
సాక్షి, కడప: కూలీ పనుల కోసం కొంతకాలం క్రిందట మహారాష్ట్రకు వెళ్ళిన యువకుడు అక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విషయం గోప్యంగా ఉంచిన కాంట్రాక్టర్ – మేస్రీలు, మృతుడి కుటుంబీకులకు ఎటువంటి సమాచారం లేకుండా అంబులెన్సులో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గోపవరం మండలం బేతాయపల్లెకు చెందిన తిరుపాల్ అనే వ్యక్తి మహరాష్ట్రలోని బదనాపూర్లో కూలీ పనికని వెళ్లి మృతి చెందాడు. తిరుపాల్ మృతి చెందిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలపకుండా ఒక్కసారిగా మృతదేహాన్ని తీసుకురావడంతో బంధువులు ఉలిక్కిపడ్డారు. తిరుపాల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతుడి బందువులు, తమకు న్యాయం చేయాలంటూ బద్వేల్ నాలుగు రోడ్లు సర్కిల్లో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువర్గాలు మృతదేహంతో పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment