బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది.
కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది.
కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ..
ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్‌లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది.
బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్‌లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment