సాక్షి, ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ను నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. ఆయన అక్కడ ప్రాజెక్టులోని వివిధ పనులను దగ్గరుండి క్షణ్ణంగా పరిశీలించారు. అందులో భాగంగా మంత్రి అంబటి ప్రాజెక్టుకు సంబంధించిన లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులను కూడా పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వం తొందరపాటు పనులతో ప్రాజెక్టులో సమస్యలు వచ్చాయన్నారు.
అందువల్లే ఆలస్యమైందని కూడా చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్ డ్యాం ఎత్తును పెంచాం అని తెలిపారు. అంతేగాదు గత ప్రభుత్వం ఈ కాఫర్ డ్యాం పనులను గాలికొదిలేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. తాము కేంద్రం నుంచి నిధులు రాకపోయిన రాష్ట్ర నిధులు ఖర్చు చేసి మరీ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
(చదవండి: డాక్టర్లు, సిబ్బంది ఖాతాలకే ప్రోత్సాహకాలు )
Comments
Please login to add a commentAdd a comment