construction
-
‘బిల్డ్ నౌ’ ఎలా పని చేస్తుంది..?
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే ఔట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ను జీహెచ్ఎంసీ (GHMC) అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’తో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం టీజీబీపాస్లో ఇన్స్టంట్ అప్రూవల్‌కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా, బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో చూపుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ప్రారంభించిన దీన్ని క్రమేపీ హెచ్ఎండీఏ, డీటీసీపీ, తెలంగాణ (Telangana) మొత్తం అమల్లోకి తేనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా గురువారమే ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న ముగ్గురికి అనుమతులు జారీ చేశారు. ఇలా పని చేస్తుంది.. → ఏఐతో పాటు సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్, స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, ఆలోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతుల జారీ. → దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ సులభతరం.. మెరుపువేగం. → 5 నిమిషాల్లోపునే డ్రాయింగ్ పరిశీలన పూర్తవుతుంది. ఇప్పటి వరకు 2–30 రోజుల సమయం పట్టేది. → అధునాతన క్యాడ్ ప్లగిన్. డిజైన్ సాఫ్ట్‌వేర్‌తో ప్రత్యక్ష అనుసంధానం. → డ్రాయింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తక్షణమే నిర్ధారిస్తుంది. → సాధారణ లోపాలు నివారిస్తూ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది. → వాట్సాప్ ద్వారానూ అప్డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తుదారులు ఆన్లైన్లో చూసుకోవచ్చు. → సందర్భానుసారం మారే ఫీజులు, టారిఫ్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే నవీకరించుకోవచ్చు. 360 డిగ్రీస్ పారదర్శకత. → స్థూల, సూక్ష్మస్థాయిల్లో ప్రాజెక్ట్ పరిస్థితి, పనితీరు పరిశీలన. → వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం. → పట్టణ నియమ నిబంధనలు మార్పుల్పి క్షణాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. → పాలసీ ఆధారిత అప్డేట్స్ను రిపోర్టులు, చట్టపర పత్రాల్లో అమలు చేయొచ్చు. → అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్తో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఉంటుంది. ఎన్ని అంతస్తులైనా.. → ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనకే ఎన్నో రోజులు పట్టేది. బిల్డ్‌నౌతో 7.7 ఎకరాల విస్తీర్ణంలోని హైరైజ్ భవనాలకు, 33 అంతస్తులున్న 5 టవర్లకు, 12 అంతస్తుల ఎమినిటీస్ బ్లాక్‌కు, 22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా భవనాలకైనా 5 నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది. → సింగిల్ విండోతో వివిధ ప్రభుత్వ విభాగాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. → జియో ఇంటెలిజెన్స్‌తో ఆటోమేటిక్‌గానే మాస్టర్ప్లాన్లు, సంబంధితమైనవి పరిశీలిస్తుంది. → అడ్వాన్స్డ్ క్యాడ్ ప్లగిన్ భారీ భవనాలకు సైతం ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సమయాన్ని తగ్గస్తుంది. వారాలు, నెలల నుంచి రెండు మూడు రోజులకు తగ్గుతుంది. → క్యాడ్ ప్లగిన్ వినియోగానికి సంబంధించి వెబ్సైట్ నుంచి వన్ టూ వన్ వీడియో కన్సల్టేషన్ కూడా జరపొచ్చని చెబుతున్నారు. →సిటిజెన్ సెంట్రిక్ డిజైన్‌తో పనిచేస్తుంది. -
అది మా జాగా.. మేమే నిర్మిస్తాం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల అంచనా వ్యయం రూ.837 కోట్లుగా చెప్పి..నాలుగో ప్యాకేజీలో భాగంగా ఈ మూడింటికీ కలిపి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ విప్రో జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవకుండా పెండింగ్‌లో ఉంచి మిగతా రెండు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాటి నిర్మాణ అంచనా వ్యయం రూ.650 కోట్లు. విప్రో జంక్షన్ వద్ద టెండరు పిలవకపోవడానికి కారణం ఆ మార్గంలో మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ఒకే పిల్లర్‌పై మెట్రో మార్గం, జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్‌ను డబుల్ డెక్కర్‌గా నిర్మించాలని భావించారు. ఆ మేరకు జరిగిన జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో డబుల్ డెక్కర్ నిర్మాణానికి రైల్వే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతోపాటు మెట్రో మార్గం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రైల్వేతో సమన్వయం కుదరదని జీహెచ్ఎంసీ కూడా భావించింది. అంతే కాకుండా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది. మెట్రో రైలు స్టేషన్ జంక్షన్‌లోనే ఉంటుంది. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఫ్లై ఓవర్‌కు టెండర్ పిలవలేదు. అది మా జాగా.. మేమే నిర్మిస్తాంమరోవైపు, విప్రో జంక్షన్ స్థలం తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు చెందినది కావడంతో తమ స్థలంలో అవసరమైన ఫ్లై ఓవర్‌ను తామే నిర్మిస్తాం సదరు కార్పొరేషన్ అధికారులు జీహెచ్ఎంసీకి తెలిపినట్లు సమాచారం. దీంతో ఇక విప్రో జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ విరమించుకుంది. మిగతా మార్గాల్లో డౌటే ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోనూ డబుల్ డెక్కర్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీహెచ్ఎంసీ కొత్తగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు మార్గాలున్నట్లయితే ఫ్లై ఓవర్ల పై వరుసలో మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా పిల్లర్లు నిరి్మంచాలని భావించారు. ఎత్తయిన పిల్లర్లు నిర్మించి డబుల్ డెక్కర్‌గా రెండు నిర్మాణాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విప్రో జంక్షన్ వద్ద కూడా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వశాఖలు వేటికవిగా అందుకు విభేదించడంతో జీహెచ్ఎంసీ విరమించుకుంది. మియాపూర్ –పటాన్‌న్‌చెరు మార్గంలో ఆలి్వ¯Œన్ క్రాస్‌రోడ్, మదీనగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్,ఇక్రిశాట్ల మార్గాల్లో, నాగోల్– ఎయిర్పోర్ట్ మార్గంలో ఎల్బీనగర్, కర్మ¯న్Œ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు రానుంది. ఆ మార్గాల్లో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చేచోట డబుల్డెక్కర్లుగా డబుల్ డెక్కర్లు నిరి్మంచేందుకు ఆలోచనలు చేసినప్పటికీ, తాజా పరిస్థితులతో డైలమాలో పడ్డాయి. ⇒ నాగోల్– ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో మార్గంలో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాలు ⇒ టీకేఆర్ కాలేజ్,గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్లు ⇒ ఒమర్ హోటల్– సోయబ్హోటల్ (వయా మెట్రో ఫంక్షన్‌హాల్) ⇒ బండ్లగూడ– ఎరక్రుంట క్రాస్‌రోడ్స్ ⇒ మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్. ⇒ మియాపూర్ క్రాస్‌రోడ్– ఆలి్వన్ క్రాస్‌రోడ్ మార్గంలో మదీనగూడ గంగారం వద్ద. -
ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం.. హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హైకోర్టు హెచ్చరించింది.ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు.. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7 తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
దోపిడీ జరిగిందన్నారు.. మరి బిల్లులెందుకు చెల్లించారు?: బొత్స
అమరావతి, సాక్షి: రుషికొండ భవనాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రేగింది. నిర్మాణాలపై అడ్డగోలు ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమిని నిలదీశారు. రుషికొండ భవనాలు వాడుకోకపోవటం ప్రభుత్వం చేతకానితనం. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారు?. తప్పు జరిగిందని చెప్పినప్పుడు చెల్లింపులు చేయడం ఎందుకు? అని బొత్స ప్రశ్నించారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగుంటే విచారణకు చేయించండి. తప్పు జరిగినపుడు ఎందుకు విచారణకు జంకుతున్నారు. మేం సభలో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. మేము ఏదైతే మాట్లాడతామో దానికే కట్టుబడి ఉంటాం అని అన్నారాయన. అయితే.. బొత్స ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించింది రుషికొండ నిర్మాణాలకు కాదని, వేరే పనులకు అని చెప్పారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన పనులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని ఆరోపించారాయన. -
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్లను రూ.లక్షల్లో వెచ్చిoచి పూర్తి చేసుకోగలరా? పిల్లర్లతో కూడిన నిర్మాణంలో వ్యయం పెరిగి ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తే ఎలా? ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం ముంగిట ప్రభుత్వానికి వచ్చిన సందేహాలు. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లబ్దిదారులు అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి నిధులు చాలక అసంపూర్తిగా ఆపేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న ఆందోళనే దీనికి కారణం. మండలానికొక మోడల్ ఇల్లు ప్రస్తుతం భవనాలను నిర్మిస్తున్నట్టుగా పిల్లర్లు, బీములతో కూడిన నిర్మాణ పద్ధతి కాకుండా, ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండలానికి ఒకటి చొప్పున, వేర్వేరు పద్ధతుల్లో మోడల్ ఇళ్లను నిర్మిస్తోంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది మేస్త్రీలకు ఆయా పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. తొలుత హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏడు జిల్లాలకు చెందిన 113 మంది మేస్త్రీలకు నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శిక్షణ ఇచ్చింది. వీరు జిల్లాల్లోని మరికొందరు మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 28 నుంచి జిల్లాల్లోని న్యాక్ సెంటర్లలో నిపుణుల ఆధ్వర్యంలో కూడా మేస్త్రీలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు జరిగే శిక్షణ తరగతులకు ఒక్కో మేస్త్రీకి రూ.8 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. లబ్దిదారు ఇష్టం ప్రకారమే! ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఆ మొత్తంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్నవారికి ఉపయుక్తంగా ఉండేలా నాలుగు నిర్మాణ పద్ధతులను అందుబాటులోకి తెచ్చిoది. కానీ, ఆ నాలుగింటిలో కచి్చతంగా ఒకదాన్ని అనుసరించాలన్న నిర్బంధం లేదని అధికారులు చెబుతున్నారు. లబ్దిదారు సాధారణ పద్ధతిలో అయినా ఇంటిని నిర్మించుకోవచ్చని, ఆర్థిక పరిస్థితి సహకరించని పక్షంలో, నమూనా ఇంటిని చూసి ఆ పద్ధతిలో ఇంటిని నిర్మించుకోవచ్చని అంటున్నారు. ఇంటి విస్తీర్ణం 400 చ.అ.కు తగ్గకుండా ఉండాలని ఇంతకాలం చెబుతూ వచ్చిన అధికారులు, ఇప్పుడు ఆ విస్తీర్ణం 600 చ.అ.కు మించరాదని కూడా బలంగా చెబుతున్నారు. విస్తీర్ణం పెరిగితే ఖర్చు తడిసిమోపెడై, ఇంటిని అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో ఇలా చెబుతుంటారని అంటున్నారు.నాలుగు డిజైన్ల ఖరారు.. 1. షార్ట్ కాలమ్ కన్స్ట్రక్షన్: ఇళ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ. దీన్ని పరిహరించేలా ఈ డిజైన్‌ను అనుసరిస్తారు. పునాదిస్థాయి వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి. పైన ప్లింథ్ బీమ్స్ ఉంటాయి. మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లలో పై అంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. 2. షియర్ వాల్ పద్ధతి: ఇందులో ప్రీఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్‌తో సిద్ధం చేస్తారు. పునాదులపై రంధం డ్రిల్ చేసి రాడ్స్‌తో ఆ గోడలను అనుసంధానిస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్ వ్యయం ఉండదు. 3. స్టోన్ రూఫింగ్ విధానం: కాంక్రీటు గోడలు నిర్మించిన తర్వాత పైన పూర్వకాలపు దూలాల తరహాలో ఆర్సీసీ రాఫ్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తాండూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ఇళ్ల కప్పులుగా తాండూరు బండలనే వాడుతున్నారు. 4. పిల్లర్ రూఫింగ్ నిర్మాణం: గోడలపై ఆర్సీసీ రాఫ్టర్లు అమర్చి వాటి మీద పూర్వ కాలం తరహాలో బెంగళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద రెండున్నర అంగుళాల మందంతో శ్లాబ్ వేస్తారు. దీనిలో ఇటుక, స్టీల్ వ్యయాన్ని పరిహరించొచ్చు. -
నిద్రిస్తున్న కూలీలపై ఇసుక అన్లోడ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్.. ఇసుకను అన్లోడ్ చేశాడు.ఇసుక అన్లోడ్ చేసే సమయంలో షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. శనివారం తెల్లవారుజామున జాఫ్రాబాద్ తహసీల్‌లోని పసోడి-చందోల్‌లోని వంతెన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అవినీతి నిర్మాణానికి రెట్టింపు ‘అడుగు’
సాక్షి, అమరావతి: రాజధానిలో భవనాల నిర్మాణ పనుల టెండర్లలో అడుగు అడుగుకు కమీషన్లు దండుకోవడానికి ముఖ్య నేతలు ప్రణాళికాయుతంగా పావులు కదుపుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల పనుల టెండర్లలోనైతే మరీ బరితెగించారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులపై ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచేసేలా చక్రం తిప్పారు. ఆ కాంట్రాక్టు సంస్థ బ్రోచర్నే నిబంధనలుగా పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టాక.. అందులో పది శాతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. దాన్నే తొలి విడత కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత చేసిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు మిగతా కమీషన్ వసూలుకు ప్రణాళిక రచించారు. వివరాల్లోకి వెళితే..రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్‌తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్‌తో లోపల, బయట విద్యుదీకరణ, ఐటీ పనులు.. లోపల, బయటి ప్రాంతాల్లో ప్లంబింగ్‌తో బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలను నిర్మించాలని టెండర్లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్లో పాల్గొంటూ బిడ్లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3వరకు గడువు ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తారు. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మార్చి 7న తెరిచి, తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించనున్నారు.వ్యయంపై నోరెళ్లబెడుతున్న బిల్డర్లు, ఇంజినీర్లుఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1లో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1లో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు.. ఇందులో రూ.2,500 వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టవచ్చని బిల్డర్లు, ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ రూ.132.02 కోట్లే అవుతుంది. బంగ్లాల నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లకు మించి కాదని స్పష్టం చేస్తున్నారు. అంటే.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.232.02 కోట్లకు మించదు. మౌలిక సదుపాయాలను కూడా కలుపుకొంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి రూ.4,393.48కు మించదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ మాత్రం ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.498.16 కోట్లకు నిర్ణయించింది. దీనిప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,433.06 అవుతోంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.5,040.12కు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా భారీగా పెంచేయడంపై బిల్డర్లు, ఇంజినీర్లు అవాక్కవుతున్నారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి దోచుకోవడానికి ముఖ్య నేతలు సీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అంచనా వ్యయాన్ని పెంచేలా చక్రం తిప్పారని చెబుతున్నారు.తన రికార్డు తానే బద్దలురాజధాని ప్రాంతంలో జీ+12 పద్ధతిలో (14 టవర్లలో 1440 ఫ్లాట్లు) గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1806.29. రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.75. అంతస్తులు పెరిగే కొద్దీ భవన నిర్మాణ వ్యయం తగ్గుతుంది. బహుళ అంతస్తులతో అత్యంత విలాసవంతంగా నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని అప్పట్లో బిల్డర్లు, ఇంజినీర్లు స్పష్టం చేశారు. కానీ.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించిన ముఖ్య నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లలో కూడా సీఆర్డీఏ, ఏడీసీఎల్ తమ రికార్డులను తామే బద్ధలు కొడుతూ అంచనా వ్యయాన్ని పెంచేశాయనే చర్చ బిల్డర్లు, ఇంజినీర్లలో జోరుగా సాగుతోంది. -
తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు కలకలం రేపుతున్నాయి. పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థసెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్మెంట్ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్‌ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. డదీంతో జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్? -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్‌హుస్సేన్, దారుల్ఫా జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
రాజమండ్రి ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం తప్పింది. మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కొంతభాగం పాక్షికంగా కూలింది. నిర్మాణ సమయంలో ఐరన్ గ్రిల్స్ కిందపడిపోయాయి. కూలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది. -
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు. -
‘రింగు’ యమ కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌లో పేర్కొంది. 162 కి.మీ నిడివితో ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతి కిలోమీటరుకు ఏకంగా రూ. 52.5 కోట్లు ఖర్చు కానుంది. 8 వరసలుగా ప్రతిపా దించినప్పటికీ, ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటంతో 4 వరసలను మాత్రమే నిర్మించనున్నారు. భవిష్యత్తులో దాన్ని 8 వరసలకు విస్తరిస్తారు. మరి 4 వరసల నిర్మాణానికే ఇంత భారీ వ్యయం ఎందుకు అవుతోందో చూద్దాం..5 మీటర్ల ఎత్తుతో నిర్మాణంఇది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. ఢిల్లీ చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగురోడ్డు స్థాయిలో దీనికి ప్లాన్ చేశారు. కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఆటంకాలు తలెత్తని రీతిలో నిర్మించబోతున్నారు. నగరం, నగర శివారు ప్రాంతాల్లో అప్పుడప్పుడు రికార్డు స్థాయి వర్షపాతం నమోదై లోతట్టు ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తుతాయి. కొన్నిరోజుల పాటు ఆ ప్రాంతాలు నీటిలోనే ఉంటాయి. ఇలాంటి వరదలు ఈ రోడ్డును ఇబ్బంది పెట్టకుండా భూ ఉపరితలం నుంచి 5 మీటర్ల ఎత్తుతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 16.4 అడుగుల ఎత్తుతో ఇంచుమించు ఎలివేటెడ్ కారిడార్ తరహాలో ఉంటుంది. అంతెత్తు మట్టి కట్ట నిర్మించి దానిమీద రోడ్డును నిర్మిస్తారు. 162 కి.మీ రోడ్డును అంత ఎత్తుతో నిర్మించేందుకు భారీ వ్యయం కానుంది. 3 నదులు.. 3 భారీ వంతెనలుఈ మార్గంలో 3 నదుల మీదుగా ఈ రోడ్డు సాగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో 4 వరసల రోడ్డుకు సరిపోయే వెడల్పుతో 3 భారీ వంతెనలు నిర్మిస్తారు. వలిగొండ వద్ద మూసీ నదిని దాటాల్సి ఉంది. వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కిలోమీటరు పొడవుతో భారీ వంతెనకు డిజైన్ చేశారు. దీనికి దాదాపు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పుల్కల్ మండలం శివంపేట గ్రామం వద్ద మంజీరా నదిని దాటాల్సి ఉంది. ఇక్కడ 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.75 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇక తూప్రాన్ సమీపంలో హరిద్రా నదిని దాటుతుంది. అక్కడ అర కి.మీ పొడవైన వంతెన నిర్మిస్తారు. దీనికి రూ.70 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.190 చిన్న వంతెనలు, అండర్ పాస్లుఇతర రోడ్ల మీదుగా సాగే వాహనాలు దాటేందుకు, కాలువలు, వాగుల్లో పారే నీళ్లు దాటేందుకు వీలుగా రోడ్డు పొడవునా చిన్న వంతెనలు, అండర్ పాస్‌లను ప్లాన్ చేశారు. ఇవి మొత్తం 190 ఉంటాయి. వీటిల్లో 105 అండర్ పాస్‌లు ఉన్నాయి. దిగువన 10 అడుగుల ఎత్తుతో దారి ఉంటుంది. వాటి గుండా ఇతర రోడ్ల వాహనాలు సాగుతాయి. ఈ కల్వర్టులు, అండర్‌పాస్‌లు ఉండే చోట్ల రింగురోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. ఇక కాల్వలు, చెక్ డ్యామ్‌లు, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే నీటి ప్రవాహానికి రింగురోడ్డు అడ్డుగా మారకుండా 85 చిన్న కల్వర్డులు నిర్మించనున్నారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా, వీటి గుండా ట్రాక్టర్లు లాంటి వాహనాలు వెళ్లేలా రోడ్డు కూడా ఉంటుంది.ఇలా పెద్ద, చిన్న వంతెనలు, కల్వర్టులు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇక తారు పొరలు కూడా చాలా మందంగా ఉండనున్నాయి. వాహనాలు 120 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున, అవి జారిపోయే ప్రమాదం లేకుండా రోడ్డుపైన ప్రత్యేక మెటీరియల్‌తో పొరలు నిర్మించనున్నారు. దిగువ తారు పొరలు కూడా చాలా మందంగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మొత్తంగా రూ.8,500 కోట్ల వ్యయం అవనుంది. -
భారీ స్థాయిలో ఆఫీస్ వసతుల నిర్మాణం
పని ప్రదేశాలకు (Work Space) డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో దేశ, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో 250 లక్షల చదరపు అడుగుల (Sft) ఆఫీస్ వసతుల నిర్మాణం జరుగుతున్నట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హౌసింగ్ బ్రోకరేజీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, రిటైల్, ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ లీజింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న అనరాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం.భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 ఎంతో సానుకూలంగా నిలిచిపోతుందని అనరాక్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. రికార్డు స్థాయిలో ఆఫీస్ మార్కెట్ లీజింగ్ లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ ఆఫీస్ స్పేస్ తగ్గినట్టు చెప్పారు. 2025లోనూ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ చాలా బలంగా కోలుకున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లను (జీసీసీలు) బహుళజాతి సంస్థలు భారత్‌తో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగారల్లో ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు జైన్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గంటలు, రోజుల తరబడి లీజింగ్‌కు అవకాశం ఇచ్చేవి) ఆపరేటర్లు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తూ, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకుంటున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది.ఈ రంగాల నుంచి డిమాండ్..ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకులు సహా), ఇంజినీరింగ్ అండ్ తయారీ రంగ కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్‌కు కీలకంగా ఉన్నట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. ‘2025 సంవత్సరంలో డిమాండ్ ఆశావహంగా ఉండనుంది. స్థిరీకరణ, విస్తరణ, హైబ్రిడ్ పని నమునా డిమాండ్‌కు మద్దతుగా నిలవనున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, పుణెలో గ్రేడ్–1 ఆఫీస్ స్పేస్ సరఫరాలో కొరత ఉంది. డెవలపర్లు ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20–25 మిలియన్ (200–250 లక్షల ) ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను సొంతం చేసుకోవడంలో ముందుంటారు’ అని జైన్ తెలిపారు. ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందన్నారు. తక్కువ వ్యయాలు, నైపుణ్య మానవ వనరులు, నిర్వహణ సామర్థ్యాలు వెరసి బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆర్అండ్డీ పరిశ్రమల్లో జీసీసీలకు భారత్ చిరునామాగా మారుతోందన్నారు. ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుసవాళ్లు ఇవే..ఆఫీస్ స్పేస్ మార్కెట్లో సవాళ్ల గురించి జైన్ ప్రస్తావించారు. అధిక ముడి సరుకుల ధరలు, సరఫరా సమస్యలతో నిర్మాణంలో జాప్యం నెలకొనడం ప్రధాన సవాలుగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ స్పేస్‌లో స్వల్పకాల లీజుకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ విభాగంలో దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. -
భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. -
కార్మికా.. మేలుకో
రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండేది. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సంక్షేమం కోసం కార్మిక శాఖ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కడప కోటిరెడ్డిసర్కిల్: భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. రిజి్రస్టేషన్ చేసుకున్న కార్మికులకు సంబంధించి కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 3,65,648 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అయితే గుర్తింపు కార్డు పొందని కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ రంగంతోపాటు పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లంబర్లుగా అనేక మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు రోజూ పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కడప నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉదయం జెడ్పీ కార్యాలయం, అప్సర సర్కిల్లోని అడ్డాలకు చేరుకుని వేచి చూస్తుంటారు. కొందరికి పని దొరకుతున్నా, మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అవగాహన లేమితో నష్టపోతున్న వైనం కార్మికులకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. కార్డులు కలిగిన కార్మికులకు నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, శిక్షణ కాలంలో రూ.300 స్టయిఫండ్ ఇస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.1000–5000 పెన్షన్ అందజేస్తారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు అందిస్తారు. భవన యజమానులు నిర్మాణ రిజిస్ట్రేషన్ చేసి.. పని చేసే కార్మికుల పేరిట ఒక శాతం కార్మిక శాఖకు సెస్ చెల్లించాలి. వీటిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పించి.. అన్ని పథకాలు అందేలా చూడాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. వివిధ వృత్తుల్లో..భవన నిర్మాణ రంగానికి సంబంధించి పలు విభాగాల కార్మికులు పని చేస్తున్నారు. మట్టి పని, పునాది గుంతలు తీయడం, చదును, తాపీ మేస్త్రీ, కూలీలు, రాడ్‌బెండింగ్, కార్పెంటర్లు, పెయింటర్లు, సెంట్రింగ్, ఫ్లంబర్లు, ఎల్రక్టీíÙయన్లు, పాలీష్ వేసే వారు ఉన్నారు. సీలింగ్, కంకర కార్మికులు, రోడ్డు నిర్మాణ కూలీలు, క్రేన్, పొక్లెయినర్ ఆపరేటర్లు తమ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. చెరువులు తవ్వడం, పూడిక తీయడం, బోర్‌వెల్స్, సిమెంటు ఇటుకలు తయారు చేసే వారు ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు పని భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డులు పొందాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో ఆధార్, రెండు ఫొటోలు, నామిని ఆధార్ కార్డుతోపాటు రూ.50 సభ్యత్వ రుసుం చెల్లించాలి. -
HYD: కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శుక్రవారం(డిసెంబర్20) బ్లాస్టింగ్ కలకలం రేపింది. కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ వద్ద నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ నిర్వహించింది. ఈ బ్లాస్టింగ్ తీవ్రతతో బండరాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. రాళ్లు పక్కనే ఉన్న అయ్యప్పస్వాముల శిబిరంపై పడ్డాయి.కాగా, కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ అత్యధిక ధరకు ప్రభుత్వం గతంలో అమ్మిన విషయం తెలిసిందే. ఇక్కడ భూములు కొనుక్కున్న కంపెనీలు నిర్మాణం ప్రారంభించాయి. ఈ నిర్మాణ ప్రక్రియలో భాగంగానే నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ చేపట్టినట్లు సమాచారం. -
Delhi: ఆంక్షల సడలింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్ఏపీ-4) నిబంధనలను సడలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి చాలా పేలవమైన కేటగిరిలో కొనసాగుతోందని.. ఇది మరింత స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిబంధనలను సడలించేందుకు అనుమతిస్తామ తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఢిల్లీ కాలుష్యంపై విచారణ చేపట్టింది.ఢిల్లీలో జీఆర్‌పీఏ నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ, హర్యాణ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ప్రధాన కార్యదర్శలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.‘భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలన్న మా ఆదేశాలను ఎన్సీఆర్ రాష్ట్రాలు ఏవీ పాటించలేదని మేము గుర్తించాము. పైసా చెల్లించినట్లు కూడా రుజువు చూపలేదు. ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు(వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వారికి సమన్లు జారీ చేస్తేనే వారు సీరియస్‌గా తీసుకుంటారు,’అని ధర్మాసనం పేర్కొంది. -
రోడ్ల ‘రూల్’ మారిపోయింది
సాక్షి, అమరావతి: రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఇకపై కూటమి నేతల అనుంగులకే దక్కనున్నాయి. ఇందుకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ప్లానే వేశారు. తమ అస్మదీయ, బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు అర్హత నిబంధనలను సడలించారు. తమ వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా, ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడకుండా అడ్డుకుని మరీ కాంట్రాక్టులు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా బిడ్లు దాఖలు చేసేందుకు అర్హతగా పరిగణించే కాల పరిమితి (బ్లాక్పీరియడ్)ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ ఆర్ అండ్ బి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపించడం గమనార్హం. ఇప్పటివరకు గత ఐదేళ్లలో కాంట్రాక్టు సంస్థలు చేసిన పనుల విలువను అర్హతగా పరిగణించేవారు. ఇక నుంచి గత పదేళ్లలో చేసిన నిర్మాణ పనులను పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా ప్రస్తుతం అర్హత లేని కాంట్రాక్టు సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు ప్రభుత్వ పెద్దలు మార్గం సుగమం చేశారు. ఈ పదేళ్ల బ్లాక్ పీరియడ్ సడలింపు 2026–27 వరకు వర్తిస్తుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే రానున్న మూడేళ్లలో చేపట్టే రోడ్ల నిర్మాణ టెండర్లలోనూ వారి ఇష్టానుసారం కాంట్రాక్టులు కట్టబెడతారన్న విషయం స్పష్టమైంది. పీపీపీ రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే..! రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై టోల్ భారం వేస్తూ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో త్వరలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం రూ.4 వేల కోట్లతో రాష్ట్ర ప్రధాన, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటి దశగా రూ.698 కోట్లతో 3,931 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కన్సల్టెన్సీలను ఆహ్వానించింది కూడా. ఈ కాంట్రాక్టులను ప్రభుత్వ పెద్దలు సన్నిహితులకు కట్టబెట్టేందుకే అర్హత నిబంధనలను సడలించినట్టు స్పష్టమవుతోంది. అందుకే కన్సల్టెన్సీల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారమే కాంట్రాక్టు సంస్థల అర్హత నిబంధనలను కూడా సడలించింది. రోడ్ల నిర్మాణాన్ని అస్మదీయ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టి, ఆ సంస్థలు వాహనదారుల నుంచి ఐదేళ్ల పాటు టోల్ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం పక్కాగా కథ నడుపుతోందని ఆర్ అండ్ బి వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
నిర్మాణ రంగం కుప్పకూలింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు. -
దళారులెవరు బాబూ.. తమ్ముళ్లేగా?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
ఢిల్లీలో నిర్మాణ పనులపై నిషేధం..ఎందుకంటే
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు(గ్రాప్) రెండో దశకు చేరుకున్నాయి. మంగళవారం(అక్టోబర్22) ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీలో నిర్మాణరంగ పనులు,డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలు చేయనున్నారు. ఢిల్లీలో తాజాగా వాయు నాణ్యత 301-400 పాయింట్ల మధ్య పడిపోవడంతో గ్రాప్ రెండో దశ చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. గ్రాప్-2లో భాగంగా రోడ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై దుమ్ము లేవకుండా నీళ్లు చళ్లనున్నారు. కాగా, ఢిల్లీ కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్సే కారణమని సీఎం అతిషి ఇప్పటికే ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా,ఉత్తరప్రదేశ్‌లు ఢిల్లీని కాలుష్యమయంగా మారుస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఆమ్ఆద్మీపార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ మాత్రం కాలుష్యం కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇదీ చదవండి: కిలో ఉల్లికి రూ.35.. ఎక్కడంటే -
How India Borrows 2024: ఆన్లైన్ రుణం.. యస్ బాస్
హైదరాబాద్: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. యాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్ సర్వే ‘హౌ ఇండియా బారోస్’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్ క్రెడిట్ ఇండియా విడుదల చేసింది. వేటి కోసం రుణాలు.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్‌లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది. ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది. వాట్సాప్, చాట్‌బాట్ పాత్ర 27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్‌బాట్ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్ జెడ్‌లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్ సేవల కోసం చాట్బాట్లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్ ఫైనాన్స్ (డిజిటల్ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్ షాపింగ్ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్ బుకింగ్ యాప్‌లు మేక్మైట్రిప్, క్లియర్‌ట్రిప్, 23 శాతం ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ సేవలను వినియోగించుకుంటున్నారు.పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్‌కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్‌లో 69 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్‌కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్ జెడ్‌లో 65 శాతం మంది, జెన్ ఎక్స్‌లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్లైన్లో షాపింగ్ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్డౌన్లతో 2021లో ఆన్లైన్ షాపింగ్ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 64 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 71 శాతంగా ఉంది. -
నల్లగొండ బైపాస్ నిర్మాణానికి రూ.516 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ సెక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారి 565లో 14 కి.మీ పొడవైన నాలుగు లేన్ల నల్లగొండ పట్టణ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.516 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ‘ఎక్స్’వేదికగా ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా నకిరేకల్ – నాగార్జునసాగర్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని, రహదారి భద్రత కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 200.06 కి.మీ మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సీఆర్ఐఎఫ్ సేతు బంధన్ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు–నల్లపాడు రైల్వే సెక్షన్లో నాలుగు లేన్ల శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి గాను రూ.98 కోట్ల విడుదలకు కూడా ఆమోదం తెలిపినట్లు గడ్కరీ వివరించారు. -
మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో విషాదం చోట చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో శనివారం ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.Five Labourers Killed in Construction Site Collapse in Gujarat's Mehsana District #Mehsana #Gujarat #ConstructionCollapseMishap @INCGujarat @AAPGujarat https://t.co/UBMZgVKjXQ— Vibes of India (@vibesofindia_) October 12, 2024క్రెడిట్స్: Vibes of India ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్‌సిన్హ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశాం. ముగ్గురికిపైగా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
ఫార్మ్ హౌస్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి
సాక్షి, అమరావతి: ప్రైవేట్‌పై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిరీ్వర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో కళాశాలల నిర్మాణం ఆపివేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీఎంస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ వైద్య కళాశాలల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కర్నూలు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదన్నారు.నిజానికి ఈ విద్యాసంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించి ఉంటే కాలేజీకి 150 చొప్పున ఈ ఏడాది 750 సీట్లు అందుబాటులోకొచ్చేవి. ప్రైవేట్‌పై ప్రేమతో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతి ఇచి్చంది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం మూడో వంతే అందుబాటులోకొచ్చాయి. పులివెందులలో 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచి్చంది. ఇక ఉచిత వైద్యం ఊసుండదు ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్న లక్ష్యంతో రూ. 8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి, ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే లక్ష్యం. కాగా, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యా, వైద్యానికి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. పీపీపీ విధానంలో ప్రైవేట్ అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళితే ఉచిత వైద్యం ఊసే ఉండదని, పీపీపీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. బాబు హయాంలో ప్రైవేట్‌కు పచ్చజెండా గతంలో 1994 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం 2014–19 విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా వాటిలో చంద్రబాబు పాలనలో ఏర్పాటైనవి ఒక్కటీ లేదు. ప్రస్తుతం 18 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా 12 కళాశాలలకు చంద్రబాబు పాలనలోనే అనుమతులు లభించాయి. గతంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగినా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు బాబు కృషి చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ అనుకూల పరిస్థితులున్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో 17 కొత్త కాలేజీలు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదింటిని గతేడాది ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ పీపీపీ మోడల్ పేరిట కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. -
సాక్షి కార్టూన్ : 26-08-2024
-
ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన మేరకే కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు 2023 డిసెంబర్లోనే ప్రతిపాదనలు పంపింది. కీలకమైన విజయవాడ తూర్పు బైపాస్తోసహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..⇒ కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. ⇒ వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు⇒అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు⇒ విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.669కోట్లు⇒ చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రూ.325కోట్లు⇒ గన్నవరం సమీపంలోని గుండుగొలను ‘గామన్ జంక్షన్’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.150కోట్లు⇒ జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు -
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!
ఇంటి నిర్మాణం అనేది సుదీర్ఘ ప్రక్రియ. శ్రామిక శక్తితో కూడుకున్నది. చాలా మంది కార్మికులు నెలలు, సంవత్సరాల తరబడి పనిచేస్తే కానీ నిర్మాణం పూర్తవ్వదు. కానీ టెక్నాలజీ సాయంతో ఇంటి నిర్మాణం రోజుల్లోనే పూర్తవుతోంది.అన్నింటా ప్రవేశిస్తున్న రోబిటిక్ టెక్నాలజీ భవన నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. 105 అడుగుల (32 మీటర్లు) టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన రోబోటిక్ ట్రక్ ఆస్ట్రేలియా నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. హాడ్రియన్ ఎక్స్ గా పిలిచే ఈ ట్రక్కును రోబోటిక్స్ కంపెనీ ఎఫ్ బీఆర్ అభివృద్ధి చేసింది. ఆ యంత్రం రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇంటిని పూర్తి చేయగలదు. గత సంవత్సరం ఇది యూఎస్ఏ ఫార్మాట్లో గంటకు 500 ఇటుకలను పేర్చి తన పనితీరు ఏంటో చూపించింది.ఇటుకలతో కూడిన ప్యాలెట్ లను లోడ్ చేశాక ఈ రోబోటిక్ వెహికల్/కన్ స్ట్రక్షన్ ఆర్మ్ తన పనిని మొదలు పెడుతుంది. ప్యాలెట్ నుంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది. ఇక్కడ క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఇది సిమెంట్ లాగా పనిచేస్తుంది. మిశ్రమం అంటిన ఒక్కొక్క ఇటుకను రోబో ఆర్మ్ చక్కగా పేరుస్తూ నిర్మాణం పూర్తి చేస్తుంది. అధిక పొడవు కారణంగా మూడు అంతస్తుల ఎత్తుతో సైతం ఇది నిర్మాణాలను చేపడుతుంది.అమెరికాలో అతిపెద్ద కాంక్రీట్ బ్లాక్ సరఫరాదారుల్లో ఒకటైన సీఆర్‌హెచ్ పీఎల్సీ అనుబంధ సంస్థ ఎఫ్బీఆర్, సీఆర్‌హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్‌ను ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ బిల్డర్ తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లోని ఒక ఫెసిలిటీలో సైట్ అంగీకార పరీక్షను మొదట పూర్తి చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే, ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ ఐదు నుంచి 10 ఏక-అంతస్తుల గృహాలను నిర్మిస్తుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ‘చిల్లర రాజకీయాలు’ సహజమే!
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఏపీలో తెలుగుదేశం తీరు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన రుషికొండపై గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలపై వివాదం రేపుతున్న వైనం అల్ప బుద్ధిని చాటుతోంది తప్ప ఇంకొకటి కాదని చెప్పాలి. విశాఖపట్నానికి శిఖరాయమానమైన, బ్రహ్మండమైన భవంతులను నిర్మాణం అయినందుకు సంతోషించవలసిందిపోయి, ఈ రకంగా బురదచల్లడం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు. అత్యంత నాణ్యమైన రీతిలో చక్కని భవంతిని నిర్మించడం కూడా తప్పేనని తెలుగుదేశం చెబుతోంది.రుషికొండపై నిర్మితమైన ఈ ప్రాజెక్టు, అక్కడ ఉన్న పార్కు ప్రదేశం తదితర విశేషాలను టీవీలలో చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ముఖ్యమైన అతిధులు అక్కడకు వస్తే, వారు ఆ భవనాలలో బస చేస్తే ఎంతో గొప్ప పేరు వస్తుంది. ఎదురుగా సముద్రతీరం. కొండమీద సురక్షితమైన ప్రదేశంలో భవనాల నిర్మాణం వల్ల దేశం అంతటిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. విశాఖలో టూరిజం అభివృద్దికి కూడా ఇది మరింత దోహదపడుతుంది. ఇదే తరహాలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక భారీ భవనం నిర్మించి ఉంటే, అబ్బో ఎంత గొప్పగానో ప్రచారం చేసి ఉండేది. వారు అలా చేయలేకపోయారు కాబట్టి ప్రజలలోకి తప్పుడు సంకేతం తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ బురద చల్లుడు కార్యక్రమం జరిగింది. ఈ భవనం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సంబంధించిందేమో అనే అనుమానం కలిగేలా ప్రచారం చేశారు. నిజానికి అది టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం. అక్కడ దానిని టూరిజం ప్రాజెక్టుగా వాడుకుంటారా? లేక ముఖ్యమంత్రి బసకు వాడుకుంటారా? అనేది ప్రభుత్వం ఇష్టం. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినప్పుడు రుషికొండపై బస చేస్తే ఏపీకి ఎంతో గౌరవం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఆ భవనాలను దేనికి వినియోగించుకుంటారో చెప్పాలి కదా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించింది కనుక తాము ఆ భవనాలను వాడబోమని అంటారా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ అక్కడ తాత్కాలిక భవనాలను నిర్మించలేదు. శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగపడేలా నిర్మించారు.అదే అమరావతి రాజధాని ప్రాంతంలో 2014-2019 మధ్యచంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనాలను నిర్మించి ఎన్ని వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందన్న అంశం గురించి టీడీపీ నేతలు మాట్లాడే పరిస్థితి లేదు. సచివాలాయం, శాసనసభ భవనాలన్నిటిని తాత్కాలిక ప్రాతిపదికనే వందల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ భవనాల నిర్మాణంలోకానీ, ఇతరత్రా కానీ రెండువేల కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీటీడీ ప్రకటించింది. దానిపై టీడీపీ నేతలు వివరణ ఇస్తే బాగుంటుంది. అధికారం వచ్చింది కనుక అన్నీ తూచ్ అని చెప్పవచ్చు. కేంద్రంలో తమ కూటమి పవర్ లో ఉంది కనుక అన్నిటినీ తప్పించుకోవచ్చు. కానీ చరిత్ర ఎప్పటికి కనుమరుగు కాదు కదా!దీని సంగతి పక్కనబెడితే ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పలు గ్రాఫిక్స్ ను ప్రచారంలోకి తెచ్చింది. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం ఎలా జరుగుతుంది? శాసనసభ ఏ రూపంలో ఉంటుంది? సచివాలయం ఎన్ని అంతస్తుల టవర్ లో ఉంటుంది?మొదలైన వాటిపై తెలుగుదేశం మీడియాలో ఎన్నో కథనాలు వచ్చేవి. అవి చూస్తే ఇంత అధ్బుతంగా ఇక్కడ భవనాలు నిర్మించబోతున్నారా అనే చందంగా ప్రచారం జరిగేది. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన డిజైనింగ్ నిపుణులతో ప్లానింగ్ చేశామని చెప్పేవారు. అసెంబ్లీ భవనం ఒకసారి ఇడ్లీ పాత్ర షేప్ లో ఉంటుందని, మరోసారి ఇంకో రకంగా ఉంటుందని రకరకాల డిజైన్ లను ప్రచారంలోకి తెచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేసేవారు. వాటన్నిటిని ఏమని అంటారు. అవన్ని చంద్రబాబు నాయుడు సొంత భవనాలు కాదు కదా! రాజధాని కోసం ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టినవే కదా! అప్పుడేమని ప్రచారం చేశారు! చంద్రబాబు కాబట్టి అంత విజన్ తో మంచి డిజైన్లతో భారీ భవనాలను నిర్మిస్తున్నారని కదా చెప్పింది. అదే తరహాలో విశాఖలో మంచి ఆకృతితో కొన్ని భవనాలు నిర్మిస్తే టీడీపీ నేతలకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటో తెలియదు. అందులో అవకతవకలు జరిగాయని వారు చెప్పడం లేదు. భారీ వ్యయంతో నిర్మాణాలు జరిగాయని అంటున్నారు. విశాఖకు అది ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది వారు చూడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు మంచి పేరు రావడం ఇష్టం లేదు కనుక వారు అదేదో కనిపెట్టినట్లు అక్కడ గదులు అలా ఉన్నాయి.. హాల్ అలా ఉంది.. ఇలా ఉంది.. అంటూ విమర్శలు చేశారు.ఇంతకీ ఆ భవనాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వాడుకునేది మాత్రం చెప్పలేదు. రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న సమయంలో దానికి అడ్డు తగలడానికి టీడీపీకానీ, ఆ పార్టీ మీడియా కానీ చేయని ప్రయత్నం లేదు. అయినా రాష్ట్రానికి ప్రయోజనం, విశాఖకు మకుటంలా ఉంటుందని పట్టుదలతో ఆ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లోని సచివాలయంలో తన చాంబర్ ను ఎన్ని కోట్లతో అభివృద్ది చేశారో చెప్పగలరా! దానిని మూడునాళ్ల ముచ్చటగా ఎందుకు మార్చారో వివరించగలరా! అదొక్కటే కాదు. వందల కోట్ల విలువైన హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఎందుకు పాడుపెట్టారో తెలపగలరా?. అప్పట్లో జూబ్లిహిల్స్ లో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నందున వేరే ఇంటిలో ఉండడానికి ఎంత వ్యయం చేశారు. పార్క్ హయతోలో తన కుటుంబం కోసం తీసుకున్న సూట్ ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయింది. దీనిపై అప్పటి బీజేపీ నేత, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఏమని ఆరోపించింది గుర్తు చేసుకోగలరా? ముప్పై కోట్ల ఇందుకు వ్యయం చేశారని ఆయన అనేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ రుషికొండ భవంతి విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి బదులుగా వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియాలో టీడీపీ వారిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చారు కనుక మరింత బాధ్యతతో వ్యవహరించి పేరు తెచ్చుకుంటే మంచిది.తెలంగాణలో గత ప్రభుత్వ నేత కేసీఆర్ సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పించేవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవే సచివాలయ భవనాలను వాడుకుంటున్నారు. ఆ సదుపాయాలను వారు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నిర్మించిన ప్రగతి భవన్ పై కూడా అప్పట్లో చాలా వ్యతిరేక ప్రచారం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లని, అదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని ప్రజాభవన్ గా మార్చామన్నారు. అంతే తప్ప నిజంగానే బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లు ఉన్నాయో, లేదో ఇంతవరకు ప్రజలకు వివరించలేదు.ఆ రోజుల్లో కేసీఆర్ కు మద్దతు ఇచ్చిన ఈనాడు తెలంగాణ సచివాలయం అంత గొప్పగా ఉంది.. ఇంత గొప్పగా ఉంది అంటూ సచిత్ర కథనాలను ఇచ్చింది. విశాఖ భవనాలపై మాత్రం టీడీపీ మీడియా విషం చిమ్ముతోంది. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి పూనుకొన్నప్పుడు విపక్షాలు విమర్శలు చేశాయి. చివరికి కోర్టుకు కూడా వెళ్లాయి. కానీ ఆ భవనాన్ని భారీ ఖర్చుతో మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తర్వాత విమర్శలు ఆగిపోయాయి. రాజకీయాలలో ఇలాంటివి కామన్ గానే జరుగుతుంటాయి.అమరావతి రాజధానికోసం మూడు దశలలో లక్ష కోట్ల వ్యయం చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. తొలిదశలోనే నలభైఎనిమిదివేల కోట్లు పెడతామని అంటున్నారు. అంత వ్యయం ఓకే చోట పెట్టడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఊరుకునే పరిస్థితి లేదు. అదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ అని విమర్శలు వచ్చేవి. అలాంటి చోట్ల లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న తెలుగుదేశం నేతలు, విశాఖపట్నం నగరానికి మరింత ఘనత తెచ్చేలా భవనాలు నిర్మిస్తే దుమారం లేవదీస్తున్నారు. ఇదేకాదు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ ఫర్నీచర్ పై కూడా వివాదం చేయడం పద్ధతిగా లేదు. అంతా కలిపి ప్రభుత్వం మారి వారం రోజులు కాలేదు.. అప్పుడే ఫర్నీచర్ అందచేయలేదని వీరు ఆరోపించారు.గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని అసెంబ్లీ పర్నీచర్ ను తన కుమారుడి షాప్ లో పెట్టుకుంటే తప్పు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఫర్నిచర్ కు ఎంత బిల్లు అవుతుందో చెబితే చెల్లిస్తామని లేఖ రాస్తే తప్పట. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ నిరంతరం పనిచేయడానికి పూనుకుంటున్నట్లుగా ఉంది. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టం కనుక ఏదో ఒక చిల్లర వివాదం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ నేతలు ఇలాంటివి చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అందుకే కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని చెప్పాల్సి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పోలవరం.. దాచేస్తే దాగని నిజాలు
-
‘ప్రమాద సొరంగం’ వెలుపల ఆలయ నిర్మాణం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందం బౌఖ్‌నాగ్ దేవతను వేడుకున్నారట.గత ఏడాది నవంబర్‌లో సిల్క్యారా టన్నెల్లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్‌నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్‌లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
ముంపు ప్రాంతానికి రక్షణ కవచం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి, రివర్‌ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ముంపు సమస్య నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్‌నగర్, భూపేష్ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్‌కాలనీ, రామలింగేశ్వర్‌నగర్ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని తలంచారు. తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. ముంపు సమస్యకు పరిష్కారం ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవారు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్ వాల్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇన్చార్జి వరద ప్రాంతాలకు రక్ష కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్‌నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్ డిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రెండేళ్ల క్రితమే ఉత్తర రింగుకు సంబంధించి కసరత్తు ప్రారంభించి అలైన్‌మెంటు ఖరారు చేసినా, ఇప్పటివరకు టెండర్ల దశకు రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కదలిక వచ్చింది. 162 కి.మీ. నిడివి ఉండే ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం చెల్లింపు ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసేందుకు అంతా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఉత్తర భాగానికి సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 4 వరసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అవసరం ఉందని కేంద్రం తేల్చింది. ఈ భాగంలో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సొంతంగా భరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈ పీసీ) పద్ధతిలో టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థను గుర్తించాలని నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఏర్పాటు చేసే టోల్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మరో టెండరు పిలిచి కాంట్రాక్టు సంస్థను గుర్తించనుంది. కేంద్రమే టోల్ రుసుమును వసూలు చేసుకుంటుంది. బీఓటీ కాకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్! దక్షిణ భాగానికి వచ్చే సరికి ఈపీసీ టెండరింగ్‌కు వెళ్లొద్దని ప్రాథమికంగా నిర్ణయించింది. దాదాపు 180 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగాన్ని నిర్మించే ప్రాంతంలో ఉండే పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే దక్షిణ భాగం పరిధిలో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో అసలు దక్షిణ భాగానికి నాలుగు వరసల రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరకు రింగురోడ్డులా ఉండాలంటే రెండు భాగాలూ ఒకే తరహాలో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అయితే ఈపీసీ పద్ధతిలో కాకుండా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో దక్షిణ భాగానికి టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పద్ధతిలో.. నిర్మాణ సంస్థ సొంత నిధులతో రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధారిత కాలం ఆ రోడ్డుపై టోల్‌ను వసూలు చేసుకోవటం ద్వారా ఆ ఖర్చును రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పని తలకెత్తుకునేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితి నెలకొంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో టెండర్లు పిలవాలని భావి స్తోంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40% మొత్తాన్ని పది వాయిదాల్లో చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. వచ్చే జూన్, జూలైలలో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంటుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. -
ఎల్ అండ్ టీ ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్ అండ్ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్ ర్యాఫ్ట్ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్ అంటే భూగర్భంలోని కాంక్రీట్ నిర్మాణాలను ‘ఎక్స్‌రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన సెకెంట్ పైల్స్ లోపాలు? వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్ పైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్ పైల్స్‌ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ కసరత్తు చేసింది. జీపీఆర్ టెస్ట్‌ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్ ఓవర్సీస్కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు. 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్ డ్యామ్‌తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్ అండ్ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది. -
అయోధ్యలో మరో 13 నూతన ఆలయాలు
అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు. -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
పేదింటి పద్దు రూ.25 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్స రంలో రూ.25 వేల కోట్లు ప్రతిపాదించా లని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో ఆ ఇళ్లను నిర్మించగా, ఇప్పుడు రెండు పడగ్గదులతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం యూనిట్ కాస్ట్ ను రూ.5 లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన విష యం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది. దీంతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయా లని నిర్ణయించింది. వీటన్నింటికి కలిపి తొలి ఏడాదిలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనాకొచ్చింది. అధికారులతో ఉప ము ఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించి ప్రాథ మికంగా నిర్ణయించారు. దావోస్ పర్యటన కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకే రూ.20 వేల కోట్లు.. తొలి ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపడితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో తొలి సంవత్సరం రూ.వేయి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లను కేటాయించాలని లెక్కలు వేశారు. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2వేల కోట్లు గత ప్రభుత్వంలో మొదలై పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, త్వరలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న నేపథ్యంలో అందులో గృహనిర్మాణ పద్దు కింద ఎంత కేటాయిస్తుంది, ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి.. అన్న అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న భావనను కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. -
ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?
దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్‌లల్లా నూతన రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నూతన రామాలయాన్ని అత్యంత సుందరంగా, అంతకుమించిన వైభవోపేతంగా నిర్మించారు. అయితే ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ అస్సలు ఉపయోగించేలేదంటే మీరు నమ్ముతారా? అవి లేకుండా ఇంత భారీ ఆలయం ఎలా రూపుదిద్దుకుందనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని రామాలయం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమయ్యింది. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి.. అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఆలయ ప్రధాన నిర్మాణం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని బన్సీ పహర్‌పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమయ్యింది. ఈ గులాబీ రాయి బలంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది. ఈ రాళ్లతో ఆలయం అంతటినీ నిర్మించారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంటు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము, సిమెంట్ లేదా ఉక్కు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణం గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ఆలయ పునాదుల కోసం భూసార పరీక్షలు ప్రారంభించినప్పుడు, ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని, అది పునాదికి ఏమాత్రం అనువైనది కాదని తేలిందన్నారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)కంపెనీ, ఐఐటీ ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబే, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) నిపుణులు సంయుక్తంగా నేషనల్ జియోఫిజికల్ సర్వే పరిశోధనా సంస్థల (ఎన్జీఆర్ఐ)టాప్ డైరెక్టర్లు సహాయం కోరారు. 2020లో ఈ అంశంపై నిపుణుల మధ్య చర్చ జరిగింది. దీని తర్వాత అయోధ్యలోని ఆరు ఎకరాల ఆలయ భూమిలో 14 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు. దీని తరువాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి, ఖాళీ స్థలంలో ‘రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్’ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. ఈ కాంక్రీటు ఆ తరువాత రాయిగా మారుతుంది. ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీటును పునాది కోసం వినియోగించారు. ఈ విధంగా ఆలయ పునాది ఇనుము, సిమెంట్ లేకుండా నిర్మితమయ్యింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మిగిలిన ఆలయం నిర్మాణమంతా రాజస్థాన్‌లోని భరత్పూర్ నుండి తీసుకువచ్చిన గులాబీ ఇసుకరాయితో కొనసాగింది. అయితే 21 అడుగుల ఎత్తయిన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి కర్ణాటక, తెలంగాణ నుండి తెచ్చిన గ్రానైట్ ఉపయోగించారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో ఒక్క గ్రాము ఇనుము కూడా ఉపయోగించలేదు. దీనికి కారణం రామ మందిరాన్ని నాగర్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించడమే. ఈ శైలిలో ఇనుమును వినియోగించనవసరం లేదు. ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని మూడు శైలులలో నాగర్ శైలి ఒకటి. ఖజురహో, సోమనాథ్, కోణార్క్ సూర్య దేవాలయాలు నాగర్ శైలిలోనే నిర్మితమయ్యాయి. ఇప్పటికి అయోధ్యలో రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రామమందిర ట్రస్టుతోపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం! -
అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో ఐదు మండపాలు (హాళ్లు) ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం. దేవతా మూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. సింహద్వారం నుండి ప్రవేశించే భక్తులు 32 మెట్ల ద్వారా ఆలయం లోనికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహరీగోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ర్యాంప్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. 25 వేల మంది యాత్రికులకు సరిపడేలా సౌకర్యాల కేంద్రం (పీఎఫ్సీ)నిర్మిస్తున్నారు. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలు కల్పించనున్నామని ట్రస్ట్ తెలిపింది. ఇది కూడా చదవండి: Pran Pratishtha: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత? -
HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్‌పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్‌నగర్ వైపు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని పోలీసులు కోరారు. చదవండి: పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్ -
మూలపేట పోర్టు పనులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా !
-
అయోధ్య ధ్వజ స్థంభాల నిర్మాణం జరుగుతోందిలా..
నూతన సంవత్సరం రాకకు మరికొద్ది రోజులే మిగిలివున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. కంపెనీ ఎండీ భరత్ మేవాడ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని నూతన రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల తయారీ పని తమకు అప్పగించారని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 5,500 కిలోల బరువున్న ఒక ప్రధాన ధ్వజ స్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజ స్తంభాలు ఉన్నాయని భరత్ తెలిపారు. మరోవైపు రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. ఆలయ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి #WATCH | Gujarat: Construction of 7 flag poles for the Ram temple in Ayodhya is underway in Ahmedabad. (04.12) pic.twitter.com/GkPCQudVoq — ANI (@ANI) December 5, 2023 -
కాంగ్రెస్‌తో చీకటి రోజులే!
కాంగ్రెస్‌తో 58 ఏళ్లు గోసపడ్డం.. ఆ రాజ్యం మళ్లీ కావాలా? వాళ్లది ‘భూమేత’.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం ఎన్నికలు కాగానే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పూర్తి ఆటోరిక్షాలపై ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ రద్దు డబుల్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం.. మానకొండూరులో హుజూరాబాద్ తరహాలో దళితబంధు అమలు చేస్తామని హామీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఇల్లు కట్టిస్తాం రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కొందరికి అందలేదు. ఇకపై అలా ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఓ ప్రాజెక్టు తరహా టాస్‌్కగా తీసుకుని ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని మనిషి ఉండొద్దు. సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి అమలు చేస్తాం. ఆటోలపై ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ రద్దు దేశవ్యాప్తంగా ఆటోరిక్షాలకు ట్యాక్స్ ఉంటే.. తెలంగాణలో మినహాయింపు ఇచ్చాం. అయితే ఆటో ఫిట్నెస్ కోసం పోతే ఏడాదికి రూ.1,200 కట్టాలి. దీనిని కూడా ఎన్నికలు ముగియగానే రద్దు చేస్తాం. ప్రభుత్వానికి రూ.100 కోట్ల వరకు నష్టం వచ్చినా భరించి.. ఫిట్నెస్ ట్యాక్స్, పర్మిట్ ట్యాక్స్ రద్దు చేస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పాలన అంటే చీకటి రోజులేనని, ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటుంటే.. కాంగ్రెస్ వాళ్లు తెస్తమంటున్న ఆ దిక్కుమాలిన ఇందిరమ్మ రాజ్యం మనకు కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలని.. బాగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ నేతలు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నరు. ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఏం జరిగింది ఇందిరమ్మ పాలనలో మనకు తెలియ దా? కరువు కాటకాలు, ఆకలి చావులు, ఎమర్జెన్సీ, నక్సల్స్ ఉద్యమం, యువత అటవీబాట, ఎన్కౌంటర్లు.. ఇవే కదా అప్పుడు జరిగింది. అది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం. ఆ దిక్కుమాలిన రాజ్యంలో బలిసినోడు బలిసిండు. తిండికిలేనోడు లేనిలెక్కనే బతికిండు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ టీడీపీ పుట్టకపోయేది. రూ.2కు కిలోబియ్యం ఇచ్చే పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించాలి. ఆచరణ సాధ్యంకాని హామీలు, మోసపూరిత మాటలు చెప్తున్న పారీ్టలకు బుద్ధి చెప్పాలి. రైతాంగ సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణను నాడు ఆంధ్రలో కలిపి తీరని నష్టం కలిగించింది కాంగ్రెస్. వాళ్లకు తిరిగి అధికారమిస్తే కరువు కాటకాలు పునరావృతమవుతాయి. వెంటనే రెగ్యులరైజ్ చేస్తాం ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఉద్యోగం పోతదో తెలియని అభద్రతాభావంలో ఉంటే బిల్లు పాస్ చేశాం. గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఆగింది. ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాం. మూడోసారి అధికారంలోకి వస్తే.. ఆహార రంగానికి పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. నల్లగొండను పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నం నల్లగొండ జిల్లా వట్టికోట ఆళ్వార్‌స్వామి పుట్టిన జిల్లా. చైతన్యవంతమైన ఉద్యమాల గడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇక్కడ మంచినీళ్లు వచ్చే వి కావు. కరెంట్ ఉండేది కాదు. పోచంపల్లి చేనేత కార్మికుల ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు జరిగేవి. నేను నల్లగొండను దత్తత తీసుకున్న. పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నాం. రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు కళ్ల ముందు జరుగుతున్నాయి. రెండు దశాబ్దాలు పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలంలో మంచినీటి సమస్య, కరెంట్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక 3 మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది. మరింత అభివృద్ధి చేస్తా.. మానకొండూరులో అందరికీ దళితబంధు స్వాతంత్య్రం వచ్చాక దళితుల స్థితిగతులు మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. హుజూరాబాద్ తరహాలో మానకొండూరు నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందిస్తాం. నాది హామీ, నేను స్వయంగా వచ్చి ప్రారంభిస్తా. రసమయి బాలకిషన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ సభలో ఎంపీ పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.రాజయ్య.. మానకొండూరు సభలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ధరణి తీసేసి దళారులను తెస్తరట కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో కలిపి మళ్లీ దళారులను తెస్తమంటున్నరు. వారు తెచ్చే పథకం భూమాత కాదు భూమేత! మళ్లీ వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సంతకాలు, సర్టీఫికెట్ల పేరిట లంచాలు, దళారుల రాజ్యం వస్తుంది. పహాణీ కావాలన్నా రూ.లక్షకు రూ.40 వేలు వసూలు చేస్తరు. ఆలోచించాలి. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. రైతులు బాగుపడాలి. అందుకే నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం. కమ్యూనిస్టు సోదరులను కోరుతున్నా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. -
టీటీడీ నిధులతో నిర్మాణాలకు పెద్దపీట
తిరుమల: టీటీడీ నిధులతో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుంచి వకుళమాత ఆలయం వద్ద జాతీయ రహదారి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్లతో టెండర్ ఆమోదం. ఇది పూర్తయితే తిరుపతికి పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. ► ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.1.65 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులకు టెండర్ ఆమోదం. ► తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రుయా ఆస్పత్రిలో నూతన టీబీ వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్లతో టెండర్ ఆమోదం. ► స్విమ్స్ ఆస్పత్రిలో మరింత మంది రోగుల సౌకర్యం కోసం రూ.3.35 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో రెండు అంతస్తుల నిర్మాణానికి టెండరు ఆమోదం. ► స్విమ్స్‌లో నూతన కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి రూ.74.24 కోట్లతో టెండర్ ఖరారు. ► స్విమ్స్ ఆస్పత్రి భవనాల ఆధునికీకరణకు, పునర్నిర్మాణానికి రూ.197 కోట్లతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతికి ఆమోదం. మూడేళ్లలో దశలవారీగా చేపట్టేందుకు నిర్ణయం. ► నడక దారుల్లో భక్తుల భద్రత కోసం డిజిటల్ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఆమోదం. ► కరీంనగర్లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల పనులకు టెండర్ ఆమోదం. 23న విశేష హోమం ► శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం. ఇందుకోసం టికెట్ ధర రూ.1000గా నిర్ణయం. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు. ఈనెల 16న టీటీడీ ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు. ► టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం. ► తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ, శిల్పకళలో ప్రాథమిక శిక్షణ సాయంకాలం కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. -
మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం. మోకాలి గాయం అంటే.. క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్ లిగ్మెంట్ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్ లాంటి ఒక విధమైన సౌండ్ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఏసీఎల్ లిగ్మెంట్కి చికిత్స ఎలా అందిస్తారంటే.. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్ లిగ్మెంట్ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు. అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్తో జాయింట్ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. (చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!) -
గ్రామీణ రహదారులకూ మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే (హై ఇంపాక్ట్) మరో 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1,035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉండగా.. వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ షురూ! ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టినట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ బాలు నాయక్ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుందని.. నవంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గుర్తించిన హై ఇంపాక్ట్ కేటగిరీ రోడ్లకు ప్రభుత్వం ఆ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు కూడ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. -
సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం నేటికి మిస్టరీలే!
ఊహో..? అపోహో..? అంతకు మించిన అభూతకల్పనో..? తేల్చుకోలేని స్థితే అశాంతికి ఆలవాలం. అంధవిశ్వాసానికి ఆధ్యం. వాటి మధ్య నలిగిన జీవితాలు.. వాళ్లు వదిలి వెళ్లిన ఆనవాళ్లు.. తర్వాత తరాలను ఇట్టే బెదరగొడతాయి. అలాంటి ఉదంతమే ఇది. 1881 తర్వాత మొదలైంది ఈ కథ. అది అమెరికా, న్యూ హెవెన్ సమీపంలోని ఒక పెద్ద విల్లా. అందులో నివసించే 44 ఏళ్ల సారా వించిస్టర్కు పడుకునే ముందు పియానో వాయించి నిద్రపోవడం అలవాటు. ఆ రాత్రి అదే చేసింది. అయితే పన్నెండు దాటాక.. అదే పియానో మ్యూజిక్ అస్పష్టంగా వినిపించడం మొదలైంది. తుళ్లిపడి నిద్ర లేచిన సారా.. వెంటనే హాల్లోకి వెళ్లిచూడగానే.. ఆ మ్యూజిక్ ఆగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. ‘ఎవరది?’ అనే అరుపు ఆమెలోని భయాన్ని మభ్యపెట్టింది. అప్పుడే.. చిమ్మచీకటిలో హాల్‌కి ఆనుకుని ఉన్న స్టోర్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయ్యింది. ఆ అలికిడికి తిరిగి చూసిన సారా.. ధైర్యం తెచ్చుకుని.. దగ్గరకు వెళ్లి తలుపు క్లోజ్ చేయబోతుంటే.. అందులో ఉన్న ఊయల ఊగుతూ కనిపించింది. పసిపాప ఏడుపు, విచిత్రమైన ఓ నవ్వు ఆమెను వణికించాయి. అప్పటి నుంచి ప్రతిరాత్రి అదే ఉలికిపాటు. కొన్ని రోజులకు పియానో వాయించే మనిషి కూడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్నిసార్లు అది కలో.. నిజమో ఆమెకు అర్థమయ్యేది కాదు. అప్పటికే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ముసురుకున్నాయి. ∙∙ 1862లో ‘విలియమ్ విర్ట్ వించిస్టర్’ అనే ధనికుడ్ని వివాహం చేసుకున్న సారా.. తన మామగారు ఆలివర్ వించిస్టర్కి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేది. మొదట షర్ట్స్ కంపెనీ నడిపించే వించిస్టర్ కుటుంబం.. తర్వాత కాలంలో రైఫిల్స్ కంపెనీ (తుపాకుల వ్యాపారం) పెట్టి.. రెట్టింపు లాభాలు గడించసాగింది. గవర్నమెంట్ పర్మిషన్స్‌తో అఫీషియల్‌గానే కాదు.. రహస్యంగా కూడా చాలా గన్స్ అమ్మేది. సుఖశాంతులతో సాగిపోతున్న ఆ కుటుంబంలోకి సారా మరో శుభవార్తను మోసుకొచ్చింది.. తాను తల్లిని కాబోతున్నా అంటూ! పెళ్లి అయిన చాలా ఏళ్లకు కలగబోతున్న సంతానం కావడంతో.. ఆ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సారాకు ఆడపిల్ల పుట్టింది. పాపకి యానీ వించిస్టర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నెల రోజులకే ఆ పాప చనిపోయింది. ఆ విషాదం వించిస్టర్ కుటుంబాన్ని కోలుకోనివ్వలేదు. కొన్ని రోజులకే ఆలివర్ మరణించాడు. ఇంటి పెద్ద మరణించడంతో సారా, విలియమ్ కుంగిపోయారు. కొన్నాళ్లకు రైఫిల్ కంపెనీ లాభాలు తగ్గాయి. వ్యాపారం పతనం దిశగా సాగింది. కంపెనీ బాధ్యతలందుకున్న విలియమ్.. ఏడాది గడవకముందే (1881లో) మరణించాడు. దాంతో సారా మరింత కుంగిపోయింది. నిజానికి అక్కడితోనే ఆ కుటుంబంలో విషాదాలు ఆగిపోలేదు. విలియమ్ తర్వాత.. సారా అత్త, సారా తల్లి, సారా సోదరి ఇలా పలు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు చాలామంది మరణించారు. దాంతో సారాలో భయం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే సారాకు ఆత్మలు కనిపించడం మొదలుపెట్టాయి. తనకు ఎదురవుతున్న వింత అనుభవాల గురించి.. కొందరు శ్రేయోభిలాషులతో పంచుకుని, వారి సాయంతో.. పరిష్కారం కోసం కొంతమంది మాంత్రికుల్ని కూడా ఆశ్రయించింది. వారు ఆ ఇంటిని పరిశీలించి.. ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. ఇందులో నివసించడం మంచిది కాదని తేల్చేశారు. కొన్నినెలల పాటు శాంతిపూజలు చేయించినా ఫలితం లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. స్టోర్ రూమ్‌లో ఊగే ఊయల సారా పాపదే. ప్రతిరాత్రి పియానో వాయించేది సారా భర్తే. తనకు ఎదురుపడే అస్పష్టమైన ఆకారం తన భర్తేదేనని గ్రహించిన రాత్రే.. సారాకి చాలా విషయాలు తెలిశాయి. ఆ రాత్రి విలియమ్.. సారాను తీవ్రంగా హెచ్చరించాడట. ‘మనం అమ్మిన రైఫిల్స్ (తుపాకీలు) కారణంగా చనిపోయిన వారి ఆత్మలు మన ఇంటిని చుట్టుముట్టాయి. ఆత్మలన్నీ కలసి.. వించిస్టర్ కుటుంబాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటి దాకా జరిగిన మరణాలన్నీ (నాతో సహా) ఆ ఆత్మల వల్లే జరిగాయి. ఈ ఇల్లు వదిలి పారిపో.. మరెక్కడైనా ఇల్లు కట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాకుండా చూసుకో.. ఎప్పుడైతే ఇంటి నిర్మాణం పూర్తవుతుందో ఆ రోజే నీకు మరణం సంభవిస్తుంది’ అని చెప్పి విలియమ్ మాయమయ్యాడట. దాంతో సారా ‘న్యూ హెవెన్ను విడిచిపెట్టి.. కాలిఫోర్నియా వెళ్లిపోయింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఓ మూడేళ్లకు.. తనకు వారసత్వంగా వచ్చిన డబ్బుతో కాలిఫోర్నియాలోని శానోస్ సమీపంలో ఓ విశాలమైన స్థలాన్ని కొనుక్కున్నది. అక్కడ ఏడంతస్తుల భవనానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సుమారు పదహారుసార్లు.. కట్టిన గదులను కూలుస్తూ మళ్లీ మళ్లీ కట్టించింది. ఆ ఇల్లు.. ఆత్మలను గందరగోళంలోకి నెట్టేలా ఉండాలనేది సారా ఉద్దేశమట. 1906 నాటికి ఇంటికి ఓ అందమైన రూపం వచ్చినా.. ఆమె శాంతించలేదు. ఆ ఇల్లు కొన్నిసార్లు భూకంప ప్రభావాలకు కూలితే.. ఎక్కువ సార్లు సారా అభీష్టానికి కూలిపోయింది. గదులు, కిటికీలు, తలుపులు ఇలా అన్నీ పగిలేవి, విరిగేవి. సుమారు ఆమె మరణం వరకూ అంటే 1922 సెప్టెంబర్ దాకా ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. స్వయంగా తనే ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పలు మార్పులు చేసేదట. సుమారు 36 ఏళ్ల పాటు ఆ ఇంట్లో రకరకాల మార్పుచేర్పులు జరిగాయి. కొన్ని మెట్లు పైకప్పుకి మార్గమైతే.. కొన్ని తలుపులు కేవలం అడ్డు గోడల్ని చూపెడుతుంటాయి. అంటే మెట్లు ఎక్కి మరో అంతస్తుకు వెళ్తాం అనుకుంటే అక్కడ ఇంటి పైకప్పు తప్ప ఏం ఉండదు. కొన్ని చోట్ల తలుపులు తెరిస్తే అడ్డంగా నిర్మించిన గోడలు తప్ప మార్గం కనిపించదు. కొన్ని కిటికీలు గోడలకు కాకుండా సీలింగ్‌కి ఉంటాయి. సారా స్వయంగా ఆత్మలతో మాట్లాడేదని.. వాటికి క్షమాపణలు చెప్పేదని.. వాటిని శాంతపరచడానికే ఇంటికి పదే పదే మార్పుచేర్పులు చేసేదని ఆ ఇల్లు కట్టిన కార్మికులు కొందరు ప్రచారం చేశారు. భర్త, బిడ్డ చనిపోవడంతో ఆమెకు పిచ్చి పట్టిందని.. ఆస్తులుండటంతో అలా ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసిందని కొందరి అభిప్రాయం. అయితే వించిస్ట్టర్ బంధువులు మాత్రం.. ‘ఆమెకు ఆర్కిటెక్చర్ మీదున్న ఆసక్తికారణంగానే అన్నిసార్లు భవన నిర్మాణంలో మార్పులు చేసిందని.. ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచానికి వెల్లడించారు. ఏది ఏమైనా సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం రెండూ నేటికీ మిస్టరీలే. అంతేగాదు మిస్టరీ హౌస్‌లో.. ప్రస్తుతం నాలుగు అంతస్తుల నిర్మాణం మిగిలింది. 500లకు పైగా గదులు, 2 వేలకు పైగా తలుపులు, 10 వేలకు పైగా కిటికీలు, 50కి పైగా బెడ్ రూమ్స్, 13 బాత్ రూమ్స్, ఆరు కిచెన్ రూమ్స్, చాలా బాల్కనీల సువిశాలమైన ఆ భవనం.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. సంహిత నిమ్మన (చదవండి: ఆరుగంటలకు పైగా మంచులో కూరుకుపోయింది! బతికే ఛాన్స్ లేదు కానీ..) -
వైద్య విద్యకు శ్రీకారం.. 30 ఎకరాల్లో.. రూ.180 కోట్లు
మెదక్: మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లా త్వరలో వైద్య విద్యకు కేరాఫ్‌గా మారనుంది. స్పెషలిస్ట్‌లు లేక అత్యవసర వైద్యం కోసం ఇంతకాలం ఇతర ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజల కష్టాలు తప్పనున్నాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పాటు త్వరలో మెరుగైన వైద్యం స్థానికంగా అందనుంది. గత నెలలో సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీఓ విడుదల కావటంతో ఈ నెల 5న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కళాశాల పనులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో 400 బెడ్స్ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, బెడ్స్, వైద్యుల నియామకం చేపట్టి ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. వైద్యశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రస్తుతం మెదక్లోఉన్న మాతా, శిశు ఆస్పత్రి పక్కనే 30 ఎకరాల్లో వైద్య కళాశాలను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయించిన అధికారులు మెడికల్ కళాశాలతో పాటు వసతి గృహం పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిబంధన ప్రకారం మెడికల్ కళాశాలకు భవనంతో పాటు 400 బెడ్స్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్‌లో 150 బెడ్స్ ఉండగా క్రిటికల్ కేర్ కోసం మరో 100 పడకల ఆస్పత్రితో పాటు జిల్లా ఆస్పత్రిలో 250 బెడ్స్‌తో ఉండాలి. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేసినా మరో 50 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటైతే అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటవుతున్న మెడికల్ కళాశాలతో జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సీఎం కేసీఆర్ కృషితో.. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో మెడికల్ కళాశాల మంజూరైంది. వచ్చే ఏడాదిలో 100 మంది మెడికోలతో తరగతులు ప్రారంభిస్తాం. కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్ అన్ని రకాల వైద్యసేవలు.. మెడికల్ కాళాశాల ఏర్పాటుతో అన్నిరకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. అన్ని రకాల వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుతాయి. వైద్యం రంగంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. – చందూనాయక్, డీఎంహెచ్ఓ, మెదక్ -
ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా ఇండిగో
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అద్భుతమైన, అధిక పోటీతో కూడిన ఏవియేషన్ మార్కెట్ అని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇండిగో మరింత పెద్ద, మెరుగైన, ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. తనకంటూ సొంతంగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటున్నట్టు, ఇతర ఎయిర్‌లైన్ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని పట్టణాల నుంచి విదేశీ గమ్యస్థానాలకు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సరీ్వసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచి్చంది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. టికెట్ ధరలు కీలకం.. విమానాల నిర్వహణ వ్యయాలు, టికెట్ ధరల మధ్య సహ సంబంధం ఉండాలని, లేకపోతే విమానయాన సంస్థలు మనుగడ సాగించలేవని ఎల్బర్స్ అభిప్రాయపడ్డారు. ఇండిగో అందుబాటు ధరలపైనే దృష్టి సారించినట్టు చెబుతూ, సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా ఇవి పెరుగుతూ, తరుగుతూ ఉంటాయని వెల్లడించారు. ఇండిగో వృద్ధి దశలో ఉందన్నారు. అదే సమయంలో దేశంలో ఏవియేషన్ హబ్‌ల అవసరాన్ని ప్రస్తావించారు. సొంతంగా నెట్వర్క్ నిర్మించుకోవడంతోపాటు, ప్రస్తుత పట్టణాలను నూతన మార్గాలతో (భువనేశ్వర్–సింగపూర్ తరహా) అనుసంధానిస్తున్నట్టు పీటర్ ఎల్బర్స్ తెలిపారు. అలాగే, ఇతర ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలను కూడా పెంచుకుంటున్నట్టు వివరించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్õÙర్ భాగస్వామ్యాన్ని ఈ నెలలోనే ఇండిగో కుదుర్చుకోవడం గమనార్హం. -
సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతో అభిమానులను అలరించిన శాంతిస్వరూప్‌కు ఇండస్ట్రీలో జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. ఇటీవలే తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కల సాకారం కాబోతోంది అంటూ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. తన సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని వెల్లడించింది. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ..' సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల అమ్మ సర్జరీ కోసం పాత ఇంటిని అమ్మేశా. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కొందరు నా మంచి కోరేవారు కూడా ఉన్నారు. వారి సహకారంతోనే ఇంటిని నిర్మిస్తున్నా. కూకట్‌పల్లిలోని భూదేవిహిల్స్‌లో ఇల్లు ఉంటుంది. త్వరలోనే పూర్తి కానుంది. ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
అంబేడ్కర్ స్మృతివనానికి అదనంగా రూ.106 కోట్లు
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం అదనంగా మరో రూ.106 కోట్లు కేటాయించిందని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం స్మృతివనం పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారని, ఆయన నిరంతరం ఇక్కడ జరుగుతోన్న పనులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే స్మృతివనం పనులు 95% పూర్తయ్యాయని, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్మృతివనాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అంబేడ్కర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు వీలుగా డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయని, మిగిలిన అన్ని పనులూ శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. -
వ్యర్థాలతో వింత ఇల్లు.. నిర్మాణానికి 28 ఏళ్లు.. చూసేందుకు ఎగబడుతున్న జనం!
ఒక జంట 28 ఏళ్లు కష్టపడి ఒక విచిత్రమైన ఇంటిని నిర్మించింది. ఇప్పుడు జనం ఆ ఇంటిని చూసేందుకు క్యూ కడుతున్నారు. వీరు పురాతన, పనికిరాని వస్తువులతో ఈ ఇంటిని నిర్మించారు. ఆర్టిస్ట్ మైకల్, అతని భార్య లెడా లీవెంట్(టెక్స్టైల్ ఆర్టిస్టు) ఈ ఇంటి నిర్మాణాన్ని 1979లో ప్రారంభించారు. ఈ ఇంటికి వారు ఎలిఫాంట్ ఆర్ట్ హౌస్ అనే పేరు పెట్టారు. కాగా 2007లో మైకల్ మృతి చెందాడు. అతని భార్య లెడా లీవెంట్ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇంటి నిర్మాణం పూర్తికావడానికి 28 ఏళ్లు పట్టింది. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం ఈ వింత ఇల్లు అమెరికాలోని అరిజోనాలో ఉంది. ఈ ఇల్లు ఎంట్రన్స్ మొదలు అంతా వింతగా కనిపిస్తుంది. ఏదో గుహలోకి వెళుతున్న భావన కలుగుతుంది. రాతితో నిర్మించిన ఈ ఇల్లు రంగులమయంగా కనిపిస్తుంది. మూడు ఎకరాల్లో నిర్మింతమైన ఈ ఇల్లు 25 అడుగుల సీలింగ్ కలిగివుంది. ఇంటిలో అద్భుతమైన కిటికీలు ఏర్పాటు చేశారు. వెలుగు కోసం ఇంటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటి గోడలను సిమెంట్, రాళ్లు, చెక్క మొదలైన వాటితో నిర్మించారు. అయితే ఇంటిలోని నేల భాగమంతా సమతలంగా ఉండదు. అయితే దీని గురించి తాము ఆలోచించలేదని, ఒక గూడు కావాలని కోరుకుని ఈ అందమైన ఇంటిని నిర్మించామని లెడా తెలిపారు. ఇంటికి విద్యుత్, నీరు, ఫోను సదుపాయాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటిని చూసేందుకు వేలమంది వస్తుంటారని లెడా తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు -
స్వయంగా తీసుకెళ్లి సచివాలయమంతా చూపించి..
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఆలయంలో జరిగిన తొలి పూజలు, మసీదు, చర్చిలలో నిర్వహించిన తొలి ప్రార్థనల్లో ఇరువురు కలసి పాల్గొన్నారు. గవర్నర్ సచివాలయానికి తొలిసారి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా దగ్గరుండి ప్రత్యేకతలను చూపించారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా నల్ల పోచమ్మ ఆలయం, మసీదులను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ రెండింటితోపాటు చర్చిని కూడా కొత్తగా, విశాలంగా నిర్మించారు. శుక్రవారమే వాటిని ప్రారంభించి అందరినీ అనుమతిస్తున్నారు. చర్చిలో కేక్‌ను కట్ చేస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్ తదితరులు గవర్నర్‌ను ఘనంగా స్వాగతించి.. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆలయం, మసీదు, చర్చిల ప్రారంబోత్సవ ఏర్పాట్లు, సచివాలయ అంశాలపై ఉద్యోగ సంఘం నేతలతో కాసేపు మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకు మేళతాళాల మధ్య సీఎం, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి జరుగుతున్న చండీయాగం పూర్ణాహుతిలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. తర్వాత ఆలయంలో నల్ల పోచమ్మ అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. దీనికి అనుబంధంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ వాహనంలో వారు చర్చి వద్దకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై రిబ్బన్ కట్ చేసి చర్చిని ప్రారంభించారు. కేక్ కట్ చేసి బిషప్ డానియేల్‌కు, సీఎంకు అందించారు. తర్వాత బిషప్ ఆధ్వర్యంలో తొలి ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ ముఖ్యమంత్రికి జ్ఞాపికను బహూకరించారు. తర్వాత వారంతా పక్కనే ఉన్న మసీదుకు చేరుకున్నారు. అక్కడ ఇమాం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించాలని అసదుద్దీన్ కోరగా.. ‘‘రాష్ట్రంలో సోదరభావం ఇలాగే పరిఢవిల్లాలి. ఇందుకు ప్రభుత్వపరంగా మావంతు చొరవ చూపుతాం. కొత్త మసీదు అద్భుతంగా, నిజాం హయాంలో కట్టిన తరహాలో గొప్పగా రూపొందింది. ఇలా అన్ని మతాల ప్రార్థన మందిరాలు ఒక్కచోట ఏర్పాటైన తెలంగాణ సచివాలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి మసీదును ప్రారంభిస్తున్న తమిళిసై. చిత్రంలో హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు సచివాలయాన్ని గవర్నర్‌కు చూపిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. ఇప్పటివరకు గవర్నర్ అందులో అడుగుపెట్టలేదు. శుక్రవారమే తొలిసారిగా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రార్థన మందిరాల్లో కార్యక్రమాలు ముగిశాక సీఎం కేసీఆర్.. సచివాలయాన్ని తిలకించాలంటూ గవర్నర్ తమిళిసైని ఆహ్వనించారు. స్వయంగా దగ్గరుండి మరీ కొత్త భవనం ప్రత్యేకతలు, నిర్మాణంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఇతర అంశాలను వివరించారు. తన చాంబర్‌కు తోడ్కొని వెళ్లి అక్కడ శాలువాతో సత్కరించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా కావటంతో.. గవర్నర్‌కు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి కుంకుమ దిద్ది సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం వారంతా తేనీటి విందులో పాల్గొన్నారు. -
అన్ని అనుమతులతోనే రుషికొండ వద్ద నిర్మాణాలు
తిరుచానూరు(తిరుపతి జిల్లా): అన్ని అనుమతులతోనే విశాఖపట్నంలోని రుషికొండ వద్ద నిర్మాణాలు జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని చేయడం పవన్‌కళ్యాణ్‌కు, చంద్రబాబుకు ఇష్టం లేదని.. అందుకే అసత్య ప్రచారాలతో విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని పవన్‌ను డిమాండ్ చేశారు. రుషికొండ వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అడ్డుకోవడానికి గతంలో పవన్, చంద్రబాబు పార్టీలతో పాటు రఘురామకృష్ణంరాజు కోర్టులను ఆశ్రయించారని గుర్తు చేశారు. ఏ కోర్టు అయినా.. ఈ నిర్మాణాలు ఆపేయాలంటూ తీర్పులిచ్చాయా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు కంటే పవన్ ఏమైనా గొప్ప వ్యక్తా అని మండిపడ్డారు. రుషికొండ వద్ద నిర్మాణాలను హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షిస్తోందని చెప్పారు. కొండలపై ఇవి కనిపించలేదా పవన్? ‘కొండపై కట్టడమే పవన్‌కు సమస్య అయితే.. మరి విశాఖలో రామానాయుడు స్టూడియో ఎక్కడ ఉంది? ఐటీ టవర్స్ ఎక్కడ ఉన్నాయి.. వేంకటేశ్వరుని ఆలయం ఎక్కడ ఉంది?’ అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మీ ఇల్లు, మీ అన్న ఇల్లు కొండలపైనే ఉన్నాయి కదా? రామోజీ ఫిలింసిటీ కూడా కొండలు, గుట్టలపైనే కదా ఉంది. అప్పుడు పర్యావరణ విధ్వంసం గుర్తుకు రాలేదా?’ అని నిలదీశారు. టీడీపీ నేత బాలకృష్ణ అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ విశాఖలో రుషికొండ సమీపంలోనే గీతం యూనివర్సిటీ పేరుతో 40 ఎకరాలు కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. ఏడాదికి మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను రైతుల నుంచి చంద్రబాబు లాక్కున్నప్పుడు.. మాట్లాడకుండా హెరిటేజ్ ఐస్‌క్రీం తింటున్నారా అని పవన్‌పై మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే తమ నాయకుడు వైఎస్ జగన్ తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. కానీ కృష్ణా నది కరకట్టలో టీడీపీ అధినేత చంద్రబాబు నివసించిన అక్రమ నిర్మాణం గురించి ఏనాడైనా ప్రశ్నించావా అని పవన్‌ను రోజా నిలదీశారు. చంద్రబాబు తన అధికార, అనధికార, సొంత నివాసాలకు మరమ్మతుల పేరుతో రూ.184.58 కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. -
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
పేద విద్యార్థులకు చేరువగా వైద్య విద్య
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణం చరిత్రాత్మకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మెడికల్ కళాశాలను శుక్రవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో 64 ఎకరాల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వెచ్చించి.. త్వరలోనే 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల్లో సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కళాశాలల్లోనూ, ఆపై ఏడాది మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లోనూ అకడమిక్ ఇయర్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. కనీసం ఆస్పత్రులనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ శూన్యమన్నారు. ఆస్పత్రుల్లో మందులనైనా ప్రజలకు అందుబాటులోకి తెద్దామన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైద్య రంగానికి సంబంధించి దాదాపు 50,000 ఉద్యోగాలిచి్చన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మరో 3,000 పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. రైతులపై చంద్రబాబుది మొసలికన్నీరేనని ధ్వజమెత్తారు. రైతును రారాజుగా చూస్తోంది, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వమేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, వైఎసార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ పేర్ని కిట్టు పాల్గొన్నారు. -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్‌ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్‌లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్‌లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్‌కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్‌కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్‌లాలా దర్శనభాగ్యం!
ఉత్తరప్రదేశ్‌లోని ఆయోధ్యలోగల రామజన్మభూమిలో ప్రతిష్టాత్మకంగా రామాలయం నిర్మితమవుతోంది. ఈ నిర్మాణ పనులలో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యింది. ఫస్ట్‌ఫ్లోర్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లోర్ పనులు 2024 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి ఫ్లోర్‌కు సంబంధించి పిల్లర్లు నిలబెట్టే పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి 14 నుంచి 24 వరకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరగనున్నాయి. 2024 జనవరి నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనభాగ్యం కలుగనుంది. 166 స్తంభాలపై వివిధ దేవీదేవతా మూర్తుల విగ్రహాలు తాజాగా మందిర నిర్మాణ సమితి ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు వివరాలు వెల్లడించింది. నేటివరకూ భద్రతాకారణాల రీత్యా మీడియాను కూడా ఆలయ నిర్మాణ పరిసరాల్లోకి అనుమతించలేదు. ఆలయ నిర్మాణంలో ఇప్పటికే గర్భగృహం పూర్తయ్యింది. దీనిలోని గల 166 స్తంభాలపై వివిధ దేవీదేవతా మూర్తుల విగ్రహాలను తీర్చిదిద్దే పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ మండపంలో తలుపులు, స్తంభాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ ఈ నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం ఫస్ట్‌ఫ్లోర్ నిర్మాణ పనులు డిసెంబర్ 2024 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. పిల్లర్ల రూపకల్పనలో పలువురు కళాకారులు రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని 166 స్తంభాలపై ప్రస్తుతం దేవీదేవతా శిల్పాలను చెక్కుతున్నారు. ప్రదక్షిణ మార్గంలోని ఈ స్థంభాలకు అద్భుతమైన రూపాన్ని ఇస్తున్నారు. ఇందుకోసం చేతి కళాకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. 10 మంది కళాకారులు పిల్లర్ల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఆలయ ట్రస్టు సభ్యుడు డాక్టర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం విగ్రహాలు తీర్చిద్దేపనిని పనిని వేగంగా పూర్తి చేసేందుకు కళాకారుల సంఖ్యను పెంచుతామన్నారు. ఆలయం కింది అంతస్తులో గల ఉన్న గర్భగుడిలో 2024 జనవరిలో రాంలాలా దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలయంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే.. మార్బుల్ ఫ్లోర్ నిర్మాణ పనులకు సన్నాహాలు నిపుణులైన శిల్పుల బృందాలు రాంలాలా విగ్రహాన్ని రూపొందిస్తున్నాయని డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. 2023 అక్టోబర్ నాటికి ఆలయ కింది అంతస్తు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మార్బుల్ ఫ్లోర్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికితోడు ఆలయ లైటింగ్, ఆధునిక మరుగుదొడ్లు, విద్యుత్ కేంద్రాలు, ఆలయ ప్రాకారం, ప్రయాణికుల సౌకర్యాల కేంద్రం తదితర నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. श्री राम जन्मभूमि मंदिर के प्रथम तल पर चल रहा निर्माण कार्य Construction work going on as per schedule on the first floor of Shri Ram Janmabhoomi Mandir. pic.twitter.com/Qh86K3v0ou — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) July 8, 2023 ప్రధాన రహదారి మార్గంలో పింక్ స్టోన్ టైల్స్ రామజన్మభూమి ఆలయాన్ని నేరుగా అనుసంధానిస్తూ శ్రీరామ జన్మభూమి మార్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్డుపై అందంగా డిజైన్ చేసిన పింక్ స్టోన్ టైల్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు టెంపుల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సుగ్రీవ కోట గుడి పక్కనుంచి వెళ్లే ఈ రహదారిలో అందమైన లైటింగ్ స్థంభాలు ఏర్పాటు చేస్తున్నారు. రామ మందిరాన్ని సందర్శించడానికి ఇదే ప్రధాన ప్రవేశ మార్గం. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి.. भव्य और दिव्य श्री राम मंदिर का निर्माण कोटि-कोटि हिंदुओं के पुण्यों की फलश्रुति है। pic.twitter.com/uSz7ItxAJx — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) May 15, 2023 -
తండ్రి అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చుతో.. బ్రిడ్జ్ నిర్మాణం..
మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంబాలని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులనో తిట్టుకుంటూ కూర్చొంటారు. కొంతమంది కాస్త ముందడుగు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా చేయడం వంటివి చేస్తారు. ఆ తర్వాత షరామాములే! ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు. కానీ ఇక్కడొక వ్యక్తి అన్ని రకాలుగా యత్నించి అవ్వకపోయినా వెనుదిరగక..వ్యక్తిగత ప్రయత్నంతో తమ ఊరికి ఎదురైన సమస్యకు చెక్‌పెట్టి శభాష్ అనిపించుకున్నాడు సుధీర్ ఝా. తండ్రి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రజల మేలు కోసం ఉపయోగించి ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించాడు. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హాయిగా ఉండొచ్చు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. దీంతో పెద్దాయన మహదేవ్ ఝూ తమ గ్రామ పరిస్థితిని చూసి చలించిపోయి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు మహాదేవ్. జీవిత చరమాంకంలో ఉన్న ఆయనకు తనవల్ల ఇది సాధ్యం కాదని తెలుసు. తన సంకల్పం ఎలగైనా నెరవేరాలి. తన ఊరికి మంచి జరగాలి ఇదే ఆ పెద్దాయన ఆశయం. దీంతో మహదేవ్ .. "ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి" అని కుటుంబ సభ్యులను కోరాడు. అది తన కల .. చివరి కోరిక అని వారికి చెప్పాడు. మహాదేవ్ అ్నట్లుగానే కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్ ఝా మరణించాడు. కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహదేవ్ ఝూ అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్ ఝా అలియాస్ సుధీర్ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా లెక్కచేయక దీక్షతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి..ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు. తమ సమస్య తీరడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరిగిందని మహదేవ్ ఝా సోదరుడు మహవీర్ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి తిడుతూ కూర్చొకుండా..వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని మహదేవ్ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయుడిగా మహదేవ్ ఈ సమాజానికి ఓ గొప్ప పాఠాన్ని నేర్పారు. (చదవండి: ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని కాలుపై కాలు వేసుకుని కూర్చొన్నారో.. అంతే సంగతి!) -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మరోసారి టీడీపీ పెద్దలకు పేదలే లక్ష్యం..
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు దక్కకుండా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి విఫలమైన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇప్పుడు మరోసారి ఆ పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు పేదలు సిద్ధమవుతున్న తరుణంలో.. అడ్డుకునేందుకు మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ తమకు అనుకూలురైన వారిచేత పిటిషన్ వేయించారు. ఇందులో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగత హోదా లో ప్రతివాదిగా చేర్పించి, ఆయనపై పలు నిందారోపణలు చేయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకటజ్యోతిర్మయి ధర్మాసనం విచారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మినహా మిగిలిన ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, భూ కేటాయింపు కమిటీ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్... అలాగే రాజధాని ప్రాంతంలో పేదల కోసం ఏర్పాటు చేసిన ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందా? లేక ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతినిచ్చిందా? పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా అనుమతినిచ్చిందా? అన్న విషయంలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. అప్పుడు అలా.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఆర్డీఏ చట్ట నిబంధనలు చెబుతున్నా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో చట్ట నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో 1,402 ఎకరాల్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఏకంగా ఆర్ 5 జోన్‌ను సృష్టించింది. పేదల కోసం ఆ భూములను సీఆర్డీఏ నుంచి కొనుగోలు చేసింది. ఈ భూముల్లో 50,793 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. తమ ప్రాంతంలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో వారికి పట్టాలు రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించారు. అయినా కూడా టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. పేదలకు ఇళ్లస్థలాల మంజూరు అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నొక్కి చెప్పడంతో పట్టాల మంజూరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం విజయవంతంగా పేదలకు పట్టాలు పంపిణీ చేసింది. పేదలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్రం అనుమతులు సైతం మంజూరు చేసింది. దీంతో ఖంగుతున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు పేదల స్థలాల్లో చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇలా.. ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సవాలు చేసిన విధంగానే ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని, 1,402 ఎకరాల బదలాయింపు జీవోలను కూడా తాజా పిటిషన్లోను సవాలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
పోర్చుగల్‌లో ఈ ఇళ్లు చాలా ఫేమస్.. అంతలా ఏముందంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శిలాగృహం. అలాగని ఇదేదో రాతియుగం నాటిది కాదు. అచ్చంగా ఆధునిక కాలంలో నిర్మించినదే! ఇది పోర్చుగల్‌లోని గిమెరెస్‌లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్ ఫామ్‌హౌస్‌లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు. విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి నానాటికీ ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్‌హౌస్‌ను నిర్మించుకుని తరలిపోయాడు. ఇందులోని ఫర్నిచర్‌ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్‌లో పర్యాటక ఆకర్షణగా మారింది. -
స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..
ఓ సాధారణ రైతు పాఠశాల నిర్మించడానికి తన ఆస్తిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా బీహ్పూర్ బ్లాక్‌లో కహర్పూర్ గ్రామానికి చెందిన సుబోధ్ యాదవ్ అనే రైతు స్కూల్ నిర్మించేందుకు తన భూమిని దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. 2020లో కోసి నది నీటి మట్టం పెరగడంతో పాఠశాల మునిగిపోయింది. దీంతో విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ గ్రామంలో ఉన్న ఏకైక పాఠశాల అదే. దీంతో బిహార్ ప్రభుత్వం పాఠశాల పూర్తిగా దెబ్బతినడంతో కొత్త పాఠశాల నిర్మించడం కోసం స్థలం వెతకడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న యాదవ్ తల్లి చడికా దేవి తన కూమారుడిని ఆస్తిలో కొంత ప్రభుత్వానికి దానంగా ఇవ్వమని కోరింది. దీంతో పక్కా పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి తన 15 సెంట్ల భూమిని ఆ పాఠశాల నిర్మాణం కోసం దానంగా ఇచ్చాడు. ఆ భూమి విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు భాగల్పూర్ డీఈవో మాట్లాడుతూ..పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తి పేరు పెట్టాలని అనుకున్నామని, కానీ అతడు తన తల్లి పేరు పెట్టాలని అభ్యర్థించినట్లు తెలిపారు. సదరు రైతు యాదవ్ కూడా ఈ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఈ పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తిగా తన తల్లి సదా గుర్తించుకుంటారని ఆనందంగా చెబుతున్నాడు. (చదవండి: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
అప్సర కేసులో పోలీసులు కీలక నిర్ణయం సాయి కృష్ణను..!
-
విజయనగరంలో శరవేగంగా మెడికల్ కాలేజ్ భవనం నిర్మాణం
-
ముంబైలో శ్రీబాలాజీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ
తిరుపతి కల్చరల్: నవీ ముంబైలోని ఉల్వేలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీవేంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తం గా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘వేంకటరమణా గోవిందా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. నవీ ముంబైలో తిరుపతి బాలాజీ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడం మహారాష్ట్రకు మరుపురాని రోజు అని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి మనల్ని ఆశీర్వదించడానికి తిరుమల బాలాజీ నవీ ముంబైలో కొలువుదీరబోతున్నారని తెలిపారు. ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ బ్రిడ్జిని త్వరలో మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన బాలాజీ ఆలయాన్ని తిరుమల ఆలయం తరహాలో నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించారని తెలిపారు. ఆలయ నిర్మాణ ఖర్చును రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా భరిస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని అత్యంత వేగంగా నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యుడు మిలిందర్ నర్వేకర్, ఆమోల్ కాలే, రాజేష్‌శర్మ, సౌరభ్ బోరా, సిడ్కో వీసీ డాక్టర్ సంజయ్ ముఖర్జీ, టీటీడీ ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
సొంత ఇల్లు కట్టుకోగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది..!
-
ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
-
భూమిపై అసాధారణ నిర్మాణాలు
-
కరీంనగర్లో శ్రీవారి ఆలయం.. టీటీడీ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో..
కరీంనగర్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కరీంనగర్ లో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జి.భాస్కర్రావులకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అదే రోజు శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం ఈనెల 31న ఉదయం 7.26 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించేలా శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, త్వరలోనే వినోద్‌రావు, భాస్కర్‌రావుతో కలిసి తిరుమలకు వెళ్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవేంకటేశ్వరసామి ఆలయం అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే? -
గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి: కొడాలి నాని
సాక్షి, కృష్ణ: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి అయినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. గ్యారెజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(సోమవారం) బస్టాండ్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వచ్చే నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. పులివెందుల తర్వాత రూ. 20 కోట్లతో బస్టాండ్ నిర్మిస్తున్నది గుడివాడలోనే అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నేత చంద్రబాబు నాయడుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ మేరకు కొడాలి నాని మాట్లాడుతూ.. తండ్రి కొడుకులు మాట్లాడితే గుడివాడ మాదే అంటారు. అసలు ఏం చేశారని ఫైర్ అయ్యారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టి గుడివాడ దాహార్తిని తీర్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడలో ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదని ఎద్దేవాచేశారు. సీఎం జగన్ చొరవతోనే ఆ పనులు మొదలు పెట్టామని చెప్పారు. మాటిమాటికి గుడివాడ నాదే అని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతాడన్నారు. ఆనాడు వైఎస్ఆర్ చలువతో సేకరించిన 77 ఎకరాల్లోనే పేదలకు ఇళ్లు కడుతున్నాం అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి జగన్ రూ. 540 కోట్లు కేటాయించాం. అలాగే చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలను గాలి కొదిలేశాడని మండిపడ్డారు. దాదాపు 2300 ఆర్టీసీ కుటుంబాలను గాలికొదిలేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనకు తన కులానికి చెందిన వాళ్లే ముఖ్యం. ప్యాకేజ్ పడేస్తే పక్క రాష్ట్రం నుంచి వాళ్లే కావాలి అంటూ రజనీ కాంత్‌ని ఉద్దేశించి చురకలంటించారు. అయినా రజనీకాంత్ మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటాడని విమర్శించారు. ఈ చంద్రబాబు మంగళవారం వస్తే కనబడడని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్తాడని అన్నారు. అసలు ఏ విషయం పరంగా చూసిన జగన్‌కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కొడాలి నాని ఘాటుగా విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘పవన్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీకాంత్ రంగంలోకి!’) -
జగనన్న లేఔట్లు : ఇవీ ఆధారాలు, నమ్మకండి అవాస్తవాలు
కంకిపాడు (పెనమలూరు): జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సకల హంగులు సమకూరుతుండటంతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలతో లే అవుట్లు కాస్తా ఊళ్లను తలపిస్తున్నాయి. పేదలకు కేటాయించిన లే అవుట్లు కార్పొరేట్ సంస్థలు నిర్మించే లే అవుట్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు నిధులు కేటాయింపులు, పరిపాలనా ఆమోదం లభించాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 670 లే అవుట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 93,245 గృహాలు మంజూరు చేయగా, 91,250 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది నాటికి 13వేల గృహాలు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా 14,023 గృహాలు పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేయటంతో జిల్లా ప్రథమస్థానం దక్కటం తెలిసిందే. ఇప్పటి వరకూ రూ. 362.15 కోట్ల సొమ్మును లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం చెల్లింపులు చేశారు. వేగంగా వసతుల కల్పన.. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా జగనన్న లే అవుట్లు (జగనన్న కాలనీలు)లో వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయా లే అవుట్ల మెరక పనులు, అంతర్గత రహదారులు, విద్యుదీకరణ పనులకు ఇప్పటికే రూ. 82.66 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో కాలనీలకు విద్యుత్ వసతి, రహదారి వసతి సమకూరింది. మెరక పనులతో ముంపు సమస్య నుంచి లబ్ధిదారులకు ఊరట లభించింది. తాగునీటి వసతుల కల్పనకు గానూ రూ. 64.88 కోట్లు నిధులు వెచ్చించి వసతులు కల్పించారు. దీంతో నివేశనస్థలం కేటాయించిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ముతో పాటుగా డ్వాక్రా మహిళలకు రూ. 35 వేలు, సీఐఎఫ్ కింద రూ. 35 వేలు, ఉన్నతి పథకం కింద రూ. 50 వేలు రుణాలను బ్యాంకుల నుంచి అందిస్తుండటంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా జగనన్న లే అవుట్లు వసతులతో కూడిన ఊళ్లను తలపిస్తున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా.. పేదలకు కేటాయించిన జగనన్న లే అవుట్లలో వసతుల కల్పనతో పాటుగా కార్పొరేట్‌కు దీటుగా కాలనీలను తయారు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆయా కాలనీలకు ఆకర్షణీయంగా కార్పొరేట్ సంస్థలు నిర్మించే రియల్ వెంచర్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో తొలి విడత 63 లే అవుట్లలో స్వాగత ద్వారాల ఏర్పాటుకు రూ. 2.90 కోట్లు నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించటంతో గృహనిర్మాణ సంస్థ ఆర్చ్‌ల నిర్మాణ పనులపై దృష్టి సారించింది. వారంలో పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అయ్యింది. సకల వసతులు కల్పిస్తున్నాం.. జగనన్న లే అవుట్లను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటికే 15వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో 23 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. వసతుల కల్పనలో రాజీ పడకుండా సమర్థంగా పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నాం. స్వాగత ద్వారాల పనులు వారంలో ప్రారంభమవుతాయి. – జి.వి.సూర్యనారాయణ, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ, కృష్ణాజిల్లా -
రిషికొండలో అనుమతులకు లోబడే నిర్మాణాలు
-
రుషికొండలో ఉల్లంఘనల్లేవ్
సాక్షి, అమరావతి: రిసార్ట్ ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా విశాఖలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సంయుక్త కమిటీ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నివేదికను కమిటీ బుధవారం హైకోర్టుకు సమర్పించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతించిన మేరకు 9.88 ఎకరాల ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ రుషికొండ రిసార్ట్ ప్రాజెక్టు భవనాలను చేపట్టిందని తెలిపింది. వ్యక్తిగత భవనాల ప్రదేశాల్లో స్వల్ప మార్పులు మినహా ఎలాంటి ఉల్లంఘనలు లేవని కమిటీ తేల్చింది. మొత్తం 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకులు నిర్మించాలని టూరిజం డెవలప్మెంట్ అథారిటీ (ఏపీటీడీసీ) ప్రతిపాదించింది. 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకుల నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతించినా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితం చేసిందని కమిటీ పేర్కొంది. వాస్తవంగా సీఆర్‌జెడ్ అనుమతి మేరకు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే 2.71 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.84 ఎకరాల్లో అంటే 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితమైనట్లు కమిటీ వివరించింది. మొత్తం 9.88 ఎకరాల ప్రాజెక్టులో 3.86 ఎకరాల్లో ఉన్న వాలు ప్రాంతంతో పాటు 4.225 ఎకరాలున్న మట్టి డంప్ ప్రాంతాన్ని కమిటీ పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం దాదాపుగా సరిపోతున్నట్లు కమిటీ పేర్కొంది. మట్టిడంప్ ప్రాంతమే అథారిటీ పేర్కొన్న దాని కన్నా కొంచెం ఎక్కువగా ఉందని, అయితే నిర్మాణం పూర్తయిన తరువాత డంప్ చేసిన మట్టిని తొలగిస్తారని కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర పర్యావరణ శాఖ ముందస్తు అనుమతి లేకుండా భూ వినియోగ నమూనాలు, ప్రతి బ్లాక్‌లో బిల్డ్ అప్ ఏరియాతో ఉన్న బ్లాకుల సంఖ్యలో సవరణలు చేసిందని కమిటీ వ్యాఖ్యానించింది. అయితే ఏపీటీడీసీ బిల్డప్ ఏరియాను తొలుత ప్రతిపాదించిన 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణం నుంచి 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణానికే నాలుగు బ్లాకులకే కుదించిందని కమిటీ పేర్కొంది. ఇందులో భూ వినియోగ విధానంలో ఎటువంటి మార్పులు లేవని, ఆమోదించిన బిల్డ్ అప్ ఏరియాలో నిర్మించిన ప్రాంతం సరిగానే ఉందని కమిటీ తెలిపింది. తొలుత 15,364 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినట్లు అంకెల్లో పొరపాటు దొర్లిందని పేర్కొంది. 13,542 చదరపు మీటర్లలో నిర్మాణాలు, ఆమోదించిన ప్రాంతంలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తయ్యాక డంప్ తొలగింపు రుషికొండకు దక్షిణం వైపున సీఆర్‌జెడ్–2 ప్రాంతంలో తవ్విన మట్టిని ఏపీటీడీసీ డంప్ చేస్తున్నట్లు కమిటీ పరిశీలనలో తేలిందని పేర్కొంది. అయితే ఇది మెటీరియల్ తాత్కాలిక నిల్వ కోసం ఉద్దేశించినందున అభ్యంతరకరం కాకపోవచ్చని తెలిపింది. పాక్షికంగా ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ పనుల కోసం దీన్ని వినియోగిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఏవైనా ఉంటే ఆ స్థలం నుంచి తొలగిస్తారని పేర్కొంది. మొత్తం మీద కోస్టల్ రెగ్యులేషన్ జోన్, పర్యావరణ శాఖ అనుమతుల్లో పేర్కొన్న షరతుల ప్రకారమే ఉన్నాయని, ఎటువంటి ఉల్లంఘనలు లేవని కమిటీ స్పష్టం చేసింది. -
ఇండోనేసియాకు కొత్త రాజధాని.. రాజధానిని మార్చిన దేశాలివే..!
ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతోంది. బోర్నియో ద్వీపంలో నుసంతర పేరిట కొత్త రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. ఈ కొత్త రాజధాని జకార్తాకు ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో బోర్నియో ద్వీపంలో పచ్చని అటవీ ప్రాంతమైన కాలిమాంటన్లో కొలువుదీరనుంది. దీన్ని కాలుష్యరహిత, సతత హరిత నగరంగా రూపొందిస్తున్నారు. అయితే దీనిపై పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతంలో అటవీ సంపద తరిగిపోయి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతుందని, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వారంటున్నారు. జకార్తా ఇసుకవేస్తే రాలనంత జనాభాతో కిటకిటలాడుతోంది. రాజధానిలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. మెట్రోపాలిటన్ ప్రాంతాన్నీ కలిపితే 3 కోట్ల దాకా ఉంటారు. భరించలేని కాలుష్యం రాజధాని వాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో జకార్తా అగ్ర భాగంలో ఉంటోంది. ఇక అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2050 నాటికి జకార్తాలో మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది. దీనికి తోడు ఇండోనేసియాకు భూకంపాల ముప్పు ఉండనే ఉంది. అన్నింటి కంటే రాజధాని మార్పుకు మరో ముఖ్య కారణం అడ్డూ అదుపు లేకుండా భూగర్భ జలాల వెలికితీయడం. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఏటా 450 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లితోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తా నుంచి బోర్నియోకు రాజధానిని మార్చేయాలని అధ్యక్షుడు జోకో విడొడొ గతేడాది ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? కొత్త నగర నిర్మాణ ప్రాంతం అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆలవాలం. ఇప్పుడు వాటి ఉనికి ప్రమాదంలో పడనుంది. నగర నిర్మాణానికి చెట్లను కూడా భారీగా కొట్టేస్తున్నారు. రాజధాని కోసం ఏకంగా 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేవే. పైగా ఈ అడవుల్లో దాదాపుగా 100 గిరిజన తెగలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ పునరావాసం, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అన్నీ సరిగ్గా అమలయ్యే అవకాశం లేదన్న ఆందోళనలున్నాయి. రాజధానిని మార్చిన దేశాలివే..! గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధానుల్ని మార్చాయి... ► రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్ 1960లో రియో డిజనిరో నుంచి బ్రెసీలియాకు మార్చింది. ► 1991లో నైజీరియా లాగోస్ నుంచి అబూజాకు రాజధానిని మార్చుకుంది. ► 1997లో కజకిస్తాన్ కూడా అల్మటి నుంచి నూర్–సుల్తాన్‌కు రాజధానిని మార్చింది. కానీ ఇప్పటికీ అల్మటీయే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ► మయన్మార్ రంగూన్ నుంచి రాజధానిని నేపిడాకు మార్చింది. కొత్త రాజధాని ఎలా ఉంటుంది? కొత్త రాజధాని నిర్మాణాన్ని అధ్యక్షుడు విడొడొ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సుస్థిర నగరంలో అందరూ కొత్త జీవితాల్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్‌తో హరిత నగరాన్ని నిర్మించనున్నారు. నగరంలో 65% ప్రాంతంలో ఉద్యానవనాలే ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని స్మార్ట్ నగరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. సౌర విద్యుత్, జల సంరక్షణ విధానాలు, వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ కొత్త సాంకేతిక హంగులతో ఉంటాయి. ప్రస్తుతానికి ఐదు గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది 184 ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్‌తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాం. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్య్ర దిన వేడుకలను కొత్త రాజధానిలో జరిపేలా సన్నాహాలు చేస్తున్నాం. – బాంబాంగ్ సుసాంటొనొ, నుసంతర నేషనల్ కేపిటల్ అథారిటీ చీఫ్ అధ్యక్ష భవనం నమూనా కొత్త రాజధాని నిర్మాణ అంచనా వ్యయం: 3,200 కోట్ల డాలర్లు రాజధాని నిర్మాణంలో ప్రైవేటు పెట్టుబడులు: 80% ఈ ఏడాది నిర్మాణం జరుపుకునే భవనాలు: 184 ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు: 7 వేలు తొలి దశలో తరలివెళ్లే ప్రజలు సంఖ్య: 15 లక్షలు అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తయ్యేది: 2024 ఆగస్టు 17 (దేశ స్వాతంత్య్ర దినోత్సవం) రాజధాని నుసంతర నిర్మాణం పూర్తయ్యేది: 2045 ఆగస్టు 17 (దేశ వందో స్వాతంత్య్ర దినం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశ ప్రారంభం
దౌసా (రాజస్తాన్): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో మరో మైలు రాయిని అందుకుంది. దేశంలో అతి పెద్దదైన జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే ఢిల్లీ–ముంబై మహా రహదారిలో 246కి.మీ. భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు.ఢిల్లీలోని సోహ్నా నుంచి రాజస్తాన్‌లో దౌసా మధ్య నిర్మాణం జరుపుకున్న తొలిదశను దౌసా వద్ద రిమోట్ కంట్రోల్ బటన్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. 8 లేన్లతో నిర్మించిన ఢిల్లీ–దౌసా–లాస్‌సాట్ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, జైపూర్ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ఇన్నాళ్లు 5 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళితే మూడున్నర గంటలే పడుతుంది. దీంతోపాటు రూ.5,940 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీల మీద అత్యధికంగా దృష్టి సారించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఇలాంటి హైవేలతో పారిశ్రామికవేత్తలతో పాటు, వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ఆర్థికంగా బలోపేతమవుతారని తెలిపారు. మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తే మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చునని మోదీ చెప్పారు. ఢిల్లీ–ముంబై తొలిదశతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో జైపూర్, అజ్మీర్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సరిహద్దు ప్రాంతాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: ప్రధాని మన దేశ సైనికుల శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ తక్కువగా అంచనా వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, దేశంలోకి చొరబడడానికి మన శత్రువులు కొత్త మార్గాలు వెతుక్కుంటారన్న భయంతో ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. దౌసాలో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన తర్వాత బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాజస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ కాగితాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే రాజస్తాన్ అభివృద్ధి పథంలో దూసుకువెళుతుందని అన్నారు. దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలు ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఆయన చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశల్ని నింపుతోందని ఈ సందర్భంగా ఆయనన్నారు. నిరుపేదలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అణగారిన వర్గాల అభ్యున్నతి మొట్టమొదటి యజ్ఞంగా చేపట్టామని తెలిపారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు మొత్తం పొడవు: 1,380 కి.మీ. మొత్తం వ్యయం: దాదాపుగా రూ. లక్ష కోట్లు ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం: 12 గంటలు (ప్రస్తుతం 24 గంటలు పడుతోంది) తొలి దశ పొడవు : 246 కి.మీ. (సోహ్నా నుంచి దౌసా) వ్యయం: రూ.12,150 కోట్లు è ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం. (ఇన్నాళ్లూ 5 గంటలు పట్టేది. ఇకపై మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు) . è ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్న ఎక్స్‌ప్రెస్ వే 90 గంటలు, 10 సమావేశాలు, 10,800కి.మీ.. నాలుగు రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ అక్షరాలా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మొత్తం 90 గంటల్లో ఏకంగా 10 బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన 10,800 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. ఫిబ్రవరి 10న ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లి ప్రపంచ పెట్టుబడుల సదస్సుని ప్రారంభించారు. ముంబైకి వచ్చి వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. ఫిబ్రవరి 11న త్రిపురలో రెండు బహిరంగ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి రాజస్తాన్ వెళ్లి దౌసాలో ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. రెండు బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. సోమవారం బెంగుళూరులో ఏరో ఇండియా 2023ను ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి మళ్లీ త్రిపురకి వెళ్లి అగర్తాలా ర్యాలీలో పాల్గొని సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. -
విశాఖ: ఇది ఆరంభం మాత్రమే.. హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త రికార్డు!
నౌకల నిర్మాణం, మరమ్మతుల విషయంలోనూ హిందుస్థాన్ షిప్ యార్డు తనదైన ముద్ర వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో దూసుకుపోతూ.. మరోవైపు సాంకేతికతకు పదును పెడుతోంది. భారత నౌకాదళం కోసం నిరి్మస్తున్న షిప్లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి అబ్బురపరిచింది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు జత కడుతున్న నేపథ్యంలోనౌకా నిర్మాణంలో హిందుస్థాన్ షిప్‌యార్డు సరికొత్త అధ్యాయాల్ని లిఖిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులు, నిర్మాణాలనైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతిపెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. తాజాగా భారత నౌకాదళం కోసం డైవింగ్ సపోర్ట్ వెసల్ షిప్లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) భారత నౌకాదళానికి చెందిన షిప్ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచి్చంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. డీప్సీ డైవింగ్, సబ్‌మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐఎన్ఎస్ నిస్టార్, ఐఎన్ఎస్ నిపుణ్ యుద్ధనౌకల్ని తయారు చేస్తోంది. తొలిసారిగా యుద్ధ నౌకలో 3 మెగావాట్ల డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి చారిత్రక అధ్యాయాన్ని లిఖించింది. ఐఎన్ఎస్ నిస్టారాలో గురువారం ఉదయం ఈ భారీ జనరేటర్‌ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి యుద్ధ నౌకలోనూ 5 జనరేటర్లు ఉంటాయి. నిర్మాణ సమయంలో మొదటి జనరేటర్ సేవలు ప్రారంభిస్తే.. నౌకానిర్మాణం దాదాపు పూర్తయినట్లేనని భావిస్తారు. ఈ జనరేటర్ ప్రారంభమైతే.. షిప్‌కు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇప్పటివరకూ 2 మెగావాట్ల డీజిల్ జనరేటర్లు మాత్రమే వినియోగించారు. కానీ.. నిస్టార్కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. షిప్‌యార్డు డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కారి్మకులు నిరంతరం శ్రమించి దీనిని రూపొందించారు. ఈ జనరేటర్ ప్రారంభంతో నిస్టార్ షిప్ పనులు 90 శాతం వరకూ పూర్తయ్యాయని షిప్‌యార్డు వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఐఎన్ఎస్ నిస్టార్ను భారత నౌకాదళానికి అప్పగించేందుకు షిప్‌యార్డు బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ యుద్ధనౌక నిర్మాణ ప్రాజెక్టును రూ.2,100 కోట్ల వ్యయంతో హెచ్ఎస్ఎల్ చేపడుతోంది. -
రెండేళ్లలో 25 డేటా సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్–ఎస్ 2025 మార్చి నాటికి కేంద్రాల సంఖ్యను 25కు చేరుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 డేటా సెంటర్లు ఉన్నాయి. రెండేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం తోడవనుంది. ప్రస్తుతం నవీ ముంబైలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ డేటా సెంటర్ పార్క్ నిర్మాణంలో ఉంది. ఇదే స్థాయిలో హైదరాబాద్ కేంద్రం నిర్మాణానికి సిద్ధంగా ఉందని కంట్రోల్–ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చెన్నై డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఈ మూడు కేంద్రాల చేరికతో 600 మెగావాట్ల సామర్థ్యం సంస్థకు జతకూడనుంది. కోల్‌కతలో సైతం ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. రేటెడ్–4 డేటా సెంటర్ల నిర్వహణలో కంట్రోల్–ఎస్ ఆసియాలో తొలిస్థానంలో ఉంది. -
నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి
-
కూకట్‌పల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా!: మహీంద్రా మెచ్చిన ఆవిష్కరణ
మనసు పెడితే దేన్నైనా మనకు సహాయకారిగా ఉపయోగించవచ్చు. కొంచెం కామెన్సెన్స్ ఉంటే దానికి కాస్త తెలివి తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అందుకు ఉదాహరణ ఇక్కడొక వ్యక్తి నిర్మాణ పనులకు స్కూటర్ని ఉపయోగిస్తున్న విధానమే నిదర్శనం. ఇలా కూడా స్కూటర్ని వాడేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలా ఉపయోగించాడు. వివరాల్లోకెళ్తే...ఇది వరకు 90లలో ఉపయోగించే స్కూటర్ని సిమ్మెంట్ బస్తాలను చేరవేసే సాధనంగా ఉపయోగించాడు ఒక వ్యక్తి . స్కూటర్ మోటారుకి తాడు చివర భాగాన్ని ఇంజన్‌కి జోడించడంతో..దాని సాయంతో సిమ్మెంట్ బస్తాలను నిర్మాణంలో ఉన్న భవనంపైకి తరలిస్తున్నారు. స్కూటర్ హ్యాండిల్‌ని రైజ్ చేయగానే బస్తా పైకెళ్లుతుంది. ఎంచక్కా మనుషుల సంఖ్య, ఖర్చు తగ్గుతుంది కూడా. పని కూడా ఎంతో సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేగాదు ఈ సరికొత్త ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకుంటూ ట్విట్టర్లో... వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తాం. ఇంజన్ల శక్తిని ఉపయోగించడానికి అనేక మార్గాలు. ఈ స్కూటర్ మెరుగ్గా ఉంటుంది. నిశబ్దంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి సెక్హ్యాండ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మహీంద్ర. 👏🏽👏🏽👏🏽 I guess that’s why we call them ‘power’trains. Many ways to utilise the power of vehicle engines. This would be even better ( and quieter!) with an e-scooter, once their cost is brought down or they are available second-hand. pic.twitter.com/Xo6WuIKEMV — anand mahindra (@anandmahindra) December 6, 2022 (చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్) -
అద్దాల్లా రోడ్లు..! నిరంతరం పర్యవేక్షణ, మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా, విభిన్నంగా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. వానలు, వరదలకు పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. రోడ్లు చెక్కు చెదరకుండా అద్దాల్లా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలదే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలో కార్యాచరణ ప్రారంభించాలని.. వచ్చేనెల రెండో వారంలోగా టెండర్లు పూర్తి కావాలని ఆదేశించారు. వానలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ తరహాలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుని రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ, ఏమూలన పాడయ్యాయో సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్ల వద్ద పూర్తి వివరాలు ఉండాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల తరహాలోనే ఆర్‌అండ్‌బీలో సైతం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)ల విధానాన్ని తీసుకురావాలన్నారు. ఐదారు ఆసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఎన్సీ ఉండాలని, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేయడానికి ఎస్ఈలు, ఈఈలు ఎంత మంది ఉండాలో ఆలోచన చేయాలన్నారు. సమర్థవంతంగా పర్యవేక్షణ ఉండేలా పని విభజన జరగాలని.. ఆ దిశగా సమీక్ష జరిపి తుది నివేదిక ఇస్తే తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమావేశంలో చర్చించారు. ‘బాధ్యతల పునర్విభజన; వానలు, వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణ; మరమ్మతులు, ఇతర పనులపై సత్వర నిర్ణయం; వెంటనే పనులు చేపట్టేదిశగా కిందిస్థాయి ఇంజనీర్లకు నిధుల కేటాయింపు..’ వంటి వ్యూహాలను అవలంబించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు. కేజ్ వీల్స్‌పై ఇక కఠినంగా.. గ్రామాల్లో ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో నడుపుతుండడంతో రోడ్లు పాడవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలా చేయకుండా రైతులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను చైతన్యవంతం చేయాలని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అటవీ భూములు అడ్డం రావడంతో రోడ్ల నిర్మాణం ఆగిపోతే.. ఆ శాఖతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి చేసుకోవాలని, తద్వారా సమయం ఆదా చేయడంతోపాటు, నాణ్యతను కాపాడుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు స్వీయ విచక్షణ నిధులు నీటి పారుదల శాఖ తరహాలోనే రోడ్ల మరమ్మతుల కోసం ఆర్అండ్బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు ప్రతి చిన్నపనికి హైదరాబాద్‌కు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని.. వారి స్థాయిని బట్టి స్వీయ విచక్షణతో ఖర్చు చేసేలా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. స్వీయ విచక్షణతో ఖర్చు చేసేందుకు డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులకు ఎన్ని నిధులు కేటాయించాలో సిఫార్సు చేయాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్వహణ సమర్థవంతంగా జరగాలంటే ఏ స్థాయి ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించాలో తేల్చాలని కోరారు. పటిష్టంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పటిష్టంగా నిర్మించాలని ఆర్అండ్బీ శాఖను సీఎం ఆదేశించారు. వరంగల్, హైదరాబాద్‌లలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలకు ఒక అంతస్తును కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల డిజైన్లను పరిశీలించి పలు మార్పులను సూచించారు. అన్ని విభాగాలకు ప్రత్యేక వసతులతో ఎత్తైన భవనాలను నిర్మించాలని కోరారు. వైద్య విద్యార్థులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఆస్పత్రులు ఉండాలన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపడం గమనార్హం. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
టీఎస్ బీపాస్‌తో సత్ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ ప్రజల మన్ననలు పొంది, మంచి ఫలితాలు సాధించిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పథకం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలో నిర్మాణ దరఖాస్తులకు అనుమ తులు 22 శాతం పెరిగాయన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 43,709 దరఖాస్తులకు అనుమతులు లభించినట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు దారులకు స్వయం మదింపు విధా నాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. 75 చ.గ. విస్తీర్ణంలో చేపట్టే గృహ నిర్మాణానికి అనుమ తులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అక్కర లేదని, రూపాయి రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. 600చ.గ. సంబంధించి సింగిల్ విండో విధానంలో అనుమ తులు లభిస్తాయని వివరించారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందజేశారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
-
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది. చదవండి: అసాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ -
నెల్లూరు హరనాథపురం జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణం
-
ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది
కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని, రికవరీ బాటలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తుండడంపై అప్రమత్త ధోరణిని ప్రకటించారు. స్వదేశీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని కీలక రంగాలు.. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మంచి పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు డిమాండ్, సేవల రంగం పనితీరు అంచనాలకు మించి ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు చేస్తోందంటూ, అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉందని అంగీకరించారు. బ్యాంకింగ్ రంగం తగినన్ని నిధులతో ఉందంటూ, బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం మెరుగునకు ఐబీసీ సాయపడినట్టు చెప్పారు. -
YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం
సాక్షి, రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన 716 కడప–రేణిగుంట జాతీయరహదారిని 2024 నాటికి పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్కువ వ్యవధిలోనే తిరుపతి.. కడప–రేణిగుంట ఎన్‌హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకోవచ్చు. ఫలితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే వారికి కడప–రేణిగుంట రహదారి ఎన్‌హెచ్ చేయడం వల్ల త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. రెండు ప్యాకేజీలుగా..హైవే నిర్మాణం కడప నుంచి చిన్నఓరంపాడు(64.2కేఎం), చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు రెండుప్యాకేజీలుగా హైవే నిర్మాణపనులు జరుగుతాయి. నాలుగులేన్లుగా రోడ్డు నిర్మితం కానుంది. ఇందు కోసం టెండర్లను కూడా కేంద్రం పిలిచింది. రెండు ప్యాకేజీలకు కలిపి రూ.4వేల కోట్లు వ్యయం చేయనుంది. సెప్టెంబరు 16 తర్వాత టెండర్ల ఖరారును నిర్ణయిస్తారు. రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి కడప–రేణిగుంట రహదారిలో రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి నిర్మించాలని యోచిస్తున్నారు. ముంబై–చెన్నై రైలుమార్గం వెంబడి (పడమర వైపు )భాకరాపేట నుంచి చిన్నఓరంపాడు వరకు మార్గం నిర్మితం కానున్నది.ఇది పూర్తిగా అటవీమార్గంలోనే కొనసాగుతుంది. మార్గమధ్యలో ఆర్వోబీలు, చెయ్యేరునదిపై వంతెనలు, చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి. త్వరతగితిన హైవే నిర్మాణానికి ఎంపీ మిథున్‌రెడ్డి కృషి కడప–రేణిగుంట నేషనల్ హైవే త్వరితగతిన నిర్మితమయ్యేలా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తన వంతు కృషిచే శారు. కేంద్రం తీసుకున్న ప్రయార్టీలో కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ను చేర్చేలా ఎంపీ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రెండేళ్లలో ఎన్‌హెచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే అభిమతంగా ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు స్పెషల్ కనెక్టిటివిటీ అవసరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్‌హెచ్ నుంచి కనెక్టిటివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని పలువురు భక్తులు కేంద్రాన్ని కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రీకులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకుంటారు. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రస్తుతం కడప–రేణిగుంట హైవేలో ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చెన్నై, ముంబై, హైదరాబాదులకు రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం మూడు నుంచి నాలుగు గంటలకుపైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్ధితి. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌కు 1,066 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి అయింది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. అన్నమయ్య జిల్లా జేసీ తమీమ్ అన్సారియాలు పరిహారం అందజేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భూసేకరణపై దృష్టి సారించారు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌రోడ్డు నిర్మితం కానుంది. రూ.4వేల కోట్లతో రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు జరుగుతాయి. గ్రీన్‌హైవే ఎక్స్‌ప్రెస్‌లో పచ్చటి ప్రకృతిలో.. ఆహ్లాదకరమైన వాతవరణంలో త్వరితగతిన గమ్యాలకు చేరుకోవచ్చు. 2024 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. –పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట ప్రమాదాలు తగ్గుతాయి కడప–రేణిగుంట ఎన్‌హెచ్ నిర్మాణంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. కడప–తిరుపతి మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుంది. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒంటిమిట్ట, నందలూరులో ఉన్నందున ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసు రోడ్డు నిర్మిచాల్సిన అవసరం ఉంది. త్వరగా అందుబాటులోకి వస్తే ఉభయ వైఎస్సార్ జిల్లా వాసులే కాకుండా, ఉత్తరభారతదేశం వారికి సకాలంలో తిరుపతి,గా చెన్నైలకు వెళ్లే వీలు ఉంటుంది. –మేడారఘునాథరెడ్డి, అధినేత, ఎంఆర్‌కెఆర్ సంస్థ, నందలూరు -
ప్రీలాంచ్ మాయ.. గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్న డెవలపర్లు!
సాక్షి, హైదరాబాద్: ‘అమీన్‌పూర్‌లోని 10 ఎకరాల స్థల యజమానితో ఓ డెవలప్పర్ రెండేళ్ల క్రితం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 65 లక్షల చదరపు అడుగులు (చ.అ.) బిల్టప్ ఏరియాలో 4 వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నానని ప్రచారం చేశాడు. నిర్మాణ అనుమతులు రాకముందే చ.అ.కు రూ.2 వేల చొప్పున 2 వేల ఫ్లాట్లను విక్రయించాడు. తీరా చూస్తే ఆ భూమి న్యాయపరమైన వివాదాలలో చిక్కుకుంది. ఇంకేముంది కొనుగోలుదారుల నుంచి ముందుగానే రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన డెవలపర్ సైలెంటైపోయాడు’.. ఇలా ప్రీలాంచ్ డెవలపర్లు గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్నారు. సామాన్యుల సొంతింటి కలలను కొల్లగొడుతున్నారు. కాస్త తక్కువ ధరకు వస్తుందనే కొనుగోలుదారుల బలహీన మనస్తత్వంతో ప్రీలాంచ్ డెవలపర్లకు మంత్రదండంలా ఉపకరిస్తోంది. స్థల యజమానులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే ఫ్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఐటీ దాడులైతే కష్టమే.. ప్రీలాంచ్ విక్రయాలలో డెవలపర్‌కు చేరేది నల్లధనమే. అనధికారిక లావాదేవీలే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆయా సొమ్మును పలు ప్రాజెక్ట్‌లకు లేదా ఇతర ప్రాంతాలలో స్థలాల కొనుగోళ్లకు వినియోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సదరు నిర్మాణ సంస్థపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తే గనక.. అసలుకే మోసం వస్తుందని ఓ డెవలపర్ తెలిపారు. అనధికారిక నగదును, బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేస్తారు. దీంతో సదరు నిర్మాణ సంస్థ ఇతర ప్రాజెక్ట్‌లపై దీని ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. నగదు సరఫరా మందగించడంతో ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ అందరే.. కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు, నానక్‌రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లీహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ.. పెద్ద కంపెనీలతో పాటు చిన్నా చితకా సంస్థలూ ప్రీలాంచ్లో విక్రయాలు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్‌పేట వంటి ప్రాంతాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. ఈ లాజిక్ తెలిస్తే చాలు.. నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్ + గ్రౌండ్ + అయిదంతస్తుల భవన నిర్మాణానికి చదరపు అడుగు (చ.అ.)కు రూ.2,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.3 వేలు, 15–25 ఫ్లోర్ల వరకు రూ.3,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.4 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్ అయినా ఇంతకంటే తక్కువ ధరకు అపార్ట్‌మెంట్‌ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ కె.ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. (చదవండి: నేడు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి అమిత్ షా.. పోలీసుల ప్రత్యేక నిఘా ) -
రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలకు అర్థం చెప్పాలనే... విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో భారీగా యాష్(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్ డస్ట్ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్ ఎంచుకున్నారు. ఎన్టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా.. రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్ గ్రేడ్, సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. సీబీఆర్ రేషియో ప్రామాణికంగా.. రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్ రేషియో(సీబీఆర్)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్ బేస్ కోర్స్‌కు లిక్విడ్ లిమిట్ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి. పట్నాయక్ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్ లిమిట్ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్)కు బాటమ్ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బాటమ్ యాష్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్ విద్యుత్ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్ యూనిట్ల ద్వారా క్రషర్ డస్ట్ వెలువడుతోంది. యాష్, క్రషర్ డస్ట్ పర్యావరణానికి సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో తుమ్లుక్ థిగా రైల్వే లైన్ నిర్మాణంలో బాటమ్ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్), వాల్తేర్ డివిజన్ -
రోడ్ల నిర్మాణానికి క్యాపిటల్ మార్కెట్లలోకి వస్తాం
న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సమీకరిస్తామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం భయాలను మంత్రి ప్రస్తావిస్తూ.. మౌలికరంగ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధుల సమస్య లేదన్నారు. ‘‘సంపన్నుల నిధులను ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. షేర్ మార్కెట్‌కు వెళతాం. చిన్న ఇన్వెస్టర్ల నుంచి రూ.లక్ష, రూ.2లక్షల చొప్పున నిధులు సమీకరిస్తాం. వారికి హామీతో కూడిన 8 శాతం రేటును ఆఫర్ చేస్తాం. ఈ విధంగా భారీ ఎత్తున నిధులు పొందగలం’’ అని ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా మంత్రి వెల్లడించారు. నిర్మాణ రంగ పరికరాల మార్కెట్ రూ.50,000 కోట్లుగా ఉంటుందని, చమురు ధరలు పెరిగిపోవడంతో ఇది సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. హానికారకమైన డీజిల్ వినియోగం నుంచి బయటకు రావాలని పరిశ్రమకు సూచించారు. మెథనాల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని భవిష్యత్తుగా పేర్కొంటూ.. ఈ విభాగంలో భారత ఆటోమొబైల్ కంపెనీల వాటా పెరిగి, విదేశీ కంపెనీల వాటా తగ్గుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత కంపెనీలు వాహనాల ఉత్పత్తిని స్థానికంగా చేపట్టడం వాటికి అనుకూలిస్తుందన్నారు. దేశంలో విస్తారంగా బొగ్గు నిల్వలు ఉన్నా కానీ, దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రస్తావిస్తూ.. అందుకే 60 బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
పైసలు రావు పనులు కావు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. గతంలో ప్రారంభించిన.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెండు వరసల రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చివరకు నిర్వహణ పనుల్లో భాగంగా క్రమం తప్పకుండా జరగాల్సిన పునరుద్ధరణ (రెన్యువల్స్) పనులు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. తెలంగాణ వచ్చిన కొత్తలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఏకంగా రూ.15,470 కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు. కానీ ప్రస్తుతం రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చడం తప్ప రోడ్ల నిర్మాణం మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రోడ్లు భవనాల శాఖలో రాష్ట్ర రహదారుల విభాగానికి చేసేందుకు పని లేని పరిస్థితి ఎదురైంది. కేటాయింపు కష్టమై.. ►తెలంగాణ ఏర్పడక పూర్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ రోడ్లు నామమాత్రంగానే ఉండేవి. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు, కొన్ని ప్రధాన పట్టణాల మధ్య తప్ప అన్నీ సింగిల్ రోడ్లే. 2014 నాటికి రాష్ట్రప్రభుత్వ అధీనంలోని రోడ్ల నిడివి 24,245 కి.మీ. కాగా, అందులో కేవలం 27.9% మాత్రమే డబుల్ రోడ్లు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్, అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు డబుల్ రోడ్లు ఉండాలని నిర్ణయించి ఏకంగా రూ.15,470 కోట్లతో 9,578 కి.మీ. నిడివిగల రహదారులను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు అధిక ప్రాధాన్యంతో సాగటంతో 2018 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం 7,540 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగతావి మాత్రం మూడేళ్లుగా నిలిచిపోయాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చివరలో ఏర్పడ్డ కొత్త మండలాలకు డబుల్ రోడ్ల భాగ్యం దక్కలేదు. తొలుత 145 మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లకు సంబంధించి 1,835 కి.మీ. పనులు ప్రతిపాదించగా 1,651 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగతావి పెండింగులోపడ్డాయి. కొత్త మండలాలకు సంబంధించి 450 కి.మీ. పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.1,000 కోట్లు కావాలని అంచనా వేశారు. వీటితోపాటు పాత పనులకు ఇంకా రూ.3 వేల కోట్లు కావాల్సి ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో అన్ని నిధులు కేటాయించటం కష్టంగా మారటంతో పనులు దాదాపుగా నిలిపివేశారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు.. ►ఇటీవల రోడ్ల రెన్యువల్స్ పనుల కోసం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రెండుసార్లు టెండర్లు పిలిచి స్పందన లేక అధికారులు మిన్నకుండిపోయారు. పనులు చేస్తే బిల్లులు వస్తాయన్న నమ్మకం లేకనే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రస్తుతం వారికి రూ.700 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇవి గతంలో రూ.1,200 కోట్లుగా ఉండగా, అడపాదడపా కొన్ని చొప్పున చెల్లిస్తూ రావడంతో ఈ మాత్రానికి తగ్గాయి. ఇవి దాదాపు రెండేళ్లుగా పేరుకుపోయి ఉండటంతో, కాంట్రాక్టర్లు స్టేట్ రోడ్ల పనులంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఏడున్నరేళ్లలో ఇలా ►తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 7,180 కి.మీ రెండు వరసల రోడ్లను నిర్మించారు. ►321 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్ల నిర్మాణం జరిగింది. ►39 కి.మీ. మేర ఆరు వరసల రోడ్లు రూపొందాయి. ►430 వంతెనలు కొత్తగాఏర్పడ్డాయి ఆ రోడ్లతో బంతాట.. పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో ఉన్న కొన్ని రోడ్లు అభివృద్ధి చేసే క్రమంలో గతంలో రోడ్లు, భవనాల శాఖకు బదిలీ అయ్యాయి. అలా విడతల వారీగా 6 వేల కి.మీ. రోడ్లను అప్పగించారు. ఈ రోడ్లను రాష్ట్ర రహదారుల స్థాయికి తేవాలంటే రూ.5 వేల కోట్లు కావాలని లెక్కలేశారు. చేపట్టిన పనులే పూర్తి చేసే పరిస్థితి లేకపోవటంతో, ఈ రోడ్లను ఇక ముట్టుకునేందుకు కూడా జంకుతున్నారు. వీలైతే తిరిగి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధంగా ఉంది. పేరుకే స్టేట్ రోడ్లు.. జాతీయ రహదారుల తర్వాత రాష్ట్ర రహదారులు విశాలంగా, అనువుగా ఉంటాయి. అలా రాష్ట్ర రహదారుల జాబితాలో ఉండి కూడా కనీసం కంకర రాయి కూడా పడని కచ్చా మట్టి రోడ్లు ఏకంగా 719 కి.మీ. మేర ఉండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వీటిపై తొలుత కంకరపరిచి మెటల్ రోడ్లుగా మార్చాలి. ఆ తర్వాత తారు రోడ్ల స్థాయికి తేవాలి. ఇక కంకర పరిచి తారు కోసం ఎదురుచూస్తున్న రోడ్ల నిడివి 615 కి.మీ మేర ఉంది. వెరసి స్టేట్ రోడ్ల జాబితాలో ఉన్నప్పటికీ ఇంకా 1,330 కి.మీ మేర కచ్చా రోడ్లే ఉండటం గమనార్హం. -
తల్లిదండ్రుల పేరుతో బస్టాండ్
యశవంతపుర(బెంగళూరు): తల్లిదండ్రుల పేరుతో కొడుకులు బస్టాండ్ నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఉడుపికి చెందిన అట్టింజె శంభుశెట్టి, హేమలతల వివాహ స్వర్ణ మహోత్సవం సందర్భంగా వారి కుమారులు శిర్వ గ్రామంలో హైటెక్ బస్టాండ్ నిర్మించి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆగమ విద్వాంసుడు కేంజి శ్రీధర తంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లౌడ్స్పీకర్లకు అనుమతి బనశంకరి: మసీదు, మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి కోరుతూ 959 దరఖాస్తులు అందగా 121 దరఖాస్తులకు చట్టప్రకారం అనుమతి ఇచ్చామని, మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తామని నగరపోలీస్‌కమిషనర్ సీహెచ్.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఈద్గామైదానంలో సమావేశానికి అనుమతి కోసం ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు. దరఖాస్తు చేస్తే చట్టపరంగా ఏమి చేయాలో అది చేస్తామన్నారు. చదవండి: కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే -
తలలోకి దూసుకెళ్లిన ఇనుపచువ్వ
హుజూరాబాద్/ఎంజీఎం: ప్రమాదవశాత్తు ఓ యువకుడి దవడ నుంచి తలలోకి ఇనుపచువ్వ గుచ్చుకోవడంతో రెండు గంటలపాటు నరకయాతన అనుభవించి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శుక్రవారం జరిగింది. హుజూరాబాద్‌లోని బుడగజంగాల కాలనీకి చెందిన మౌటం రాజు(35) సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్లో మూడు నెలల నుంచి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో క్రాస్‌రోడ్‌లో నిర్మిస్తున్న డ్రైనేజీకి ఉదయం నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రెయిలింగ్‌పై పడిపోయాడు. రెయిలింగ్‌పై మొనదేలి ఉన్న ఇనుపచువ్వ ఒకటి రాజు దవడ కింది నుంచి దూసుకెళ్లి తల వెలుపలికి వచ్చింది. ఈ హఠాత్పరిణామానికి షాక్‌కు గురైన రాజు ఇనుపచువ్వకు అతుక్కుపోయి ఎటూ కదల్లేక నొప్పితో విలవిల్లాడాడు. దవడ కదలించలేని దయనీయస్థితిలో సాయం కోసం సైగలు చేస్తున్న రాజును చూసి పలువురు కంటతడి పెట్టారు. వెంటనే అక్కడి సిబ్బంది ఆ ఇనుపచువ్వను కట్టర్‌తో కత్తిరించారు. సైట్ ఇంజనీర్ అశ్వి న్‌కుమార్, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకుని రాజును ఇనుపచువ్వతోపాటు హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మెరుగైన చికిత్స కోసం రాజును హుజూరాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో రాజు ప్రాణాలు వదిలాడు. ఎంజీఎంకు వచ్చేసరికే రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కృతిమ శ్వాస అందిస్తూ చువ్వను తొలగిస్తున్న క్రమంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో రాజు కొన ఊపిరితో ఉన్నాడని, దాదాపు 40 నిమిషాలు ప్రాణాలతో పోరాడాడని ఆయన బంధువు రవి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫారసులు చేసింది. ప్రస్తుతం మాదాపూర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)ను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచేందుకు వీలుగా సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో న్యాక్ డైరెక్టర్ జనరల్ సభ్యకార్యదర్శిగా, క్రెడాయ్ నుంచి ముగ్గురు, బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, సీఐఐ నుంచి ఒకరు చొప్పున సభ్యులుగా ఉన్న కమిటీ లోతుగా పరిశీలించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. యూనివర్సిటీ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యాక్‌కు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వర్సిటీని స్థాపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో పొందుపరిచిన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి. ► దీన్ని గ్లోబల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ లేదా ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీగా పేర్కొనాలి. విదేశాల నుంచి కూడా సివిల్ ఇంజనీర్లు ఇం దులో చేరే స్థాయికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ► ఇందులో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ కన్స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ కన్స్ట్రక్షన్ ఫర్ అర్బన్ ప్లానింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ స్కూల్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్కూల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, స్కూల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇంజనీరింగ్.. ఇలా ఐదు రకాల విభాగాల కింద స్పెషల్ కోర్సులు ఏర్పాటు చేయాలి. ► సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 40 ఏళ్ల క్రితం నాటి బోధనే ఇప్పుడూ సాగుతుండటంతో అందులో పురోగతి లేకుండా పోయింది. దాన్ని ఈ యూనివర్సిటీతో భర్తీ చేసి యూరప్, అమె రికా, సింగపూర్ లాంటి దేశాల నిర్మాణ రం గంలో వస్తున్న ఆధునికతను ఈ యూనివర్సిటీ కూడా స్థానికంగా అందిస్తుంది. ► యూనివర్సిటీని ఎంటెక్‌తో ప్రారంభించాలి. బీటెక్ విద్యార్థులకు పీజీ కోర్సులు అందిస్తూ రెండు, మూడేళ్లలో బీటెక్, ఆ తర్వాత రీసెర్చ్ విభాగాలు ప్రారంభించాలి. -
ఏక సంఘం ఏర్పాటుకు వారమే
సాక్షి, హైదరాబాద్: ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కులాలకు నిర్మాణ అనుమతులు జారీచేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం మంత్రి కమలాకర్ తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 కులాలు ఏ కులానికి ఆ కులం ఏక సంఘంగా ఏర్పడి బీసీ సంక్షేమ శాఖను సంప్రదించాయని, వాటికి ఆయా కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల నిమిత్తం అనుమతి ప్రతాలు జారీ చేశామని, అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. మిగతా కులాలు కూడా ఏక సంఘంగా ఏర్పడాలని, ఇందుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు విధిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గడువులోగా ఏకసంఘంగా ఏర్పడకుంటే ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. బీసీ కులాల కోసం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రూ.వేల కోట్ల విలువైన స్థలాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా వీటి నిర్మాణాలు చేపట్టడం కోసం 82 ఎకరాలు, రూ.96 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే 80,039 ఉద్యోగాల భర్తీలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇస్తాయని, ఇప్పటికే గ్రూప్–1 కోచింగ్ ప్రారంభమైందన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. -
నిర్మాణాల ఆయుష్షు పెంచుతుంది!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు మరింత కాలం దృఢంగా ఉండేందుకు తోడ్పడే ప్రత్యేక మెటీరియల్‌ను హైదరాబాద్ ఐఐటీ పరిశోధన విభాగం అభివృద్ధి చేసింది. పాత నిర్మాణాలను బలోపేతం చేయడం కోసం స్టీలు, కాంక్రీట్‌కు బదులుగా.. తాము రూపొందించిన ‘హైబ్రిడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ (ఎఫ్ఆర్పీ)’ను వినియోగించవచ్చని ఐఐటీహెచ్ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ తెలిపారు. స్టీల్‌ప్లేట్లు, కాంక్రీట్ కంటే ఎఫ్ఆర్పీ దృఢత్వం, సామర్థ్యం ఎక్కువ అని ఐఐటీలోని క్యాస్ట్‌కాన్ ల్యాబ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలిందని చెప్పారు. ‘పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్న కొద్దీ దృఢత్వాన్ని కోల్పోతుంటాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్లు వంటివాటితో నిర్మాణాలు దెబ్బతింటాయి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే, రోడ్డు వంతెనలు బలహీనమవుతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలంటే వ్యయప్రయాసలతో కూడిన విషయం. కానీ ఎఫ్ఆర్పీని వినియోగించి మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేయడంతో ఆ నిర్మాణాల దృఢత్వాన్ని పెంచవచ్చు. వాటి ఆయుష్షును కూడా మరో 20 ఏళ్లవరకు పొడిగించవచ్చు. ఎఫ్ఆర్పీని వినియోగించడం వల్ల ఆయా నిర్మాణాల పరిమాణంలో మార్పులు ఉండవు. బరువు కూడా తక్కువగా ఉంటుంది’’అని సూర్యప్రకాశ్ వెల్లడించారు. దేశ అభివృద్ధికి ఊతం ఎఫ్ఆర్పీని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ నేతృత్వంలోని పరిశోధన బృందాన్ని ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. ఈ పరిశోధన దేశంలో మౌలిక సదుపాయాలకు దీర్ఘాయువును ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయాల పరిరక్షణ, వాటి జీవితకాలాన్ని పెంచడం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. -
రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ షాక్!
సాక్షి, హైదరాబాద్: అధిక రుణాలు, నిధుల లేమిలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలాగా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు గత ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది. టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయని కొల్లియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయని వివరించారు. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయాల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండస్ట్రియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు. ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితని పేర్కొన్నారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..!
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో దేశీ కంపెనీల నికర లాభాలు తగ్గనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా అంచనా వేసింది. పెరిగిన ముడివ్యయాల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోవడంతో లాభాల మార్జిన్లు నీరసించనున్నట్లు నివేదికలో అభిప్రాయపడింది. క్యూ4(జనవరి–మార్చి)లో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం స్థాయిలో క్షీణించనున్నట్లు పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)తో పోలిస్తే 0.6 శాతం బలపడవచ్చని రీసెర్చ్ విభాగం రూపొందించిన నివేదికలో క్రిసిల్ తెలియజేసింది. క్యూ4 ఫలితాల సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక ప్రాతిపదికన ఒక క్వార్టర్లో లాభాల మార్జిన్లు బలహీనపడటం గత మూడేళ్లలో ఇది రెండోసారని వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నిర్వహణ లాభాలు(ఇబిటా) 0.4 శాతం వెనకడుగుతో 21–23 శాతంగా నమోదుకావచ్చని క్రిసిల్ డైరెక్టర్ హెటల్ గాంధీ అంచనా వేశారు. పెరిగిన ముడివ్యయాల భారాన్ని పూర్తిస్థాయిలో ప్రొడక్టు ధరలకు బదలాయించలేకపోయినట్లు గాంధీ తెలియజేశారు. ప్రధానంగా మెటల్స్, ఎనర్జీ రంగాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కమోడిటీల ధరలు ప్రభావితమైనట్లు వెల్లడించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో లాభాల మార్జిన్లు 1 శాతంమేర క్షీణించనున్నట్లు అభిప్రాయపడ్డారు. 6 శాతంవరకూ నిర్మాణ రంగ సంబంధ రంగాల మార్జిన్లకు భారీగా దెబ్బ తగలనున్నట్లు నివేదిక పేర్కొంది. 6 శాతం వరకూ మార్జిన్లు క్షీణించనున్నట్లు నివేదిక అంచనా కట్టింది. ఈ బాటలో ఎగుమతి ఆధారిత ఇండస్ట్రియల్ కమోడిటీల రంగం లాభదాయకత(మార్జిన్లు) సైతం 4 శాతం స్థాయిలో తగ్గనున్నట్లు తెలియజేసింది. ఇక వినియోగ ఆధారిత సర్వీసుల రంగంలో లాభాల మార్జిన్లు స్వల్పంగా పుంజుకునే వీలుంది. టారిఫ్‌లను పెంచడంతో టెలికం కంపెనీలు బలపడనుండగా.. నిత్యావసర వస్తు సేవలు, వైద్య రంగం లబ్ది పొందనున్నాయి. కాగా.. పలు రంగాలలో ఆదాయాలు కరోనా మహమ్మారి ముందు దశకు చేరుకునే వీలున్నట్లు నివేదిక తెలియజేసింది. వ్యవసాయ రంగం సైతం వేగవంత రికవరీ సాధిస్తున్నట్లు క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సేహుల్ భట్ పేర్కొన్నారు. కంపెనీల మొత్తం ఆదాయం గతేడాది 26 శాతం జంప్‌చేయనున్నట్లు నివేదిక అంచనా వేసింది. చదవండి: శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్ -
రాజమండ్రి లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం
-
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
ఇళ్లు కట్టుకునేవారికి షాక్ ! వాటి ధరల్లో పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, రంగులు వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి గృహాల ధరలు పెరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) అంచనా వేసింది. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల రేట్లు 10–15 శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిర్మాణ రంగాన్ని.. తాజాగా నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరింత దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. నిర్మాణ వ్యయం పెరగడంతో ఆ మేరకు వచ్చే లాభం తగ్గిపోయిందని, దీంతో ఇళ్ల రేట్లను పెంచడం మినహా డెవలపర్లకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. కాపర్, పీవీసీ, రంగులు, అల్యూమినియం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. -
పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం అవిష్కృతమయ్యింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఐఏఎంసీతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్ రమణ శనివారం భూమిపూజ చేశారు. ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తిచేసుకొని దుబాయ్, సింగపూర్, లండన్ ఆర్బిట్రేషన్ కేంద్రాల తరహాలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 17, 18 తేదీల్లో దుబాయ్‌లో సెమినార్ ఏర్పాటు చేశామని, అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ కేసులను ఆకర్షించేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందని చెప్పారు. ఐఏఎంసీకి ఇప్పటికే ఆర్బిట్రేషన్ కేసులు వస్తున్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడంలో ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించబోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మించబోయే ఈ కేంద్రం నగరానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. -
కింద నది.. పైన కాలువ
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల నదిపై నుంచి కాలువ ప్రవహించేందుకు వీలుగా కొత్త పద్ధతిలో వంతెన నిర్మిస్తున్నారు. సాగునీటిని నదికి అవతలివైపు తరలించేందుకు ఆర్సీసీ షెల్ఫ్‌తో పిల్లర్లపై కాలువను కడుతున్నారు. ఈ మధ్యే నిర్మాణం పూర్తవడంతో అధికారులు, ఇంజనీర్లు కలిసి కాలువ లోపల పరిశీలించారు. వాహనంలో తీసుకొచ్చి.. ఒక్కొక్కటిగా బిగించి.. ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా–కొరాటా బ్యారేజీ కింద లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌ను 42 కిలోమీటర్ల పరిధిలో రూ.207.32 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జైనథ్, బేల మండలాలకు కాలువ నీటిని మళ్లించే మధ్యలో సాత్నాల నది ఉంది. దీంతో నదిపై 1.675 కిలోమీటర్ల మేర పిల్లర్లు నిర్మించి కాలువ కడుతున్నారు. సిమెంట్ కాంక్రీట్‌తో చేసిన షెల్ఫ్‌లను (ఒక్కొక్కటి 250 టన్నుల బరువు ఉంటుంది) ఓ వాహనంలో తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బిగిస్తున్నారు. పిల్లర్ల ఎత్తు 35 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు ఉంటుంది. కాలువ ద్వారా రెండు మండలాల్లోని 37 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. కాలువ లోపల నడిచి.. ఎలాగుందో చూసి.. 68 పిల్లర్లపై 67 షెల్ఫ్‌లను బిగించేందుకు చేపట్టిన పనులు తుది దశకు వచ్చాయి. 24.4 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ షెల్ఫ్‌ల ద్వారా 420 క్యూసెక్కుల సాగునీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. పనులు తుది దశకు చేరుకోవడంతో జల వనరుల శాఖాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఈ వయాడక్ట్ మార్గంలో పయనించి పరిశీలించారు. -
చకచకా పోలవరం నిర్మాణ పనులు ..
-
జూబ్లీహిల్స్‌లో మరో వంతెన
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, షేక్‌పేట వైపు వెళ్లేవారికి ఇప్పుడున్న జూబ్లీహిల్స్ రోడ్ నెం.45, రోడ్ నెం.78, ఫిలింనగర్ కొత్త చెరువు రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రోడ్లపై భారీగా వాహనాలు తరలి వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సంబంధిత అధికారులు జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులకు మరో అనువైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.51లో ఈ వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ►షేక్‌పేట మల్కంచెరువు వద్ద షేక్‌పేట ఫ్లైఓవర్ కింద జూబ్లీహిల్స్ రోడ్ నెం.51 ఈ బ్రిడ్జి రోడ్డును అనుసంధానం చేస్తున్నారు. ►లెదర్ పార్కు రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45కు కనెక్ట్ చేస్తున్న ఈ రహదారి వంతెన నిర్మాణానికి రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ►290 మీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటున్న ఈ బ్రిడ్జిపై నాలుగు లైన్ల బై డైరెక్షనల్ రోడ్డును నిర్మించడం జరుగుతున్నది. ►ప్రస్తుతం షేక్‌పేట వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45కు విస్పర్‌వ్యాలీ మహాప్రస్థానం మీదుగా రావాల్సి ఉండేది. ఇది ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా ఇప్పుడు కొత్తగా వేస్తున్న జూబ్లీహిల్స్ రోడ్ నెం.51 లింకు రోడ్డుతో ఈ దూరం 3.5 కిలోమీటర్లకు తగ్గనుంది. ►మరో వారం, పది రోజుల్లో ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. -
చకచకా పోలవరం పనులు
-
24 అంతస్తులతో.. 18 నెలల్లో..అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వరంగల్‌లోని పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ భారీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ తాజాగా ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించింది. టెండర్లు దాఖలు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 15న నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిన వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సింగిల్ టెండర్లో రూ.1,100 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టే రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు కావడం విశేషం. ఇప్పటివరకు రోడ్లు, వంతెనలు, భవనాలు.. ఇలా ఏ కేటగిరీలో చూసినా అంత మొత్తంతో కూడిన సింగిల్ టెండర్ ప్రాజె క్టును ఆ శాఖ చేపట్టలేదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా గడువులోగా చేసి చూపాలని అధికారులు భావిస్తున్నారు. ఒప్పందం కుదిరిన నాటి నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 సెప్టెంబర్ ఆఖరుకల్లా ఆసుపత్రి భవనం అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. 24 అంతస్తులతో.. ఇటీవల ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలి సిందే. ఆరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భాగంగా వరంగల్‌లో చేపట్టేదే అతి పెద్దది. మిగతా ఐదు వేయి పడకలతో కూడినవి కాగా, వరంగల్ ఆసుపత్రి మాత్రం 1,750 పడకలతో నిర్మించను న్నారు. ఇప్పటికే పాత జైలు భవనాన్ని కూల్చి చదును చేశారు. 60 ఎకరాల సువిశాల స్థలంలో 24 అంతస్తులతో నిర్మిస్తారు. ఇక్కడ 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం అందు బాటులోకి రానుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లేన ట్టుగా మొత్తం 34 విభాగాలతో కూడిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ రూపుదిద్దుకోనుంది. ఇందుకు మంచి ఎలివేషన్‌తో కూడిన డిజైన్‌ను సిద్ధం చేశారు. మూడు బ్లాకులుగా ఉండే ఈ భవనం ముందు భారీ పచ్చిక మైదానం, విశాలమైన ఫౌంటెయిన్ ఏర్పాటు చేస్తారు. నిమ్స్ విస్తరణ ఇప్పటివరకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనమే రాష్ట్రంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ప్లాన్ చేయగా, మరోవైపు ఏకంగా 2 వేల పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టును కూడా రోడ్లు, భవనాల శాఖ చేపట్టనుంది. దీనికి సంబంధించి ప్లాన్లను సిద్ధం చేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న నిమ్స్ ఆసుపత్రి భవనానికి అనుబంధంగా ఈ నిర్మాణం జరగనుంది. ఇందుకు పక్కనే ఉన్న ఎర్రమంజిల్ క్వార్టర్స్ కాలనీని ఎంపిక చేశారు. దాదాపు 19 ఎకరాల్లో విస్తరించిన ఆ కాలనీ మొత్తాన్ని తొలగించి అక్కడ భారీ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అక్కడున్న దాదాపు 300 క్వార్టర్స్‌ను ఇప్పటికే ఖాళీ చేయగా, త్వరలో వాటిని కూల్చనున్నారు. -
మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!!
ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. మీరు కోరుకున్న విధంగా ఈ సంవత్సరంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 3.85 లక్షల గృహ నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం..2020లో 2.14 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. 2021 ప్రథమార్ధంలో సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాదిలో మొదటి ఏడు నగరాల్లో దాదాపు 2.78 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని తేలింది. ►2021లో పూర్తి చేసిన మొత్తం ఇళ్లలో గరిష్టంగా ఎన్‌సిఆర్‌లో దాదాపు పూర్తయ్యాయి. గతేడాది ఎన్సీపీఆర్లో 86,590 యూనిట్లు ఉండగా..2020లో 47,160యూనిట్లు పూర్తయ్యాయి. అంటే గతేడాది ఇళ్ల నిర్మాణం 2020 కంటే దాదాపు 84% ఎక్కువ. ►ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో సుమారుగా. 2021లో 70,490 యూనిట్లు పూర్తికాగా 2020లో 54,720 యూనిట్లు పూర్తయ్యాయి. ►పూణెలో సుమారు. 2021లో 46,090 యూనిట్లు పూర్తికాగా 2020లో 40,840 యూనిట్లు పూర్తయ్యాయి. ►బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఇళ్లనిర్మాణాలు సమానంగా ఉన్నాయి. 2021లో 63,870 యూనిట్లు పూర్తికాగా 2020లో 59,730 యూనిట్లు పూర్తయ్యాయి ►కోల్‌కతాలో 2020లో 11,920 పూర్తి కాగా 2021లో 11,620 యూనిట్లు పూర్తయ్యాయి. పరిశోధన ఫలితాలపై అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. “2022లో టాప్ 7 నగరాల్లో 3.85 లక్షల యూనిట్లను పూర్తి చేయాలని డేటా సూచిస్తుందని అన్నారు. చాలా నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని, థర్డ్ వేవ్ ప్రభావం రియాల్టీమీద చాలా తక్కువగా ఉందని పూరి చెప్పారు. దీంతో 2022లో ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. డెవలపర్లు కొత్త వాటిని ప్రారంభించే ముందు గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట
-
కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్
-
కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రద్దీకి తగినట్లుగా మౌలికసదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్ తెలిపారు. పోర్టులుపైనా సీఎం జగన్ సమీక్ష: రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టి, పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని సీఎంకు అధికారులు వివరించారు. ఫిషింగ్ హార్భర్లు: రాష్ట్రంలోని 9ఫిషింగ్ హార్భర్లలో తొలిదశలో నిర్మాణం చేపడుతున్న 4ఫిషింగ్ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. తొలిదశలో ఉప్పాడ(తూర్పుగోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా), జువ్వలదిన్నె(నెల్లూరు) జిల్లాల్లో ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం, రెండో విడతలో చేపడుతున్న మిగిలిన 5హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ 5 ఫిషింగ్ హార్భర్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. ఫేజ్ 2లో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) జిల్లాల్లో ఫిషింగ్ హార్భర్లు నిర్మాణం కానున్నాయని అధికారులు సీఎం వైఎస్ జగనకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, సీఎఫ్ఎస్ఎస్ సీఈఓ రవిసుభాష్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సలహాదారు వీ ఎన్ భరత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది: కైకాల సత్యనారాయణ -
Year End 2021: గ్రేటర్లో హై.. ఫ్లై!
సాక్షి, హైదరాబాద్: ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం. నిధుల లేమితో పనులు కుంటుపడవద్దనే తలంపుతో ప్రభుత్వం ఎస్సార్డీపీని ఏర్పాటుచేసి.. బాండ్లతో నిధులు సమకూరేలా చేయడమే కాక బ్యాంకు లోన్లకు అనుమతిచ్చింది. దీంతో జరిగే పనుల కనుగుణంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో పనులు వడివడిగా సాగుతున్నాయి. దీనివల్ల జీహెచ్ఎంసీకి ఎంతో ఆర్థిక భారం పెరిగినా.. కళ్లముందరి ఫ్లై ఓవర్ల వల్ల ప్రజల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా నిర్మించారనే ఆరోపణలున్నా రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీతో మున్ముందు వాటి ఉపయోగం తెలుస్తుదంటున్న వారూ ఉన్నారు. దశల వారీగా చేపట్టిన పనుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ. 4500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇతర విభాగాలవి కూడా కలిపితే వాటి విలువ రూ.6 వేల కోట్లు. అన్ని విభాగాలవీ వెరసి దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. పురోగతిలో ఉన్నవి.. ► బొటానికల్ గార్డెన్,కొత్తగూడ– కొండాపూర్ జంక్షన్ వద్ద: సెప్టెంబర్ 2022 ► శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్‌తో సహ 120 అడుగుల వెడల్పుతో రోడ్డు: సెప్టెంబర్ 2022, ఫేజ్ 1 పూర్తవుతుందని అంచనా. ► ఖైతలాపూర్ ఆర్ఓబీ(హైటెక్‌సిటీ– బోరబండ రైల్వేస్టేషన్ల మధ్య): కోర్టు వివాదం పరిష్కారమైతే మార్చి 2022లో పూర్తి. ► ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్: మార్చి 2022 ► బైరామల్ గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022 ► బైరామల్‌గూడ కుడి, ఎడమ వైపులా రెండు లూప్‌లు, రెండో వరుసలో ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022. ► నాగోల్ ఫ్లై ఓవర్ : జూన్ 2022 ► ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్: ఫిబ్రవరి 2022 ► పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జి: జనవరి 2022 ► తుకారాంగేట్ వద్ద ఆర్యూబీ: ఫిబ్రవరి 2022 ► ఇందిరాపార్కు–వీఎస్టీ, రామ్‌నగర్–బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్లు: డిసెంబర్ 2022, 1వ ఫేజ్ ► ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్: డిసెంబర్ 2023 ► బహదూర్‌పురా జంక్షన్ ఫ్లైఓవర్: మార్చి 2022 ► చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు: జూన్ 2022 ► నల్గొండ క్రాస్‌రోడ్స్– ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ ఫ్లైఓవర్: అక్టోబర్ 2022 ► ఫలక్‌నుమా ఫ్లైఓవర్‌కు సమాంతర ఫ్లైఓవర్: సెప్టెంబర్ 2022 ► శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ: జూలై 2023 ► ఆరాంఘర్నుంచి జూపార్క్ వరకు ఫ్లైఓవర్ మార్చి 2023లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ► ఇవి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని పనులు కాగా, గ్రేటర్ పరిధిలో ఇతర విభాగాల ఆధ్వర్యంలో పూర్తయిన, జరగుతున్న పనులిలా ఉన్నాయి. ► పూర్తయిన పనులు: ఓఆర్ఆర్–మెదక్ సెక్షన్ వరకు రహదారుల విస్తరణ.. అప్‌గ్రేడేషన్ పనులు, బాలానగర్ క్రాస్‌రోడ్స్ ఫ్లైఓవర్, ఆనంద్‌బాగ్ ఆర్యూబీ. పూర్తి కావాల్సిన పనులు: అంబర్‌పేట చేనెంబర్ క్రాస్‌రోడ్స్ ఫ్లైఓవర్(రూ.369.19 కోట్లు),ఆరాంఘర్– శంషాబాద్ సెక్షన్ ఫ్లైఓవర్(రూ.488 కోట్లు), ఉప్పల్– సీపీఆర్ఐ (రూ.821కోట్లు). ► అన్ని విభాగాల్లో వెరసి పురోగతిలో ఉన్న పనుల అంచనా వ్యయం దాదాపు రూ. 6 వేల కోట్లు. పూర్తయిన పనులివీ.. ఫ్లైఓవర్లు మైండ్‌స్పేస్, రాజీవ్‌గాంధీ విగ్రహం(కూకట్పల్లి), బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు, రోడ్‌నెంబర్ 45–దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జిని కలుపుతూ, కామినేని హాస్పిటల్ వద్ద రెండు వైపులా రెండు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు, బైరామల్‌గూడ వద్ద కుడివైపు, పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జితో, ఒవైసీ జంక్షన్లో అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ పూర్తయ్యాయి. ఇక షేక్పేటఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. కొత్త సంవత్సర కానుకగా అందుబాటులోకి రానుంది. ► దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికే తలమానికంగా నిలుస్తోంది. అండర్‌పాస్‌లు.. అయ్యప్పసొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్,చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్,ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు. ఆర్యూబీ/ఆర్ఓబీలు.. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్, ఉత్తమ్‌నగర్, ఉప్పుగూడల వద్ద ఆర్‌యూబీలు, లాలాపేట ఆర్ఓబీ పునరుద్ధరణ. -
జగనన్న కాలనీల నిర్మాణాల పై గృహనిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టి
-
‘చెక్’లేని డ్యామ్‌లు.. నీరుగారుతున్న లక్ష్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో వట్టిపోయిన వాగులు, వంకలకు తిరిగి జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం పనులు ముగిసే నాటికి వివిధ వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలాచోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో నాణ్యత లోపించి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. కొన్ని జిల్లాల్లో కాంట్రాక్టు ఏజెన్సీలున్న ప్రజాప్రతినిధులు ఈ పనులు చేపట్టారు. మరికొందరు బినామీలకు కట్టబెట్టారు. అయితే, చాలాచోట్ల నాణ్యత లోపించి చెక్‌డ్యామ్‌లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు రెండేళ్లలో 1,200 చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.3,825 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీటి నిర్మాణం తర్వాత సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలూ మెరుగుపడతాయని ప్రభుత్వం భావించింది. 2020–21 సంవత్సరంలో రూ.2,847.71కోట్లు కేటాయించింది. చిన్న వాగులపై చేపట్టే నిర్మాణాలకు కనిష్టంగా రూ.2.50లక్షలు, పెద్ద వాగులు, ఉప నదులపై కట్టడాలకు గరిష్టంగా రూ.11 కోట్లు ఇచ్చారు. 600 చెక్‌డ్యాంల కోసం టెండర్లు పిలవగా.. 91 నియోజకవర్గాల్లో 596 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఖరారయ్యాయి. పలు జిల్లాల్లో నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పోటీపడి టెండర్లు సాధించారు. చాలాచోట్ల అంచనా కన్నా తక్కువకు టెండర్లు దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో నాయకులు తమ అనుకూలురుకి పనులు దక్కేలా చూసుకున్నారు. అయితే, చాలాచోట్ల నిర్మాణంలో నాణ్యతను గాలికొదిలేశారు. దీంతో ప్రభుత్వ సమున్నత లక్ష్యం నీరుగారిపోతోంది. ఉదాహరణలెన్నో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 50 చెక్‌డ్యాంలు మంజూరు కాగా.. ఇందులో ఆదిలాబాద్‌లో 20 పూర్తి కాగా, నిర్మల్‌లో 21, ఆసిఫాబాద్‌లో రెండు పూర్తయ్యాయి. ఇక మంచిర్యాలలో పనులు చాలాచోట్ల సగమే పూర్తయ్యాయి. ఎక్కువచోట్ల వానాకాలంలో నిర్మాణ దశలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. అటవీ ప్రాంతంలో వరదకు కొన్నిచోట్ల కొట్టుకుపోవడంతో మళ్లీ మరమ్మతు పనులు చేపట్టారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల కోట్ల నిధులు వృథా అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు మానేరు వాగుపై చెక్‌డ్యాం నాసిరకంగా నిర్మించడంతో రెండు ముక్కలైంది. రూ.14.46 కోట్లకు టెండర్ ఆహ్వానించగా, కాంట్రాక్టర్ రూ.10.93 కోట్లకే దక్కించుకున్నారు. ప్రవాహానికి అనుగుణంగా డిజైన్ లేకపోవడం ప్రధాన లోపం కాగా, వానాకాలం ఆరంభంలో వరదలకు డ్యాం మధ్యభాగం రెండుగా విడిపోగా.. రెండోసారి వచ్చిన వరదకు రెండు వైపులా గోడల పక్కన మట్టి భారీగా కోతకు గురైంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోర గ్రామ సమీపంలో కప్పలవాగుపై రూ.5.75 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం కట్ట వరదకు కొట్టుకుపోయింది. ఇరువైపులా వింగ్ వాల్స్ పక్కన మట్టి కోతకు గురైంది. చివరకు వాగు విస్తీర్ణం మేరకు రెండువైపులా గోడలు కట్టాల్సి ఉండగా.. వాగు లోపలి భాగంలోనే నిర్మించారని, నిర్మాణంలో నాణ్యత, డిజైన్‌లో లోపాలున్నాయని గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల–మణుగూరు మార్గంలో మల్లన్నవాగుపై ఈ ఏడాదే నిర్మించిన చెక్‌డ్యాం కొద్దిపాటి వర్షాలు, వరదలకు కోతకు గురైంది. వాగు ఉధృతిని అంచనా వేయకుండా రెండువైపులా గట్లను కలుపుతూ డ్యాం కట్టారు. ఇప్పుడు వింగ్ వాల్స్‌కు ముప్పు ఏర్పడి మొత్తం నిర్మాణమే ప్రమాదంలో పడింది. జనగామ జిల్లాలో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు అధికారుల పర్యవేక్షణా లోపంతో నాణ్యత లోపించింది. దేవరుప్పుల, గొల్లపల్లి, మున్పహాడ్ శివారులోని వాగు ప్రాంతంలో ఏడాది క్రితం రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యాంల సైట్ కట్టలు ఒక్క వర్షాకాలంలోనే బీటలువారి తెగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తిసదగోడు వద్ద దుందుబీ వాగుపై రూ.6.78కోట్ల నిధులతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం 60% పూర్తయింది. గత ఆగస్టు 31న వచ్చిన దుందుబీ ప్రవాహానికి కుంగింది. చెక్‌డ్యాం దిమ్మె పగుళ్లు ఏర్పడి ఇసుకలోకి కూరుకుపోయింది. ముక్కలైన రిటైనింగ్ వాల్ మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా కరీంనగర్ తీగల వంతెన దిగువన నిర్మించిన చెక్‌డ్యామ్ రిటైనింగ్ వాల్ పరిస్థితి ఇది. వరద ఉధృతికి ఇలా కొట్టుకుపోయింది. దీంతో రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. కరీంనగర్ నుంచి మాన కొండూర్ మండలం వేగురుపల్లి వరకు నీరు నిల్వ ఉండేలా రూ.12 కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్ నీళ్లు పక్కకు వెళ్లకుండా రిటైనింగ్ వాల్ కడుతుండగా ఎల్ఎండీ నుంచి నీళ్లు విడుదల చేయడంతో ఆ రిటైనింగ్ వాల్ ముక్కలైంది. రూ. 9.66 కోట్లు దండగ.. ములుగు జిల్లా మేడారం జంపన్నవాగులో నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. పడిగాపురం సమీపంలో రూ.4.51 కోట్లతో, రెడ్డిగూడెంలో రూ.2.88 కోట్లు, మేడారంలో రూ.2.75కోట్లు, ఊరట్టంలో రూ.3.42 కోట్లతో నిర్మించారు. కానీ, వాగులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పడిగాపురం చెక్‌డ్యాం మినహా మిగిలిన మూడు చెక్‌డ్యామ్‌లను కూల్చాలని నిర్ణయించారు. మూడింటి నిర్మాణానికి రూ.9.05కోట్లు వెచ్చించారు. కూల్చివేతకు మరో రూ.61 లక్షలు ఖర్చుచేశారు. అధికారులకు ముందుచూపు లేని కారణంగా రూ. 9.66 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే.. నందిగడ్డ ప్రాంతంలో దుందుబీ వాగులో నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణంలో ఉండగానే కుంగిపోయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వరద ఉధృతికి చెక్‌డ్యాం తట్టుకోలేక కుంగిపోయి రైతుల పొలాలు కోతకు గురయ్యాయి. రూ.కోట్ల నిధులు వృథా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. – అంతిరెడ్డి, రైతు, జప్తిసదగోడు, ఉప్పునుంతల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా వారి ఆదేశాల మేరకే.. మేడారం జంపన్నవాగులో నీటిని నిల్వ చేసేందుకు మూడు చెక్‌డ్యాంలను నిర్మించారు. కానీ, నిల్వ ఉన్న నీటిలోపడి భక్తులు మరణిస్తుండటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ, కమిషనర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క లేఖలు, ఆదేశాల మేరకు కూల్చివేత పనులు చేపట్టాం. వాటి కూల్చివేతకు రూ.61 లక్షలు కేటాయించారు. -సదయ్య, డీఈఈ, జలవనరుల శాఖ, తాడ్వాయి నిర్లక్ష్యంగా నిర్మాణం ప్రభుత్వం చెక్‌డ్యాంల కోసం నిధులిస్తే అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బక్కురి మోహన్, రైతు, సుంకెట్, నిజామాబాద్ జిల్లా -
ఆర్ఆర్ఆర్లో 8 భారీ ఇంటర్ ఛేంజర్లు.. లేదు సాటి.. దేశంలోనే మేటి
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి మంజూరు కావడం, అలైన్మెంట్ కూడా ఖరారు కావడంతో అధికారులు రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించారు. 158.6 కి.మీ. నిడివితో రూపొందే ఈ భాగం రోడ్డులో 8 ప్రాంతాల్లో భారీ కూడళ్లు (క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజెస్) ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్ వేలలో ఇవి మేటిగా ఉండ నున్నాయి. ఇలాంటి నిర్మాణాలను భాగ్యనగరానికి పరిచయం చేస్తూ 12 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)లో భాగంగా నిర్మించిన క్లవర్‌లీఫ్ ఇంటర్ఛేంజెస్తో పోలిస్తే ఇవి మరింత భారీగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే ఆర్ఆర్ఆర్ నిర్మితం కానున్నా భవిష్యత్తులో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భావి అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. ఒక్కోటి దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నాయంటే వాటి పరిమాణం ఏ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌పైకి వాహనదారులు రావడానికి, ఆర్ఆర్ఆర్ నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజెస్ అవకాశం కల్పిస్తాయి. సర్వీసు రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా వీటిని నిర్మించనున్నారు. క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్టర్లు రానున్న ప్రాంతాలు... 1.హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి: పెద్దాపూర్–గిర్మాపూర్ గ్రామాల మధ్య 2.సంగారెడ్డి–నాందేడ్ రహదారి: శివంపేట సమీపంలోని ఫసల్వాది సమీపంలో.. 3.హైదరాబాద్–మెదక్ రోడ్డు: రెడ్డిపల్లి–పెద్ద చింతకుంట మధ్య 4.హైదరాబాద్–నాగ్‌పూర్ రోడ్డు: తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద 5.హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి: గౌరారం సమీపంలోని గుందాన్‌పల్లి వద్ద 6.హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి: భువనగిరి–రాయ్‌గిరి మధ్య భువనగిరికి చేరువలో.. 7.జగదేవ్‌పూర్–చౌటుప్పల్ రోడ్డు: మందాపురం–పెనుమటివానిపురం మధ్య.. 8.హైదరాబాద్–విజయవాడ హైవే: చౌటుప్పల్ సమీపంలోని బాగరిగడ్డ వద్ద -
Polavaram Project: బయటపడుతున్న చంద్రబాబు అక్రమాలు
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బాబు ప్రభుత్వం, ఆ కంపెనీ కలిసి సుమారు నలభై కోట్లు ఎగ్గొట్టింది. కూరగాయల సప్లయర్ నుంచి అనేక పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. చదవండి: రామోజీ మార్కు ‘వైఫల్యం’ తమకు రావాల్సిన బకాయిలేవని వారు ప్రశ్నిస్తే బలవంతంగా సెటిల్మెంట్ చేసి అప్పటి మంత్రి దేవినేని ఉమా సగానికి సగం కోసేశారు. అలా సెటిల్మెంట్ చేసిన ఎమౌంట్ కూడా ఇప్పటి వరకూ వారికి చేరనేలేదు. ఇప్పుడు వాళ్లంతా ట్రాన్స్ట్రాయ్ చేసిన నిర్వాకం, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు చేసిన సెటిల్మెంట్లను ఏకరువు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో తమకు రావాల్సిన సొమ్ము ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. -
‘రియల్ ఎస్టేట్’ సమస్యల పరిష్కారానికి చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ క్రెడాయ్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి రామమనోహర్, కమిషనర్ (సీడీఎంఏ) ఎం.ఎం.నాయక్, డీటీసీపీ రాముడుతో పాటు క్రెడాయ్ ప్రతినిధులు రాజా శ్రీనివాస్, బోస్, స్వామి, జీవీఎస్సీ రాయుడు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం అమలులో ఉన్న జీవోలు, అందుకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలని, కోవిడ్ కారణంగా పనులు మందగించినందున నిర్మాణాలు పూర్తి కాలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జారీ చేసిన అనుమతులు (బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్లు) గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. టీడీఆర్‌ల జారీ, వాటి కాలపరిమితి, ఖాళీ ల్యాండ్ ట్యాక్సు, ఎల్ఆర్ఎస్ అమలు, ఆన్లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలోని అనేక సమస్యలను పరిష్కరించడం ద్వారా నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా క్రెడాయ్, ఇతర సంఘాల ప్రతినిధులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్లందరితో సమగ్రంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు రూపొందిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే, ఆ ఉత్తర్వుల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ ఇటీవల క్రెడాయ్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకుని వచ్చినందున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన తరువాత త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి బొత్స హామీ ఇచ్చారు. -
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడం వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంది. పరిశ్రమలు, కాలేజీల నిర్మాణం వంటివి ఇలానే ఆగిపోతున్నాయని పేర్కొంది. వైద్య కళాశాలల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన భూమిని వైద్య కళాశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ బొజ్జా దశరాథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిల్ దాఖలు చేసిన ఆది రామకృష్ణుడు పార్టీ ఇన్‌పర్సన్‌గా వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. స్టే ఉత్తర్వుల వల్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎలాంటి పనులు జరగడం లేదని తెలిపారు. మరో పిటిషనర్ న్యాయవాది బొజ్జా అర్జునరెడ్డి.. ఈ వ్యాజ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాయిదాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే పిటిషనర్ పలు వాయిదాలు తీసుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారికి అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఇలా పదేపదే వాయిదాలు కోరుతున్నారని తెలిపారు. వాయిదాల వల్ల మెడికల్ కాలేజీల నిర్మాణం ముందుకెళ్లడం లేదని చెప్పారు. ప్రభుత్వం సైతం ప్రజల కోసమే మెడికల్ కాలేజీలు కడుతోందన్నారు. ఈ సమయంలో అటు అదనపు ఏజీ సుధాకర్, ఇటు పిటిషనర్ న్యాయవాది అర్జున్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వాదనలతో తమకు దీపావళి వేడుకలను ముందుగానే జరుపుకొన్నట్లు ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించింది. దీపావళి తరువాత కూడా కాల్చుకోవడానికి టపాసులను (వాదనలు) దాచుకోవాలని ఇరుపక్షాలకు సూచించింది. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులతోసహా అందరూ నవ్వుకున్నారు. ఇలాంటి వ్యాజ్యాల వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. -
సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’
జీహెచ్ఎంసీ మేయర్ క్యాంప్ కార్యాలయానికి (ఇంటి వద్ద) కానోపి షెడ్ నిర్మాణం కోసమంటూ దాదాపు రూ. 4.18 లక్షల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. ఇలా జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు తాము ఏవి కావాలనుకుంటే అవి చేయించుకుంటున్నారు. ఓవైపు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. వారు మాత్రం దేనికీ వెనుకాడటం లేరు. ప్రస్తుత పరిస్థితికి ఇది ఓ మచ్చుతునక ! – సాక్షి,సిటీబ్యూరో బల్దియా అంటే అంతే మరి.. జీహెచ్ఎంసీ ఖజానాలో చేరాల్సిన సొమ్మును ఉద్యోగులు సొంతానికి వాడుకుంటారు. ఇతర శాఖల్లో పనిచేసినప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించినా ఎలాంటి వాహనం లేనివారికి ఇక్కడికి రాగానే వాహనం వచ్చి వాలుతుంది. ఇక ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులైతే బల్దియా భవనాన్ని తమ సొంత ఇల్లే అనుకుంటారు. ఇంటికైనా రంగులు వేయాలనుకుంటే వెనుకాముందు కాస్త ఆలోచిస్తారేమో కానీ.. ఇక్కడ మాత్రం బాగున్నవాటిని సైతం కూలగొట్టి గొప్పగా కట్టించుకుంటారు. ఇలా ఎందుకంటే.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. వ్యయానికి నిధుల పరిమితి లేదు. అందుకే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం ఖరీదైనవి కొంటారు. పాలకమండలి కొత్తదా, పాతదా అన్న తేడా లేదు. పదవి పోయాక వాటికి ఇంటికి తీసుకెళ్తారు. అధికారులూ ఆడంబరాలకు పోతారు. చేసిన అప్పులకు రోజుకు సగటున కోటి రూపాయల వడ్డీ కడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ దర్పం ఏమాత్రం తగ్గకుండా బాగున్నవి కూల్చి కొత్తగా కడుతుండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చుకానీ.. వారికవి మామూలే. ప్రధాన కార్యాలయ భవనంలో గత రెండు మూడేళ్లుగా ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పని జరుగుతూనే ఉంది. కాళేశ్వరం, మిషన్ భగీరథల వంటి ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లై ఓవర్లు పూర్తయినా.. ఇక్కడ ఎప్పుడూ ఏదో పని జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం .. వారికే తెలుసు. ఇక పనులే కాదు.. ఏవిషయంలోనూ ఖర్చులకు వెనుకాడరు. టీ , బిస్కెట్ల నుంచి ఉత్సవాల నిర్వహణల వరకు ఖర్చు గ్రాండ్‌గా ఉండాల్సిందే. పాత పాలకమండలి.. కొత్త పాలకమండలి.. అప్పటి అధికారులు, ఇప్పటి అధికారులు అనే తేడా ఏం లేదు. అందరూ అతిరథులే.. ఖర్చుల మహారథులే. చెప్పుకుంటే.. ఎంతెంతో.. ► బల్దియాలో చాలామంది ఘనాపాటీలే. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక తొలి పాలకమండలి (2009–14)లో రెండు పార్టీల ఫ్లోర్‌లీడర్లు బల్దియాకు చెందిన సోఫాలు, జనరేటర్లు వంటివి సైతం ఇళ్లకు తరలించుకు వెళ్లారు. వారి కార్యాలయాల్లో ఉన్న వాటిని తమ పదవి పోగానే వాటిని సైతం ఇళ్లకు తీసుకెవెళ్లారు. ► కాగిత రహిత పాలన కింద ల్యాప్‌టాప్‌లు తీసుకొని తిరిగి ఇచ్చేయని వారెందరో. ► అధ్యయన యాత్రల పేరిట..వాటికి వెళ్లకుండానే అందుకయ్యే ఖర్చు దాదాపు లక్ష రూపాయలకు పైగా సొంత జేబుల్లో వేసుకున్నవారున్నారు. ప్రస్తుత పాలకమండలి అయితే.. ► మేయర్ క్యాంప్ కార్యాలయంలో(ఇంట్లో) కరెంట్ లేదంటూ భారీ ఇన్వర్టర్ను కోరడం రచ్చ కావడంతో వెనక్కు తగ్గారు. ► డిప్యూటీ మేయర్ కార్యాలయం ఆధునీకరణ చేపట్టారు. గత డిప్యూటీ మేయర్ కంటే తక్కువేం కాదంటూ రూ. 20 లక్షలు ఖర్చుచేస్తున్నారు. గత పాలక మండలి కూడా తక్కువేం కాదు.. ► గత పాలకమండలి(2016–21)లో డిప్యూటీ మేయర్ చాంబర్ ఆధునీకరణ పేరిట దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు ► ఖరీదైన సెల్ఫోన్లు పాలక మండలి సభ్యులతోపాటు మేయర్ పేషీల్లోని ఉద్యోగులు సైతం పొందారు. ► మేయర్ కోసం ఒకటో అంతస్తులో ఒక చాంబర్ ఉండగా, పైన ఏడో అంతస్తులో మరొకటి ఏర్పాటు చేసుకున్నారు. అధికారులూ అంతే.. ► బాగున్న పన్వర్హాల్ను ఆధునీకరణ పేరిట లక్షలు ఖర్చు చేసి.. అసౌకర్యంగా మార్చారు. ► ప్రతి సోమవారం ప్రజావాణి, ఫేస్ టూ ఫేస్ వంటి కార్యక్రమాలేవీ లేకున్నా హాస్పిటాలిటీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి. పన్వర్ హాల్లో విలేకరుల సమావేశం పెట్టినా రూ. 20వేలు ఖర్చు చూపిస్తారు. ► ఎంతో మోజుపడి అద్దంలా చాంబర్లకు హంగులదుకున్న అధికారులు.. ఆ చాంబర్ల సౌఖ్యం పొందకుండానే బదిలీ అయి వెళ్లడం విచిత్రం. ► ఒక విభాగం ఆధునీకరణ పనుల కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని విభాగాల పనులుఇంకా జరుగుతున్నాయి. ► చెప్పుకుంటూ పోతే.. బల్దియాలో ఇలాంటిచిత్రవిచిత్రాలింకా ఎన్నెన్నో ! పొదుపు పాటించాలి.. దుబారా ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించాలి. ప్రస్తుతం నెలనెలా జీతాల చెల్లింపులకే ఇబ్బందులు పడుతున్న తరుణంలో వృథా ఖర్చుల్ని నిలిపివేస్తే మేలు. ప్రజలు చెల్లించిన పన్నుల నిధుల్ని ప్రజా సదుపాయాలకు వాడాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బల్దియా చట్టంలో ఖర్చు చేయొచ్చని లేదు.. మేయర్, డిప్యూటీ మేయర్ల చాంబర్లకు ఖర్చుచేయాలని బల్దియా చట్టంలో లేదు. క్యాంప్ కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసుకోవచ్చుననీ లేదు. ఫ్లోర్‌లీడర్లు, వారికి కార్యాలయాలు, ఫర్నీచర్ వంటివి లేవు. హోదాకు తగ్గట్లు ఉండేందుకు గౌరవంతో చేసేవి మాత్రమే. – సీనియర్ అధికారి, జీహెచ్ఎంసీ మీసాలకు సంపెంగనూనె.. మింగ మెతుకు లేకున్నా.. మీసాలకు సంపెంగనూనె అన్నట్లుంది జీహెచ్ఎంసీ వ్యవహారం. జీహెచ్ఎంసీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అయినా ఆడంబర ఖర్చులు, దుబారా వ్యయం తగ్గించుకునే పరిస్థితిలో లేరు. చాంబర్ల మార్పులు, అనవసర రిపేర్లు, వాహనాల వినియోగం, లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తగ్గకపోగా, పెరుగుతున్నాయి. అవినీతి పెచ్చరిల్లి పోతున్నది. – ఎం. శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మించాలి బల్దియా కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడితే ఎంతో ప్రయోజనం. పారిశుధ్య కార్మికుల స్వేదంతోనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. కోట్లకు కోట్ల దుబారా ఖర్చుల్ని తగ్గించాలి. డిప్యుటేషన్ మీద వచ్చి పాతుకుపోయిన వారిని మాతృసంస్థలకు పంపించాలి. – యు.గోపాల్, అధ్యక్షుడు, జీహెచ్ఎంఈయూ చదవండి: అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను.. -
సిలికానాంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభం
సిలికాన్ వ్యాలీ : ప్రవాస భారతీయులు నెలకొల్పిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. శాన్ వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణ సమీపంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. 2016లో స్థాపించిన ఈ యూనివర్సిటీకి WASC SCUC (Senior College and University Commission) గుర్తింపు ఉంది. 67 ఎకరాల్లో ఈ ప్రాంగణ నిర్మాణానికి 67 ఎకరాల భూమిని సంధు కుటుంబం విరాళంగా అందించింది. సిలికాన్ వ్యాలీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన నిర్మిస్తున్న ఈ క్యాంపస్ వల్ల శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికై సముచితమైన విద్యాబోధనను అందిస్తుందన్నారు. రూ. 3,300 కోట్ల వ్యయంతో రాబోయే ఐదేళ్లలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణానికి 450 మిలియన్ డాలర్ల (రూ.3300 కోట్లు)ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.uofsa.edu వెబ్ సైటులో లభ్యమవుతాయి. చదవండి : అమెరికాలో భారతీయుల హవా.. సంపాదనలో సూపర్ -
మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలే.. చివరికి
జయపురం(భువనేశ్వర్): వంతెన నిర్మించండి మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో చందాలు వేసుకుని మరీ వెదురు కర్రలు కొనుగోలు చేసుకున్నారు. మూడు రోజులు కష్టపడి కెరకొండ నదిపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. బొరిగుమ్మ సమితిలోని డెంగాపొదర్ పంచాయతీ ప్రజలు చేపట్టిన ఈ పనిని చుట్టుపక్కల గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా మూడేళ్ల క్రితం బిజూ పట్నాయక్ సేతు పథకంలో భాగంగా ఇక్కడి నదిపై శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటివరకు ఆ నిర్మాణంలో కనీసం 10 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఇదే వంతెనపై ఆధారపడిన పంచాయతీలోని డెంగాపొదర్, కెరకొండ, చత్రల, చంపియా, పొడయిగుడ, పకనగుడ, పరసొల, నాగజొడి, బిజాగుడ, అంవులి వంటి దాదాపు 15 గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం నది నీటిలో ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమస్య పరిష్కారానికి అధికారులు, నేతల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇలా అందరూ కలిసి, వెదురు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. దీంతో తమ కష్టాలు కొంతవరకు అయినా తీరాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Rescued Pregnant Cat: పిల్లిని కాపాడినందుకు రూ.10 లక్షల రివార్డు ! -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
ఏపీ: 20,403 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో పట్టణాలు, నగరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్(పీఎంఏవై–యూ) పథకం కింద మంజూరై నిర్మాణాలు మొదలవ్వని, పునాది దశ కూడా పూర్తి చేసుకోని ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పీఎంఏవై–వైఎస్సార్ (అర్బన్) పథకం కింద 20,403 ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు తొలి దశ కార్యక్రమంలో భాగంగా వీటి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఒక్కో ఇంటికి పీఎంఏవై–వైఎస్సార్(అర్బన్) పథకం కింద ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేయనుంది. మొత్తం 20,403 ఇళ్లలో 2016–17కి సంబంధించి 2,529 ఇళ్లు, 2017–18కి సంబంధించి 7,465, 2018–19కి సంబంధించి 10,409 ఇళ్లున్నాయి. -
పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం
-
ఏపీ: శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జల వనరుల శాఖ డీఈఈ ఎంకేడీవీ ప్రసాద్ తదితరులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సోమవారం పనులు ప్రారంభించారు. 96 మీటర్ల పొడవు, 10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. దిగువ కాఫర్ డ్యాం లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. దిగువ కాఫర్ డ్యాం దగ్గర నదిలో గ్యాప్‌లను పూడ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంపై జలవనరులశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణంపై దృష్టి సారించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసీఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. -
వర్షాకాలం ముగియగానే కొత్త రోడ్లనిర్మాణాలు చేపడుతాం : శంకర్ నారాయణ
-
ఆగిన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్‌లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్‌రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్సీఆర్లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు. -
Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ
సాక్షి, ఉప్పల్( హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్లో మరిన్ని ప్లై ఓవర్లకు జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు. భవిషత్లో రానున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ముందస్తుగా మరో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతి పాదనలను అధికారులు సిద్ధం చేశారు. దాదాపుగా రూ.311 కోట్లతో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. స్కైవేకు ఇరువైపుల రెండు వంతెనలతో పాటు, మెట్రోరైల్ వంతెనకు రెండు వైపుల మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దాదాపు రూ.658 కోట్లతో.. ► ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న స్కై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) పనులు కొనసాగుతున్న విషయం విధీతమే. ► ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు 6.4 కిలో మీటర్ల పొడవుతో దాదాపు రూ. 658 కోట్లతో నిర్మిస్తున్నారు. ► భవిషత్లో వరంగల్ నుంచి ఇటు సికింద్రాబాద్ మరో పక్క ఎల్బినగర్ వైపు, ఇంకోపక్క రామంతాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కేంద్రీకృతమయ్యే ట్రాఫిక్‌ను అధిగమించేందుకు ఈ వంతెనలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చక చకా పనులు.. ► ఎలివేటెడ్ కారిడార్ ముగింపు ప్రాంతం నుంచి రామంతాపూర్ క్రికెట్ స్టేడియం రోడ్డు వద్ద తిరిగి ఉప్పల్ పారిశ్రామిక వాడ మోడ్రన్ బేకరీ చౌరస్తా నుంచి ఉప్పల్ వరకు రోడ్డుకు ఇరువైపుల రెండు ప్లై ఓవర్లును నిర్మించనున్నారు. ► మరో వైపు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల గేటు నుంచి నాగోల్ రోడ్డు ఉప్పల్ మెట్రోస్టేషన్ రాజ్యలక్ష్మి థియేటర్ వరకు అటు నుంచి నాగోల్ రోడ్డు నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్ ఇండియా గేట్ వరకు మొత్తం నాలుగు ప్లైఓవర్లను నిర్మించనున్నారు. ► ఇందుకు సంబంధించిన రోడ్డు వెడల్పు పనులను కూడా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు చకా చకా ప్రారంభించారు. ► హబ్సిగూడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా నాగోల్ రోడ్డు రాజ్యలక్ష్మి థియేటర్ వరకు 1.5 కిలో మీటర్ల పొడవున ప్రస్తుతం 30 మీటర్ల రోడ్డు ఉండగా దానిని 60 మీటర్ల వరకు పొడగించనున్నారు. ► రోడ్డు వెడల్పులో భాగంగా 25 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతుండగా అందులో 6 ప్రభుత్వ ప్రాపర్టీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రింగ్ రోడ్డుపై భారం తగ్గించడమే లక్ష్యం.. వరంగల్ జాతీయ రహదారి వైపు నుంచి స్కైవే పైగా వచ్చే ట్రాఫిక్ ఉప్పల్ జంక్షన్ వద్దకు రాగానే తిరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తే ప్రమాదముంది. అటు వైపు నుంచి హబ్సిగూడ, రామంతాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ తీవ్రరూపం దాల్చకముందే రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో నాలుగు సమాంతర ఫ్లై ఓవర్లను నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. ప్రతిపాదనలు పూర్తవ్వగానే పనులను ప్రారంభిస్తాం. – రవీందర్ రాజు, ఎస్ఈ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం నాగోల్ వైపు 60 మీటర్ల రోడ్డు.. ఉప్పల్ చౌరస్తా మీదుగా నాగోల్ వైపు 60 మీటర్ల రోడ్డును వెడల్పు చేయనున్నాం. మొదటి దశగా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ నుంచి రింగ్ రోడ్డు మీదుగా రాజ్యలక్ష్మి థియేటర్ వరకు అక్కడి నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్ ఇండియా గేటు వరకు రోడ్డుకు ఇరువైపుల రోడ్డు వెడల్పుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పులో నష్టపోయే 25 ఆస్తులను గుర్తించాం. – శ్రావణి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఉప్పల్ -
డబ్బులు లేక, ఆగిన 1.74 లక్షల గృహాల నిర్మాణం
న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి నిధుల కొరత నెలకొన్న నేపథ్యంలో పలు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు నిల్చిపోయాయి. దేశీయంగా హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో 1.74 లక్షల గృహాల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ సుమారు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014, అంతకన్నా ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులను దీనికి పరిగణనలోకి తీసుకున్నారు. నిల్చిపోయినవే కాకుండా జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 6,28.630గా ఉంటుందని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 5,05,415 కోట్లుగా వివరించింది. నిర్మాణ రంగాన్ని నిధుల కొరత సమస్య వెంటాడున్నందున.. పూర్తిగా నిల్చిపోయిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు చేసిన వారికి భవిష్యత్ అంచనాలు అత్యంత విపత్కరంగా ఉన్నాయని తెలిపింది. భారీ జాప్యమున్న ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకూ పరిస్థితి ఆశావహంగా లేవని పేర్కొంది. ఢిల్లీలో అత్యధికం .. నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో సుమారు రూ. 2,727 కోట్ల విలువ చేసే 4,150 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా రూ. 86,463 కోట్ల విలువ చేసే 1,13,860 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఇది మొత్తం టాప్ 7 నగరాల్లో నిల్చిపోయిన వాటిలో 66 శాతం కావడం గమనార్హం. అటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 41,730 యూనిట్లు (విలువ రూ. 42,417 కోట్లు), పుణెలో 9,900 యూనిట్లు (విలువ రూ. 5,854 కోట్లు), బెంగళూరులో 3,870 యూనిట్లు (విలువ రూ. 3,061 కోట్లు), కోల్‌కతాలో 150 ఫ్లాట్ల (విలువ రూ. 91 కోట్లు) నిర్మాణం ఆగిపోయింది. ఇక, నిల్చిపోయిన వాటితో పాటు జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ. 11,810 కోట్ల విలువ చేసే 17,960 యూనిట్లు ఉన్నాయి. -
బ్యాంకు మాజీ ఉన్నతాధికారి కృషి.. పైపులైన్ల పంట!
వ్యవసాయంపై ఉన్న మమకారం ఆయనను తిరిగి సొంతూరికి తీసుకొచ్చింది. పదెకరాల నల్లరేగడి భూమిని సాగు చేసుకుంటూ తమ ఊళ్లో విశ్రాంత జీవితం గడుపుదామని ఆయన నిర్ణయించుకొని ఉండకపోతే.. సాగు నీరు లేక అల్లాడుతున్న ఆ ఊరు పొలాల్లో హంద్రీ నీవా కాలువ నీరు జల జలా పారేదే కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి పట్టుదలతో ఆయన సాధించిన వరుస విజయాల గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు! ఆయన పేరు సూగూరు వెంకటేశ్వరరెడ్డి. రైతు బిడ్డ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఆయన స్వగ్రామం. వ్యవసాయంలో బీఎస్సీ పట్టా తీసుకున్న ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్‌లో వ్యవసాయ క్షేత్ర అధికారిగా ఉద్యోగంలో చేరారు. 35 ఏళ్ల తర్వాత 2018లో ఏజీఎంగా ఉద్యోగ విరమణ చేసి.. సొంతూళ్లో సేద్యం చేస్తూ వ్యవసాయానికి జవసత్వాలు చేకూర్చుతున్నారు. ? ఉమ్మడిగా భూగర్భ పైపులైన్లు మల్లెపల్లి గ్రామానికి 2.5 కి. మీ. దూరం నుంచి హంద్రీ నీవా – సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ వెళ్తుంది. వర్షాలు కురిస్తే కాలువలో ఏడాది పొడవుగా నీళ్లు పారుతుంటాయి. కానీ, గ్రామ పొలాలకు ఈ నీరు పారదు. వెంకటేశ్వరరెడ్డి పైపులైను గురించి ఆలోచించారు. గ్రామ రాజకీయాలను, రైతుల్లో అనైక్యతను అధిగమించి 30 మంది రైతులను ఏకం చేశారు. భూగర్భ పైపులైను నిర్మించి డీజిల్ పంపుల ద్వారా కాలువ నీటిని పొలాల్లో పారించారు. మీటరు లోతులో, 5–6 అడుగుల వెడల్పున ఉమ్మడిగా కందకం తవ్వి.. రైతులు ఎవరికి వారు తమ పీవీసీ పైపులను ఈ కందకంలో పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి డీజిల్ ఇంజన్లను వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఎవరికి కావాల్సినప్పుడు నీటిని వారు తోడుకుంటున్నారు. ఫామ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్‌లో, స్ప్రింక్లర్ల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ స్కీము అమలయ్యేనా? అన్న అనుమానంతో తొలుత ఏ ఇతర రైతులూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరెడ్డి పట్టుదలతో తనే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, పైపులైను నిర్మించి నీటిని పొలాలకు పారించారు. సొంత పూచీకత్తుపై ప్రతి రైతు పేరిట రూ. లక్ష బ్యాంకు రుణం ఏర్పాటు చేయించి.. తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 నెలల తర్వాత తిరిగి తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ విధంగా తమ గ్రామ పొలాల్లో ఆరుతడి పంటలకు రక్షక తడులు ఇవ్వడానికి నీటి భద్రత చేకూరిందని వెంకటేశ్వరరెడ్డి సంబరంగా చెబుతుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఇతర రైతులు కూడా అనుసరించారు. సుమారు వంద మంది రైతులు దశల వారీగా మరో 8 భూగర్భ పైపులైన్ స్కీముల ద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత కల్పించుకున్నారని ఆయన తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పాడి గేదెల ఫారం ఎకరానికి రూ. 5–6 వేల ఖర్చు రేగడి నేలలు కావటాన మూడు నాలుగు వారాలు వర్షం మొహం చాటేసినప్పుడు పంటలను రైతులు కాలువ నీటితో రక్షక తడులు అందించి రక్షించుకుంటున్నారు. ఖరీఫ్ కాలంలో వర్షాభావ పరిస్థితులను బట్టి 1–2 సార్లు, రబీలో 2–3 సార్లు నీటిని సొంత ఖర్చుతో తోడుకుంటున్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 5–6 వేల వరకు డీజిల్ ఖర్చవుతున్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొందరు రైతులు వేసవిలో కూరగాయలను సైతం మూడో పంటగా సాగు చేసుకొని మంచి ఆదాయం గడిస్తున్నారు. నీటి భద్రత వల్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. పత్తి, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. భూమి విలువ పెరగడంతో పాటు కౌళ్లు రెట్టింపయ్యాయి. 25 ఎకరాల దేవాలయ భూములకు పైపులైను ద్వారా కాలువ నీటిని తెప్పించేందుకు సొంత డబ్బు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మల్లెపల్లె ప్రాథమిక పాఠశాల, అల్లుగుండు ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ట్యాంకులు విరాళంగా ఇచ్చారు. సంఘటితమైతే రైతులకు మేలు జరుగుతుందని నమ్మే వెంకటేశ్వరరెడ్డి ‘నాగలి రైతు ఉత్పత్తిదారుల సంఘం’ను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరెడ్డి. ప్రస్తుతం ఇందులో 40 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు వెంకటేశ్వరరెడ్డి రుణం తీర్చుకోవటం కోసమే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు! పైపులైన్ నీటితో సాగవుతున్న వేరుశనగ రాజకీయాలకు అతీతంగా కృషి దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండాలనేది నా లక్ష్యం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రైతులను రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై తెచ్చాం. హంద్రీ నీవా కాలువ నీటిని అందించే పైపులైను స్కీమును అమలు చేశాం. ఎంతో కష్టపడ్డాం. ఒకప్పడు ఏటా ఒక పంట పండటమే కష్టంగా ఉంది. నేడు అనేక మంది 2 పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంటలు కూడా వేసుకుంటున్నారు. తర్వాత మరో 8 పైపులైను స్కీములు ఏర్పాటయ్యాయి. తద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత చేకూరింది. రాజకీయాలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో బాధ్యత పెరిగింది. – సూగూరు వెంకటేశ్వరరెడ్డి (98660 09889), మాజీ బ్యాంకు ఉన్నతాధికారి, రైతు, సర్పంచ్, మల్లెపల్లి, కర్నూలు జిల్లా -
ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు
-
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : ముగ్గురి దుర్మరణం..
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భవంతి, నిన్న రాత్రి(ఆదివారం) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు భవనంలో 8 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక పీబీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ క్రమంలో ముగ్గురు కూలీలు అప్పటికే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భవంతి కూలడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రించడం వంటి సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నాలుగు రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే.. -
మణిహారంలా గరుడ వారధి
-
మొదటి విడతలో లక్ష 11 వేల ఇళ్ల నిర్మాణం
-
24గంటల్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం హనుమాన్‌పుర పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే రైల్వే గేట్ (62వ గేట్) సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం చేపట్టారు. యుద్ధప్రాతిపదికన కేవలం 24 గంటల్లో రైల్వే భూగర్భ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రైల్వే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం విశేషం. పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో అండర్ బ్రిడ్జిలను దింపి గంటల వ్యవధిలోనే ఏర్పాటు చేశారు. కాపలా ఉన్న రైల్వే గేట్లను తీసివేయడంలో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా పలు రైల్వే అండర్ బ్రిడ్జిలను తక్కువ సమయంలోనే ఏర్పాటు చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జితో త్వరలో ఈ రైల్వేగేటు గుండా వెళ్లే వాహనదారులకు సమయం ఆదా కానుంది. -
పరుగులు పెడుతోన్న పోలవరం ప్రాజెక్టు పనులు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు-అవకతవకలు సరిచేస్తూనే సీఎం వైఎస్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేపడుతోంది. వేలాది మంది కార్మికుల శ్రమైక్య సౌందర్యంతో పాటు ఆధునిక యంత్ర సామాగ్రి, వేలాది టిప్పర్లు,లారీలు,యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య ఓ ప్రపంచ అద్భుత నిర్మాణంగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. వందలాది మంది నిపుణులు,ఇంజనీర్లు పర్యవేక్షణలో పనులు పరుగులు పెడుతున్నాయి. గత ప్రభుత్వాలు మాటలకు, గ్రాఫిక్స్ కే పరిమితమైతే , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గత రెండేళ్ళుగా చేతల్లో చూపిస్తున్నారు. వరదలు వచ్చినా, కరోనా కలవర పెడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో కొనసాగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సహకారంతో నిర్మాణం అంచనాలను తలకిందులు చేస్తూ యుద్ధప్రాతిపతికన పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు పోలవరాన్ని సోమవరంగా మార్చాను అని మొండి గోడలకు పరిమితం చేస్తే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆంధ్రుల జీవనాడి తమ లక్ష్యంగా పనులు చేయిస్తోంది. రికార్డ్ స్థాయిలో మేఘా పనులు పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలను మించి పనులు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో అంటే ఏప్రిల్ 2020 నుంచి 21 మార్చివరకు 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేఘా ఇంజనీరింగ్ 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని చేసి సత్తాచాటింది. గత ఏడాది మే, జూన్, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్ పని చేపట్టింది. గత సంవత్సరంలో మే నెలలో కరోనాను తట్టుకొని 53 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 85,300 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. అలాగే జూన్-2020లో 70 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రికార్డు స్థాయిలో 1,20,100 క్యూబిక్ మీటర్ల పూర్తి చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 2021లో 47 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని టార్గెట్ పెట్టుకుని 83 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేసింది. ఈ సంవత్సరం మార్చి నెలలో 68,600 క్యూబిక్ మీటర్ల లక్ష్యం పెట్టుకోగా, 81,200 క్యూబిక్ మీటర్ల పనులు చేసి తనకు చాటి ఎవ్వరూ లేరు అని నిరూపించుకుంది మేఘా సంస్థ . ప్రతి నెలా అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ సాగుతోంది. కాంక్రీట్ పని క్యూబిక్ మీటర్లలో నెల జరిగిన పని పని లక్ష్యం ఏప్రిల్-20 36783 36783 మే-20 85300 53263 జూన్-20 120100 72215 జులై-20 20800 27798 ఆగష్టు-20 14500 6148 సెప్టెంబర్-20 14670 6444 అక్టోబర్-20 20058 17607 నవంబర్-20 25997 15691 డిసెంబర్-20 19000 23036 జనవరి-21 36705 28513 ఫిబ్రవరి-21 82956 47047 మార్చి-21 81204 68615 మొత్తం 558073 403160 తుది దశకు స్పిల్ వే పనులు ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తితో తుది దశకు చేరింది. కాంక్రీట్ పనులు, గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు, మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఇప్పటి వరకు స్పిల్ వేలో 2,82,276 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసింది. స్పిల్ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లకు గానూ 42 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. మిగతా 12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ లకు గానూ 13 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 26 గేట్లను ఒకేసారి పైకి ఎత్తవచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను నిర్వహించవచ్చు. పోలవరం స్పిల్ వేలో పది కి 10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరిక ఇప్పటికే పూర్తయ్యింది. వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్ సిలిండర్ల పనులు ముగిశాయి. వీటిని ఆపరేట్ చేయడానికి అమర్చాల్సిన 10 పవర్ ప్యాక్ లకు గానూ 6 పవర్ ప్యాక్ లను ఏర్పాటు చేశారు.ఇంకా 4 పవర్ ప్యాక్‌లను పెట్టాల్సి వుంది. పక్కా ప్రణాళికతో అప్రోచ్ ఛానెల్ పనులు పోలవరం అప్రోచ్ ఛానెల్ లో మట్టి తవ్వకం పనులు పక్కా ప్రణాళికతో చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే అప్రోచ్ ఛానెల్ లో 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరిగాయి. దాదాపు 300 కు పైగా టిప్పర్లు, 100కు పైగా ఎక్సవేటర్లు రాత్రింబవళ్లు పనుచేస్తున్నాయి. అప్పర్ కాఫర్ డ్యాం గ్యాప్ లను మూసివేసి, పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నందున వచ్చే వర్షాకాలం నాటికి స్పిల్‌వే నుంచి నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి వుంది. అందులో భాగంగా గోదావరిని సహజ ప్రవాహం నుంచి కుడి వైపునకు 6 కిలోమీటర్ల మేర నీటిని మళ్లించాలి. అందుకు అప్రోచ్ ఛానెల్ (స్పిల్ వే ఎగువన) కీలకమైనది. అప్రోచ్ ఛానెల్ పూర్తి స్థాయిలో తవ్వేందుకు ఆగమేఘాల మీద పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం లక్ష్యాన్ని 4 రెట్లు పెంచడంతో అందుకు తగిన విధంగా మేఘా సంస్థ యుద్ధ ప్రతిపాదికన మట్టి తవ్వకం, రవాణా పనులు చేస్తోంది. వేగంగా స్పిల్ ఛానెల్ పనులు వరదలను సైతం తట్టుకొని స్పిల్ ఛానెల్ లో ఇప్పటి వరకు 22,7,900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో పాటు స్పిల్ ఛానెల్ లో దాదాపు 28,41785 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది మేఘా సంస్థ. ఇక పోలవరంలో అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 4,48,487 క్యూబిక్ మీటర్లు పూర్తి చేసింది. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతూ ఎగువ కాఫర్ ఢ్యాం పనులు గత ప్రభుత్వం చేసిన ఇంజనీరింగ్ తప్పులను సరిదిద్దుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం,ఎగువ కాఫర్ డ్యాం పనులను శరవేగంగా చేస్తోంది. ఎగువ కాఫర్ డ్యాం రీచ్-1లో డయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేసింది. దాంతో పాటు రాక్ ఫిల్లింగ్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే రీచ్-1 నిర్మాణంతో, అందులో దాదాపు 35 మీటర్ల ఎత్తు కు పనులు జరిగాయి. రీచ్-2 నిర్మాణం పూర్తి స్థాయి 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక రీచ్-3లో గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పనులు, రీచ్-4 లో రాక్ ఫిల్లింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ఎగువ కాఫర్ డ్యాంలో ఇప్పటి వరకు 5,77,676 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు జరిగాయి. గ్యాప్-2 ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం పనులు ప్రాజెక్ట్ గ్యాప్-2 లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) కూడా కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు. ఇక్కడ రాతినేల ఎక్కడో లోతుగా ఉండడం వల్ల నిర్మాణ పని పటిష్టత కోసం కేంద్ర జలసంఘం ఆధీనంలోని డిడిఆర్‌పి (డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్) సూచనల మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక పనులన్నీంటిన్ని కొనసాగుతున్నాయి. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోనే పోలవరం పనులు రాష్ర్ట ప్రభుత్వం నిర్మాణ పనులు చేయిస్తున్నా పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ప్రాజెక్ట్ లో అంగుళం పనిలో మార్పులు, చేర్పలైనా కేంద్ర జలసంఘం చేయాల్సిందే. అందులో భాగంగానే జలాశయ పరిరక్షణ, సరైన ప్రయోజనాలు సాధించే దిశగా పనుల పరిమాణం గణనీయంగా పెరిగింది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్పులు, చేర్పులు చేసిన పనుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించింది. అందులో భాగంగానే దాదాపు 1656 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనుల్లో పాత పనులను చక్కబెడుతూనే ఓ వైపు లక్ష్యాన్ని అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. చదవండి: పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు -
ఏపీ: వడివడిగా పేదల ఇళ్ల నిర్మాణం..
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద ‘వైఎస్సార్ – జగనన్న’ కాలనీల్లో వడివడిగా ఇళ్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. ‘అందరికీ ఇళ్లు పథకం’ కింద ప్రభుత్వం రికార్డుస్థాయిలో దాదాపు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. వీటిలో మొదటి దశలో 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని లే అవుట్లలో ఈ నెల 31 నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము, ఇతర ముడిసరుకు సరఫరా చేసేవారికి సకాలంలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతివారం లబ్ధిదారులు, సరఫరాదారులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని జమ చేస్తారు. దీంతో అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. 15లోగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్.. మొదటి దశలో మంజూరైన 15,10,227 ఇళ్లకు సంబంధించి 12,61,928 ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తి చేశారు. దాదాపు 84% ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తయ్యింది. మిగిలింది ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. ఇక 7,81,430 ఇళ్ల స్థలాలకు అంటే దాదాపు 52% జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మిగతాదీ గడువులోగా పూర్తి చేయనున్నారు. -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్‌లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం
సాక్షి, అమరావతి: ‘ఆట విడుపు, వాహ్యాళికి పార్కులు లేవు.. ఆహ్లాదానికి పచ్చదనం లేదు..’ అని చింతపడుతున్న పట్టణ ప్రజలకు ఊరట కలిగించేందుకు పురపాలకశాఖ సమాయత్తమైంది. కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో.. అమృత్ పథకంలో భాగంగా పార్కుల నిర్మాణం, పచ్చదనం పెంపొందించేందుకు కార్యాచరణ చేపట్టింది. మొదటిదశలో లక్షలోపు జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో 125 పార్కుల నిర్మాణంతోపాటు పచ్చదనం పెంపొందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పార్కుల నిర్మాణం, ఖాళీ ప్రదేశాల నిర్వహణ చేపడుతోంది. ప్రతి మునిసిపాలిటీలో కనీసం రెండు పార్కుల చొప్పున మొత్తం మీద 125 పార్కులు నిర్మిస్తారు. ఇందుకోసం అధికారులు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించారు. విశాలమైన పార్కు, వాటిలో వ్యాయామ ఉపకరణాలు, ఫౌంటేన్ నిర్మాణంతోపాటు ల్యాండ్ స్కేపింగ్ చేపడతారు. పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంబడి మొక్కలు పెంచుతారు. ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అర్బన్ ఫారెస్ట్రీ కింద దట్టంగా మొక్కలు పెంచుతారు. మొత్తం మీద పార్కులు, పచ్చదనం పెంపొందించేందుకు రూ.92.10 కోట్లతో 95 పనులు చేయనుంది. ఇప్పటికే 87 పనులు మొదలయ్యాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. పట్టణాల్లో పార్కుల నిర్మాణం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఖాళీ ప్రదేశాల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలకశాఖ అనుసరిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో పార్కులు 5 వేల చదరపు మీటర్లు, కమ్యూనిటీ పార్కులు 10 వేల నుంచి 15 వేల చ.మీ., జిల్లా కేంద్రంలోని ప్రధాన పార్కు 50 వేల నుంచి 2.50 లక్షల చదరపు మీటర్లలో నిర్మిస్తారు. ఇక మునిసిపాలిటీల్లో ప్రతి పౌరుడికి 10 నుంచి 12 చదరపు మీటర్ల వంతున ఖాళీ జాగా ఉండాలి. ఆ ప్రకారం పట్టణాలను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. పెద్ద మునిసిపాలిటీలు ఏ గ్రేడ్‌లో, చిన్న మునిసిపాలిటీలు బీ గ్రేడ్‌లో ఉండాలని నిర్దేశించారు. సీ గ్రేడ్‌లో ఒక్కటి కూడా ఉండకుండా చూడాలని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లకు స్పష్టం చేసింది. పార్కులు నిర్మించి పట్టణాల్లో పచ్చదనం పెంపొందిస్తామని ఈఎన్సీ చంద్రయ్య చెప్పారు. చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. 17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు -
జూలై 1 నుంచి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం
సాక్షి, అమరావతి: జూలై 1వ తేదీ నుంచి కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశం నాటికి మొత్తం మెడికల్ కాలేజీలకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచి పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్‌వోపీలు రూపొందించాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ పకడ్బందీగా జరగాలని.. వైద్యులు, సిబ్బంది కొరత ఉందనే విమర్శలు రాకూడదని చెప్పారు. మెడికల్ డిపార్ట్మెంట్లు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటే.. రిక్రూట్మెంట్ సులువుగా, ఒక పద్ధతిగా జరుగుతుందని అన్నారు. నాడు–నేడు కింద చేపట్టే పనులకు ఇచ్చే నిధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీలకు గాను 8 కాలేజీలకు భూసేకరణ పూర్తయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన ఎనిమిదింటికి కూడా భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 16 కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్‌ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు నిధులు విడుదల చేయండి ►వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఈ క్లినిక్స్‌కు మంచి రంగులు వేయాలి. చూడగానే ఇది ఆసుపత్రి అనే భావన కలిగించేలా, ఆకట్టుకునేలా ఉండాలి. ►నాడు–నేడు స్కూల్స్ తరహాలో వైబ్రెంట్‌గా ఉండాలి. (అన్ని చోట్ల షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా.. లేదా? అని ఈ సందర్భంగా సీఎం ఆరా తీశారు.) ఆసుపత్రుల నిర్వహణకు మేనేజర్ల నియామకం ►ఆసుపత్రుల నిర్వహణను మెడికల్ సూపరింటెండెంట్లకే వదిలేయడం వల్ల మేనేజ్మెంట్ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. నిర్వహణ శాస్త్రీయంగా ఉండటానికి హాస్పిటల్ మేనేజర్లను నియమించుకోవాలని సీఎం సూచించారు. ►క్లినికల్ నిర్ణయాలు మినహా మిగిలిన ఆసుపత్రి నిర్వహణను మేనేజర్లు పర్యవేక్షిస్తారని, పలు రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోందని, మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణ చాలా ముఖ్యం ►ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల విడుదల విషయంలో ఎక్కడా జాప్యం జరగకూడదు. దీనిపై ఒక విధానాన్ని రూపొందించి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. ►ప్రైవేట్ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఎలా ఉంటాయో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అదే విధమైన సదుపాయాలు రోగులకు అందాలి. హాస్పిటల్ మేనేజ్మెంట్కు సంబంధించి మెడికల్ కాలేజీల్లో ప్రత్యేకంగా కోర్స్ ఏర్పాటు చేయాలి. ►హాస్పిటల్ మేనేజ్మెంట్పై ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులను భాగస్వాములను చేసి, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి. ప్రైవేట్‌లో ఎలా చేస్తున్నారో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలా జరగాలి. ఆసుపత్రుల నిర్మాణం జరిగేటప్పుడే అవసరమైన సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ►ప్రతి ఆసుపత్రి నిర్వహణపై ఆడిట్, సూపర్ విజన్ జరగాలి. ఇవి ఉంటేనే మనం అనుకున్న విధంగా సదుపాయాలు ప్రజలకు అందుతాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ పోస్ట్‌ల పదోన్నతులు సిఫార్సుల ద్వారా కాకుండా పనితీరు ఆధారంగా వుండాలి. చదవండి: రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ -
రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డు
సాక్షి, ఢిల్లీ: వేగవంతంగా రహదారుల నిర్మాణంలో భారత్ గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం పేర్కొన్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ 13,394 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ, రోజూవారీ సగటు 37 కిలోమీటర్లని ఆయన వివరించారు. తాను రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి రోజుకు 2 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం మాత్రమే ఉండేదని మంత్రి పేర్కొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు... వేగవంతమైన రహదారుల నిర్మాణంతోసహా మొత్తం మూడు అంశాల విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులను భారత్ నమోదుచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘ఢిల్లీ-వడోదర-ముంబై ఎనిమిది వరుసల ఎక్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భాగంగా కేవలం 24 గంటల్లో 2.5 కిలోమీటర్ల నాలుగు వరుసల కాంక్రీట్ రోడ్డును నిర్మాంచాం. అలాగే 24 గంటల్లో సోలాపూర్–బీజపూర్ మధ్య 25 కిలోమీటర్ల బిటుమెన్ రోడ్డును నిర్మించాం. ఈ అంశాలు రహదారుల నిర్మాణంలో భారత్ శక్తిసామర్థ్యాలను నిరూపిస్తున్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలోనూ రహదారుల మంత్రిత్వశాఖ ఈ రికార్డులను సృష్టించిందని గుర్తుచేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2014 ఏప్రిల్ నాటికి భారత్ రహదారుల నిర్మాణం 91,287 కిలోమీటర్లు ఉంటే, 2021 మార్చి 20 నాటికి ఈ పొడవు 1,37,625 కిలోమీటర్లకు చేరింది. అంటే గడచిన ఏడేళ్లలో రహదారుల నిర్మాణం 50 శాతంపైగా పురోగతి సాధించింది. ► 2014–15లో రహదారుల నిర్మాణానికి కేటాయింపులు రూ.33,414 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధుల పరిమాణం 5.5 రెట్టు పెరిగి రూ.1,83,101 కోట్లకు ఎగసింది. ► 2014లో (గడ్కరీ రహదారుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు) దాదాపు రూ.3.85 లక్షల కోట్ల విలువైన 406 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే అటు తర్వాత తీసుకున్న పలు చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. దాదాపు రూ.3 లక్షల కోట్లు మొండిబకాయిలుగా మారకుండా బ్యాంకింగ్‌కు ప్రయోజనం చేకూరింది. ► రహదారుల ప్రాజెక్టుల్లో స్తబ్దత తొలగించడానికి అలాగే పనులు వేగవంతం కావడానికి పలు చొరవలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులూ రద్దయ్యాయి. వెరసి ఫాస్ట్‌ట్రాకింగ్ ప్రాతిపదికన పనులు జరిగాయి. ► భారత్‌మాల పరియోజన బృహత్తర ప్రణాళిక కింద దాదాపు రూ.5.35 లక్షల కోట్లతో 34,800 కిలోమీటర్ల నిర్మాణం కేంద్రం లక్ష్యం. ► రానున్న ఐదు సంవత్సరాల్లో భారత్ మౌలిక రంగంలో గణనీయమైన మార్పు, పురోగతి రాబోతోంది. అమెరికా, యూరోపియన్ దేశాలకు ఏ మాత్రం తక్కువకాకుండా భారత్ ఆవిర్భవిస్తోంది. అత్యాధునిక వసతులు... మరోవైపు ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రణాళికల ఉద్దేశం. వీటిలో 130 ప్రాంతాల్లో 2021–22లో అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు వివరించింది. ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలలో ప్రతి 30–50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్‌లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్‌లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్‌షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్‌లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. -
లాఠీ పక్కనపెట్టి.. పలుగు, పార చేతపట్టి
మక్కువ (సాలూరు): నేరస్తులు, వివిధ ఘర్షణలతో వచ్చిన నిందితులు, బాధితుల మధ్య ఎప్పుడూ బిజీబిజీగా పోలీసులు గడుపుతుంటారు. ఇక సామాజిక సేవల జోలికి పోవడానికి తీరికెక్కడుంటుందని అందరం అనుకుంటుంటాం. విజయనగరం జిల్లా మక్కువ పోలీసులు దీనికి భిన్నం. గిరిజన ప్రాంతంలో సమస్యలను గుర్తించి.. స్వయంగా తామే శ్రమదానానికి నడుం బిగించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఓఎస్డీ సూర్యచంద్రరావు తన సిబ్బందితో ఇటీవల గిరిశిఖర గ్రామాలను సందర్శించారు. మక్కువ, సాలూరు మండలాలకు చెందిన పలు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఎలాగైనా తమ వంతుగా కృషి చేసి, గిరిజన గ్రామాలకు రహదారి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు పదునుపెట్టారు. మక్కువ మండలం ఎగువ మెండంగి గ్రామం నుంచి సాలూరు మండలం తాడిపుట్టి గ్రామం వరకు రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 100 మంది పోలీసులతో ఓఎస్డీ సూర్యచంద్రరావు శుక్రవారం ఎగువమెండంగి గ్రామానికి చేరుకున్నారు. ఆయా గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులతో మమేకమై గిరిజన ‘బాట’ ఏర్పాటుకు నడుంబిగించారు. ఎగువమెండంగి గ్రామం నుంచి తాడిపుట్టి గ్రామాల మధ్యనున్న రాళ్లు, రప్పలు, తుప్పలు, డొంకలను తొలగించి సుమారు 800 మీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలోనూ పోలీసులంతా రహదారి ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఓ రూపును తీసుకొచ్చారు. సాలూరు సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్టీఫ్ ఆర్ఐ పి.నాగేశ్వరరరావు, మక్కువ ఎస్ఐ కె.రాజేశ్, పోలీస్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు. రహదారి ఏర్పాటు చేస్తున్న పోలీసులు, గిరిజనులు