పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌లో వేగంగా జరుగుతున్న పనులు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రవాహం లేని ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్ పనులను అధికారులు చేపట్టారు. మంగళవారం పోలవరం వద్ద గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 203 మీటర్ల మధ్య 29 మీటర్ల ఎత్తుకు పనులు చేశారు.
వరద తగ్గే కొద్దీ ప్రవాహం నుంచి బయటపడిన ప్రాంతంలో మిగిలిన 473 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోగా దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి స్థాయిలో అంటే 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడంతో ఆమేరకు చర్యలు చేపట్టారు. గోదావరి వరద ఉద్ధృతికి కోతకు గురైన ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల, దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల మధ్య అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతం మినహా మిగిలిన 932 మీటర్లను జూలై నాటికే 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశారు.
పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 203 మీటర్ల మధ్య పనులు వేగంగా చేస్తున్న దృశ్యం
నవంబర్‌లో కనిష్ట స్థాయికి వరద
అగాధాలు పూడ్చడం, కాఫర్ డ్యామ్ పనులు చేపట్టే విధానాన్ని ఖరారు చేయడంతో డీడీఆరీ్ప(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) జాప్యం చేయడంతో జూలై ఆఖరు నాటికి పూర్తి చేయలేకపోయారు. జూలై రెండో వారంలోనే వరద రావడంతో కోతకు గురైన ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్‌ను వరద నీరు ముంచెత్తింది. దీంతో పనులు చేపట్టలేని పరిస్థితి.
ఇటీవల వరద తగ్గడంతో ప్రవాహం లేని ప్రాంతంలో 0 నుంచి 203 మీటర్ల మధ్య దిగువ కాఫర్ డ్యామ్ పనులను చేపట్టి ఇప్పటికే 29 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశారు. నవంబర్ రెండో వారానికి వరద కనిష్ట స్థాయికి చేరుతుంది. అప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతంలో వరద ఉండదు. ఆ సమయంలో మిగతా పనులు చేపట్టి కోతకు గురైన ప్రాంతంలో 680 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను సంక్రాంతికి పూర్తి చేయనున్నారు.
అప్పుడు 1,612 మీటర్ల పొడవున దిగువ కాఫర్ డ్యామ్ పూర్తవుతుంది. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీడబ్ల్యూసీ ఖరారు చేసే డిజైన్ల మేరకు ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనున్నారు. గోదావరి వరదల్లోనూ ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి నిరి్వఘ్నంగా కొనసాగించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment