Property tax
-
Hyderabad: శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
Property Tax: ఇక నెలవారీగా ఆస్తి పన్ను చెల్లింపులు..!
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆర్నెల్లకోసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకనుంచి అలా కాకుండా ఏకమొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా అయిదు శాతం రాయితీ సదుపాయం ఉంది. ఆస్తిపన్ను ఏడాదికో, ఆర్నెల్లకో కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెలనెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా, పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారికి సదుపాయంగా ఆస్తిపన్నును సైతం నెలనెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. ఆస్తిపన్ను, కరెంటు, నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా, ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కలి్పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలనుకుంటోంది. సీఎం ఆలోచనతో.. 👉 గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆర్నెల్లకోసారి చెల్లించే సదుపాయం ఉండగా, జలమండలి నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానం ఉండాలనే తలంపులో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల అధికారులతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉 డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకా రం జారీ చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించే విధానం అనుసరిస్తున్నాయి. యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే ప్రతి నెలా కరెంట్ బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటు లో ఉంది. దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసే లా కొత్త విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలా చేయడంవల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం నెల నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు.కరెంట్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే కొత్త గా జీహెచ్ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు కూడా నిరీ్ణత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు.సక్రమంగా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు.. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వాలని, లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలున్నాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో కచి్చతంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవలను మహా నగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.భారీ బకాయిలకు అడ్డుకట్ట.. నెలనెలా ఆస్తిపన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలామందికి అసలు కంటే పెనాలీ్టల భారం ఎక్కువ కావడంతో చెల్లించడంలేదు. ముఖ్యంగా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ల ద్వారా పెనాలీ్టల్లో 90 శాతం రాయితీలిచ్చినప్పటికీ చెల్లించని వారూ ఉన్నారు. నెలనెలా చెల్లించే విధానంతో, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. -
fact check: తిక్కరాతలతో రామోజీ తెలివి బొక్కబోర్లా!
రాష్ట్ర ప్రగతికి నిధులు గాల్లోంచి సృష్టించాలన్నదే రామోజీ మతిచలించిన రాతల పరమార్థంలా కనిపిస్తోంది. ఏటా పెరిగే ఆస్తుల విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని కేంద్రం చట్టమే తెచ్చి, అమలు చేసి తీరాలన్న నిబంధనను విధించింది. అయినా సరే...పన్ను పెంపు అనేది పేద వర్గాలకు పెనుభారం కారాదని సీఎం జగన్ ప్రభుత్వం పన్ను పెంపు 15 శాతానికి మించకుండా చర్యలు తీసుకుంటే అదేదీ ఈనాడుకు కనిపించదు. నోటికొచ్చిన లెక్కలు గట్టి రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఇళ్లకు పన్ను పెంపు భారం ...అంటూ తప్పుడు రాతలు రాసింది. నిజానికి 2020 నుంచే అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త పన్ను విధానం అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. తెలంగాణతో సహా పది రాష్ట్రాలు పన్ను పెంపు విధానంలో కేంద్రం చెప్పిందే అమలు చేస్తున్నాయి. తద్భిన్నంగా .. రాష్ట్రంలో సీఎం జగన్ పేదల పట్ల కారుణ్యంతో వ్యవహరిస్తున్నారు. పేదలపై పెనుభారం మోపడానికి ఆయన ససేమిరా అంటారు...అందుకే 2021 ఏప్రిల్ నుంచి 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు కేవలం రూ.50 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడంలోని జగన్ మానవత్వ భావన రామోజీ బుర్ర కెక్కినట్లు లేదు. లెక్కలేనన్ని తిక్కరాతలతో రాష్ట్రంలో అభివృద్ధికి మోకాలడ్డడానికి ఈ అతి తెలివి వక్రమార్కుడు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఖాళీ స్థలాలపై పన్నే పెంచని ఉదారత జగన్ ప్రభుత్వానిది... అంతేకాదు ఒకేసారి పన్ను మొత్తాన్ని చెల్లిస్తున్న వారికి రెండేళ్లుగా వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించడం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరో వరం...ఇదంతా రామోజీకి తెలియదా అంటే తెలుసు..తెలిసినా ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏదో ఒక తప్పుడు కారణాన్ని వెదుక్కుని వాస్తవాల పునాదులపై అడ్డగోలుగా అబద్ధాల మేడలు కట్టడమే ఈ కుహనా మేధావి లక్ష్యం... ఈయన తెలివి తెల్లారినట్లే ఉందని చెప్పడమే ఈ ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశం... సాక్షి, అమరావతి: అబద్ధాలను అచ్చు వేయడంలో రామోజీ అందెవేసిన చేయిగా మారిపోయారు. తెల్లారి లేచిందే తడవుగా ప్రభుత్వంపై ఎలా రాళ్లేయాలా? అనే దురాలోచన నుంచి ఈనాడు బయటపడడం లేదు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఒక్కరోజూ చెప్పకపోగా, అబద్ధాన్ని నిజమని ప్రజలను నమ్మించేందుకు వాస్తవాలను కప్పిపుచ్చి అదే అబద్ధాన్ని పదేపదే అచ్చు వేస్తోంది. పన్ను మదింపును పరిగణనలోకి తీసుకున్న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఇళ్లకు గాలిలో తప్పుడు లెక్కలు వేసి అన్యాయం జరిగిపోతున్నట్టు గగ్గోలు పెట్టింది. వాస్తవానికి పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆస్తిపన్ను పెంపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పునరీకరణ (రివిజన్) చేయాలని సూచించింది. ద్రవ్య లోటును తగ్గించేందుకు ఈ విధానం తప్పనిసరని చెప్పడంతో పాటు 2019లో ‘‘ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్’’ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం సంస్కరణల్లో భాగంగా పట్టణ ఆస్తి పన్ను వార్షిక అద్దె విధానం కాకుండా, ఆస్తుల వార్షిక విలువ ఆధారంగా లెక్కించాలని సూచించింది. 2020 నుంచి అన్ని రాష్ట్రాలు కొత్త పన్ను విధానం అమలు చేయాలని ఆదేశించింది. అందుకు మున్సిపాలిటీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లెక్కల ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. తెలంగాణతో సహా 10 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అదే ఏడాది నుంచి అమలు చేస్తుండగా, ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం 2021 ఏప్రిల్‌లో అమల్లోకి తేవడంతో పాటు 375 చ.అ. లోపు ఇంటికి ఆస్తిపన్ను గరిష్ఠంగా రూ.50 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది నిరుపేదలకు ఎంతో మేలు చేసింది. ఖాళీ స్థలాలపై అసలు పన్ను పెంపే లేదు. రెండేళ్లుగా మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తున్న వారికి వడ్డీ రాయితీనీn ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించాలన్న కేంద్రం... కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ఐదేళ్లకోసారి మదింపు చేసి, తదనుగుణంగా పన్ను పెంచాలి. స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో నివాస ఆస్తులపైన, 2007లో కమర్షియల్ ఆస్తుల పన్నును మదింపు చేశారు. తర్వాత పన్ను మదింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో పన్ను విధింపు ఆస్తి వార్షిక అద్దె ప్రకారం వసూలు చేసేవారు. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం పన్ను విధింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ఈ విధానంలో ఆస్తి పన్ను భారీగా పెరిగి ప్రజలకు అధిక భారం పడే ప్రమాదముందని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను పెంపు గరిష్టంగా 15 శాతం మించరాదని షరతు పెట్టింది. ప్రజలపై భారం లేకుండా చూసిన రాష్ట్రం... కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పన్ను నిర్ణయించినట్టయితే అది మున్సిపాలిటీల్లోని ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడే ఇబ్బంది ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్లాబులను అందుబాటులోకి తెచ్చింది. నివాస ఆస్తులపై స్థానిక మార్కెట్ ధర ప్రకారం 0.10 నుంచి 0.50 శాతం, కమర్షియల్ ఆస్తులపై 0.02 నుంచి 2 శాతం మధ్య పన్ను ఎంత ఉండాలనే నిర్ణయాధికారం పట్టణ స్థానిక సంస్థల కౌన్సిళ్లకే అప్పగించింది. ఆస్తి విలువ ఎంత పెరిగినా పన్ను పెంపు 15 శాతం మించరాదని, పేదలు నివసించే 375 చ.అ విస్తీర్ణం గల ఇళ్లకు పన్ను వార్షిక రూ.50 మాత్రమే ఉండాలని అదేశాలు జారీ చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను పెరగని ఆస్తులకు గరిష్టంగా 2 శాతం పెంపు అమలు చేయాలంది. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానంపై అధ్యయనం, ప్రజల అభ్యంతరాలను తీసుకున్న తర్వాతనే అధికారులు పన్ను వసూలు చేపడుతున్నారు. పట్టణాభివృద్ధికి ఎల్లో మీడియా వ్యతిరేకం... పట్టణ స్థానిక సంస్థల్లో ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, అభివృద్ధి పనులకు నిధులు అవసరం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు అధికంగా ఉండేవి. కేంద్రం 2019లో తెచ్చిన ఎఫ్ఆర్బీఎం చట్టంతో యూఎల్బీలు పన్ను ఆదాయాన్ని పెంచుకుంటేనే సాయం అందుతుంది. ఈ విషయంలో ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన నారా చంద్రబాబుకు, ఆయనకు శిక్షణ ఇచ్చిన రాజగురువు రామోజీకి తెలియంది కాదు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి ఆస్తి పన్ను డిమాండ్ రూ.3950.15 కోట్లు ఉంటే, గతేడాది వసూళ్లు 50 శాతం (రూ.1686.46 కోట్లు) దాటలేదు. మరి స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలో వారికే తెలియాలి. కేపిటల్ వ్యాల్యూ పన్ను విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు.. ఛత్తీస్‌గఢ్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ -
AP: ఆస్తి పన్ను బకాయిలుపై వడ్డీ మాఫీ
సాక్షి, విజయవాడ: ఆస్తి పన్ను బకాయిలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్‌టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తీ పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాలీ స్థలాలు పన్నులపై వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. చదవండి: ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్ -
ఐటీ సిటీలో డబుల్ ట్యాక్స్.. ఇంటి అద్దెలు మరింత పెరుగుతాయా?
బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది. కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ.. ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది. బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. -
Hyderabad: ఆస్తిపన్ను బకాయిలపై రాయితీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)గా ఆస్తిపన్ను బకాయిల పెనాల్టీలపై 90 శాతం రాయితీ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నే. త్వరలో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 2100 కోట్లు అయినప్పటికీ, గతనెల 20 వరకు రూ.1269 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆరి్థక కష్టాల్లో ఉంది. నెలనెలా సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో పలు పర్యాయాలు కల్పించిన ఓటీఎస్ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే ఆస్తిపన్ను బకాయిదారులు అసలుతో పాటు బకాయిల వడ్డీలపై కేవలం 10 శాతం పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. అది ఎందరికో వెసులుబాటుగా ఉండటమే కాక జీహెచ్ఎంసీ ఆరి్థక కష్టాల నుంచి గెట్టెక్కేందుకూ ఉపకరిస్తుంది. ఈ అంశాన్ని వివరిస్తూ లేఖ రాశారు. పరిశీలనలోకి తీసుకుని ప్రభుత్వం అవకాశం కల్పించగలదని ఆశిస్తున్నారు. ఆస్తిపన్ను బకాయిలు (వడ్డీలపై పెనాల్టీలతో సహా).. ► 4,95,628 ప్రైవేట్ యజమానుల భవనాలకు సంబంధించి బకాయిలు రూ.1887.59 కోట్లు కాగా, వడ్డీల పెనాల్టీలతో కలిపి అవి రూ.4522.18 కోట్లకు పేరుకుపోయాయి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1800 భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు రూ. రూ.1622.16 కోట్లు కాగా, వడ్డీల పెనాలీ్టలతో సహ అవి రూ.5281.21 కోట్లకు పేరుకుపోయాయి. ► అన్నీ వెరసి పేరుకు పోయిన మొత్తం బకాయిలు రూ.9803.39 కోట్లు. -
ఆస్తిపన్ను గడువులోపు చెల్లించకుంటే భారమే
వికారాబాద్ అర్బన్: మున్సిపాలిటీల్లో గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆలస్య రుసుం పేరుతో 2శాతం వడ్డీ వేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 30లోపు సగం ఆస్తి పన్ను చెల్లించని వారికి ఈ వడ్డీ భారం తప్పదు. నిబంధనల ప్రకారం మున్సిపాల్టీలో భవన యజమానులు ప్రతి ఏటా రెండుసార్లు (ఆరు నెలలకు ఒక సారి) ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరానికి చెందిన ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే యజమానులు ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఫిబ్రవరి, మార్చిలోనే ఎక్కువగా పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఏటా వడ్డీ చెల్లించక తప్పడంలేదు. ఈ ఏడాది తప్పకుండా అర్ధవార్షిక పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. యజమానులకు నోటీసులు ఆస్తి పన్నును ముందస్తుగా వసూళ్లు చేసేందుకు మున్సిపల్ అధికారులు సంబంధిత యజమానులకు డిమాండ్ నోటీసులు పంపిస్తున్నారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లను ఇంటింటికి ఒకటి రెండు సార్లు పంపి అర్ధ సంవత్సరం పన్ను చెల్లించాలని లేకుంటే అస్సలు పన్నుపై 2శాతం వడ్డీ పడుతుందని చెప్పిస్తున్నారు. అయితే ఆస్తిపన్ను చెల్లింపునకు అర్ధ వార్షిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తుంది. ఇప్పుడు చెల్లించకుంటే వచ్చేనెల నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. యజమానులు వెంటనే మున్సిపల్ బిల్ కలెక్టర్లకు లేక ఆన్లైన్లో పన్ను చెల్లించుకోవడం మంచిదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఐదుశాతం మినహాయింపు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభం కాగా ఆస్తపన్ను చెల్లింపుపై పురపాలక శాఖ ఐదు శాతం రాయితీ అవకాశాన్ని కల్పించింది. అంటే ఈ ఏడాదికి సంబంధించిన పన్నును ఒకేసారి చెల్లిస్తే మొత్తం పన్నులో ఈ ఐదు శాతం రాయితీ వర్థిస్తుంది. దీంతో కొంత మంది యజమానులు ఆసక్తి చూపి పన్ను చెల్లించడంతో మున్సిపాల్టీలకు కొంత నిధులు సమకూరాయి. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించినవారిని మినహాయిస్తే మిగిలిన వారంతా గడువులోగా పన్ను చెల్లింపకపోతే వడ్డీ భారం భరించాల్సిందే. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించడం కూడా భారమే. అందుకే అర్ధవార్షిక సంవత్సరంలో చెల్లిస్తే ఇంటి యజమానులకు భారం తగ్గుతుంది. – శరత్ చంద్ర, వికారాబాద్, మున్సిపల్ కమిషనర్ -
ఆన్‌లైన్‌కే సై
సాక్షి, హైదరాబాద్: సదుపాయాలు కల్పిస్తే ప్రజలు వినియోగించుకుంటారు. తమకు అత్యంత సదుపాయంగా ఉంటే.. ఎవరూ వెళ్లి ఒత్తిడిచేయకున్నా చెల్లింపులు చేస్తారనేందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు. ఆర్థిక సంవత్సరం మొదటినెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద 5 శాతం రాయితీ ఉంటుంది. ఈ రాయితీని వినియోగించుకోవడం ద్వారా చాలామంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక సంవత్సర లక్ష్యమే దాదాపు రూ. 2వేల కోట్లయితే.. ‘ఎర్లీబర్డ్’ను వినియోగించుకోవడం ద్వారా ఒక్క నెలలోనే మూడో వంతుకుపైగా ఆదాయం సమకూరింది. ఎక్కువ మంది ఆన్లైన్ ద్వారా ఎర్లీబర్డ్‌ను వినియోగించుకున్న ఇళ్ల యజమానులు 7.35 లక్షల మంంది కాగా, వారిలో 4.95 లక్షల మంది ఆన్లైన్ ద్వారానే ఆస్తిపన్ను చెల్లించారు. అంటే దాదాపు 67 శాతం మంది ఆన్‌లైన్‌ను వినియోగించుకున్నారు. వీరి చెల్లింపుల ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.786.75 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయం పెరుగుతున్నా.. జీహెచ్ఎంసీ ఖజానాకు ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఏటికేడాది ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అంతకుమించి పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు తప్పడం లేదు. వేల కోట్లు ఖర్చయ్యే భారీ ప్రాజెక్టులకు సైతం జీహెచ్ఎంసీ నుంచే ఖర్చు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణం కాగా, అధికారులు, పాలకమండలి మితిమీరిన ఖర్చులు కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆనందించేలోగా.. అదనపు భారం ఎర్లీబర్డ్ ద్వారా టార్గెట్‌ను మించి ఆదాయం రావడంతో సంతోషపడిన అధికారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. పారిశుద్ధ్య కార్మి కుల వేతనాలను అదనంగా రూ.1000 పెంచుతూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. ఈమేరకు అదనపు వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లించాలని పేర్కొనడమే ఇందుకు కారణం. దీంతో జీహెచ్ఎంసీ ఖజనాకు సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది. -
ఆస్తిపన్ను వసూళ్లు రూ. 825.87 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది. ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ మునిసిపల్ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్ స్కీమ్ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్ కార్యాలయానికి రాకుండానే పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్ఎంఎస్లలో లింక్ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్ చాట్‌బాట్ నంబర్ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
పెరిగిన మున్సిపల్ ఆస్తి పన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది. గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ నీటి పన్ను డిమాండ్ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ
-
Hyderabad:‘ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది. ఇలాంటి వాటితో జీహెచ్ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు. అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఆన్‌లైన సంబంధిత ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్‌ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ లోపాలకు చెక్.. ► ఈ ఇంటెలిజెన్స్ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్ అసెస్‌మెంట్‌లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు. ► భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్మెంట్ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ► ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్‌సెక్షన్ సిబ్బంది ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం. ► రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని, వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు. ► 360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. ► ఈ సిస్టమ్ డెవలప్ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది. ► ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ► ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు. ► ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్‌బోర్డులు విని యోగించి భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి అవసరమైన చర్యలు చేపడతారు. భవన వినియోగం తెలుస్తుంది.. ఖైరతాబాద్‌లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది. ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: కరోనా కేసుల్లేవ్ -
రేషన్‌కార్డుకు ఆస్తి పన్ను నంబర్ లింక్
సాక్షి, చెన్నై: రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబరు లింక్ చేయడానికి నగర పాలక, స్థానిక సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని గుర్తింపు కార్డులకు, ప్రభుత్వ రాయితీ, పథకాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత నెల రోజులుగా విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం శరవేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబర్‌ను లింక్ చేయాలన్న నిర్ణయానికి నగర పాలక, స్థానిక సంస్థలు వచ్చాయి. బియ్యం కార్డు కలిగి ఉన్న రేషన్‌కార్డుదారులు ఏ మేరకు సొంతిళ్లను కలిగి ఉన్నారో, వారి ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. లగ్జరీ కార్లు, బంగళాలు కలిగి ఉన్న వారు సైతం రేషన్ ద్వారా ప్రభుత్వ రాయితీలను పొందుతూ వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టడం లక్ష్యంగా ఈ లింక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఎస్ఐ -
Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు..
లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్‌మహల్‌కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్‌ను 15 రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజ్‌మహల్‌కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు. మరోవైపు తాజ్‌మహల్‌కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్.. -
క్షీణిస్తున్న మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల సొంత ఆదాయం, సామర్థ్యం క్షీణిస్తోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాలు దశాబ్ద కాలంలో దేశ జీడీపీలో ఒక్క శాతం వద్ద స్తబ్దుగా ఉన్నట్లు తెలిపింది. మెజారిటీ మునిసిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ కాగితాలకే పరిమితమని, వాస్తవికతను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే మునిసిపల్ కార్పొరేషన్లు ఆధారపడుతున్నాయని, సొంత ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ తొలిసారిగా అధ్యయన నివేదికను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా తరహాలో.. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగినట్లుగా సేవల్లో నాణ్యత పెరిగేందుకు తక్షణం సొంత ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం దక్షిణాఫ్రికా తరహాలో సంస్కరణలు తేవాలని సూచించింది. బ్రెజిల్, రష్యన్ ఫెడరేషన్, చైనా, దక్షిణాఫ్రికాతో పోల్చి చూస్తే దేశంలో పట్టణ ప్రజలకు కనీస నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు అందించడం చాలా తక్కువ శాతం ఉందని తెలిపింది. పెరుగుతున్న పట్టణ జనాభాకు మెరుగైన మౌలిక సదుపాయాలు, కనీస ప్రాథమిక సేవలందించేందుకు ఆస్తి పన్ను సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలు తేవాలని సూచించింది. ఆస్తి పన్ను మరింత సమర్థంగా వసూలు చేసే చర్యలు చేపట్టడంతోపాటు యూజర్ చార్జీలు, ప్రకటన పన్ను, పార్కింగ్ ఫీజు, ట్రేడ్ లైసెన్సుల జారీలో పటిష్ట విధానాలను అమలు చేయాలని పేర్కొంది. రహదారులు, సీవరేజ్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపల్ బాండ్లను జారీ చేయాలని సూచించింది. సీఆర్డీఏ బాండ్లతో అత్యధిక రుణం దేశంలో తొలిసారిగా 1997లో బెంగళూరు మునిసిల్ కార్పొరేషన్, 1998లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రుణాలను సేరించాయని, 2000 సంవత్సరం వరకు తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లు బాండ్ల జారీ ద్వారా రూ.1200 కోట్ల వరకు సమీకరించినట్లు నివేదికలో ప్రస్తావించింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రారంభమయ్యాక 2005 నుంచి మున్సిపల్ బాండ్ల జారీ ఆకస్మాత్తుగా నిలిచిపోయిందని పేర్కొంది. తిరిగి 2017–2021 మధ్యలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రూ.3840 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఏపీ సీఆర్డీఏ బాండ్ల ద్వారా రూ.2000 కోట్లు రుణం తీసుకున్నాయి. సొంత వనరులు పెంచుకునేలా.. ప్రైవేట్ భూ యజమానులపై భూమి విలువ పన్నులు, బెటర్మెంట్ లెవీ, డెవలప్మెంట్ చార్జీలు, ఖాళీ భూమి పన్ను మొదలైన మార్గాల ద్వారా సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని నివేదిక సూచించింది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయం కోసం ప్రత్యేకంగా వినియోగించాలని పేర్కొంది. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల ద్వారా మున్సిపాలిటీలకు రుణాల సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తలసరి అప్పుల్లో తెలంగాణ టాప్ దేశంలో మునిసిపల్ కార్పొరేషన్ల తలసరి రుణాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. తలసరి అప్పు రూ.1750 ఉండగా బిహార్, మహారాష్ట్రలో రూ.600 ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో మునిసిపల్ కార్పొరేషన్లలో తలసరి అప్పు రూ.400 చొప్పున ఉంది. షరతుల బాండ్లతో అవరోధాలు దేశంలో మునిసిపల్ బాండ్లకు అనేక షరతులతో అనుమతించడం అవరోధంగా ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో బాండ్ల జారీకి అనుమతించినా ద్వితీయ మార్కెట్ లేకపోవడంతో కీలకమైన అడ్డంకిగా ఉందని పేర్కొంది. ఈ సెక్యూరిటీల కోసం మరింత విస్తృతమైన పెట్టుబడిదారుల వ్యవస్థ అవసరమని సూచించింది. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్ బాండ్ల ద్వారా స్థిరమైన వనరుల సమీకరణకు ప్రోత్సహించాలని తెలిపింది. ఆర్థిక పెట్టుబడికి అవసరమైన వాతావరణం, సమర్థ నియంత్రణ, పారదర్శకత, మెరుగైన పాలనకు చర్యలు తీసుకోవాలని, స్టాక్ ఎక్సే్చంజీలలో మునిసిపల్ బాండ్లు నమోదయ్యేలా ద్వితీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని పేర్కొంది. బాండ్ల జారీతో రూ.37,600 కోట్లు మునిసిపల్ పాలన మెరుగుపరచేందుకు దక్షిణాఫ్రికా రెండు దశాబ్దాలుగా పలు చర్యలు తీసుకుంది. మూడంచెల విధానంలో జనాభా ఆధారంగా షరతులు లేకుండా సమానంగా వనరుల పంపిణీ చేపడుతోంది. అక్కడ 97 మునిసిపాలిటీలు 4.7 బిలియన్ డాలర్లు (రూ.37,600 కోట్లు) బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించాయి. -
ఆస్తిపన్ను పరిధిలోకి రాని గృహాలు లక్షల్లో..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పురపాలికలకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. నిధుల్లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్ష్రేత్రస్థాయిలో ఇంకా లక్షల సంఖ్యలో ఆస్తుల పన్ను మదింపు జరగడం లేదు. ఒకవేళ మదింపు జరిగి, నోటీసులు జారీ చేసినా, వందశాతం వసూళ్లు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విదిలించకపోతే ఆ స్థానిక సంస్థలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితులుంటున్నాయి. చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల.. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో సహా మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 17.50 లక్షల స్థిరాస్తులపై ఏటా రూ.4,500 కోట్ల ఆస్తిపన్నులు విధించి వసూలు చేస్తున్నారు. మిగిలిన 141 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో 22 లక్షల స్థిరాస్తులను ఆస్తి పన్నుల పరిధిలోకి తెచ్చి మొత్తం రూ.1,322 కోట్ల పన్నులను వాటిపై విధించారు. మిగిలిన వాటితో పోల్చితే ఒక్క జీహెచ్ఎంసీ 3.2 రెట్లు అధిక ఆదాయాన్ని పొందుతోంది. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు పెద్దసంఖ్యలో ఉండటం, అద్దె విలువ సైతం అధికంగా ఉండటంతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది. క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను వసూళ్లలో లోపాలను అరికట్టేందుకు ఉన్నతస్థాయిలో కొత్త ఆలోచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదు. జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)ను ప్రత్యేకంగా సీనియర్ అధికారిగా నియమించినా.. ఆస్తిపన్ను పెంపులో పెరుగుదల ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ..కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. అయినా, స్థానిక సంస్థల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వందకు వందశాతం వసూలైన దాఖలాలు లేవు. మదింపులోనే అసలు సమస్య ఆస్తిపన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. టాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తిపన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు పుచ్చుకుని ఆస్తిపన్ను తక్కువగా వేస్తున్నారని, ముడుపులివ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. టాక్స్ ఇన్స్పెక్టర్లకు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే.. నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. చాలామంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులను నిర్మిస్తుండటంతో.. అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అనుమతిలేకుండా కట్టిన నిర్మాణాలకు పన్నుల చెల్లింపు విషయంలోనూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తిపన్నుల సవరణ ప్రతీ ఐదేళ్లకోమారు జరగాల్సి ఉన్నా.. నివాస గృహాలపై గత 20 ఏళ్లుగా జరగలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను ఆటోమెటిక్‌గా పెంచేందుకు పురపాలక శాఖ యత్నిస్తోంది. 141 మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లలో ఇప్పటివరకు 76 మునిసిపాలిటీల్లో భూముల విలువలు పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరిగే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మరో 65 మునిసిపాలిటీల్లో ఈ విధానం అమలు కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో గత ఐదేళ్లలో ఆస్తి పన్ను ఇలా..(ఆగస్టు10 వరకు) సంవత్సరం ఉన్న ఇళ్లు (లక్షల్లో) డిమాండ్ (రూ.కోట్లలో) వసూళ్లు (రూ.కోట్లలో) శాతం 2018-19 17.53 501.20 445.89 88.96 2019-20 19.18 650.13 561.05 86.30 2020-21 20.27 799.14 719.34 90.01 2021-22 20.76 811.48 698.25 86.04 2022-23 21.95 1,322.89 334.18 25.26 -
అధికారులు పరిధులు దాటారు..
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వివాదంలో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్పొరేషన్ అధికారులపై నిప్పులు చెరిగింది. కోర్టుకిచ్చిన హామీని ‘ఏదో పని ఒత్తిడిలో’ ఇచ్చామంటూ మునిసిపల్ కమిషనర్ తన కౌంటర్లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ అధికారులు పరిధులన్నీ దాటేశారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారం లేకున్నా బలవంతంగా పన్ను వసూలు చర్యలకు పాల్పడ్డారని మండిపడింది. కోర్టుకిచ్చిన హామీని తుంగలో తొక్కడమే కాకుండా, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదంది.నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ఏకపక్షమే కాక రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాష్ట్రం ఓ పౌరురాలిని వేధింపులకు గురి చేసిన వ్యవహారమని, ఇలాంటి చర్యలను వీలైనన్ని మార్గాల్లో అడ్డుకుని తీరాల్సిందేనని స్పష్టం చేసింది. పిటిషనర్ నుంచి వసూలు చేసిన రూ.34.12 లక్షల మొత్తాన్ని 24 శాతం వార్షిక వడ్డీతో రెండు వారాల్లో వాపసు చేయాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. అంతేకాక పిటిషనర్‌కు రెండు వారాల్లో రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలంది. రూ.34.12 లక్షల వాపసు, రూ.25 వేల చెల్లింపు చేసినట్టు రుజువులను హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్) ఎదుట సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం నెల్లూరు పట్టణం, ట్రంక్ రోడ్డులో తనకున్న భవన సముదాయానికి సంబంధించిన ఆస్తి పన్ను వివాదంపై విజయలక్ష్మి 2012లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సివిల్ జడ్జి కోర్టు.. పెంచిన ఆస్తి పన్ను మొత్తాన్ని రద్దు చేసింది. పాత పన్నులో 50 శాతం పెంచుకునేందుకు కార్పొరేషన్ అధికారులకు అనుమతిచ్చింది. అప్పటికే అధికంగా వసూలు చేసిన పన్ను మొత్తాన్ని విజయలక్ష్మి భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో, ఆదేశాల అమలు కోసం ఆమె.. ఎగ్జిక్యూషన్ పిటిషన్(ఈపీ) దాఖలు చేశారు. దీంతో కోర్టులో మునిసిపల్ కమిషనర్ ఓ మెమో దాఖలు చేస్తూ.. అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు విజయలక్ష్మి దాఖలు చేసిన ఈపీని కోర్టు మూసివేసింది. అనంతరం విజయలక్ష్మికి రూ.13.71 లక్షలను వాపసు చేయాల్సి ఉందని, ఈ మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే పన్ను మొత్తంలో సర్దుబాటు చేస్తామని కమిషనర్ ఓ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.34.12 లక్షలకు విజయలక్ష్మికి పన్ను పంపింది. అంత మొత్తం ఎందుకు చెల్లించాలో ఆ నోటీసులో ఎక్కడా పేర్కొనలేదు. ఈ నోటీసు అందుకున్నాక.. సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని విజయలక్ష్మి కార్పొరేషన్ అధికారులకు ఇచ్చారు. దీనిని పట్టించుకోకుండా అధికారులు విజయలక్ష్మికి చెందిన షాపును సీజ్ చేశారు. రూ.34.12 లక్షలు చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి చేసి చెక్కు తీసుకుని, దాన్ని నగదుగా మార్చుకున్నారు. దీనిపై విజయలక్ష్మి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. -
ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది
ఆస్థిపన్ను దాఖలు చేసే విషయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తూ అడ్డంగా దొరికిపోయింది. పన్ను తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి అసలుకే ఎసరు తెచ్చింది. లక్షల్లో పన్ను తప్పించుకోవాలని చూస్తే చివరకు జరిమానాతో కలిపి వ్యవహారం కోట్లకు చేరుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బాచుపల్లి ఏరియాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆస్పత్రికి 9 అంతస్థులతో భవన నిర్మాణ అనుమతులు కూడా వచ్చాయి. అయితే మున్సిపాలిటీకీ ఆస్తి పన్ను చెల్లించాల్సిన సమయంలో ఉన్న విలువ కంటే తక్కువ విలువ చూపిస్తూ దరఖాస్తు చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అనుమానం వచ్చి విచారణ చేపట్టగా ఆస్తి వివరాలు తక్కువ చేసి చూపినట్టుగా తేలింది. దీంతో ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన మున్సిపల్ చట్టాల ప్రకారం.. ఎంత పన్నును తక్కువ చూపించారో దానికి 25 రెట్లు జరిమానాగా విధించారు. దీంతో సదరు హాస్పిటల్ యాజమాన్యానికి ఏకంగా రూ.24 కోట్ల రూపాయలు జరిమానా పడింది. చదవండి: హైదర్‌గూడ డీ మార్ట్‌కి షాక్! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక -
ఫలితాలిచ్చిన ఆస్తి పన్ను తగ్గింపు
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌లో ప్రకటించిన ఆస్తి పన్నుపై ఐదు శాతం తగ్గింపు అవకాశాన్ని పుర ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కంటే 55 శాతం అధికంగా పన్ను చెల్లించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని, ఇందులో వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. పలు దఫాలుగా ఆస్తి పన్ను చెల్లింపులపై సమీక్షలు నిర్వహించామన్నారు. దాంతో పన్ను చెల్లింపులు గత సంవత్సరం వసూలైన రూ.320.13 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి 55 శాతం అధికంగా రూ.496.51 కోట్లు వసూలైందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ వివరించారు. -
ఎర్లీబర్డ్’..యమా సక్సెస్!
సాక్షి హైదరాబాద్: కరువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్’ స్కీమ్‌కు నగర వాసులు బాగా స్పందించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 36 శాతం మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు ఒక్కనెలలోనే రూ.600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. శుక్రవారం సాయంత్రం వరకు రూ.616 కోట్ల ఆస్తిపన్ను జీహెచ్ఎంసీ ఖజానాలో చేరింది. శనివారం వరకు ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా దాదాపు రూ.700 కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు మిగతా సంవత్సరమంతా ఎలా నెట్టుకురావాలా అన్న ఆలోచనలోనూ అధికారులున్నారు. ఎర్లీబర్డ్ పథకం పాత బకాయిలు లేని, కొత్త ఆర్థికసంవత్సరం(2022–23)ఆస్తిపన్ను చెల్లించేవారికి వర్తిస్తుంది. ఎర్లీబర్డ్ రాయితీ వినియోగించుకోవాలనుకుంటే ముందు బకాయిలన్నీ చెల్లించాలి. పాత బకాయిలు కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను అంచనా దాదాపు రూ.1500 కోట్లు. అంటే వచ్చే ఆస్తిపన్నులో దాదాపు సగం మొత్తం ఈ ఒక్కనెలలోనే వసూలైతే మిగతా 11 నెలలు ఎలా నెట్టుకురావాలన్నదే అధికారుల ఆలోచన. జీహెచ్ఎంసీకి ఉన్న ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నే. వీటిద్వారానే సిబ్బంది, పెన్షన్‌దారుల జీతభత్యాల చెల్లింపులు తదితరమైనవి జరుపుతున్నారు. మున్ముందు వసూలయ్యే ఆస్తిపన్ను తగ్గనున్నందున ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. నేడు రాత్రి 10 గంటల వరకు సీఎస్సీలు పనిచేస్తాయి.. జీహెచ్ఎంసీ ఆస్తిపన్నును ఆన్‌లైనా ద్వారా, మీసేవా కేంద్రాలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీలు)ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉంది. ఎర్లీబర్డ్ అవకాశానికి చివరి రోజైన శనివారం ప్రజల సదుపాయార్థం జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలోని సీఎస్సీలు రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. గత రెండు సంవత్సరాల్లో కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎర్లీబర్డ్ అవకాశాన్ని ఏప్రిల్ నెలలోనే కాకుండా మే నెలాఖరు వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో రెండునెలల గడువు ఇచ్చినా ఏ ఒక్క సంవత్సరం కూడా రూ.600 కోట్లు వసూలు కాలేదు. (చదవండి: టైమ్‌సెన్స్ లేక..) -
ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తిపన్ను పెంపు! ఈ నిబంధనలే కారణం ?
తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచబోత్నుట్టు ప్రకటించింది. ప్రతిపక్షాలతో పాటు మిత్ర పక్షం నుంచి విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గేది లేదంటోంది స్టాలిన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ శనివారం న్యూఢిల్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. తమిళనాడులో ఉన్న పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను భారీగా పెరగనుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై విషయాన్ని పరిశీలిస్తే... 600 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులపై 50 శాతం, 600ల నుంచి 1200 చదరపు అడుగుల స్థలంలో విస్తరించిన ఆస్తులపై 75 శాతం పన్ను, 1200 నుంచి 1800 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఉన్న ఆస్తులపై వంద శాతం పన్ను పెరగబోతుంది. 1800 చదరపు అడుగులకు మించితే 150 శాతం పన్ను పెంచనున్నట్టు సమాచారం. డీఎంకే సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పాటు మిత్రపక్షం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కాటు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, పెట్రోలు ధరల వాతలతో ప్రజలు ఉక్కిరిబిక్కరవుతున్న సమయంలో ఈ పన్ను పెంపు సరికాదంటున్నాయి. పదిహేనో ఫైనాన్స్ కమీషన్ నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు రావాలంటే ఆస్తి పన్ను పెంచక తప్పడం లేదంటూ స్టాలిన్ ప్రభుత్వం చెబుతోంది. పన్నులు పెంచినప్పటికీ అవి బెంగళూరు, లక్నో, అహ్మాదాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా కంటే తక్కువగానే ఉంటాయని అక్కడి ప్రభుత్వం అంటోంది. చదవండి: జీఎస్టీ వసూళ్లు.. రికార్డ్ -
అధికారుల ఓవరాక్షన్.. ఇంటి పన్న కట్టలేదని తలుపులు, కుర్చీలు తీసుకెళ్లి..
సాక్షి,మేడిపల్లి(హైదరాబాద్): ఇంటి పన్ను కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ వీధి నంబరు–8లోని మురళి అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు. సదరు ప్లాట్ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయమై ప్లాట్ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్ట లేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్ కలెక్టర్లు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణారావు, పీర్జాదిగూడ కమిషనర్ చదవండి: Hyderabad: డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా అధికారులు.. ఇదేం తీరు..! -
ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 6 నుంచి మార్చి చివరి ఆదివారం 27వ తేదీ వరకు ఆదివారాల్లో ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అసెస్మెంట్స్ వ్యత్యాసాలు, కోర్టు వివాదాలకు సంబంధించి ప్రజలు అధికారులతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చని కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఇతరత్రా సమస్యలను సైతం సత్వరం పరిష్కరించుకు నేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయని చెప్పారు. ఏయే తేదీల్లో.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమం నిర్వహించే ఆదివారాల తేదీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి: 6, 13, 20, 27. మార్చి: 6, 13, 20, 27 8 వారాల్లో ప్రజల ఇబ్బందులు తొలగించడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏటికేడాది ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతు న్నప్పటికీ, వివిధ ప్రాజెక్టుల పేరిట ఖర్చులు పెరిగిపోవడంతో దీని ద్వారా మరింత ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ.1362 కోట్లు వసూలు కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 వరకు రూ.1180 కోట్లు వసూలైంది. గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను శేరిలింగంపల్లి జోన్ గత సంవత్సరం ఫిబ్ర వరి నెలాఖరు వరకు వసూలైన దానికంటే ఎక్కువ వసూలు చేసింది. ఫిబ్రవరి నెలా ఖరు వరకు రూ.245 కోట్లు వసూలు కాగా, రూ.251 కోట్లు వసూలయ్యాయి. -
Tekkali: మరో నకిలీ బాగోతం: రశీదు అబద్ధం.. దోపిడీ నిజం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలిలో తవ్వుతున్న కొద్దీ అక్రమాల పుట్టలు బయటపడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఎంత అండగా నిలిచారో తెలీదు గానీ వెతికిన చోటల్లా అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు భూములకు సంబంధించి ఆయన హయాంలో సృష్టించిన ఫేక్ వన్‌బీ, అడంగల్ బయటపడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేసిన బాగోతాలు వెలుగు చూశాయి. నకిలీ పట్టాలతో బ్యాంకు రుణాలు కాజేసిన వ్యవహారాలూ బయటకొచ్చాయి. భూరికార్డులను తారుమారు చేసి కబ్జా చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా టెక్కలి పంచాయతీలో నకిలీ బిల్లులతో ఆస్తి పన్నుల ఆదాయాన్ని కొల్లగొట్టిన బండారం బయటపడింది. ఇందులో టెక్కలి బిల్లు కలెక్టర్‌గా పనిచేసిన సీహెచ్ కైసును బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినా మరో ఇద్దరు దీని వెనుక ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి రిటైరైనా అప్పటి నేతల అండతో అక్కడే తిష్టవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సొంతంగా నోటీసులు.. టెక్కలిలో నకిలీ డిమాండ్ నోటీసులు సృష్టించారు. నకిలీ రశీదు పుస్తకాలు సొంతంగా తయారు చేయించారు. టెక్కలి పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్నులు చెల్లించాల్సిన వారికి తొలుత ఆ నకిలీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పబ్లిక్కు ఆ విషయం తెలియక జారీ చేసిన డిమాండ్ నోటీసుకు తగ్గట్టుగా ఆస్తి పన్ను చెల్లింపులు చేశారు. ఇలా నకిలీలతో వసూలు చేసిన పన్నుల సొమ్మును వారు తమ జేబులోకి వేసుకున్నారు. అనుమానం రాకుండా కొంత మొత్తం మేర మాత్రం అధికారికంగా చూపించారు. ఇలా టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు రూ.16 లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. పంచాయతీలో వసూలు చేసిన ఇంటి పన్ను సొమ్మును పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా బిల్ కలెక్టర్ చేతివాటం చూపించారు. వీరితో పాటు గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి, రిటైరైన ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు 9 వేల పై చిలుకు ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే 2018– 19 సంవత్స రం నుంచి సుమారు మూడేళ్లుగా వసూళ్లు చేసిన ఇంటి పన్ను సొమ్ములో కొంత భాగాన్ని పంచాయతీ ఖాతాకు మళ్లిస్తూ మిగిలిన సొమ్మును స్వాహా చేశారు. గత కొద్ది రోజుల కిందట ఈ బాగోతం బయట పడడంతో, ప్రస్తుత పంచాయతీ ఈఓ తన స్థాయి మేరకు విచారణ జరిపి, రూ.16.46లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగొచ్చు. దీంతో ఈఓ అజయ్‌బాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇన్చార్జి డీఎల్ పీఓ ఎస్.హరిహరరావు వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. 2018–19లో రూ. 7,67,999, 2019–20లో రూ.4,22,416, 2020– 21లో రూ.4,55,787 స్వాహా చేశారు. ఈ మూడేళ్ల లో సుమారు రూ.16,46,202 మేర పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా తేల్చారు. పూర్తి అవినీతి బయటపడాలంటే సమగ్ర విచారణ అవసరమని గుర్తించారు. ఆ మేరకు విచారణకు కూడా ఆదేశించారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. పన్నుల వసూలులో అక్రమాలకు పాల్పడ్డారని, నకిలీ రశీదులు జారీ చేయడం వంటి అంశాలు బయట పడటంతో పాటు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో బిల్ కలెక్టర్ సీహెచ్ కైసును జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా టెక్కలి వదిలి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
గ్రామాల్లో ఆస్తి పన్ను ఏటా 5 శాతం పెంపు జీవో బాబు సర్కారుదే
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను (ఇంటి పన్ను) ఏటా ఐదు శాతం చొప్పున పెంచాలని 2002లో చంద్రబాబు సర్కారు జీవో 98 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రకారం అధికారుల స్థాయిలోనే గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏటా ఇంటి పన్ను పెంచుకుంటూ వెళ్లింది. ఐదేళ్లలో పెంచిన ఇంటి పన్నుల భారం రూ.266 కోట్లు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో ప్రకారమే ఈ ఏడాది కూడా గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తున్నా రాజకీయ విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేదో ప్రజలపై కొత్తగా పన్ను భారం మోపుతున్నట్లు అపోహలు సృష్టించేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు రెట్లు పెరుగుదల... 2013–14లో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మొత్తం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు లక్ష్యం రూ.157.96 కోట్లు కాగా 2018–19 నాటికి రూ.423.69 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్లలో ఇంటి పన్ను లక్ష్యం దాదాపు మూడు రెట్లు పెరిగింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే కూడా అధికంగా గత సర్కారు ఇంటి పన్ను భారం మోపింది. చదవండి: విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి నాటి జీవో ప్రకారమే.. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇంటి విలువపై రూ.వందకు 12 పైసల నుంచి ఒక్క రూపాయి మధ్య ఇంటి పన్నును సంబంధిత గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని నిర్ధారించుకోవచ్చు. 2000–2001లో ఇంటి విలువ ఆధారంగా ప్రస్తుతం పన్ను నిర్ధారణ జరుగుతోంది. అప్పుడు నిర్ధారించిన ఇంటి పన్ను ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతోంది. కొత్తగా ఇంటి విలువ నిర్ధారణ జరిగే వరకు 2000–2001 నాటి ఇంటి విలువ ఆధారంగానే పన్ను వసూలు చేయాలని టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో 98లో పేర్కొన్నారు. ఎన్నికల భయంతో ప్రయోగం వాయిదా 2017–18లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత సర్కారు ప్రయోగాత్మకంగా అప్పటి ధరల ప్రకారం ఆస్తి విలువను నిర్ధారించి కొత్తగా ఇంటి పన్ను వసూలు చేసింది. ఈ నిర్ణయంతో ఒక్కో యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్ను ఒకేసారి రెండు రెట్లకు పైగా పెరిగినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో పశ్చిమ గోదావరి తరహాలోనే అప్పటి విలువ ఆధారంగా కొత్తగా ఇంటి పన్ను నిర్ధారణకు నాటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్ కసరత్తు చేపట్టారు. చదవండి: అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లను కొత్తగా సర్వే చేసి అప్పటి విలువ ప్రకారం లెక్కకట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల భయంతో ఇంటి పన్ను పెంపును గత సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2019లోనే పంచాయతీల్లో ఇంటి పన్ను రెండు మూడు రెట్లు పెరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. 2014–19 గ్రామాల్లో ఇంటి పన్ను పెరిగిన తీరు ఆర్థిక ఏడాది వసూలు లక్ష్యం రూ.కోట్లలో 2013–14 157.96 2014–15 186.33 2015–16 257.95 2016–17 299.60 2017–18 369.40 2018–19 423.69 -
ఆస్తి పన్ను మదింపు చట్టంపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టంతో పాటు తదనుగుణ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి వీరాంజనేయులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. -
ఆస్తి పన్ను మదింపు విధానాన్ని మార్చండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా.. వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబర్ 24న జారీ చేసిన జీవో 198, అదే రోజున జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జీవో 198తో పాటు గెజిట్ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ‘అవగాహన’ కార్యదర్శి కె.శివరామిరెడ్డి, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. పాత విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. -
ప్రక్షాళన దిశగా జీహెచ్ఎంసీ.. ఇక బిల్లు కలెక్టర్లు ఉండరా?
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లవద్దంటూ ఇప్పటికే బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ.. ఆస్తిపన్ను వసూళ్ల కోసం కూడా ఇళ్ల యజమానులకు వెళ్లకుండా చేసే ఆలోచనలో ఉంది. జీహెచ్ఎంసీలో పలువురు బిల్ కలెక్టర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు ఆస్తిపన్ను వసూళ్ల కోసం ప్రైవేటు అసిస్టెంట్లను నియమించుకోవడం వంటి ఘటనలు గతంలో వెలుగు చూశాయి. (చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్...ఎలాగంటే!) ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్నును సైతం వెంటనే ఖజానాలో జమ చేయకపోవడం తదితరమైనవి బల్దియా వర్గాలకు సుపరిచితమే. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్తిపన్ను వసూళ్ల కోసం కోసం బిల్ కలెక్టర్లు వెళ్లనవసరం లేకుండా ప్రజలే తమ బాధ్యతగా ఆస్తిపన్ను చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ► ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుతో పాటు నిర్ణీత వ్యవధుల్లో పన్ను చెల్లించాల్సిందిగా ఎస్ఎంఎస్లు పంపించడం.. నిర్ణీత వ్యవధిలో చెల్లించని పక్షంలో పెనాల్టీ పడే అంశాన్ని తెలియజేయడం వంటివి చేయనున్నారు. వీటితోపాటు అధికారులు ర్యాండమ్‌గా తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. ► తనిఖీల్లో భవనం వాస్తవ విస్తీర్ణం వంటివి గుర్తించనున్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉండి తక్కువ ఆస్తిపన్ను ఉంటే సరిచేస్తారు. దీర్ఘకాలంగా ఆస్తిపన్ను చెల్లించని వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. తదుపరి దశల్లో విద్యుత్, నీటి కనెక్షన్ వంటివి తాత్కాలికంగా నిలిపివేయాలనే ఆలోచనలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ► ఎటొచ్చీ బిల్ కలెక్టర్లు వెళ్లకుండానే ప్రజలే తమ ఆస్తిపన్ను చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఆస్తిపన్నును ఎక్కడినుంచైనా ఆన్లైన్లో చెల్లించే వెసులుబాటు మాత్రమే కాక, సిటిజెన్ సర్వీస్ సెంటర్లలోనూ చెల్లించే వీలుంది. డాకెట్ల విధానం ఎత్తివేత.. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్ల కోసం డాకెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 20 లక్షల ఇళ్లు 314 డాకెట్లలో ఉన్నాయి. డాకెట్ల వారీగానే బిల్కలెక్టర్లు తమకు కేటాయించిన డాకెట్‌లో ఇళ్లపన్ను వసూలు చేస్తారు. బిల్ కలెక్టర్లను ఆస్తిపన్ను వసూళ్ల కోసం వినియోగించనందున డాకెట్ విధానం కూడా అవసరం లేనందున ఆ విధానాన్ని కూడా ఎత్తివేయనున్నారు. ఓవైపు బల్దియాలో అవినీతి ప్రక్షాళన.. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగానే ఆస్తిపన్ను చెల్లించేలా చేయాలనేది లక్ష్యం. (చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం) -
ఆస్తి జానెడు.. పన్ను బారెడు
ఈ ఫొటోలోని మహిళ బుర్జుగడ్డతండా వాసి లక్ష్మి.. ఈమె ఇంటికి సంబంధించి గత ఏడాది రూ.899 ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది రూ.5,371 ఆస్తి పన్ను చెల్లించాలని ఐదు రోజుల కిందట పంచాయతీ నుంచి నోటీసులు వచ్చాయి. ఒకే సారి ఆస్తి పన్ను ఇష్టానుసారంగా పెంచితే ఎలా..? వ్యవసాయం చేసుకునే మేము ఇంత ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు.. రెండు తండాల్లోని అందరికీ ఎదురవుతోన్న సమస్య. అధికారుల అత్యుత్యాహం.. పాలకుల అనాలోచిత చర్యలతో తండా ప్రజలకు ఆస్తి పన్ను భారంగా మారింది. ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి ఐదు వంతులకు పెంచడంతో గిరిజనులు ఆందోళనకు చెందుతున్నారు. మండల పరిధిలోని పెద్దషాపూర్‌తండా పంచాయతీ, అనుబంధ గ్రామం బుర్జుగడ్డతండాలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులను భారీగా పెంచేశారు. గతేడాది రూ.5,32,264 ఉండగా.. ఈ ఏడాదికి రూ.9,01,351 డిమాండ్ నమోదు చేసి ఇంటి యజమానులకు వారం రోజుల నుంచి డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న స్థానికులు పన్ను మొత్తాన్ని చూసి షాక్ తింటున్నారు. పంచాయతీ పరిధిలోని రెండు తండాల్లో 312ఇళ్లు ఉండగా.. సుమారు 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో చాలా వరకు వ్యవసాయం, రోజూ కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది వరకు రూ.1000 ఉన్న ఆస్తి పన్ను ఇప్పుడు ఏకంగా రూ.5వేలు దాటిపోయింది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు వసూలు చేయరని, గిరిజన తండాల్లో రూ.వేలకు వేలు ఆస్తి పన్నులకు డిమాండ్ నోటీసులు పంపించడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్ను మదింపు విధానం ఆస్తి పన్ను మదింపును పంచాయతీ పాలక వర్గం తీర్మాణం మేరకు ధర నిర్ణయించాల్సి ఉంటుంది. ఖాళీ స్థలానికి చదరపు గజం, నిర్మాణానికి చదరపు అడుగుల మేరకు కొలతలు తీసుకుని పన్ను మదింపు చేయాలి. గజానికి రూ.1500 చొప్పున వంద గజాల ఖాళీ స్థలం విలువ రూ.1,50,000 అవుతుంది. ఇందులో ఆర్సీసీ ఇంటి నిర్మాణం ఉంటే 900 చదరపు అడుగుల విస్తీర్ణం అవుతుంది. దీంతో ఇంటి విలువ చదరపు అడుగుకు రూ.1250గా లెక్కిస్తే రూ.11,25,000గా నిర్ధారించాలి. ఖాళీ స్థలం, నిర్మాణం విలువలను కూడితే మొత్తం రూ.12,75,000 ఆస్థి విలువ అవుతుంది. దీనికి రూ.0.12 పైసల నుంచి ఒక రూపాయి వరకు ఆస్తి పన్ను మదింపు చేయవచ్చు. రూ.0.12 పైసలుగా వంద గజాల ఇంటికి ఆస్తి పన్ను రూ.1530లు కాగా.. దీనికి 8 శాతం గ్రంథాలయం ఫీజు రూ.122 జత చేసి ఆస్తి పన్ను మదింపు చేపట్టాలి. ఏళ్ల నాటి ఇళ్లకు కొత్తగా మదింపు కొత్తగా నిర్మించే ఇళ్లకు పైన సూచించిన విధంగా ఆస్తి పన్ను మదింపు చేయాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు గ్రామాల్లో ఆస్తి పన్ను తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రతి ఏటా ఐదు శాతం పెంచుతూ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం సుమారు 20ఏళ్ల కిందట నిర్మించిన ఇళ్లకు కొత్తగా అసెస్మెంట్ చేస్తూ ఆస్తి పన్ను మదింపు చేశారు. పైగా ఇటీవల నిర్మించిన ఇళ్ల కంటే కూడా ఏళ్ల నాటి ఇళ్లకు ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. చదవండి: Radhe Shyam Shooting: గండికోటలో ‘రాధేశ్యామ్’ షూటింగ్.. ఫోటోలు వైరల్ ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను.. -
నిరీక్షణకు తెర.. సెల్ఫ్ అసెస్మెంట్తో పాటే ‘పీటీఐఎన్’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కున్న/నిర్మించుకున్నవారికి జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ (ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య) కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ఆన్లైన్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్ను ఎంతో కాలం క్రితమే జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఆన్లైన్ ద్వారా ప్రజలు సమర్పించిన వివరాలను నిర్ధారించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశాకే పీటీఐఎన్ కేటాయించేవారు. ఇప్పుడిక సెల్ఫ్ అసెస్మెంట్కు సంబంధించి జతపర్చాల్సిన పత్రాలు జత చేశాక, నివాస గృహమా, వాణిజ్య భవనమా, జోన్, సబ్జోన్ తదితర అవసరమైన వివరాలన్నీ నమోదు చేశాక చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు తెలుస్తాయి. ఆస్తిపన్నును ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించగానే పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. చెల్లించిన ఆస్తిపన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీటీఐఎన్ జనరేట్ అయ్యాక సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. హెచ్చుతగ్గులుంటే సవరిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరగ్గానే పీటీఐఎన్ జనరేట్ అయ్యే ప్రక్రియ కూడా అందుబాటులోకి తెచ్చినప్పటికీ, పూర్తిస్థాయిలో అమలుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పీటీఐఎన్ జనరేట్ అయితే ఆ వివరాలు జీహెచ్ఎంసీకి చేరతాయి. జీహెచ్ఎంసీలో సంబంధిత సర్కిల్‌స్థాయి అధికారులు సంబంధిత ఆస్తిని తనిఖీ చేసి ఆస్తిపన్ను నిర్ధారిస్తారు. అలాంటి వారు సెల్ఫ్అసెస్మెంట్ చేసుకోవాల్సిన పని ఉండదు. అంటే ఇప్పటి వరకు ఆస్తిపన్ను నిర్ధారణ అయ్యాక పీటీఐఎన్ జనరేట్ చేసేవారు. కొత్త పద్ధతి వల్ల పీటీఐఎన్ ముందుగానే జనరేట్ అవుతుంది. బర్త్ సర్టిఫికెట్ ఫైల్ ట్రాకింగ్ సిస్టం.. ఆస్పత్రుల్లో శిశువుల జననం జరిగినప్పటి నుంచి బర్త్ సర్టిఫికెట్ రెడీ అయ్యేంత వరకు ఫైల్ ట్రాకింగ్ సైతం తల్లిదండ్రులకు తెలిసేలా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. డెత్ సర్టిఫికెట్ల జారీకి సైతం దాదాపుగా ఇదే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. -
దరఖాస్తు చేయగానే బర్త్ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: ఇకపై మీ–సేవా కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకుంటే తక్షణమే (ఇన్‌స్టంట్‌గా) పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జారీ కానుంది. పురపాలక శాఖ పౌర సేవల పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే ఆస్తి పన్నుల మదింపు, వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మదింపు, ట్రేడ్ లైసెన్సు జారీ, ట్రేడ్ లైసెన్సు పునరుద్ధరణ వంటి సేవలు లభించనున్నాయి. ఆస్తి పన్నులపై పునః సమీక్ష దరఖాస్తుతో పాటు ఈ పునః సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై అప్పీళ్లను 15 రోజుల గడువులోగా పరిష్కరించనున్నారు. ఖాళీ భవనాలు/ ఇళ్లకు ఆస్తి పన్నుల నుంచి ఉపశమనం కల్పించడానికి వెకెన్సీ రెమిషన్ దరఖాస్తులను సైతం 15 రోజుల్లోగా పరిష్కరించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని షెడ్యూల్–3లో పొందుపర్చిన ‘పౌర సేవల పట్టిక’లో నిర్దేశించిన గడువుల్లోగా ఆయా సేవలను ఇకపై కచ్చితంగా పౌరులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం అన్ని పురపాలికలకుఆదేశాలు జారీ చేశారు. పురపాలికల్లో ఆన్లైన్ ద్వారా పౌరులకు సత్వర సేవలను అందించాలని సరళీకృత వాణిజ్యం(ఈఓడీబీ) సంస్కరణలు–2020 పేర్కొం టున్నాయని తెలిపారు. ఆన్లైన్/ మీ–సేవా ద్వారా పౌరులకు నిర్దిష్ట గడువులోగా సేవలు అందించాలని ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం సైతం పేర్కొంటోందని, ఈ క్రమంలో చట్టంలో పేర్కొన్న పౌర సేవల పట్టికను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పౌర సేవల పట్టికను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డు, పౌర సేవల కేంద్రం, పురపాలిక పోర్టల్‌లో ప్రదర్శనకు ఉంచాలని కోరారు. పురపాలక శాఖ పోర్టల్ https://cdma.telangana.gov.in లేదా మీ–సేవా కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ కింద పేర్కొన్న సేవలను నిర్దిష్ట గడువులోగా పొందవచ్చు. వాట్సాప్‌లో ఆస్తిపన్నుల వివరాలు ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు ‘తెలంగాణ ఈ–పట్టణ సేవలు’పేరుతో పురపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించింది. 9000253342 నంబర్‌కు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరాలను పంపించనుంది. అలాగే ఈ పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్‌లను కూడా పంపించనుంది. ఈమేరకు పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
గ్యాగ్ ఆర్డర్ తప్పని ఆ రోజే చెప్పాం: మంత్రి బొత్స
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్ను చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఉత్తర్వులపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కొత్త ఆస్తి పన్ను విధానంపై ఆస్తి పన్ను మోత అంటూ పిచ్చి రాతలు రాస్తున్నారని విమర్శించారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే ఆ పత్రికలు నిర్ణయించుకున్నాయన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం అందరికి తెలుసని అన్నారు. అలాంటి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందా అని ప్రశ్నించారు. ఆస్తి పన్ను సవరిస్తూ జారీ చేసిన జీవో అర్థం కాకపోతే తమను అడగాలని, దాని గురించి వివరంగా చెప్తామని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటగా కోరుతున్నామని, ఇలాంటి తప్పుడు రాతలను విశ్వసించవద్దని ప్రజలను కోరారు. చదవండి: పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు చెల్లిస్తాం : సీఎం జగన్ ఈ ప్రభుత్వం ప్రజలదని, దేశం మొత్తం కేంద్రం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. స్థానిక సంస్థలు బలోపేతానికి, మెరుగైన సేవల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇవని స్పష్టం చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను విషయంలో కేంద్రం సూచన మేరకు మార్పులు చేశామని పేర్కొన్నారు. ఒక్క ఏపీ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే అవలంబిస్తున్నాయని తెలిపారు. 0.10 శాతం మేర పన్ను వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, అన్ని విధాలా ఆలోచన చేసి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. విధానం మార్పుచేయండి, కానీ ప్రజలపై భారం పడకూడదు అని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఇంటికి ఉన్న పన్నుకు 10 నుంచి 15 శాతం కంటే ఎక్కువ పెరిగే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో 375 చదరపు అడుగుల లోపు ఉన్న వారికి 50 రూపాయలు మాత్రమే పన్ను ఉంటుందని, మిగతా వారికి 0.10 శాతం నుంచి 0.50 వరకు పన్ను ఉంటుందన్నారు. చదవండి: ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించాం. దానికీ భారీగా పెరగకుండా 100 నుంచి 350 రూపాయల కంటే నీటి పన్ను ఎక్కువ ఉండకూడదని నిర్ణయించాం. ఇది కూడా 5 శాతం కంటే పెంచకూడదని నిర్ణయించాం. సీవరేజ్ కూడా 30 నుంచి 35 రూపాయలు మించకూడదని నిర్ణయించాం. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయాలు తీసుకున్నాం. సామాన్యులకు, మధ్యతరగతి వారికి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల బలోపేతమే మా ధ్యేయం. ఓ పత్రిక ఇసుక మీద కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామంటూ రాతలు రాశారని, ఏదైనా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలనేది తమ ప్రయత్నం. కొత్త వ్యవస్థను రూపొందించి అవినీతి జరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందుకు ప్రజలందరి సహకారం అవసరం. చదవండి: పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ గ్యాగ్ ఆర్డర్ తప్పు అని ఆ రోజే మేము చెప్పాం. ఈ అదే విషయం సుప్రీం కోర్టు చెప్పింది. న్యాయం అనేది అందరికీ సమానమే. దానికి అందరం కట్టుబడి ఉన్నాం. మేము ఊహించిందే. ఆరోజు అందరూ వ్యతిరేకించారు. చంద్రబాబుకి మేము ఎందుకు భయపడతాం. ఎస్టీలు ఒడిస్తారా...? మీ లాగా కులాల మధ్య చిచ్చు పెట్టామా..? బలహీన వర్గాలకు మహిళలకు మేము ఎంతో చేస్తున్నాం. నువ్వు మహిళల్ని మోసం చేస్తే మేము వారిని ఆదుకున్నాం. వారంతా ఆనందంగా ఉన్నారు. ఈ ఒక్క రోజే సుమారు 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందించాం. మళ్లీ రెండో దఫా కరోనా వచ్చే అవకాశం ఉందని ప్రజల క్షేమం కోసం ఎన్నికలు వాయిదా వేయాలన్నాం. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
ప్రభుత్వంపై కావాలని బురద చల్లుతున్నారు: మంత్రి బొత్స
-
పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేటగిరీలవారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లు ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి. అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి. దీనిపై పురపాలకశాఖ తుది నిర్ణయం తీసుకుని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. పురపాలకశాఖ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ఆస్తి పన్ను రేట్లు ఇలా.. ► నివాస గృహాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.10 శాతానికి తగ్గకుండా 0.50 శాతానికి మించకుండా ఆస్తి పన్నును ప్రతిపాదించారు. ► వాణిజ్య భవనాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.20 శాతానికి తగ్గకుండా 2 శాతానికి మించకుండా ఆస్తి పన్ను ప్రతిపాదించారు. ► ఒక మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతటా ఆస్తి పన్ను రేట్లు ఒకేలా ఉండాలి. ► 375 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలోపు నిర్మించిన ఇళ్లలో ఇంటి యజమాని నివాసం ఉంటే ఏడాదికి నామమాత్రంగా రూ.50 ఆస్తిపన్నుగా నిర్ణయించారు. ఖాళీ జాగాలపై పన్ను రేట్లు ఇలా ► మున్సిపాలిటీలలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.20 శాతం. ► మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.50 శాతం. ► ఖాళీ జాగాలలో చెత్త / ఇతర వ్యర్థాలు వేస్తే మున్సిపాలిటీలలో అదనంగా 0.10 శాతం, కార్పొరేషన్లలో అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు. అనధికార నిర్మాణాలపై జరిమానాలు ► అనుమతులకు మించి 10 శాతం అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 25 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులకు మించి 10 శాతాని కంటే ఎక్కువగా అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 50 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు (ఫ్లోర్లు) నిర్మిస్తే విధించిన ఆస్తిపన్నుపై 100 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. మొత్తం భవనమే అనధికార నిర్మాణం అయితే కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది. వీటికి పన్ను మినహాయింపులు ► ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ/ మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు, పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ► సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ జాగాకు పన్ను మినహాయింపు కలి్పంచారు. -
సగం ఆస్తి పన్ను మాఫీ
సాక్షి, హైదరాబాద్ : గృహ యజమానులు, వరద బాధితులు, జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దీపావళి రోజు పండుగ కానుకలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రూ.15 వేలలోపు వార్షిక ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల యజమానులకు 2020–21 సంవత్సరానికి సంబంధించి 50 శాతం ఆస్తిపన్ను మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని మిగిలిన 140 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సైతం రూ.10 వేలలోపు ఆస్తిపన్ను ఉన్న వారికీ ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల ఇళ్ల యజమానులకు రూ.196.48 కోట్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 31.40 లక్షల ఇళ్ల యజమానులకు రూ.326.48 కోట్ల రాయితీ లభిస్తుందన్నారు. ఇప్పటికే 2020–21కి సంబంధించిన ఆస్తిపన్నులను చెల్లించిన వారికి సైతం ఈ మాఫీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది (2021–22)కి సంబంధించిన వీరి ఆస్తిపన్నులను ఆ మేరకు సర్దుబాటు చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కలున్న 15 పురపాలికల ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుందని గత శుక్రవారం జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోమంత్రులందరూ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ మేరకు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రకటన మేరకు 50 శాతం ఆస్తిపన్నును మాఫీచేస్తూ అదేరోజు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మాఫీచేసిన ఆస్తిపన్నును సంబంధిత పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీ–సేవ ద్వారా ‘వరద సాయం’ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాల్లోతు నీళ్లున్న ముంపు కాలనీల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారని, ఎవరూ అడగక ముందే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడానికి రూ.530 కోట్లను విడుదల చేశారని గుర్తుచేశారు. శనివారం నాటికి 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్ల సహాయం పంపిణీ చేశామన్నారు. ఇంకా ప్రభుత్వ సహాయం అందని బాధిత కుటుంబాలు మీ–సేవ కేంద్రాల ద్వారా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులపై విచారణ జరిపి అర్హుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామన్నారు. పేరు, ఇంటి నంబర్, ప్రాంతం, మొబైల్, ఆధార్ నంబర్, పిన్‌కోడ్, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలను దరఖాస్తుతో పాటు అందజేస్తే సరిపోతుందన్నారు. ఈ మేరకు మీ–సేవ కేంద్రాల ద్వారా వరద బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల బ్యాంకు ఖాతాల్లో సహాయాన్ని జమ చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ప్రత్యేక మెమో జారీచేశారు. గ్రేటర్ పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంపు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాలను రూ.14 వేల నుంచి రూ.17 వేలకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలను రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వచ్చినా పారిశుధ్య, వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిపి రూ.3 వేల పెంపు వర్తిస్తుందన్నారు. ఫిబ్రవరి 10 వరకు టైం ఉంది.. ‘తొందరేం ఉంది.. ఫిబ్రవరి 10 వరకు మాకు టైం ఉంది.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం.. మీరెందుకు తొందర పడుతున్నారు’అని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఇలా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ముందే అనుకున్నట్టు ప్రస్తుత నవంబర్లోషెడ్యూల్ జారీచేస్తారా? లేక కొంత కాలం వేచిచూస్తారా? అన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
హైదరాబాద్: దీపావళి కానుక
-
తెలంగాణ ప్రజలకు దీపావళి బొనాంజా
సాక్షి, హైదరాబాద్ :దీపావళి పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2020-21 ప్రాపర్టీ ట్యాక్స్‌లో రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. జీహెచ్ఎంసీలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో జీహెచ్ఎంసీలో 13.72 లక్షలు.. మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షలు.. తెలంగాణ వ్యాప్తంగా 31.40 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆస్తి పన్ను కట్టిన వారికి వచ్చే ఏడాది రాయితీ ఇస్తామన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ హాజరయ్యారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ 4,75,871 కుటుంబాలకు వరద సాయం రూ.10 వేల చొప్పున అందించాం. వరద సాయం అందని వారికి మరో అవకాశం ఇస్తాం. వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. జీహెచ్ఎంసీ వర్కర్ల జీతాన్ని రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నాం. ప్రజల పక్షాన నిలబడిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తలకిందులు అయ్యింది. ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశాం. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకొన్నార’’న్నారు. -
రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తలైవాను కోర్టు హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని కొడంబాకంలోరాఘవేంద్ర కళ్యాణమంటపం పేరిట రజనీకాంత్‌కు ఒక కళ్యాణమండపం ఉంది. అయితే దానికి సంబంధించి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆయనకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని... అప్పటి నుంచి కళ్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. చదవండి: మీరు లేకపోతే నేను లేను! -
ప్రాపర్టీ ట్యాక్స్‌పై వడ్డీ భారం తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాపర్టీ టాక్స్‌పై వడ్డీ భారాన్ని తగ్గిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం వెలువడింది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద ప్రాపర్టీ టాక్స్‌పై కేవలం 10శాతం వడ్డీ కడితే సరిపోతుంది. ఈ అవకాశం కేవలం 45 రోజులు పాటు (ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15) మాత్రమే కల్పించారు. భారీగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 5.64లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా.. ఇప్పటి వరకు రూ. 1477.86 బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆస్తి పన్ను చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన మేరకు ఆస్తిపన్ను చెల్లింపు గడువును 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపు గడువు మార్చి 31తో ముగియగా, అపరాధ రుసుం లేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మే 31వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. -
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం సెక్షన్ 100 (2)ను సవరిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగరపాలక సంస్థల్లో పొడిగించిన గడువుకు అదనంగా ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను, ఇతర బకాయిల చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. చదవండి : ఆపరేషన్ ‘ఢిల్లీ రిటర్న్’ -
పన్ను పెంపు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచాలనే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పన్నుల పెంపునకు సంబంధించిన అన్ని కసరత్తులను పక్కనపెట్టేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాం గానికి సూచించినట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యమనే కోణంలోనే ముందుకెళ్లాలని, మిగిలిన అన్ని అంశాలను పక్కనపెట్టాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారనే చర్చ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటమే బాధ్యతగా ముందుకెళ్లాలని ఆయన ప్రతిరోజూ నిర్దేశిస్తున్నారని అధికారులు చెపుతున్నారు. ఈ విషయమై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపు అంశం ఇప్పట్లో సీఎం ముందు చర్చకు పెట్టే పరిస్థితి కూడా లేదని, అన్నీ సర్దుకున్న తర్వాత జూలైలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతోపాటు ఇప్పటికే చెల్లించాల్సిన ఆస్తిపన్ను మార్చి 31లోపు వసూలు చేయాలని, లేదంటే యజమానులకు నోటీసులు జారీ చేయాలని గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది. దీని రీషెడ్యూల్కు సంబంధించిన ప్రకటనను త్వరలోనే సీఎం అధికారికంగా వెల్లడిస్తారని, రాష్ట్రంలో ఎలాంటి దైనందిన కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఆస్తి పన్ను చెల్లింపు రీషెడ్యూల్ తథ్యమని అధికార వర్గాలంటున్నాయి. -
జీహెచ్ఎంసీ టూ డైమెన్షన్ సర్వే..
సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఖర్చులు ఏటికేడాది పెరుగుతున్నాయి. అయితే, అనుకున్నంత ఆదాయం మాత్రం సమకూరడం లేదు. దీంతో ఖర్చులకు అనుగుణంగా రాబడిని పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ వైపు ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయడంతో పాటు మరోవైపు అన్ని భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్నును పొందేందుకు ‘2డీ’ (టూ డైమెన్షన్) సర్వే నిర్వహిస్తోంది. జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను ద్వారా దాదాపు రూ.1400 కోట్లు వసూలవుతున్నప్పటికీ, ఈ ఆదాయం ఇంకా పెరిగేందుకు అవకాశముందని భావించిన అధికారులు అన్ని ఇళ్ల నుంచి వాస్తవ ఆస్తిపన్ను వసూలు చేసేందుకు శాటిలైట్ చిత్రాలను అనుసంధానం చేస్తున్నారు. ప్రతి భవనాన్ని ‘వీ మ్యాప్’ (వెక్టర్ మ్యాప్)తో జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు. సంబంధిత యాప్‌ను వినియోగిస్తూ బిల్ కలెక్టర్లతో – పాటు ఇతర సిబ్బంది డాకెట్ల వారీగా ఇళ్ల సర్వే చేపట్టారు. సర్వే ప్రారంభానికి ముందు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించేందుకు, రోజుకు ఎన్ని ఇళ్లు సర్వే చేయవచ్చో అంచనాకు వచ్చేందుకు వారం క్రితం ఒకేరోజు దాదాపు 340 ఇళ్లను సర్వే చేశారు. అందులో 70 ఇళ్లకు వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ పన్ను ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 10 ఇళ్లు అసలు ఆస్తిపన్ను జాబితాలో లేవు. మరో 17 ఇళ్ల విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికే పన్ను ఉంది. ఇలా మూడు విధాలా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువే వస్తోంది. శాంపిల్ డ్రైవ్‌లోనే దాదాపు 28 శాతం ఇళ్లు వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించడం లేదని గుర్తించారు. ఇలా అన్ని ఇళ్ల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను భారీ మొత్తంలో ఉండే అవకాశముండడంతో ఇళ్ల సర్వేపై దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వసూలు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు కనీసం మూడో వంతు ఇళ్ల సర్వే పూర్తిచేసి.. ఆస్తిపన్ను రివైజ్ చేసి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అదనంగా వచ్చే పన్నుతో సహా వసూలు చేయాలని యోచిస్తున్నారు. సర్వే పేరిట ఆస్తిపన్ను వసూళ్లు ఆగకుండా ఉండేందుకు ఒకపూట వసూళ్లు, మరో పూట సర్వేలో పాల్గొనాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. అంతే కాకుండా సర్వే నిర్వహించినప్పటికీ, వెంటనే పెరిగిన ఆస్తిపన్ను విధించకుండా లక్ష్యం మేరకు మూడో వంతు ఇళ్ల సర్వే మొత్తం పూర్తయ్యాకే.. పెరిగే ఆస్తి పన్నును రివైజ్ చేయాలని సూచించారు. తద్వారా గతేడాది వసూలైన ఆస్తిపన్ను కంటే దాదాపు 20 శాతం అదనంగా వసూలు కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వేలో భాగంగా ఎక్కువ అంశాల్లోకి పోకుండా ప్రస్తుతానికి భవన వినియోగంలో తేడా (వ్యాపారానికి వినియోగిస్తూ నివాస ఆస్తిపన్ను చెల్లింపు), ఇంత వరకు ఆస్తిపన్ను జాబితాలోలేని ఇళ్లు, ప్లింత్ ఏరియా కంటే తక్కువ ఏరియాకు మాత్రమే పన్ను చెల్లిస్తున్న వివరాలు మాత్రమే తీసుకుంటున్నట్లు అడిషనల్ కమిషనర్(ఐటీ) సిక్తా పట్నాయక్ తెలిపారు. సర్వేలో భాగంగా ఎక్కువ ఆస్తిపన్ను వచ్చేందుకు అవకాశమున్న డాకెట్లలో తొలుత సర్వే చేపట్టనున్నారు. ఎక్కువ పన్ను వచ్చే వాణిజ్య భవనాలు అధికంగా ఉన్న ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా, తర్వాత పెద్ద భవనాలున్న ప్రాంతాలను ‘బి’ కేటగిరీగా, మిగతావాటిని ‘సి’ కేటగిరీగా గుర్తిస్తారు. తొలుత ‘ఎ’ కేటగిరీ ఎక్కువగా ఉన్న డాకెట్లలో సర్వే పూర్తి చేయనున్నారు. సర్వేలో భాగంగా బిల్ కలెక్టర్లు ఇళ్లను రెండు ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అవి కార్యాలయంలోని ఉన్నతాధికారులకూ తెలుస్తాయి. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 15.93 లక్షల ఆస్తులు(ఇళ్లు/భవనాలు) ఉన్నాయి. వీటిలో 13.59 లక్షలు నివాస భవనాలు కాగా, వాణిజ్య జాబితాలో 2.06 లక్షలు ఉన్నాయి. నివాసం/వాణిజ్యం కలిసి ఉన్న భవనాలు దాదాపు 28 వేలు. సమగ్ర సర్వే పూర్తయితే వాణిజ్య కేటగిరీలో భవానాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పటి దాకా ఆస్తిపన్ను జాబితాలోకి ఎక్కని భవానాలు కూడా చేరి మొత్తం భవనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. -
ఐలా.. చూస్తూ ఉంటే ఎలా..?
చింతల్: పన్నులు చెల్లించని వాణిజ్య సముదాయాలపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. లక్షల్లో అద్దెలు తీసుకుని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని సదరు యజమానిపై గాంధీనగర్ ఐలా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సుమారు రూ.30 లక్షల మేర ప్రభుత్వానికి గండి పడింది. ఆర్థిక సంవత్సరం చివర్లో ఐలా అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. ఎంత హడావిడి చేసినా రూ.8, 9 కోట్లు రావాల్సిన ఆదాయం రూ.3 కోట్లకు మించి రావడం లేదు. ట్యాక్స్ వసూళ్ల సమయంలో హడావుడి చేసి ఒక్క రోజు గేట్లకు తాళాలు వేసి నోటీసులు ఇచ్చినా కొంతమంది భవన యజమానులు పన్నులు చెల్లించడం లేదు. గాంధీనగర్ ఐలా పరిధిలో 225 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో కొంతమేర 2005కు ముందు భవనాలను నిర్మించగా మరి కొంత మంది 2005 తర్వాత భవనాలను నిర్మించారు. ప్రభుత్వం ట్యాక్స్‌లను 100 శాతం మేర పెంచడంతో పారిశ్రామికవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఇందులో కొంతమంది పాత ట్యాక్స్ ప్రకారం చెల్లిస్తుండ గా కొందరు పారిశ్రామికవేత్తలు కేసు కోర్టు పరిధిలో ఉందన్న సాకుతో ట్యాక్స్‌లను చెల్లించడం మానేశారు. అక్కడే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఐలా అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏళ్ల తరబడి ట్యాక్స్ కట్టని వారిపై చర్యలేవి..? ఐలా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పన్నులు చెల్లించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా 11 ఏళ్లలో కేవలం రూ.5 లక్షలు వరకు పన్నులు చెల్లించి మిగిలిన సొమ్మును చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. సీఐఈ గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ప్లాట్ నెం 56/1, 56/2లో సదరు యజమాని 800 గజాలలో 2008లో రెండు ప్లాట్లలో కలిపి రెండు అంతస్తులు, పెంట్‌హౌజ్ నిర్మించి మొత్తం 30కి పైగా షెట్టర్లను వేసి లక్షల్లో అద్దెకు ఇస్తున్నాడు. 2008–19 వరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తి మొత్తం రూ.28,67,196 లక్షల్లో బకాయిపడ్డాడు. ప్రతినెలా అతను అద్దెకు ఇస్తూ ఏకంగా రూ.5 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తోంది. ట్యాక్స్ వసూళ్ల సమయంలో హడావుడి చేసే ఐలా అధికారులు ఇన్నేళ్లుగా పన్నులు చెల్లించని భవనాన్ని సీజ్ చేయాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇంతమేర బకాయి రూపంలో గండి పడింది. నోటీసులకే పరిమితమవుతున్న అధికారులకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఉన్న వాటిని సీజ్ చేసే అధికారం ఉంది. కానీ ఇక్కడ అధికారుల తీరుచూస్తుంటే మాత్రం పలు అనుమానాలకు తావివ్వక మానదు. రెడ్ నోటీసులు జారీ చేస్తాం.. గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉన్న సదరు భవనాల యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేస్తామని జీడిమెట్ల ఐలా కమిషనర్ నజీర్ అన్నారు. 2005 తరువాత నిర్మించిన అన్ని భవనాల యజమానులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. బకాయి ఉన్న భవనాల వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం.– నజీర్, జీడిమెట్ల ఐలా కమిషనర్ -
ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఆదాయం పెంపునకు కమిషనర్ లోకేష్‌కుమార్ చర్యలు ప్రారంభించారు. ఇకపై ప్రతి ఇంటి నిర్మాణదారుడి నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణం పూర్తికాగానే ఆటోమేటిక్‌గా అసెస్మెంట్తో పాటు ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా సదరు యజమానికి డిమాండ్ నోటీసు కూడా అందించనున్నారు. ఇందుకోసం టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలను అనుసంధానం చేయనున్నారు. -
మనీ మోర్ మనీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ప్రధానంగా ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు సర్వేల ద్వారా అండర్ అసెస్డ్, అన్‌అసెస్డ్ భవనాలను గుర్తిస్తోంది. ఇటీవల మూసాపేటలో నిర్వహించిన శాటిలైట్ ఆధారిత 2డీ సర్వేతో ఒక్క సర్కిల్లోనే ఆదాయం గణనీయంగా పెరగడంతో గ్రేటర్ వ్యాప్తంగానూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మూసాపేట సర్కిల్లో మొత్తం 30వేల ఇళ్లకు గాను 9వేల ఇళ్లు ఆస్తిపన్ను రాయితీలోనివి ఉండగా... 6వేల ఇళ్లు ఆస్తిపన్ను జాబితాలోనే లేవు. వాస్తవ విలువ కంటే తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్నవి దాదాపు 3వేల ఇళ్లు ఉన్నాయి. ఇలాంటి సర్వేతో బెంగళూర్‌లో ఆస్తిపన్ను ఏకంగా రూ.1,080 కోట్లు పెరగడాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ప్రస్తావించారు. జీహెచ్ఎంసీకి వివిధ పనుల కోసం నెలకు సగటున దాదాపు రూ.147 కోట్లు ఖర్చవుతుండగా... ఆదాయం మాత్రం దాదాపు రూ.110 కోట్లు ఉంటోంది. మిగతా మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకోవాలని, ట్రేడ్ లైసెన్సు లేని వ్యాపారుల నుంచి వసూళ్లు తదితర చర్యలకు సిద్ధమవుతోంది. వీటి ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల రూ.5లక్షల కంటే ఎక్కువ ఆస్తిపన్ను ఉన్న వాణిజ్య భవనాల తనిఖీ చేపట్టగా దాదాపు రూ.9 కోట్లు అదనంగా పెరిగింది. అదనపు అంతస్తులు తదితరమైనవి గుర్తిస్తే మరింత ఆదాయం పెరగనుంది. ఓవైపు ఆదాయం పెంచుకోవడంతో పాటు మరోవైపు ఎస్సార్డీపీలో భాగంగా జరుగుతున్న పనుల్లో భూసేకరణను వేగవంతం చేసేందుకు కూడా బల్దియా ప్రణాళిక రచిస్తోంది. వీటికి చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు రూపేణా కాకుండా వీలైనంత మేరకు టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇటీవల కాలంలో ఈ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు పెరగడంతో అధికారులు ఈ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎల్బీనగర్ పరిసరాల్లో ఎస్సార్డీపీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తిచేసేందుకు భూ యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో నివాస భవనాలు వాణిజ్య భవనాలుగా మారడంతో వాటిని కమర్షియల్ కారిడార్లుగా గుర్తించి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో జీవో రానుంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఆర్కిటెక్ట్‌ల ప్రమేయం తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. త్వరలో రూపొందించనున్న జీహెచ్ఎంసీ యాక్ట్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. రోడ్ల మరమ్మతుల బాధ్యత బల్దియాదే... నగరంలో రోడ్లు వివిధ సంస్థలకు చెందినవి ఉన్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఆర్డీసీఎల్, హెచ్ఎండీఏ, టీఎస్‌ఐఐసీల రోడ్లున్నాయి. రోడ్లు ఎవరివైనా వర్షాకాలం ముగిసేంత వరకు ఏర్పడే మరమ్మతుల బాధ్యత జీహెచ్ఎంసీనే చేపట్టాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసిందని కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీలో వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు తగిన యంత్రాంగం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
రూ.లక్ష ఇస్తే పీటిన్!
సాక్షి, సిటీబ్యూరో: భారీ మొత్తం తీసుకుని ఒకరి ఇంటిపై వేరే వారికి అక్రమంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) సృష్టించి ఇచ్చిన జీహెచ్ఎంసీ ఉద్యోగితో పాటు అతడికి సహకరించిన వ్యక్తినీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2016లో అప్పటి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఏదైనా ఓ ప్లాట్‌లో ఇల్లు కట్టిన తర్వాత ఇంటి నంబర్ ఇవ్వడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) జీహెచ్ఎంసీ క్రియేట్ చేస్తుంది. అందుకు గాను సదరు యజమాని సేల్‌డీడ్ తదితరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ జరిగి, అధికారులు అన్నీ సరిచూసిన తర్వాతే పీటిన్ కేటాయిస్తారు. రాజేంద్రనగర్‌లోని ప్రేమావతిపేటలో ఉన్న ఓ ఆస్తిపై కొందరి మధ్య వివాదం ఉంది. దీనిని కాజేయాలని చూసిన ముగ్గురు బోగస్ పత్రాల సాయంతో రాజేంద్రనగర్ అధికారులను సంప్రదించి పీటిన్ కోసం దరఖాస్తు చేశారు. ఇది తిరస్కారానికి గురికావడంతో వీరు అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్æ ఆపరేటర్‌గా పని చేస్తున్న జయ చంద్ర వెలగను సంప్రదించారు. రూ.లక్ష తీసుకున్న అతగాడు అక్రమంగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్వర్లోకి చొరబడి ఆ ముగ్గురి పేరుతో ఆస్తి ఉన్నట్లు పీటిన్ సృష్టించి ఇచ్చాడు. ఇలా పొందిన పత్రంతో వారు సదరు స్థలాన్ని విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఆస్తి యజమాని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2016లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ నేతృత్వం లోని బృందం దీన్ని దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌కు బాధ్యుడైన జయ చంద్ర వెలగతో పాటు అతడికి సహకరించిన నాగేంద్ర బాబులను శుక్రవారం అరెస్టు చేశారు. -
ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి బిల్ కలెక్టర్
సాక్షి, కూకట్పల్లి: ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసిన ఓ బిల్ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్పల్లి సర్కిల్–24లోని ఆస్బెస్టాస్ కాలనీ ఏరియాకు బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మహేంద్రనాయక్ కాలనీలోని రాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు సంబంధించి ఆస్తి పన్నును తగ్గించేందుకు రూ.36 వేలు డిమాండ్ చేయగా షాపు యజమాని ఎం.నాగరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అధికారులు కెమికల్ కలిపిన నోట్లను నాగరాజుకు ఇచ్చి పంపారు. డబ్బులు తీసుకునేందుకు షాపు వద్దకు వచ్చిన మహేంద్రనాయక్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు మహేంద్రనాయక్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగింది’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయం 750 కోట్ల నుంచి 1450 కోట్ల రూపాయలకు చేర్చామన్నారు. తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ ఎవరు మెచ్చుకోరని అన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు సంబంధం ఉన్న సంస్థ తమదని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని.. జన సాంద్రత పెరిగినప్పుడు మౌళిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఆగస్టులో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 74 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని.. అవి రానున్న కొద్ది రోజుల్లో 146 కానున్నాయని ప్రకటించారు. అలాగే తొమ్మిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో రోడ్ల కోసం హెచ్ఆర్డీసీ, మూసీ నది ప్రక్షాళన కోసం మూసి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బాండ్లను సేకరించడం ద్వారా జీహెచ్ఎంసీ నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. కొల్లూరులో అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నామని.. దీన్ని అందరు గుర్తించాలని కోరారు. కేంద్ర రక్షణ శాఖ సహకారం లేకపోవడం వల్ల రెండు పెద్ద స్కైవేలు ఆగిపోయాయని పేర్కొన్నారు. -
ఆస్తి పన్ను మూడింతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న 71 పురపాలికల్లోని ప్రజలకు ముందుంది ముసళ్ల పండగే. గ్రామ పంచాయతీలు కాస్త పురపాలికలుగా మారగానే స్థానికంగా ఆస్తి పన్నులు మూడింతలై పోతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాదెపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రూ.74.48 లక్షల ఆస్తి పన్నులుండగా, మునిసిపాలిటీగా మారిన తర్వాత రూ.2 కోట్లకు పైగా పెరిగిపోయాయి. గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా కల్పించిన తర్వాత రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం ప్రకారం ఆస్తి పన్నుల వసూళ్లు జరిపేందుకు పురపాలక శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మునిసిపాలిటీల చట్టంలోని నిబంధనల ప్రకారం అక్కడి నివాస, వాణిజ్య, ప్రభుత్వ స్థిరాస్తులపై విధించాల్సిన ఆస్తి పన్నులను గణించేందుకు ప్రత్యేకంగా ఆస్తి పన్నుల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రామ పంచా యతీ స్థాయి నుంచి రెండేళ్ల కింద మునిసిపాలిటీగా మారిన బాదెపల్లిలో ఆస్తి పన్నుల సవరణ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ పూర్తి చేసింది. ఈ పురపాలికలో 9 వేలకు పైగా గృహాలు, భవ నాలు, ఇతర స్థిరాస్తులపై ఆస్తి పన్నులు సగటున మూడింతల వరకు పెరిగిపోయాయి. ఇదిలా ఉండ గా, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఏడాది కింద మునిసిపాలిటీగా మారిన దుబ్బాకలో త్వరలో ఆస్తి పన్నులు పెరగనున్నాయి. వచ్చే ఆగస్టు 1 నుంచి దుబ్బాకలో ఆస్తి పన్నుల సవరణ అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. స్థానికంగా ఆస్తి పన్నుల పెంపునకు కసరత్తు జరుగుతోంది. ఆస్తి పన్నుల సవరణకు కసరత్తు కొత్తగా 71 మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. 173 గ్రామ పంచాయతీల విలీనం చేయడంతో ఈ పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలు విలీనం కానున్నాయి. వచ్చే జూలై 31తో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పాలక మండళ్ల పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే వీటికి మునిసిపాలిటీల హోదా లభించనుంది. ఈ 71 మునిసిపాలిటీలతో పాటు ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనం కానున్న గ్రామ పంచాయతీల పరిధిలో మునిసిపాలిటీల చట్టం ప్రకారం ఆస్తి పన్నుల సవరణ జరిపేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ముందస్తుగా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి నేతృత్వంలోని ఆస్తి పన్నుల బోర్డు ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 308 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఆస్తి పన్నులకు సంబంధించిన డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలను స్థానిక జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది. ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు, జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ రిజిస్ట్రీ తదితరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని కోరింది. కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికల్లో ఆస్తి పన్నుల సవరణ కార్యక్రమాన్ని చేపట్టి, కసరత్తు పూర్తి చేసే వరకు మరో ఏడాది సమయం పట్టనుందని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
పూరి గుడిసెపై రూ.500 పన్నా!
సాక్షి, హైదరాబాద్: వృద్ధ దంపతులు నివాసముంటున్న ఓ గుడిసెపై స్థానిక పంచాయతీ కార్యదర్శి రూ.500 ఆస్తి పన్నును వసూలు చేసిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్లూర్ మండలం కర్దెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉదంతాన్ని ట్విట్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు చెల్లించిన ఆస్తి పన్నును వెనక్కి ఇప్పించడంతో పాటు వారికి డబుల్‌బెడ్ రూం ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులు నిర్దయగా వ్యవహరించారని ఉత్తమ్ తప్పుపట్టారు. దీనికి కేటీఆర్ స్పందించి ఈ పొరపాటును సరిదిద్దాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆ దంపతులకు డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్ రాని పక్షంలో అదీ మంజూరు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఉత్తమ్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ ఆదేశాలపై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ ట్వీటర్లో స్పందించారు. ఈ విషయం తన దృష్టికి నాలుగు రోజుల క్రితమే వచ్చిందని.. వెంటనే బాధితులకు ఆస్తిపన్ను తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. ఆ వృద్ధ దంపతులకు ఇప్పటికే ఆసరా పింఛన్ అందుతోందని.. డబుల్ బెడ్రూం పథకం కింద ఇంటిని మంజూరు చేస్తామని కేటీఆర్‌కు ఆయన బదులిచ్చారు. -
క్రమబద్ధీకరణపై ‘పన్ను’పోటు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అనుమతిలేని భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నుల పిడుగు పడింది. భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్ఎస్) దరఖాస్తుదారుల సమాచారాన్ని వినియోగిం చుకుని పురపాలికలు అనుమతి లేని కట్టడాలపై జరిమానాల పేరుతో ఆస్తి పన్నులను ఏకంగా 25 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచేశాయి. అలాగే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖా స్తుల సమాచారాన్ని వినియోగించుకుని ఆయా లేఅవుట్లు, ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లను వడ్డించాయి. అసాధారణ రీతిలో ఆస్తి పన్నులు పెరిగిపోవడంతో బీఆర్ఎస్ దరఖాస్తుదారులు, కొత్తగా ఖాళీ స్థలం పన్నులు వడ్డించడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. పెంచిన ఆస్తి పన్నులను తగ్గించాలని కోరుతూ నేరుగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటు న్నారు. మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. చేతికి అందిన సమాచారం.. అనధికార భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో 3 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 1.6 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ కింద మరో 1.65 లక్షల దరఖాస్తులొచ్చాయి. అనధికార భవనాల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రెండేళ్లు గడిచినా ఈ కేసులో పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మరోవైపు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూపంలో చేతికి అందిన సమాచారం ఆధారంగా ఆయా అనధికార భవనాలపై జరిమానాలు, లే అవుట్లపై ఖాళీ స్థలాల పన్నులు విధించేందుకు పురపాలక శాఖ వినియోగించుకుంది. అనుమతి లేని/పూర్తిగా అక్రమ కట్టడాలపై జరిమానాలతో కూడిన ఆస్తి పన్నులు విధిస్తూ జారీ చేసే గులాబీ రంగు డిమాండ్ నోటీసులను బీఆర్ఎస్ దరఖాస్తుదారులకు పురపాలికలు జారీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి లభించే వరకు ఈ భవన యజమానులు జరిమానాలు చెల్లించక తప్పదని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గులాబీ రంగులో పెనాల్టీ నోటీసులు పూర్తిగా అనుమతి లేకుండా లేక అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల ప్రకారం 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులు పెంచి జరిమానాల రూపంలో వసూలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జరిమానా వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణ ప్లాన్‌లో అనుమతించిన ప్రకారమే అంతస్తులు నిర్మించినా, సెట్‌బ్యాక్ విషయంలో 10 శాతం లోపు ఉల్లంఘనలు ఉంటే 25 శాతం ఆస్తి పన్నును పెంచి జరిమానాగా వసూలు చేయాలి. అనుమతించిన సంఖ్యలోనే అంతస్తులు కలిగి ఉండి సెట్‌బ్యాక్ విషయంలో 10 శాతానికి మించి ఉల్లంఘనలుంటే 50 శాతం ఆస్తి పన్నులను పెంచి వసూలు చేయాలి. అనుమతించిన అంతస్తుల మీద అనుమతి లేకుండా అదనపు అంతస్తులు కడితే 75 శాతం ఆస్తి పన్ను పెంచాలి. పూర్తిగా అనుమతి లేని కట్టడంపై 100 శాతం ఆస్తి పన్ను వడ్డించాలి. జరిమానాలతో కూడిన ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను గులాబీ రంగులో భవన యజమానులకు అందించాలి. -
ఇక ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణ!
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణలు జరపాలని మునిసిపాలిటీలను పురపాలక శాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్ నిర్మాణం చేసిన, విస్తరించిన భవనాలు, కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణం పూర్తయితే 30 రోజుల్లోగా, పూర్తికాకున్నా గృహ ప్రవేశం చేస్తే తక్షణమే పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. భవన యజమాని మారినా, భవన వినియోగం (గృహ, వాణిజ్య) మారినా సవరణలు జరపాలని పేర్కొంది. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి అధ్యక్షతన ఇటీవల సమావేశమైన తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు.. ఆస్తి పన్ను వసూళ్లలో మునిసిపాలిటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, క్షేత్ర స్థాయిలో పని చేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని సూచించింది. మునిసిపాలిటీల్లోని అన్ని గృహాలు, భవనాలకు సంబంధించిన ఆస్తి పన్నుల జాబితాలను యజమానుల ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను ఆదేశించింది. మునిసిపాలిటీలకు జారీ చేసిన ఆదేశాలివే.. కొత్తగా ఏర్పాటైన బాదెపల్లి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంపును ఏప్రిల్ 1 నుంచి, దుబ్బాక మునిసిపాలిటీలో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలి. కొత్తగా ఏర్పాటవనున్న 68 పురపాలికల పరిధి లో వసూలు చేస్తున్న ఆస్తి పన్నుల వివరాలను ఆయా గ్రామ పంచాయతీల నుంచి పు రపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాలి. (మునిసిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపును చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు) 72 పురపాలికల్లో ఉన్నఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ జరిపించి ఆస్తి పన్నుల జాబితాలోని ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50% తక్కువగా పన్నులు వసూలైనట్లు వెల్లడైంది. దీంతో ఈ నెల 15 లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలోనే బిల్డింగ్ నమూనా ఆధారంగా ఆస్తి పన్ను గణన చేసేందుకు కొత్త విధానం తీసుకురావాలి. ఆస్తి పన్నుల సవరణలపై భవన యజమానుల నుంచి వచ్చిన 4,292 అభ్యంతరాలు ముని సిపల్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలి. అనుమతి లేకుండా నిర్మించిన.. ప్రైవేటు, ప్రభు త్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా 100% ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గతం లో ఇచ్చిన ఉత్తర్వులను మునిసిపాలిటీలు అమ లు చేయాలి. పన్నుల డిమాండ్ నోటిసులో ‘భవ న యజమాని’పేరుకు బదులు ‘భవనాన్ని అధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు’అని రాయాలి. -
ఆస్తిపన్నుపై 5% రాయితీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30 లోపు పన్ను చెల్లించే వారికి ఈ రిబేట్ వర్తింపజేస్తామని వెల్లడించింది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే రిబేట్‌ను అమలు చేస్తుం డగా.. ఇకపై రాష్ట్రంలోని 73 మున్సిపల్ కార్పొ రేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆస్తి పన్నుల వసూళ్లతో ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిబేట్‌పై విస్తృత ప్రచారం కల్పించి వసూళ్లు ప్రోత్సహించాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. గడువులోగా చెల్లించని ఆస్తి పన్నుల బకాయిలపై పెనాల్టీలు విధించడం.. తర్వాత మిగిలిన బకాయిలను రాబట్టుకోడానికి మళ్లీ కొత్త గడువు విధించి ఆలోపు చెల్లిస్తే పెనాల్టీలు మాఫీ చేయడం కొన్నేళ్లుగా అనవాయితీగా వస్తోంది. దీంతో సకాలంలో పన్ను చెల్లింపులు ప్రోత్సహించేందుకు 2016–17 నుంచి పెనాల్టీల మాఫీకి పురపాలిక శాఖ స్వస్తి పలికింది. ‘నేమ్ అండ్ షేమ్’పద్ధతిలో.. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లో ఆస్తి పన్ను ఎగవేసిన టాప్–100 మంది జాబితాను పురపాలక శాఖ తన వెబ్సైట్లో పొందుపరిచింది. కమర్షియల్ ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా చెల్లించని మొండి బకాయిలు రూ.కోట్లకు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వసూళ్ల కోసం పలు మార్లు నోటిసులిచ్చినా లాభం లేకపోవడంతో ‘నేమ్ అండ్ షేమ్’పద్ధతిలో ఎగవేతదారుల పేర్లు బహిర్గతం చేసేందుకు ఆ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీంతో ఎగవేతదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారని ఈ నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆస్తి పన్నులు ఎగవేస్తే సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం పురపాలికలకు ఉందని ఓ అధికారి తెలిపారు. రూ.294 కోట్లు వసూలు.. 2017–18లో 73 పురపాలికల ద్వారా రూ.294 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2016–17లో వసూలైన రూ.232.77 కోట్లతో పోల్చితే గతేడాది 26 శాతానికి పైగా అధిక రాబడి వచ్చింది. సిరిసిల్ల, మెట్పల్లి, కొత్తగూడెం, పీర్జాదిగూడ పురపాలికల్లో 100 శాతం.. మీర్పేట్, దుబ్బాక, కోరుట్ల, బోడుప్పల్, హుజూరాబాద్ పురపాలికల్లో 98 శాతానికి పైగా పన్ను వసూలైంది. నల్లగొండ, ఐజా, నారాయణ్‌పేట్, భూపాలపల్లి పురపాలికల్లో వసూళ్లు 50 శాతానికి మించలేదు. -
ఆస్తి పన్ను సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు
సాక్షి, హైదరాబాద్ : 2017-18 సంవత్సరానికిగానూ ఆస్తి పన్నుల సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 1205 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా 1320.26 కోట్లతో రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 115 కోట్లు అధికం. గత ఏడాదితో పోల్చితే అడ్వర్టైజ్మెంట్ వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. 2016-17లో రూ. 26.19 కోట్లు వసూలు కాగా ప్రస్తుతం రూ. 38.44 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం 42 కోట్లు ఉన్న ట్రైడ్ లైసెన్స్ వసూళ్లు ప్రస్తుతం రూ. 52 కోట్లకు చేరాయి. రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను సేకరించడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్డన్రెడ్డి అధికారులకు అభినందనలు తెలిపారు. -
41 శాతం అతిక్రమణలే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పెచ్చరిల్లిన అవినీతి అవినీతి అధికారుల జేబులు నింపుతోందని కాగ్ నివేదిక సాక్షిగా తేలింది. 2012–2017 కాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో మచ్చుకు 75,387 ఇళ్లను తనిఖీ చేసిన కాగ్, అతిక్రమణల స్థాయి చూసి అవాక్కైంది. ఏకంగా 30,864 ఇళ్ల నిర్మాణంలో అతిక్రమణలు బయటపడ్డాయి. అంతేకాదు, వీటిలో 10,460 అక్రమ నిర్మాణాలేనని కూడా తేలింది! అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందిలో కొందరు ఆస్తి పన్ను మదింపులో చేతివాటం ప్రదర్శించి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలకూ కాగ్ నివేదిక బలం చేకూర్చింది. 708 కట్టడాలను పరిశీలించగా, రూ.5.24 కోట్ల మేర ఆస్తి పన్ను తక్కువగా మదింపు చేసినట్టు కాగ్ గుర్తించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ సమయంలో పన్ను చెల్లించేప్పుడు కూడా ఇలాంటి మతలబులే చోటుచేసుకుంటున్నట్టు తేలింది. ఆయా భవనాల విస్తీర్ణం టౌన్ ప్లానింగ్‌లోని వివరాలకు, ఆస్తి పన్ను మదింపులోని వివరాలకు చాలా తేడా ఉంది. ఆరు సర్కిళ్ల పరిధిలో కేవలం 287 నిర్మాణాలను పరిశీలించగా రూ.1.25 కోట్ల మేర పన్ను తక్కువగా చెల్లించినట్టు తేలింది. పదేళ్లలో 26 చెరువుల్ని మింగారు జీహెచ్ఎంసీ ఆవిర్భవించే నాటికి (2007) దాని పరిధిలో 185 చెరువులుండగా వాటిలో 26 చెరువులు ఇప్పుడు ‘కనపడుట లేదు’. మిగతా వాటిలోనూ 17 చెరువులు ఎక్కడుండాలో కూడా జాడ కనుక్కోలేని దుస్థితి ఉందని కాగ్ తేల్చింది! మరో 9 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని జీహెచ్ఎంసీ నివేదిక ఆధారంగా కాగ్ గుర్తించింది. -
30 రోజులు.. రూ. 400 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మిగిలింది కేవలం 30 రోజులే. ఇంకా వసూలు కావాల్సిన ఆస్తి పన్ను మాత్రం దాదాపు రూ. 405 కోట్లు. దీంతో రోజుకు రూ. 13.52 కోట్లకు తగ్గకుండా ఆస్తి పన్ను వసూలుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి దాకా స్వచ్ఛ మంత్రం పఠించిన జీహెచ్ఎంసీ యంత్రాంగమంతా ఇక వసూళ్ల పర్వం లో మునగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) రూ. 1400 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యం కాగా, బుధవారం వరకు రూ. 994.40 కోట్లు వసూలయ్యాయి. మిగతా మొత్తాన్ని సేకరించేందుకు జోన్ల వారీగా లక్ష్యాన్ని నిర్ధారించారు. జీహెచ్ఎంసీ డాకెట్లవారీగా బిల్ కలెక్టర్లకు లక్ష్యాలు నిర్దేశించి, ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాల్సిందిగా కమిషనర్ డిప్యూటీ, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి దాదాపు రూ. 852 కోట్లు వసూలైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువే వసూలైనప్పటికీ, లక్ష్యాన్ని చేరుకునేం దుకు కసరత్తు చేపట్టారు. ఇప్పటి వరకు బిల్ కలెక్టర్ల ద్వారా దాదాపు రూ. 556 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా రూ. 181 కోట్లు, మీసేవ కేంద్రాల ద్వారా రూ. 82.25 కోట్లు, ఆన్లైన్ ద్వారా రూ. 174 కోట్లు వసూలయ్యాయి. ఆస్తిపన్నుతో పాటు ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు కూడా వసూలు చేయా ల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఈ సంవత్సరం ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల లక్ష్యం రూ. 50 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ. 38 కోట్లు వసూలయ్యాయి. -
నత్తనడక
మండపేట: జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం డిమాండ్ రూ.115.31 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.61.63 కోట్లు మాత్రమే వసూలైంది. 74.5 శాతం పన్నుల వసూళ్లతో జిల్లాలో పెద్దాపురం పురపాలకసంఘం ముందంజలో ఉండగా 43 శాతంతో పిఠాపురం చివరిస్థానంలో ఉంది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా నూరుశాతం వసూళ్లు ప్రశార్థకంగా మారింది. ఆర్థిక సంఘం నిధుల విడుదలకు నూరుశాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేయడంతో అధికారుల అలసత్వం పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరకార్పొరేషన్లతోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 2,41,493 ప్రైవేటు భవనాలున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు నాటికి ఆయా భవనాలు ద్వారా మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 115.31లు డిమాండ్ కాగా ఇప్పటి వరకు కేవలం రూ. 61.63 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాకినాడ నగర పాలక సంస్థలో 52.8 శాతం వసూలు కాగా, రాజమహేంద్రవరంలో 51.27 శాతం వసూలయ్యాయి. అమలాపురం మున్సిపాల్టీలో 56.3 శాతం, రామచంద్రపురంలో 48.8 శాతం, పిఠాపురంలో 43.9 శాతం, మండపేటలో 68.2 శాతం, తునిలో 72 శాతం, పెద్దాపురంలో 74.5 శాతం, సామర్లకోటలో 49.6 శాతం పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 69.2 శాతం, ఏలేశ్వరంలో 65 శాతం, ముమ్మిడివరంలో 50 శాతం పన్నులు వసూలయ్యాయి. నూరుశాతం వసూలు గగనమే 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు మేరకు స్థానిక సంస్థలు నూరుశాతం పన్నులు వసూలు తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్నుల వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతర సమీక్ష జరుగుతోంది. మరో ఐదు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితితో నూరుశాతం వసూలు గగనమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బాధ్యతగా పన్నులు చెల్లించండి
విశాఖసిటీ: ఆస్తి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని గ్రేటర్ ప్రజలను జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ విజ్ఞప్తి చేశారు. కోట్ల రూపాయల బకాయిలుండటం వల్ల అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పోలిస్తే జీవీఎంసీలో పన్నుల విలువ తక్కువైనా నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఏడా ది అక్టోబర్ వరకూ మొత్తం నీటి పన్ను బకాయిలు రూ.29 కోట్లుండగా, ఆస్తి పన్ను బకాయిలు రూ.37 కోట్లున్నాయని ఇవన్నీ వసూలైతే.. నగర ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశముంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్లకు నిధులు అవసరమని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను కచ్చితంగా వేరు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 100 కిలోలు, అంతకంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు.. తమ పరిసర ప్రాంతాల్లోనే కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలా చేయని వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. అదే విధంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. లేకుంటే ఆ ప్రాంతాలకు చెత్త బండిని పంపించే ది లేదని స్పష్టం చేశారు. చెత్త బండి రాలేదని పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. తడి పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఇంటి వద్ద బాధ్యతగా చేపట్టాలనీ, త్వరలోనే ఈ అంశాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేరు చేస్తున్నారని, అన్ని జోన్లకూ కలిపి రోజుకి 105 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. భీమిలి జోన్‌కు సంబంధించి 279 జీవో టెండర్ పరిశీలనలో ఉందనీ, మిగిలిన జోన్లకు సంబంధించి కోర్టులో స్టే నడుస్తోందని కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. నీటి పన్నుల విషయంలో కమర్షియల్ కేటగిరీల్లో కొన్ని తప్పులు దొర్లాయనీ, నోటీసులు వచ్చిన వారు ఆయా జోన్లకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. వర్షపునీటిని ఒడిసి పట్టాల్సిందే.. జీవీఎంసీ పరిధిలోని సెమీ బల్క్, బల్క్ వాటర్ కనెక్షన్లు కలిగిన వారంతా విధిగా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కమిషనర్ సూచించారు. కేవలం ఇంకుడు గుంతల నిర్మాణానికే పరిమితం కాకుండా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఇస్తామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు జీవీఎంసీ సిద్ధమవుతోందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్ ద్వారా ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్లైన్లో 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పది ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ జీవీఎంసీ పరిధిలోని 27 హైస్కూల్స్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. ఏఏ సబ్జెక్టుల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని గుర్తించి, వారికి స్పెషల్ కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారి బలాలు, బలహీనతలు గుర్తించి దానికనుగుణంగా విద్యార్థుల్ని సన్నద్ధులు చేస్తామన్నారు. ఈ పరీక్షల మార్కుల్ని ఆన్లైన్లో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
ప్రతి ఇంటికి జియోట్యాగ్
మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మెదక్‌మున్సిపాలిటీ: ఆస్తిపన్ను మదింపునకు సంబంధించి ప్రతి ఇంటికి(అసెస్మెంట్) జియోట్యాగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భువన్ యాప్‌ను ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఫతేనగర్ వీధిలో జియోట్యాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా మెదక్ పట్టణంలో జియోట్యాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పన్నులు వసూలు చేసే బిల్ కలెక్టర్లు ముందుగా ఫోన్లో భువన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్ కావాలన్నారు. దీంతో అతని పరిధిలో గల అసిస్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్లోకి చేరతాయన్నారు. అనంతరం బిల్ కలెక్టర్ ప్రతి అసిస్మెంట్ను పరిశీలించి, భవనాల ఫొటో తీసుకొని వాటిని జియోట్యాగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్ఐ ఆయా వివరాల్లో తప్పులు సరిచేయడంతో పాటు వాటిని కంప్యూర్‌లో నిక్షిప్తం చేస్తారన్నారు. గతంలో జీఐఎస్ సర్వే ద్వారా ప్రతి ఇంటికి కొలతలు తీసుకున్నామని, జియోట్యాగింగ్ ద్వారా అందులో ఏమైనా అనుమానాలుంటే సరిచేసుకోవచ్చన్నారు. మెదక్ పట్టణంలో 9,470 అసిస్మెంట్లు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అందులో ఇప్పటి వరకు 450 అసిస్మెంట్లకు జియోట్యాగ్ పూర్తిచేశామన్నారు. జూలై 15వ తేదీలోగా జియోట్యాగ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. భువన్‌యాప్‌లో సేకరించిన సమాచారాన్ని ప్రజలు ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్ఐ రమేశ్, బిల్ కలెక్టర్ శివ తదితరులు ఉన్నారు. -
ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగం
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగమయ్యింది. ప్రా థమికంగా సుమారు రూ.75 వేలు స్వాహా అయినట్టు తేలింది. అయితే ఇది మరింత పెరగవచ్చని అంచనా. దీనిపై నగర పంచాయతీ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలిలా ఉన్నా యి.. నగర పంచాయతీలో ఆస్తిపన్ను (ఇంటి పన్ను) వసూళ్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి సిబ్బంది సౌలభ్యాన్ని బట్టి ఒకరిని నియమిస్తుంటారు. ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ కౌంటర్లో పనిచేస్తుండగా రూ.75 వేలు దుర్వి నియోగం చేసినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. బయటపడిందిలా.. ఈ నెల 10న రెండో శనివారం సెలవు కావడంతో ఆస్తిపన్ను వసూలుకు అధికారులు కౌంటర్ ఏర్పాటు చేయలేదు. 12న సోమవారం ఆర్ఐ సీహెచ్ వెంకటేశ్వరరావు శుక్రవారం వరకు వసూలైన వివరాలు, రికార్డులు కంప్యూటర్లో పరిశీలించగా, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో 8 ఇంటి పన్నులకు సంబంధించి రూ.75 వేల రశీదులు ఇచ్చినట్టు గుర్తించారు. అయితే దీనిపై ఆరా తీయగా స్థానిక చింతల బజారులోని ఓ ఈ–సేవ కేంద్రం నుంచి నగర పంచాయతీ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి రశీదులు ఇచ్చినట్టుగా గుర్తించారు. దీనిపై ఆయన కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావుకు రిపోర్ట్ చేశారు. విచారించగా ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ సేవ కేంద్రం ద్వారా రశీదులు జారీ చేసినట్టు తేలింది. క్యాన్సిలేషన్‌ను క్యాష్ చేసుకున్న వైనం నగర పంచాయతీ వెబ్సైట్లో ఆస్తిపన్నుల క్యాన్సిలేషన్‌కు ఆప్షన్ ఉంది. దీనిని ఆమె సొమ్ము చేసుకుంది. గతంలో కొందరు యజమానులు ఆస్తి పన్ను చెల్లించగా వారికి రశీదులు ఇచ్చి వెంటనే క్యాన్సిలేషన్ చేసి సొమ్మును స్వాహా చేసింది. అయితే ఇటీవల ఒకరిద్దరికి తాము ఆస్తిపన్ను చెల్లించినా డిమాండ్ నోటీసులు రావడంతో నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిం చారు. దీంతో కంగారు పడిన ఆమె హడావుడిగా ఈ–సేవ కేంద్రం ద్వారా గత శనివారం రశీదులు జారీ చేసింది. అధికారులు ఆమెను నిలదీయడంతో భిన్నకథనాలు చెప్పుకొచ్చింది. అయితే చివరకు ఆమెకు కావాలి్సన ఒక కౌన్సిలర్‌తో మాట్లాడించడంతో సొమ్ము స్వాహా చేసినట్టు మంగళవారం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన ఆమె నగర పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆత్మహత్యాయత్నం అవకతవకలకు పాల్పడిన ఆమె రాజమండ్రి గోదావరి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపైకి చేరుకుని ఆత్మహత్యకు యత్నించగా ఓ కానిస్టేబుల్ చూసి పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు అడిగి తెలుసుకుని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తండ్రి , నగర పంచాయతీ సిబ్బంది అక్కడకు వెళ్లి ఆమెను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. సంఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నాం నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై విచారణ చేస్తున్నామని కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాథమికంగా 8 ఇంటి పన్నుల రశీదులకు సంబంధించి రూ.75 వేలు దుర్వినియోగమయ్యాయని, ఇంకా నిధులు ఏవైనా దుర్వినియోగమయ్యాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
‘టవర్ల’ టోకరా!
- జీహెచ్ఎంసీ నెత్తిన ‘సెల్’ టోపీ - అనుమతుల్లేకుండానే టవర్ల ఏర్పాటు - ఆ తర్వాత ఫీజులు, ఆస్తిపన్ను కట్టని వైనం - రూ.50 కోట్ల మేర జీహెచ్ఎంసీకి నష్టం సాక్షి, హైదరాబాద్: సామాన్యులు నివాస గృహానికి అనుమతి తీసుకోకున్నా.. ఆస్తిపన్ను చెల్లించకున్నా పెనాల్టీలతో కలిపి ముక్కుపిండి వసూలు చేసే జీహెచ్ఎసీ యంత్రాంగం.. సెల్ టవర్ల నిర్వాహకులు విషయంలో చూసిచూడనట్టు వదిలేస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సెల్ టవర్ నిర్వాహకులు అనుమతులే తీసుకోకున్నా, ఆస్తి పన్ను చెల్లించకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఫీజులు ఎగ్గొడుతున్న కంపెనీలు.. నగరంలో సెల్ టవర్ ఏర్పాటు చేసిన కంపెనీ జీహెచ్ఎంసీకి వన్‌టైమ్ ఫీజు కింద రూ.లక్ష చెల్లించాలి. సెల్ టవర్‌ను ఏర్పాటు చేసిన స్థల విస్తీర్ణాన్ని బట్టి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. అనుమతులే లేకుండా టవర్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీల నిర్వాహకులు, ఏర్పాటు తర్వాత ఫీజులు కూడా చెల్లించడం లేదు. గ్రేటర్లో అనధికారికంగా 3,303 సెల్ టవర్లను గుర్తించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో వెల్లడించారు. ఈ లెక్కన జీహెచ్ంఎసీకి రూ.33 కోట్లకుపైగా రావాలి. ఇది టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ఫీజు మాత్రమే. ఆస్తిపన్ను రూపేణా ఒక్కో టవర్ నుంచి సగటున రూ.20 వేల వరకు రావాలి. అనుమతి పొందిన, అనుమతి లేని అన్ని టవర్ల నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆస్తిపన్ను రావాల్సి ఉంటుందని అంచనా. అనుమతి తీసుకున్న సంస్థలు సైతం సెల్ టవర్లకు సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించడం లేవు. ఇలా జీహెచ్ఎంసీకి రావాల్సిన దాదాపు రూ.50 కోట్లు రాకుండా పోయాయి. పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు.. ప్రస్తుతం భాగ్యనగరంలో పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు పుట్టుకొస్తున్నాయి. అక్రమంగా అనధికారి కంగా ఏర్పాటు చేస్తున్న ఈ టవర్లతో రేడి యేషన్ ప్రభావం ఉంటుందని, ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హైదరా బాదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, ఒకవేళ రేడి యేషన్ తీవ్రతపై ఫిర్యాదులు అందితే వాటిని డాట్ టర్మ్ సెల్‌కు తగిన చర్యల నిమిత్తం తెలియజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెపుతున్నారు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నియంత్రిస్తుందని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ తన పరిధి లోని అక్రమ టవర్ల ఏర్పాటును చూసీ చూడనట్లు వదిలేయడం విమర్శలకు తావి స్తోంది. టవర్ల నిర్వాహకులతో అధికారుల లాలూచీయే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► 2013లో వెలువడిన జీవో మేరకు స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆస్ప త్రుల వంటి ప్రదేశాలకు వంద మీటర్ల లోపు సెల్ టవర్ల ఏర్పాటు నిషిద్ధం. ఆ మేరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొంది సెల్ టవర్‌ను ఏర్పాటు చేయాలి. ► 2015లో వెలువరించిన జీవో మేరకు సెల్ టవర్‌ను ఏర్పాటు చేశాక సమాచారం ఇవ్వవచ్చు. దీన్ని ఆసరా చేసుకునే సమాచారమే ఇవ్వకుండా సెల్‌టవర్లు ఏర్పాటు చేసేస్తున్నారు. -
జీహెచ్ఎంసీ ఆల్‌టైమ్ రికార్డ్
⇒పెరిగిన ఆస్తిపన్ను వసూళ్లు ⇒గత ఆర్థిక సంవత్సరం రూ.1025 కోట్లు ⇒ఈ మార్చి 30 నాటికి రూ.1137 కోట్లు ⇒నేడు అర్ధరాత్రి వరకు సీఎస్సీల సేవలు సిటీబ్యూరో: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ జీహెచ్ఎంసీకి మాత్రం కాసుల వర్షం కురిపించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆస్తిపన్నుగా రూ.180 కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. గతంలో ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెల చివరి వారం.. చివరి రెండు రోజుల్లోనే ఎక్కువ పన్ను వసూలయ్యేది. మార్చి 31న ఒక్కరోజే రూ.వందకోట్లకు పైగా వసూలైన ఘటనలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో పన్ను బకాయిలపై వడ్డీ రద్దు చేయడం వంటి కారణాలతో ప్రజలు చివరి వరకు వేచి చూసేవారు. ఈసారి వడ్డీ మాఫీ ఉండదని ముందే జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. పెద్దనోట్లరద్దు, వడ్డీ మాఫీ ఉండదని తెలియజేయడంతో ఆస్తిపన్ను చెల్లించేవారిలో మెజారిటీ ప్రజలు ఇప్పటికే చెల్లింపులు చేశారు. ఇంకా చెల్లించని వారుంటే గతంలో మాదిరిగా చివరిరోజు చెల్లిస్తారని భావిస్తున్నారు. ఇలా మరో రూ.50 కోట్లకు పైగా వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఆస్తిపన్ను వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.1200 కోట్లకు చేరే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు. అర్ధరాత్రి వరకు సీఎస్సీలు సేవలు ఆస్తిపన్ను చెల్లింపునకు శుక్రవారం చివరిరోజు కావడంతో జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఆన్లైన్లో చెల్లించండి.. ఆస్తిపన్ను చెల్లింపునకు చివరి రోజైన శుక్రవారం సీఎస్సీలు, మీసేవా కేంద్రాల్లో అధిక రద్దీ ఉండే దృష్ట్యా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఇందుకు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.inÌZలోని పేమెంట్స్ ట్యాబ్‌పై క్లిక్‌చేసి, అందులోని సూచనలకు అనుగుణంగా పన్ను చెల్లించవచ్చని విజ్ఞప్తి చేశారు. -
7 రోజులు..38 కోట్లు..
–మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు మిగిలింది వారం రోజులే - ఈ సారైనా లక్ష్యం సాధించేరా? కార్పొరేషన్ : 1 మునిసిపాలిటీలు : 8 నగర పంచాయతీలు : 3 మొత్తం అసెస్మెంట్లు : 2,42,248 వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను : రూ.6,455.54 లక్షలు ఇప్పటి దాకా వసూలైన మొత్తం : రూ.2,614.91 లక్షలు వారం వ్యవధిలో వసూలు చేయాల్సిన మొత్తం : రూ.3,840.63 లక్షలు ధర్మవరం : పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలు, మడకశిర, పామిడి, పుట్టపర్తి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.6,455.54 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. గురువారం సాయంత్రం నాటికి రూ.2,614.91 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. 40.50 శాతం మాత్రమే వసూళ్లు సాధించి.. పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. అనంతపురం నగర పాలక సంస్థలో రూ.2,608.45 లక్షల డిమాండ్ ఉండగా.. రూ.1,140.97 లక్షలు మాత్రమే (43.74 శాతం) వసూలు చేయగలిగారు. ఇక మడకశిర నగర పంచాయతీ కేవలం 12.78 శాతం పన్ను వసూళ్లతో జిల్లాలోనే చివరిస్థానంలో ఉంది. ఎప్పటిలాగే తాడిపత్రి మునిసిపాలిటీ లక్ష్యంలో ఇప్పటికే 65.14 శాతం వసూలు చేసి మరోసారి జిల్లా టాపర్‌గా నిలిచింది. మున్సిపాలిటీల్లో అత్యధిక అసెస్మెంట్లు కల్గిన హిందూపురం 39.42 శాతం వసూలు సాధించగా, ధర్మవరం 40.69 శాతం మాత్రమే చేయగల్గింది. తప్పెట మోగించినా పెరగని వసూళ్లు మొండి బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు కదిరి మునిసిపల్ అధికారులు వినూత్న పద్ధతిని అవలంబించారు. బకాయిదారుల ఇళ్ల ముందు తప్పెట మోగించారు. ఇళ్లు, సంస్థలకు తాళాలు కూడా వేశారు. అయినా మొత్తం లక్ష్యంలో 28.09 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయగలిగారు. కదిరి మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 20,042 అసెస్మెంట్లకు గాను రూ.510.2 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.143.3 లక్షలు మాత్రమే రాబట్టారు. ఇదేవిధంగా జిల్లాలోని చాలా మునిసిపాలిటీలు తమ లక్ష్యంలో సగం కూడా వసూలు చేయలేకపోయాయి. మిగిలింది వారమే.. పన్నుల వసూలుకు వారం గడువు మాత్రమే ఉంది. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో 2,42,248 అసెస్మెంట్లకు గాను దాదాపు 10 వేల దాకా ప్రభుత్వ కార్యాలయాలకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపు రూ. 10 కోట్ల మేర బకాయిలు రావాలి. పాత బకాయిలపై ప్రభుత్వం వడ్డీమాఫీ ఎత్తివేయడం కూడా వసూళ్లు మందగించడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉన్న వారం వ్యవధిలో 80 శాతమైనా వసూళ్లు చేయగలిగితే ఆయా మునిసిపాలిటీలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుంది. -
పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?
స్కిట్ కళాశాల బకాయిలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాల యజమాన్యం 2011 నుంచి రూ.60లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని..నోటీసులిచ్చినా పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డికి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో పన్నుల బకాయిలపై చర్చించారు. పన్ను చెల్లించకపోతే కళాశాలను సైతం జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ 2013 నుంచి మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉందని, అది కూడా రూ.26లక్షల లోపే ఉందని సమాధానమిచ్చారు. ఏప్రిల్ 1వతేదీలోపు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. మరో తలపోటుగా పన్నుల భారం స్కిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు. మొన్నటి వరకు స్కిట్‌ను అనంతపురం జేఎన్టీయూకి, కర్ణాటకలోని మఠాలకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో లీజుపై స్కిట్ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈనేపథ్యంలో మున్సిపాలిటి పన్నుల భారం కళాశాల యాజమాన్యానికి మరో తలపోటుగా పరిణమించింది. -
మంత్రి ‘పల్లె’ కళాశాల సీజ్
⇒ ఆస్తి పన్ను చెల్లించని ఫలితం ⇒ ‘వాళ్లకెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే’ అంటూ సమాధానం కదిరి: ఆస్తి పన్ను చెల్లించని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సంబంధించిన ఓ కాలేజీని మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. కదిరిలో మంత్రి పల్లెకు చెందిన శ్రీనివాస జూనియర్ కాలేజీకి రూ. 1.61 లక్షల మేర ఆస్తి పన్ను బకాయి ఉంది. మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కాలేజీ వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలంటూ గంటకు పైగా డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆస్తిపన్ను గురించి బిల్డింగ్ యజ మానితో మాట్లాడుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సి పల్ సూర్యప్రకాశ్ చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ అక్కడి నుంచే బిల్డింగ్ యజమాని రామ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. బిల్డింగ్ పన్నులన్నీ కడతానని మంత్రి పల్లె తనకు అగ్రిమెంట్ రాసిచ్చాడని ఆయన సమాధానం చెప్పారు. నా కాలేజీలోనే డప్పు వాయిస్తారా! ఇదంతా జరుగుతుండగానే సదరు కాలేజీ ప్రిన్సిపాల్ అసెంబ్లీలో ఉన్న మంత్రి పల్లెకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. స్పందిం చిన మంత్రి ‘మన కళాశాల ఆవరణలోకి వచ్చి డప్పు వాయిస్తారా? వారికెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే.. ఆ విషయం నేను మున్సి పల్ మంత్రి నారాయణతో మాట్లాడతాను’ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బకాయి కోసం వారం కిందటే రెడ్ నోటీస్ ఇచ్చామని చెప్పిన కమిషనర్.. కాలేజీ ఆఫీస్ రూం, స్టాఫ్ రూంలకు తాళం వేసి, సీల్ వేశారు. కాగా, కదిరిలోనే మంత్రి పల్లె నిర్వహిస్తున్న వివేకానంద డిగ్రీ కాలేజీ కూడా రూ. 84 వేల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఆ పన్ను బిల్డింగ్ ఓనర్‌కే సంబంధం కదిరిలో మా శ్రీనివాస కాలేజీ బిల్డింగ్‌కు సంబంధించి ఆస్తి పన్నుకు మాకు ఎలాంటి సబంధం లేదు. ఆ బకాయి బిల్డింగ్ యజమానే చెల్లించాలి. అయినప్పటికీ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన బకాయి చెక్కు రూపంలో పంపాను. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి -
ఆస్తి పన్నుకు ‘ఆధార్’ లింకు!
⇒ యజమాని ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో ఆస్తుల అనుసంధానం ⇒ తనఖా ఆస్తుల జాబితాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నులు, ఖాళీ స్థలంపై పన్నుల మదింపు సమాచారాన్ని సంబంధిత ఆస్తి యజమానుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో తక్షణమే అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులు, స్థలాల జాబితాలను సైతం రూపొందించి, బహిర్గతం చేయాలని సూచించింది. రాష్ట్రంలో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పురపాలక డైరెక్టరేట్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాలన్నీ అందుబాటులో: అన్ని పుర పాలికలు అధికారిక వెబ్సైట్లను ఏర్పాటు చేసుకోవాలని పురపాలక డైరెక్టరేట్ సూచిం చింది. ఆస్తి పన్నుల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలతో పాటు సంబంధిత యజమాని పేరు, ఆధార్, పాన్, ఫోన్ నంబర్ల సమాచారాన్ని వాటిలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన భవనాలు/ప్లాట్లు/ఖాళీ స్థలాల కు సంబంధించి అయితే.. ఆ ఆస్తి యజమాని పేరు, తనఖా పెట్టిన బ్యాంకు, బ్రాంచీ వివరాలను సైతం పేర్కొనాలని తెలిపింది. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో సమావేశమై తమ ప్రాంత పరిధిలో తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను సేకరించాలని సూచించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద ఎంపికైన నగరాలు, పట్టణాల్లో సంస్కరణల అమల్లో భాగంగా ఆస్తి పన్నుల మదింపు వివరాలను సంబంధిత పురపాలిక వెబ్సైట్లో ప్రదర్శించాలన్న నిబంధనలు న్నాయి. అదే తరహాలో అన్ని మున్సిపాలిటీ ల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి పన్నుల మదింపు వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసి, బహిర్గతం చేస్తే సంబంధిత యజ మానుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడి కానున్నాయి. వెబ్సైట్ నిర్వహణ తప్పనిసరి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 23 పురపాలికలు క్రియాశీలంగా వెబ్సైట్లను నిర్వహిస్తుండగా, మరో 45 పురపాలికలు వెబ్సైట్లు రూపొందించుకున్నా సరిగా నిర్వహించడంలేదు. నాలుగు పురపాలికలకు అధికారిక వెబ్సైట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పురపాలిక ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరిస్తూ (అప్డేట్ చేస్తూ) వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మ్యూటేషన్ రుసుము పెంపు అధికారం పురపాలికలకే.. స్థిరాస్తుల క్రయవిక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే మ్యూటేషన్ రుసుముల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్స్‌కు ఉందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మ్యూటేషన్ రుసుము పెంపుపై కౌన్సిల్లో చేసే తీర్మానాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌కు పంపించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు స్పష్టతనిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆస్తిపన్ను అసెస్మెంట్ ఇక ఈజీ...
→ ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్కు అవకాశం → జీహెచ్ఎంసీ మరో కొత్త కార్యక్రమం → అక్రమాల సిబ్బందికి ముకుతాడు → పారదర్శకంగా ఆస్తిపన్ను నిర్ధారణ సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తయితే.. కొత్త ఇంటికి ఆస్తిపన్ను చెల్లించేందుకు అసెస్మెంట్ చేయించుకోవడం ఒక ఎత్తు. తాము కొత్తగా ఇల్లు కట్టుకున్నామని, ఆస్తిపన్ను కట్టేందుకు ఇంటి కొలతలు తీసి ఎంత మేర ఆస్తిపన్ను కట్టాలో వెల్లడించాలని, ఆస్తిపన్ను జాబితాలో తమ పేరు నమోదు చేయాలని కోరిన వారికి ట్యాక్స్ సెక్షన్ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా అసెస్మెంట్కు వెళ్లరు. అసెస్మెంట్ చేయాలంటే చేయి తడపాలి. అసెస్మెంట్లో కట్టాల్సిన ఆస్తిపన్నుకుంటే ఎక్కువ మొత్తం పడకుండా ఉండాలంటే ముడుపులు ముట్టజెప్పాలి. అంతేకాదు.. ఇంటి విస్తీర్ణం మేరకు చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తమే చెల్లించేలా అసెస్మెంట్ చేయమన్నా చేస్తారు. అయితే ఒక కండీషన్. వారు కోరినంత భారీ మొత్తాన్ని చెల్లించాలి. మాకు చెల్లించేది ఇప్పుడే కదా.. మీరు ప్రతియేటా చెల్లించే ఆస్తిపన్నులో లాభమేకదా అంటూ అందిన కాడికి దండుకుంటారు. ఏ మామూలు ఇచ్చుకోలేని వారి వినతులు అసలు పట్టించుకోరు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ ఇళ్ల యజమానులే జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే విధానాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్లో ఈ–రిజిస్ట్రేషన్స్‌లో ప్రాపర్టీటాక్స్లోకి.. అక్కడినుంచి ‘అసెస్మెంట్ ఫామ్’లోకి వెళితే సెల్ఫ్ అసెస్మెంట్ అప్లికేషన్ ఫారమ్ వస్తుంది. దాన్లోని సూచనల మేరకు వెళితే యూనిట్రేట్ తదితర వివరాలు కనిపిస్తాయి. చేతివాటంలో ఘనాపాఠీలు.. తాము కట్టుకున్న భవనాలు, వ్యాపార సముదాయాలకు ఆస్తిపన్ను చెల్లించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పటికీ వారు చెల్లించలేకపోతున్నారు. అందుకు కారణాలు.. →భవనాన్ని కొలతలు తీసి ఆస్తిపన్ను నిర్ధారించాల్సిన ట్యాక్స్ సిబ్బంది జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అసలు కనిపించరు. అదేమని అడిగితే క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లకు, ఇతరత్రా పనులకు వెళ్లారని చెబుతారు. → అయితే వీరిలో చాలామంది ఈ పనులకు సైతం ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని, వారితోనే ఈ పనులు చేయిస్తుంటారు. భారీగా అందే ముడుపులతో వారికి జీతాలు చెల్లించడం టాక్స్ సిబ్బందికి సమస్యే కాదు. → ఒకవేళ కార్యాలయాల్లో కనిపించినా ఇళ్ల యజమానులు చెప్పేది వినిపించుకోరు. అసలు స్పందించరు. తమ చేయి తడిపితేనే స్పందిస్తారు. భారీ ముడుపులు ముడతాయనుకుంటేనే కదులుతారు. → నిబంధనల మేరకు.. ఏరియాను బట్టి, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆస్తిపన్ను నిర్ధారించాల్సి ఉండగా, తమ ఇష్టానుసారం అధిక మొత్తంలో ఆస్తిపన్నును నిర్ధారిస్తారు. ఇదేమని అడిగితే.. తమ వాటా ముడితే అందులో సగానికన్నా తగ్గించేందుందుకు సిద్ధమవుతారు. ఇలా ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన సొమ్ముతో వేసవిలో విదేశీ టూర్లు, ముజ్రాపార్టీలు చేసుకోవడం పరిపాటి అనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఏసీబీ దాడుల్లో ఈ విభాగం వారే ఎక్కువగా దొరుకుతున్నారు. ఖజానాకు చిల్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా దాదాపు 80వేల భవనాల నిర్మాణం జరుగుతున్నప్పటికీ, కేవలం 30 వేల లోపు మాత్రమే ఆస్తిపన్ను జాబితాలో చేరుతున్నాయి. వీటిద్వారా జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ. 40 కోట్లు ఆస్తిపన్ను రూపేణా వసూలవుతోంది. కొత్త భవనాలన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తే దాదాపు రూ.100 కోట్లు ఖజానాకు జమ అవుతాయి. అయితే తమ జేబులు నింపుకునేందుకు అలవాటుపడ్డ సిబ్బంది భవనాలను ఆస్తిపన్ను జాబితాలోకి తేవడం లేరు. జాబితాలో చేర్చకుండా తాము చూసుకుంటామని అందినకాడికి దండుకుంటున్నారు. ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు ఎన్ని దరఖాస్తులొచ్చిందీ తెలుస్తుంది కనుక, వారి ఆటలకు అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటినుంచి దాదాపు నెలన్నర రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ప్రాక్టికల్‌గా ఎదురయ్యే ఇబ్బందుల్ని తొలగిస్తూ నెలరోజుల్లో నే ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. -
గట్టెక్కేదెలా!
చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలు కార్యదర్శులకు గుదిబండగా మారాయి. మార్చి 15వ తేదీలోగా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు హుకుం జారీ చేయడంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక కార్యదర్శులు, సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. తలకు మించిన పనులతో ఇబ్బంది పడుతున్న కార్యదర్శులకు పన్నుల వసూలు సాధ్యం కావడం లేదు. పంచాయతీల్లో రోజువారీ కార్యకలాపాలతో పాటు ఇతర పనులు కూడా చేయడం వల్ల పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టలేక పోతున్నారు. మరోవైపు ఒక్కొక్క కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఏ పనీ ముందుకు సాగడం లేదు. పన్నులను తక్షణమే వసూలు చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఈఓపీఆర్డీలు, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారుల దీనిపైనే కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్‌తోపాటు కార్యాలయ సిబ్బందిని సైతం పన్నుల వసూలు కోసం కేటాయించారు. అయినా ఆశించినమేర వసూలు కావడం లేదని తెలుస్తోంది. పంచాయతీల్లో పోస్టులు ఖాళీ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులతో పాటు బిల్లు కలెక్టర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు, కార్యదర్శుళు దృష్టి సారించలేకపోతున్నారు. ముఖ్యంగా పాలన కష్టంగా మారింది. ప్రతినెలా పింఛన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులన్నీ కార్యదర్శులే చూడాలి. దీంతో వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న కార్యదర్శి, బిల్లు కలెక్టర్ పోస్టులను భర్తీ చేస్తే పంచాయతీల్లో పాలన గాడిన పడుతుంది. 40 శాతం మించని వసూళ్లు జిల్లాలో 48 మండలాల్లోని నాలుగు డివిజన్ల పరిధిలో 908 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నోటిఫైడ్ పంచాయతీలు 204, నా¯ŒS నోటిఫైడ్ పంచాయతీలు 704. డివిజన్ వారీగా చూస్తే ఒక్కొక్క డివిజన్లో ఇప్పటివరకు 40 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జంగారెడ్డిగూడెం డివిజన్లో 177 పంచాయతీలు ఉండగా, రూ.10.50 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 34 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఏలూరు డివిజన్ పరిధిలో 272 పంచాయతీలు ఉండగా, రూ. 19.72 కోట్లకు గాను, 41శాతం మాత్రమే వసూలయ్యాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో 209 పంచాయతీలు ఉండగా, రూ.20.75 కోట్లకు గాను 41శాతం పన్నులు వసూలయ్యాయి. నరసాపురం డివిజన్ పరిధిలో 250 పంచాయతీలు ఉండగా, రూ.12.90 కోట్లకు గాను 45శాతం పన్నులు వసూలయ్యాయి. 34 శాతం మాత్రమే వసూలు చేసి జంగారెడ్డిగూడెం డివిజన్ చివరి స్థానంలో ఉంది. మార్చి 31 నాటికి పన్నులు వసూలు చేయాలంటే.. 44 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులతో సమావేశమై పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగవంతం చేశాం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. గత ఏడాది 97శాతం వసూలు చేశాం. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకోసం అధికారులు , సిబ్బందిని అప్రమత్తం చేశాం. – కె.సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు -
కంటోన్మెంట్లో శశికళ ట్యాక్స్ డిఫాల్టర్!
రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని వైనం హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్యాక్స్ డిఫాల్టర్! మారేడ్‌పల్లి రాధిక కాలనీలో శశికళ నటరాజన్ పేరిట ఉన్న ప్లాట్ నెంబర్ 16లోని ఇంటికి సంబంధించి రెండేళ్లకు రూ. 35,424 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం బకాయిల వసూలు లక్ష్యంగా కంటోన్మెంట్ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు పంపిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు, శశికళ పేరిట ఉన్న ఇంటికీ నోటీసు పంపారు. 1990 ప్రాంతంలో జయలలిత నగర శివారులోని జీడిమెట్ల గ్రామపరిధిలో జేజే గార్డెన్ పేరిట వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సమయంలోనే, మారేడ్‌పల్లిలో శశికళ పేరిట ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో తరచూ హైదరాబాద్‌కు వచ్చే సమయాల్లో జయలలిత ఇక్కడ నివాసం ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ–2గా సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చిన సందర్భంలో ఆమె పేరిట నగరంలో ఉన్న ఆస్తుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలం క్రితం ప్రైవేటు వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారని, నాలుగేళ్లుగా సదరు నివాసం ఖాళీగానే ఉంటోందని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆమె ఆస్తి అక్రమమా లేక సక్రమమా అనే చర్చ మొదలైంది. -
పన్నులు వసూలు చేయాలి
గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనూరాధ కావలిఅర్బన్ : మున్సిపల్ పరిధిలోని పన్నులను 100 శాతం వసూలు చేయాలని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనురాధ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కావలి పట్టణంలోని 4, 5, 33, 34వ వార్డులతో పాటు పట్టణ ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్యాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 14, 13వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్‌ప్లాన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ నిధుల ద్వారా చేపట్టబడిన పనులను ఇంజనీరింగ్ శాఖ ద్వారా తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు సరిచూసి చర్యలు చేపట్టాన్నారు. పనులకు సంబంధించిన చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగాన్ని సమీక్షించి అన్ని రకాల పన్నులను ఏడాదిలోగా వసూలు చేయాలన్నారు. జనన, మరణ నివేదికలు, ఆస్తి పన్ను పేరు మార్పు బదిలీ, కొళాయిల మంజూరు వంటి లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే జరపాలన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ రాని గుమస్తాలు వెంటనే నేర్చుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటేశ్వర్లు, డీఈ మదర్ అలీ, మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాత నోట్లతో.. ఆస్తిపన్ను చెల్లింపు బంద్
సిటీబ్యూరో: పాత పెద్ద నోట్ల(రూ500, రూ.1000)తో ఆస్తిపన్ను, ఎల్ఆర్ఎస్ తదితర ఫీజుల చెల్లింపు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఇకపై పాతనోట్లను స్వీకరించబోమని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. గురువారం రాత్రి 11 గంటల వరకు రూ.26.19 కోట్లు వసూలు అరుునట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సర్కార్ తీసుకున్న పాతనోట్ల రద్దు ప్రకటనతో 15 రోజుల్లో జీహెచ్ఎంసీకి మొత్తం రూ.246.02 కోట్లు వసూలు అరుుంది. -
జిల్లాలో రూ. 8కోట్ల ఆస్తిపన్ను బకాయి
నిడమనూరు : జిల్లాలోని 31మండలాల్లో ఆస్తిపన్ను బకాయిలు 8 కోట్లు పేరుకుపోయాయని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయ న నిడమనూరుకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన పంచాయతీ సిబ్బం ది, గ్రామస్తులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయన్నారు. సిబ్బంది జీతభత్యాలకే పన్నుల వసూలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన నోట్లతో ఆస్తిపన్ను చెల్లించవచ్చని తెలి పారు. నిడమనూరులో డీపీఓ ప్రభాకరరెడ్డి స్వయం గా ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కరోజే 45వేల రూపాయల ఆస్తిపన్ను వసూలైంది. ఆయన వెంట ఎంపీడీఓ ఇందిర, సర్పంచ్ ముత్తయ్య, కార్యదర్శి పద్మ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు
- వారంలో రూ.32.08 కోట్ల ఆస్తి పన్ను వసూలు - 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపు సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుకు గ్రామ పంచాయతీల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.32,08,29,499 పన్ను వసూలైంది. వారం రోజుల్లో ఆస్తి పన్ను వసూలు తీరు పరిశీలిస్తే.. 11న అత్యధికంగా రూ.8.16 కోట్లు, శుక్రవారం రూ.2.45 కోట్ల పన్ను వసూలు జరిగింది. 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.8.38కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4.96 కోట్ల పన్ను వసూలైంది. సంగారెడ్డి జిల్లాలో రూ.2.54 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.1.75 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.1.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1.21 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.1.10 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.1.07 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10 వరకు రూ.73.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా, వారం రోజుల్లోనే రూ.32.08 కోట్లు వసూలవడం గమనార్హం. ఈ నెల 24 వరకు పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు ఉన్న వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని బకారుులు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గ్రామాల్లో అన్ని కుటుంబాలు ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
నోట్ల రద్దుతో పంచాయతీల పంట పండింది!
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు అంశం తెలంగాణలోని గ్రామపంచాయతీలకు అనూహ్యంగా కలిసివచ్చింది. రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లతో ఆస్తిపన్ను చెల్లించేందుకు అవకాశం ఇస్తుండటంతో జనాలు తమ ఆస్తిపన్నును, బకాయిలు చెల్లించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో తెలంగాణ అంతటా ఆస్తిపన్ను చెల్లింపులకు విశేషమైన స్పందన లభిస్తోంది. మూడురోజుల్లో రాష్ట్రంలోని పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో ఏకంగా రూ. 16 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. బాకాయిపడ్డ ఆస్తిపన్ను చెల్లించేందుకు సైతం గ్రామీణులు పంచాయతీల ముందు బారులు తీరుతున్నారు. పాతనోట్లతో పన్ను చెల్లించేందుకు రేపటివరకు గడువు ఉండటంతో సోమవారం కూడా భారీమొత్తం ఆస్తిపన్ను చెల్లింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిపడిన ఈ అనూహ్య ఆదాయంతో గ్రామపంచాయతీలు నిధులతో కళకళలాడుతున్నాయి. -
కొరడా
► ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.700 కోట్లు ► దుకాణాలపై కార్పొరేషన్ కొరడా సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కార్పొరేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం పన్ను బకాయిలు పడిన దుకాణాలు, నివాస గృహాలపై కొరడా ఝుళిపిం చడం ప్రారంభించింది. చెన్నై కార్పొరేషన్‌కు వచ్చే వార్షిక ఆదాయంలో ఆస్తిపన్ను రూపేణా లభించే శాతమే ఎక్కువ. ఆస్తిపన్ను ద్వారా గత ఏడాది రూ.600 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకోగా రూ.586.46 కోట్లు వసూలైంది. కార్పొరేషన్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను అత్యధిక సొమ్ముగా రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం చెన్నై కార్పొరేషన్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఆస్తిపన్నే దిక్కని భావిస్తూ రూ.650 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్తిపన్ను వసూలులో తొలి అర్ధ సంవత్సరం రూ.308 కోట్లు వసూలు చేశారు. ఇక లక్ష్యసాధనలో మిగిలిన రూ.342 కోట్లకు అక్టోబర్ 1వ తేదీ నుంచి కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. రోజుకు సగటున అందరూ కలిపి రూ.4 కోట్లు వసూలు చేయాలని బిల్ కలెక్టర్లకు నిబంధన విధించారు. అత్యధిక బకాయి ఉన్న వర్తక దుకాణాల జాబితాను సిద్ధం చేసుకుని కఠిన చర్యలు చేపడుతున్నారు. దుకాణాలకు జారీ చేసిన జీఎస్టీలను రద్దు చేయించడం, కాలుష్య నియంత్ర మండలి నుంచి సర్టిఫికెట్ జారీ కాకుండా అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. పురసైవాక్కం జాతీయ రహదారి, ఠాకూర్ రోడ్డు ప్రాంతాల్లో రాయపురం మండల అధికారులు గురువారం దాడులు జరిపి 18 దుకాణాలకు సీలు వేశారు. ఇదే ప్రాంతంలోని రెండు వర్తక దుకాణాల వారు రూ.50 లక్షల వరకు ఆస్తిపన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు కావడం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా లేకపోవడం వల్ల కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి పన్ను వసూలు మినహా మరే ముఖ్యమైన బాధ్యతలు లేవు. దీంతో ఆస్తిపన్ను వసూలుపైనే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదే వేగాన్ని మరి కొన్ని నెలలు కేటాయించి రూ.700 ఆస్తిపన్ను వసూలుతో సరికొత్త రికార్డును స్థాపించగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆస్తిపన్ను లక్ష్య సాధన, చెల్లింపు బకాయిలపై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్లకే రూ.400 కోట్ల బకాయిని కార్పొరేషన్ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వసూలయ్యే నగదులో నిర్వహణ ఖర్చులకు, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు. ఆస్తిపన్ను వసూళ్ల ద్వారానే కార్పొరేషన్ ఆర్థిక భారాన్ని నెట్టుకొస్తున్నామని తెలిపారు. 2012-13లో ఆస్తిపన్ను కింద రూ.461 కోట్లు, వృత్తిపన్ను ద్వారా రూ.221.04 కోట్లు వసూలు చేశామని తెలిపారు. అలాగే 2013-14లో ఆస్తిపన్ను కింద రూ.480.13, వృత్తి పన్ను ద్వారా రూ.234.68, 2014-15లో ఆస్తిపన్ను ద్వారా రూ.581.82, వృత్తిపన్ను కింద రూ.264.79 వసూలు చేశామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మొదటి వారం వరకు రూ.400 కోట్లు వసూలైనట్లు తెలియజేశారు. -
‘గ్రేటర్’కు కాసుల పంట..
జీహెచ్ఎంసీకి భారీగా సమకూరిన ఆదాయం ► ఆస్తి పన్ను కింద శుక్రవారం ఒక్కరోజే రూ.50 కోట్ల రాబడి ► గ్రేటర్ లో వివిధ ప్రభుత్వ సంస్థలకు రూ.100 కోట్ల వసూలు ► కిటకిటలాడిన ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా సెంటర్లు ► 14వ తేదీ వరకూ పన్ను చెల్లింపుల గడువు పొడిగింపు ► సెలవు దినాల్లోనూ పన్నులు, వినియోగ చార్జీల చెల్లింపునకు అవకాశం ► ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను, నీటి, విద్యుత్ బిల్లులు తదితర ఫీజులను పాత రూ.500, రూ.1,000 నోట్ల ద్వారా చెల్లించేందుకు వినియోగదారులకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ గడువు ఇవ్వడంతో ‘గ్రేటర్’కు కాసుల పంట పండింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లింపుల కింద శుక్రవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు రూ.48 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తం రూ.50 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. సాధారణ రోజుల్లో రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలవుతుంది. కానీ శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 50 కోట్ల వరకూ ఆస్తి పన్ను వసూలవ్వడం గమనార్హం. కాగా, అన్ని రకాల బిల్లులు, పన్నులు వెరసి గ్రేటర్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలకు దాదాపు రూ.100 కోట్ల రాబడి వచ్చింది. పాత నోట్లతో పన్నులు, వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు(సీఎస్సీలు), మీసేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను మొత్తంతోపాటు పాత బకాయిల చెల్లింపులకూ అవకాశం ఉండటంతో అనేక మంది బకాయిలతో సహా చెల్లించారు. మరికొందరు అడ్వాన్సగా రెండు, మూడేళ్ల ఆస్తి పన్ను ముందస్తుగానే కట్టేందుకు ముందుకొచ్చినా.. వాటిని స్వీకరించలేదు. జీహెచ్ఎంసీలోని పౌరసేవా కేంద్రాలతోపాటు బిల్ కలెక్టర్లకు.. మీసేవా, ఏపీ ఆన్లైన్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లించారు. మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్షమంది వివిధ రకాలైన పన్నులు, ఫీజుల్ని చెల్లించినట్టు సమాచారం. భారీ మొత్తంలో బకాయిలు ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులతో జీహెచ్ఎంసీ అధికారులు సంప్రదింపులు జరపడంతో పలువురు బకాయిలు చెల్లించారు. మొత్తంగా ఆరు వేల మందికి పైగా తమ ఆస్తిపన్ను చెల్లించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సంస్థల ఆదాయం జీహెచ్ఎంసీ : రూ.50 కోట్లు జలమండలి : రూ.15 కోట్లు విద్యుత్‌శాఖ : రూ.30 కోట్లు హెచ్ఎండీఏ : రూ.4.10 కోట్లు డిస్కంకు రూ.71 కోట్లు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు పాత నోట్ల స్వీకరణతో శుక్రవారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు రూ.71 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు సర్కిళ్ల నుంచి రూ.30 కోట్ల బిల్లులు రాగా, జిల్లాల నుంచి రూ.41 కోట్లు వసూలైనట్లు డిస్కం ఆపరేషన్స డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. 14 వరకూ చెల్లింపులు జరపొచ్చు.. తమ పిలుపునకు స్పందించిన ప్రజలకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం మరో 72 గంటలపాటు పాత నోట్లను చెల్లింపులకు అనుమతించడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచు కోవాలని మేయర్ సూచించారు. భవన నిర్మాణ అనుమతులకు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో ఫీజు సమా చారం జనరేట్ అరుున వారు, పాత బకారుులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చెల్లింపుల కోసం శుక్రవారం పౌరసేవా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు సోమవారం వరకు కొనసాగుతాయని చెప్పారు. సెలవు దినాల్లోనూ పనిచేస్తాయ న్నారు. ట్రేడ్ లెసైన్సుల రెన్యువల్, వేకెంట్ ల్యాండ్ టాక్స్ తదితర మైన వాటికి పాతనోట్లతో చెల్లింపులు జరపొచ్చని స్పష్టం చేశారు. సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజుల కోసం చెల్లించే పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించిన వారు వాటిని ఉపసంహరించుకుని పాతనోట్లతో నగదు చెల్లించవచ్చన్నారు. పాతనోట్లతో చెల్లించే ఈ పన్నులకు, ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జలమండలికి రికార్డు ఆదాయం.. పాత నోట్ల స్వీకరణతో జలమండలికి శుక్రవారం రికార్డు స్థారుులో ఆదాయం సమకూరింది. క్యాష్ కౌంటర్లు, ఆర్టీజీఎస్, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా సుమారు 53 వేల మంది వినియోగదారులు పెండింగ్ నీటి బిల్లులు చెల్లించారు. దీంతో రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. పాతనోట్ల స్వీకరణ గడువును కేంద్రం పొడిగించడంతో జలమండలికి సుమారు రూ.50 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు వసూలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జలమండలికి నెలవారీగా నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీ ద్వారా సుమారు రూ.90 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. -
ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఆశ్రమాలకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖలను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆస్తి పన్ను మినహాయింపునకు వీలుగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలకశాఖ, పంచాయతీరాజ్‌శాఖలు చర్యలు చేపట్టాయి. చట్ట సవరణ జరిగి ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రా‘పల్టీ’
ఈ ఏడాది వసూలు కావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ రూ.15.12 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది రూ.5.75 కోట్లు గతేడాది బకాయిలు రూ.4.38 కోట్లు ఐదు నెలల్లో వసూలు చేయాల్సింది రూ.13.75 కోట్లు ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్ రీజియన్ లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 54,387 గృహ సముదాయాలున్నాయి. ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్ బిల్డింగ్లు 6,536, పార్ట్లీ రెసిడెన్షియల్ భవనాలు 8603. వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి. గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం రూ.15.12 కోట్లు. గత ఏడాది బకాయి కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే 2016–17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే పేర్కొంటున్నాయి. వరంగల్ రీజియన్ లో ఖమ్మం వెనుకంజ.. వరంగల్ రీజియన్ లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా, పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్‌వ¯ŒS స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్ లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్న వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. ఖమ్మం కార్పొరేషన్ లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, 14 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్ కలెక్టర్ మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది. ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు.