migrant labour
-
AP: ఆమెకు టెర్రర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యాచార ఘటనలు మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వలస వచ్చిన మహిళా కూలీలు ఈ వరుస ఘటనలతో హడలెత్తుతున్నారు. ప్రధానంగా కడియం పరిసర మండలాల్లోని నర్సరీల్లో రోజువారీ పనులకు ఒకరిద్దరుగా వెళ్లడానికి వలస మహిళా కూలీలు జంకుతున్నారు. గత నెల 15న నర్సరీలో పనికి వెళ్లిన 43 ఏళ్ల కస్తూరి సామూహిక లైంగిక దాడికి, హత్యకు గురవడమే దీనికి కారణం. ఈ పరిస్థితులు నర్సరీ రైతులకు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు నర్సరీల్లో మొక్కల ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది.కడియం: తూర్పు గోదావరి జిల్లా కడియం, రాజమహేంద్రవరం రూరల్‌తో పాటు కోనసీమ జిల్లా కొత్తపేట, ఆలమూరు, మండపేట రూరల్ తదితర ప్రాంతాల్లో నర్సరీలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1,500 రిజిస్టర్డ్, రిజిస్టర్ కానివి మరో 500 పైగా కలిపి మొత్తం రెండు వేలకు పైగా నర్సరీలు ఉన్నాయి. వీటికి దేశవ్యాప్తంగానే ప్రత్యేక గుర్తింపు ఉంది. రూ.5 నుంచి రూ.50 లక్షల వరకూ విలువ చేసే మొక్కలను ఇక్కడి రైతులు స్వీయ ప్రతిభతో ఉత్పత్తి చేస్తూంటారు. నాణ్యమైన మొక్కలు సరసమైన ధరలకు లభిస్తూండటంతో ఇక్కడి మొక్కల వ్యాపారం దేశం నలుమూలలా విస్తరించింది. వేలాది మందికి ఉపాధి ఇక్కడి నర్సరీలపై ఆధారపడి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కారి్మకులు జీవనం సాగిస్తున్నారు. మొక్కల సాగు, రవాణా తదితర పనుల్లో వీరి పాత్ర అత్యంత కీలకం. నర్సరీలతో పాటు, పూలతోటలు, గోదావరి లంక ప్రాంతాల్లో కూరగాయల సాగులో కూడా వలస కూలీల పాత్ర ఎక్కువే. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న కడియం నర్సరీ రంగానికి శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన దాదాపు 25 వేల మంది కూలీలు వెన్నెముకగా ఉన్నారు. వారు తమ కుటుంబాలతో వచ్చి ఇక్కడ స్థిరపడి, నర్సరీల్లో ఉపాధి పొందుతున్నారు.వీరిలో 12 వేల మందికి పైగా మహిళా కూలీలే కావడం విశేషం. చేసే పనిని బట్టి రోజు కూలీగా, కాంట్రాక్టు విధానంలో వీరికి రైతులు చెల్లింపులు చేస్తారు. మహిళలకు రోజుకు రూ.350 నుంచి రూ.400 వరకూ చెల్లిస్తారు. ప్యాకెట్లు పెట్టడం, వాటిని సర్దడం, మొక్కల పెంపకం, కలుపుతీతలు, ఎరువులు వేయడం, మందుల పిచికారీ, నీరు పెట్టడం, ఎగుమతులు, దిగుమతులు తదితర విభాగాల్లో మహిళా కూలీలు పని చేస్తూంటారు. ప్యాకెట్లను బట్టి కూలి ఉంటుంది. ఒక్కోసారి రోజుకు సగటున ఒక్కొక్కరికి రూ.600 నుంచి రూ.800 వరకూ కూడా గిట్టుబాటు అవుతూంటుంది. చిన్న కమతాలే అధికం స్థానిక నర్సరీల్లో 85 శాతం పైగా అరెకరం నుంచి రెండెకరాల విస్తీర్ణం ఉన్న చిన్న కమతాలే ఉన్నాయి. ఈ రైతులు ఒకరిద్దరు మహిళలను పనిలో పెట్టుకుని, తాము కూడా పని చేస్తూ మొక్కలు ఉత్పత్తి చేస్తారు. ఇద్దరు మనుషులు నాలుగైదు రోజులు పని చేస్తే మొక్కల సాగులో ఒక దశ పని పూర్తవుతుంది. మళ్లీ కొన్ని రోజులకు పనిలోకి పిలుస్తూంటారు. కానీ అక్టోబర్ హత్యాచార ఘటన తరువాత ఒకే రోజు ఐదారుగురు కలసి పనిలోకి వచ్చేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒకరిద్దరే అవసరమయ్యే చిన్న కమతాల రైతులకు భారం తప్పడం లేదు. భయం తొలగించేందుకు చర్యలు మహిళా కూలీల్లో భయాన్ని తొలగించేందుకు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఒకరిద్దరుగా పనులకు వెళ్లవద్దని మహిళలకు సూచించారు. అలాగే ప్రతి నర్సరీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. అతిగా ప్రవర్తించే వ్యక్తుల సమాచారం తమకు ముందుగా ఇస్తే నిఘా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు.మత్తులో జోగుతున్న యువతనర్సరీల్లో పనులు చేస్తున్న వారిలో అత్యధిక శాతం మందికి మద్యం అలవాటు ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల గంజాయి వినియోగం కూడా పెరిగిందని అంటున్నారు. జన సంచారం లేని ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల మధ్య సైతం గంజాయి తాగుతూ మత్తులో జోగుతున్నారని చెబుతున్నారు.ఒకరిద్దరుగా వెళ్లడానికి భయంగా ఉంది గతంలో మాదిరిగా ఒకరిద్దరుగా పనుల్లోకి వెళ్లడానికి భయపడుతున్నాం. కస్తూరి ఘటన తరువాత ఒకరిద్దరం పనులకు రాలేమని చెప్తున్నాం. రైతులు అర్థం చేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా ఎక్కువ మందిని పనిలోకి పిలవడం వారికి ఇబ్బందే. అయినప్పటికీ తప్పడం లేదు. – జి.నీలవేణి, నర్సరీ కూలీ, కడియపులంక మహిళా కూలీలు జంకుతున్నారు కస్తూరి ఘటనకు ముందు ఎంత మంది కావాలంటే అంత మందే కూలీలు పనులకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరుగా రావడానికి భయపడుతున్నారు. మేము కూడా ఉంటామన్న భరోసా ఇస్తే తప్ప పనుల్లోకి రావడం లేదు. బాగా తెలిసిన వారే అయినప్పటికీ వారిని భయం వెంటాడుతోంది. – ఎం.నాగేశ్వరరావు, నర్సరీ రైతు అవగాహన పెంచుతున్నాంరౌతు కస్తూరి ఘటన తరువాత నర్సరీల్లో పనులకు వచ్చే మహిళల భద్రతకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ఇప్పటికే పలు సమావేశాల ద్వారా వివరించాం. నర్సరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. పనులకు వెళ్లి వచ్చే సమయంలో కూలీలకు సమావేశాలు ఏర్పాటు చేసి, స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నాం. – ఎ.వేంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్, కడియంరౌతు కస్తూరి ఘటన క్రమం ఇదీ.. అక్టోబర్ 15 : డ్వాక్రా సమావేశం ముగించుకుని బుర్రిలంకలోని ఇంటి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు కాలినడకన కిలోమీటరు దూరంలోని నర్సరీకి పనికి వెళ్ళింది. సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు.అక్టోబర్ 16 : కస్తూరి భర్త పాపారావు ఫిర్యాదు మేరకు కడియం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అక్టోబర్ 17: బుర్రిలంకకు 6 కిలోమీటర్ల దూరంలో ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల వద్ద బాగా పాడైపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై ఉన్న ఆపరేషన్ ఆనవాళ్లు, కాలి పట్టీల ఆధారంగా ఆ మృతదేహం కస్తూరిదేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. కస్తూరిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్టోబరు 31 : నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.అక్టోబర్ 15 దుర్ఘటనతో.. కడియం మండలం కడియపులంక పంచాయతీ బుర్రిలంక వద్ద నర్సరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న రౌతు కస్తూరిపై గత నెల 15వ తేదీన నలుగురు దుర్మార్గులు మద్యం మత్తులో అత్యంత పాశవికంగా సామూహిక లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశారు. ఈ దారుణ ఘటనతో నర్సరీల్లో పనులు చేసుకునేందుకు వచ్చే వలస మహిళలు, వారి కుటుంబాల్లో తీరని భయం అలముకుంది. ఎక్కడెక్కడి నుంచో ఉపాధి పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ వారు, స్థానికులతో కలసిమెలసి జీవిస్తున్నారు. తాము వలస వచ్చామన్న విషయాన్ని మరచిపోయి, హాయిగా గడుపుతున్నారు.ఎప్పటి మాదిరిగానే పనికి వెళ్లిన మహిళ పట్ల, తమకు నిత్యం కనిపించే వ్యక్తులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వారిలో భయాందోళనను నింపింది. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు నర్సరీల్లో కూలి పనులకు వెళ్లేందుకు వలస మహిళా కూలీలు జంకుతున్నారు. రైతుల అవసరాన్ని బట్టి గతంలో ఒకరిద్దరుగా కూడా పనులకు వెళ్లేవారు. అటువంటిది ఇప్పుడు పనికి రావడానికి నిరాకరిస్తున్నారు. -
రెండు రోజుల్లో మణిపూర్‌లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు..
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు మొదలై రెండు నెలలకు పైబడుతోంది. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోంది. మెల్లిగా జనజీవనం కూడా యధాస్థితికి చేరుకుంటోంది. అంతలోనే మయన్మార్ నుండి 700 కు పైగా వలసదారులు మణిపూర్‌లో అడుగుపెట్టారు. రాష్ట్ర సరిహద్దు చుట్టూ వేల సంఖ్యలో అస్సాం రైఫిల్స్ ను కాపలా పెట్టినా సరైన డాక్యుమెంట్లు లేకుండా అంతమంది రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నదే ప్రభుత్వాన్ని తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. మే 3 నుండి మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే రెండు జాతుల మధ్య వైరుధ్యం కారణంగా చెలరేగిన అల్లర్లు సుమారు 150 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఎన్నో ఇళ్ళు దగ్ధమయ్యాయి. ఏ వీధిని చూసిన సగం కాలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 40 వేలకు పైగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు. ఒకపక్క ప్రాణాలను చేత బట్టుకుని మణిపూర్ వాసులు వలస పోతుంటే పక్క దేశం నుండి అగ్నిగుండంలా ఉన్న రాష్ట్రంలోకి వలసలు వస్తున్నారు. హోంశాఖ తెలిపిన విసరాల ప్రకారం జులై 22, 23 లోనే మయన్మార్ నుండి 718 మంది వలసవచ్చారు. వీరంతా ఎవరనేది మణిపూర్ ప్రభుత్వానికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న. బ్రతుకు తెరువు కోసమే వచ్చారా లేక ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారా? అన్నదానిపై స్పష్టత లేదు. వారు ఆయుధాలు ఏవైనా వెంట తెచ్చుకున్నారా అన్న సమాచారం కూడా హోంశాఖ వద్ద లేదు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా దళాలు ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలించకుండానే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
Theli Rajeshwari: మురికివాడ నుంచి లండన్ వరకు
తేలి రాజేశ్వరిది మెదక్ జిల్లా దప్పూరు. వలస కూలీలుగా తల్లిదండ్రులు ముంబైకి వెళితే అక్కడే పుట్టింది. స్లమ్స్‌లో ఉన్నా మరాఠీ మీడియంలో చదువుకున్నా ఏనాటికైనా పై చదువులకు విదేశాలకు వెళ్లాలని పట్టుదల. దానిని సాధించింది. లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రాజేశ్వరి తన చదువు కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో. ‘నా పేరు రాజేశ్వరి. మాది మెదక్ జిల్లా దప్పూరు. మా అమ్మానాన్నలు వలస కూలీలు. ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఎక్కడ కడుతుంటే దాని బేస్మెంట్లో పట్టాలు కట్టుకుని కాపురం ఉండేవారు. అంధేరిలో వాళ్లు కూలి పని చేస్తుండగా నేను పుట్టాను. నాకు అప్పటికే అన్న ఉన్నాడు. ఎల్.కె.జి, యు.కె.జి నేను మరాఠి స్కూల్లో చదువుకున్నాక ముంబైలో చదువు కష్టమని నన్ను, అన్నను దప్పూరులోని మా నానమ్మ దగ్గరకు పంపారు. అక్కడ మళ్లీ అఆలు నేర్చుకోవడం నాకు కష్టమైంది. ఐదవ క్లాసు పూర్తయ్యేసరికి మా నానమ్మ చనిపోయింది. ఇక ఊళ్లో ఎవరూ లేరు. మళ్లీ అన్నా, నేను ముంబై చేరుకున్నాం’. ► పనిపిల్లగా ఉంటూ ‘2006లో ముంబైకి వచ్చాక ఆరోక్లాసు నుంచి చదవడానికి తెలుగుమీడియం స్కూల్ దొరకలేదు. మేముండే ములుండ్ నుంచి గంట దూరం వెళ్లి చదువుకుందామన్నా దొరకలేదు. చివరకు దగ్గరిలోని కన్నడ మీడియం స్కూల్లో చేరాల్సి వచ్చింది. నేను ముంబై వచ్చాక బాగా చదువుకోవాలని అనుకున్నాను. దానికి డబ్బు కావాలి. అందుకని నేను స్కూలుకు వెళ్లడంతోపాటు దగ్గరి ఇళ్లల్లో పనిపిల్లగా చేసేదాన్ని. అందుకు నేను కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. టెన్త్ వరకూ అలాగే చదువుకున్నాను. ఇంటర్‌కి వచ్చేసరికి కాలేజీకి అరాకొరా వెళుతూ టెలీకాలర్‌గా పని చేశాను. దానివల్ల అకౌంట్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక పై చదవలేనేమో అనిపించింది. ఎలాగో ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగంలో చేరిపోయాను. అంతవరకూ నేను జీవితం గడిపింది స్లమ్స్‌లోనే’ ► మళ్లీ చదువుకు ‘ఇంటర్ అయ్యాక నేను ముంబైలోని ఎక్సెంచర్ సంస్థలో ఒక ఏజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. ఇంటర్ పాస్ మీద వారిచ్చిన ఉద్యోగం నాకు తృప్తిగా ఉండేది. కాని 2018 వచ్చేసరికి నా ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదు. డిగ్రీ లేని నీకు ఈ మాత్రం జీతం ఇవ్వడమే గొప్ప అన్నారు సంస్థ వారు. మళ్లీ చదువు గుర్తుకొచ్చింది. ఏమిటి ఇలా తయారయ్యాను అనుకున్నాను. పై చదువులు చదవాలన్న పట్టుదల గుర్తుకొచ్చింది. ఎలాగైనా నా కలను సాధించుకోవాలనుకున్నాను. కాని ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలని అలాంటి ఆప్షన్ కోసం ఎన్ని కాలేజీలు తిరిగినా వీలు కాదన్నారు. కరెస్పాండెన్స్ కోర్సు చేయమన్నారు. చివరకు కల్యాణ్ (ముంబైలోని ఒక ఏరియా) లో సంకల్ప్ కాలేజీ వాళ్లు నా తపన చూసి నీకు వీలున్నప్పుడు వచ్చి అటెండ్ అవుతూ ఉండు అని సీట్ ఇచ్చారు. అక్కడ నేను బికాం చేరాను. నా ఉద్యోగం వారంలో ఐదు రోజులు. ఏ రెండు రోజులైనా ఆఫ్ తీసుకోవచ్చు. అలా నేను అందరిలా శని, ఆదివారం కాకుండా వీక్‌డేస్ ఆఫ్ తీసుకుంటూ 2021 జూన్‌లో బి.కాం పూర్తి చేశాను. ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చాను’ ► యు.కె. కల ‘ఒకవైపు చదువు, ఉద్యోగంతో పాటు విదేశాలలో చదవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ వచ్చాను. పాస్‌పోర్ట్ కోసం నా పర్మినెంట్ అడ్రస్ దప్పూర్ కావడం వల్ల హైదరాబాద్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆధార్ కరెక్షన్, సర్టిఫికెట్లు చాలా పని. మరో వైపు 2022 సెప్టెంబర్ ఇన్‌టేక్ (యూకేలో సెప్టెంబర్‌లో మొదలయ్యే అకడెమిక్ ఇయర్ కోసం) కోసం ఆన్లైన్లో ఆయా యూనివర్సిటీల్లో అప్లికేషన్స్ వేస్తూ వెళ్లాను. కాని యు.కెలో చదవడం చాలా ఖర్చుతో పని. అందుకోసం నేను బ్యాంకులోను, వడ్డీ మీద బయటి వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నాను. యూకేలో మాస్టర్స్ చేయడానికి నాకు సీట్ వచ్చింది. సెప్టెంబర్ 2022లో లండన్ చేరుకున్నాను. చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి పరిమిత గంటల అనుమతి ఉంటుంది. కాని అక్కడ వెంటనే పని దొరకదు. సులభంగా దొరికే ఉద్యోగం కేర్‌హోమ్‌లలో పని చేయడమే. మతి స్థిమితం లేనివారు, వృద్ధులు... వీరి బాగోగులు చూసుకుంటే డబ్బులు ఇస్తారు. అలా ఆరు నెలలు పని చేశాను. నాకు డిజిటల్ మార్కెటింగ్‌తో బాగా పరిచయం ఉంది కాబట్టి అందులోనూ సంపాదన వెతుకుతున్నాను. ముంబైలో స్లమ్స్‌లో ఉండిపోవలసిన దాన్ని. నా కష్టమే నన్ను యూకే దాకా చేర్చింది. ఇక్కడకు వచ్చి 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈస్టర్ సెలవలు నడుస్తున్నాయి. ఈ సెలవుల్లో ఎక్కువ గంటలు పని చేయవచ్చు. పని చేస్తున్నా. కష్టేఫలి అన్నారు కదా’. -
విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు
చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే) నేత సెంథామిళన్ సీమన్పై తమిళనాడు ఈరోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీట్ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ఓ పబ్లిక్ ర్యాలీలో సీమన్ మాట్లాడుతూ.. తమిళనాడులో హిందీలో మాట్లాడేవారిని కొడతానని, ఈ దెబ్బతో వాళ్లు బ్యాగులు సర్దుకుని పారిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. సీమన్ విద్వేష ప్రసంగాన్ని ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం సృష్టించే వారిపై చర్యలు తీసుకున్నట్లే.. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ రోడ్ పోలీసులు సీమన్పై కేసు నమోదు చేశారు. All those who used fake videos to incite hate & violence must be dealt with as per the law. But this doesn’t absolve those who’re openly calling for violence against #Hindi speaking people in #TN Why no action against likes of @SeemanOfficial for their vitriolic utterances? pic.twitter.com/vyu2EkjBQu — Prashant Kishor (@PrashantKishor) March 10, 2023 కాగా.. తమిళనాడులో ఉత్తరాది నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో బిహార్ సీఎం ఈవిషయంపై విచారణకు నిజనిర్ధరణ కమిటీ కూడా వేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమకు సోదరులతో సమానమని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. వారికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా..
శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లా ధరంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చండీగఢ్-శిమ్లా జాతీయ రహదారిపై టొయోటా ఇన్నోవా కారు వలస కార్మికులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరంతా పనికోసం వెళ్తున్న సమయంలో సోలన్ నుంచి పర్వాను వెళ్తున్న వాహనం వాళ్లను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. స్థానికులే పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్‌కు కాల్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల్లో ముగ్గురు.. గుడ్డుయాదవ్, రాజా వర్మ, నిప్పు నిషద్ బిహార్ చంపారన్ జిల్లాకు చెందిన వారు. మోతి లాల్ యాదవ్, సన్నీ దేవల్ యూపీలోని కుషీనగర్ జిల్లాకు చెందిన కార్మికులు. ఘటన అనంతరం ఇన్నోవా డ్రైవర్ రాజేష్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా, రాష్ డ్రైవింగ్ చేసి ఐదుగురు కార్మికుల మరణానికి కారణమైన అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్.. పదకొండుకు చేరిన సంఖ్య -
ఉత్తరాది వలస కార్మికులపై తమిళనాడులో దాడులు నిజమేనా..?
చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో ఆ రాష్ట్ర కార్మిక సంక్షేమ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి సీవీ గణేషన్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు ఫేక్ అని కొట్టిపారేశారు. కావాలనే తమిళనాడుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమిళనాడుకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి కార్మికలు వచ్చి పనిచేస్తున్నారని, వారంతా శాంతియుత వాతావరణంలో పని చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కొందరు దురుద్దేశంతోనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'పెద్ద, చిన్న పరిశ్రమలు తమిళనాడులో చాలా ఏళ్లుగా పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా తమ పని చేసుకుంటారు. రాష్ట్రాభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. తమిళనాడులో కొన్ని చోట్ల ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారిపై దాడులు జరుగుతున్నాయనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారికి కూడా ఈ విషయం తెలుసు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని మంత్రి హెచ్చరించారు. బిహార్ ప్రభుత్వం ప్రత్యేక బృందం.. కాగా.. తమిళనాడులో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులపై నిజంగానే దాడులు జరగుతున్నాయా? అనే విషయంపై బిహార్ ప్రభుత్వం నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు తమిళనాడును సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లేదు..
జగిత్యాల: ‘మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లే దు.. వివాహాలను అడ్డుకుంటున్నారు.. గ్రామంలో ఎవరు చనిపోయినా ఆధార్‌కార్డు ఇస్తేనే అంత్యక్రియలకు అనుమతి ఇస్తానంటున్నారు’ అని ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణి ద్వారా అద నపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. 40ఏళ్లుగా వేములకుర్తిలో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వలస వచ్చి ఇక్కడ ఉండొద్దా? అని ప్రశ్నించారు. మా పని మేం చేసుకుంటామని, మమ్మల్ని బతకనివ్వాలని ప్రజావాణి ద్వారా వేడుకున్నారు. సుమారు 20 మంది వరకు కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ ఆవేదనను వెలిబుచ్చారు. సుమారు 60 కుటుంబాలు గ్రామంలో ఉంటున్నాయని, గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోవాలని సర్పంచ్ ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇల్లు కిరాయి ఇవ్వడం లేదు నేను పరాయి దేశం పోయి వచ్చి అంతా లాసైన. అప్పుల బాధతో నా సొంతింటిని అమ్ముకున్న. కిరాయి ఇంట్లో ఉండనివ్వడంలేదు. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – మాచర్ల లక్ష్మణ్ పెళ్లి అడ్డుకునేందుకు యత్నించారు నేను దివ్యాంగుడిని. ఇటీవల నాకు వివాహం నిశ్చయమైంది. పెళ్లిని అడ్డుకునేందుకు సర్పంచ్ ప్రయత్నం చేశారు. బ్రాహ్మణులను రాకుండా చేశారు. వేరేవాళ్లతో పెళ్లి చేయించుకున్నాం. – రాట్నం మహేశ్ శవాన్ని అడ్డుకున్నారు మా తాత ముత్తయ్య ఇటీవల చనిపోయాడు. ఆ శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్దామంటే ఆధార్‌కార్డు ఇస్తేనే పంపిస్తామని సర్పంచ్ చెప్పిండ్రు. చేసేది లేక ఆధార్‌కార్డులు ఇచ్చినం. ఇప్పుడు మా వద్ద అవిలేవు. ఇబ్బందిగా ఉంది. – రాజ్‌కుమార్ -
గల్ప్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు గల్ఫ్ జెఏసి డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. వాల్గొండకు చెందిన గుంటి బర్నబ్బ (42) ఇటీవల యూఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోయారు. అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో పాటు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వాల్గొండ వరకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు. గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు చనిపోతున్నారు. గత ఎనిమిది ఏళ్లలో సుమారు 1,600 మంది తెలంగాణ ప్రవాసీల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొందరి మృతదేహాలకు గల్ఫ్ దేశాలలోనే అంత్యక్రియలు జరిగాయని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. ప్రవాసి అంతిమయాత్రలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి నాయకుడు మెంగు అనిల్, గ్రామ సర్పంచ్ దండిగ గంగు - రాజన్న, గ్రామస్తులు, గల్ఫ్ వాపసీలు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
వలస కార్మికులకు ఖతర్‌లో సెలవులు రద్దు ! కారణమిదే ?
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌లో పని చేస్తున్న విదేశీ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. వారం రోజుల నుంచి అమలవుతున్న సెలవుల రద్దును ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందే ఎత్తివేయనున్నారు. ఖతర్‌లో 2022 నవంబర్‌లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను తిలకించడానికి విదేశీయులు పెద్ద సంఖ్యలో ఖతర్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు రద్దు చేసిన సెలవులను అప్పుడు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఖతర్ ప్రభుత్వం సెలవులపై మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కంపెనీలు పాటిస్తున్నాయి. అత్యవసరం ఉన్న కార్మికులనే సెలవులపై సొంతూర్లకు పంపిస్తున్నారు. మిగతావాళ్లు ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందు స్వదేశాలకు వెళ్లి 4 నెలల పాటు సెలవులపై ఉండిరావచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి. చదవండి: కనీస వేతనం, విదేశీ భవన్.. ఇంకా మరెన్నో.. -
ఎక్కడికి పోవాలి? 20 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం
పరవాడ: కూలి పనులు చేసుకుంటూ.. కుటుంబాలను నెట్టుకొస్తూ పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్న తమ కుటుంబాలను ఉన్నట్టుండీ ఖాళీ చేసి పొమ్మంటే తమ గతేమిటని దేశపాత్రునిపాలెం సమీపంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్థలంలో తలదాచుకొంటున్న వలస కూలీలు వాపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు 20 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంటు, పరిసర ప్రాంతాల్లో దొరికే కూలి పనుల కోసం వచ్చాయి. సాయినగర్ కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న స్థలంలో చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న నిరుపేద కుటుంబాలన్నీ భార్యాభర్తలు కష్టించి పనిచేస్తే తప్ప పొట్ట గడవడం కష్టం. కొందరు స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనులు చేస్తుండగా మరికొందరు భవన నిర్మాణం పనులు, మట్టి పనులకు వెళుతున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో నివాసం ఉంటున్న వలస కూలీలను ఖాళీ చేసి వెళ్లి పొమ్మని కొంత కాలం నుంచి పవర్ గ్రిడ్ అధికారులు ఆదేశిస్తుండడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. పవర్ గ్రిడ్ యాజమాన్యం తమకు పునరావాసం కల్పించి గుడిసెల తొలగింపు చేపట్టాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే చొరవ: వసల కూలీల సమస్య తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఇటీవల పవర్ గ్రిడ్ అధికారులతో మాట్లాడారు. అప్పటినుంచి అధికారులు వత్తిడిచేయడం లేదని తెలిసింది. న్యాయం చేయాలి నేను, నా భర్త 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా హిరమండలం గరివిడి గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకొని స్టీల్‌ప్లాంటులో కూలి పనులకు వచ్చాం. తన భర్త కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. దేశపాత్రునిపాలెం సమీపంలో ఖాళీ స్థలంలో చిన్న పూరిగుడిసె నిర్మించుకొని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. ఇంతలో పవర్ గ్రిడ్ అధికారులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి. – బోర రమణమ్మ, వలస కూలి పునరావాసం కల్పించాలి విజయనగరం జిల్లా గంట్యాడ మండల లక్కిడాం నుంచి 21 ఏళ్ల క్రితం కూలి పనులకు వచ్చి చిన్న పూరి గుడెసె నిర్మించుకొని కుటుంబంతో తలదాచుకుంటున్నాం. పునరావాసం కల్పిస్తే తప్ప గుడిసెలు ఖాళీ చేసేదిలేదు. – బండారు రమణమ్మ, వలస కూలి ప్రభుత్వమే ఆదుకోవాలి పాతికేళ్ల క్రితం గాజువాక నుంచి చిరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని పొట్టపొషించుకొంటున్నాం. ఇళ్ల పట్టాలిప్పిస్తామని కొందరు పవర్ గ్రిడ్ హోం గార్డులు తమ వద్ద ఆధార్ కార్డులు, నగదు తీసున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ప్రçభుత్వమే ఆదుకోవాలి. – నడిపిల్లి అరుణ, చిరు వ్యాపారి -
వలస కార్మికులకు కువైట్ సర్కార్ ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికి 60 ఏళ్ల వయసు పైబడిన వారిని స్వదేశాలకు పంపిన కువైట్ ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. వలస కార్మికులను బలవంతంగా పంపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో 60 ఏళ్ల పైబడిన వారిని మళ్లీ విధులలో కొనసాగించాలని కువైట్ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించే బాధ్యత కువైట్ ప్రభుత్వంపై పడటంతో 2020 డిసెంబర్లో విదేశీ వలస కార్మికులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. కువైట్ పౌరులలో ఎక్కువ మందికి వ్యాపార, సాంకేతిక రంగాల్లో అనుభవం లేక పోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపారాలకు ప్రతిబంధకంగా మారింది. దీంతో వృత్తి నైపుణ్యం ఉన్న విదేశీ వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 1 నాటికి 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపించగా ఆ తర్వాత కూడా 60 ఏళ్లు నిండిన వారికి వీసాలను రెన్యూవల్ చేయలేదు. 60 ఏళ్ల వయసు నిబంధనను ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల కార్మికులకు ఊరట లభించింది. కువైట్‌లో ఉపాధి పొందుతున్న తెలుగు రాష్ట్రాల వలస కార్మికుల సంఖ్య దాదాపు 3.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా కరోనాతో నిలిపివేసిన కువైట్ ప్రభుత్వం నిలిపివేసిన వీసాలను ఇప్పుడు జారీచేయడానికి ఆమోదం తెలిపింది. (చదవండి: ఆ విషయంలో దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
‘ఒక్క సంఘటన నా కళ్లు తెరిపించింది’
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎందరో ఉద్యోగాలు పొగొట్టుకుని రోడ్డున పడ్డారు. బతుకుతెరువు కోసం పట్టణానికి వచ్చిన వారంతా తిరిగి పల్లే బాట పట్టారు. మార్చి మొదలు మే వరకు రోడ్డు మీద ఎక్కడ చూసిన వలస కార్మికులే దర్శనమిచ్చారు. చంటి బిడ్డలతో.. మండుటెండల్లో వారు అనుభవించిన కష్టాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. వీరి బాధలు ఇలా ఉంటే ఇక ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. లాక్‌డౌన్‌తో అందరికి సెలవులు దొరికాయి ఒక్క మహిళలకు తప్ప. వారికి చాకిరీ రెట్టింపయ్యింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే లాక్డౌన్ కాలంలో మహిళలపై గృహహింస రెట్టింపయినట్లు జాతీయ మమహిళా కమిషన్ ఓ నివేదిక విడుదల చేసింది. ఒక్క ఫోన్ కాల్‌తో.. ఈ క్రమంలో ఓ ఐపీఎస్ అధికారి గృహహింస బాధితులను ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం ఎన్నో ప్రశంసలు పొందుతుంది. ఒక్క గృహహింస బాధితులనే కాక ఇంటి బాట పట్టిన వలస కార్మికులకు సాయం చేసి వారిని స్వస్థలాలకు చేర్చింది. దాంతో ఆమెకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హ్యూమన్స్ బాంబే వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆ వివరాలు.. ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో.. జనాలను రోడ్ల మీదకు రాకుండా చూడటానికి కృషి చేశారు. ఇలా విధులు నిర్వహిస్తుండగా ఓ రోజు ఆమెకు కాన్పూర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. (కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్) మూడు రోజులుగా చుక్క నీరు లేకుండా ఫోన్లో సదరు మహిళ మహబూబ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరి గత మూడు రోజుల నుంచి తనకు ఫోన్ చేయడం లేదని తెలిపింది. సోదరి భర్త ఆమెను తరచుగా కొడతాడని.. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరిగి ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేసింది. అనంతరం తన సోదరి అడ్రస్ ఇచ్చి.. సాయం చేయమని కోరింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు రాజేశ్వరి తన టీంతో ఆమె ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లింది. అక్కడ కనిపించిన భయంకరమైన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నది. ఫోన్ చేసిన మహిళ సోదరిని ఆమె భర్త గత మూడు రోజుల నుంచి దారుణంగా కొడుతునే ఉన్నాడు. ఆమెకు కనీసం తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా హింసించాడు. నొప్పితో బాధపడుతుంది. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. మూడు రోజుల తర్వాత బాధితురాలు కోలుకుంది. అనంతరం ఆమె భర్తపై కేసు పెట్టింది. బాధితురాలి సోదరి రాజేశ్వరికి ఫోన్ చేసి.. ఆమెను తన దగ్గరకు పంపమని వేడుకుంది. అందుకు ఒప్పుకున్న రాజేశ్వరి బాధితురాలిని తెలంగాణ మహబూబ్‌నగర్ నుంచి ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు వెళ్లడానికి ఏర్పాటు చేసింది. (ఇల్లే భద్రం)| ఆ సంఘటన నా కళ్లు తెరిపించింది ఈ సంఘటన రాజేశ్వరిని తీవ్రంగా కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాటి సంఘటన నా కళ్లు తెరిపించింది. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉంటారు. సమాజం కట్టుబాట్లు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఇళ్లలోనే ఈ హింసను భరిస్తుంటారు. ఫిర్యాదు కూడా చేయలేరు. అలాంటి వారికి సాయం చేయాలనిపించింది. దాంతో ఒక ఆలోచన చేశాను. బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చే బదులు మనమే వారి దగ్గరకు వెళ్లి సాయం చేయడం మంచిది అనిపించింది. వెంటనే ఒక మొబైల్ సెఫ్టీ వెహికల్‌ను ఏర్పాటు చేశాను. టీమ్‌ను సిద్ధం చేశాను. వీరంతా జిల్లా వ్యాప్తంగా తిరిగి బాధితులను గుర్తించి వారికి సాయం చేస్తారు. ఈ ప్రయత్నం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 40 కేసులు నమోదయ్యాయి’ అన్నారు. (ఒక్కో బుక్... ఒక్కో కిక్) నా టీం వల్లే ఇదంతా సాధ్యమయ్యింది అంతేకాక ‘లాక్డౌన్ నియమాలు కఠినతరం కావడంతో.. వలస కార్మికులంతా ఇళ్ల బాట పట్టారు. దాంతో వారికి కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. నేను, నా టీమ్ హైవేల వెంట ఫుడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి.. వారికి సాయం చేశాం. వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేసేంత వరకు దాదాపు 11 వేల మందిని స్వస్థలాలకు చేర్చాం’ అన్నారు రాజేశ్వరి. అంతేకాక గత మూడు నెలల నుంచి తన టీం ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబానికి దూరంగా ఉంటూ సామాన్యులకు సాయం చేశారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం వారిలో చాలామందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్లో ఉన్నారన్నారు. అయినా కూడా వారంతా ‘‘మేడమ్ .. మేము తిరిగి ఎప్పుడు విధుల్లో జాయిన్ కావాలి’ అని అడుగుతున్నారు. ఈ ఉద్యోగం పట్ల వారికున్న ప్రేమ అలాంటిది. వారందరి సహకారంతోనే నేను ఇదంతా చేయగలిగాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజేశ్వరి ప్రయత్నాన్ని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు. -
నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే
నగరంలో కార్మికుల కొరత ఇప్పటికే సొంతూళ్లకు 13 లక్షల మంది వలస కార్మికులు తిరిగి రప్పించేందుకు యాజమాన్యాల ప్రయత్నాలు మంచి వేతనం..వసతి హామీలతో రప్పించే యత్నం కొందరి సుముఖం.. బుక్కాని రైలు టికెట్లు సాక్షి,సిటీబ్యూరో: అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులను తిరిగి రప్పించేందుకు వివిధ రంగాల యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే కార్మికులు తిరిగి రావడం అంత సులభం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు పడి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రావాలంటే రైళ్లల్లో రావాల్సిందే. అయితే అందుకు తగ్గట్లుఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం కష్టమే. సొంతంగా వారు వచ్చే పరిస్థితి లేదు.అయితే కొందరు కార్మికులుమాత్రం రోడ్డుమార్గం ద్వారా వస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దు మినహా మిగతా రాష్ట్రాల వైపు నుంచి రాకపోకలపై ఆంక్షలు నెలకొంది. హైదరాబాద్ మహానరంతో పాటు శివారు ప్రాంతాల్లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న సుమారు 13 లక్షల మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు.(‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’) నాడు గాలికి వదిలేసి.... వాస్తవంగా ఉపాధి నిమిత్తం లేబర్ కాంట్రాక్టర్ (టేకేధార్) ద్వారా స్వస్థలాల నుంచి పనులు చేసే ప్రాంతాలకు, తిరిగి వేళ్లేటప్పుడు రైల్వే స్టేషన్ల వరకు చేర్చే బాధ్యత కూడా టేకేధార్లు నిర్వర్తిస్తారు.లాక్డౌన్ కష్ట కాలంలో ఇటూ యాజమాన్యం పట్టించుకోక పోగా, టేకేధార్లు కూడా పత్తా లేకుండా పోయారు. దీంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వారిని గాలికొదిలేసిన యాజమాన్యాలు తిరిగి మళ్లీ పిలవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోగా.. ఇప్పుడు మీ అవసరం కోసం రమ్మంటున్నారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంచిజీతం, వసతి, వైద్య ఆరోగ్య సేవల సదుపాయాలను సమకూర్చుతామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని హామీ వచ్చిన తరువాతే కొందరు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణాలు కష్టమే... సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులకు మంచి వేతనం, సదుపాయాలను ఇస్తామని యాజమాన్యాలు చెబుతుండటంతో స్వస్థలాల్లో పనులువదులుకొని తిరిగి వచ్చేందుకు కార్మికులు సిద్ధమవుతున్నా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంది. ఆధార్ అడ్రస్ ఆధారంగా రైలు టికెట్ బుక్ కావడంలేదు. ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చే పరిస్థితి లేదు. -
క్వారంటైన్ భయంతో రైలు చైన్ లాగి..
గువహతి : ముంబై నుంచి శ్రామిక్ రైలులో స్వస్ధలాలకు చేరుకుంటున్న వలస కూలీలు రెండు వారాల క్వారంటైన్‌ను తప్పించుకునేందుకు రైలులో ఎమర్జెన్సీ చైన్ లాగిన ఘటన వెలుగుచూసింది. ఈ ఉదంతంలో 61 మందిని అరెస్ట్ చేయగా రైల్వేలు, అసోం పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ముంబై నుంచి దిబ్రూగఢ్ వెళుతున్న లోక్మాన్య తిలక్ శ్రామిక్ రైలు మంగళవారం అర్ధరాత్రి హజోయి రైల్వేస్టేషన్‌కు చేరుకునే సమయంలో వలస కూలీలు చైన్ లాగారు. హజోయి వద్ద రైలు దిగిన 56 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు అదేరోజు రాత్రి అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో అసోం పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబై నుంచి వీరందరూ తిరిగి వస్తుండటంతో హజోయి స్టేషన్లో ఈ ఘటన కలకలం రేపింది. ఇక అసోం లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి : ఒక కుటుంబం ఆరు చపాతీలు.. -
దుబాయ్ టూ హైదరాబాద్
మోర్తాడ్(బాల్కొండ): పొట్ట కూటి కోసం గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికులు కరోనా సృష్టించిన కల్లోలంతో ఉపాధిని కోల్పోయారు. ప్రధానంగా దుబాయ్, షార్జాలలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికులు లాక్డౌన్ వల్ల రోడ్డున పడ్డారు. తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉండగా వారిని షార్జాలోని పారిశ్రామిక వాడలో షెల్టర్‌కు తరలించారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పించారు. ఇందులో 150 మంది కార్మికులు ఇండ్లకు వెళ్లడానికి దుబాయ్‌లోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుమతి ఇవ్వగా ఈ రోజు దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరందరికి బాప్స్ అనే దేవాలయ సంస్థ ఉచిత విమాన టిక్కెట్లను సమకూర్చింది. అలాగే షార్జాలోనిషెల్టర్‌లో ఉన్న ఇతర కార్మికులకు వాలంటీర్లు భోజన సదుపాయాలను సమకూరుస్తున్నారు. వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా షెల్టర్‌లో ఉన్న కార్మికులు అందరిని దశల వారీగా స్వరాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాయబార కార్యాలయం అధికారుల సహాయం మరువలేనిది... లాక్‌డౌన్‌తో వీధిన పడ్డ తెలంగాణ కార్మికులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిని క్షేమంగా ఇండ్లకు పంపించడానికి దుబాయ్‌లోని మన రాయబార కార్యాలయం అధికారులు చేసిన కృషి మరువలేనిది. ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్, కాన్సులేట్ అధికారులు అజిత్‌సింగ్, బాప్స్ సంస్థ ప్రతినిధులు అశోక్, నరేష్, రూపేష్, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత గిరీష్ పంత్‌ల సహకారంతో తెలంగాణ కార్మికులకు విలువైన సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ చేరుకున్న కార్మికులకు ఉచిత క్వారంటైన్‌ను కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం విమాన చార్జీలను వాపసు చేయాలి. – జనగామ శ్రీనివాస్, ఇండియన్ పీపుల్స్ ఫోరం ఉపాధ్యక్షుడు(దుబాయ్) -
ప్రభుత్వ పర్యవేక్షణలో ఇక క్యాంపులు నో...
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్లో ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లన్నీ ఎత్తివేయడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు సడలింపు లభించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పనులు దొరకని వలస కార్మికులు ఇక్కడ ఉండలేక..సొంతూళ్లకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల్లో సుమారు పది లక్షల మంది వలస కార్మికులు మహానగరం దాటేశారు. మరో రెండు లక్షల మంది సొంతూరి బాటపట్టారు. తాజాగా శుక్రవారం నగరం నుంచి మరో మూడు శ్రామిక్ రైళ్లలో సుమారు ఐదు వేలకు పైగా వలస కార్మికులు పశ్చిమ బెంగాల్‌కు బయలు దేరారు. లాక్డౌన్లో వలస కార్మికులు అకలితో అలమటించకుండా క్యాంప్‌లు ఏర్పాటు చేసి కొందరికి బియ్యం, నగదు పంపిణీ చేసి ఉపశమనం కలిగించిన ప్రభుత్వం.. వరుస సడలింపులతో నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంది. ఆ తరువాత కొద్ది రోజులు స్వచ్చంద సంస్థల సహకారంతో కొనసాగిన క్యాంపులు పూర్తిగా మూత పడ్డాయి. తిండీ..తిప్పలు లేక... మహా నగరంలో ఇంకా మిగిలిపోయి పనులు లభించని వలస కార్మికుల కుటుంబాలు తిండీతిప్పలు లేక సొంతూళ్లకు వెళ్లలేక నరక యాతన పడుతున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్లో వివిధ రంగాలకు మినహాయింపులతో వలస కార్మికులకు చేయూత పై దృష్టి తగ్గడంతో పాటు రిలీఫ్ క్యాంప్‌లు సైతం క్రమంగా మూతపడ్డాయి. వాస్తవంగా నెలన్నర ముందే లాక్డౌన్ ఎత్తివేతపై భరోసా లేక వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు బయలు దేరడంతో కేంద్ర ప్రభుత్వం రైలు, ఆ తర్వాత రోడ్డు మార్గాల ద్వారా వేళ్లేందుకు అనుమతించింది. మరోవైపు భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు కూడా మినహాయింపు ఇవ్వడంతో వలస కార్మికులు ఉరుకులు పరుగులు తీశారు. కొందరు పోలీసు యంత్రాంగం వద్ద పేర్లు నమోదు చేసుకొని సొంతూళ్లకు రోడ్డు, రైళ్ల మార్గాల ద్వారా బయలు దేరగా.... మరి కొందరు ఇక్కడే పనులు చేసేందుకు ఆగిపోయారు. అయితే ప్రభుత్వ నిబంధనలు, పెట్డుబడులు, ముడిసరుకులు, నిపుణులు లేక పూర్తి స్థాయిలో పనులు, ఉత్పత్తి ప్రారంభానికి నోచుకోలేదు. దీంతోవలస కార్మికులకు పనులు లేకుండా పోయాయి. కనీసం తినడానికి తిండి, చేతిలో చిల్లి గవ్వ లేక పోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమై తల్లడిల్లిపోతున్నారు. సరిహద్దు ప్రాంతాలకు ... ఇంకా కాలినడకన..సొంతూళ్లకు బయలు దేరిన వలస కార్మికులను అక్కడక్కడ గుర్తిస్తున్న పోలీసు యంత్రాంగం వారిని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం వరకు ప్రత్యేక బస్సుల్లో చేరుస్తోంది. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతం నుంచి మేడ్చల్ క్యాంప్ వైపు కాలినడకన వస్తున్న సుమారు 30 మంది వలస కార్మికులను గుర్తించి వారిని చత్తీస్ఘడ్ వెళ్లేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రాష్ట్ర సరిహద్దు వరకు పంపించారు. మరోవైపు గత పదిరోజులుగా శ్రామిక రైళ్ల రాకపోకలు నిలిపివేసిన కారణంగా తమ వద్ద నమోదైన వారిని సైతం ఇప్పటికే ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు తరిలించి అక్కడ నుంచి గమ్యస్థానాలకు వెళ్లే విధంగా ఏర్పాటుచేశారు. ఎన్జీవోల చేయూత.. మహానగరంలోని ఎన్జీవోలు వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు చేయూత అందిస్తున్నారు. ఇప్పటికే క్యాంప్‌లో భోజన సదుపాయాలు కల్పించిన ఎన్జీవోలు సొంతూళ్లకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ . మరో వైపు స్వతహాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వలస కార్మికులు సైతం ఇక్కడి వచ్చేందుకు సహకరించినట్లు తెలుస్తోంది. నేపాల్ దేశానికి వెళ్లిన సుమారు 30 మంది నాగర్ కర్నూల్‌కు చెందిన వలస కార్మికులు తిరిగివచ్చే విధంగా ప్రయత్నించడంతో మేడ్చల్ క్యాంప్ నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు. -
ఒంటె పాలు@ 600
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వేళ నగరంలో ఉంటున్న వలస జీవులు సొంత ప్రాంతాలకు తరలిపోతుండగా...రాజస్థాన్‌కు చెందిన కొందరు ఒంటెల యజమానులు మాత్రం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. ఒంటె పాలు లీటర్ రూ.600కు విక్రయిస్తున్నారు. తద్వారా కొద్దిగా ఆదాయం వస్తోందని వారు పేర్కొన్నారు. శుక్రవారం కొందరు ఒంటెల్ని మలక్‌పేట వద్ద నిలిపి మేత వేసి...నీళ్లు తాపించారు. -
‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’
పట్నా: వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయని బిహార్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంజిత్ రంజన్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంజిత్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మధుబని, సుపాల్, దర్భాంగా, ముజఫర్‌పూర్, మాధేపురా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. దీని గురించి ప్రశ్నిస్తే.. 9 మంది వలస కార్మికుల మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. బిహార్‌లోని క్వారంటైన్ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సరైన వసతులు లేవని అడిగితే వారి మీద కేసు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వ చర్యలు చూస్తే.. వలస కార్మికులు ఈ దేశ పౌరులు కారు.. వారికి ఎలాంటి హక్కులు లేవన్నట్లు తోస్తుంది’ అన్నారు.(క్వారంటైన్లో 23 లక్షల మంది) -
‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’
కోల్‌కతా: కరోనా విషయంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు, లాక్డౌన్ అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదన్న అమిత్ షా విమర్శలపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లాక్డౌన్ అమలును పర్యవేక్షించేందుకు అమిత్ షా కేంద్రం బృందాలను కేవలం బెంగాల్‌కు మాత్రమే పంపించారు. సరే మంచిదే. మా ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని మీరు భావిస్తున్నారు కదా.. అలాంటపప్పుడు మీరే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు’ అని అమిత్ షాను ప్రశ్నించారు దీదీ. అంతేకాక లాక్డౌన్ సమయంలో రైళ్లు, విమనాలు తిరిగేందుకు అనుమతివ్వడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు బెంగాల్‌కు రావడం పట్ల కూడా మమత ఆందోళన వ్యక్తం చేశారు. (రైల్వేల తీరుపై దీదీ ఫైర్) రాబోయే 24 గంటల్లో, మహారాష్ట్ర మీదుగా బెంగాల్‌కు 36 శ్రామిక్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘ఇప్పటికే దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాజస్తాన్, మహారాష్ట్రాల నుంచి వలస కార్మికులు బెంగాల్ వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ కరోనా కేసులు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నేనేం చేయాలి? అందుకే ప్రధాని మోదీనే స్వయంగా ఇక్కడ పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను’ అన్నారు దీదీ. అయితే ఇంత అకస్మాత్తుగా బెంగాల్‌కు వలస కూలీల రైళ్లను పంపడం.. తనను కలవరపరిచేందుకు కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రగా ఆమె పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టెందుకే బీజేపీ ఇలా చేస్తుందని మమత ఆరోపించారు. కేంద్ర తనను ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నం వల్ల.. బెంగాల్ ప్రజలు నష్టపోతారని తెలిపారు. బీజేపీ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం గురించి కాక వలస రైళ్ల గురించి ప్రణాళికలు చేస్తే బాగుంటుందని మమత సూచించారు.(మమత సర్కారు కీలక నిర్ణయం) -
వలస కూలీల పరిస్థితిపై స్పందించిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వలస కూలీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో కూలీలను ఆదుకునేందుకు, వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏంటో తమకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. (కరోనా: రాజకీయ సంక్షోభం తప్పదా..!) ప్రస్తుతమున్న గడ్డు కాలంలో ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని పోయిన వలస కూలీలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. కూలీల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల వివరాలను తమకు సమర్పించాలని కోరుతూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. (యూఎస్ లాంటి పరిస్థితి తీసుకురావద్దు: హైకోర్టు) కాగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఉపాధి లేక తింటానికి తిండిలేక బిక్కుబిక్కుమంటూ కాలాన్నీ వెళ్లదీశారు. ఈ క్రమంలోనే చాలామంది నడుచుకుంటూ స్వస్థలాలకు బయలుదేరి.. మార్గంమధ్యంలోనే కన్నుమూశారు. దీంతో కేంద్రం స్పందించి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. అయినా కూడా చాలామంది కూలీలు ఇంకా కాలిబాటన స్వస్థలాలకు వెళ్తున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వలస కూలీల దుస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. -
రంజాన్ వేళ 600 మందికి బిర్యానీ విందు
సింగపూర్: ప్రపంచవవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు నేడు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈ ఏడాది పండగ సంబరాలు ఎక్కడా కనిపించడం లేదు. లాక్డౌన్, సామాజిక దూరం నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వారే పండగ జరుపుకుంటున్నారు. ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి పర్లేదు.. మరి క్వారంటైన్లో ఉండే వారి సంగతి ఎలా. అక్కడ వారు పెట్టింది తినాలే తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ఓ బిజినేస్ మ్యాన్ క్వారంటైన్లో ఉన్న వారికి బిర్యానీ విందు ఇచ్చి.. పండగ పూట వారికి తోడుగా నిలబడ్డాడు. దుష్యంత్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 600 మంది వలస కూలీలకు బిర్యానీతో విందు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు.(నిర్మానుష్యంగా మారిన ఈద్గాలు,మసీదులు) ఈ సందర్భంగా దుష్యంత్ మాటట్లాడడుతూ.. ‘భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. సాధారణంగా అయితే పండగ సమయానికి వారు కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్ వల్ల ఈ వలస కూలీలంతా ఇక్కడే క్వారంటైన్ కేంద్రాల్లో ఉండిపోయారు. పండగ పూట వారి ముఖంలో నవ్వు చూడాలనుకున్నాను. అందుకే నా భార్యతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ కిచెన్‌లో దాదాపు 600 మందికి సరిపోను బిర్యానీ వండించాను’ అని తెలిపాడు. ఇదే కాక లాక్డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రతిరోజు 1000 మందికి భోజనం పెడుతు మంచి మనసు చాటుకుంటున్నాడు దుష్యంత్.(గోల్డీ కల్యాణం) -
‘నీ తండ్రి ఏం ఉద్యోగం ఇచ్చాడు’
పట్నా: బిహార్ షెయిక్‌పూర్ నియోజకవర్గ జేడీయూ ఎమ్మెల్యే రంధీర్ కుమార్ సోనికి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మే 22న తీసిన ఈ వీడియోలో రంధీర్ కుమార్ షెయిక్‌పూర్‌లోని చండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులు ఉద్యోగాలు, మౌళిక వసతుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ఎందుకు వెనకబడ్డాయి అంటూ వలస కూలీలు రంధీర్ కుమార్‌ను ప్రశ్నించారు. (‘ఆ బస్సులను ఆపకండి’) దానికి సదరు ఎమ్మెల్యే ‘మీ తండ్రి నీకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా’ అంటూ వలస కూలీని ప్రశ్నించారు. దాంతో వలస కూలీలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిసస్థితి చేయి దాటడంతో రంధీర్ అక్కడి నుంచి మరో క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. అయితే రంధీర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మండిపడడ్డారు. ఎమ్మెల్యే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని..) -
గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ
-
గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా.. ఆత్మహత్యా.. ఒకవేళ హత్యకు గురైతే చంపిందెవరు.. ఆత్మహత్యకు పాల్పడితే అందుకు కారణమేమిటి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఇద్దరు బీహార్ కార్మికులు, ఓ డ్రైవర్ సహా మొత్తం తొమ్మిది మంది మృతి వెనుక అసలు విషయమేమిటి... ఇలా అనేక సందేహాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. అయితే బావిలో నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్లే వీరంతా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. ఏడు మృతదేహాల్లో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ పాడుపడిన బావిలో తొమ్మిది మంది మృతి చెందిన దుర్ఘటనపై విచారణ ఇంకా కొలిక్కి రాని విషయం తెలిసిందే. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన విధంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాల(సిట్) పరిశోధన ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ ఘటన వరంగల్ పోలీసులకు సవాల్‌గా మారగా, త్వరలోనే ఆ తొమ్మిది మంది కార్మికుల మృతిపై మిస్టరీ వీడనుందని అంటున్నారు. పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిపాటి పురోగతి సాధించారు. ఇప్పటికే మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాటూన్ ప్రియుడు యాకూబ్‌తో పాటు బీహార్‌కు చెందిన కార్మికులు సంజయ్ కుమార్ యాదవ్, మంకుషా లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వరంగల్‌కు చెందిన మరో ఇద్దరిని శనివారం పట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్‌కు చెందిన ఆ ఇద్దరి వద్ద నుంచే మృతులలో ఇద్దరికి చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు సెల్ఫోన్లు తొమ్మది మంది మృతి చెందిన బావి సమీపంలో దొరికినట్లు ఆ ఇద్దరు వెల్లడించినట్లు తెలిసింది. సెల్ఫోన్లు చేజిక్కించుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. (చనిపోయారా.. చంపేశారా?) కాగా ఆ రెండు సెల్ఫోన్లలో ఒకటి మక్సూద్ ఆలంకు చెందినది కాగా, మరోటి ఆయన కూతురు బుష్రా ఖాతూన్‌గా ప్రచారం ఉంది. ఆ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న ‘సిట్’, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఫోన్‌కాల్స్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 6 గంటల తరువాత మక్సూద్ వీరితో ఫోన్లో మాట్లాడాడు. పోలీసులు బీహారీ యువకులను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మరోసారి విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో మంకుషా వాంగ్మూలం కీలకంగా మారింది. ఫోరెన్సిక్, నిఘావర్గాల ఆరా... గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై ఫోరెన్సిక్, కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీశారు. తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రజామాలిక్ బృందం, వారి మృతికి కారణమైన బావిని పరిశీలించింది. బార్దాన్ సంచుల గోదాము, ఆ గోదాం ఆవరణలో వారు నివాసం ఉండే క్వార్టర్లను కూడా వారు పరిశీలించారు. పాడు పడిన వ్యవసాయ బావిలో తొమ్మిది మంది మృతదేహాలు తేలిన ఘటనపై నివేదిక పంపేందుకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాల అధికారులు సైతం సందర్శించారు. (గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...) సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ రీజనల్ ఇంటలిజెన్స్ అధికారులు వేర్వేరుగా పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ‘సిట్’ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అందులో ఇద్దరినీ శనివారం ఉదయం గొర్రెకుంటలోని 9 మంది మృతి చెందిన బావి వద్దకు తీసుకు వచ్చి పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్ యాదవ్, మంకుషాలను సంఘటన వద్దకు తీసుకు వచ్చిన పోలీసులు ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ తరహాలో ఆరా తీశారు. కాగా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు సెల్‌ఫోన్ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. ఫోన్ కాల్స్ వివరాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ మక్సూద్ తనయ బుష్రా ఖాతూన్, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. -
‘ఆ బస్సులను ఆపకండి’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను సొంత ఊళ్లకు చేర్చేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాల్సిందిగా కోరాడు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళల విషయంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు.ఫలితంగా వలస కూలీలు ఉపాధి కోల్పోతామనే భయంతో సొంత ఊళ్లకు బయలుదేరారని తెలిపారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాఫ్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. (వలస కూలీల కోసం 1000 బస్సులు) వలస కూలీల కోసం ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపడం, విశ్రాంతి నిలయాలను ఏర్పాటు చేయాలన్నారు అజయ్ భల్లా. ఆహారంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉందని స్పష్టం చేశారు. వలస కూలీలకు బస్సులు, రైళ్ల ఏర్పాటు గురించి సరైన సమాచారం అందించాలని.. పుకార్లకు తావివ్వకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో స్పష్టత లేకపోతే.. వలస కూలీల్లో అశాంతి ఏర్పడుతుందన్నారు. కాలినడకన బయలుదేరిన వలస కూలీలను విశ్రాంతి సముదాయాలకు తరలించడమే కాక.. వారి చిరునామ, ఫోన్ నంబర్లు సేకరించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే అని పేర్కొన్నారు. వలస కూలీల బస్సులను రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపవద్దని కోరారు.(కరోనా ఎఫెక్ట్: డ్రైవరన్నా.. నీకు సలామ్) Home Secy Ajay Bhalla writes to Chief Secretaries of all states to take steps to "mitigate the distress of migrant workers", suggests a number of measures to be implemented incl. operation of more special trains by proactive coordination between states and Railways ministry: MHA pic.twitter.com/iQEkXhlPYQ — ANI (@ANI) May 19, 2020 -
వలస కూలీల కోసం 1000 బస్సులు
లక్నో: ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ అభ్యర్థన మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బస్సు నంబర్లతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వివరాలను ప్రియాంక గాంధీ కార్యాలయానికి పంపించారు. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది వలస కూలీలు మరణించగా.. 36మంది గాయపడ్డారు.(బారికేడ్లను బద్దలు కొడుతూ..) ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వలస కూలీల కోసం బస్సులను ఏర్పాటు చేయాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రియాంక అభ్యర్థనపై స్పందించిన యోగి ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులను ఏర్పాటు చేసింది.(చితికిన బతుకులు) -
కరోనా ఎఫెక్ట్: డ్రైవరన్నా.. నీకు సలామ్
ముంబై: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దాంతో పెళ్లిల్లు, ఇతర ప్రైవేట్ ఫంక్షన్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో పెళ్లి కోసం దాచిన డబ్బును పేదలకు వినియోగిస్తూ.. తన గొప్ప మనసు చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఆ వివరాలు.. పుణెకు చెందిన అక్షయ్ కొథవాలె అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల కింద అక్షయ్‌కు వివాహం నిశ్చయమయ్యింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ నెల 25న అక్షయ్ వివాహం జరిగేది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వారి వివాహం వాయిదా పడింది.(లాక్డౌన్: అయ్యో పాపం..) ఈ నేపథ్యంలో పెళ్లి కోసం దాచిన 2 లక్షల రూపాయలను ఆకలితో ఉన్న పేదల కోసం వినియోగించాలనుకున్నాడు అక్షయ్. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి ప్రతి రోజు 400 మంది పేదలు, వలస కూలీలకు ఓ పూట ఆహారం అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు అక్షయ్. ధనవంతుల సంగతి పక్కకు పెడితే.. ఓ ఆటో డ్రైవర్‌కు 2 లక్షల రూపాయలు అంటే భారీ మొత్తమే. అంత సొమ్మును పేదలు కోసం వినియోగిస్తున్న అక్షయ్ రియల్ హీరో అని చెప్పవచ్చు. అయితే ఇలా సాయం చేయడం అక్షయ్‌కు కొత్త కాదు. గతంలో ముసలి వారిని, గర్భిణిలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళ్లేవారు అక్షయ్. -
పేదల బాధలు తెలిసిన సీఎం ఆయన
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదల బాధలు తెలుసుకాబట్టే తమకు అండగా ఉన్నారని ఒడిస్సా వలస కూలీలు అన్నారు. ప్రత్యేకంగా ఒడిస్సా రాష్ట్రానికి బస్సులు వేసి తమను పంపిస్తున్న సీఎం వైస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పునరావాస కేంద్రం నుంచి 9 బస్సుల్లో 283 ఒడిస్సా వలస కూలీలను సొంత రాష్ట్రానికి పంపించారు అధికారులు. ఈ సందర్భంగా ఒడిస్సా వలస కూలీలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇంటికి వెళ్లాలన్న ఆత్రుతతో మా రాష్ట్రానికి నడుచుకుంటూ బయల్దేరాం. దారిలో తాగడానికి నీళ్లు తినటానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడ్డాం. ( వలస కూలీలపై కరోనా పంజా ) ఒక చేత్తో బిడ్డలను మరొక చేత్తో లగేజీని మోసుకుంటూ నడక మొదలుపెట్టాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. పునరావాస కేంద్రాల్లో మాకు అద్భుతమైన భోజనాలు పెట్టార’’ని తెలిపారు. -
త్వరగా సొంతూళ్లకు చేర్చండి
సాక్షి, హైదరాబాద్ : ‘మండు వేసవిలో పిల్లలు, కుటుంబాలతో లక్షల మంది వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తుండటం అత్యంత బాధాకరం. వీలైనంత త్వరగా వారిని సొంతూళ్లకు పంపించాలి. అప్పటిదాకా ఆహార, వసతి, వైద్య సదుపాయాలను కల్పిస్తామన్న హామీ ఇవ్వాలి. వారి హక్కులను, గౌరవాన్ని నిలబెట్టాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వంద మందికిపైగా పౌర సంఘాల ప్రతినిధులు, ప్రముఖ యాక్టివిస్టులతో కూడిన కోవిడ్–19 అడ్వొకసీ లాక్డౌన్ కలెక్టివ్ విజ్ఞప్తి చేసింది. క్షేత్రస్థాయిలో వలస కార్మికుల ఆకలిదప్పికలను తీర్చుతూ వారికి చేదోడువాదోడుగా ఉంటున్న ఈ సంస్థ గత వారం రోజులుగా తమ దృష్టికి వచ్చిన అంశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ నుంచి ఇప్పటివరకు 45 రైళ్ల ద్వారా 50,822 మంది వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపించారని వార్తలొచ్చాయి. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న కార్మికుల సంఖ్యతో పోలిస్తే వారిని తరలించేందుకు ఏర్పాటుచేస్తున్న శ్రామిక్ రైళ్ల సంఖ్య చాలా తక్కువ. అది కూడా రాత్రిపూట, ఊరి అవతల స్టేషన్ల నుంచి రైళ్లను నడుపుతుండటంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసు స్టేషన్లలో వలస కార్మికుల నమోదు నెమ్మదిగా జరుగుతోంది. ఒక్కో స్టేషన్లో రోజుకు 200 మందికి మించి నమోదు చేసుకోవడం లేదు. ఠాణాల ముందు రోజుల తరబడి బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. కార్మికుల నివాస ప్రాంతాలకు వెళ్లి మూకుమ్మడి నమోదు కార్యక్రమం చేపడితే ఉపయోగంగా ఉంటుంది. మూవ్మెంట్ పాస్ ఫర్ రైల్వే స్టేషన్ పాసుల్లో కార్మికుల వివరాలతోపాటు సంతకం చేసే అధికారి పేరు కూడా ఉండాలి. చాలా పాసుల్లో అధికారి సంతకం, తేదీ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులను ఆర్టీసీ బస్సుల ద్వారా స్వరాష్ట్రాలకు పంపడానికి ఆయా ప్రభుత్వాలతో చర్చించి చర్యలు చేపట్టాలి. వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరే దాకా ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలి. ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రోజుకు రెండుసార్లు ఆహారం అందజేసే ఏర్పాట్లు చేయాలి. స్వరాష్ట్రాలకు వెళ్లే అవకాశం లేక రాష్ట్రంలో చిక్కుకుపోయిన ప్రతి వలస కార్మిక కుటుంబానికీ 12 కేజీల బియ్యం, రూ.1,500 నగదు ఇచ్చే జీవోను మరో మూడు నెలలు అమలు చేయాలి. కార్మికులను కొట్టడం, వేధించడం, తరిమేయడం చేయవద్దని రైల్వే స్టేషన్లు, ఇతర చోట్లలో పని చేస్తున్న పోలీసులకు ఆదేశాలివ్వాలి. వలస కార్మికులకు సమాచారంతోపాటు సహాయం అందించడానికి ప్రతి రైల్వేస్టేషన్, ప్రతి పోలీసు స్టేషన్, తాలూకా ఆఫీసులు, కీలక రహదారుల కూడళ్ల వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలి. ప్రయాణ, వైద్య అనుమతి పత్రాల పేరుతో వలస కార్మికుల నుంచి డబ్బు గుంజుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ–పాసులు, ఎస్ఎంఎస్–1, ఎస్ఎంఎస్–2లలో విషయమంతా ఆంగ్లంలో ఉండటంతో కార్మికులకు అర్థం కావట్లేదు. పాసు ఇవ్వడానికీ, ఎస్సెమ్మెస్–2 (అదే అసలు అనుమతి పత్రం) రావడానికీ మధ్య చాలా వ్యవధి ఉండడం కూడా పెద్ద సమస్యే అవుతోంది. దుండిగల్, మాదాపూర్, ముషీరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు లింగంపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, మేడ్చల్, సికింద్రాబాద్ స్టేషన్ల వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. పోలీసులు తరిమేస్తుంటే నిరాశతో వెనుదిరుగుతున్నారు. చాలా చోట్ల రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు కార్మికులకు వాహన వసతి కల్పించట్లేదు. కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ బాలుడు కర్ణాటక నుంచి కుటుంబంతో కలసి ఉత్తరప్రదేశ్ వెళ్తూ హైదరాబాద్ శివార్లలో శనివారం ఇలా సేదతీరుతూ కనిపించాడు. ఎర్రటి ఎండలో నడిచి నడిచి కాళ్లకు పుండ్లు పడటంతో అతని తల్లిదండ్రులు కేవలం ఓ బట్టను ఇలా కాలికి చుట్టారు. వలస కార్మికుల కోసం మేడ్చల్ హైవేపై స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సహాయ శిబిరం దగ్గర్లో ఓ తల్లి వారం రోజుల పసిగుడ్డుతో దుమ్ములో నిస్సహాయంగా కూర్చొని ఉండగా అక్కడి వారు గమనించారు. బిడ్డ ఒంటిపై బట్టలు కూడా లేవు. భూమిక వుమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి తన కారులో ఉన్న టవల్‌ను ఆ శిశువుపై కప్పేందుకు ఇవ్వడంతోపాటు 700 కి.మీ. దూరంలో ఉన్న గడ్చిరోలి జిల్లాలోని ఆమె సొంతూరుకు వెళ్లేందుకు రూ. 20 వేలతో కారును ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు పోలీసుల నుంచి అనుమతి ఇప్పించారు. శనివారం ఈ మహిళ తన పాపతో ఇంటికి క్షేమంగా చేరుకుంది. వారం రోజుల పసిపాపతో ఉన్న ఈమె పేరు చమేలీ. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో భర్త, పసిపాపతో కలసి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన పయనమైంది. వారి కష్టాన్ని చూసి చలించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సొంతూరుకు పంపేందుకు వీలుగా నగర శివార్ల వరకు తన వాహనంలో దింపారు. అక్కడి నుంచి ఓ ట్రక్కులో ఆ కుటుంబం శనివారం రాత్రి స్వరాష్ట్రం బయలుదేరింది. -
ఏపీ సర్కార్ గొప్ప మానవతా దృక్పధాన్ని చాటుతోంది
సాక్షి, అమరావతి : వలస బాధితుల తరలింపు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. వలస కూలీలను ఆదుకోవడంతో సీఎం జగన్ ప్రభుత్వం గొప్ప మానవతా దృక్పధాన్ని చాటుతోందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. (చదవండి : ఆయన ఎప్పటికీ మారరు : సజ్జల) ‘రాష్ట్రాలను దాటుకుంటూ సుదీర్ఘ దూరం వెళ్తున్న వలస కూలీలను ఆదుకోవడంలో సీఎం జగన్ ప్రభుత్వం గొప్ప మానవతా దృక్పధాన్ని చాటుతోంది. రాష్ట్రంలో ఉన్న వలసకూలీలను శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో పంపిస్తోంది. అంతే కాకుండా ఒక్కొక్కరి చేతిలో రూ.500 పెట్టాలని నిర్ణయించింది’ అని సజ్జల ట్వీట్ చేశారు. ‘వలస కూలీలెవరూ ఆకలి బాధకు గురికాకుండా వారికోసం రహదారుల వెంబడి భోజనం, తాగునీరు ఏర్పాటు చేసింది. ఇలా రోడ్డు వెంబడి నడుస్తూ కనిపించే వారిని సురక్షితంగా చేర్చడానికి వచ్చే 15 రోజులు ఉచితంగా బస్సులు కూడా నడపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు’ అని సజ్జల పేర్కొన్నారు. -
‘ఆర్థిక ప్యాకేజీని పునఃపరిశీలించండి’
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఈ ప్యాకేజీపై స్పందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. దేశం తరఫున మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించి చాలా మంచి పని చేసింది. అయితే ఈ ప్యాకేజీ స్వభావం గురించి నాకు తీవ్రమైన ఆక్షేపన ఉంది. ప్రభుత్వం ప్యాకేజీని పునఃపరిశీలించాలి. దీనిలో కేటాయించిన డబ్బును ఎక్కువ శాతం అవసరమున్నవారికి, వలస కూలీలకు, రైతులకు అందేలా చూడాలి. డబ్బును నేరుగా ప్రజల చేతిలో పెట్టడం ముఖ్యం. అప్పుడే ఈ ప్యాకేజీకి సార్థకత’ అన్నారు రాహుల్.(రైతులకు 2 లక్షల కోట్లు) -
మమ్మల్ని పట్టించుకోవడం లేదు..
ముంబై: కరోనా వలస కార్మికులను ఆగం చేసింది. ఉన్న చోట తిండి లేక.. సొంత ఊరుకు వెళ్లేందుకు వీలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మీకుల కోసం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాంతో వేలాది మంది వలస కార్మీకులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వీరంతా కరోనా విజృంభిస్తోన్న ధారవి, కుర్లా ప్రాంతంలో నివసిస్తున్నారు. మహారాష్ట్రలో దాదాపు 5లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా నిర్మాణ రంగం, ఇటుకల తయారీ వంటి పరిశ్రమల్లో పనుల చేయడం కోసం వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంతో ప్రస్తుతం వీరు సొంత ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు వలస కూలీలు మాట్లడుతూ.. ‘ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బస్సులు ఏర్పాటు చేయలేదు. శ్రామిక్ రైళ్ల కోసం ఈ నెల 5న రిజిష్టర్ చేసుకుంటే.. ఈ రోజు ప్రయాణానికి కుదిరింది. క్షేమంగా ఇంటికి చేరితే చాలు.. ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం.. మళ్లీ ముంబై రాం’ అన్నారు.(లాక్డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు) మరి కొందరు మాత్రం ‘ముంబై నగరం మాకు ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి కల్పించింది. పరిస్థితులు బాగాలేక ఇప్పుడు వెళ్లి పోతున్నాం. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అప్పుడు తిరిగి వస్తా’మన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. (కరోనా వైరస్: సేఫ్ జోన్లో గిరిజనం) -
లాక్డౌన్: ముంబై నుంచి బిహార్‌కు ఆటోలో
పట్నా: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. కానీ రవాణా వ్యవస్థ స్తంభించటంతో కాలి నడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. అవకాశం ఉన్న చోట ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముంబైకి 621 కిలోమీటర్ల దూరాన మధుబనిలో ఉన్న తమ గ్రామానికి ఆటోలో పయనమయ్యారు. దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసిన వారు చివరకు.. ఓ ఆటో మాట్లాడుకుని ఊరికి ప్రయాణం అయ్యారు.(లాక్డౌన్: ‘అది ఫేక్‌న్యూస్’) దీనిపై సదరు యువుకులు మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని భావించాం. రెండు నెలల నుంచి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూశాం. కానీ మా బాధను ఎవరు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో ఓ ఆటో మాట్లాడుకుని బయలుదేరాం’ అన్నారు. అయితే ప్రతి పక్షాలు ఈ విషయంలో నితీష్ ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నారు. తక్షణమే వలస కార్మీకులను ఆదుకోవాలని.. లేదంటే వారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.(ఇంటి ముంగిటే వైద్యం) నిన్న, మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్, బిహార్ వైపు వెళ్తున్న వేలాది మంది వలస కారర్మికులు జాతీయ రహదారి 3లో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రవాణా సదుపాయాలు కల్పించకపోవడమే కాక కనీసం ఆహారం కూడా అందజేయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వలస కార్మీకులు ఆందోళన చేశారు. అధికారుల మీద రాళ్లు రువ్వారు. -
సొంత గూటికి చేరేలోపే...
లక్నో: లాక్డౌన్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలను మృత్యువు పలకరించింది. అయిన వారిని చూడకుండానే అనంతలోకాలకు చేర్చింది. ఈ విషాదకర సంఘటన కాన్పూర్ - ఝాన్సీ హైవేపై చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు వలస కూలీలు ఉపాధి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు దొరకకపోవడంతో సొంత ఊరికి ప్రయాణమయ్యారు. దాదాపు 54 మంది ఓ ట్రక్కులో బయలు దేరారు. వలస కూలీల ట్రక్కు కాన్పూర్ - ఝాన్సీ హైవే మీద ఉండగా మరో ట్రక్కు వచ్చి దీన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పెద్దలతో పాటు ఓ చిన్నారి మరణించగా.. 43 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిని కాన్పూర్‌లోని లాలా లజపతి రాయ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. -
‘ప్యాకేజీ కాదు.. బస్సులు ఏర్పాటు చేయండి’
లక్నో: కరోనా వల్ల పట్టాలు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్యాకేజీ పట్ల పేదలు ముఖ్యంగా వలస కార్మికులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు కొందరు రిపోర్టర్లు ప్రయత్నించారు. మరి వారి స్పందన ఏంటో చూడండి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మీ సాహు అనే మహిళ ఉపాధి కోసం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో వెళ్లారు. లాక్డౌన్ ప్రకటించడంతో సైకిల్‌పై 500కిలోమీటర్ల దూరాన ఉన్న సొంత ఊరికి ప్రయాణమయ్యారు. రిపోర్టర్లు లక్ష్మీని కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ గురించి ప్రశ్నించగా.. ‘ఈ వార్త గురించి విన్నప్పుడు కాస్త సంతోషమేసింది. కానీ ఈ ప్యాకేజీ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. గతంలో కూడా ఓ ప్యాకేజీ ప్రకటించారు. డబ్బులు ఇస్తారు, రేషన్ ఇస్తారు అన్నారు. మూడు రేషన్ దుకాణాల్లో ఆధార్ కార్డు ఇచ్చాను.. కానీ మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ప్యాకేజీ సంగతి దేవుడెరుగు.. కనీసం మాకోసం బస్సులను అయినా ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం మమ్మల్ని కూడా పట్టించుకుంటుంది అని భావించే వాళ్లం. ప్రభుత్వ పథకాలు మాలాంటి వలస కూలీలకు అందడం లేదు. అందుకే సొంత ఊరికి వెళ్తున్నాం. కనీసం అక్కడ పొలం పనులయినా దొరుకుతాయి’ అని లక్ష్మీ సాహు ఆవేదన వ్యక్తం చేశారు. -
కరోనా పాడుగాను.. ఎంత కష్టమొచ్చే
భోపాల్ : కరోనా పాడుగాను.. వలస జీవుల బతుకులను ఎంత ఇరకాటంలోకి నెట్టిందో. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలను రోడ్డు పాలు చేసింది. ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే రాష్ర్టాలకు వెళ్లిన కార్మికులు ఈ లాక్డౌన్ సమయంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మరీ ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయసు పైబడిన వారి కష్టాలు వర్ణణాతీతం. ఈ పయనంలో నెలలు నిండిన గర్భిణీలు రోడ్డు పక్కనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. అలాంటి ఓ విషాదకర సంఘటన వివరాలు.. మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాకేశ్ కౌల్, శకుంతల దంపతులు.. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌కు ఉపాధి కోసం వలస వెళ్లారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వారికి ఉపాధి కరువైంది. దాంతో ఇక్కడే ఉండి ఆకలితో అలమటించే కన్నా సొంతూరు వెళ్లి అయిన వారితో కలిసి ఉందామనుకున్నారు. అయితే శకుంతల నిండు గర్భిణీ. అయినప్పటికీ వారు సొంత ఊరు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. దాంతో ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర నాసిక్ నుంచి మధ్యప్రదేశ్ సాత్నాకు నడక ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం శకుంతలకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దాంతో ఆమె రోడ్డు మీదనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ నడక ప్రారంభించింది. తన పసిబిడ్డను ఎత్తుకుని.. ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లకు పైగా నడిచింది ఆ బాలింత. ఈ విషయం గురించి సాత్న వైద్య అధికారి ఏకే రాయ్ మాట్లాడుతూ.. ‘శకుంతల దంపతుల గురించి మాకు తెలిసిన వెంటనే సరిహద్దు వద్ద వారి కోసం బస్సు ఏర్పాటు చేశాం. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాం. ఇద్దరు క్షేమంగా ఉన్నారు’ అని తెలిపారు. చదవండి: కరోనా వదలదు.. ప్రభుత్వాలకు పట్టదు -
‘ఎవరికి ఏం దక్కుతుందో చూడాలి’
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం దీనిపై బుధవారం స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కేవలం హెడ్లైన్ చెప్పి ఖాళీ పేపర్‌ను వదిలేశారు. అందుకే నిన్న నా స్పందన కూడా బ్లాంక్‌గానే ఉంది. నేడు ఆర్థిక మంత్రి ఆ కాగితాన్ని పూరిస్తారు. కేంద్రం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టే ప్రతి ఒక్క రూపాయిని మేం చాలా జాగ్రత్తగా లెక్కిస్తాం. ఎవరికి ఏం దక్కబోతుందో నేడు తెలుస్తుంది. పేదలు, మరి ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సొంత ఊళ్లకు చేరుకున్న వలస కార్మికులకు మోదీ ప్రభుత్వం ఏం ఇవ్వబోతుందో తెలుసుకునేందుకు మేం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు. Yesterday, PM gave us a headline and a blank page. Naturally, my reaction was a blank! Today, we look forward to the FM filling the blank page. We will carefully count every ADDITIONAL rupee that the government will actually infuse into the economy. — P. Chidambaram (@PChidambaram_IN) May 13, 2020 కరోనాతో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుతం ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% అని ప్రధాని వెల్లడించారు. (చదవండి: నిందలు సరే నిర్ధారణ ఎలా) -
కరోనా వదలదు.. ప్రభుత్వాలకు పట్టదు
రాయ్‌పూర్: బీద, ధనిక తేడా లేకుండా కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. లాక్‌డౌన్‌ను ఆయుధంగా చేసుకుని దేశాలన్ని కరోనాతో పోరాడుతున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పని లేక.. చేతిలో చిల్లి గవ్వ లేక వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చోట బతికే పరిస్థితి లేక.. సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ సరైన రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వలస కూలీల ఇక్కట్లకు అద్దం పట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఓ వ్యక్తి ఒక చేత్తో పిల్లాడిని.. మరో చేత్తో తాడు పట్టుకుని ట్రక్కు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో ఏ మాత్రం పట్టు తప్పినా.. సదరు వ్యక్తితో పాటు అతని చేతిలోని పిల్లాడికి ఎంత ప్రమాదమో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మహిళలు చీరలతో టక్కు ఎక్కేందుకు పడే తిప్పలు చూస్తే కరోనా ఎంతటి కష్టాన్ని మిగిల్చిందో అర్ధమవుతుంది. అయితే కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల కోసం బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి సదరు వలస కూలీలను ప్రశ్నించగా.. ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించిన విషయం తమకు తెలియదన్నారు. నెల రోజులుగా పని లేక, తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అందుకే ప్రమాదం అని తెలిసి కూడా ఇలా వెళ్లక తప్పడం లేదని వాపోయారు. heart-breaking picture showing a man holding an infant in one hand as he clings on to a rope hanging on the vehicle with another in raipur @ndtvindia @ndtv #NursesDay #LockdownEnd #COVID19 pic.twitter.com/F4YhUWLyA0 — Anurag Dwary (@Anurag_Dwary) May 12, 2020 -
‘వారి విషయంలో యూపీని అనుసరించండి’
పట్నా: వలస కార్మికుల సమస్యపై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు సరిగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలు సరిగా పని చేస్తేనే.. కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోగలరని తెలిపారు. ఈ వివరాలను కేంద్రానికి అందజేయడం ద్వారా వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందన్నారు. బిహార్ వెలుపల ఉన్న వలస కార్మికులను రాష్ట్రానికి రప్పించే అంశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చిరాగ్ పాశ్వాన్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు తమ పార్టీ కార్యకర్తలు రేషన్‌ను అందజేశారని పాశ్వాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. రాష్ట్రానికి చెందిన కార్మికులకు తగిన సాయం అందేలా చూడాలని కోరారు. అంతేకాక వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని పాశ్వాన్ ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్లలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు నితీష్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని పాశ్వాన్ డిమాండ్ చేశారు. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) -
వలస కార్మికుడిపై బీజేపీ నేత దాడి!
సూరత్ : వలస కార్మికుల నుంచి అన్యాయంగా డబ్బులు దండుకోవటమే కాకుండా.. ఇదేంటని అడిగిన ఓ వలస కార్మికున్ని విచక్షణా రహితంగా చితకబాదాడో బీజేపీ నేత. ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌కు చెందిన వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వీరిని సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. రైలు టిక్కెట్ తీసుకునే అవకాశం లేకుండా ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. కానీ, సూరత్‌కు చెందిన రాజేష్ వర్మ అనే బీజేపీ నేత వలస కార్మికుల నుంచి టిక్కెట్ల ధరల రూపంలో దాదాపు రూ.లక్ష వసూలు చేశాడు. ఒక్కోటిక్కెట్ ధరకు మూడురెట్లు అధికంగా డబ్బులు వసూలు చేశాడు. ( భారత్ ప్రతీకార దాడి: పాక్ సైనికులు హతం ) వాసుదేవ వర్మ అనే వలస కూలీ టిక్కెట్ల ధరల విషయమై అతడ్ని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్, అతడి అనుచరులు వాసుదేవను చెక్క దబ్బలతో, రాళ్లతో చావగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరల్ పాటెల్ అనే కాంగ్రెస్ నాయకుడు దీన్ని తన ట్విటర్ ఖాతో పోస్ట్ చేశాడు. కాగా, దాడికి పాల్పడ్డ రాజేష్ వర్మకి బీజేపీతో అసలు సంబంధమే లేదని అధికార బీజేపీ పార్టీ చెబుతుండటం గమనార్హం. ( లాక్డౌన్ :ప్రియుడిని కలవటం కుదరక భర్తను.. ) -
వలస కార్మికులపై చార్జీల భారమా!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మొదటి విడత లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో వలస కార్మికుల కష్టాలు మొదలై రెండవ విడత లాక్‌డౌన్‌తో మరింత తీవ్రమయ్యాయి. పలుచోట్ల వలస కార్మికులు ఆందోళన చేయడంతో వారిని ఇళ్లకు పంపించేందుకు కేంద్రం అనుమతించింది. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్రాల మధ్య ప్రత్యేకంగా బస్సులు నడపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్రం, ప్రత్యేక రైళ్లను నడపాల్సిందిగా రైల్వే శాఖను కోరింది. (వలస కార్మికులు: సోనియా కీలక నిర్ణయం) అయితే వలస కార్మికుల కోసం భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కార్మికుల నుంచి వారి గమ్యస్థానాలకు పూర్తి చార్జీలను డిమాండ్ చేయడంతోపాటు అదనంగా 50 రూపాయలను సర్‌చార్జీగా వసూలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఛార్జీల డబ్బులు కూడా లేని కారణంగా చాలా రాష్ట్రాల్లో వలస కార్మికులు రైళ్లు ఎక్కలేక రైల్వే స్టేషన్లలోనే చిక్కుకు పోయారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే వలస కార్మికుల కోసం ఎయిర్ కండీషన్డ్ టాక్సీలను ఏర్పాటు చేసింది. అయితే బస్సు చార్జీలకన్నా నాలుగు రెట్లు చార్జీలను వసూలు చేస్తోంది. దీంతో డబ్బులున్న కొంతమంది కార్మికులు మాత్రమే తమ గమ్య స్థానాలకు చేరుకోగలిగారు. మిగతా వారంతా ఎక్కడి వారక్కడ చిక్కుకు పోయారు. (ఉండలేక.. ఊరెళ్లలేక..) సరిగ్గా ఈ దశలోని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ స్పందించి వలస కార్మికుల చార్జీలను తమ పార్టీ భరిస్తుందంటూ ముందుకు వచ్చారు. అన్ని రాష్ట్రాల పీసీసీలు తమ తమ ప్రాంతాలకు వచ్చే వలస కార్మికుల చార్జీలకు బాధ్యత వహించాలంటూ ఆమె పిలుపునిచ్చారు. నెలన్నర రోజులుగా ఉపాధిలేని వలస కార్మికులు చార్జీలు ఎలా చెల్లిస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయో అర్థంకాని విషయం. వలస కార్మికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడం కోసం అంతర్రాష్ట బస్సు సర్వీసులను నడపాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడమే కాకుండా ఆ బాధ్యతను వాటిమీదకే నెట్టింది. (లాక్డౌన్: టోలీచౌకీలో కార్మికుల ఆందోళన!) నిజానికి అంతర్రాష్ట్ర కార్మికుల అంశం భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాబితాలోనిది. ఆ విషయాన్ని పక్కన పెడితే చైనా, జపాన్, ఇటలీ, ఇరాన్ దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను ఎలాంటి చార్జీలను వసూలు చేయకుండా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, పేదవారైనా వలస కార్మికుల విషయంలో అదే విధానం పాటించక పోవడం ఆశ్చర్యమే! దేశంలో వైద్య సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ దేశంలోని పలు ఆస్పత్రులపై గులాబీ రెక్కలను సాయుధ దళాల హెలికాప్టర్లతోని చల్లడం, వైద్య సిబ్బందికి అభినందనల సూచకంగా భారత వైమానిక దళం జెట్ విమానాలతో విన్యాసాలు చేయడానికి ‘కోవిడ్ నిధి’ని అనవసరంగా ఖర్చు పెట్టే బదులు పేదలకు ఖర్చు పెట్టవచ్చుగదా! అన్నది మరో ప్రశ్న. పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ‘కోవిడ్ నిధి’కి భారతీయ రైల్వే కూడా 151 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. విరాళాలు ఇచ్చిందీ సర్‌చార్జీ కింద వసూలు చేయడానికా! అన్నది ఇక్కడ అనుమానం. (వలస కూలీల్లో కరోనా కలకలం) కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేయడంతోపాటు కరోనా నిర్ధారణ కిట్ల కొనుగోలు నుంచి కరోనా బాధితుల చికిత్స వరకు అన్ని ఖర్చులను భరిస్తున్నాయి. ఈ దశలో వలస కార్మికుల ప్రయాణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై వేసే బదులు కేంద్రమే భరించి ఉంటే నేడు వలస కార్మికులకు తిప్పలు తప్పేవని ‘స్ట్రాండెడ్ ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ నెట్వర్క్’ వ్యాఖ్యానించింది. -
వలస కూలీల నుంచి వసూళ్లా..?
లక్నో : వలస కూలీలను ప్రత్యేక రైళ్లలో స్వస్ధలాలకు తరలించేందుకు వారి వద్ద నుంచి చార్జీలు వసూలు చేయడంపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. పేదలను వారి స్వస్థలాలకు తరలించేందుకు చార్జీలను వసూలు చేయడాన్ని బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు ఆలోచించాలని, పీఎం కేర్స్ ఫండ్‌కు వచ్చిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు ఆరోగ్య సేతు యాప్ కోసం రూ వంద వసూలు చేస్తున్నారని ప్రచారం సాగుతోందని అఖిలేష్ ట్వీట్ చేశారు. ఇక కోవిడ్-19 ఆస్పత్రులపై పూలు చల్లడాన్ని ప్రస్తావిస్తూ పలు క్వారంటైన్ సెంటర్లలో అసమర్ధ నిర్వహణపై వార్తలు వస్తున్న క్రమంలో ఈ హడావిడి ఎందుకని మరో ట్వీట్లో ఆయన ప్రశ్నించారు. చదవండి : ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్ వీరంగం -
వలస కూలీల్లో కరోనా కలకలం
లక్నో : దేశ వ్యాప్తంగా వివిధ రాష్టాల్లో ఉంటున్న వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మహారాష్ట్ర కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అయితే వారిని రైల్వే స్టేషన్‌కు పంపే ముందు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహారాష్ట్ర వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలడం తీవ్ర కలకలం రేపింది. దీంతో వారందరినీ అక్కడే క్వారెంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీలు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లకు తరలివస్తున్నారు. (17దాకా లాక్డౌన్.. సడలింపులివే..!) ఇక ముంబై నుంచి ఇటీవల చత్తీస్‌గడ్‌కు చేరుకున్న ఓ వలస కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్ రైళ్ల ప్రయాణం మేడే రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైలులోనూ భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్ చేస్తారు. (లాక్డౌన్ ఎత్తివేతపై హెచ్చరికలు) -
రెడ్ జోన్లో కఠిన చర్యలు : కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వారందరితో ఏకాభిప్రాయాంకు వచ్చిన తర్వాతే లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించామన్నారు. రెడ్జోన్ల ప్రాంతాల్లో ఇకపై లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కొత్తగా పాజిటివ్ కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. లాక్డౌన్లో ప్రజలకు ఇబ్బందులు పడకుండా కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. (లాక్డౌన్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ) కేసుల తీవ్రతను బట్టి ప్రాంతాలను మూడు జోన్లుగా వర్గీకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక ఆధారంగా జోన్లను గుర్తించామని కిషన్‌రెడ్డి తెలిపారు. రెడ్‌జోన్‌లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆయా జోన్లలో ప్రజలకు ప్రభుత్వాలకు, స్థానిక అధికారులకు సహకరించాలని కోరారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు అందించామని వెల్లడించారు. కూలీల తరలింపు కోసం 300 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2 కోట్ల 22 లక్షల పీపీఈ కిట్లు తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. (17దాకా లాక్డౌన్.. సడలింపులివే..!) -
చిక్కుకుపోయిన 9,435 మంది కూలీలు
సాక్షి,విశాఖపట్నం: హఠాత్తుగా వచ్చిన లాక్డౌన్.. వలస కూలీల బతుకులపై పిడుగు పడేలా చేసింది. పొట్ట చేత పట్టుకొని ఊరుగాని ఊరు వచ్చిన వలస జీవుల్ని.. కంటికి కనిపించని కరోనా మహమ్మారి రోడ్డున పడేసింది. పనితోనే జీవితాలు ముడిపడి ఉండే వారంతా.. ఉన్న ఊరిలో ఉండలేక.. సొంత ఊరికి చేరలేక అనాథలుగా మారిన వారిని.. ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. వారి జీవన గమనానికి భరోసా ఇస్తూ ఆదుకుంటోంది. నిత్యావసరాలు పంపిణీ చెయ్యడంతో పాటు.. తలదాచుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేస్తూ.. వారికి ఏలోటూ రానీయకుండా చర్యలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో వలస కార్మికుల్ని ఎక్కడి వారక్కడే ఉండాలనీ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కూలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చెయ్యొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు ప్రభుత్వం భరోసానిచ్చింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వలస కూలీలు, కారి్మకుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చెయ్యడంతో పాటు నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 12 వేల మంది గుర్తింపు.. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 వేల మంది కూలీలు, కార్మికులు వున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో తొలి విడతగా 9435 మందికి నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. రోజుకు ఒక ప్రాంతం చొప్పున ఈ పంపిణీ జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ పది కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, మూడు కిలోల గోధుమ పిండి, లీటర్ వంట నూనె, అరకిలో ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల పసుపు పొడి, 2 కిలోల ఉల్లిపాయలు, రెండు కిలోల బంగాళాదుంపలు కలిపి ఒక కిట్‌గా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. 46 వసతి కేంద్రాలు.. వలస కూలీలు, దినసరి కార్మి కుల కోసం జిల్లా వ్యాప్తంగా 46 కేంద్రాల్లో ఉచిత భోజనం, వసతి ఇతర ఏర్పాట్లు చేశారు. జీవీఎంసీ పరిధిలో 26 కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా.. రూరల్ ప్రాంతంలో 20 ఏర్పాటు చేశారు. అరకులోయ, పాడేరు, పాయకరావుపేట, జి.మాడుగుల, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇబ్బందులుంటే ఫోన్ చెయ్యండి.. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకూ గుర్తించిన వారి కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా.. నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. తొలివిడతలో 9,435 మందికి అందించాం. రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు కిట్లు సిద్ధం చేస్తున్నాం. ఏ వలస కారి్మకుడైనా భోజనానికి, వసతికి ఇబ్బంది ఎదురైతే 1800 4250 0002 నంబర్‌కు కాల్ చేస్తే.. వారి సమస్యలు పరిష్కరిస్తాం. – ఎల్.శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రెండు వారాల నుంచి.. పని నిమిత్తం విశాఖకు వ చ్చాను. కరో నా నేపథ్యంలో అనకాపల్లిలో చిక్కుకుపోయాను. పునరావాస కేంద్రంలో ఉంటున్నాను. భోజనం పెడుతున్నారు. సౌకర్యాలతో కూడిన వసతి కల్పించారు. – ప్రభాకర్, వలస కార్మికుడు, కాకినాడ -
‘కోట’ నుంచి విద్యార్థులను తీసుకొచ్చినట్టుగా..
లక్నో: లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. లక్షలాది మంది పేద వలస కార్మికులు మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ఉపాధి కోల్పోయి తిండిలేక వలస కార్మికులు కష్టాలు పడుతున్నారు. రోజుకు ఒక్కపూట కూడా వారికి ఆహారం దొరకడం లేదు. వారంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. కేంద్రం సానుభూతితో వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకుని వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి విద్యార్థులను సొంతూళ్లకు తరలించినట్టుగానే ప్రత్యేక బస్సుల్లో బడుగులను తరలించాలి. లేదంటే ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను పంపించాల’ని మాయావతి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత -
కంట్రోల్ రూమ్‌గా కాంగ్రెస్ నేత కార్యాలయం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి తన వంతు కృషి చేస్తున్నారు. ఢిల్లీలో తన కార్యాలయాన్ని కంట్రోల్ రూమ్‌గా మార్చి దేశవ్యాప్తంగా వలస కార్మికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని వలస కార్మికులతో చర్చించి వారి సమస్యలను తీరుస్తున్నారు. అధీర్ రంజన్ తన భార్య, సిబ్బందితో కలిసి తన కార్యాలయ్యాన్నే ఓ మినీ కంట్రోల్ రూమ్‌గా మార్చారు. వలస కార్మికుల సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులు, అక్కడి పార్టీ కార్యకర్తలను సంప్రదించి వెంటనే సహాయం అందేలా చూస్తున్నారు. నిరాశ్రయులైన వలసకార్మికుల వివరాలను సేకరించి వారిని సంప్రదించడంలో అధీర్ సతీమణి, సిబ్బంది తోడ్పాటును అందిస్తున్నారు. తన నియోజక వర్గం బెహ్రాపూర్ నుంచే రోజుకు దాదాపు 500 వరకు సహాయాన్ని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అధీర్ రంజన్ తెలిపారు. ‘ఆశ్రయం, ఆహారం లేక వలసకార్మికులు రోధిస్తున్నారు. నా నియోజక వర్గంలో ఎక్కువగా పేద వారే ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వారి వివరాలు సేకరించి, వెంటనే సహాయం అందేలా చూస్తున్నాము’ అని అధీర్ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, జిల్లా అధికారులను సహాయం కోసం సంప్రదిస్తున్నానని తెలిపారు. బీజేపీ ఎంపీలు, మంత్రులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వలస కార్మికుల కోసం సంప్రదిస్తున్నానన్నారు. వారు కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతున్నారని చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని, వారి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అధీర్ మండిపడ్డారు. లాక్డౌన్ ముగియగానే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలసకార్మికులు దేశంలో ఎక్కడున్నా స్వరాష్ట్రానికి తీసుకురావడంలో సహాయాన్ని అందించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు.(వలస కార్మికులను తరలించండి) -
వలస కూలీలకు అండగా ఉంటాం
సాక్షి, సిద్దిపేట: వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, నంగునూరు మండలాల్లో ధాన్యం, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర నిర్మాణ పనులతోపాటు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం కూలీలు మన రాష్ట్రానికి వచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 వేలకు పైగా వలస కూలీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరందరూ ప్రస్తుతం పనులు లేక, కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిందని అన్నారు. వీరిని ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున నగదు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరూ తమ దాతృత్వాన్ని చాటుకుంటూ కూలీలకు సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఆహార పదార్థాలతో కూడిన కిట్స్‌ను అందజేసేందుకు వచ్చిన దాతలను మంత్రి అభినందించారు. అసత్యపు ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి ప్రజలను కోరారు. ప్రతీ గింజను కొంటాం గతంలో లేనివిధంగా ఈ ఏడాది గోదావరి, కృష్ణా జలాలు రాష్ట్రంలోని చెరువులకు మళ్లించామని, దీంతో ఎన్నడూ లేని విధంగా రబీ సాగు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ మూలంగా తమ పంటలను ఎలా అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెన్నైలో ఉండలేక.. సొంతూరికి వెళ్లలేక
ఒంగోలు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది వలస కూలీల పరిస్థితి. పని ప్రదేశంలో ఉండే అవకాశం లేక సొంతూరికి వెళ్లే దారి లేక అవస్థలు పడుతున్నారు. రోనా దెబ్బకు సోమవారం 48 మంది ఇతర రాష్ట్రాల వారు పడ్డ అవస్థలు వర్ణణాతీతం. గుజరాత్‌కు చెందిన 36 మంది, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 12 గత కొన్నేళ్లుగా చెన్నైలో పెయింటింగ్, స్వీపింగ్, కార్పెంటింగ్ వంటి పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో ఉపాధితోపాటు కనీసం నిలువనీడ కూడా లేక వారంతా ఒక లారీ డ్రైవర్‌ను పట్టుకుని నాగపూర్ వరకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరు రూ.2వేలు చొప్పున లారీ బాడుగ మాట్లాడుకున్నారు. తీరా తెలంగాణ సరిహద్దు అయిన నల్గొండ వద్దకు వెళ్లగానే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించారా? ) మేదరమెట్ల నుంచి ఒంగోలు వైపు జాతీయ రహదారిపై ఎర్రటి ఎండలో కాలినడకన వస్తున్న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన యువకులు రాష్ట్రంలోకి అనుమతించేదే లేదంటూ నిలిపివేశారు. దీంతో దిక్కుతోచక తిరిగి చెన్నైకు వెళ్ళడమే ఉత్తమమని భావించి 20 కిలోమీటర్ల దూరం వెనుకకు నడిచి మరో లారీ మాట్లాడుకున్నా రు. నెల్లూరు వరకు రూ.500 చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు రాగానే ముందుకు పోయే అవకాశం లేదంటూ లారీ డ్రైవర్ వారిని దింపేశాడు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం ఉందని పేర్కొనడంతో వారంతా దిగిపోయారు. కనీసం తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో గూగుల్ మ్యాప్ ఆధారంగా తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించి చెన్నై వైపు నడక సాగించారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రాగా ఒంగోలు సమీపంలో త్రోవగుంట చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న తాలూకా సీఐ యం.లక్ష్మణ్ వారిని అడ్డుకొని విచారించారు. తమ గోడు విన్నవించున్న బాధితుల్లో చాలా మంది నీరసించి ఉండడంతో భోజనం చేశారా అంటూ ప్రశ్నించారు. తినడానికి రొట్టె కూడా దొరకలేదని, ఏదైనా తిని 24 గంటలు దాటిపోయిందని చెప్పడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు సమీపంలోని శ్రీలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారితో మాట్లాడి 48 మందికి భోజనం ఏర్పాట్లు చేయించాడు. భౌతిక దూరం పాటించేలా కూర్చోబెట్టి కరోన పరిస్థితుల నేపథ్యంలో క్వారంటైన్ హోంలో ఉండాలని సూచించి, వారందరినీ టంగుటూరు హోంకు తరలించారు. -
విషయాన్ని గోప్యంగా ఉంచి ఏకంగా మృతదేహంతో..
సాక్షి, కడప: కూలీ పనుల కోసం కొంతకాలం క్రిందట మహారాష్ట్రకు వెళ్ళిన యువకుడు అక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విషయం గోప్యంగా ఉంచిన కాంట్రాక్టర్ – మేస్రీలు, మృతుడి కుటుంబీకులకు ఎటువంటి సమాచారం లేకుండా అంబులెన్సులో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గోపవరం మండలం బేతాయపల్లెకు చెందిన తిరుపాల్ అనే వ్యక్తి మహరాష్ట్రలోని బదనాపూర్లో కూలీ పనికని వెళ్లి మృతి చెందాడు. తిరుపాల్ మృతి చెందిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలపకుండా ఒక్కసారిగా మృతదేహాన్ని తీసుకురావడంతో బంధువులు ఉలిక్కిపడ్డారు. తిరుపాల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతుడి బందువులు, తమకు న్యాయం చేయాలంటూ బద్వేల్ నాలుగు రోడ్లు సర్కిల్లో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువర్గాలు మృతదేహంతో పోలీసులను ఆశ్రయించారు. -
నెలరోజుల్లో క్షమాభిక్ష తెచ్చుకో..!
ఆర్మూర్: ‘నెల రోజుల్లో క్షమాభిక్ష తీసుకురాకపోతే నీ కేసు ఆబూదాబి కోర్టుకు వెళ్తుంది.. అక్కడ హత్యా నేరంపై ఉరిశిక్ష పడటం ఖాయం’ అని దుబాయ్ కోర్టు జడ్జి మాకూరి శంకర్‌కు సూచించినట్లు దుబాయ్ జైలు నుంచి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఉపాధి వేటలో దుబాయ్ వెళ్లి అక్కడ చేయని హత్యకు తొమ్మిదేళ్లుగా జైలులో మగ్గుతున్న తన భర్తను కాపాడాలంటూ శంకర్ భార్య భూదేవి, కుమారుడు రాజు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన వీరి సమస్యను పరిష్కరించడానికి స్థానికుడైన టీడీపీ నాయకుడు దేగాం యాదాగౌడ్ తనవంతు ప్రయ త్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోరాకు చెందిన మాకూరి శంకర్ వ్యవసాయ కూలీ. భార్య భూదేవి గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్ వెళ్లాడు. అక్కడి ఓ కంపెనీలో ఫోర్‌మన్‌గా పనిలో చేరాడు. 2009లో అక్కడే తాపీ పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాద వశాత్తు కిందపడి చనిపోయాడు. దీంతో ఫోర్‌మన్‌గా ఉన్న శంకర్‌పై పోలీసులు హత్యా నేరం మోపి ఫుజీరా జైలుకు పంపించారు. దుబాయ్ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి ఉరిశిక్ష విధిస్తారు. తొమ్మిదేళ్లుగా అతను జైలులోనే ఉన్నాడు. కొడుకు పుట్టినా కనీసం ఇప్పటి వరకు శంకర్ చూడలేదు. తన పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి, రక్షించాలని శంకర్ సమాచారం అందించాడు. మృతుడి కుటుంబ సభ్యులు శంకర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు లేఖ ఇస్తే జైలు నుంచి విడుదలయ్యే అవకా శాలున్నాయి. రాయబార కార్యాలయానికి లేఖ శంకర్ దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి తనను కాపాడాలని లేఖ రాయడంతో అధికా రులు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. యాదాగౌడ్ గతేడాది రాజస్తాన్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రూ.6.5లక్షల పరిహారం ఇస్తే బాధిత కుటుంబం క్షమాభిక్ష లేఖ ఇచ్చేందుకు అంగీకరించింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో దిక్కుతోచక శంకర్ కుటుంబం సాయం చేయాలని దాతలు, ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.