coffer dam
-
‘కాఫర్ డ్యామ్’ నిర్లక్ష్యం పాక్షికంగా నిజమే!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బరాజ్ దెబ్బతిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకు నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణం కాదా? అని అధికారులను ప్రశ్నించగా ‘పాక్షికంగా నిజమే’నని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా శనివారం ఆయన్ను కమిషన్ సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒప్పందం ప్రకారం బరాజ్ కట్టాక నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు పూర్తిగా తొలగించలేదని నిలదీసింది. ఈ పనుల వ్యయాన్ని తొలి సవరణ అంచనాల్లో రూ. 61.21 కోట్లకు పెంచారని.. ఆ డబ్బును మిగుల్చుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఒప్పందాన్ని ఉల్లంఘించారని తప్పుబట్టింది. 2019లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ నిర్వహించలేదని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. 2020 వరదల్లో బరాజ్ దిగువన కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోగా పునరుద్ధరించాలని నిర్మాణ సంస్థను కోరారా? అని కమిషన్ ప్రశ్నించగా అప్పట్లో తానక్కడ లేనని బదులిచ్చారు. బరాజ్‌ల నిర్మాణం జరిగి అవి వినియోగంలోకి వచ్చినట్లు ధ్రువీకరించుకున్నాకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకం చేశానని సమర్థించుకున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీకి విధివిధానాలేవి లేవని ఆయన తెలపగా, కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విధివిధానాలు లేకున్నా రబ్బర్ స్టాంపులాగా సర్టిఫికెట్ల జారీకి మీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందంటూ నిలదీసింది. మిమ్మల్ని మీరు ఇరకాటంలో పడేసుకుంటున్నారని మండిపడింది. సికెంట్ పైల్స్‌పైనే కమిషన్ గురి.. దేశంలో జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరని, అలాంటిది మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, వాటి డిజైన్లను సీఈ సీడీఓ ఇచ్చారని సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. బరాజ్ కుంగిపోవడానికి మరో కారణంగా పునాదుల కింద సికెంట్ పైల్స్‌ను నిట్టనిలువుగా, క్రమబద్ధంగా నిర్మించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తుచేయగా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన బదులిచ్చారు. సీఈ సీడీఓ డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఇచ్చినా దానికంటే తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే సికెంట్ పైల్స్‌కు మొగ్గు చూపినట్టు తెలిపారు. డీవాటరింగ్‌కు అంచనాల కంటే 49.6 శాతం అధిక చెల్లింపులను నిబంధనల ప్రకారమే చేశామని సుధాకర్ రెడ్డి తెలియజేశారు. టెండర్లు లేకుండానే డీపీఆర్ తయారీనా? టెండర్లు లేకుండానే నామినేషన్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సుదాకర్‌రెడ్డి తెలిపారు. టెండర్లు పిలవొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయి పరీక్షల రికార్డులను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మరో ప్రశ్నకు బదులిచ్చారు. -
చంద్రబాబుపై మోదీ వ్యాఖ్యలే నిదర్శనం.. అందుకే రామోజీ వంకరరాతలు
సాక్షి, అమరావతి: తన ఆత్మీయుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో లేరనే అక్కసుతో ఒప్పును తప్పుగా చిత్రీకరించి ఉన్నది లేనట్లు కనికట్టు చేయడం తనకు మాత్రమే సాధ్యమైన పాత్రికేయమని రామోజీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. తేలికగా చేయగలిగి.. అధికంగా వచ్చే లాభాలను కాంట్రాక్టర్‌తో కలిసి పంచుకుతినే పనులకే ప్రాధాన్యం ఇచ్చి, చంద్రబాబు.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు జీవాన్ని తీశారు. పోలవరంను కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ ఇప్పుడు ప్రణాళికాయుతంగా సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తుంటే జీర్ణించుకోలేక ‘ఆ ఐదేళ్లలోనే పనులు భేష్’ శీర్షికతో శనివారం ‘ఈనాడు’లో రామోజీ వంకరరాతలు రాశారు. ఆ రాతల్లో తమ దోపిడీకి అడ్డుకట్ట పడిందనే అక్కసు తప్ప మరొకటి కన్పించలేదు. అత్యధిక శాతం పనులు సీఎం వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయనే వాస్తవాన్ని మరుగున పరిచి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలనే తాపత్రయం రామోజీ కథనంలోని ప్రతి వాక్యంలోనూ కనిపించింది. ఆరోపణ : ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం వాస్తవం: గోదావరిపై ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) నిర్మించడానికి వీలుగా.. వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను తొలుత పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తయ్యేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. కానీ.. చంద్రబాబు మాత్రం ఆ పనులేవీ చేయకుండానే.. కమీషన్ల కోసం తేలికగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే మట్టి తవ్వకం, స్పిల్ ఛానల్లో కాంక్రీట్‌ను కుప్పలా పోయడం వంటి పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. స్పిల్ వే పునాది స్థాయిలోనే వదిలేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయలేక.. వాటికి ఇరు వైపులా ఖాళీలు వదిలేసి, చేతులెత్తేశారు. దీంతో 2019 అక్టోబర్ 1న గోదావరికి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద (సీడబ్ల్యూసీ గేజ్ ప్రకారం) ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గూండా ప్రవహించడం వల్ల దాదాపు 13 మీటర్/సెకను వేగంతో వరద ఉధృతి పెరగడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి, స్పీల్ వే మీదుగా వరద నీటిని మళ్లించి ఉంటే.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినే పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. గోదావరి వరద ఉధృతి వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం +23 మీటర్ల నుంచి –12.00 మీటర్ల వరకు అంటే దాదాపు 35 మీటర్ల మందంతో కోతకు గురైంది. గ్యాప్–2లో + 8 మీటర్ల నుంచి –12 మీటర్ల వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందంతో, దిగువ కాఫర్ డ్యాం లో 36.5 మీటర్ల మందంతో గోదావరి గర్భం కోతకు గురైంది. స్పిల్ ఛానల్ లోని కాంక్రీటు బ్లాకులు (దిమ్మెలు) కొట్టుకుపోయాయి. వరద ఎగదన్నడంతో ముంపు గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటినీ సరిచేసేందుకే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. ఆరోపణ : బాబు హయాంలో చకచకా పనులు వాస్తవం: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయాన్ని భరించి.. అన్ని అనుమతులు తెచ్చి తామే పూర్తి చేస్తామని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని నాటి టీడీపీ సర్కార్‌ను కోరుతూ వచ్చింది. ఒప్పందం చేసుకోకుండా కాలయాపన చేస్తూ.. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నాటి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో పార్లమెంట్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు. దీంతో 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలోనే బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణాలతో పోలవరానికి నిధులు ఇస్తామని.. 2018 డిసెంబర్‌లోగా పూర్తి చేయకపోతే ఇచ్చిన నిధులను రుణంగా పరిగణిస్తామని కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరిస్తూ 2016 డిసెంబర్ 26న సీఎంగా చంద్రబాబు సంతకం చేశారు. ఆ తర్వాత 2016 డిసెంబర్ 30న పనులు ప్రారంభించారు. అంటే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకూ 31 నెలలపాటు పోలవరంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఆ నాటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించాలని అనేక మార్లు కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. ఆ సంస్థనే అడ్డుపెట్టుకుని పోలవరం పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి, తేలికగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోపణ : మంత్రుల మాటలు కోటలు దాటాయి వాస్తవం: చంద్రబాబు నిర్వాకం వల్ల అస్తవ్యస్తంగా మారిన పోలవరాన్ని గాడిలో పెడుతూ.. ఆనాటి తప్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికా యుతంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే యాక్షన్ ప్లాన్ రచించి, అమలు చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. 48 గేట్లతో సహా స్పిల్ వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసి.. 2021 జూలై 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీల పొడవున మళ్లించి చరిత్ర సృష్టించారు. చంద్రబాబు పాపాల వల్ల దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. 2022 ఏప్రిల్‌లో విధానాన్ని ఖరారు చేయడంతో.. దాని ప్రకారం 2022 జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. వరదలు తగ్గాక పనులు చేపట్టి ఈ నెల 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా నిశ్చితంగా ప్రధాన డ్యామ్ పనులను చేపట్టవచ్చు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని పంపులతో తోడేస్తూ.. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి, యథాస్థితికి తెచ్చే పనులను ముమ్మరం చేసింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను ఎలా సరిచేయాలనే అంశంపై 15 నెలలుగా డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ, ఐఐటీ(తిరుపతి, చెన్నై, ఢిల్లీ) ప్రొఫెసర్లు, ఎన్‌హెచ్‌పీసీతో రాష్ట్ర ప్రభుత్వం మేధోమధనం చేస్తోంది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చే పరీక్షలను ఇటీవల ఎన్‌హెచ్‌పీసీ పూర్తి చేసింది. ఆ సంస్థ నివేదిక ఇవ్వగానే డయాఫ్రమ్ వాల్‌పై ముందడుగు వేసి.. ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినక పోయి ఉంటే.. 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ అధికారవర్గాలే స్పష్టం చేశాయి. ఇవన్నీ నిజాలే కదా! మంత్రులు ఈ వాస్తవాలు చెప్పడం మాటలు కోటలు దాటడమా రామోజీ? నిర్వాసితులకు మేలు చేసిందెవరు? నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో వాటిని టీడీపీ సర్కార్ చేపట్టకుండా వారిని నట్టేట ముంచింది. ఐదేళ్లలో కేవలం రూ.484 కోట్లు ఖర్చు పెట్టి 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మూడేళ్లలోనే రూ.1,677 కోట్లు ఖర్చు పెట్టి 8,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. రానున్న రెండు మూడు నెలల్లో రూ.525 కోట్లతో మిగిలిన పునరావాసం పనులు పూర్తి చేసి.. 9,390 కుటుంబాలకు పునరవాసం కల్పించనున్నారు. తద్వారా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
పోలవరంలో మరో కీలక ఘట్టం
-
Polavaram Project: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యం: అంబటి
సాక్షి, ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ను నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. ఆయన అక్కడ ప్రాజెక్టులోని వివిధ పనులను దగ్గరుండి క్షణ్ణంగా పరిశీలించారు. అందులో భాగంగా మంత్రి అంబటి ప్రాజెక్టుకు సంబంధించిన లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులను కూడా పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వం తొందరపాటు పనులతో ప్రాజెక్టులో సమస్యలు వచ్చాయన్నారు. అందువల్లే ఆలస్యమైందని కూడా చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్ డ్యాం ఎత్తును పెంచాం అని తెలిపారు. అంతేగాదు గత ప్రభుత్వం ఈ కాఫర్ డ్యాం పనులను గాలికొదిలేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. తాము కేంద్రం నుంచి నిధులు రాకపోయిన రాష్ట్ర నిధులు ఖర్చు చేసి మరీ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. (చదవండి: డాక్టర్లు, సిబ్బంది ఖాతాలకే ప్రోత్సాహకాలు ) -
దిగువ కాఫర్ డ్యామ్ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రవాహం లేని ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్ పనులను అధికారులు చేపట్టారు. మంగళవారం పోలవరం వద్ద గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 203 మీటర్ల మధ్య 29 మీటర్ల ఎత్తుకు పనులు చేశారు. వరద తగ్గే కొద్దీ ప్రవాహం నుంచి బయటపడిన ప్రాంతంలో మిగిలిన 473 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోగా దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి స్థాయిలో అంటే 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడంతో ఆమేరకు చర్యలు చేపట్టారు. గోదావరి వరద ఉద్ధృతికి కోతకు గురైన ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల, దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల మధ్య అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతం మినహా మిగిలిన 932 మీటర్లను జూలై నాటికే 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశారు. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 203 మీటర్ల మధ్య పనులు వేగంగా చేస్తున్న దృశ్యం నవంబర్‌లో కనిష్ట స్థాయికి వరద అగాధాలు పూడ్చడం, కాఫర్ డ్యామ్ పనులు చేపట్టే విధానాన్ని ఖరారు చేయడంతో డీడీఆరీ్ప(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) జాప్యం చేయడంతో జూలై ఆఖరు నాటికి పూర్తి చేయలేకపోయారు. జూలై రెండో వారంలోనే వరద రావడంతో కోతకు గురైన ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్‌ను వరద నీరు ముంచెత్తింది. దీంతో పనులు చేపట్టలేని పరిస్థితి. ఇటీవల వరద తగ్గడంతో ప్రవాహం లేని ప్రాంతంలో 0 నుంచి 203 మీటర్ల మధ్య దిగువ కాఫర్ డ్యామ్ పనులను చేపట్టి ఇప్పటికే 29 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశారు. నవంబర్ రెండో వారానికి వరద కనిష్ట స్థాయికి చేరుతుంది. అప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతంలో వరద ఉండదు. ఆ సమయంలో మిగతా పనులు చేపట్టి కోతకు గురైన ప్రాంతంలో 680 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను సంక్రాంతికి పూర్తి చేయనున్నారు. అప్పుడు 1,612 మీటర్ల పొడవున దిగువ కాఫర్ డ్యామ్ పూర్తవుతుంది. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీడబ్ల్యూసీ ఖరారు చేసే డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనున్నారు. గోదావరి వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి నిరి్వఘ్నంగా కొనసాగించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. -
Andhra Pradesh: వడివడిగా వరదాయని
సాక్షి, అమరావతి: ఉత్తుంగ గోదావరిపై ఎనిమిది దశాబ్దాల స్వప్నం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. స్పిల్ వేను పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్‌తో అడ్డుకట్ట వేయడంతో పోలవరం జలాశయం ఇప్పటికే సుందర రూపం సంతరించుకుంది. జలాశయం, అనుసంధానాల పనులు 80.6 శాతం, కుడి కాలువ పనులు 92.57 శాతం, ఎడమ కాలువ పనులు 71.11 శాతం పూర్త య్యాయి. నిర్వాసితులకు పునరావాస కల్పన పను లు 20.19 శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68 శాతం పనులు పూర్తయ్యాయి. గోదావరి సహజ ప్రవాహాలు, సీలేరు నుంచి వచ్చే జలాలకు తోడు పోలవరం లో నిల్వ చేసిన నీటితో రబీలో గోదావరి డెల్టాకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. గత సర్కారు అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, చిత్త శుద్ధి లేమితో చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 2019, 2020లో గోదావరి వరద ఉధృతికి కొంత భాగం దెబ్బతింది. కోతకు గురైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్‌లను డ్యా మ్ డిజైన్ రివ్యూ ప్యానల్, సీడబ్ల్యూసీ మార్గదర్శ కా ల మేరకు బాగుచేసి జలాశయాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీడ బ్ల్యూసీ, ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. జీవనాడికి జవసత్వాలు.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోల వరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలు త వరద మళ్లించే స్పిల్ వేను పూర్తి చేసి తర్వాత కాఫర్ డ్యామ్‌లు, సమాంతరంగా పునరావాస పను లు, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరద సమయంలోనూ పనులు కొనసాగించడం ద్వారా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. టీడీపీ సర్కార్ నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన ప నులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షించారు. తాజాగా శుక్రవారం రోజు ఐదోసారి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పనుల పరిశీలనకు తొలిసారిగా రానుండటం గమనార్హం. ప్రణాళికాయుతంగా పనులు.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు తీయించింది. స్పిల్‌వేలో మిగతా ఆరు గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాదే ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. గతేడాది జూన్ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కి.మీ. పొడవున మళ్లించింది. జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించడమే ఆలస్యం.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను పూర్తి చేసి సమాంతరంగా జలవిద్యుత్కేంద్రం పనుల పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరంలో పునరావాసం, భూసేకరణకు రూ.35,669.08 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం లెక్కించగా.. అది రూ.33,163.28 కోట్లుగా సీడబ్ల్యూసీ తేల్చింది. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో అతి కష్టమ్మీద 1,846 ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 4,505 కుటుంబాలకు పునరావాసం కల్పించి రూ.6,654.39 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 38.41 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. తక్కువ ధరకే 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వస్తుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, ఉత్తరాంధ్ర తాగునీటి కష్టాలు తీర్చవచ్చు. -
పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం
-
ఏపీ: శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జల వనరుల శాఖ డీఈఈ ఎంకేడీవీ ప్రసాద్ తదితరులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సోమవారం పనులు ప్రారంభించారు. 96 మీటర్ల పొడవు, 10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. దిగువ కాఫర్ డ్యాం లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. దిగువ కాఫర్ డ్యాం దగ్గర నదిలో గ్యాప్‌లను పూడ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంపై జలవనరులశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణంపై దృష్టి సారించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసీఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. -
ఈ ఏడాది ‘పోలవరం’ నీళ్లు ఇవ్వలేం
కొవ్వూరు/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది గ్రావిటీ ద్వారా నీళ్లు అందించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాల్లో పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2020 మే, జూన్‌లోపు అన్ని పనులు పూర్తిచేసి, వచ్చే సీజన్‌కి నీరిస్తామని చెప్పారు. భూసేకరణ, పునరావాసం కల్పన కోసం ఇంకా రూ.2,992 కోట్ల నిధులు అవసరమని అన్నారు. ఈ సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో పోలవరంలో రూ.11,358 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని తెలిపారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6,728 కోట్లు అందించిందని వెల్లడించారు. ఇంకా కేంద్రం నుంచి రూ,4,630 కోట్ల మేర బిల్లులు అందాల్సి ఉందన్నారు. ఎన్నికల కారణంగా ప్రాజెక్టు పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పూర్తి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 45.72 మీటర్ల ఎత్తు నిర్మించాల్సి ఉందని, ఇప్పటివరకు 25.72 మీటర్ల ఎత్తుదాకా పనులు పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మరో ఇరవై మీటర్ల మేర పనులు చేయాల్సి ఉందన్నారు. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 70.17 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 74 శాతం, మట్టి పనులు 85.5 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. స్పిల్‌వేకి 48 గేట్లుకుగాను 16 గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 30 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే విధంగా వీటిని తయారు చేస్తున్నారని వెల్లడించారు. 50 లక్షల క్యూసెక్కుల వరదను సైతం సమర్థవంతంగా తట్టుకునేలా గేట్లను డిజైన్ చేసినట్లు తెలిపారు. 11.69 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పూర్తయిందన్నారు. 23 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం పోలవరంలో కాఫర్ డ్యామ్ నిర్మాణం ద్వారా ఈ ఏడాది 23 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ నీటిని కొంతమేర వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ వి.శ్రీధర్, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ దూరంగా ఉన్నారు. -
ఎటు చూసినా మట్టి గుంతలే
సాక్షి,అమరావతి: అరకొర కాంక్రీట్ పనులు, అక్కడక్కడా మట్టిపనులు, కానరాని కాఫర్ డ్యామ్ పనులు ఇదీ గురువారం నాటికి ఆ ప్రాజెక్టు పరిస్థితి.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా కొనియాడుతున్న బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరం పరిస్థితి ఇదీ. 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాల్సి ఉంటే అందులో పదోవంతు పనులు మాత్రమే జరిగాయి.. మట్టిని మాత్రం తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. కాఫర్ డ్యామ్ పనులు అసలు ప్రారంభమే కాలేదు.. పోలవరం పూర్తిచేస్తామని నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న గడువు మరో ఆరునెలల్లో పూర్తవుతుంది. కానీ ఈ ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికావడం సంగతలా ఉంచితే మరో పావుశాతం పనులు కూడా జరిగే అవకాశం లేదు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు అక్కడి పరిస్థితిని చూసి ఓ అంచనాకొచ్చారు. ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదంతా ఒట్టి బూటకమని, అక్కడ అంత వేగంగా పనులు జరగడం లేదని వారు గమనించారు. రెండురోజుల వరకు అక్కడ ఎలాంటి అలికిడీ లేదు. పనులన్నీ ఆగిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నదన్న సమాచారం నేపథ్యంలో గురువారం అక్కడ మనుషుల అలికిడి, యంత్రాల చప్పుడు మరలా మొదలయ్యింది. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం, మీడియా బృందాలు అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు ఈ హడావుడి ఉంది. ఆ తర్వాత మరలా మామూలే.. పోలవరం ప్రాజెక్టు వద్ద తాము గమనించిన విషయాలను వైఎస్సార్సీపీ నేతలు మీడియాకు వివరించారు.. ముడుపుల కోసమే పోలవరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరతప్పిదాలు చేశారని, వాటి వలన ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు వివరించడానికి పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2018లోపు గ్రావిటీతో పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు అందిస్తామని చెబుతూ వచ్చారని, అనేక టీవీ చానళ్లు ఆ పనులను ఎంతో గొప్పగా చూపించాయని, అయితే వాస్తవంగా సైట్‌లోని పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవన్నారు. కేవలం ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ఆ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ముడుపుల కోసమే కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే 2018 ఎన్నికల్లోపు ఈ ప్రాజెక్టు పనులు ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తికావని, ఈ పనుల పూర్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకువచ్చి, రూ.4,700 కోట్లతో కుడి, ఎడమ కాలువ పనులను పూర్తిచేశారని పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక్కడ పనులన్నీ కాగితాలపైనే జరుగుతున్నాయన్నారు. వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టు పూర్తికావాలని కోరుకుంటున్నారని, ధనదాహంతో ప్రాజెక్టును ఆలస్యం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన అవినీతి డబ్బుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని తిరుపతి ఎంపీ వరప్రసాదరావు ఆరోపించారు. ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చేపట్టారని, దివంగత వైఎస్ ఈ ప్రాజెక్టులోని కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయడమే కాక, నిర్వాసితులకు మంచి ప్యాకేజి అందచేశారని ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్ కొనియాడారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఈ బస్సుయాత్రకు వచ్చిన నేతలకు «ధన్యవాదాలు చెప్పారు. -
పోల‘వరం’పై మరో రియాలిటీ షోకు తెర
►డిజైన్లే రూపొందని కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించిన సీఎం ►డిజైన్లు రూపొందించడం, సీడబ్ల్యూసీ ఆమోదం పొందడంలో ►ప్రభుత్వం ఘోర వైఫల్యం! పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోల‘వరం’పై మరో రియాలిటీ షోకు తెరతీశారు. నాబార్డు రుణం మంజూరు.. కాంక్రీట్ పనుల ప్రారంభం.. డయాఫ్రమ్ వాల్ పనులకు అంకురార్పణ పేరుతో హడావుడి చేసినట్లే... కాఫర్ డ్యామ్ పనులను గురువారం ప్రారంభించారు. అయితే ఇప్పటివరకూ కాఫర్ డ్యామ్ డిజైన్లే రూపొందించకపోవడం, సీడబ్ల్యూసీ ఆమోదం పొందకపోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పాక్షికంగా.. 2019 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 26 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్, 17 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరుగులెత్తిస్తున్నానని ప్రకటిస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా మూడు కొండల మధ్యన 2,454 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను నిర్మించాలి. గోదావరి ప్రవాహాన్ని మళ్లించగలిగితేనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేసేందుకు అవకా శం ఉంటుంది. అందుకోసం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (రాతి మట్టికట్ట)కు 400 మీటర్ల ఎగువన 2454 మీటర్ల పొడవుతో ఒకటి, 200 మీటర్ల దిగువన 1467 మీటర్ల పొడవుతో మరొక కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి. వీటిని 41 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించడానికి సీడబ్ల్యూసీ ఏడాది క్రితమే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా.. ఇప్పటివరకూ డిజైన్లను రూపొందించడంలో సర్కార్, కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని స్పష్టమవుతోంది. సమీక్షల పేరుతో తమాషా! పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి పునాది (డయాఫ్రమ్ వాల్) పనులను బావర్, ఎల్ అండ్ టీ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించారు. ఈ ఏడాది 667 మీటర్లు, వచ్చే ఏడాది 1053 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం 334 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పనులను పూర్తి చేశారు. కానీ.. ఇప్పటివరకూ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించలేదు. కాఫర్ డ్యామ్ డిజైన్లపై ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ రమణ నుంచి ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు సాంకేతిక సహకారం అందిస్తోంది. డిజైన్లకు మెరుగులు దిద్ది.. సీడబ్ల్యూసీ ఆమోదం పొందేలా చూడటానికి కేంద్ర జలవనరుల శాఖ ఏబీ పాండ్య నేతృత్వంలోని డిజైన్స్ రివ్యూ ప్యానల్(డీఆర్పీ)ను ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తున్నానని సీఎం పదే పదే చెప్పడమే తప్ప.. ఇప్పటికీ కాఫర్ డ్యామ్ డిజైన్లనే రూపొందించలేకపోవడం గమనార్హం. వర్చువల్ ఇన్స్పెక్షన్, క్షేత్ర స్థాయి పర్యటనలతో సీఎం చంద్రబాబు రియాలిటీ షోను తలపించేలా తమాషా చేస్తున్నారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. నేల విడిచి సామే! పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ (ఎఫ్ఆర్ఎల్) 45.72 మీటర్లు. కనీస నీటి నిల్వ (ఎండీడీఎల్) 41.5 మీటర్లు. పోలవరం ప్రాజెక్టులో 40.54 మీటర్లలో నీళ్లుంటే ఎడమ కాలువకు.. 40.23 మీటర్లలో నీళ్లుంటే కుడి కాలువకు గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. కానీ.. స్పిల్ వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 52 బ్లాక్‌లకుగానూ 29 బ్లాక్‌ల్లోనే పునాది పనులకు కాంక్రీట్ వేస్తున్నారు. 2018 నాటికి 41 మీటర్ల ఎత్తుతో స్పిల్ వే పూర్తి చేస్తేనే కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించవచ్చు. కానీ.. 2018 నాటికి స్పిల్ వే 41 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయడం సాధ్యం కాదని పోలవరం అధికారులే తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాఫర్ డ్యామ్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. 31 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించి.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభించాలన్నది ప్రభుత్వం తాజా ఆలోచన. ఇదే అంశంపై ఈనెల 7, 8న ఏబీ పాండ్య నేతృత్వంలోని డీఆర్పీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ 31 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తే గ్రావిటీ ద్వారా పోలవరం కాలువలకు నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉండదు. స్పిల్ వే పనులు వేగవంతం చేసి.. 41 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించినా 2018 నాటికి పూర్తయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కురిసే జూలై నుంచి డిసెంబర్ మొదటి వారం వరకూ గోదావరిలో వరద ప్రవాహం ఉంటుంది. అంటే ఆర్నెళ్లపాటు పనులు చేయడానికి సాధ్యం కాదు. ప్రస్తుత నెలతోపాటు.. 2018లో జనవరి నుంచి జూన్ వరకూ ఆర్నెళ్ల అంటే మొత్తం ఏడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాఫర్ డ్యామ్ డిజైన్లే ఓ కొలిక్కిరాని నేపథ్యంలో 2018 నాటికి పనులెలా పూర్తవుతాయన్నది సర్కార్కే ఎరుక.