
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జల వనరుల శాఖ డీఈఈ ఎంకేడీవీ ప్రసాద్ తదితరులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సోమవారం పనులు ప్రారంభించారు. 96 మీటర్ల పొడవు, 10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది.
దిగువ కాఫర్ డ్యాం లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. దిగువ కాఫర్ డ్యాం దగ్గర నదిలో గ్యాప్‌లను పూడ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంపై జలవనరులశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణంపై దృష్టి సారించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసీఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment