Khammam Corporation
-
మురికిపోయి.. ముద్దుగా మారి
అదో కాలువ.. దానికి అనుబంధంగా డ్రైనేజీలు, వానాకాలం వచ్చిందంటే ఉప్పొంగడం, రోడ్లన్నీ మురికినీటితో నిండిపోవడం, విషజ్వరాలు, తాగునీటి కాలుష్యం, దుర్వాసన.. ఇదంతా గతం.. ఇప్పుడు అదంతా అందాల హరివిల్లు. పచ్చదనం నిండిన పార్కులు, ఫౌంటెయిన్లు, ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలతో ఆహ్లాదం పంచే ప్రదేశం.. ఖమ్మం పట్టణంలోని గోళ్లపాడు చానెల్,దాని వెంట ఉన్న ప్రాంతాల్లో వచ్చిన అద్భుతమైన మార్పు ఇది. సీఎం కేసీఆర్ హామీ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ కలిసి రూ.100 కోట్ల ఖర్చుతో గోళ్లపాడు చానెల్ ప్రాజెక్టు అపూర్వంగా రూపుదిద్దుకుంది. సీఎం కేసీఆర్ ఈ అభివృద్ధి పనులకు కితాబివ్వగా.. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.100 కోట్లతో 10.6 కి.మీ.పొడవునాఅభివృద్ధి గోళ్లపాడు చానల్ పునరుద్ధరణతో ఖమ్మం పట్టణానికి వన్నె ఆక్రమణలకు పాల్పడిన 862 మందికి పునరావాసం మంత్రి పువ్వాడ చొరవతో పనులు.. త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం గోళ్లపాడు చానల్ ఖమ్మం నగరం మీదుగా వెళ్తూ.. శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరందించేది. త్రీటౌన్ ప్రాంతంలో 10.6 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ కాల్వ కాలక్రమేణా నగరాభివృద్ధితో డ్రైనేజీగా మారింది. పంపింగ్ వెల్ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో కాల్వకు ఇరువైపులా బస్తీలు వెలిశాయి. ఖమ్మం నగరంలోని 28 డివిజన్ల మురికినీరంతా ఈ కాల్వ నుంచే వెళ్లి మున్నేరులో కలుస్తుండటం, ఆక్రమణలు, సిల్ట్ తీయకపోవడంతో నాలుగు దశాబ్దాలుగా కాల్వ, పరిసర ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. వానాకాలంలో ఈ డ్రైనేజీ పొంగి సమీప డివిజన్లలో మురికినీరు చేరడం, ఆ నీరు పైపులైన్లలో కలిసి తాగునీరు కలుíÙతం కావడం నిత్యకృత్యమైంది. దోమల స్వైర విహారంతో విషజ్వరాలు, వ్యాధుల విజృంభణ సాధారణమైంది. రూ.100 కోట్లతో మారిన ముఖచిత్రం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లతోపాటు ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి 2018లో ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగా రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 30ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాన నీరు వెళ్లేందుకు ఓపెన్ కాల్వ నిర్మించడంతోపాటు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైభాగంలో ఆహ్లాదం పంచేలా పార్కులను ఏర్పాటు చేశారు. అధునాతన సౌకర్యాలతో.. పది డివిజన్ల పరిధిలోని 50 వేల మంది ప్రజలకు ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్‌ను అభివృద్ధి చేశారు. పిల్లలకు చెస్‌పై అవగాహన కలి్పంచేలా రష్యాలోని మాస్కో తరహాలో మెగా చెస్‌బోర్డులు, అధునాతనంగా స్కేటింగ్ రింక్లు, వాటర్ ఫౌంటెయిన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, బస్తీ దవాఖానా, యోగా వేదికలు, పంచతత్వ పార్కులు, 10 వేల ఔషధ, ఇతర మొక్కలతో మినీ పార్కులను ఏర్పాటు చేశారు. మొత్తం 32 ఎకరాల స్థలం ప్రజా అవసరాల దృష్ట్యా వినియోగంలోకి వచ్చింది. గోళ్లపాడు చానల్ ప్రాజెక్టు వ్యయం రూ.100 కోట్లు అయితే.. వినియోగంలోకి వచ్చిన భూమి విలువ రూ.300 కోట్లకు పైమాటేనని అంచనా వేశారు. సీఎం సూచనల మేరకు ఇటీవల నిజామాబాద్ కలెక్టర్, ఆ జిల్లా అధికారులు ఈ అభివృద్ధి పనులను సందర్శించారు కూడా. గోళ్లపాడు చానల్‌పై నిర్మించిన పార్కులకు ప్రొఫెసర్ జయశంకర్, మంచికంటి రామకిషన్రావు, పుచ్చలపల్లి సుందరయ్య, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, రజబ్ అలీ, వనజీవి రామయ్య తదితరప్రముఖుల పేర్లను పెట్టారు. గోళ్లపాడు చానల్ వెంట గతంలో గుడిసెలు, ఇతర తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న 862 మంది పేదలకు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్ని వసతులతో కాలనీ ఏర్పాటు చేశారు. మురికి పోయి.. వన్నె వచ్చింది సీఎం కేసీఆర్ రూ.100 కోట్లను గోళ్లపాడు చానల్‌కు కేటాయించడంతో నాలుగు దశాబ్దాల మురికి కూపం నుంచి విముక్తి కలిగింది. వన్నె వచ్చింది. ప్రత్యేకంగా త్రీటౌన్ ప్రాంతానికి ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్ ముస్తాబైంది. విషజ్వరాలు, దుర్వాసనతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నేడు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. సీఎం దార్శనికతకు ఇది నిదర్శనం.- పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి అందరి కృషితో ఆహ్లాదం సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులు, స్థానికుల సహకారంతో గోళ్లపాడు చానల్ సొబగులు అద్దుకుంది. ఆహ్లాదకరమైన పార్కులు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వీటిని సదినియోగం చేసుకోవాలి. మొత్తం పది వేల కుటుంబాలు ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా తీర్చిదిద్దాం. గోళ్లపాడు చానల్ పార్కుల్లో ఇంకా కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. -వీపీ గౌతమ్, కలెక్టర్, ఖమ్మం -
టిక్ టాక్ వీడియోలు.. వారిని సస్పెండ్ చేయలేదు!
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు టిక్‌టాక్ యాప్‌లో సరదా వీడియోలు అప్లోడ్ చేసి.. హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టిక్‌టాక్ వీడియోలు వైరల్ కావడంతో కార్పొరేషన్ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనులను పక్కనపెట్టి ఇలా టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మొదటి చర్యగా ఆయా ఉద్యోగుల సెక్షన్లు మార్చారు. ఈ క్రమంలో టిక్ టాక్ వీడియోలు చేసిన సిబ్బంది వ్యవహారంపై తాజాగా ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ స్పందించారు. టిక్‌టాక్ వీడియోలు చేసిన వారిపై శాఖపరంగా అంతర్గత క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, వారిని విధుల నుంచి తొలగించలేదని, సస్పెండ్ కూడా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ సిబ్బంది విధులను కొంతకాలం నిలుపడం, జీతాల్లో కోత విధించడం వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. -
టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ
-
కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ..!
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ తిరగబడ్డారు. తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చివేయడంతో ఆగ్రహించిన ఆమె.. ఎందుకు గోడను కూల్చేశారంటూ.. కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సిన పనిలో ‘నీకేమి పని ఉంటూ’ అని ఆమె అతన్ని నిలదీశారు. నగరంలోని ఐదో డివిజన్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఐదో డివిజన్లో మల్సూరు సుజాత దంపతులకు నివాస భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన నలుగురు కార్నొరేటర్‌లు కొంతకాలంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉదయం మల్సూరు దంపతుల ఇంటికి వెళ్లిన 23వ డివిజన్ కార్పొరేటర్ పొట్ల శశికళ భర్త వీరెందర్ దౌర్జన్యానికి దిగినట్టు తెలుస్తోంది. సుజాత దంపతుల నివాసానికి సంబంధించిన ప్రహారీ గోడను అతను కూల్చివేయించడంతో మల్సూరు సుజాత కార్పొరేటర్ భర్తపై తిరగబడ్డారు. ఎలా తన ఇంటి గోడను కూల్చేస్తారంటూ.. అతనికి చెప్పుతో దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతను ఆమెను కిందపడేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. -
ప్రా‘పల్టీ’
ఈ ఏడాది వసూలు కావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ రూ.15.12 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది రూ.5.75 కోట్లు గతేడాది బకాయిలు రూ.4.38 కోట్లు ఐదు నెలల్లో వసూలు చేయాల్సింది రూ.13.75 కోట్లు ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్ రీజియన్ లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 54,387 గృహ సముదాయాలున్నాయి. ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్ బిల్డింగ్లు 6,536, పార్ట్లీ రెసిడెన్షియల్ భవనాలు 8603. వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి. గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం రూ.15.12 కోట్లు. గత ఏడాది బకాయి కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే 2016–17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే పేర్కొంటున్నాయి. వరంగల్ రీజియన్ లో ఖమ్మం వెనుకంజ.. వరంగల్ రీజియన్ లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా, పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్‌వ¯ŒS స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్ లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్న వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. ఖమ్మం కార్పొరేషన్ లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, 14 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్ కలెక్టర్ మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది. ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు. -
ప్రా‘పల్టీ’
♦ ఈ ఏడాది నూరుశాతం పన్ను వసూళ్లు అసాధ్యమే ♦ ఆస్తి పన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ వెనుకంజ ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్ రీజియన్‌లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థారుు దృష్టి సారించలేదనే ఆరోపణలున్నారుు. ♦ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 54,387 గృహ సముదాయాలున్నారుు. ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్ బిల్డింగ్లు 6,536, పార్ట్లీ రెసిడెన్షియల్ భవనాలు 8603. వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అరుుతే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి. ♦ గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకారుులు పేరుకుపోయారుు. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం ♦ రూ.15.12 కోట్లు. గత ఏడాది బకారుు కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అరుుతే 2016-17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే పేర్కొంటున్నారుు. వరంగల్ రీజియన్‌లో ఖమ్మం వెనుకంజ.. వరంగల్ రీజియన్‌లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా, పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్‌వన్ స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్ను వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. ఖమ్మం కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్సపెక్టర్లు, 14 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్ కలెక్టర్ మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అరుుతే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది. ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు. -
ప్యాకేజీ..నాన్చుడేంది..!
మూడు నెలలుగా ముగియని పారిశుద్ధ్య టెండర్ల ప్రక్రియ నేడు ఖమ్మంలో పరిశీలన, పనులు అప్పగించడంపైనే ఉత్కంఠ ఖమ్మం: టెండర్లు మార్చిలోనే ముగిసినా.. పనులు అప్పగించక, ప్యాకేజీల వ్యవహారం కొలిక్కి రాక.. ఖమ్మం కార్పొరేషన్లో కాంట్రాక్టర్లకు పారిశుద్ధ్య పనులు అప్పగించే వ్యవహారం గందరగోళంగా మారింది. 21 ప్యాకేజీలను ఆరుకు కుదించడం.. కార్మికులకు కాకుండా ఇతర ఫెడరేషన్‌కు బాధ్యతలు ఇచ్చేందుకు మొగ్గు చూపడంపై విమర్శలు తలెత్తాయి. వర్కర్లపై పర్యవేక్షణ కొరవడుతోందని, పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సోమవారం ఖమ్మంలో టెండర్లు పరిశీలించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు 6 ప్యాకేజీలే.. పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు, కార్మికులపై పర్యవేక్షణకు గతంలో 21 ప్యాకేజీలు ఉండగా..ఇప్పుడు 6 ప్యాకేజీలకు కుదించారు. దీనిపై ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 11 ప్యాకేజీలు ఉండేవి. ఖానాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 236మంది కార్మికులు ఉండేవారు. ఖమ్మంలో కాంట్రాక్టర్ల పరిధిలో, ఖానాపురం హవేలీలో ఈఓ పర్యవేక్షించేవారు. శివారులోని 9 గ్రామ పంచాయతీలు విలీనమై 50 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పడ్డాక 21 ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం 580 మంది కార్మికులు ఉన్నారు. ఒక్కో ప్యాకేజీలో 20 నుంచి 50 మంది కార్మికులు ఉన్నప్పుడే పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వచ్చాయి. అలాంటిది 6 ప్యాకేజీలుగా కుదించి టెండర్లు పిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ప్యాకేజీలో వందమంది కార్మికులుంటే ఎలా పర్యవేక్షిస్తారని ఇటీవల ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్మిక సంఘాల గుర్రు.. మూడు ప్యాకేజీలను మహాత్మాగాంధీ టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్)కు అప్పగించేందుకు గతంలో తీర్మానం చేయడంపై కార్మిక సంఘాల నాయకులు గుర్రుగా ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధిక మంది మహిళలే. డ్వాక్రా గ్రూపు సభ్యులే అయినా..పనులు కేటాయించకుండా మహాత్మా గాంధీ ఫెడరేషన్‌కు అప్పగించేందుకు మొగ్గు చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కమిషనర్ తీరు మారాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగారు కూడా. మహిళా సంఘాలకు పనులు అప్పగించడం ద్వారా బాధ్యత కార్పొరేషన్ ఉద్యోగులే చూసుకుంటారని, కేవలం డబ్బులు పంపిణీ చేసేందుకే మహిళా సంఘాల సహకారం ఉంటుందని కార్పొరేషన్ అధికారులు వివరణ ఇస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా డబ్బు పంపిణీ చేయిస్తే..తీసుకున్న రుణాలకు సకాలంలో వాయిదాలు చెల్లించకుంటే జీతాల్లో కోత పడే ప్రమాదముందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వేతనాల చెల్లింపులో సహకరించినందుకు 2శాతం సర్వీస్ చార్జీలు వస్తాయని మెప్మా అధికారులు చెబుతుండగా.. ప్యాకేజీకి నెలకు రూ.8 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పడం..కార్మికుడికి ఒక్కింటికి నెలకు రూ.200 చొప్పున సర్వీస్ చార్జీ ఇవ్వాలని ఫెడరేషన్ నిర్వాహకులు అంటుండడంతో అంతా గందరగోళం నెలకొంది. నేడు టెండర్ల పరిశీలన.. నూతన కాంట్రాక్టర్లకు ప్యాకేజీలను కేటాయించేందుకు సోమవారం కాంట్రాక్టర్లు ఆన్లైన్లో వేసిన టెండర్లను అధికారులు పరిశీలించనున్నారు. ఐదు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పనులకు, మూడు పారిశుద్ధ్య పనుల కోసం కాంట్రాక్టర్ల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అధికారుల ప్రకటనతో పలువురు కాంట్రాక్టర్లు వేసిన టెండర్లను సోమవారం ఓపెన్ చేసి, టెండర్ల పరిశీలన అనంతరం పనులు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఖమ్మం మేయర్ గా పాపాలాల్ ఎన్నిక
హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లను రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందించారు. అయితే మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ కార్పొరేటర్ రామ్మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిక జరిగే వరకు రామ్మూర్తిని టూటౌన్ పీఎస్ నిర్బంధించినట్టు తెలుస్తోంది. మేయర, డిప్యూటీ ఎన్నిక తర్వాతే కార్పొరేటర్ గా రామ్మూర్తి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. కాగా సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ఉంచి ఎన్నిక సమయంలోనే అభ్యర్థలను ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. -
కార్పొరేషన్ పోలింగ్ ప్రశాంతం
గ్రేటర్ వరంగల్‌లో 60.28 శాతం ఖమ్మంలో 67.68 శాతం అచ్చంపేటలో 70.88 శాతం ‘వరంగల్ తూర్పు’లో ఘర్షణలు సాక్షి నెట్వర్క్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట నగర పంచాయతీ పోలింగ్ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో 60.28 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 67.68 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అచ్చం పేట నగర పంచాయతీ పరిధిలో 70.88 శాతం పోలింగ్ జరిగింది. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 6,43,863 మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్లో కొత్తగా విలీనమైన శివారు ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగింది. నగరంలోని 36వ డివి జన్ పరిధిలోని కాజీపేట రైల్వే మిక్స్డ్ హైస్కూల్ పోలింగ్ బూత్ బయట రైల్వే జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోల్ చీటీలు పంచుతుండగా ధర్మసాగర్ ఎస్ఐ దేవేందర్ ఎలాంటి హెచ్చరికలూ చేయకుండా రైల్వే జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలపై లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిని నిరసిస్తూ రైల్వే జేఏసీ నేతలు అరగంట పాటు ధర్నా చేశారు. అలాగే, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ 44వ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. 47వ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ, ఆ పార్టీకి చెందిన ఈవీ సతీశ్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. 40వ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి మారగాని కీర్తి కిరణ్‌గౌడ్ ఓటు గల్లంతైంది. తన డివిజన్లో పరిధిలో తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు చెందిన 65 ఓట్లు గల్లంతయ్యాయంటూ కీర్తి కిరణ్ ఆరోపించారు. 15వ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి శారద భర్త సురేష్ జోషిపై అధికార పార్టీ అభ్యర్థి భర్త సాదిక్ డాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సురేష్‌జోషి చేతికి, ఛాతీలో దెబ్బలు తగిలాయి. 13, 20 డివిజన్లలో బరిలో ఉన్న అధికార పార్టీ రెబెల్ అభ్యర్థులు, అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన అనుచరులు దాడి చేసిన ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 2,65,710 మంది ఓటర్లు ఉండగా.. 1,79,827 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ఉద యం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 3గంటల వరకు 57.54 శాతం పోలింగ్ పూర్తికాగా.. ఆ తర్వాత మందకొడిగా సాగింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో 18,614 మంది ఓటర్లు ఉండగా 13,193 మం ది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ పి.విశ్వప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఖమ్మంలో నకిలీ ఓటరు కార్డులు.. ఖమ్మంలోని 22వ డివిజన్లో భారీగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను టీడీపీ, ైవైఎస్సార్సీపీ నేతలు పట్టుకున్నారు. రోటరీనగర్‌లోని ఓ డీటీపీ సెంటర్ నిర్వాహకుడితో.. ఎన్నికల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఓటరు కార్డులు రూపొందించారు. 1,500కుపైగా కార్డులు తయారు చేశారని, 750 కార్డులు మాత్రం బయటకు వచ్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ పోలింగ్ కేంద్రం సమీపంలోని ఓ టైలర్ షాపులో నకిలీ ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, రూ.2 వేల నగదును ఇస్తుండటాన్ని గమంచిన టీడీపీ అభ్యర్థి బంధువులు వీటిపై ఆరా తీశారు. టైలర్ షాపులో భారీగా ఉన్న గుర్తింపు కార్డులను టీడీపీ నాయకులు పట్టుకోవడంతో.. టీడీపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి పద్మజారెడ్డి, టీడీపీ అభ్యర్థి సరిపుడి సతీష్‌లు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పోసి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నేతలు ఉన్న టైలర్‌షాపు నుంచి తీసుకొచ్చిన 250 నకిలీ ఓట్ల గుర్తింపు కార్డులను మీడియాకు చూపించారు. ఎంపీ పొంగులేటి ఆగ్రహం: నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ నకిలీ వ్యవహారం అధికారులకు తెలిసినా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నకిలీ గుర్తింపు కార్డులతో చాలా మంది ఓటు వేశారని, ఇక్కడ వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశా రు. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఓటర్లుగా చేర్పిం చి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కొత్త ఓటర్లపై విచారణ చేయకుండా అధికారులు ఓటు హక్కు కల్పించారన్నారు. దీనికి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సైతం సహకరించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యలు అక్కడకు చేరుకొని రీపోలింగ్ నిర్వహించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల ఆందోళనతో చాలాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుపై వేసిన నకిలీ గుర్తింపు కార్డులను అక్కడే ఉన్న ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి అసలువా..? నకిలీవా అని గుర్తించేందుకు వాటిని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై స్పష్టత ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఈవీఎంలకు ప్రింటర్లు దేశంలోనే తొలిసారిగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానం చేశారు. 50 డివిజన్లకు గాను 265 పోలింగ్ కేంద్రాలుండగా, 25 కేంద్రాల్లో ప్రింటింగ్ మిషన్లు అనుసంధానం చేశారు. -
ఖమ్మం ఎన్నిక: టీఆర్ఎస్ మూడు జాబితాలు
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ టీఆర్ఎస్ బుధవారం మూడు జాబితాలు విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు 50 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రకటించింది. అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్‌కు టీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసింది. 28 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, టీడీపీ కూడా ఈ రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి. కాగా, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఫిబ్రవరి 22న మొదలైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు. మార్చి 6వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. మార్చి 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: అరాచకపాలన సాగిస్తున్న టీఆర్ఎస్కు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అసత్య ప్రచారాలతో ముందుకొస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాన్ని గమనించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి భవిష్యత్‌లో కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చేలా చూడాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం పెద్దమొత్తంలో నిధులిచ్చిందని, రోడ్ల కోసం రూ.43 వేల కోట్లు, 81వేల డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేసిందని, వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని గుర్తుచేశారు. కాగా, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఖమ్మం పరిశీలకుడిగా ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అచ్చంపేట నగర పంచాయతీ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు. -
మున్సి‘పోల్స్’పై టీఆర్ఎస్ గురి
♦ పార్టీలో మొదలైన ఎన్నికల సందడి ♦ వరంగల్, ఖమ్మంలో మంత్రుల పర్యటనలు ♦ మొదలైన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ♦ వరాల జాబితా తయారీలో నిమగ్నం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి ఆదివారం ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి పెట్టింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన ఆ పార్టీ గ్రేటర్ వరంగల్ ఎన్నికలపైనా అదే విశ్వాసంతో ఉంది. ఈ నెలలోనే ముగిసిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీ గెలుపొందింది. ఇలా వరసగా అన్ని ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్న టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాతో ఉంది. షెడ్యూలు విడుదల కంటే ముందు నుంచే ఈ ఎన్నికలపై హోంవర్క్ చేసిన అధికార పార్టీ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధిపై స్పష్టత ఇచ్చింది. మంత్రులూ ఈ రెండు నగరాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. ఇప్పటికే విపక్షాలు సైతం ఎన్నికలకు సిద్ధం అవుతుండటం, కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జులను కూడా నియమించుకోవడంతో టీఆర్ఎస్లోనూ ఎన్నికల వేడి మొదలైందని అంటున్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తున్నందున ఈ ఎన్నికల్లోనూ అవలీలగా విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంతోపాటు, వరంగల్, ఖమ్మం నగరాల్లో ప్రత్యేకంగా చేపట్టే పనుల గురించి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. నగర ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. వాస్తవానికి వరంగల్లోనూ కేసీఆర్ పర్యటించాల్సి ఉన్నా, అది వాయిదా పడింది. వరంగల్‌లో ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామావు పర్యటించగా, ఆ జిల్లాల మంత్రులే కాకుండా సీనియర్ మంత్రుల పర్యటనలూ మొదలయ్యాయి. పనిలోపనిగా ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార పార్టీ కొనసాగిస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వ లసలూ మొదలయ్యాయి. వరంగల్ నగర టీడీపీ అధ్యక్షుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు కూడా గులాబీ గూటికి చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అమలు చేసిన చేరికల వ్యూహాన్నే ఇక్కడా సైతం మొదలుపెట్టినట్లు తాజా చేరికలు రుజువు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెండు నగరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితరాలను ప్రచారాంశాలుగా ఎంచుకుంది. మరోవైపు రెండు కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన వరాల జాబితాను రూపొందిస్తున్నారని చెబుతున్నారు. -
కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు
ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్‌లకు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించిన సీఎం.. అధికారులతో సమీక్ష సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు ఒక్కోదానికి బడ్జెట్లో ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ.5.70 కోట్లు, వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో రూ.3.50 కోట్ల ఆస్తి పన్ను పెనాల్టీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల పర్యటన కోసం సోమవారం ఖమ్మం వచ్చిన సీఎం.. నగరంలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం అధికారులతో జిల్లా పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని, భక్త రామదాసు ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేశామని వివరించారు. వచ్చే జూన్, జూలై నాటికి పనులు పూర్తి చేసి ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో 60 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. భద్రాచల సీతారాముడి ఆశీస్సులతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేసి 5 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. గతంలో చేపట్టిన రుద్రమకోట ఏపీలోకి వెళ్లడంతో సీతారామ ప్రాజెక్టు చేపట్టామని, దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారుస్తామన్నారు. కృష్ణా, దాని ఉప నదులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 200లకు పైగా ప్రాజెక్టులు నిర్మించారని, దీనివల్ల నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ప్రమాదం ఉందని, నాలుగేళ్ల వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వర్షాలు పడి అక్కడి ప్రాజెక్టులు నిండితేనే ఇక్కడికి నీరు వస్తుందన్నారు. ఈ ఉద్దేశంతోనే గోదావరి నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాణహిత, ఇంద్రావతి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం జిల్లాకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద 350 రోజులు 5వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉంటుందని, ఈ నీటితో ఎన్నెస్పీ ఆయకట్టుకు కూడా నీటిని అందించేలా డిజైన్ చేశామన్నారు. భద్రాచలం డివిజన్ నుంచి ఏపీలో కలిసిన నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని సీఎం తెలిపారు. రానున్న బడ్జెట్ నాటికి ఈ పంచాయతీలు తెలంగాణలోకి వస్తాయన్నారు. భద్రాచ లం పుణ్యక్షేత్రాన్ని వేములవాడ, యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. భద్రాచలంకు చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి క్షేత్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదనంగా 3 వేల డబుల్ బెడ్రూమ్లు... ఖమ్మంకు ఇప్పటికే 2 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశామని, ఈ బడ్జెట్లో మరో 3 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ ఇళ్లన్నీ నిర్మిస్తామన్నారు. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉన్నాయని, వీటన్నింటినీ ఒకేచోటకు తెచ్చేలా సమీకృత కార్యాలయాలను నిర్మిస్తామని వివరించారు. ఎన్నెస్పీలోని 39 ఎకరాల్లో ఈ కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. ఖమ్మంలో కూరగాయల మార్కెట్, మాంసపు మార్కెట్ల కోసం 73 ఎకరాల్లో 6 మార్కెట్లను మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయానికి కూడా కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. లకారం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దేందుకు అదనపు నిధులిస్తామని, వెలుగుమట్ల ఫారెస్ట్ బ్లాక్‌ను హైదరాబాద్ కేబీఆర్ పార్కులా తీర్చిదిద్దుతామన్నారు. ఖమ్మం చుట్టూ రింగురోడ్డు నిర్మిస్తామని చెప్పారు. మిషన్ భగీరథను పూర్తిచేసి డిసెంబర్ నాటికి ఖమ్మంలో మంచినీటి సమస్య ఉండకుండా చూస్తామన్నారు. హైదరాబాద్, వరంగల్ తరహాలో ఖమ్మం కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. స్థలం చూస్తే ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే ఖమ్మం ప్రెస్‌క్లబ్‌కు ఎకరం స్థలం కేటాయిస్తామని, అందుకు స్థలం చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ లేదా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. జిల్లాల పునర్విభజన తర్వాత వర్సిటీ ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 153 అవుతాయన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో హమాలీలు, గ్రానైట్ కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని, అందులో వీరికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడున్న షాదీఖానా బాగాలేదని ముస్లింలు తన దృష్టికి తెచ్చారని, రూ.2 కోట్లతో మరో షాదీఖానా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని కూడా ఆధునీకరిస్తామన్నారు. -
‘గులాబీ’ గాలం
టీఆర్ఎస్ గాలం విసిరింది. ఆపరేషన్ ‘ఆకర్ష్’ మొదలుపెట్టింది. ఈసారి ఖమ్మం కార్పొరేషనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ‘హస్తం’నేతలను ఆకట్టుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అనుకున్నట్టుగానే కొందరు మాజీ కౌన్సిలర్లను గులాబీ గూటికి లాగుతోంది. ‘శీలంశెట్టి’ నుంచి మొదలైన ఈ ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్తుందో... మంత్రి తుమ్మల రాజకీయ చాణక్యం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.. - కార్పొరేషన్ దక్కించుకోవడమే లక్ష్యం! - పావులు కదుపుతున్న మంత్రి తుమ్మల - టీఆర్ఎస్ గూటికి మాజీ కౌన్సిలర్లు - పార్టీ తీరుతోనే ఫిరారుుంపులట! సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌ను దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నగరంలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ బలోపేతం దిశగా ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లను తనవైపు ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మాజీ కౌన్సిలర్, డీసీసీ ఉపాధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రంను గురువారం గులాబీ గూటికి చేర్చుకుంది. ఆయనతోపాటు మరికొందరు ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు గులాబీ బాట పట్టనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు, ప్రజాప్రతినిధుల విధానాలు నచ్చకనే బయటకు వెళ్తున్నట్లు పార్టీ ఫిరారుుస్తున్న నేతలు చెబుతుండటం చర్చనీయూంశంగా మారింది. త్వరలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అధికార పార్టీ హోదాలో ఉండి.. పార్టీ పరంగా బలం లేకున్నా ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో జెండా ఎగురవేయాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం మినహా జిల్లాలో ఎక్కడా టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. పైకి నేతలే పార్టీలో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కేడర్ లేకపోవడంతో అప్పట్లో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతాయని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బలం లేని ఖమ్మం నగరంలో బలోపేతంపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న నేతలు కార్పొరేషన్ బరిలో నిలిచేందుకు సరిపోరన్న ఉద్దేశంతో ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లు, నేతలకు ఎరవేసేందుకు సిద్ధమయ్యూరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ చతికిలపడింది. అధికారంలో ఉండి కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటకపోతే నేతలుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్న తమ ప్రతిష్ట గంగలో కలుస్తుందన్న భావనతో ఆ పార్టీ ఈ తతంగానికి తెరతీసింది. దీని దృష్ట్యానే కాంగ్రెస్ పార్టీ నుంచి పలుమార్లు కౌన్సిలర్లుగా విజయం సాధించి, డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న శీలంశెట్టి వీరభద్రంను గులాబీ గూటికి చేర్చడంలో సఫలమైంది. ఆయనతోపాటు మాజీ కౌన్సిలర్లు గుంటి మల్లయ్య, గాదె భాస్కర్, బెడదం సత్యనారాయణ, గుంటి అరుణ, నేతలు తేజావత్ శ్రీను, ఆర్. రాము, కుమ్మరి గురుమూర్తి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాజధానిలోని తెలంగాణ భవన్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో నేతల తీరు నచ్చక.. భవిష్యత్‌పై ఆందోళనతోనే సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడినట్లు సమాచారం. ఒంటెత్తు పోకడలతో తొలి నుంచి జెండా మోసిన వారికి పదవులు దక్కకుండా ఇటీవల వచ్చిన వారికే పీట వేస్తున్నారన్న ఆగ్రహంతో సదరు నేతలు కాంగ్రెస్‌పార్టీకి దూరమైనట్లు చర్చ జరుగుతోంది. దారికి రాకుంటే నయానో..భయానో.. పదవులు, నజరానాలు ఆశ చూపుతూ మరికొందరు మాజీ కౌన్సిలర్లు, వార్డుల్లో బలంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దారికి రాని వారికి నయానో..భయానో నచ్చచెప్పి తమ దారికి తెచ్చుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి త్వరలో ఖమ్మం నగరంలో పర్యటించనున్నట్టు సంకేతాల నేపథ్యంలో ఆయన సమక్షంలోనే జిల్లాకేంద్రంలో కొంతమంది మాజీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చాలన్న దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నేతలు మాత్రం తమను కాదని ఇప్పటికే ఇటీవల వచ్చిన వారిని భుజానికెత్తుకోవడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు దక్కకున్నా కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా కార్పొరేటర్‌గా బరిలో దిగుదామనుకుంటున్న వారి ఆశలు కొత్త నేతల రాకతో అడియాసలు అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాత నేతలంతా కార్పొరేషన్ ఎన్నికల సమయానికి తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. ఉద్యమ జెండాను మోయకుండా ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరుతున్న వారికి పదవులు, ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్‌లో కలవరం ఇప్పటి వరకు టీడీపీపై కన్నేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లకు వల వేయడంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. నగరంలో పరిస్థితి చేయి దాటిపోతే కార్పొరేషన్ గోల్ కొట్టడం సాధ్యం కాదని పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఓ వైపు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ కౌన్సిలర్లు, నేతలను గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ డీసీసీ కార్యాలయానికి పిలిపించుకుని వారితో మంతనాలు జరిపారు. పార్టీని వీడవద్దని, రానున్న ఎన్నికల్లో మనదే పై చేయి అవుతుందని వారికి హితబోధ చేశారు. అయితే మరికొందరు కౌన్సిలర్లు, నేతలు కూడా గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ఎస్ నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నారన్న సమాచారంతోనే ఎమ్మెల్యేలు ఈ చర్చకు దిగారు. అయినా ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ‘చేయి’ ఇస్తారోనని, కార్పొరేషన్ బరిలో నిలవడం ఎలా అన్న హైరానాలో ఆ పార్టీ నేతలున్నారు. -
పన్నుభారం
ఖమ్మం: మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలోభాగంగా పురవాసులకు వాత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆస్తి పన్ను పెంచితే ఖజానా గలగలలాడుతుందనే ఉద్దేశంతో భారం వేసేందుకు యత్నిస్తోంది. ఇదే జరిగితే తొలుత ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి, కార్పొరేషన్ పరిధిలో అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. నిధుల లేమితో కార్పొరేషన్‌కు వచ్చే ఆస్తి, ఇతర పన్నులతోనే పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రభుత్వం తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న సాకుతో ఆస్తి పన్ను పెంచేందుకు సమాయత్తమవుతుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సౌకర్యాలు కల్పించకుండా పన్ను పెంచితే ఏలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తప్పకుండా ఆస్తి పన్ను పెంచాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్తుండటం గమనార్హం. ఖమ్మం వాసులకు భారమే గ్రామ పంచాయతీలతో కలిపి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 వేల వరకు నివాసిత ప్రాంతాలు ఉంటాయి. ఇందులో 10 వేలకు పైగా నాన్ రెసిడెన్షియల్ పరిధిలోకి వస్తాయి. ఏడాదికి రూ.12.36 కోట్ల మేరకు ఆస్తి పన్ను రూపంలో కార్పొరేషన్‌కు ఆదాయం రావాలి. కానీ వాణిజ్య కేటగిరీకి సంబంధించి మొండి బకాయిలు ఉండడంతో ఏటా 50 శాతం పన్నుల వసూలు మించడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాలను ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్న అధికారులు.. వాణిజ్య, ఇతర సంపన్నవర్గాల నుంచి గృహ పన్నులను వసూలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పన్ను పెంచడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలకే ఇబ్బంది కలుగుతుంది. ఖమ్మం కార్పొరేషన్ లో ఒకటో జోన్లో నివాస వసతికి పక్కా భవనానికి చ.మీటర్‌కు ఏడాదికి రూ.19, సాధారణ భవనానికి రూ.16, పలకల కప్పుకు రూ. 11, పెంకు ఇల్లుకు రూ. 8, గడిసెకు రూ. 3 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వార్షిక అద్దె విలువ (వీఆర్వీ)ను ప్రామాణికంగా తీసుకొని కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని భవనాలు, ఖాళీ స్థలాల ఆస్తి పన్నుల గణన జరుపుతారు. ఏప్రిల్ 1 నుంచి నగర పంచాయతీల్లో.. సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి పెంచిన ఆస్తి పన్ను అమల్లోకి రానుంది. సత్తుపల్లి నగర పంచాయతీలో నివాస, వాణజ్య, వ్యాపార గృహాలు, సముదాయాలు 8 వేలు, మధిరలో 5 వేల వరకు ఉన్నాయి. వీటికి కూడా చదరపు మీటర్ చొప్పున ఆస్తి పన్ను పెంచి వసూలు చేస్తారు. ఇప్పటికే ఈ పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో శివారు కాలనీల్లో ఏటా మంచినీటి ఎద్దడి నెలకొంటోంది. ఆస్తి పన్ను పెంచి వసూలుకు దిగితే ఆధికారులు, సిబ్బంది జనాగ్రహం చవిచూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడంతో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహాల సంఖ్యను మళ్లీ గణన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులను త్వరలో ఆదేశించనున్నట్లు సమాచారం. ఈ గణన పూర్తి అయిన తర్వాత పాత మున్సిపాలిటీల్లోనూ పన్ను పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. -
పన్నుభారం
* ఖమ్మం కార్పొరేషన్ వాసులపై ఇక ట్యాక్స్ మోత * సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు కూడా * త్వరలో ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు * ఆదాయం కోసమే అంటున్న సర్కారు సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలోభాగంగా పురవాసులకు వాత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆస్తి పన్ను పెంచితే ఖజానా గలగలలాడుతుందనే ఉద్దేశంతో భారం వేసేందుకు యత్నిస్తోంది. ఇదే జరిగితే తొలుత ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి, కార్పొరేషన్ పరిధిలో అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సరిగా నిధులు రాకపోవడంతో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు, జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌గా హోదా పెరిగి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు శివారు కాలనీల్లో మాత్రం సీసీరోడ్లు, డ్రైనేజీలతో పాటు మంచినీటి సరఫరా లేదు. ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారు తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. నిధుల లేమితో కార్పొరేషన్‌కు వచ్చే ఆస్తి, ఇతర పన్నులతోనే పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రభుత్వం తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న సాకుతో ఆస్తి పన్ను పెంచేందుకు సమాయత్తమవుతుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సౌకర్యాలు కల్పించకుండా పన్ను పెంచితే ఏలా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నగర పంచాయతీగా ఏర్పడిన మధిరలోనూ అభివృద్ధి పనులకు నిధుల లేమితో మోక్షం లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దండిగా విడుదల చేస్తే పన్ను పెంచాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇవేవీ చేయకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తప్పకుండా ఆస్తి పన్ను పెంచాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్తుండటం గమనార్హం. ఖమ్మం వాసులకు భారమే వీలిన గ్రామ పంచాయతీలతో కలిపి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 వేల వరకు నివాసిత ప్రాంతాలు ఉంటాయి. ఇందులో 10 వేలకు పైగా నాన్ రెసిడెన్షియల్ పరిధిలోకి వస్తాయి. కార్పొరేషన్‌ను నాలుగు జోన్లుగా విభజించి ఇప్పటి వరకు పన్ను వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.12.36 కోట్ల మేరకు ఆస్తి పన్ను రూపంలో కార్పొరేషన్‌కు ఆదాయం రావాలి. కానీ వాణిజ్య కేటగిరీకి సంబంధించి మొండి బకాయిలు ఉండడంతో ఏటా 50 శాతం పన్నుల వసూలు మించడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాలను ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్న అధికారులు.. వాణిజ్య, ఇతర సంపన్నవర్గాల నుంచి గృహ పన్నులను వసూలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనివల్లే బకాయిలు భారీగా పెరుకుపోతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం పన్ను పెంచడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలకే ఇబ్బంది కలుగుతుంది. పన్ను వసూలుకు నివాస, వాణిజ్య, వ్యాపార సముదాయాలను 10 వినియోగ కేటగిరీలుగా విభజించారు. దీని ప్రకారం ఆస్తి పన్ను వసూలు ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్లో ఒకటో జోన్లో నివాస వసతికి పక్కా భవనానికి చ.మీటర్‌కు ఏడాదికి రూ.19, సాధారణ భవనానికి రూ.16, పలకల కప్పుకు రూ. 11, పెంకు ఇల్లుకు రూ. 8, గడిసెకు రూ. 3 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వార్షిక అద్దె విలువ (వీఆర్వీ)ను ప్రామాణికంగా తీసుకొని కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని భవనాలు, ఖాళీ స్థలాల ఆస్తి పన్నుల గణన జరుపుతారు. ఏప్రిల్ 1 నుంచి నగర పంచాయతీల్లో.. సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి పెంచిన ఆస్తి పన్ను అమల్లోకి రానుంది. సత్తుపల్లి నగర పంచాయతీలో నివాస, వాణజ్య, వ్యాపార గృహాలు, సముదాయాలు 8 వేలు, మధిరలో 5 వేల వరకు ఉన్నాయి. వీటికి కూడా చదరపు మీటర్ చొప్పున ఆస్తి పన్ను పెంచి వసూలు చేస్తారు. ఇప్పటికే ఈ పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో శివారు కాలనీల్లో ఏటా మంచినీటి ఎద్దడి నెలకొంటోంది. ఆస్తి పన్ను పెంచి వసూలుకు దిగితే ఆధికారులు, సిబ్బంది జనాగ్రహం చవిచూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడంతో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహాల సంఖ్యను మళ్లీ గణన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులను త్వరలో ఆదేశించనున్నట్లు సమాచారం. ఈ గణన పూర్తి అయిన తర్వాత పాత మున్సిపాలిటీల్లోనూ పన్ను పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. -
పారిశుధ్య కార్మికుల బతుకులు మాత్రం..
సాక్షి, ఖమ్మం: పట్టణాల్లో కంపునంతా ఎత్తిపారేస్తున్నా పారిశుధ్య కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు. అత్తెసరు వేతనం..అందులోనూ కోత. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు ఎప్పుడోకాని ఇవ్వరు. కనీసం చీపుర్లు కూడా సరిగా ఉండవు. చలికి వణుకుతూ విధులు నిర్వహించక తప్పని పరిస్థితి. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లోనూ కాంట్రాక్టు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికులను దండుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ ప్రాంతాల్లో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన కార్మికుల దుర్భర స్థితిగతులు... జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలున్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్ పారిశుధ్య కార్మికులను మినహాయిస్తే కాంట్రాక్టు కార్మికులు 1,152 మంది పని చేస్తున్నారు. మున్సిపాలిటీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కార్మికులను పారిశుధ్య పనుల కు పంపిస్తారు. మున్సిపల్‌శాఖ నిబంధనల ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లే వేతనాలు చెల్లించాలి. కానీ కాంట్రాక్టు నిబంధనలు వీరు బేఖాతర్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5 గంటలకు, మరికొన్నిచోట్ల రాత్రి వేళ్లల్లో కార్మికులు పట్టణ వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ట్రాక్టర్లలోకి ఎత్తి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు మున్సిపాలిటీల్లో కొన్నేళ్లుగా కార్మికులకు యూనిఫాం, గ్లౌజులు, నూనె, సబ్బులు, ఇవ్వడం లేదు. కనీసం చీపుర్లు కూడా సక్రమంగా ఉండటం లేదు. చలితో వణుకుతున్నా కాంట్రాక్టర్లు కార్మికుల గోడు పట్టించుకోవడం లేదు. చెత్తను తీయకుంటే అధికారులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని.. తమ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థాయి లభించినా కార్మికులకు మాత్రం ఆస్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదు. కార్పొరేషన్లో మొత్తం 569 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరికి ఈ ఏడాది యూనిఫాం అందజేయలేదు. చలికి వణుకుతూనే తెల్లవారుజామున నగరాన్ని శుభ్రపరుస్తున్నారు. కార్పొరేషన్ స్థాయిలో ఇంకా ఖమ్మం నగరాన్ని శుభ్రం చేయాలంటే సుమారు 300 మంది కార్మికుల అవసరం. కానీ భారం అంతా ఉన్న కార్మికుల పైనే పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులూ సమస్యలతోనే సావాసం చేస్తున్నారు. వీరికి యూనిఫాం అందలేదు. కొంతమంది అధికారుల ఇళ్లలోనూ వీరితో పనిచేయించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల హవా మున్సిపాలిటీల్లో పారిశుధ్య టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల చేయి తడుపుతూ కార్మికులకు శ్రమ, సౌకర్యాలను దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నెల వేతనాలు ఎప్పుడో ఒకసారి ఇస్తుండడం.. అందులోనూ ప్రతి నెల వేతనంలో ఎంతోకొంత కోత పెడుతున్నారు. ఇదేమని కార్మికులు ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ కాంట్రాక్టర్లు బెదిరిస్తూ మరీ పొట్ట కొడుతున్నారు. పెద్ద డ్రైనేజీల్లో మురుగు నీరు నిల్వకుండా చేయడం కార్మికులకు ఇబ్బందిగా మారింది. దీన్ని తొలగించడానికి కావాల్సిన పరికరాలను మున్సిపాలిటీలు కూడా సమకూర్చకపోవడంతో చేతులతోనే తీసివేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్‌ల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నా అధికారులు నోరు మెదపడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై వీటిని మింగేస్తున్నట్లు సమాచారం. పీఎఫ్‌ను కార్మికులకు నెల మొత్తం చెల్లించాల్సి ఉన్న కేవలం 15 రోజులు మాత్రమే చెల్లిస్తూ మిగిలింది స్వాహా చేస్తున్నారని తెలిసింది. స్థాయితో పాటు సమస్యలూ పెరిగాయి... ఖమ్మం కార్పొరేషన్ స్థాయికి చేరిన కాంట్రాక్టు కార్మికుల వేతలు మాత్రం తొలగటం లేదు. కాంట్రాక్టు కార్మికులకు సౌకర్యాల కల్పన అటుంచితే కార్పొరేషన్ అధికారులు కనీసం వారికి చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. అరిగిపోయిన చీపుర్లతో చెత్త ఉడుస్తుండటంతో నడుం నొప్పిపెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది విలీన గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్‌గా మారి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ కార్మికుల సంఖ్యలో ఎలాంటి మార్పులేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఈ మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా కార్మికులకు యూనిఫాం ఇవ్వడం లేదు. మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల హోదా పెరిగినా ఇక్కడ కూడా గతంలో ఉన్న కార్మికులే పారిశుధ్య పనులు చేస్తున్నారు. మధిరలో రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో సంక్రాంతి వరకైనా చెల్లిస్తారో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ మూడు నెలలుగా కార్మికులు వేతనాలు ఇవ్వడం లేదు. బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు పడగానే ఇచ్చే విధంగా ముందుగానే ఏటీఎం కార్డులను కిరాణాషాపుల్లో తాకట్టు పెట్టి మరీ సరుకులు తెచ్చుకుంటున్నామని కార్మికులు వాపోతున్నారు. -
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్లో ఖరీదైన వక్ఫ్ బోర్డ్ భూముల్లో రాజకీయ నేతలు పాగా వేశారు. పేద ముస్లింలకు చెందాల్సిన స్థలాలను కబ్జా చేశారు. ఆక్రమణలు నిజమేనంటూ రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చినా నివేదికపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సాహసం చేయడం లేదు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో రూ.1200 కోట్ల విలువైన భూములున్నాయి. ఖమ్మం ఖిల్లా బజార్‌లోని బాదెషాహి అషూర్ ఖానా, రోటరీనగర్‌లోని తాలీమస్తాన్ రహమతుల్లా అలై దర్గాలకు చెందిన ఈ భూములు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నట్లు ప్రభుత్వ రాజపత్రం ద్వారా వెల్లడవుతోంది. అయితే సదరు స్థలాలు కాగితాల్లో మాత్రమే వక్ఫ్ భూములుగా కనిపిస్తుండగా, ఖరీదైన ఈ భూముల్లో పలువురు రాజకీయ నేతలు పాగా వేశారు. అషూర్ఖానాకు చెందిన దాదాపు 86 ఎకరాల భూమిలో 71 ఎకరాలు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో ఉంది. ఎకరం కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఈ భూములపై ఖమ్మానికి చెందిన పలువురు ప్రముఖుల కన్నుపడింది. క్రమంగా రికార్డులను తారుమారు చేస్తూ కబ్జాదారులు వక్ఫ్ భూముల్లో కాలుమోపారు. మరికొందరు 99 సంవత్సరాల లీజు పేరుతో సంస్థలను ఏర్పాటు చేశారు. సదరు భూమిలో ఆక్రమణకు పాల్పడిన వారిలో జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత కూడా ఉన్నారని మైనార్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే భూమిలో సదరు నేత తన సొంత కంపెనీ పేరుతో పలు నిర్మాణాలు కూడా చేసి వాటిని విక్రయించినట్లు గతంలో ఫిర్యాదులు సైతం దాఖలయ్యాయి. వక్ఫ్ బోర్డు భూముల్లో జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ దందాను గమనించిన మైనార్టీ సంఘాలు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై విచారణ చేయాలని రెండు సంవత్సరాల కిందట అప్పటి ట్రైనీ ఐఏఎస్ అధికారి, అసిస్టెంట్ కలెక్టర్ హరినారాయణను నియమించారు. ఆయన విచారణ నిర్వహించి టీడీపీ నేత చేసిన కబ్జా వాస్తవమేనంటూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అయితే నివేదిక సమర్పించి రెండేళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం సదరు ఆక్రమణలపై కనీస విచారణకు కూడా సిద్ధపడకపోవడం గమనార్హం.ఖమ్మంలోని రోటరీనగర్‌లో సైతం దర్గాకు చెందిన దాదాపు 8 ఎకరాల భూమి పలువురి ఆధీనంలో ఉన్నట్లు వక్ఫ్ అధికారులు అంగీకరిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉండటం విశేషం. సదరు భూముల ఆక్రమణల్లో ఖమ్మానికి చెందిన కాంగ్రెస్ నేత కూడా ప్రముఖంగా ఉండటంతో వక్ఫ్ అధికారులు చర్యలు తీసుకునేందుకు అప్పట్లో వెనుకాడారు. ఈ భూముల ఆక్రమణల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు సైతం ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే విషయంలో జిల్లా యంత్రాంగం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండటం కబ్జాదారుల పలుకుబడిని స్పష్టం చేస్తోంది. మైనార్టీలకు అండగా నిలుస్తున్నామని చెప్పుకుంటున్న రాజకీయ నేతలే వక్ఫ్ బోర్డు స్థలాలను మింగేస్తున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. రక్షిత భూముల విషయంలో న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. కోట్ల విలువైన వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని, దీనిపై తమ ఆవేదనను అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికారులు గుర్తించడం లేదని ముస్లిం మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం డివిజన్‌లోనే ఆక్రమణలు ఎక్కువ... జిల్లా వ్యాప్తంగా మొత్తం 714.04 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా, 344.05 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. వక్ఫ్పరిరక్షణలో 370 ఎకరాలు ఉన్నాయి. ఖమ్మం డివిజన్లో 170.28 ఎకరాలు ఉండగా, అందులో 122.11 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. కొణిజర్ల మండలం పరిధిలో 48.24 ఎకరాలకు 38.08 ఎకరాలు, సింగరేణి మండల పరిధిలో 0.37 ఉండగా మొత్తం ఆక్రమణకు గురయ్యాయి. మధిర మండల పరిధిలో 219.23 ఎకరాలు ఉండగా 22.09 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఇవి కాక చింతకాని మండల పరిధిలో 32.03 ఎకరాలు, ముదిగొండ మండలంలో 0.21, నేలకొండపల్లి మండలంలో 3.01, బోనకల్ మండలంలో 3.31, ఎర్రుపాలెంలో 26.38, తిరుమలాయపాలెం మండల పరిధిలో 8.08, బయ్యారం మండలంలో 5.20, బూర్గంపహాడ్‌లో 20.36, అశ్వాపురంలో 4.37, కుక్కునూరులో 0.20, వేంసూరులో 49.05, కల్లూరు మండలంలో 16.24, గార్లలో 33.22, గుండాల 2.32, తల్లాడలో 8.07, జూలూరుపాడులో 14.00, పాల్వంచలో 51.23, ఏన్కూర్‌లో 8.15, వైరా మండలంలో 0.09 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. -
ఖమ్మం స్మార్ట్ సిటీకి పొంగులేటి కృషి
సాక్షి, ఖమ్మం: స్మార్ట్ సిటీ జాబితాలో ఖమ్మం కార్పొరేషన్‌కు చోటు కోసం ఎంపీ, వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని పొంగులేటి కలిశారని అన్నారు. వారు బుధవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ సిటీకి కావాల్సిన అర్హతలన్నీ ఖమ్మం నగరానికి ఉన్నాయన్నారు. ఈ విషయూన్ని ఎంపీ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. దోమల స్వైర విహారం, చెత్తచెదారంతో నగరం కంపు కొడుతోందన్నారు. కార్పొరేషన్‌గా హోదా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు కనీస వసతులు అందడం లేదని అన్నారు. నగరం త్వరగా అభివృద్ధి కావాలన్నా, కిందిస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలన్నా కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాల్సిన అవసరముందని అన్నారు. కార్పొరేషన్‌కు ఏటా 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ.. వసతుల కల్పనలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీకి ట్యాంక్ నిర్మాణం కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రామన్నపేట వద్ద భూసేకరణ జరిగిందన్నారు. ఆ తరువాత ప్రతి వేసవిలో నగర ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్నా సమ్మర్ స్టోరేజి ట్యాంకు ప్రతిపాదనను మాత్రం అధికారులు మూలన పడేశారని విమర్శించారు. రానున్న వేసవిలో దాహార్తి ఏర్పడకుండా ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే వైఎస్ఆర్ సీపీ ఉద్యమిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర విభాగం అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జిల్లా నాయకురాలు షర్మిలా సంపత్ పాల్గొన్నారు. -
మున్సి‘పల్టీలు’
సాక్షి, ఖమ్మం: పన్నుల వసూళ్లు లేక.. ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు రాక మున్సిపాలిటీలను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. నాలుగేళ్లలో మున్సిపాలిటీలు, ఆర్నెల్లలో ఖమ్మం కార్పొరేషన్ బకాయిలు మొత్తం రూ.15.62 కోట్ల మేర పేరుకుపోయాయి. ఇటీవల ప్రభుత్వం బకాయిలు వసూలు చేయని మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలకు ఆస్తి, నీటి కుళాయి పన్ను, ఆస్తి యాజమాన్యంపై పేరు మార్పిడి, భవన నిర్మాణ అనుమతులు, ప్లాట్ల లే అవుట్స్, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు, ట్రేడ్ లెసైన్స్‌లు.. తదితర వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. వీటితోనే పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు ఇవి ఆశించిన స్థాయిలో వస్తే ఏటా మున్సిపాలిటీల్లో పనులు వేగంగా జరుగుతాయి. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధులు ఆశించినస్థాయిలో రాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వసూలు చేస్తున్న పన్నులు, వచ్చే ఆదాయం అంతా వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కార్యాలయాల నిర్వహణకే సరిపోతుంది. నాలుగేళ్లలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో రూ.11.62 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ ఆర్నెల్లలోనే రూ.4 కోట్ల మేర పన్నుల వసూలు పెండింగ్‌లో ఉంది. వసూళ్లలో సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రతి ఆర్నెల్లకోసారి మున్సిపల్ సిబ్బంది భవన యజమానుల నుంచి పన్నులు వసూలు చేయాలి. కానీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడం లేదు. బకాయిపడిన వారికి మున్సిపాలిటీల నుంచి ముందస్తు నోటీసులు ఇవ్వాలి. ఇంటి యజమానుల బకాయిలు భారీగా పేరుకపోయినా అధికారులు మాత్రం నోటీసులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీలో నాలుగేళ్ల పాటు పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో దీని ప్రభావం పన్నుల వసూళ్లపై పడింది. బకాయిలు పడిన యాజమానులు.. సిబ్బంది, కొంతమంది అధికారుల చేయి తడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనివల్లే భారీగా బకాయి పడిన యాజమాన్యాలపై సిబ్బంది కన్నెత్తి చూడడం లేదంటున్నారు. ఇటీవల ప్రభుత్వం బకాయిలపై కన్నెర్రజేసింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా.. ఏ మున్సిపాలిటీలోనూ పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించకపోవడం గమనార్హం. అత్యధికంగా కొత్తగూడెం మున్సిపాలిటీలోనే రూ.7.76 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఖమ్మం కార్పొరేషన్ విషయానికొస్తే ఆర్నెల్లలో రూ.7 కోట్లకు గాను రూ.3 కోట్లు వసూలు చేశారు. గత నాలుగేళ్లలో కార్పొరేషన్ పరిధిలో రూ.కోట్లలో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కొన్నేళ్లుగా పన్నుల చెల్లింపు లేకపోవడంతో ఈ బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. -
‘స్మార్ట్’ ఖమ్మంపై ఆశలు
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ సిటీల జాబితాలో ఖమ్మానికి చోటుదక్కాలని నగర ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రూ.కోట్ల నిధులతో నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర తీసుకుంటున్న ఈ కార్యక్రమంలో ఖమ్మంకు అవకాశం వస్తే నగర రూపు రేఖలే మారనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంను కూడా స్మార్ట్ సిటీల జాబితాలోకి చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ప్రకటించడంతో నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మంఅర్బన్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విలీనం చేయడంతో 2012లో ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడింది. మూడు లక్షల పై చిలుకు జనాభాతో 50 డివిజన్లను చేశారు. అయితే కార్పొరేషన్ హోదా పెరిగినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఖమ్మానికి నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. నిత్యం పెరగుతున్న జనాభాకు తగిన మంచినీటి సరఫరా లేక, డ్రైనేజీ వ్యవస్థ అస్తవస్థంగా ఉంది. రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోతున్నారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు కూడా తక్కువే. కార్పొరేషన్ స్థాయిలో వసతులు లేకపోవడంతో ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ చందంగా నగరం పరిస్థితి తయారైంది. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చితే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనుంది. ఈ ఉద్దేశంతో ఈ జాబితాలో నగరాన్ని చేర్చాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. * ప్రస్తుతం నగరంలో 71 మురికివాడల్లో 66, 918 మంది జనాభా ఉన్నారు. వీరిలో 15 వేల మందికి కూడా మంచినీటి సరఫరా కావడం లేదు. 42 కుటుంబాలు ఉన్నా కేవ లం 24,500 ఇళ్లకే మంచినీటి కనెక్షన్లు ఉన్నా యి. నగర శివారు ప్రాంతాల వాసుల కు ఇప్పటికీ మంచినీటి సమస్య తప్పడం లేదు. * నగరం కార్పొరేషన్ అయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం లేదు. చిన్నపాటి వర్షానికే మామిళ్లగూడెం, బస్టాండ్ సెంటర్, కస్పాబజార్, మార్కెట్ ప్రాంతం చెరువులను తల పిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ప్రస్తుతం 397 కి.మీ మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మురుగు నీరంతా నగరం నుంచి పంపించాలంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థే శరణ్యం. * నగరం నిత్యం రద్దీ కేంద్రంగా మారింది. ఇటు హైదరాబాద్, అటు విజయవాడ, వరంగల్ వెళ్లేందుకు సెంటర్‌గా ఉండటంతో నిత్యం ప్రయాణీకుల ప్రాంగణంగా నగరం మారింది. దీనికితోడు వాహనాల సంఖ్య పెరగడం.. రోడ్ల విస్తరణ లేకపోవడంతో నగరం అంతా ఎక్కడ చూసినా ట్రాఫిక్. * ఇక నగర వాసులకు ఆహ్లాదం అందనిద్రాక్షే. ఆహ్లాదాన్ని పంచే పార్కులు వెళ్లమీద లెక్కబెట్టవచ్చు. గ్రీన్ బెల్టు స్థలాలు అన్యాక్రాంతం కావడంతో కాలుష్య కోరల్లోకి నగరం వెళ్లుతోంది. స్మార్ట్ సిటీ అయితే ఇలా.. * కేంద్రం నుంచి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరువుతాయి. * అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ జరిగి నగరం సుందరీకరణ సాధ్యమవుతుంది. * సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడళ్లలో విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. * అర్హులైన నగర వాసులందరికీ ఇళ్ల స్థలాలు రానున్నాయి. * మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటి సరఫరా కానుంది. * నగరంలో నివసించే పౌరులందరికీ నగర పాలక సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో సేవలు అందించడం స్మార్ట్ సిటీ ఉద్దేశం.