ప్రా‘పల్టీ’ | property tax in khammam corporation | Sakshi
Sakshi News home page

ప్రా‘పల్టీ’

Published Wed, Nov 2 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

property tax in khammam corporation

ఈ ఏడాది వసూలు కావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్‌ రూ.15.12 కోట్లు 
ఇప్పటి వరకు వసూలైంది రూ.5.75 కోట్లు 
గతేడాది బకాయిలు రూ.4.38 కోట్లు 
ఐదు నెలల్లో వసూలు చేయాల్సింది రూ.13.75 కోట్లు
 
ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్‌ రీజియన్ లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి.
  
కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా  54,387 గృహ సముదాయాలున్నాయి.  ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్‌ బిల్డింగ్‌లు 6,536, పార్ట్‌లీ రెసిడెన్షియల్‌ భవనాలు 8603.  వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి.  
గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం 
 
రూ.15.12 కోట్లు.  గత ఏడాది బకాయి కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే 2016–17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే  పేర్కొంటున్నాయి.  
 
వరంగల్‌ రీజియన్ లో ఖమ్మం వెనుకంజ.. 
వరంగల్‌ రీజియన్ లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా,  పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్‌ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్‌వ¯ŒS స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్‌ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్ లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్న వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.  
 
అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. 
ఖమ్మం కార్పొరేషన్ లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, 14 మంది బిల్‌ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్‌ కలెక్టర్‌  మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది.  ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో  ప్రస్తుతం ఆ పనుల్లో బిల్‌ కలెక్టర్లు, ఆర్‌ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్‌ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement