సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బాబు ప్రభుత్వం, ఆ కంపెనీ కలిసి సుమారు నలభై కోట్లు ఎగ్గొట్టింది. కూరగాయల సప్లయర్ నుంచి అనేక పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.
చదవండి: రామోజీ మార్కు ‘వైఫల్యం’
తమకు రావాల్సిన బకాయిలేవని వారు ప్రశ్నిస్తే బలవంతంగా సెటిల్‌మెంట్ చేసి అప్పటి మంత్రి దేవినేని ఉమా సగానికి సగం కోసేశారు. అలా సెటిల్‌మెంట్ చేసిన ఎమౌంట్ కూడా ఇప్పటి వరకూ వారికి చేరనేలేదు. ఇప్పుడు వాళ్లంతా ట్రాన్స్‌ట్రాయ్ చేసిన నిర్వాకం, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు చేసిన సెటిల్‌మెంట్లను ఏకరువు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో తమకు రావాల్సిన సొమ్ము ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment