ను పెంచాలని రాష్ట్రాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అమలవుతాయని తెలిపింది. నిర్దేశించిన నియంత్రణ చర్యలను ఖచ్చితంగా పాటించాలా అదేశించింది. ఇందుకు స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. (కరోనా: మన దేశంలో ఎందుకు ఇలా అవుతోంది?) కొత్త మార్గదర్శకాలు కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌ను విధించలేవు, కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం "నైట్ కర్ఫ్యూ" వంటి ఆంక్షలను అమలు చేయవచ్చు. మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది. కరోనా ప్రస్తుత పరిస్థితి ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే రాత్రి పూట కర్ఫ్యూ విధించుకోవచ్చు. ఒకవేళ లాక్డౌన్ విధించాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ల గుర్తింపులోఅప్రమత్తంగా ఉండాలి. ఈ జాబితాను రాష్ట్రాలు / కేంద్ర ప్రాంతాలు వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. దీన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా షేర్ చేయాలి. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి. ఇంటింటికీ పర్యవేక్షణ, నిఘా ఉండాలి. వైద్యం, అత్యవసర సేవలు, అవసరమైన వస్తువులు, సేవల సరఫరాను మినహాఈ జోన్లలో ప్రజల కదలికలపై నియంత్రణ అమలు కావాలి. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తులపై కూడా జరిమానాలు విధించాలని తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలి. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన కేంద్ర హోంశాఖ అంతర్జాతీయ ప్రయాణికులను నిబంధనల ప్రకారం అనుమతించాలని పేర్కొంది. కంటైన్ మెంట్ జోన్ల వెలుపల 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు అనుమతి. క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/వినోద/ విద్య/సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదు. ఇతర కార్యక్రమాలకు 200 మందికి పైగా వ్యక్తులు అనుమతించబడరు. ఈ నిబంధనలు 2020 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు. -
ఏపీకి 16.. తెలంగాణకు 14 పోలీసు మెడల్స్
ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 14 మంది మెడల్స్ అందుకోనున్నారు. ఏపీకి వచ్చిన 16 పతకాల్లో.. రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్, 14 ఉత్తమ సేవా పోలీసు మెడల్స్ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. తెలంగాణ నుంచి పురస్కారానికి ఎంపికైన వారు.. రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు మనసాని రవీందర్ రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్ చింతలపాటి యాదగిరి శ్రీనివాస్ కుమార్ ఏసీపీ సైబరాబాద్ అడిషనల్ కమాండెంట్ మోతు జయరాజ్ వరంగల్ డబ్బీకార్ ఆనంద్ కుమార్ డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్ బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్ సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్ మల్కాజ్గిరి ఎస్ఐ షేక్ సాధిక్ అలీ ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్‌తో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కుమార్ విశ్వజిత్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్ అందుకోనున్నారు. కాగా కేంద్ర హోంశాఖ వివిధ రాష్ష్ర్టాల నుంచి ఉత్తమ సేవలందించిన 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌కు, 80 మందిని ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. Ministry of Home Affairs announces list of medal awardees to the police personnel on #IndependenceDay 2020. 215 personnel get Police Medal for Gallantry, 80 get President's Police Medal for Distinguished Service & 631 get for Police Medal for Meritorious Service. pic.twitter.com/qXI3cBieIb — ANI (@ANI) August 14, 2020 -
భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
-
‘ఆ బస్సులను ఆపకండి’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను సొంత ఊళ్లకు చేర్చేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాల్సిందిగా కోరాడు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళల విషయంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు.ఫలితంగా వలస కూలీలు ఉపాధి కోల్పోతామనే భయంతో సొంత ఊళ్లకు బయలుదేరారని తెలిపారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాఫ్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. (వలస కూలీల కోసం 1000 బస్సులు) వలస కూలీల కోసం ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపడం, విశ్రాంతి నిలయాలను ఏర్పాటు చేయాలన్నారు అజయ్ భల్లా. ఆహారంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉందని స్పష్టం చేశారు. వలస కూలీలకు బస్సులు, రైళ్ల ఏర్పాటు గురించి సరైన సమాచారం అందించాలని.. పుకార్లకు తావివ్వకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో స్పష్టత లేకపోతే.. వలస కూలీల్లో అశాంతి ఏర్పడుతుందన్నారు. కాలినడకన బయలుదేరిన వలస కూలీలను విశ్రాంతి సముదాయాలకు తరలించడమే కాక.. వారి చిరునామ, ఫోన్ నంబర్లు సేకరించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే అని పేర్కొన్నారు. వలస కూలీల బస్సులను రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపవద్దని కోరారు.(కరోనా ఎఫెక్ట్: డ్రైవరన్నా.. నీకు సలామ్) Home Secy Ajay Bhalla writes to Chief Secretaries of all states to take steps to "mitigate the distress of migrant workers", suggests a number of measures to be implemented incl. operation of more special trains by proactive coordination between states and Railways ministry: MHA pic.twitter.com/iQEkXhlPYQ — ANI (@ANI) May 19, 2020 -
మ్యారేజీ హాళ్లు తెరవచ్చు.. చిరు వ్యాపారులు కూడా..
లక్నో: చిరు వ్యాపారులు, దుకాణదార్లు, ఫంక్షన్ హాల్ యజమానులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో తిరిగి కార్యకలాపాలు సాగించుకోవచ్చని తెలిపింది. అయితే సామాజిక ఎడబాటు, మాస్కు ధరించడం తదితర నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు లాక్డౌన్ 4.0 నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తూ.. పలు అంశాల్లో రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సోమవారం సాయంత్రం లాక్డౌన్ నిబంధనల సడలింపు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.(నిబంధనల సడలింపు సాధ్యం కాదు: సీఎం) లాక్డౌన్ 4.0: యూపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కంటైన్మెంట్ జోన్లు మినహా... ఇతర ప్రాంతాల్లో వీధి వ్యాపారులు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. రెస్టారెంట్లు, స్వీటు షాపులు హోం డెలివరీ చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఇండస్ట్రీలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా షాపులు తెరిచేందుకు అనుమతించినందున ఓనర్లు, కస్టమర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. గ్లోవ్స్ ధరించి అమ్మకాలు జరపాలి. షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఈ నిబంధనలు పాటించనట్లయితే దుకాణదార్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోజు విడిచి రోజు ఒక్కో మార్కెట్ తెరవాలి. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల యంత్రాంగం వ్యాపార మండళ్లకు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. మ్యారేజీ హాళ్లు తెరచుకోవచ్చు. అయితే 20 కంటే ఎక్కువ మందిని అనుమతించబోము. డ్రైక్లీనింగ్ షాపులు, ప్రింటింగ్ ప్రెస్‌లు తెరుచుకునేందుకు అనుమతి కూరగాయల మార్కెట్లు ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచాలి. రిటైల్ వెజిటబుల్ మండీలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు తెరవాలి. వ్యాపారులు ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు వరకు కూరగాయలు అమ్ముకోవచ్చు. వాహనాలకు అనుమతి ఉంటుంది. అయితే కార్లు తదితర వాహనాల్లో డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి. టూ వీలర్లపై ఒక్కరికి మాత్రమే అనుమతి. మహిళలు అయితే ఇద్దరికి అనుమతి. అయితే తప్పక హెల్మెట్, మాస్కు ధరించాలి. త్రీ వీలర్లో డ్రైవర్ కాకుండా ఇద్దరికి మాత్రమే అనుమతి. ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లను నోయిడా, ఘజియాబాద్‌లో ప్రవేశించేందుకు అనుమతినిస్తాం. అయితే పాసులు ఉన్న వారికే ఈ అవకాశం ఉంటుంది. -
ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ నుంచి వచ్చేవారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఆయా రాష్ట్రాల నుంచి ప్రయాణీకుల రాకపోకలపై నిషేధం విధించింది. మహమ్మారి కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడత లాక్డౌన్లో పలు నిబంధనలు సడలించిన కేంద్రం... కంటైన్మెంట్ జోన్లు మినహా.. అంతరాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతినిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. (మే 31 దాకా లాక్డౌన్: కొత్త నిబంధనలు ఇవే!) ఈ నేపథ్యంలో మంత్రులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సులు నడిపేందుకు అనుమతినిచ్చారు. అయితే సామాజిక ఎడబాటు నిబంధనలు అనుసరించి బస్సులో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఓలా, ఉబెర్ కంపెనీలు మంగళవారం నుంచి టాక్సీలు నడుపవచ్చని పేర్కొన్నారు. ఇక విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.(ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం) కాగా కర్ణాటకలో ప్రతీ ఆదివారం లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తెలిపారు. ఆదివారాల్లో ఎటువంటి సడలింపులు ఉండవని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అదే విధంగా మంగళవారం నుంచి పార్కులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని షాపులు, మాల్స్, విద్యా సంస్థలు, జిమ్‌లు, స్విమ్మింగ పూల్, ఫిట్నెస్ సెంటర్లు తెరవబోమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకు దాదాపు 1231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.(లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు) -
లాక్డౌన్ 4.0: కొత్త నిబంధనలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. ఈ మేరకు నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు తెలుపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దేశంలో చిక్కు కుపోయిన విదేశీయులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అనుమతినిచ్చింది. అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధిస్తూ... అవసరమైన సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది.(భారత్‌లో ఒకే రోజు 5,242 పాజిటివ్ కేసులు) లాక్డౌన్ 4.0: సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధలు 1. విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. మందులు, ఔషధాలు ఇతరత్రా వైద్య పరికరాలు సరఫరా చేసే విమానాలు ఎంహెచ్ఏ ప్రత్యేక అనుమతితో నడుస్తాయి. దేశీయ ఎయిర్ అంబులెన్సులు, వివిధ వర్గాలను చేరవేసేందుకు ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతి. 2. కేవలం శ్రామిక్ రైళ్ల ప్రయాణానికి మాత్రమే అనుమతి. అదే విధంగా నిత్యావసరాలు సరఫరా చేసే ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 3. కంటైన్మెంట్ జోన్లలోని షాపింగ్ మాల్స్ మినహా ఇతర ప్రాంతాల్లోని దుకాణాలు తెరిచేందుకు అనుమతి. సెలూన్లు, స్పాలు తెరచుకోవచ్చు. 4. ఢిల్లీ మెట్రో సహా అన్ని మెట్రో సర్వీసులు మే 31 వరకు బంద్. 5. సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదు. మే 31 వరకు ప్రార్థనా మందిరాలు అన్నీ మూసివేత. 6. 65 ఏళ్ల వృద్ధులు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంటికే పరిమితం కావాలి. 7. రాత్రి 7 నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసరాల నిమిత్తం, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చే వీలుంటుంది. 8. నిత్యావసరాలు సహా ఇతర వస్తువులు డెలివరీ చేసేందుకు ఇ- కామర్స్ కంపెనీలకు అనుమతి. అయితే కంటోన్మెంట్ జోన్లలో మాత్రం ఈ వెసలుబాటు ఉండదు. 9. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు మే 31వరకు మూసివేసే ఉంటాయి. అయితే రెస్టారెంట్లలో టేక్అవే సర్వీసులకు అనుమతి. 10. కంటైన్మెంట్ జోన్లు మినహా.. అంతరాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతి. బస్సులు సహా ఇతర వాహనాలు నడుపవచ్చు. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 11. పట్టణాలు, నగరాల్లో ప్రయాణాల(టాక్సీలు, ఆటోరిక్షాలు)పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. 12. మే 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు మూసివేత. 13. స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి. అయితే ప్రేక్షకులు మైదానానికి రావడం నిషిద్ధం. -
లాక్డౌన్ ముగింపు: ప్రజారవాణాకు సిద్ధం!
బెంగళూరు: కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 17తో ముగియనుంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల ఇప్పటికే నిబంధనలు సడలించారు. ఈ క్రమంలో దాదాపు 54 రోజుల తర్వాత బస్సులు నడిపేందుకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంసిద్ధమవుతోంది. బస్పులు నడిపే క్రమంలో కోవిడ్-19 నివారణ చర్యలపై ఒక వ్యూహంతో ముందుకు సాగేలా ప్రణాళికలు రచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రజారవాణా ప్రారంభించడానికి అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఈ విషయం గురించి బీఎంటీసీ ఎండీ శిఖా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బస్సుల్లో మిడిల్ సీటు లేదు. కాబట్టి భౌతిక దూరం నిబంధనలకు ఎటువంటి విఘాతం కలుగబోదు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం’’అని స్పష్టం చేశారు. కాగా బీఎంటీసీ ఆధ్వర్యంలో 6500 బస్సులు ఉన్నాయి. వీటిలో 800 ఏసీ బస్సులు. కరోనా నేపథ్యంలో వాటిని డిపోలకే పరిమితం చేయనున్నారు. బీఎంటీసీ ముందుజాగ్రత్త చర్యలు 1. బీఎంటీసీ సిబ్బందికి ప్రతిరోజూ హెల్త చెకప్ 2. ఇందుకోసం ప్రతీ డిపోలోనూ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అందుబాటులో ఉంచాలి 3. సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలి. 4. కోవిడ్-19 గురించి అప్రమత్తం చేసే నోట్లను బస్సులో అంటించాలి. 5. ప్రతిరోజూ బస్సులను రసాయనాలతో శుభ్రం చేయాలి. 6. వారం, నెలవారీ పాసులు జారీ చేయడం, టికెట్ డబ్బు వసూలు కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయాలి. 7. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి 8. సామాజిక ఎడబాటు తప్పక పాటించాలి 9. జ్వరం ఉన్న వాళ్లు బస్సులు ప్రయాణాలు మానుకుంటే మంచింది. -
మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్డౌన్ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది. తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!) ఆరెంజ్ , గ్రీన్ జోన్లు రెండింటిలోనూ మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి వుంటుంది. అన్ని వస్తువులకు ఇ-కామర్స్ అనుమతి. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి వుండగా, తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంటి పనిమనుషులను అనుమతించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర, లేదా యూటీ (కేంద్రపాలిత ప్రాంతాలు)ల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. రెడ్ జోన్లు నాన్ కంటైన్ మెంట్ జోన్లలో మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి. అత్యవసరమైన వస్తువులకు మాత్రమే ఇ-కామర్స్ అనుమతి. అత్యవసరం కాని వస్తువుల విక్రయానికి అనుమతి లేదు. మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌వేర్, జూట్ మిల్లులకు అనుమతి ఉంది. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి. పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్‌తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సడలింపులు, పరిమితులు రెడ్, ఆరెంజ్ జోన్లలో స్థానిక అధికారులు గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాలకు వర్తించవు. అనుమతించిన నిత్యావసరాల సరఫరాకు మించి కంటైన్ మెంట్ జోన్ ప్రాంతాలు తీవ్రమైన పరిమితులకు లోబడి వుంటాయి . (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్డౌన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఆంక్షలను సడలించడానికి వీల్లేదు. ఉదాహరణకు రెడ్ (స్వతంత్ర దుకాణాలు మాత్రమే), ఆరెంజ్, గ్రీన్ జోన్స్, జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం వుంది. కానీ కావాలనుకుంటే రాష్ట్రాలు, యూటీలు మద్యం షాపులను మూసి వుంచడానికి కేంద్రం అనుమతినిచ్చింది. అదే సందర్భంలో రెడ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకానికి ఇ-కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వుండదు. ఈ నెల 3వ తేదీతో ముగియనున్నరెండవ దశ లాక్ డౌన్ ను పొడిగించి, అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. మార్చి చివరిలో అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్డౌన్ విస్తరించడం ఇది రెండోసారి. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) -
మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మే 17 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. అయితే లాక్డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి పరిస్ధితిని సమీక్షిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.(తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే..) కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్డౌన్ రెండో దశ ఏప్రిల్ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది. దీంతో మొత్తం 56 రోజులు భారత్‌లో లాక్డౌన్ విధించినట్టయింది. అయితే మూడో దశలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇచ్చారు.(ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే) 3వ దశ లాక్డౌన్ నిబంధనలు ఇవే.. ►విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం ►స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్ ►హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్ ►స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి ►అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు ►అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి ►గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు ►రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు ►వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన ►కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి ►గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి ►ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ►ఆరెంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి ►ఆరెంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి ►ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ క్యాబ్‌లకు అనుమతి ►వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి ►రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు ►33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి ►రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం ►బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్ లైన్ షాపింగ్‌కు అనుమతి ►ప్రైవేట్ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి ►అన్ని రకాల గూడ్స్, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి ►బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే ►పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు ►అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి(ఆ జోన్లలో లిక్కర్ కిక్..) ►మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకుండా ఉండాలి కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించిన విషయం తెలిసిందే. ఆ శాఖ రూపొందించిన పలు నియమ నిబంధనల మేరకు జిల్లాలను మూడు రకాల జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లుగా విభజించి తదనుగుణంగా కొన్ని పరిమితులను విధించారు. రెడ్ జోన్స్ (హాట్‌స్పాట్ జిల్లాలు) - కరోనా వైరస్‌కు సంబంధించి మొత్తం యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు రెండింతలుగా నమోదు కావడం, ఆయా ప్రాంతాల్లో జరిగిన పరీక్షలు, నిఘా వర్గాల సమాచారం మేరకు రెడ్ జోన్లను ప్రకటించారు. గ్రీన్ జోన్లు - గడిచిన 21 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్జోన్లుగా గుర్తించారు. ఇకపోతే, రెడ్, గ్రీన్ కానీ పరిస్థితులున్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా 733 జిల్లాలను ఆయా జోన్ల కింద విభజించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తీరు, పాజిటివ్ కేసులు నమోదు వంటి ప్రక్రియల ఆధారంగా 130 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. అలాగే 284 ఆరెంజ్ జోన్లోకి రాగా 319 జిల్లాలు గ్రీన్ జోన్లో నిలిచాయి. -
ఆంక్షలు సడలింపు..షరతులు కూడా
-
గుడ్‌న్యూస్.. మరికొన్ని ఆంక్షలు సడలింపు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నుంచి మరికొన్ని సడలింపులను ఇచ్చింది. నిత్యావసరాల్లో భాగంగా ప్రజలకు అవసరమైన గూడ్స్ సరఫరకు కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే నాన్ హాట్‌స్పాట్ ఏరియాలోని మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను కూడా తెరవబడతాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిమితిలో ఉన్న మార్కెట్ సముదాయాలపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తెరుచుకునే షాపులకు మాత్రం షరతులు కూడా విధించింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని తెలిపింది. హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లు ఉన్న చోటమాత్రం ఏషాపులూ తెరవడానికి వీలేద్దని కేంద్ర విడుదల చేసిన జీవో పేర్కొంది. కాగా ఇప్పటి వరకు కిరాణా దుకాణాలు, నిత్యవసర, అత్యవసర, మందుల, ఫార్మసీలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ, బ్యూటీ సెలూన్స్, డ్రైక్లీనర్స్, ఎలక్టికల్ స్టోర్స్ తెరుచుకోవచ్చు. అయితే ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. మరికొంతకాలంపాటు వీటిపై ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే తెరుచుకోబడిన ఆయా షాపుల్లో కేవలం 50శాతం మంది సిబ్బంధి మాత్రమే విధులు నిర్వర్తించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ముఖాలకు మాస్క్‌లు, శానిటైజర్లు, సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని పేర్కొంది. కాగా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు కేంద్ర ఇప్పటికే పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలు షాపులకు అనుమతి ఇచ్చింది. -
లాక్డౌన్ 2: రాష్ట్రాలపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన రెండోసారి లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు కఠినంగా అమలు చయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరం కాని సేవలకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించడంపై మండిపడింది. ఇలాంటి ఏమరపాటు చర్యల వల్ల కరోనా విజృంభించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల సోమవారం లేఖ రాశారు. తక్షణమే అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. (లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్!) ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా లాక్డౌన్ సడలింపు చేయడం వల్ల పలు చోట్ల సామాజిక ఎడబాటును ఉల్లంఘించడమే కాక పట్టణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా వాహనదారులు రోడ్ల మీదకు వస్తున్నారన్న విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కాబట్టి వెంటనే రెండవసారి లాక్డౌన్ అమలు చేయడంపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఇదిలావుండగా ఇండోర్, ముంబై, పుణె, జైపూర్, కోల్‌కతా, హౌరా, మెదినీపూర్ ఈస్ట్, డార్జిలింగ్, కలింపోంగ్, జల్పైగురి నగరాల్లో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, అందుకవసరమైన సూచనలు చేయడానికి, లాక్డౌన్ అమలును పర్యవేక్షించడానికి ఆరు ఐఎమ్‌సీటీ(ఇంటర్ మినిస్టరియల్ సెంట్రల్ టీమ్స్)లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. (శానిటైజర్ తయారీ పరిశ్రమలో పేలుడు) -
వైద్య సిబ్బందిపై దాడులు: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాపై పోరులో ముందుండి బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అదే విధంగా పట్టణాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైద్య సిబ్బందిపై దాడుల కేసులు, నిబంధనల ఉల్లంఘనలు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య సిబ్బందిపై దాడులను కట్టడి చేసేందుకు.. లాక్డౌన్ నిబంధనలు అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆరు కీలక మంత్రిత్వ శాఖ సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటకలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. (లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్!) అదే విధంగా కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలు సడలించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ నిబంధనల సడలింపులో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని.. వాటికి విరుద్ధంగా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్రం జారీ చేసిన నిబంధనలను అనుసరించి కొన్ని రంగాలకు మాత్రమే మినహాయింపునివ్వాలని స్పష్టం చేసింది. కేరళ, రాజస్తాన్ ఏప్రిల్ 20 నుంచి సవరించిన లాక్డౌన్ నిబంధనల ఆధారంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు మినహాయింపునివ్వగా.. ఢిల్లీ, పంజాబ్ తమ రాష్ట్రంలో నిబంధనలను సులభతరం చేయబోమని స్పష్టం చేశాయి. (ఆశా వర్కర్లపై దాడి.. కరోనా టెంట్లు ధ్వంసం) GoI to States: Violations to #lockdown measures reported, posing a serious health hazard to public & risk for spread of #COVIDー19: Incidents of violence on frontline healthcare prof; complete violations of social distancing norms; movement of vehicles in urban areas — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 20, 2020 -
కేరళలో కొన్ని సడలింపులపై కేంద్రం సీరియస్
-
లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు.(లాక్డౌన్: కేరళ కీలక ఆదేశాలు.. సడలింపులు ఇవే) ‘‘ఏప్రిల్ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పినరయి విజయన్ సర్కారు తీరును విమర్శించాయి. ఇక కేంద్రం లేఖపై స్పందించిన కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ... ‘‘ కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్డౌన్ నిబంధనలు సడలించాం. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగింది. అందుకే కేంద్రం వివరణ కోరింది. ఇందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుంది. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నాం’’అని స్పష్టం చేశారు.(లాక్డౌన్ : పాటించాల్సిన కొత్త రూల్స్) కాగా లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాసర్గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్... పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్ ఏ జోన్... ఆరెంజ్ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లాలు... కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. -
లాక్‌డౌన: గూడ్స్ వాహనాలకు ఉపశమనం
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: లాక్డౌన్లో చిక్కుకున్న లారీలు, అన్ని రకాల గూడ్స్ వాహనాలకు ఉపశమనం కలిగేలా కేంద్రం హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వీటిని నిరాటంకంగా అనుమతించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంవల్ల నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది లేకుండా పోవడమే కాకుండా పోర్టుల నుంచి, ఇతర కర్మాగారాల నుంచి సరుకుల రవాణా సులభతరం కానుంది. లాక్‌డౌన్‌వల్ల గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ తరహా లారీలు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయాయి. ఉదాహరణకు.. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, స్టీల్, పరిశ్రమలకు అవసరమైన సామగ్రి తదితర వాటితో ఉన్న అన్ని వాహనాలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. అలాగే.. ► అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యావసరాల వాహనాలను తప్ప మిగిలిన వాహనాలు వేటినీ ఆయా రాష్ట్రాల్లో పోలీసులు అనుమతించడంలేదు. ► ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వంటి గూడ్స్ వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ► ఇతర రాష్ట్రాలకు పంట ఉత్పత్తులతో పాటు పరిశ్రమలకు చెందిన సామగ్రిని రవాణా చేసేందుకు వీలు ఏర్పడింది. ► రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులను ప్రస్తుతం ముమ్మరం చేసిన నేపథ్యంలో ఏపీకి మరింత వెసులుబాటు కల్పించినట్లయింది. ఖాళీ లారీలకూ లైన్‌క్లియర్ సరుకుతో పనిలేకుండా ఖాళీ లారీలను కూడా అనుమతించాలని కేంద్రం ఆదేశించింది. లాక్డౌన్ వల్ల రాష్ట్రానికి చెందిన సుమారు 2,500 లారీలు వివిధ రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాలకు చెందిన వెయ్యికి పైగా లారీలు మన రాష్ట్రంలోనూ సరుకులతో నిలిచిపోయాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు తమతమ గమ్యస్థానాలకు బయలుదేరతాయి. అలాగే, రాష్ట్రంలో సుమారు 3 లక్షల వరకు లారీలు, సరుకు రవాణా చేసే వాహనాలున్నాయి. లాక్డౌన్ నుంచి వీటికి ఇప్పుడు మినహాయింపు నివ్వడంతో ఇవి రోడ్డెక్కనున్నాయి. దీంతో డీజిల్ అమ్మకాలూ ఊపందుకుంటాయి. డీజీపీ, రవాణా కమిషనర్ ఆదేశాలు అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు అడ్డంకులు కల్పించవద్దంటూ డీజీపీ సవాంగ్, రవాణా కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు కూడా జిల్లాల పోలీస్, రవాణా అధికారులను ఆదేశించారు. ఖాళీగా Ððð ళ్లే వాహనాలనూ అనుమతించాలన్నారు. ఈ వాహనాల్లో డ్రైవర్, క్లీనరు తప్ప ప్రయాణికులను అనుమతించవద్దని స్పష్టంచేశారు. వెసులుబాటు కల్పించడం హర్షణీయం గూడ్స్ వాహనాలు నడిపేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ఈ నిర్ణయంతో సరుకు రవాణా మొదలై వ్యవస్థ గాడిలో పడుతుంది. – వైవీ ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్ని వాహనాలకు అనుమతి అన్ని రకాల వాహనాలు అనుమతించాలని రవాణా శాఖాధికారులకు ఆదేశాలిచ్చాం. పోలీస్, రవాణా అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమతిస్తారు. – ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్ వస్తువుల రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు వస్తువుల రవాణా వాహనాల రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టంగా చెప్పినప్పటికీ నిత్యావసరాలతోపాటు ఇతర వస్తువుల రవాణా వాహనాలను రాష్ట్రాలు అనుమతించడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత స్పష్టత ఇస్తూ రోజూ వినియోగించే ఆహారం, నిత్యావసర సరుకులన్నింటికీ లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సోమవారం లేఖ రాశారు. ► నిత్యావసర సరుకులతోపాటు ఇతర సరుకు రవాణా వాహనాలన్నింటినీ రాష్ట్రాల మధ్య తిరిగేందుకు అనుమతించాలి. ఈ వాహనాల్లో లైసెన్స్ కలిగిన ఒక డ్రైవర్‌తోపాటు అదనంగా మరొకరు ఉండొచ్చు. ► ఖాళీ గూడ్స్ వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వాలి. ► అనుమతించిన పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు కార్మికులు వెళ్లడానికి ఆంక్షలు పెట్టకూడదు. ► నిత్యావసరాలు, ఇతర సరుకు రవాణాకు రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టుల్లో కార్గో సర్వీసులను అనుమతించాలి. సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ కోసం కాంట్రాక్టు కార్మికులకు కూడా జిల్లా అధికార యంత్రాంగం పాస్‌లు జారీ చేయాలి. నిత్యావసరాల రవాణా డ్రైవర్లకు ప్రత్యేక కిట్లు పంట ఉత్పత్తులు, నిత్యావసర సరుకుల రవాణాకు అవసరమైన వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ సేకరిస్తోంది. అయితే, కరోనా వైరస్ భయంతో డ్రైవర్లు ముందుకు రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో డ్రైవర్ భద్రత, వారి కుటుంబ సభ్యుల భయాలను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం సమీకరించిన ప్రతి వాహనం నడిపే డ్రైవర్లకు డ్రైవ్ ప్రొటెక్షన్ కిట్లను ఉచితంగా అందించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ కిట్‌లో ఒక శానిటైజర్ బాటిల్, రెండు డెట్టాల్ సబ్బులు, ఐదు చేతి గ్లవ్స్, ఐదు ఫేస్ మాస్క్‌లు ఉంటాయి. ఇలాంటి 10 వేల కిట్లను రవాణా శాఖ సిద్ధం చేసింది. -
కోవిడ్.. జాతీయ విపత్తు
న్యూఢిల్లీ: కోవిడ్‌ను భారత్ జాతీయ విపత్తుగా ప్రకటించింది. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం రాసిన ఒక లేఖలో పేర్కొంది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన కారణంగా కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని నిర్ణయించినట్లు తెలిపింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించేందుకు నిర్ణయించింది. కోవిడ్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరేవారి కోసం ఈ నిధులు రాష్ట్రాలకు అందిస్తామని, ఇందుకు తగిన రేట్లను ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. క్వారంటైన్ క్యాంపుల సంఖ్య, ఎంత కాలం కొనసాగాలి? ఎంత మందిని ఈ క్యాంపుల్లో ఉంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. ఎస్డీఆర్ఎఫ్ నిధులను ధర్మల్ స్కానర్లు, వెంటిలేషన్ తదితర పరికరాల కొనుగోలుకూ వాడవచ్చునని హోం శాఖ తెలిపింది. మార్గదర్శకాలను ట్వీట్ చేసిన ప్రధాని కోవిడ్ వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే గడిపే సందర్భంలో తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు మిమ్మల్నీ, మీ వాళ్లను రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి’ అని ట్వీట్ చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అటాచ్డ్ బాత్రూమ్ ఉండే, గాలి, వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండాలని సూచించారు. ఎక్కువ మంది అదే గదిలో ఉండాల్సి వస్తే 3అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని చెప్పారు. వీలైనంత వరకు వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ట్వీట్లో పేర్కొన్నారు. పద్మ ప్రదానోత్సవాలు వాయిదా మార్చి 26, ఏప్రిల్ 3వ తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వాయిదావేసింది. వేర్వేరు రంగాల్లో విశేష కృషిచేసిన 141 మందికి కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం తెల్సిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను గతంలో ప్రకటించారు. అంత్యక్రియలపై మార్గదర్శకాలు ఢిల్లీలో వైరస్ కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదంచేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎబోలా, నీపా వంటి వైరస్లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం. -
కరోనా కలకలం : వీసా ఆన్ అరైవల్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కేంద్రంగా కరోనా వైరస్ పలు ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో భారత ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే ట్రావెలర్స్‌కు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇమిగ్రేషన్ బ్యూరో, హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించాయి. మరోవైపు చైనాలో 44 తాజా మరణాలతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2,788కి చేరింది. చైనా వ్యాప్తంగా గురువారం 433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 78,824కు పెరిగింది. ఈ డెడ్లీ వైరస్ బయటపడిన హుబేయ్ ప్రావిన్స్‌లోనే నూతన కేసులు, మృతుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. చదవండి : ‘ముక్క’ ముట్టడం లేదు! -
నిరుద్యోగులకు బొనాంజా; 84 వేల కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్పీఎఫ్లో 22,980 ఖాళీలు, బీఎస్ఎఫ్లో 21,465, సీఐఎస్ఎఫ్లో 10,415, ఎస్ఎస్బీలో 18,102, ఐటీబీపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. నూతనంగా ఏర్పడిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని పేర్కొంది. రిక్రూట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. -
పౌరసత్వ రగడ : రాహుల్‌కు హోం శాఖ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్ పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ కోరింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు ఆధారంగా రాహుల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌లున్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్ విన్సీ, క్రిస్టియన్‌గా నమోదైందని సుబ్రఃహ్మణ్య స్వామి ఇటీవల ఆరోపించారు. కాగా రాహుల్ పౌరసత్వంపై వివాదం నేపధ్యంలో ఈసీ ఇటీవల రాహుల్ నామినేషన్ పత్రాలను ఆమోదించడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. మరోవైపు రాహుల్ పౌరసత్వంపై ఆమేధిలో ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రవ్‌లాల్ సైతం ఫిర్యాదు చేశారు. బ్రిటన్‌లో ఓ కంపెనీ నమోదు సమయంలో రాహుల్ గాంధీ తాను బ్రిటన్ పౌరుడినని ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్ న్యాయవాది రవిప్రకాష్ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. -
2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాలకు చెందిన 96 మంది జవాన్లు 2018లో వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే నివేదిక ద్వారా 2016లో 90 మంది, 2017లో 121 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాల పని పరిస్థితుల మెరుగుదల అనేది ఒక స్థిరమైన ప్రయత్నమని, అవసరమైనపుడు హోంశాఖ తగు సూచనలు చేస్తుందని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కాలానుగుణంగా సమీక్ష నిర్వహిస్తోందని వివరించారు. జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఒత్తిడికి గల కారణాలపై ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో జవాన్లు పని చేసిన తర్వాత ఒత్తిడి తగ్గించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్‌గా అధికారులతో జవాన్లు తమ సమస్యలు చెప్పుకునే సమావేశాలు ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పని వేళలు కూడా తగ్గించి జవాన్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నట్లు, పని ఒత్తిడి మరింత తగ్గించేందుకు క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. -
ఉద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం
న్యూఢిల్లీ: కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54,953 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, వీటిలో మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టుల్లో సీఆర్పీఎఫ్లో అత్యధికంగా 21,566 ఖాళీలు ఉండగా, బీఎస్ఎఫ్(16,984), ఎస్ఎస్బీ(8,546), ఐటీబీపీ(4,126) అస్సాం రైఫిల్స్(3,076) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఇందుకోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2019, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 11 వరకూ కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఇక సబ్ఇన్స్పెక్టర్ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్ఎఫ్లో 508, సీఆర్పీఎఫ్లో 274, ఎస్ఎస్బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా ట్రేడ్స్‌మెన్, హోంశాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో మరో 20,086 పోస్టులను పదోన్నతుల ద్వారా హోంశాఖ భర్తీ చేయనుంది. -
ఎలాగైనా ఆపాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్–మే నెలల్లో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర సాయుధ బలగాలు విధులు నిర్వర్తించాల్సి ఉందని, ఆ సమయంలో ఈ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి గతంలో విధించిన జూలై 31 గడువును పొడిగించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కేంద్రం సహకరించడం లేదని, ఎన్ఆర్సీ ప్రక్రియను మొత్తం నాశనం చేసేలా హోం శాఖ వ్యవహరిస్తోందని తప్పుపట్టింది. రాష్ట్ర అధికారులకు లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాల్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల వల్ల ఎన్ఆర్సీ నమోదుకు ఆటంకం కలగకుండా చూడాలని ఇది వరకే అత్యున్నత ధర్మాసనం అస్సాం ప్రభుత్వం, ఎన్ఆర్సీ కోఆర్డినేటర్, ఈసీలకు సూచించింది. గడువులోనే పూర్తిచేస్తాం: రాజ్‌నాథ్ నిర్దిష్ట గడువులోగా ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విదేశీయులకు ఈ జాబితాలో స్థానం కల్పించమని, అలాగే ఒక్క భారతీయుడిని కూడా విస్మరించమని హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకు అవసరమైన అన్ని నిధుల్ని అస్సాంకు సమకూర్చామని చెప్పారు. సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టిన కొన్ని గంటల తరువాత రాజ్‌నాథ్ ఈ విధంగా స్పందించారు. -
నిఘాపై అట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు. స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది. -
కంప్యూటర్లపై కేంద్రం నిఘా
న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు, తాజా నోటిఫికేషన్ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఈ నిబంధనల్ని రూపొందించింది. ప్రయోజనాలు ఇవే.. ‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే.. కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69లోని ఉప సెక్షన్1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్ ప్రొవైడర్లు, కంప్యూటర్ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. పలానా ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ హోం శాఖ తాజా నోటిఫికేషన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే.. 1.ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 8. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) 9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్ కమిషనర్. దేశ భద్రత కోసమే ‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’ – ఐటీ మంత్రి రవిశంకర్ కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం ‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’ – ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీ గురించి తెలుస్తుంది ‘మోదీజీ.. భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’ – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త ఉత్తర్వులెందుకు? 2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’ –కాంగ్రెస్ నేత జయ్‌వీర్ షేర్గిల్ -
దర్యాప్తు సంస్థలు కంప్యూటర్లోకి చొరబడవచ్చు
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ కంప్యూటర్‌నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని పలు దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పది దర్యాప్తు సంస్థలకు ఈ నిబంధనలు వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. వీటిలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కో కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, రా, డీఎస్ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ కొత్త అధికారాన్ని కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా దర్యాప్తు సంస్థలకు కల్పించబడింది. గతంలో దర్యాప్తు సంస్థలకు వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది. దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్ బ్రదర్‌లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారాలు దుర్వినియోగం కావని కేంద్రం చెప్పగలదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అవసరం ఈ అపరమిత అధికారం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు. -
మానవ అక్రమ రవాణా నియంత్రణపై సమష్టి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర పోలీస్ శాఖ–కేంద్ర హోంశాఖ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. శనివారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ అధికారుల మెస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సదస్సును డీజీపీ మహేందర్‌రెడ్డి, రిటైర్డ్ డీజీపీ పీఎం నాయర్ కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు మొత్తం 100మంది వరకు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై గ్రూప్ డిస్కషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. అక్రమ రవాణా కేసుల నమోదు, వాటి దర్యాప్తులో చేపట్టాల్సిన అంశాలపై మహేందర్‌రెడ్డి, పీఎం నాయర్ అధికారులకు అవగాహన కల్పించారు. చట్టపరంగా సమన్వయం చేసుకోవాల్సిన విభాగాలు, వాటి ద్వారా చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా శిక్షణ కొనసాగింది. అక్రమ రవాణా కూపాల నుంచి బయటపడ్డ బాధితులకు అందాల్సిన పరిహారం, స్వచ్ఛంద సంస్థల సహకారంపై వేగవంతంగా స్పందించాలని సూచించారు. యూనిసెఫ్ నుంచి వచ్చిన ప్రతినిధులు మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, అందుకు తగిన సహకారంపై ప్రజెంటేషన్ అందించారు. ప్రజ్వల, మై చాయిస్, దివ్యదిశ, తరుణి, బచ్పన్ బచావ్, సంకల్ప్ తదితర స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమంలో కలిసి చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మెట్రోపాలిజన్ సెషన్స్ జడ్జి వెంకట కృష్ణయ్య అవగాహన కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన భరోసా లాంటి సెంటర్లను జిల్లాల్లోనూ వేగవంతంగా విస్తరించి చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, మహిళ భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా, ఎస్పీ సుమతి, ప్రజ్వల ఎన్జీవో నిర్వాహకురాలు సునీతకృష్ణన్, మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
అమిత్‌షాపై దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్
-
కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్!
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పకుండా ఇలా చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది. గత నెలలో పాకిస్తాన్ కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్ కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గత నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 700కు పైగా వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ కేసుల్లో 8,348 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు గతవారం ఓ నివేదికలో వెల్లడైంది. -
ఖాతా వివరాలు ఆన్లైన్లో లేకుంటే చర్యలు
ఎన్జీవోలకు హోంశాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు తమ బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో ఉంచాలని లేకుంటే చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎన్జీవోల వార్షిక పన్ను రిటర్నుల హార్డుకాపీలను స్వీకరించబోమని, అవన్నీ ఆన్లైన్లోనే సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే సంస్థలు లేదా వ్యక్తులు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం–2010 కింద శిక్షార్హులవుతారని హోంశాఖ ప్రకటించింది. విదేశీ నిధులు పొందే సంస్థలు తమ ఆదాయ వ్యయాల వివరాలు, బ్యాలెన్స్ షీట్ల స్కానింగ్ కాపీలను డిజిటల్ సంతకం చేసిన నివేదికతో పాటు ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల్లోపే ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పలువురు తమ రిటర్నులను హార్డు కాపీల రూపంలో దాఖలు చేశారని, అయితే తాము వాటిని అంగీకరించలేదని పేర్కొంది. -
ఆ పత్రాలు మా వద్ద లేవు
ఎమర్జెన్సీలో మానవ హక్కుల తొలగింపుపై హోం శాఖ న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధించిన నాటి రోజుల్లో మానవ హక్కులను తాత్కాలికంగా తొలగించిన దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర సమాచార కమిషన్‌కు (సీఐసీ) తెలిపింది. 1975లో ఆత్యయిక స్థితి అమలులో ఉన్న సమయంలో మానవ హక్కుల తొలగింపునకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. హోం మంత్రిత్వ శాఖలోని మానవ వనరుల విభాగం దీనికి సమాధానమిస్తూ..తమ విభాగం 1993లో ఏర్పాటైందనీ, 1975 నాటి సమాచారం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐసీ హోం శాఖను ఆదేశించింది. -
మీరు దిగిపోండి!
అరుణాచల్ గవర్నర్‌ను కోరిన కేంద్రం? న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రకాష్ రాజ్‌ఖోవాను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా కేంద్రం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పి మీరు పదవి నుంచి తప్పుకోండి’ అని కేంద్ర హోం శాఖ అధికారి, సహాయ మంత్రుల నుంచి గవర్నర్‌కు ఫోన్లు వచ్చాయని తెలిసింది. ఫోన్లు వచ్చాక రాజ్‌ఖోవా స్పష్టత కోసం హోం మంత్రి రాజ్‌నాథ్‌ను సంప్రదించగా పదవి నుంచి దిగిపోవాల్సిందిగా రాజ్‌నాథ్ చెప్పలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. రాష్ట్రంలో టుకీ ప్రభుత్వాన్ని కూలదోసి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కలిఖోపుల్ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కలిఖోపుల్ ప్రభుత్వ ఏర్పాటు చెల్లదనీ, నబం టుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఈ మధ్యనే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో నేతాజీ స్మృతి చిహ్నం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకాన్ని నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నేతాజీకి చెందిన మరో 25 పత్రాలను బహిర్గతం చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 1956-2009 మధ్య కాలానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన 5 ఫైళ్లు, హోం శాఖకు సంబంధించిన 5 ఫైళ్లు, విదేశాంగ శాఖకు చెందిన 15 ఫైళ్లను బహిర్గతం చేసింది. జపాన్ కూడా 5 ఫైళ్లలో రెండింటిని బహిర్గతం చేసేందుకు అంగీకరించిదని సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. నేతాజీ స్మారకంతో పాటు మ్యూజియం కూడా నిర్మిస్తామని, పనులు మొదలయ్యాయని తెలిపారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశించిన మొరార్జీ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని గత ప్రభుత్వాలు నిర్ధారించినప్పటికీ.. నేతాజీ మరణంపై మరింత దర్యాప్తు చేయాలని 1977లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆదేశించినట్లు మహేశ్ శర్మ వెల్లడించారు. -
నామినేట్ వ్యవహారం రచ్చ.. రచ్చ...
శాసన మండలికి ప్రభుత్వం ఐదుగురిని నామినేట్ చేసే వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన ఐదుగురిని నామినేట్ చేయడం ద్వారా ఎగువ సభకు పంపడం ఆనవాయితీ. దీనిపై తనకు అందే సిఫార్సులను గవర్నర్ ఆమోదిస్తారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వారుంటే తిరస్కరించే అధికారం ఆయనకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ కూడా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో నియమితులయ్యారు. ఈ నెల 20న ఐదుగురు నామినేటెడ్ సభ్యులు రిటైర్ కానున్నారు. వారి స్థానంలో వీఎస్. ఉగ్రప్ప, సినీ నటి జయమాల, ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌లతో పాటు అబ్దుల్ జబ్బార్ పేర్లను సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్‌కు జాబితాను పంపారు. వీరిలో ఉగ్రప్ప కాంగ్రెస్ నాయకుడు. గతంలో ఎగువ సభలోనే ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు. సరడగి కూడా కాంగ్రెస్ మాజీ ఎంపీ. రెండేళ్ల కిందట శాసన సభ నుంచి ఎగువ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శాంత కుమార్ కాంగ్రెస్ కార్మిక విభాగం నాయకుడు. అబ్దుల్ జబ్బార్ దావణగెరె జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పని చేశారు. జయమాల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. సాధారణంగా కళలు, సాహిత్యం, సినిమా, విద్య, వైద్య తదితర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎగువ సభకు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న వారిని ఎంపిక చేయడంలోని ఔచిత్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే గవర్నర్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప మాజీ మంత్రి వీ. సోమన్నను ఎగువ సభకు సిఫార్సు చేశారు. అంతకు ముందే ఆయన శాసన సభ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే సోమన్నకు పలు విద్యా సంస్థలున్నందున, విద్యా రంగం కోటా కింద ఆయనను ఎంపిక చేయాలన్న సిఫార్సును గవర్నర్ తోసిపుచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆ విషయాన్ని గుర్తుకు తెస్తోంది. ఈ నెల 29న గవర్నర్ రిటైర్ కానున్నారు. ఆలోగా జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోవాలని ముఖ్యమంత్రి ఆత్రుతగా ఉన్నారు. అయితే గతంలో సోమన్నను కాదన్న గవర్నర్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తానే విషయమై ఆసక్తి నెలకొంది. హోం శాఖకు ఫిర్యాదు ఈ జాబితాను తిరస్కరించాలని గవర్నర్‌కు సూచించాల్సిందిగా కేంద్ర హోం మంత్రికి ప్రతిపక్ష బీజేపీ లేఖ రాసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి రాసిన ఈ లేఖలో, రాజకీయ పార్టీకి చెందిన వారిని ఎగువ సభకు సిఫార్సు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన అయిదు మందీ చురుకైన కాంగ్రెస్ నాయకులని తెలిపారు. తద్వారా సమాజంలో కళలు, సైన్స్, సాహిత్యం రంగాల్లోని వ్యక్తులకు ప్రజా సేవ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. -
విధుల్లో చేరిన రోజే సస్పెన్షన్
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరం(56)కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మొదటి మహిళా అదనపు డెరైక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే ఆమెను సస్పెం డ్ చేస్తూ తమిళనాడు ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. అదనపు డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకునేముందు పాటించాల్సిన విధి, విధానాలను ఉల్లంఘించడం వల్లనే ఆమెను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అర్చన రామసుందరం సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ కొనసాగుతున్నందున ఆమె చెన్నైలోనే ఉండాలని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర హోం శాఖ వ్యతిరేకించి, వేరే అధికారి పేరును సూచించినప్పటికీ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అదనపు డెరైక్టర్ పదవికి అర్చన పేరును సిఫారసు చేశారు. దాంతో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ అర్చనను ఖరారు చేసింది. సీబీఐలో జాయింట్ డెరైక్టర్ హోదా అందుకున్న మొదటి మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. అదనపు డెరైక్టర్‌గా ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరగనుంది. -
ఎయిమ్స్ నుంచి ఎంఎస్సీ బయోటెక్నాలజీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి? -శ్రీకాంత్, జడ్చర్ల. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ). మాస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి బోధన, శిక్షణ, పరిశోధన అంశాల్లో దేశంలోనే ప్రధానమైన ఐఐఎంసీ. న్యూఢిల్లీలోని ప్రధాన క్యాంపస్‌తోపాటు ఐజ్వాల్ (మిజోరం), అమరావతి (మహారాష్ట్ర), దెంకనల్ (బడిశా), జమ్మూ-కాశ్మీర్, కొట్టాయం (కేరళ)లలో రీజనల్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో అందుబాటులో ఉన్న కోర్సులు.. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఇంగ్లిష్) పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (హిందీ) పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (రేడియో/టెలివిజన్) పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఒడియా) అర్హత: బ్యాచిలర్ డిగ్రీ. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.iimc.nic.in ఎయిమ్స్ అందిస్తున్న ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) కోర్సు వివరాలను తెలపండి? -రవి, కోదాడ. దేశంలోని ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థల్లో ఒకటైనా.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)-న్యూఢిల్లీ, మెడిసిన్‌తోపాటు హెల్త్‌కేర్‌కు సంబంధించి వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. వాటిల్లో మాస్టర్ ఇన్ బయోటెక్నాలజీ (ఎం. బయోటెక్నాలజీ) ఒకటి. రికాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీ, ఇమ్యునాలజీకి సంబంధించిన అధునాతన బయోటెక్నాలజీ పద్ధతులను ఉపయోగించి మెరుగైన చికిత్స అందించే అంశాలపై ఈ కోర్సులో శిక్షణనిస్తారు. ఈ కోర్సులో రికాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీ, టి సెల్ క్లోనింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోమెడిసిన్ తదితర అంశాలు ఉంటాయి. అర్హత: 60 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ/ బీఫార్మసీ/బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరిపీ/బీఎస్సీ. ప్రవేశం: దేశ వ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ఏప్రిల్/మేలో వెలువడుతుంది. పరీక్షను జూన్/జూలైలో నిర్వహిస్తారు. పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత సబ్జెక్ట్‌పై 90 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. వివరాలకు: www.aiimsexams.org చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోర్సులేవి? -చరణ్, గద్వాల్. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ను 1989లో ప్రారంభించారు. దీనికి 1996 నుంచి స్వయంప్రతిపత్తి హోదా లభించింది. దేశంలో మ్యాథమెటికల్ సెన్సైస్‌కు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా దీని గుర్తింపు ఉంది. ఆఫర్ చేస్తున్న కోర్సులు.. బీఎస్సీ (ఆనర్స్-మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్- మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు) బీఎస్సీ (ఆనర్స్-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్- మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్) పీహెచ్డీ (మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్) ప్రవేశం పొందిన విద్యార్థులకు కోర్సును బట్టి నెలవారీగా స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలు.. బీఎస్సీ (ఆనర్స్)- రూ. 4,000 (వీరికి ప్రైవేట్ డొనేషన్స్ ద్వారా నెలకు రూ. 1,000 అదనంగా లభిస్తుంది). ఎంఎస్సీ-రూ.6,000. పీహెచ్డీ-రూ. 16,000. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. పీహెచ్డీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి ఎన్బీహెచ్ఎం/సీఎస్ఐఆర్, జెస్ట్ స్కోర్ ఇంటర్వ్యూ ద్వారా. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014 వివరాలకు: www.cmi.ac.in ఐఐటీ-రాజస్థాన్ ఆఫర్ చేసే బీటెక్ (బయాలాజికల్లీ ఇన్స్పైర్డ్ సిస్టమ్ సైన్స్) కోర్సు వివరాలను తెలపండి? -కిరణ్, ఖమ్మం. కాలక్రమేణా వస్తున్న మార్పులకనుగుణంగా ఐఐటీలు ఎన్నో నూతన కోర్సులను ప్రారంభిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో ఒకటి.. ఐఐటీ-రాజస్థాన్ ఆఫర్ చేస్తున్న బీటెక్ (బయాలాజికల్లీ ఇన్స్పైర్డ్ సిస్టమ్ సైన్స్). శాస్త్రం-దాని మూల భావనల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలనుకునే వారికి సరిపోయే కోర్సు ఇది. మానవ జీవితంలో కీలకమైన సమాజం, శాస్త్రం (సైన్స్), తత్వశాస్త్రం ఒకదానితోఒకటి ఎలా సంధానమై ఉన్నాయో విపులంగా వివరించడానికి ఈ కోర్సు దోహద పడుతుంది. కాలానుగుణంగా సైన్స్ పరిణామం, దాని స్వభావాన్ని వివరించేందుకు ఉద్దేశించిన ఈ కోర్సు నాలుగు మాడ్యుల్స్‌గా ఉంటుంది. మొదటి మాడ్యూల్లో సైన్స్ చారిత్రక నేపథ్యం, తాత్విక పునాదుల గురించి వివరిస్తారు. రెండో మాడ్యూల్లో ప్రధాన భావనలపై విశ్లేషణ, మూడో మాడ్యూల్లో ఇప్పటి వరకు సైన్స్ గురించి చోటు చేసుకున్న ముఖ్యమైన చర్చలు వంటి అంశాలను చేర్చారు. నాలుగో మాడ్యూల్లో జీవ శాస్త్రాల్లోని తాత్విక సమస్యలను చర్చిస్తారు. ఈ కోర్సులో పొందిన అవగాహన ద్వారా విద్యార్థులు సిస్టమ్ సైన్స్, పర్యావరణ వ్యవస్థ, వ్యాపార, ఆర్థిక రంగాల్లోని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పొందుతారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హెల్త్ కేర్, డిజైన్, పునరుత్పాదక ఇంధన రంగం, మెటీరియల్ సైన్స్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిర పడొచ్చు. వివరాలకు: www.iitj.ac.in -
2013 - హొంశాఖ పనితీరు
-
తొలిరోజు ముగిసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ బృందం తొలిరోజు సమావేశం ముగిసింది. ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే శాంతి భద్రతల సమస్యలపై బృందం చర్చించింది. ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో చర్చలు నిర్వహించారు. పోలీసు సిబ్బందిని ఎక్కడ ఎంతమందిని ఉంచాలి, ఆస్తుల పంపిణీ ఎలా అనే సమాచారాన్ని కేంద్ర హోం శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీ సేకరిస్తోంది. ఈ సమావేశంలో 17 మంది ప్రస్తుత, రిటైర్డ్ పోలీసులు అధికారులు పాల్గొన్నారు. పోలీసు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ చీఫ్ విజయకుమార్ నేతృత్వంలో ఉన్న ఈ బృందం తిరిగి గురువారం మధ్యాహ్నం సమావేశం అవుతుంది. ఉమ్మడి రాజధానిలో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఈ సమావేశంలో వచ్చినట్లు తెలుస్తోంది. తమ సమావేశం బుధవారం కూడా కొనసాగుతుందని కమిటీ కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలు తగిన సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాల కూర్పుపై దృష్టి పెట్టినట్టు విజయ్‌కుమార్ తెలిపారు. -
విభజనపై ఇప్పుడే ఏం మాట్లాడను
-
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం
-
విభజనపై ఇప్పుడే ఏం మాట్లాడను: విజయ్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంపై తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడనని కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర విభజన పరిస్థితులపై అధ్యయనం చేయటానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి తొమ్మిది మంది సభ్యుల బృందానికి విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. (పూర్తి కథనం... ఎవరీ విజయ్ కుమార్?) ఈ సందర్భంగా ఆయనను విలేకర్లు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. విభజనపై మిగతావారిని కూడా సంప్రదించిన అనంతరం మీడియాతో మాట్లాడతానన్నారు. రాష్ట్ర విభజన పరిస్థితులపై చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయో తాము చెప్పమలేమన్నారు. అయితే అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని విజయ్ కుమార్ తెలిపారు. శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులు: కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఆ బృందంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్.ఆర్. వాసన్, మధ్యప్రదేశ్ అదనపు డీజీ డి.ఎం. మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అభయ్‌కుమార్, సరిహద్దు భద్రతా దళం ఐజీ సంతోశ్ మెహ్రా, సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, హోంశాఖ (పర్సనల్) డెరైక్టర్ శంతను, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీఐజీ అన్షుమన్ యాదవ్‌లు ఉన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం
హైదరాబాద్ : కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. భారీ భద్రత మధ్య కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలోని 9మంది సభ్యుల బృందం నగరానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, అంశాలపై టాస్క్‌ఫోర్స్ బృందం ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన అధికారులతో చర్చించనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కేంద్రానికి ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. ప్రధానంగా హైదరాబాద్‌ను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని పరిధితోపాటు ఆ పరిధిలో శాంతిభద్రతల నిర్వహణ ఎలా ఉండాలి? ఉమ్మడి రాజధానిగా కొనసాగినంత కాలం హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలా? లేక తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధీనంలో ఉండాలా? అనే అంశాలపై కూడా టాస్క్‌ఫోర్స్ బృందం దృష్టి సారించనుంది. ఈ బృందం ఈరోజు నుంచి ఈ నెల 31 వరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రానికి చెందిన 18 మంది ఐపీఎస్‌లతో సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహించే టాస్క్‌ఫోర్స్ బృందంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్.ఆర్. వాసన్, మధ్యప్రదేశ్ అదనపు డీజీ డి.ఎం. మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అభయ్‌కుమార్, సరిహద్దు భద్రతా దళం ఐజీ సంతోశ్ మెహ్రా, సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, హోంశాఖ (పర్సనల్) డెరైక్టర్ శంతను, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీఐజీ అన్షుమన్ యాదవ్‌లు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర అధికారులు డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, మాజీ డీజీపీలు హెచ్.జె.దొర, అరవిందరావు, ఆంజనేయరెడ్డి, ఎ.కె.మహంతి, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎ.కె.ఖాన్, జె.వి.రాముడు, విశ్వజిత్ కుమార్, చారు సిన్హా, మల్లారెడ్డి, దామోదర్, ఎన్.ఆర్.కె.రెడ్డి, కె. సజ్జనార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆస్కీ డీజీ ఎస్.కె.రావులున్నారు. -
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ : పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌కు భద్రత పెంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పాట్నా బాంబు పేలుళ్ళ వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్లు బీహార్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహితుడైన తైసిన్ అక్తర్ ఈ పేలుళ్లకు సూత్రదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక పాట్నా పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. మరో వందమంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
అద్నాన్ సమీకి మూడు నెలల వీసా గడువు పెంపు!
పాకిస్థానీ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీకి మూడు నెలల పాటు వీసా గడువును హోంమంత్రిత్వ శాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇటీవల అద్నాన్ సమీ వీసా గడువు ముగిసినా.. భారత్ లో ఉండటం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6 తేది నుంచి మరో మూడు నెలలపాటు వీసా గడువును పెంచామని ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ షింత్రే మీడియాకు తెలిపాడు. అద్నాన్ సమీ వీసా 2006 సెప్టెంబర్ 26 నుంచి 2013 అక్టోబర్ 6 తేది వరకు వీసా అనుమతి ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా అద్నాన్ సమీ ముంబైలో నివాసముంటున్నారు. వీసా గడువు పూర్తయిన వెంటనే అద్నాన్ సమీకి ముంబై సోలీసులు నోటీసులు జారీ చేశారు. తాను వీసా గడువు పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నానని నోటీసులకు సమీ జవాబిచ్చారు.