ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. మీరు కోరుకున్న విధంగా ఈ సంవత్సరంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 3.85 లక్షల గృహ నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం..2020లో 2.14 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. 2021 ప్రథమార్ధంలో సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాదిలో మొదటి ఏడు నగరాల్లో దాదాపు 2.78 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని తేలింది.
►2021లో పూర్తి చేసిన మొత్తం ఇళ్లలో గరిష్టంగా ఎన్‌సిఆర్‌లో దాదాపు పూర్తయ్యాయి. గతేడాది ఎన్‌సీపీఆర్‌లో 86,590 యూనిట్లు ఉండగా..2020లో 47,160యూనిట్లు పూర్తయ్యాయి. అంటే గతేడాది ఇళ్ల నిర్మాణం 2020 కంటే దాదాపు 84% ఎక్కువ.
►ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో సుమారుగా. 2021లో 70,490 యూనిట్లు పూర్తికాగా 2020లో 54,720 యూనిట్లు పూర్తయ్యాయి.
►పూణెలో సుమారు. 2021లో 46,090 యూనిట్లు పూర్తికాగా 2020లో 40,840 యూనిట్లు పూర్తయ్యాయి.
►బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఇళ్లనిర్మాణాలు సమానంగా ఉన్నాయి. 2021లో 63,870 యూనిట్లు పూర్తికాగా 2020లో 59,730 యూనిట్లు పూర్తయ్యాయి
►కోల్‌కతాలో 2020లో 11,920 పూర్తి కాగా 2021లో 11,620 యూనిట్లు పూర్తయ్యాయి.
పరిశోధన ఫలితాలపై అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. “2022లో టాప్ 7 నగరాల్లో 3.85 లక్షల యూనిట్లను పూర్తి చేయాలని డేటా సూచిస్తుందని అన్నారు. చాలా నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని, థర్డ్ వేవ్ ప్రభావం రియాల్టీమీద చాలా తక్కువగా ఉందని పూరి చెప్పారు. దీంతో 2022లో ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. డెవలపర్లు కొత్త వాటిని ప్రారంభించే ముందు గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
Comments
Please login to add a commentAdd a comment