
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ తిరగబడ్డారు. తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చివేయడంతో ఆగ్రహించిన ఆమె.. ఎందుకు గోడను కూల్చేశారంటూ.. కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సిన పనిలో ‘నీకేమి పని ఉంటూ’ అని ఆమె అతన్ని నిలదీశారు. నగరంలోని ఐదో డివిజన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది.
ఐదో డివిజన్‌లో మల్సూరు సుజాత దంపతులకు నివాస భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన నలుగురు కార్నొరేటర్‌లు కొంతకాలంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉదయం మల్సూరు దంపతుల ఇంటికి వెళ్లిన 23వ డివిజన్ కార్పొరేటర్ పొట్ల శశికళ భర్త వీరెందర్ దౌర్జన్యానికి దిగినట్టు తెలుస్తోంది. సుజాత దంపతుల నివాసానికి సంబంధించిన ప్రహారీ గోడను అతను కూల్చివేయించడంతో మల్సూరు సుజాత కార్పొరేటర్ భర్తపై తిరగబడ్డారు. ఎలా తన ఇంటి గోడను కూల్చేస్తారంటూ.. అతనికి చెప్పుతో దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతను ఆమెను కిందపడేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment