న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను సొంత ఊళ్లకు చేర్చేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాల్సిందిగా కోరాడు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళల విషయంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు.ఫలితంగా వలస కూలీలు ఉపాధి కోల్పోతామనే భయంతో సొంత ఊళ్లకు బయలుదేరారని తెలిపారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాఫ్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. (వలస కూలీల కోసం 1000 బస్సులు)
వలస కూలీల కోసం ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపడం, విశ్రాంతి నిలయాలను ఏర్పాటు చేయాలన్నారు అజయ్ భల్లా. ఆహారంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉందని స్పష్టం చేశారు. వలస కూలీలకు బస్సులు, రైళ్ల ఏర్పాటు గురించి సరైన సమాచారం అందించాలని.. పుకార్లకు తావివ్వకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో స్పష్టత లేకపోతే.. వలస కూలీల్లో అశాంతి ఏర్పడుతుందన్నారు. కాలినడకన బయలుదేరిన వలస కూలీలను విశ్రాంతి సముదాయాలకు తరలించడమే కాక.. వారి చిరునామ, ఫోన్ నంబర్లు సేకరించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే అని పేర్కొన్నారు. వలస కూలీల బస్సులను రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపవద్దని కోరారు.(కరోనా ఎఫెక్ట్: డ్రైవరన్నా.. నీకు సలామ్)
Home Secy Ajay Bhalla writes to Chief Secretaries of all states to take steps to "mitigate the distress of migrant workers", suggests a number of measures to be implemented incl. operation of more special trains by proactive coordination between states and Railways ministry: MHA pic.twitter.com/iQEkXhlPYQ
— ANI (@ANI) May 19, 2020
Comments
Please login to add a commentAdd a comment